abhinav
-
ప్రేమకథ షురూ
అభినవ్ మణికంఠ(Abhinav Manikanta), దివిజా ప్రభాకర్, తన్మయి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘హే చికితా(Hey Chikittha)’. ధన్‌రాజ్ లెక్కల దర్శకత్వంలో ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) విడుదల చేశారు. ‘‘ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. తెలంగాణ, ఆంధ్రాలోని పలు లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుతాం’’ అని యూనిట్ తెలిసింది. ఈ చిత్రానికి సంగీతం: చరణ్ అర్జున్, కెమేరా: ‘గరుడవేగ’ అంజి. -
దేశభక్తి నేపథ్యంలో ‘అభినవ్’
‘ఆదిత్య, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్’ వంటి సందేశాత్మక బాలల చిత్రాలు తీసిన దర్శక–నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్ రూపొందించిన మరో బాలల చిత్రం ‘అభినవ్’. సమ్మెట గాంధీ, సత్య ఎర్ర, మాస్టర్ గగన్ , గీతా గోవింద్, అభినవ్, చరణ్, బేబీ అక్షర కీలక పాత్రల్లో నటించారు. శ్రీలక్ష్మి ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందింది. శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ– ‘‘పిల్లల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సినిమాను రూపొందించాను. దురదృష్టవశాత్తూ పిల్లలు గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. ఎన్సీసీ, స్కౌట్స్, యోగా, ధ్యానం నేర్చుకోవడం ద్వారా పిల్లలు ఇలాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటారు’’ అన్నారు. -
కొండపల్లి బొమ్మలకు.. మార్వలెస్ టచ్
ఈ తరం యువతకు అధునాతన ఆవిష్కరణల పై ఉన్న ఆసక్తి.. మన మూలాలను అన్వేషించడంపై ఉండదని తరచూ వింటుంటాం. కానీ నగరానికి చెందిన అభినవ్ సాయి అనే 23 ఏళ్ల యువకుడు తన సృజనాత్మకతతో సాంస్కృతిక వైభవానికి అధునాతన హంగులను అద్దుతూ రెండు తరాలకూ మధ్య వారధిలా నిలుస్తున్నాడు. కళ పరంగా ఎంతో విశిష్టత ఉన్నప్పటికీ ఆదరణకు దూరమవుతున్న కొండపల్లి బొమ్మలకు అధునాతన హంగులతో మళ్లీ ప్రాణం పోస్తున్నాడు. వోక్సన్ యూనివర్సిటీ వేదికగా తను చదువుకున్న విజ్ఞానాన్ని సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆద్యం పోస్తున్నాడు. ఇలా కొండపల్లి బొమ్మకు తాను రూపొందించిన మోడ్రన్ జాయింట్ టెక్నాలజీకి పేటెంట్ సైతం లభించింది. తాను అందించిన ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంతో స్వయంగా రూపొందించిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు ఐదు నేషనల్ అవార్డులను పొందింది. అంతేకాకుండా తన స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో హాలీవుడ్ లెగో టాయ్స్ తరహాలో రూపొందించిన కల్కి మూవీ టాయ్స్ వినూత్న ఆవిష్కరణను తలపిస్తున్నాయి. ఇలా కొండపల్లి బొమ్మలు మొదలు తన సినిమా ప్రయాణం ఈ తరానికి స్ఫూర్తి దాయకమే. ఆ విశేషాలు అభినవ్ మాటల్లోనే తెలుసుకుందాం...!! చిన్నప్పటి నుంచి క్రియేటివ్ పెయింటింగ్, రాక్ స్కల్ప్చరింగ్, మినియేచర్ స్కల్ప్చర్ వంటి సృజనాత్మకత కళలు అంటే ఇష్టం. ఇలా కళాత్మక ప్రయోగాల్లో భాగంగానే నేను 7వ తరగతి (12 ఏళ్ల వయసులో..) చదువుతున్నప్పుడే ఫ్రెండ్స్‌తో నా మొదటి షార్ట్‌ఫిల్మ్ తీశాను. అప్పటికీ నాకు ఎడిటింగ్ అంటే కూడా సరిగా తెలీదు. ఐ మూవీస్ యాప్ సహాయంతో దానిని పూర్తిచేశాను. అలా బ్లాక్ అండ్ వైట్ సినిమా, థ్రిల్లర్, యానిమేషన్, ఫ్యాషన్ తదితర వేరియేషన్స్‌తో 50 షార్ట్ఫిల్్మ్స చేశాను. ఈ క్రియేటివిటీ, ఐడియాలజీతోనే నగరంలోని వోక్సెన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ ఆండ్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్‌లో చేరాను. వోక్సెన్ వేదికగా తెలుగు సంస్కృతిలో విశిష్టత కలిగిన కొండపల్లి బొమ్మలపైన పరిశోధనలు చేశాను. నా క్రియేటివిటీలో భాగంగా కొండపల్లి బొమ్మకు యాక్షన్ మూమెంట్ ఉండేలా మార్పు చేశాను. డెమోక్రసీ డెత్ ఆఫ్ ఆర్ట్స్..నా గ్రూప్ ప్రాజెక్ట్‌లో భాగంగా టాయ్‌కథాన్ అనే కాంపిటీషన్లో పలు ఆసక్తికర విషయాలను తెలుసుకున్నాను. ముఖ్యంగా 95 శాతం ట్రెడిషనల్ బొమ్మల విషయంలో ప్రచారం వేరు, వాస్తవికత వేరు. ఆన్లైన్లో కూడా ఔట్‌డేటెడ్ సమాచారం ఉంటుంది. కొండపల్లి బొమ్మలకు ఎంతో విశిష్టత ఉంది. 400 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి రాజుల కళాభిరుచిలో భాగంగా తెలుగు నేలకు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయింది. తేలికైన తెల్లపొనిక చెక్కతో చేస్తారు. కానీ వాటికి ప్రస్తుతం అంతగా మార్కెట్ లేదు. ఒకప్పుడు 6 అడుగుల వరకూ ఉంటే ఇప్పుడు 4, 5 ఇంచులకు మారిపోయాయి. సహజసిద్ధమైన రంగులు వినియోగించేవారు. ప్రస్తుతం అవి వాడట్లేదు. ఎయిర్ పోర్ట్‌లు, పెద్ద షాపింగ్ మాల్స్‌లో అమ్మే బుట్ట బొమ్మలు కూడా కొండపల్లి బొమ్మలు అనుకుంటారు చాలమంది. ఇలాంటి అంశాల వెనుకున్న కారణాలను నా పరిశోధనలో తెలుసుకున్నారు.యూనివర్సిటీ ప్రోత్సాహంతో పేటెంట్ ఒక స్పైడర్ మ్యాన్ బొమ్మలా మన కొండపల్లి చెక్క బొమ్మలు కూడా కదిలేలా డిజైన్ చేశాను. ప్రయోగంలో మా యూనివర్సిటీ అందించిన ప్రోత్సాహంతో నాకు పేటెంట్ రైట్స్ లభించాయి. హాలీవుడ్లో టాయ్స్టిక్ స్టార్టజీ బాగా ఆదరణ పొందింది. బార్బీ వంటి బొమ్మలను రూపొందించి వాటి మార్కెట్ కోసం భారీ సినిమాలను సైతం నిర్మిస్తారు. ఈ కోణంలోనే నా ప్రొడక్ట్ డిజైన్ నేపథ్యంలో తీసిన యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు మరో ఐదు నేషనల్ అవార్డులు పొందింది. మరో 10 నేషనల్ అవార్డులకు ఎంపికైంది. ఈ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయింది. 3డీ డిజైన్.. గ్లిమ్స్‌తో యానిమేషన్..హాలీవుడ్ లెగో టాయ్స్లాగే.. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలుగు సినిమా ‘కలి్క’ సినిమాలోని బుజ్జీ కారు, ప్రభాస్ తదితర పాత్రధారులను నా స్టార్టప్ ‘క్యాపిబరో’ ఆధ్వర్యంలో స్కెచ్ వేసి, 3డీ డిజైన్‌తో కొండపల్లి క్రాఫ్ట్ మెన్‌తో బొమ్మలు చేయించాను. అంతేకాకుండా కల్కి గ్లిమ్స్ ఆధారంగా యానిమేటెడ్ వీడియో చేశాను. ఈ విషయం తెలుసుకుని కల్కి నిర్మాత స్వప్న, దర్శకులు నాగ్ అశ్విన్ నా క్రియేటివిటీని అభినందించారు. వారితో కలిసి ఒక ప్రాజెక్టులా ఈ బొమ్మలను తయారు చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమా విడుదల బిజీ నేపథ్యంలో కుదరలేదు. నా క్రియేటివిటీతో దర్శకునిగా సినిమాలు చేయాలని ఉంది. ఇప్పటి వరకూ తొమ్మిది కమర్షియల్ సినిమా స్క్రిప్‌్టలు రెడీ చేశాను. ఇందులో ఒక కథ ప్రముఖ దర్శకులు సుకుమార్‌కు నచ్చి చర్చలు జరుగుతున్నాయి. తన సుకుమార్ రైటింగ్స్ ఆధ్వర్యంలో నా సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాను. -
కామెడీ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వదేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రధారులుగా, ‘అవసరాల’ శ్రీనివాస్ ఓ కీలక పాత్రలో నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ పతాకాలపై రాజు నిర్మించారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 2న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ గురువారం వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, సహ–నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
కవలలకు జన్మనిచ్చిన బిగ్‌బాస్ విజేత!
బుల్లితెర నటి, బిగ్‌బాస్ విజేత రుబీనా దిలక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత రివీల్ చేసింది. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా జన్మించినట్లు ఆమె వెల్లడించింది. కానీ అంతకుముందే రుబీనా-అభినవ్ జంటకు ట్విన్స్ జన్మించినట్లు రుబీనా ఫిట్నెస్ ట్రైనర్ పోస్ట్ చేశారు. ఈ బుల్లితెర జంట తమ కుమార్తెల పేర్లను కూడా వెల్లడించారు. కవలలకు జీవా, ఈధా అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు. పిల్లలు జన్మించి నెల రోజులు పూర్తి కావడంతో ఇంట్లో పూజలు నిర్వహించారు. తమ కూతుళ్లను చేతుల్లో పట్టుకుని కెమెరాల ముందు కనిపించారు. కాగా.. రుబీనా బుల్లితెర నటుడు అభినవ్ శుక్లాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మా కుమార్తెలు జీవా, ఎధాలకు నెల రోజులు నిండాయని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. గురుపురాబ్ లాంటి పవిత్రమైన రోజున ఆ దేవుడు ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా దేవతలకు మా శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. ఈ జంట 2018లో సిమ్లాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్- 14 లో పాల్గొన్నారు. ఈ సీజన్ విజేతగా రుబీనా నిలిచింది. అభినవ్ ఇంట్లో పెద్దమనిషిగా ప్రశంసలు అందుకున్నారు. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) -
యూత్‌ఫుల్ కిస్మత్
నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘కిస్మత్’. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో రాజు నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను హీరో సత్యదేవ్ విడుదల చేశారు. ‘‘బెస్ట్ బడ్డీస్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఫన్ రైడ్ ‘కిస్మత్’. ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: మార్క్ కె. రాబిన్, కెమెరా: వేదరామన్ శంకరన్, సహ నిర్మాత: సీహెచ్ భానుప్రసాద్ రెడ్డి. -
కోస్టల్ రైడర్స్ శుభారంభం
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్ జట్టు 12 పరుగుల తేడాతో బెజవాడ టైగర్స్ జట్టుపై గెలిచి శుభారంభం చేసింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోస్టల్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మన్యాల ప్రణీత్ (31; 3 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ షేక్ రషీద్ (20; 4 ఫోర్లు), మద్దిల హర్షవర్ధన్ (32; 2 ఫోర్లు, 1 సిక్స్), మిట్టా లేఖజ్ రెడ్డి (26; 5 ఫోర్లు), పాథూరి మనోహర్ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. బెజవాడ టైగర్స్ బౌలర్లలో లలిత్ మోహన్ మూడు వికెట్లు, సాయితేజ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ 19.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్ మున్నంగి అభినవ్ (57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. కోస్టల్ జట్టు బౌలర్లలో చీపురపల్లి స్టీఫెన్, సుదర్శన్, ఆశిష్, మనోహర్ రెండు వికెట్ల చొప్పున తీసి బెజవాడ జట్టును దెబ్బ తీశారు. -
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ‘దిల్సే’
ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంటుంది. అందుకే మన దర్శకనిర్మాతలు లవ్‌స్టోరీ చిత్రాలపై ప్రత్యేక దృష్టిపెడతారు. త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో ట్రయాంగిల్ లవ్‌స్టోరీ రాబోతుంది. అభినవ్ మదిశెట్టి , స్నేహ సింగ్ హీరో హీరోయిన్లు గా నటించిన చిత్రం ‘దిల్ సే’. శ్రీ చైతన్య క్రియేషన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీ ఆగస్ట్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా మొదటి సాంగ్ ‘రెండు కన్నులతో’ కు మంచి స్పందన లభించింది. లహరి మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట 2 మిలియన్ వ్యూస్ కు చేరుకుంది. శ్రేయ ఘోషల్ పాడిన ఈ పాటకు నూతన సంగీత దర్శకుడు శ్రీకర్ సంగీతం అందించాడు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా ‘దిల్ సే’ ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఒన్ మీడియా ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చెయ్యబోతోంది. -
అదనపు కలెక్టర్‌గా అభిలాష
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా మహబాబూబాద్ జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా విధులు నిర్వర్తిస్తు న్న అభిలాష అభినవ్ నియమితులయ్యారు. అలాగే, ప్రస్తుత ఖమ్మం అదనపు కలెక్టర్ స్నేహలతను జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా నియమించారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2018 బ్యాచ్ ఐఏఎస్ 2018వ బ్యాచ్‌కు చెందిన అభిలాష అభివన్‌కు 2020 ఆగస్టులో మహబూబాబాద్ అదనపు కలెక్టర్ తొలి పోస్టింగ్ వచ్చింది. అక్కడ పనిచేసిన మూడేళ్ల కాలంలో ఆమె మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు జాతీయ స్థాయిలో అవార్డులు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు. బిహార్‌కు చెందిన ఆమె పాట్నాలో పదో తరగతి 91శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు. అలా గే, ఇంటర్ 85శాతం మార్కులతో 2007లో ఉత్తీర్ణత సాధించగా, బీటెక్(ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) నావి ముంబైలోని ఏసీ పటేల్ కళాశాలలో 2012లో పూర్తిచేశారు. అనంతరం పూణేలోని ఐబీఎంలో రెండేన్నరేళ్లు విధులు నిర్వర్తించిన అభిలాష వాలీబాల్ చాంపియన్ షిప్‌గా గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు పెయింటింగ్ హాబీగా ఉంది. కాగా ఆమె తండ్రి గోల్నాథ్ సర్కార్ సైతం ఐపీఎస్ అధికారే కావడం విశేషం. స్నేహలతకు మంచి గుర్తింపు 2020 ఫిబ్రవరి 10న ఖమ్మం అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన స్నేహలత విధినిర్వహణలో మంచి పేరు సంపాదించారు. స్థానిక సంస్థలకు సంబంధించి వివిధ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ విజయవంతమయ్యేలా కీలక భూమిక పోషించారు. మన ఊరు – మన బడి, గ్రామాల్లో పల్లెప్రగతి పనులు వేగవంతమయ్యేలా కృషి చేశారు. కాగా, స్నేహలత ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించడం ద్వారా ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం పెరిగేందకు దోహదపడ్డారు. కల్లూరు ఆర్డీఓగా శివాజీ ఖమ్మం ఆర్డీఓ రవీంద్రనాథ్ తొర్రూరుకు బదిలీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(భూసేకరణ)గా ఉన్న బి.శివాజీని కల్లూరు ఆర్డీఓగా నియమించారు. ఈ స్థానంలో ఉన్న సీహెచ్.సూర్యనారాయణను కోదాడ ఆర్డీఓగా బదిలీ చేశారు. అలాగే, ఖమ్మం ఆర్డీఓ ఎం.వీ.రవీంద్రనాథ్ను తొర్రూరు ఆర్డీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఖమ్మం ఆర్డీఓగా మాత్రం ఇంకా ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. -
అందుకే జబర్దస్త్‌లో ఎక్కువ పారితోషికం.. చైతన్య చివరి వీడియోపై అభి..
ఢీ షోలో కొరియోగ్రాఫర్‌గా పని చేసిన చైతన్య మాస్టర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే! మే 1న అప్పులు తీర్చలేకపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు తీసుకున్నాడు. ఢీ షో పేరు ఇస్తుంది కానీ జబర్దస్త్‌లో వచ్చినంత సంపాదన ఢీలో రాదని ఆయన వీడియోలో వాపోయాడు. తాజాగా చైతన్య మృతికి సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించిన కమెడియన్ అదిరే అభి జబర్దస్త్ వర్సెస్ ఢీ పారితోషికాలపై స్పందించాడు. అలాగే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవారికి పలు సలహాలు, సూచనలు ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. సినిమా, టీవీ పరిశ్రమలో ఉండేవాళ్లను చూసి చాలామంది కొత్తగా ఈ ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. అలా వచ్చి సెటిలైన వాళ్లను చూసి.. మరింతమంది ఇన్స్పైర్ అయి వస్తుంటారు. అంటే.. మనం ఏం చేసినా దాని ప్రభావం తర్వాత వచ్చేవాళ్లపై పడుతుంది. కాబట్టి ఇండస్ట్రీలోకి రావాలనుకునేవాళ్లందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా.. ఇండస్ట్రీ గురించి ముందు అవగాహన తెచ్చుకుంటే మున్ముందు వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మానసిక ధైర్యం వస్తుంది. ఇక్కడికి రాగానే ఎర్రతివాచీ పరిచి ఆఫర్లు ఇస్తారు, చాలా డబ్బులు వస్తాయి అని భ్రమపడితే పొరపాటే. కడుపు మాడ్చుకుని, ఎన్నో నిద్ర లేని రాత్రిళ్లు గడిపితేనే సక్సెస్ వస్తుంది. ఒక బ్రేక్ వచ్చాక దాన్ని మెయింటెన్ చేయడం కూడా చాలా పెద్ద విషయం! ఇండియన్ సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్టార్‌గా వెలుగొందిన అమితాబ్ బచ్చన్ గతంలో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఆ బ్యానర్లో తీసిన సినిమాలన్నీ ఫ్లాపవడంతో వంద కోట్ల మేర నష్టం వచ్చింది. తన కార్లు కూడా అమ్మేసుకున్నాడు. కానీ.. కౌన్ బనేగా కరోడ్‌పతితో హోస్ట్‌గా మళ్లీ కెరీర్ మొదలుపెట్టి జీరో నుంచి మళ్లీ సూపర్ స్టార్ అయ్యాడు. అంటే పరిస్థుతులను ఎదుర్కొనేంత మానసిక ధైర్యం మనకు ఉండాలి. అందుకే ముందుగానే ప్లాన్ బి కూడా రెడీ చేసుకోవాలి. మనకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత దాచుకోవాలి. అప్పుడే ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది మనకు సాయపడుతుంది. చిన్నవాటికే కుంగిపోయి ఆత్మహత్య చేసుకోకూడదు. ఇక షో రేటింగ్‌ను బట్టి ఆయా ప్రోగ్రామ్‌లో పని చేసే వాళ్లకు పారితోషికం ఇస్తారు. జబర్దస్త్‌కు రేటింగ్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. అయినా వాటి మీద ఆధారపడకుండా బయట ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ ద్వారా ఆర్టిస్టులు మరింత సంపాదిస్తారు. ఇక్కడ ఆఫర్లు రానప్పుడు వేరే దారి ఎంచుకుని జీవించడం బెటర్' అని చెప్పుకొచ్చాడు అభి. చదవండి: అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. చై ఆన్సరేంటంటే -
మెడ్‌టెక్ జోన్లో కృత్రిమ అవయవాల తయారీ
