Sravani
-
బండారు శ్రావణిపై పోలీసులకు ఫిర్యాదు
అనంతపురం: శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావుకు విలేకరి బాలమురళీధర్ మంగళవారం ఫిర్యాదు చేశారు. శింగనమలలో ఇసుక అక్రమ రవాణాపై వార్తలు ప్రచురించడంతో తనపై బండారు శ్రావణి వర్గీయులు కక్ష కట్టారని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో నగరంలోని ఓ హోటల్లో తనపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని, ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో నాల్గో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో తనను పరుష పదజాలంతో దూషిస్తూ ఎమ్మెల్యే అనుచరుడు బాబా ఫకృద్దీన్ వలి అభ్యంతరకర పోస్టులు పెడుతున్నాడని వాపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తనకు ఏదైనా జరిగితే దానికి ఎమ్మెల్యే బండారు శ్రావణిదే పూర్తి బాధ్యత అంటూ ఫిర్యాదు చేశారు. -
Anantapur: శింగనమలలో బండారు లీలలు
సాక్షి అనంతపురం జిల్లా: శింగనమల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి ఒకరైతే.. పెత్తనం మరొకరు చెలాయిస్తున్నారు. నియోజకవర్గ అభివృది, ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించి ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించడం.. అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వడం సహజం. అయితే ఇక్కడ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ స్థానాన్ని ఆమె తల్లి బండారు లీలావతి ఆక్రమించారు. అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తల్లి లీలావతి శుక్రవారం బుక్కరాయసముద్రం మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. మండల పరిషత్ అధికారితో పాటు ఇంజినీర్లు, ఇతర అధికారులు, ఎమ్మెల్యే వర్గీయులైన టీడీపీ నాయకులను పిలిపించారు. అందరినీ దగ్గర ఉండి అధికారులకు పరిచయం చేయించారు. అంతటితో ఆగకుండా ‘మండలంలో మా నాయకులు, కార్యకర్తలు మీ ఆఫీసులకు వస్తుంటారు. వారికి పనులు చేయడంతో పాటు వారు చెప్పిన వారికి మాత్రమే మీరు ప్రభుత్వం తరఫున సేవలందించాల’ని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఎలాంటి పదవీ లేకున్నా అధికారులతో సమావేశాలు నిర్వహించడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. -
నెల్లూరు జిల్లాలో పరువు హత్య
కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది. ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన షేక్ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.పూడ్చిపెట్టి.. పైన కంప వేసి.. శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్ రాకపోవడంతో షేక్ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు. తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తులు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తులకూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.దీంతో తహసీల్దార్ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసుకున్నామని, భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు. -
మరో అల్పపీడనం.. మూడు రోజులు భారీ వర్షాలు
-
టీడీపీ ఎమ్మెల్యే శ్రావణికి చేదు అనుభవం
-
శ్రావణి వర్సెస్.. పల్లా చెంతకు శింగనమల పంచాయితీ
అనంతపురం, సాక్షి: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక.. టీడీపీలో వర్గ విబేధాలు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. శింగనమల నియోజకవర్గంలో వర్గపోరు అయితే తారాస్థాయికి చేరింది. స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ టూమెన్ కమిటీగా ఆధిపత్య పోరు నడుస్తోందక్కడ. నియోజకవర్గంలో రేషన్ షాపుల్ని చేజిక్కించుకోవాలని ఎమ్మెల్యే శ్రావణి వర్గం తీవ్రంగా యత్నిస్తోంది. అయితే.. దానికి టీడీపీ టూమెన్ కమిటీ అడ్డు తగిలింది. ఆ వ్యవహారం మొత్తం తమ చేతుల్లోకి తీసేసుకుంది. దీంతో అధికారం ఎమ్మెల్యే చేతుల్లో ఉందా?.. లేదంటే ఆ కమిటీ చేతుల్లో ఉందా? అని శ్రావణి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. దళిత ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే చోట కావాలనే కమిటీకి అధికారం కట్టబెట్టారా? అని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. అయితే.. శ్రావణిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన టైంలోనే కొందరు సీనియర్లు ఆమె ఎంపికను బహిరంగంగా వ్యతిరేకించారు. అందుకు సంబంధించిన ఓ వీడియో సైతం వైరల్ అయ్యిది. ఆ తర్వాత చంద్రబాబు ఆదేశాలతో వాళ్లంతా సైలెంట్ అయినప్పటికీ.. ఇప్పుడు ఈ రకంగా తమ రివెంజ్ తీర్చుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. టూమెన్ కమిటీ తనకు తలనొప్పిగా తయారైందని భావించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి.. విషయాన్ని టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శింగనమల నేతలతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
బండారు శ్రావణిని పక్కన పెట్టిన టీడీపీ!
