
అభినవ్ మణికంఠ(Abhinav Manikanta), దివిజా ప్రభాకర్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘హే చికితా(Hey Chikittha)’. ధన్‌రాజ్ లెక్కల దర్శకత్వంలో ఎన్. అశోక ఆర్‌ఎన్‌ఎస్, ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) విడుదల చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. తెలంగాణ, ఆంధ్రాలోని పలు లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతాం’’ అని యూనిట్ తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమేరా: ‘గరుడవేగ’ అంజి.
Comments
Please login to add a commentAdd a comment