సాక్షి, విశాఖపట్నం: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కృత్రిమ అవయవాల తయారీపై దృష్టిసారించింది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో అసిస్టివ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)ను ఏర్పాటు చేసిన ఐసీఎంఆర్.. తాజాగా విశాఖలోనూ ప్రారంభించింది. ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోగా.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే నిర్మించడం విశేషం. మరోవైపు, వైద్య ఉపకరణాలకు వేదికగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్లో మరో తయారీ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించింది. చక్కెర స్థాయిల్ని తెలిపే బీజీఎంఎస్ పరికరాల తయారీ ప్రాజెక్టుకు యాక్యూరెక్స్ సంస్థ శ్రీకారం చుట్టింది. విశాఖలోని ఏపీ మెడ్‌టెక్ జోన్లో వైద్య పరికరాల తయారీ క్రమక్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మెడ్‌టెక్ జోన్లో 100కి పైగా సంస్థలు వైద్య పరికరాల ఉత్పత్తి, పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. తాజాగా యాక్యురెక్స్ సంస్థ కూడా తమ పరికరాల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించింది. బ్లడ్ గ్లూకోజ్ మోనిటరింగ్ సిస్టమ్(బీజీఎంఎస్) పరికరాల్ని మెడ్‌టెక్‌జోన్‌లో ఇక నుంచి తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి సంబంధించిన పరిశ్రమని ఇటీవల ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.రాజీవ్‌భాల్, ఏఎంటీజెడ్ సీఈవో, ఎండీ డా.జితేంద్రశర్మ ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటి యూరిన్ స్ట్రిప్స్ తయారీ సంస్థగా రికార్డు సృష్టించామని, భవిష్యత్తులో మరిన్ని నూతన పరికరాల్ని తయారు చేసేందుకు విశాఖ కేంద్రంగా అడుగులు వేస్తున్నామని యాక్యురెక్స్ ఎండీ అభినవ్ ఠాకూర్ తెలిపారు. -
రెండు సీన్లు చూసి ఆ సినిమాను ఎక్కువ రేటుకు కొన్నారు
Shikaaru Movie Trailer: ‘‘నా ‘ఆది’ సినిమా అప్పుడు జస్ట్ రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయనకు జడ్జిమెంట్ బాగా తెలుసు. బాబ్జీని ఒప్పించి, దర్శకుడు హరి ఈ సినిమా చేయడం గొప్ప విషయం. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరున్న బాబ్జీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో హరి కొలగాని దర్శకత్వంలో పీఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మించిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ ప్రధాన తారలుగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌ను వీవీ వినాయక్ ఆవిష్కరించారు. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘చక్కని కామెడీతో హరిగారు ఈ సినిమాని తెరకెక్కించారు. శేఖర్ చంద్ర చక్కని బాణీలు సమకూర్చారు’’ అన్నారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది’’ అని తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ అన్నారు. -
కోటేశ్వర రావు గారి కొడుకులు టీజర్ వచ్చేసింది
Koteswara Rao Gari Kodukulu Movie Teaser: అభినవ్, సత్యమణి హీరోలుగా ప్రియాంక డి, చందన హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం " కోటేశ్వరరావు గారి కొడుకులు". మోస్ట్ డేంజరస్ వెపన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మనీ అనేది క్యాప్షన్. నవీన్ ఇరగానిని దర్శకుడిగా పరిచయం చేస్తూ మై గోల్ సినిమా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై తన్వీర్ యం.