అధికారంలో ఉన్నప్పుడే కాదు.. విపక్షంలోనూ బడుగు, బలహీన వర్గాల పట్ల చంద్రబాబు చిన్న చూపు ప్రదర్శిస్తున్నారు. అగ్ర కులాల వారే పెత్తనం చెలాయించేలా చూస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో బంతాట ఆడుతూ అడుగడుగునా అవమానాలకు గురి చేస్తున్నారు. టీడీపీ పెత్తందార్ల పార్టీనే అని నిరూపిస్తున్నారు. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. చంద్రబాబు, చినబాబు లోకేష్‌ల ద్వంద్వ వైఖరిని చెప్పకనే చెప్పేస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పేదలు, బడుగు బలహీన వర్గాల కోసమని ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారు. చెప్పినట్లుగానే పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించారు. ఆయనకు వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్న చంద్రబాబు.. ఎన్టీఆర్ సిద్ధాంతాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. పార్టీని క్రమంగా పెత్తందార్లకు అడ్డాగా మార్చారు. టీడీపీలో రాజకీయంగా ఎదగాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలు నిత్యం పోరాటం చేయాల్సిన పరిస్థితి. ఆత్మాభిమానం చంపుకోలేక ఎంతో మంది ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. శింగనమలలో దారుణంగా.. ఎస్సీలకు కేటాయించిన రిజర్వుడు స్థానాల్లోనూ టీడీపీకి చెందిన అగ్రకులాల నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో ఎస్సీ అభ్యర్థి పరిస్థితి గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అవగతమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేత బండారు శ్రావణిని ఇక్కడ డమ్మీగా మార్చారు. టూమెన్ కమిటీ పేరుతో ముంటిమడుగు కేశవరెడ్డి, ఆలం నరసనాయుడును నియమించి అవమానించారు. వీళ్లు చెప్పినట్టే అక్కడ పనులు జరగుతున్నాయి. ఇటీవల శ్రావణి తండ్రిపై దాడి జరిగింది. ఆ సమయంలో ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా లోకేష్ జిల్లాలోనే ఉన్నారు. దాడికి పాల్పడిన వారిని మందలించనూ లేదు. దెబ్బలు తిన్న వ్యక్తిని పరామర్శించనూ లేదు. గుండుమల.. ఎస్సీ నేతల విలవిల మడకశిర ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. ఇక్కడ మైనింగ్ మాఫియాకు అధిపతిగా చెప్పుకునే గుండుమల తిప్పేస్వామిదే పెత్తనం. ఆయన నియంత వైఖరిని జీర్ణించుకోలేని ఈరన్న వర్గానికి చెందిన ఎస్సీ నాయకులు పార్టీకి ఆమడదూరం వెళ్లిపోయారు. డబ్బున్న వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని, ఎస్సీలను పట్టించుకునే నాథుడే లేరని ఉన్న కొద్దిపాటి ద్వితీయశ్రేణి నాయకులు వాపోతున్నారు. ఇప్పటికే పలు సామాజిక వర్గాల నేతలు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక్కడ పార్టీకి పరిస్థితి ఏ మాత్రం అనుకూలంగా లేదన్న సర్వేలు అధిష్టానానికి వెళ్లినట్లు తెలిసింది. మైనార్టీ మాట చెల్లని రూక.. 2014లో జరిగిన ఎన్నికల్లో కదిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్‌బాషా గెలిచారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లారు. ఇప్పుడాయన మాట చెల్లని రూక అయింది. డీడీల కుంభకోణంలో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ మాటే పైచేయిగా మారింది. నేరాలకు తెగబడుతున్నా కందికుంటనే చంద్రబాబు, లోకేష్ ప్రోత్సహిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. దీంతో ఇక్కడ మైనార్టీలు తెలుగుదేశం పార్టీపై మండిపడుతున్నారు. అంతటా అంతే.. ఉమ్మడి జిల్లాలో అన్ని చోట్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకుల మాట చెల్లడం లేదు. అధికారంలో ఉన్నప్పుడూ.. ఇప్పుడూ అగ్రకులాల వారు పెత్తనం చెలాయిస్తుండడంతో రగిలిపోతున్నారు. ఇక.. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్ జగన్ అన్ని సామాజిక వర్గాలకు సముచితం స్థానం కల్పించారు. పెద్ద ఎత్తున రాజకీయంగానూ పదవులు కట్టబెట్టారు. చెప్పాడంటే.. చేస్తాడంటే అనేంతలా పేరు తెచ్చుకున్నారు. అన్ని వర్గాల మనసులనూ గెలుచుకున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన టీడీపీలోని బడుగు బలహీన వర్గాల నాయకులు ఇప్పటికే పలు చోట్ల అధికార పార్టీలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసల తాకిడి మరింత ఎక్కువయ్యేలా కనిపిస్తోంది. టీడీపీకి బడుగు బలహీన వర్గాల నేతలు గట్టి షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. -
TS Election 2023: జగిత్యాల అభ్యర్థిగా భోగ శ్రావణి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: బీజేపీ అసెంబ్లీ స్థానం నుంచి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భోగ శ్రావణి పోటీ చేయనున్నారు. కొన్ని నెలల క్రితం అధికార పార్టీలో విభేదాల కారణంగా పదవికి, పార్టీకి రాజీనామా చేసిన ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. వైద్యురాలు, విద్యావంతురాలు, బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళ కావడం, జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా చేసిన అనుభవం ఉండటంతో పార్టీ ఆమెకు టికెట్ ఇచ్చే యోచనలో ఉందని కమలనాథులు చెబుతున్నారు. వాస్తవానికి శ్రావణి చేరిక సమయంలోనే ఆమెకు పార్టీ నుంచి టికెట్ హామీ దక్కిందని ప్రచారం జరిగింది. అధిష్టానం ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసిందని సమాచారం. -
టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఊహించని రీతిలో కబళించిన మృత్యువు
క్రైమ్: చక్కగా చదువుకునే అమ్మాయిని ఆమెకున్న ఆరోగ్య సమస్య హఠాత్తుగా బలిగొంది. అదీ ఎవరూ ఊహించని రీతిలో!. రోజూలాగే స్కూల్‌కు వెళ్తున్న ఆమె ఫిట్స్ రావడంతో పక్కనే ఉన్న చెరువులో పడి కన్నుమూసింది. సీతానగరం మండలం ఆవాలవలసకు చెందిన శ్రావణి(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. సత్యం-పార్వతిలకు ఆమె ఏకైక సంతానం. గాదెలవలసలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సైకిల్ మీద వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో ఫిట్స్ వచ్చింది. దీంతో బ్యాలెన్స్ ఆగక పక్కనే ఉన్న చెరువులో పడింది. అది గమనించిన తోటి విద్యార్థులు చుట్టుపక్కల వాళ్లకు సమాచారం అందించారు. అయితే.. అప్పటికే ఆలస్యమైంది. సైకిల్ మీద పడి ఆమె బుదరలో కూరుకుపోవడంతో కన్నుమూసిందామె. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: నితిన్ తన మాట వినడం లేదంటూ.. -
‘బిగ్‌బాస్ 7’లోకి బ్యాంకాక్ పిల్ల.. వీడియోతో క్లారిటీ
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ కొత్త సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆరు సీజన్స్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో.. త్వరలోనే ఏడో సీజన్‌ని ప్రారంభించబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని కూడా వదిలారు బిగ్‌బాస్ నిర్వాహకులు. ఈ సారి గత సీజన్స్ కంటే భిన్నంగా బిగ్‌బాస్ ఆట ఉండబోతుందట. గత సీజన్ మాదిరి చిన్న చిన్న నటీనటులను కాకుండా..ఈ సారి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులను బిగ్‌బాస్‌లోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తయిందట. ఇక ఆ లిస్ట్ ఎలాగో షో ప్రారంభం వరకు బయటకు రాదు. కానీ ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్-7 కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. (చదవండి: అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్) ఆ లిస్ట్‌లో ముఖ్యంగా ఒకరి పేరు బలంగా వినిపించింది. ఆమే బ్యాంకాక్ పిల్ల. యూట్యూబ్ వీక్షకులకు ఈ పేరు బాగా తెలుసు. బ్యాంకాక్‌లో ఉండే ఈ తెలుగుమ్మాయి.. అక్కడి ప్రదేశాలను, వింతలను తెలియజేస్తూ యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయింది. అలాంటి వీడియోలు ఎవరైనా పెడతారు కానీ.. విదేశాల్లో ఉండి కూడా తెలుగులో భాషలో.. తన ప్రాంతం యాస(విజయనగరం)లో మాట్లాడుతూ వీడియోలు చేయడం ఈ పిల్ల స్పెషల్. ఈమె అసలు పేరు శ్రావణి సమంతపూడి. యూట్యూబ్ చానెల్ పేరు బ్యాకాంక్. బిగ్‌బాస్ కోసమే ఇండియాకి ఇటీవల శ్రావణి ఇండియాకి వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోని తన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసింది. దీంతో ఆమె బిగ్‌బాస్ -7 కోసమే ఇండియాకు వస్తున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. అంతేకాదు చాలా మంది ఆమెకు ఆల్ ద బెస్ట్ చెబుతూ వీడియోలు కూడా చేస్తున్నారు. పలు వెబ్సైట్లలో కూడా ఆమె బిగ్‌బాస్-7లో పాల్గొంటున్నారంటూ కథనాలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను బ్యాకాంక్ పిల్ల స్పందించింది. తన బిస్‌బాస్ ఎంట్రీ గురించి స్వయంగా ఓ వీడియోని కూడా చేసింది. పిలవని పేరంటానికి వెళ్తే బాగోదు బిగ్‌బాస్-7లోకి తాను వెళ్తున్నట్లు వస్తున్న పుకార్లపై ఆమె ఫన్నిగా స్పందించారు. అసలు తకు బిగ్‌బాస్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని, పిలవని పేరెంటానికి వెళ్తే బాగోదని చెప్పింది. ‘నేను బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాననే వార్తలు ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. నాకే ఆశ్చర్యం కలిగింది. ఆ వార్తలు బాగా వైరల్ కావడంతో నిజంగానే నేను సెలెక్ట్ అయ్యానా అని మెయిల్స్ చెక్ చేసుకున్నాను. నాకు ఎలాంటి ఆహ్వానం రాలేదు. ఒకవేళ వస్తే తప్పకుండా అందరికి చెబుతాను. ఇలాంటి ఫేక్ న్యూస్‌ని నమ్మకండి’ అని శ్రావణి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sravani Samanthapudi (@bangkok.pilla) -
బండారు శ్రావణి పార్టీ మారుతున్నారా..?
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భవిష్యత్‌కు గ్యారంటీ’ అట్టర్ ప్లాప్‌గా మారింది. ఆ పార్టీ నాయకులతో పాటు జనం నుంచి కూడా స్పందన లేకపోవడంతో టీడీపీ భవిష్యత్కే గ్యారెంటీ లేదని ప్రజలు అంటున్నారు. గార్లదిన్నె మండల పరిధిలోని ఇల్లూరులో ఆదివారం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సుయాత్రకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు శ్రావణితో పాటు ఆమె వర్గం నాయకులు, కార్యకర్తలు హాజరు కాలేదు. దీంతో టీడీపీకి భవిష్యత్తు ఏది అని బహిరంగంగానే ప్రజలు గుసగుసలాడుకున్నారు. అడుగడుగునా అవమానాలే..... బండారు శ్రావణి పార్టీ మారుతున్నారా..? టీడీపీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయట పడింది. శింగనమల నియోజకవర్గం ఎమ్మెల్యే స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేసినప్పటికీ టీడీపీలో అగ్ర కులాల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ ఇన్చార్జ్ బండారు శ్రావణి గైర్హాజరైనట్లు సమాచారం. బస్సు యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు ప్లెక్సీలు ఏర్పాటు చేసినా ఎక్కడా శ్రావణి ఫొటో లేకపోవడం గమనార్హం. అలాగే కల్లూరు వైఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా జనం లేక వెలవెలబోయింది. పేరుకే బండారు శ్రావణి.. శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి ఎప్పట్నుంచో టీడీపీకి సేవలందిస్తోంది. కానీ ఈమెకు అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయి. లోకేష్ పాదయాత్ర సమయంలోనే శ్రావణి తండ్రిపై ఇతర సామాజికవర్గ పెద్దలు దాడి చేశారు. గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయినా లోకేష్ దీనిపై స్పందించలేదు. అంతేకాదు నియోజకవర్గంలో పేరుకే శ్రావణి.. పెత్తనమంతా ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి చేతుల్లోనే ఉండటంతో ఎస్సీలు రగిలిపోతున్నారు. చికెన్, మందు ఏర్పాటు చేసినా... షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం జరగాల్సి ఉంది. అయితే జనం రాకపోవడంతో ఆలస్యంగా మధ్యాహ్నం 12.30 గంటలకు బస్సుయాత్ర ప్రారంభమైంది. టీడీపీ నాయకులు బస్సుయాత్రకు వాహనాలు సమకూర్చిన జనం రాకపోవడంతో బస్సుయాత్ర కాస్తా తుస్సు యాత్రగా మారింది. టీడీపీ నాయకులు నామమాత్రంగానే కార్యక్రమాన్ని జరిపించి మమ అనిపించారు. కార్యక్రమానికి వచ్చిన వాళ్లకు చికెన్, మందు ఏర్పాటు చేసినా పెద్దగా స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులకు దిక్కుతోచని పరిస్థితి. -
జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ రాజీనామా ఆమోదం
జగిత్యాల: జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణి రాజీనామాను జిల్లా కలెక్టర్ రవి ఆమోదించారు. ఈ నెల 25న శ్రావణి మున్సిపల్ చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రవి సోమవారం ఆమెను కలెక్టరేట్‌కు పిలిపించారు. రాజీనామా నిర్ణయాన్ని ఎవరి ఒత్తిడితోనైనా తీసుకున్నారా ? లేక సొంతంగా నిర్ణయం తీసుకున్నారా? అని కారణాలు అడిగి తెలుసుకున్నారు. తన ఇష్టపూర్వకంగానే రాజీనామా చేశానని స్పష్టం చేసిన శ్రావణి.. మరోసారి లేఖ రాసివ్వడంతో కలెక్టర్ ఆమె రాజీనామా లేఖకు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీచేశారు. అనంతరం వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌కు ఇన్చార్జి చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించారు. కాగా, ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు రాగానే నూతన చైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జగిత్యాల మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు ఆమెపై అవిశ్వాసానికి ప్రయత్నించడంతో శ్రావణి తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. -
Hyderabad- Sravani: ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై జి.సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గోల్నాక ప్రాంతానికి చెందిన రాజు కుమార్తె కె.శ్రావణి (18) ఈ నెల 12వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఇప్పటి వరకు తిరిగి రాలేదు. వివిధ ప్రాంతాల్లో, బంధు మిత్రుల ఇండ్లలో ఎంత వెదికినా ఆచూకి లభించలేదు. దీంతో తల్లి కృష్ణవేణి కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Hyderabad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్) -
సీరియల్స్‌లో బిజీ ఆర్టిస్టుగా శ్రావణి.. అలా అవకాశం
శ్రీకాకుళం (టెక్కలి): కార్తీకదీపం సీరియల్లో తులసిగా..గీతాగోవిందంలో జయమ్మగా..గుప్పెడంత మనసులో ధరణిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.. సుమారు 14 టీవీ సీరియల్స్, మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి వెబ్ సిరీస్‌లో నటిగా, అమమ్మగారిల్లు, పేపర్‌బాయ్ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వర్ధమాన టీవీ సీరియల్ నటి తాండ్ర శ్రావణి అలియాస్ సీతామహాలక్ష్మి ఇటీవల టెక్కలి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఈమె స్వస్థలం కోటబొమ్మాళి మండలం పులిబంద గ్రామం. టెక్కలిలోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మారుమూల ప్రాంతానికి చెందిన తనను టీవీ సీరియల్స్ అభిమానులు ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్నారని చెప్పారు.2వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లామన్నారు. 2011లో హైదరాబాద్‌లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రారోంభోత్సవంలో భాగంగా తనకు నటిగా అవకాశం వచ్చిందన్నారు. మొదట తమిళంలో కడాసి బెంచ్ అనే సీరియల్లో నటించినట్లు తెలిపారు. తర్వాత మొగలిరేకులు, ఒకరికొకరు, అభిషేకం , కార్తీకదీపం, గోరింటాకు, గీతాగోవిందం, గుప్పెడంత మనసు, ఆడదే ఆధారం, పౌర్ణమి, అగ్నిపూలు తదితర సీరియల్స్‌లో అనేక పాత్రలు పోషించినట్లు వివరించారు. వీటితో పాటు మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు హైదరాబాద్‌లో అనాథ పిల్లలకు అండగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. -
హైదరాబాద్ మలక్‌పేట్‌లో దారుణం.. డాక్టర్ శ్రావణి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మలక్‌పేట్‌లో దారుణం జరిగింది. ఓలా బైక్ బుక్ చేస్కొని వెళ్తున్న డాక్టర్ శ్రావణిని గుర్తుతెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి పారిపోయారు. ఓలా బైక్ డ్రైవర్ వెంకటయ్య, తీవ్రంగా గాయపడిన శ్రావణిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. శ్రావణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా కారుని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: (హైదరాబాద్‌లో మహిళ హంగామా.. ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో గొడవ) -
విషాదం: సరిగ్గా చదవడం లేదని మందలిస్తే..
వంగర (శ్రీకాకుళం): మండల పరిధి కొప్పర పంచాయతీ కె.కొత్తవలస గ్రా మానికి చెందిన విద్యార్థిని గొట్టిపల్లి శ్రావణి (17) మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు సమీపంలో వంగర –రాజాం రోడ్డులో ఉన్న వంతెన పైనుంచి దూకి ఆత్మహత్యకు శుక్రవారం పాల్పడింది. ఎస్ఐ రొంగలి దేవానంద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. కొత్తవలస గ్రామానికి చెందిన శ్రావణి విజయవాడ పడమటి రోడ్డులో ఉన్న శ్రీనివాస హైస్కూల్ లో పదో తరగతి చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు ఉపాధి కోసం వలస వెళ్లిపోవడంతో అక్కడే చదువుతోంది. ఇటీవలే సంక్రాంతికి సొంతూరు వచ్చారు. చదవండి: (పుట్టిన రోజే ప్రాణాలు పోయాయి) శ్రావణి సరిగ్గా చదవడం లేదని ఇటీవల తల్లిదండ్రులు ఆమెను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన శ్రావణి శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంట ల సమయంలో ఇంటి నుంచి బయల్దేరి వెళ్లి వంతెన నుంచి నీటిలో దూకేసింది. దీనిపై స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. రాజాం అగ్నిమాపక శకటం సిబ్బందికి సమాచారం అందించి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ డి.నవీన్‌కుమార్ పరిశీలించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలించారు. తండ్రి గొట్టిపల్లి అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పేదింట విషాదం.. విద్యార్థిని ఆత్మహత్యతో కె.కొత్తవలస గ్రామంలో వి షాద ఛాయలు అలముకున్నాయి. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణి తల్లిదండ్రులు గొట్టిపల్లి అప్పలరాజు, చిట్టెమ్మలు కొన్నేళ్ల కిందట విజయవాడకు వలస వెళ్లారు. సంక్రాంతికి సొంతూరు వచ్చారు. ఈ లోగా ఈ విషాదం సంభవించడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. -
తల్లి లొంగలేదని కూతురిని బలిగొన్న కామాంధుడు
సూర్యాపేట రూరల్: అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని తీసుకొచ్చిన తల్లిపై కన్నేశాడు. తన కోరిక తీర్చడానికి ఆమె అంగీకరించలేదన్న అక్కసుతో బిడ్డకు పసరు తాగించి పొట్టన పెట్టుకున్నాడు. సూర్యాపేట పట్టణ శివారులోని దురాజ్‌పల్లి గ్రామానికి చెందిన పల్లపు దుర్గయ్య, రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కూలి పనులు చేసుకుంటూ కుమార్తెలను చదివిస్తున్నారు. చిన్న కుమార్తె శ్రావణి(18) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయిస్తున్నారు. అయినా నయం కాకపోవడంతో శ్రావణిని ఆమె తల్లిదండ్రులు సోమవారం ఉదయం సూర్యాపేట మండలం గాంధీనగర్‌లోని దర్గా వద్ద నాటు వైద్యం చేసే జక్కిలి భిక్షపతి వద్దకు తీసుకొచ్చారు. భిక్షపతి శ్రావణిని చూసి.. ఆరోగ్యం నయం చేస్తానని, రెండు రోజులు అక్కడే ఉండాలని సూచించాడు. దీంతో వారు దర్గా వద్దే ఉండిపోయారు. సోమవారం అర్ధరాత్రి భిక్షపతి పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడు. మంగళవారం ఉదయం ఎంత లేపినా శ్రావణి లేవకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది బంధువులు, కుటుంబ సభ్యులకు తెలిపారు. చదవండి: మహిళను నమ్మించి.. పది నిమిషాల్లో వస్తానని చెప్పి.. కోరిక తీర్చనందుకే.. భిక్షపతి తన కోరిక తీర్చాలని.. లేదంటే శ్రావణిని కాటికి పంపిస్తానని సోమవారం రాత్రి బెదిరించాడని యువతి తల్లి రాజేశ్వరి తెలిపింది. దీనికి నిరాకరించడంతో భిక్షపతి కోపంతో పాలల్లో పసరు కలిపి శ్రావణికి తాగించాడంది. అప్పటిదాకా బాగానే ఉన్న శ్రావణి పాలు తాగిన తర్వాతే మరణించిందని ఆమె బోరున విలపించింది. ఆదివారం రాత్రే ఇంటికి వెళ్తామని చెప్పినా.. వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడని విలపించింది. శ్రావణి (ఫైల్) భిక్షపతి విషయం తెలుసుకున్న దురాజ్‌పల్లి గ్రామస్తులు మంగళవారం దర్గా వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రావణి మృతికి కారణమైన భిక్షపతిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. భిక్షపతిని రూరల్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. కాగా, భిక్షపతి కొన్నేళ్లుగా గాంధీనగర్ గ్రామ సమీపంలో దర్గా ఏర్పా టు చేసుకుని నాటు వైద్యం చేస్తున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. ఒంట్లో బాగోలేక తన వద్దకు వచ్చిన వారిని లైంగికంగా వేధిస్తున్నట్టు తెలిపారు. చదవండి: రియల్టర్ విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో కొత్త కోణం..తుపాకీ ఎక్కడ? -
చుండూరు ఎస్ఐ శ్రావణి మృతి
