Ajay Bhupathi's Next Titled Mangalavaram Poster Released - Sakshi
Sakshi News home page

Ajay Bhupathi: అజయ్‌ భూపతి నెక్ట్స్‌ మూవీ మంగళవారం.. పోస్టర్‌ రిలీజ్‌

Published Tue, Feb 28 2023 1:23 PM | Last Updated on Tue, Feb 28 2023 1:40 PM

Ajay Bhupathis Next Titled Mangalavaaram Poster Released - Sakshi

ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్‌ అజయ్‌ భూపతి. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య మహాసముద్రం అనే సినిమాను తెరకెక్కించినా ఆ మూవీ అంతగా సక్సెస్‌ కాలేదు. దీంతో కాస్త గ్యాప్‌ తీసుకొని మంగళవారం అనే సినిమాను రూపొందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి టైటిల్‌ అండ్‌ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. అంతేకాకుండా ఇది పాన్‌ ఇండియాన్‌ సినిమా అంటే బజ్‌ క్రియేట్‌ చేశారు. 

స్వాతి - సురేశ్ వర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి అజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు.హారర్ జానర్‌లో ఈ సినిమా కథను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఆర్‌ఎక్స్‌ 100తో క్రేజ్‌ సంపాదించుకున్న పాయల్‌ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించనుందని టాక్‌ వినిపిస్తుంది. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement