RX100
-
మళ్ళీ మార్కెట్ లోకి యమహా RX 100
-
ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!
Yamaha RX: గత కొన్ని సంవత్సరాల క్రితం బైక్ ప్రేమికులకు బాగా ఇష్టమైన మోడల్ 'యమహా' (Yamaha) కంపెనీకి చెందిన 'ఆర్ఎక్స్100' (RX100). ఒకప్పుడు కుర్రకారుని ఉర్రుతలూగించిన ఈ బైక్ కోసం ఎదురు చూసే కస్టమర్లు ఇంకా భారత్‌లో ఉన్నారు అనటంలో ఏ మాత్రమే సందేహం లేదు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ మళ్ళీ ఈ బైకుని లాంచ్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనల్లో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, యమహా ఆర్ఎక్స్100 భారతీయుల గుండెల్లో నిలిచిపోయిన బైక్ మోడల్. కావున ఆ పేరుకి ఏ మాత్రం భంగం కలగకుండా 'ఆర్ఎక్స్' (RX) అనే పేరుతో మళ్ళీ మార్కెట్లో బైకుని విడుదల చేయనున్నట్లు యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ 'ఈషిన్ చిహానా' ఇటీవల ధృవీకరించినట్లు తెలుస్తోంది. భారతదేశపు ఐకానిక్ మోడల్ అయిన ఆర్ఎక్స్100 మంచి స్టైలింగ్, లైట్ వెయిట్, ప్రత్యేకమైన సౌండ్ సిస్టం కలిగి ఉండేది. ఇది అప్పటి వినియోగదారులను మాత్రమే కాకుండా ఆధునిక కాలంలో బైక్ కొనుగోలు చేస్తున్న వారిని మంత్రముగ్దుల్ని చేసింది. (ఇదీ చదవండి: ప్రత్యర్థుల పని పట్టడానికి వస్తున్న టీవీఎస్ కొత్త బైక్ - వివరాలు) ఈ బైకుని మళ్ళీ పునఃరూపకల్పన చేయాలంటే కనీసం 200సీసీ ఇంజిన్ అయినా అమర్చాలి. అయినప్పటికీ ఒకప్పటి సౌండ్ మళ్ళీ వస్తుందా? అనేది ప్రశ్నగానే ఉంటుంది. కావున ఆర్ఎక్స్100 బైకుకి ఉన్న పేరును నాశనం చేయదలచుకోలేదు. ప్రస్తుత లైనప్‌తో 155 సీసీ సరిపోదు. కానీ భవిష్యత్తులో యమహా ఆర్ఎక్స్ పేరుతో తీసుకురావడానికి తప్పకుండా కృషి చేస్తామని ఆయన తెలిపారు. మొత్తానికి ఆర్ఎక్స్ మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టనున్నట్లు తెలిసింది. అయితే లాంచ్ ఎప్పుడనేది తెలియాల్సి ఉంది. -
'ఆర్ఎక్స్ 100' డైరెక్టర్ అజయ్ భూపతి కొత్త సినిమా పోస్టర్ రిలీజ్
ఆర్ఎక్స్ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించినా ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని మంగళవారం అనే సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ అండ్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఇది పాన్ ఇండియాన్ సినిమా అంటే బజ్ క్రియేట్ చేశారు. స్వాతి - సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.హారర్ జానర్లో ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఆర్ఎక్స్ 100తో క్రేజ్ సంపాదించుకున్న పాయల్ ఈ మూవీలో హీరోయిన్గా నటించనుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. Here's the Title & Concept Poster of our #Mangalavaaram #Chevvaikizhamai #Chovvazhcha 🦋 It's a PAN-SOUTH INDIAN movie🔥 'KANTARA' fame @AJANEESHB is scoring 🎶 to this never-seen-before film 💥@MudhraMediaWrks @ACreativeWorks_ #SwathiGunupati #SureshVarmaM pic.twitter.com/VqMNy64wYj — Ajay Bhupathi (@DirAjayBhupathi) February 28, 2023 -
ఎన్ని ఉన్నా ఈ బైక్ క్రేజ్ వేరబ్బా.. యమహా నుంచి ఆ మోడల్ మళ్లీ వస్తోంది!
యూత్‌లో బైక్‌లకు ఉన్న క్రేజ్ వేరు. ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో బోలెడన్ని బైకులు దర్శనమిస్తున్నాయి. అయితే ఎన్ని ఉన్నా మార్కెట్లో యమహా ఆర్ఎక్స్ 100కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 90 దశకంలో యువతని ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఈ బైక్‌లను నిలిపేసి 25 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ అవి రోడ్లపై దర్శనమిస్తున్నాయి. అయితే ఆ మోడల్ బైక్ కోసం కలలు కనే వారి కోసం తాజాగా యమహా కంపెనీ ఓ శుభవార్త తీసుకువచ్చింది. ఆర్ఎక్స్ 100 బైక్‌ను ఆధునిక హంగులతో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. యువత కలల బైక్ రానుంది యమహా ఇండియా చైర్మన్ ఐషిన్ చిహానా మాట్లాడుతూ.. కొత్తగా రాబోతున్న యమహా RX100 ఆధునిక డిజైన్ , స్టైలిష్ లుక్‌తో మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ పాత మోడల్‌కి మార్కెట్లో ఇప్పటికీ డిమాండ్ ఉంది, వాటిని దృష్టిలో పెట్టుకుని బైక్ లవర్స్‌ని ఆకట్టుకునేలా డిజైన్, తయారీ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2026 తర్వాత మార్కెట్లోకి కొత్త వెర్షన్ ఆర్ఎక్స్100 బైక్‌ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఎందుకంటే వచ్చే మూడేళ్లలో యమహా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అడుగుపెట్టాలని యోచిస్తోందని చిహానా పేర్కొన్నారు. ప్రస్తుతానికి, రాబోయే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్లు టెస్టింగ్ దశలో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం యమహాకు భారత్‌లో గ్రేటర్ నోయిడా, చెన్నైలో ప్రొడక్షన్ యూనిట్లు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే వాటితో 30 దేశాలకు ఎగుమతులు చేస్తున్నారు. కాగా యమహా కంపెనీ 1985 నుంచి ఉత్పత్తి ప్రారంభించి ఆర్ఎక్స్100బైక్‌ను 1996 వరకు కొనసాగించారు. చదవండి: 2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి -
Rx 100కు సీక్వెల్ ?
-
rx100 హిందీ రీమేక్
-
ఆర్ఎక్స్100 రీమేక్‌లో స్టార్ హీరో కొడుకు
తెలుగులో హిట్ అయిన ‘ఆర్ఎక్స్100’ను హిందీలో తన కుమారుడితో రీమేక్ చేస్తున్నాడు నటుడు సునీల్ శెట్టి. సినిమా పేరు ‘తడప్’. అంటే తపన అని అర్థం. అహన్ శెట్టి, తార సుతరియా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు మిలన్ లుత్రియా. ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నటుడు అక్షయ్ కుమార్ రిలీజ్ చేశాడు. అక్షయ్, సునీల్‌శెట్టి కలిసి ‘మొహ్రా’ వంటి సూపర్‌హిట్‌లో నటించారు. ఆ తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ కామెడీల్లోను సందడి చేశారు. ఆ స్నేహం కొద్దీ అక్షయ్ కుమార్ ‘తడప్’ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఆర్ఎక్స్ 100 రెగ్యులర్ ప్రేమ కథల వంటిది కాదు. అందులో ప్రేమను స్వార్థానికి ఉపయోగించే కొందరు అమ్మాయిల ధోరణిని కథాంశంగా తీసుకున్నారు. సమాజంలో అది ఉందని ప్రేక్షకులు కన్విన్స్ అవడం వల్లే సినిమాను హిట్ చేశారు. ఇందులో నటించిన పాయల్ రాజ్‌పుత్ మంచి పేరు సంపాదించుకుంది. హీరోగా నటించిన కార్తికేయ ట్రాక్‌లో పడ్డాడు. కనుకనే సునీల్ శెట్టి కూడా తన కుమారుడికి ఈ సినిమా మంచి ప్లాట్‌ఫామ్ కాగలదని ఆశిస్తున్నట్టున్నాడు. అహన్ శెట్టి తండ్రి వలే శారీరక పోషణలో శ్రద్ధ ఉన్నవాడు. ఫుట్‌బాల్ బాగా ఆడతాడు. ఇతనికి ఒక అక్క ఉంది. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో వస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. -
నటి శ్రావణి- ఆర్ఎక్స్100 నిర్మాత ఆడియో లీక్
-
నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. శ్రావణి మృతికి దేవరాజు వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆర్ఎక్స్100 సినిమా నిర్మాత అశోక్‌రెడ్డి- శ్రావణి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన సమయంలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగినట్లు తెలిసింది. కాగా శ్రావణిని వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజుకు సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టిక్‌టాక్‌లో అమ్మాయిలను ఫ్రెండ్స్ చేసుకునేవాడని, వారితో స్నేహం పెంచుకుని, డబ్బు వసూలు చేసేవాడని అతడిపై శ్రావణి గతంలో ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్నాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రేమించి, మొహం చాటేయడంతో మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు దేవరాజుపై ఆరోపణలు చేస్తున్నారు.(చదవండి: వేధింపులు.. సీరియల్ నటి ఆత్మహత్య) -
సుచిత్రా సర్కిల్లో బిగ్‌బాస్ విజేత కౌశల్ సందడి
-
సెలెక్ట్ స్టోర్ ప్రారంభించిన పాయల్ రాజ్‌పుత్
ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ సోమవారం మదనపల్లెలోసందడి చేశారు. పేరెన్నికగన్న సెలెక్ట్ మొబైల్ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. చిత్తూరు, మదనపల్లె సిటీ: ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్ స్టోర్‌ను స్థానిక సీటీఎం రోడ్డులో ఏర్పాటు చేశారు. ఈ స్టోర్‌ను ఆర్ఎక్స్–100 మూవీ ఫేం హీరోయిన్ పాయల్‌రాజ్‌పుత్ సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ, సెలెక్ట్ స్టోర్స్‌లో అన్ని రకాల మొబైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. సెలెక్ట్ స్టోర్స్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. సంస్థ ఎండీ వై.గురు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 200 స్టోర్స్ ఏర్పాటు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. సంస్థ డైరెక్టర్ మురళి మాట్లాడుతూ స్టోర్‌లో కొనుగోలు చేసిన ప్రతి మొబైల్‌పై ఒక ఆకర్షణీయమైన బహుమతి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సెలెక్ట్ స్టోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. -
కడపలో పాయల్ రాజ్‌పుత్ సందడి
అందాల తార పాయల్ రాజ్‌పుత్ ఆదివారం కడపలోతళుక్కుమన్నారు.ఒక బ్యూటీ సెలూన్ప్రారంభించేందుకు వచ్చినరాజ్పుత్ అభిమానులతో సందడి చేశారు.ఆమె అభివాదం చేయగానే యువకులు కేరింతలు కొట్టారు. కడప కార్పొరేషన్ : ఆర్ఎక్స్100 సినిమా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కడపలో సందడి చేసింది. అందం, గ్రూమింగ్ విభాగాల్లో అత్యత్తమ సేవలందించే లాక్మే సెలూన్ ప్రారంభోత్సవానికి ఆమె విచ్చేశారు. పాయల్ రాజ్‌పుత్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున యువత కోటిరెడ్డి సర్కిల్‌కు చేరుకున్నారు. ఆమె అభివాదం చేయగానే పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా అభిమానులతో ఆమె సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్మే సెలూన్ తన ఫేవరెట్ అని, ఇక్కడ గ్లామరస్ హైలెట్స్ మొదలు పునరుత్తేజం కలిగించే ఫేసియల్స్, మెడిక్యూర్, పెడిక్యూర్ వంటి సేవలు అందించడంలో లాక్మే సెలూన్ అగ్రగామిగా ఉందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నూతన షోరూం ప్రారంభం కావడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో లాక్మే సీఈఓ పుష్ఫరాజ్ షెనాయ్, టీడీపీ జిల్లా అ«ధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి, ఫ్రాంఛైజీ భాగస్వామి శ్రీ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. -
25 రోజులంటే 250 రోజులతో సమానం– అశోక్‌రెడ్డి గుమ్మకొండ