సాక్షి, గుంటూరు: ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చుండూరు ఎస్ఐ పిల్లి శ్రావణి(35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. గత శనివారం చుండూరు పోలీస్ స్టేషన్లోనే పనిచేస్తున్న కానిస్టేబుల్ రవీంద్ర, ఎస్ఐ శ్రావణి గడ్డి మందు కూల్ డ్రింక్‌లో కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణానికి చెందిన శ్రావణి 2018లో ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టారు. జిల్లాలోని అడవులదీవి, నరసరావుపేట దిశ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించారు. దిశ పోలీస్ స్టేషన్ నుంచి ఏడు నెలల కిందట చుండూరుకు బదిలీపై వెళ్లారు. ఎస్ఐ మృతదేహానికి జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఐపై ఆరోపణలు చుండూరు సీఐ రమేశ్‌బాబు, టీడీపీ నాయకుడు వంపుగాని గురవయ్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్ఐ శ్రావణి వాంగ్మూలం ఇచ్చారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా టీడీపీకి చెందిన కొందరిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బైండోవర్ చేయగా ఆ వ్యక్తులతో సీఐ తనపై రిట్పిటీషన్లు వేయించడంతో పాటు, ఎస్ఈసీకి ఉద్దేశపూర్వకంగా ఫిర్యాదు చేయించారని పేర్కొన్నారు. తనకు కానిస్టేబుల్ రవీంద్రతో అక్రమ సంబంధం ఉందని గురవయ్య ద్వారా సీఐ దుష్ప్ర చారం చేయించారని, ఎస్పీకి ఫిర్యాదులు చేయించి ఇబ్బంది పెట్టినట్టు ఎస్ఐ తెలిపారు. స్టేషన్లో తనకు అనుకూలంగా ఉన్న సిబ్బందికి, తనకు మోమోలు ఇవ్వడంతో పాటు, లంచాలు తీసుకుంటున్నట్టు అసత్య ప్రచారం చేశారని, పై అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేయడంతో వృత్తిపరంగా, మానసికంగా వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిపారు. ఇద్దరి మధ్య వివాదం ఎస్ఐ శ్రావణి తొలి నుంచి తప్పుని సహించరని పోలీస్ శాఖలో పేరుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆమెపై ఎస్ఈసీకి, కోర్టుల్లో, ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదులపై అనేక విచారణలను ఎదుర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఎస్ఐ శ్రావణి, సీఐ రమేశ్‌బాబు మధ్య వివాదం నడుస్తోందని, ఇద్దరు పర్సపరం వాదులాడుకునేవారని సమాచారం. స్టేషన్ సిబ్బంది సైతం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల విచరణలో తెలిపినట్టు తెలుస్తోంది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి నట్టు డీఎస్పీ శ్రవంతిరాయ్ తెలిపారు. సీఐను వీఆర్‌కు పిలిచాం ఎస్ఐ శ్రావణి ఆత్మహత్య ఘటనపై ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా చుండూరు సీఐ రమేశ్‌బాబును వీఆర్‌కు పిలిచాం. శాఖపరమైన దర్యాప్తు చేపడతాం. – డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ, డీఐజీ, గుంటూరు రేంజ్ చదవండి: గుంటూరు, నరసరావుపేటల్లో చంద్రబాబుపై కేసులు ఆత్మ బంధువులు: మానవత్వమే ‘చివరి తోడు’ -
ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి: శ్రావణి
లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండడంతోపాటు.. అందుకు తగ్గట్టుగా సాధన చేస్తే ఉన్నత శిఖరాన్ని చేరుకోవడం ఖాయమని పాలకొండ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి అన్నారు. కృషి.. పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. 2018 గ్రూప్–1 బ్యాచ్‌కు చెందిన ఈమె అప్పటి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 14, మహిళా విభాగంలో నాలుగో ర్యాంక్ సాధించి డీఎస్పీగా ఎంపికయ్యారు. తొలుత కృష్ణా జిల్లా బందర్ సబ్‌డివిజన్ ఇన్చార్జి డీఎస్పీగా విధులు నిర్వహించిన శ్రావణి ఈ నెల 19న పాలకొండ పోలీస్ సబ్‌డివిజన్ అధికారిగా పూర్తి బాధ్యతలు చేపట్టారు. శనివారం ఆమెను కలిసిన ‘సాక్షి’తో ముచ్చటించారు. – పాలకొండ రూరల్ సాక్షి: మీ కుటుంబ నేపథ్యం? డీఎస్పీ: మాది పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. అక్కడ బీఈ ఎలక్ట్రానిక్స్ చదివా. తండ్రి గాంధీ న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి శేషపద్మ గృహిణి. నాకో సోదరుడు ఉన్నారు. సాక్షి: పోలీస్ శాఖను ఎంచుకోవడంలో ఉద్దేశం? డీఎస్పీ: మిగాతా ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చుకుంటే పోలీస్ శాఖ ప్రజలకు దగ్గరగా ఉండి సేవలందించే అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకే తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమై విజయం సాధించాను. సాక్షి: భవిష్యత్ లక్ష్యాలు? డీఎస్పీ: ఉన్నత లక్ష్యంతో పోలీస్ ఉద్యోగంలోకి వచ్చాను. అన్నివర్గాల ప్రజలకు చట్టం సమానంగా ఉండాలనేది నా ఉద్దేశం. భవిష్యత్‌లో ఎక్కడ విధులు చేపట్టినా మంచి పేరు తెచ్చుకోవాలి. ఓ ఉద్యోగిగానే కాకుండా ప్రజలు మెచ్చిన అధికారిగా ఉంటా. సాక్షి: పాలకొండలో తొలి పోస్టింగ్ కదా.. ఏ అంశాలకు ప్రాధాన్యతనిస్తారు? డీఎస్పీ: ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లల