
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శ్రావణి మృతికి దేవరాజు వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్‌ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలిసింది. కాగా శ్రావణిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజుకు సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టిక్‌టాక్‌లో అమ్మాయిలను ఫ్రెండ్స్ చేసుకునేవాడని, వారితో స్నేహం పెంచుకుని, డబ్బు వసూలు చేసేవాడని అతడిపై శ్రావణి గతంలో ఎస్‌ఆర్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రేమించి, మొహం చాటేయడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు దేవరాజుపై ఆరోపణలు చేస్తున్నారు.(చదవండి: వేధింపులు.. సీరియల్ నటి ఆత్మహత్య)
Comments
Please login to add a commentAdd a comment