‘‘ఆర్ఎక్స్ 100’ సినిమా ట్రైలర్ విడుదల చేసినప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మేం ఊహించలేదు. ఈ రోజుల్లో ఓ సినిమా 25 రోజులు సక్సెస్‌ఫుల్‌గా రన్ కావడం అంటే 250 రోజులతో సమానం. 25–30 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది. ఈ సినిమా మా జీవితాన్ని మార్చేసింది. పేరు, డబ్బులకంటే గొప్ప స్నేహితులను ఇచ్చిన సినిమా ఇది’’ అని నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మకొండ అన్నారు. కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్ జంటగా రావు రమేశ్, రామ్కీ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 25 డేస్ సెలబ్రేషన్స్ జరిగాయి. నటుడు రావు రమేశ్ మాట్లాడుతూ– ‘‘అమితాబ్‌గారు, చిరంజీవిగారు గ్యాప్ తీసుకుని సినిమా చేసినప్పుడు ఓ ఉప్పెనలా ఉంటుంది. అది కొందరికే చెల్లుబాటు అవుతుంది. ‘ఆర్ఎక్స్ 100’ ఓ రకంగా ఇండస్ట్రీకి అసూయను క్రియేట్ చేసింది’’ అన్నారు. ‘‘సక్సెస్ స్వీట్ అంటుంటారు. కానీ, మా సక్సెస్ మాత్రం హాట్’’ అన్నారు అజయ్ భూపతి. ‘‘కొత్తవాళ్లు ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు బయటివాళ్లు చెప్పే మాటలు వినొద్దు. మూవీలో కంటెంట్ ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు’’ అన్నారు కార్తికేయ. ‘‘ఇది డైరెక్టర్ ఫిలిం. ఈ సినిమాను రెండు రాష్ట్రాల్లో విడుదల చేయడం హ్యాపీ’’ అని నిర్మాత ‘దిల్’రాజు అన్నారు. -
‘కబాలి’ నిర్మాతతో ‘ఆర్ఎక్స్ 100’ హీరో..!
ఇటీవల సంచలన విజయం సాధించిన చిన్న సినిమా ఆర్ఎక్స్ 100. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించారు. బోల్డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకోవటంతో వసూళ్ల పంట పండింది. అంతేకాదు ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతితో పాటు హీరోగా నటించిన కార్తికేయకు పెద్ద బ్యానర్ల నుంచి ఆఫర్లు అందుతున్నాయి. తాజాగా హీరో కార్తికేయ ఓ తమిళ నిర్మాణ సంస్థ నిర్మించబోయే సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్‌లో కబాలి లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను అందించిన కలైపులి ఎస్ థాను నిర్మించబోయే సినిమాలో కార్తికేయ హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాకు ఎన్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా తమిళ్లోనే తెరకెక్కిస్తారా.. లేక బైలింగ్యువల్‌గా తెరకెక్కిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
యమా స్పీడ్...
గతంలో జుయ్‌మంటూ మన పక్కనుంచి ఒక బైక్ వెళితే అది ‘ఆర్ఎక్స్100’ సౌండ్ అనుకునేంత గొప్పగా చెప్పుకునేవారు ఆ బైక్ గురించి. దాని స్పీడు అలా ఉండేది మరి. ఆ బైక్ పేరునే సినిమాకు టైటిల్‌గా పెట్టారు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పుడు ఆ బైక్ స్పీడ్ కంటే మనోడు సాధించిన హిట్ తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇంకా పెద్ద సౌండ్‌తో వినిపించింది. ఆ మాత్రం సౌండ్ చేస్తే చాలు చాన్సులు డోర్ దగ్గరికి వచ్చేస్తాయ్. ఇప్పటికి అజయ్‌కి వచ్చిన అవకాశాల లెక్క దాదాపు 15. మంచి మంచి ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి అజయ్ డైరెక్షన్లో సినిమా చేయడానికి నిర్మాతలు సంప్రదించారు. విశేషం ఏంటంటే... తెలుగులో సాధించిన హిట్ సౌండ్ పరభాషల వారికీ వినిపించింది. బాలీవుడ్ నుంచి ఫాంథమ్ ఫిల్మ్స్ నిర్మాతలు అనురాగ్ కశ్యప్, మధు మంతెనలతో ఓ సినిమా గురించి మంతనాలు జరుగుతున్నాయి. అలాగే కోలీవుడ్ నుంచి కూడా అజయ్‌కి ఖబర్ వచ్చింది. ప్రముఖ తమిళ హీరో ధనుష్‌తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చిందని టాక్. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. స్పీడు స్పీడులే అంటూ వరుస సినిమాలతో అజయ్ రయ్‌మని దూసుకెళ్లే చాన్స్ కనిపిస్తోంది. -
ఎమోషన్స్ చూడకుండా రొమాన్స్‌పై విమర్శలా?