భద్రత, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటాను. ఏజెన్సీ కలబోసి ఉన్న ఈ సబ్‌డివిజన్‌లో సారా అమ్మకాలు, తయారీపై కఠినంగా వ్యవహరిస్తా. సమస్యల పరి ష్కారం కోరి వచ్చిన వారితో గౌరవంగా సిబ్బంది మెలి గేలా చొరవ తీసుకుంటా. ట్రాఫిక్ సమస్యను గాడిలో పెట్టేందుకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రజలకు పోలీస్ వ్యవస్థపై అపోహలు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా. సాక్షి: ఈ సబ్‌డివిజన్‌లో ఆంధ్రా– ఒడిశా సరిహద్దు ప్రాంతాలున్నాయి. మావోల ప్రభావం కూడా ఉంటుంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారు? డీఎస్పీ: సరిహద్దు గ్రామాల వద్దగల చెక్ పోస్టులు మరింత పటిష్టంగా నిర్వహిస్తాం. గస్తీ, ముందస్తు సమాచార సేకరణపై దృష్టిసారిస్తా. మా పరిధిలో గల పోలీస్ స్టేషన్లను పరిశీలించి, లోపాలు గుర్తించి ఉన్నతాధికారుల సూచనలతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నాకు తెలిసి మావోయిస్టుల ప్రభావం గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం లేదు. సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఎటువంటి చర్యలు చేపడతారు? డీఎస్పీ: స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కచ్చితంగా వ్యవహరించనుంది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపడతాం. గతంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించిన వారిని ముందుగానే బైండోవర్ చేస్తాం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తాం. సాక్షి: నేటితరం యువతకు, ఈ ప్రాంత ప్రజలకు ఏం చెప్పదల్చుకున్నారు? డీఎస్పీ: యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. లక్ష్యం కోసం కృషిచేస్తే కోరుకునే ఆనందం దక్కుతుంది. ఆ లక్ష్యం చేరుకున్నప్పుడే సమాజంలో గౌరవం లభిస్తుంది. కన్నవారు సంతోషిస్తారు. ఈ ప్రాంత ప్రజలకు శాఖా పరంగా అందుబాట్లో ఉంటా. ఏ సమస్య ఉన్నా నేరుగా కలిసి తెలియజేయవచ్చు. -
లోకేష్ పర్యటనపై శ్రావణి తీవ్ర అసంతృప్తి
సాక్షి, అమరావతి : గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష టీడీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీలో వ్యక్తుల ఆధిపత్య పోరు కారణంగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ శమంతకమణితో పాటు ఆమె కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినిబాల ఇటీవల టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే శమంతకమణి నిష్క్రమణతో నేతల మధ్య విభేదాలు మరింత పెరిగాయి. సింగనమల నియోజకవర్గ ప్రస్తుత ఇంఛార్జీ బండారు శ్రావణి పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు కాకుండా టీడీపీ నేత ఎంఎస్ రాజు వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటంపై శ్రావణి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇరువర్గల మధ్య పచ్చగడ్డేస్తే మండే విధంగా పరిస్థితి తారాస్థాయికి చేరింది. లోకేష్ పర్యటనకు దూరంగా శ్రావణి.. ఈ క్రమంలోనే టీడీపీ నేత నారా లోకేష్ అనంతపురం పర్యటన విభేదాలను బయపడేసింది. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందిన శ్రావణి.. లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోగా.. ఎంఎస్ రాజుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. నేతల పర్యటనపై తనకు ఏమాత్రం సమాచారం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నారు. మరోవైపు అనంతపురం పర్యటన సందర్భంగా లోకేష్ కరోనా నిబంధనలు ఉల్లంఘించారు. కనీస సామాజిక దూరం పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా జనసమీకరణ చేశారు. కరోనా జాగ్రత్తలు పక్కనపెట్టి భారీ కాన్వాయ్ నడుమ పర్యటన చేశారు. లోకేష్ తీరుపై స్థానిక నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేష్ అబద్ధాలు బట్టబయలు.. శుక్రవారం జిల్లాలోని కరడికొండ, ధర్మాపురం, మిడుతూరు, రాందాస్ పేట, ,కామారుపల్లి గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన లోకేష్.. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆరోపణలు చేశారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అయితే వరద నష్టంపై కలెక్టర్ గంధం చంద్రుడు వాస్తవాలు బహిర్గతం చేశారు. అనంతలో భారీ వర్షాలకు 38.53 కోట్ల పంట నష్టం జరిగిందని తెలిపారు. 13861 హెక్టార్లలో పంటలు నష్టపోయాయని వివరించారు. నష్టపోయిన రైతులకు వాతావరణ బీమా, ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని హామీ ఇచ్చారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపామని, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సాధారణం కన్నా 60 శాతం అధికంగా వర్షాలు నమోదు కావటంతో క్రాప్ డ్యామేజ్ జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. దీంతో నారా లోకేష్ అబద్ధాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. -