ఆర్ఎక్స్ 100 సినిమా విజయోత్సవం నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరినాలో ఆదివారం రాత్రి ఉత్సాహంగా సాగింది. హీరో హీరోయిన్లు కార్తీకేయరెడ్డి, పాయల్ రాజ్‌పుత్ డ్యాన్స్‌లు చేస్తూ, ఫొటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేశారు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినిమా సమీక్ష రాసే వారికి తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్స్ కనిపించటం లేదు.. కేవలం 6 నిమిషలా రొమాన్స్ మాత్రమే కనిపిస్తోందంటే వాళ్ల్ల ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్థం అవుతోందని ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మైండ్‌లో అలాంటివి లేవు కాబట్టి 140 నిమిషాల ఎమోషన్స్‌కు కనెక్ట్ అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం వుడా చిల్డ్రన్ ఏరినాలో గౌరీ బాయి అసోసియేట్స్, మూన్ పవర్ ఈవెంట్స్ సంయుక్తంగా ఆర్ఎక్స్ 100 చిత్రం విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలకు యూ ట్యూబ్‌లో కోట్ల వ్యూస్ వస్తున్నాయన్నారు. సినిమాలో రొమాన్స్ ఎందుకు అనేది సినిమా పూర్తిగా చూస్తే అర్థం అవుతుందని అలా కాకుండా నచ్చినట్లు రివ్యూలు రాసి సినిమా పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలను బ్యాన్ చేయాలని మంత్రి గంటాను కోరారు. మెగాస్టార్ చిరంజీవికి మా సినిమా క్యూబ్‌ను పంపించామని ఈ రోజు మా చిత్రాన్ని ఆయన చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ రివ్యూలను బ్యాన్ చేయాలనే ఆలోచన మంచిదని ముఖ్యమంత్రి తో చర్చించి దాన్ని అమలు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వంద శాతం సినిమా షూటింగ్ చేసే చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రం నిర్మాత అశోక్ రెడ్డి, కో–ప్రొడ్యూసర్లు సురేష్ రెడ్డి, రవి కుమార్‌రెడ్డి, వెంకటరెడ్డి మ్యూజిక్ డెరెక్టర్ చైతన్య భరధ్వజ్, కెమెరామెన్ రామిరెడ్డి, గౌరీబాయి అసోసియేట్స్ అధినేత శివకుమార్, మూన్ పవర్ ఈవెంట్స్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామ్‌చరణ్ నుంచి సునీల్ వరకు అందరూ మెచ్చుకున్నారు ఆర్ఎక్స్ 100 చిత్రం చూసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి హీరో సునీల్ వరకు అందరూ సినిమా బాగుందని మెచ్చుకున్నారని హీరో కార్తీకేయ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమలో ఎవరిని ఎదగనివ్వరనే ఒక అపోహ ఉంది. కానీ అది నిజం కాదు మాకు ఎవరు అండ లేరు.. మా కథలో దమ్ము ఉంది. మేము కష్టపడి చేశాం మా చిత్రాన్ని చూసి పంపిణీదారులు ముందుకు వచ్చి విడుదల చేశారు. ఇప్పుడు ప్రేక్షకులను అదరిస్తున్నారు. ఇకనైనా రివ్యూలు రాసేవారు కచ్చితంగా రాయాలని లేకుంటే మనివేయటమే మంచిందన్నారు. వైజాగ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడ తన సినిమా విజయోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్ఎక్స్ 100 విజయోత్సవ వేదికపై మాట్లాడుతున్న మంత్రి గంటా తెలుగు సినిమాలే చేయాలని ఉంది ఇప్పటికే పంజాబీ, హిందీ సినిమాలు చేస్తున్నా అక్కడ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తున్నారని అందుకే తెలుగు సినిమాలే చేయాలని తనకు ఉందని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అన్నారు. మొదటిసారి కథ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలనా అనిపించింది. ఈ చిత్రంలో తన రోల్ ఛాలెజింగ్ ఉందన్నారు. జిగేలు రాణి పాటకుహీరో హీరోయిన్ల స్టెప్పులు విజయోత్సవంలో మునిగి తేలుతున్న ఆర్ఎక్స్ 100 హీరో కార్తీక్, హీరోయిన్ రాజ్‌పుత్ రంగస్థలంలోని జిగేలు రాణి పాటకు స్టేజ్‌పై డ్యాన్స్ చేసి వేదికను హోరెత్తించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రాంచరణ్,తారక్‌లతో నటించాలని ఉంది
-
‘ఆర్ఎక్స్ 100’ మూవీ స్టిల్స్