హేమంత్ హత్యకేసు.. పోలీసుల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: హేమంత్ కుమార్ హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. హేమంత్ కుమార్ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేందుకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు విచారించాల్సిన అవసరముందని కస్టడీ పిటిషన్లో కోరారు. ఇదిలాఉండగా కుటుంబసభ్యులైన అశిష్‌రెడ్డి, సందీప్ రెడ్డి వల్ల కూడా తమ కుటుంబానికి ప్రాణహని ఉందని హేమంత్ కుమార్ భార్య అవంతిరెడ్డి ఆరోపించారు. మామయ్య మురళీ కృష్ణకు సందీప్‌రెడ్డి ఫోన్‌కాల్ చేసి ఇంతకుముందు బెదిరించాడని తెలిపారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. (చదవండి: హేమంత్ హత్య కేసులో మరో ట్విస్ట్!) శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన పోలీసు కస్టడీ అమీర్‌పేట: టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులైన దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు చంచల్‌గూడ జైలులో ఉన్న దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను ఎస్ఆర్నగర్ పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ ముగియడంతో వారిని ఆదివారం తిరిగి జైలుకు తరలించారు. శ్రావణి ఆత్మహత్యకు ఒక రోజు ముందు ఏమి జరిగిందన్న దానిపై సుదీర్ఘంగా విచారించారు. పంజగుట్టలోని శ్రీకన్య హోటల్లో జరిగిన దాడిపై మరిన్ని వీడియో, ఆడియో సంభాషణలను సేకరించినట్లు తెలిసింది. మూడో నిందితుడిగా ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డి సాయితో కలిసి ఆత్మహత్య జరిగిన రోజు రాత్రి శ్రావణి ఇంటికి వచ్చారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అశోక్‌రెడ్డిని కూడా కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం. (దేవరాజ్‌తో వివాహం చేయండి : శ్రావణి) -
శ్రావణి కేసులో కస్టడీకి దేవరాజ్, సాయికృష్ణ
సాక్షి, హైదరాబాద్: బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అరెస్టయి చంచలగూడ జైలులో ఉన్న ఇద్దరు నిందితులు సాయి కృష్ణ, దేవరాజ్ రెడ్డిని ఎస్సార్ నగర్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు. ప్రేమిస్తున్నట్లు నటించి శ్రావణిని బ్లాక్మెయిల్ చేసి తీవ్రంగా వేధింపులకు గురి చేసి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారనే ఆరోపణలతో దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డితో పాటు సినీ నిర్మాత అశోక్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న దేవరాజ్, సాయిలను తిరిగి పోలీసు కస్టడీకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించి శ్రావణి ఆత్మహత్యకు గల మరిన్ని కారణాలు తెలుసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. ముగ్గురు నిందితుల సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. అయితే ఈ కేసులో మూడో నిందితుడు అయిన అశోక్ రెడ్డిని మాత్రం పోలీసులు ఇంకా కస్టడీకి తీసుకోలేదు. -
శ్రావణి కేసు: వెలుగులోకి కొత్త విషయాలు
సాక్షి, హైదరాబాద్ : టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసుకు సంబంధించి అశోక్‌రెడ్డి అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అశోక్ రెడ్డి శ్రావణిని విపరీతంగా వేధింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా ఆ విచారణలో.. ‘‘ 2017 నుంచి శ్రావణితో అతడికి పరిచయం ఉంది. అశోక్‌రెడ్డి తీసిన ఆర్ఎక్స్ 100లో ఆమెకు గెస్ట్ రోల్ ఇచ్చాడు. శ్రావణిని అన్ని విధాలుగా వాడుకున్నాడు. ఆమె ఆర్థిక పరిస్థితి అడ్డం పెట్టుకుని వేధింపులకు గురిచేశాడు.శ్రావణికి పలుమార్లు ఆర్థికసాయం చేసిన అశోక్‌రెడ్డి ఆర్థిక సాయం నెపంతో ఆమెపై జులుం చేశాడు. తనను కాదని ఎవరిని వివాహం చేసుకోవద్దని బెదిరింపులకు దిగాడు. శ్రావణి చనిపోయిన రోజున కూడా ఆమె ఇంటికొచ్చి, కుటుంబసభ్యులతో కలిసి ఇంట్లోనే బెదిరింపులకు పాల్పడ్డాడు. ( శ్రావణి కేసు: ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! ) అదే సమయంలో శ్రావణి ఇంటికొచ్చిన సాయి, అశోక్‌రెడ్డితో కలిసి ఆమెను టార్చర్ చేశాడు. ఇద్దరి వేధింపులను శ్రావణి దేవరాజ్‌తో పంచుకుంది. ఈ నేపథ్యంలో సాయి, అశోక్‌రెడ్డిలను దూరం చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని దేవరాజ్ చెప్పాడు. అయితే ఆ తర్వాత నుంచి శ్రావణిని దూరం పెడుతూ వచ్చాడు. దీంతో ముగ్గురి వేధింపులు తట్టుకోలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుంద’’ని వెల్లడైంది. -
అశోక్ రెడ్డి ని విచారిస్తున్న పోలీసులు..