డి. నిర్మిస్తున్న ఈ సినిమాలో వశిష్ట్ నారాయణ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని మ్యాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెబుతూ టీజర్ చాలా బాగా వచ్చిందని అభినందించారు. టీజర్ విషయానికొస్తే.. 'మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా దానికి కారణం ఖచ్చితంగా మనీ అయి ఉంటది' అనే రియలిస్టిక్ డైలాగ్‌తో ప్రారంభమై ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. మనీ కెన్ డు ఎనీథింగ్.. ఈ ప్రపంచంలో చాలా ప్రమాదకరమైన ఆయుధం డబ్బు అంటూ మోడ్రన్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే ప్రయత్నం చేశారు మేకర్స్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్ అబ్బురపరుస్తున్నాయి. మిడిల్ క్లాస్ తండ్రి కొడుకుల మధ్య జరిగే స్టోరీ ఇదని, తండ్రీ కొడుకుల మధ్య మనీ మ్యాటర్ నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారని తెలుస్తోంది. కొడుకులను కోటీశ్వరులను చేయాలనుకునే తండ్రి కల నెరవేరిందా? అదేవిధంగా తండ్రిని కోటీశ్వరుడు చేయాలనుకునే ఆ కొడుకుల ప్రయత్నం ఫలించిందా? అనే డిఫరెంట్ స్టోరీని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్. -
'రామ్ అసుర్' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నాం: నిర్మాత
Ram Asur Movie Unit Success Meet In Hyderabad: టాలీవుడ్లో చిన్న సినిమాలుగా వచ్చి హిట్ కొట్టిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతగానో మెప్పించిన చిత్రం రామ్ అసుర్. అభినవ్ సర్ధార్, రామ్ కార్తిక్ కథానాయకులుగా నటించారు. ఈ చిత్రానికి వెంకటేష్ త్రిపర్ణ కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి రోజు నుంచి ప్రేక్షకుల ఆదరణ పొందడమే గాక విమర్శకుల ప్రశంసలు పొందుతుంది. అయితే ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కరోనా సమయంలో ధైర్యంగా షూటింగ్ చేసి విజయం సాధించామని సహ నిర్మాత ఆర్కే తెలిపారు. దీంతో ఫుల్‌జోష్‌లో ఉన్నామన్నారు. దర్శకుడు వెంకటేష్ త్రిపర్ణ మాట్లాడుతూ, 'ఈ సినిమా విజయం చూసిన తర్వాత మేము ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా మర్చిపోయాం. క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో గానీ, కలెక్షన్స్ పాయింట్ అఫ్ వ్యూ లో గానీ మా సినిమా కి మంచి ఆదరణ లభిస్తుంది. భారీ వర్షాల్లో కూడా ప్రేక్షకులు మా సినిమా ను వీక్షిస్తున్నారు అంటే సినిమా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా సక్సెస్ కు కారణమైన అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.' అన్నారు. హీరో అభినవ్ సర్దార్ మాట్లాడుతూ.. సక్సెస్ టూర్లో భాగంగా కొన్ని నగరాలకు వెళ్లి ఆడియన్స్‌తో సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశామని హీరో అభినవ్ తెలిపారు. ప్రేక్షకుల రెస్పాన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. తన పాత్రకు మంచి గుర్తింపు వస్తోందని నటుడు షానీ తెలిపారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం డైరెక్టర్ వెంకటేష్ అని హీరోయిన్ శెర్రి అగర్వాల్ పేర్కొన్నారు. -
ఆకట్టుకుంటున్న ‘మైల్స్ అఫ్ లవ్’ టీజర్
హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నాలుగు పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని యంగ్ మరో శ్రీవిష్ణు విడుదల చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మైల్స్ అఫ్ లవ్ టీజర్ చూశాను. చాలా ఫ్రెష్ గా ఉంది. హీరో అభినవ్ చాలా అందంగా కనిపించాడు.ఈ సినిమా కి అందరు కొత్తవాళ్లే పని చేశారు. ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. మెలోడీ మ్యూజిక్ తో ఈ టీజర్ మొదలవుతుంది. ఇది ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ అని టీజర్ చూస్తే తెలుస్తుంది. ఎంతో ఫీల్ తో హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ ఉండబోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టీజర్ చివర్లో వచ్చే ఓ షాట్ ద్వారా చూపించారు. 'ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా కాకుండా సొల్యూషన్ లా చూస్తే సొల్యూషన్ ప్రాబ్లమ్ అవుతుంది.. ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది..' అనే డైలాగ్ చాలా బాగుంది. -
ఆయన లేకపోతే జాతిరత్నాలు లేదు
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల కన్నా ‘జాతిరత్నాలు’ సినిమాకు నాగీ అన్న (నాగ్ అశ్విన్) ఎక్కువ కష్టపడ్డారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు’’ అని సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహార్ అన్నారు. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా ‘జాతిరత్నాలు’ సినిమాటోగ్రాఫర్ మనోహార్ మాట్లాడుతూ– ‘‘నాది నెల్లూరు. నాగీ (నాగ్ అశ్విన్) అన్న కార్పొరేట్, వెడ్డింగ్ వీడియోస్‌ను డైరెక్ట్ చేసే ప్రాసెస్‌లో ఉన్న సమయంలో చాలా వర్క్ నేర్చుకున్నా. ‘ఎవడే సుబ్రమణ్యం’ సమయంలో నేను దర్శకత్వ ప్రయత్నాలు చేశాను. డైరెక్షన్లోకి వెళితే సినిమాటోగ్రఫీ చేయలేవని నాగీ, స్వప్న కౌన్సిలింగ్ ఇచ్చారు. ‘మహానటి’ సినిమాకు అసిస్టెంట్ కెమెరామెన్‌గా చేశాను. ‘అమ్మ దీవెన’ చిత్రంతో పాటు ఓ చిన్న సినిమాకు కెమెరామ్యాన్‌గా పని చేశాను. తర్వాత చేసిన ‘జాతిరత్నాలు’ సినిమా పెద్ద హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. ఈ సమావేశంలో ‘జాతిరత్నాలు’ ఎడిటర్ అభినవ్ మాట్లాడుతూ– ‘‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. వెడ్డింగ్ ఫిల్మ్స్, కమర్షియల్ యాడ్స్‌ని సరదాగా షూట్ చేసి ఎడిట్ చేసేవాణ్ణి. ఏడాదిన్నర క్రితం ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’ అనే వెబ్ సిరీస్ ఎడిటర్‌గా నాకు పెద్ద ప్రాజెక్ట్. దాని తర్వాత ‘జాతిరత్నాలు’ చిత్రానికి ఎడిటర్‌గా చేశాను. డైరెక్టర్ కావాలన్నది నా లక్ష్యం. ఎడిటర్లలో డైరెక్టర్స్ అయినవారూ ఉన్నారు. ‘రాజూ హిరానీ, ఆంథోనీ, రాజమౌళి లాంటి వాళ్ళకు ఎడిటింగ్‌లో మంచి స్కిల్ ఉంది. కథను ఎలా చెప్పాలి?, క్యారెక్టర్స్‌ను ఎలా చూపించాలి? అనేవి ఎడిటింగ్ ద్వారానే మరింత తెలుస్తాయి’’ అన్నారు. చదవండి: దర్శకుడి హాస్పిటల్ బిల్ కట్టిన విజయ్ సేతుపతి నవ్వులు పూయించిన ‘జాతి రత్నాలు’ -
బిగ్‌బాస్: శ్రుతి మించిన రొమాన్స్
బిగ్‌బాస్... అక్కడ అనుక్షణం ఎమైనా జరగొచ్చు. చివరి వరకు ఉంటారనుకున్న వారు మధ్యలోనే వెళ్లిపోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన వారు ఫైనల్‌కి రావొచ్చు. కంటెస్టెంట్ల ప్రవర్తన వారి ఆటను పూర్తిగా మలుపు తిప్పుతుంది. ఇక వివిధ భాషల్లో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ షోలలో హిందీ బిగ్‌బాస్‌కు క్రేజ్ ఎక్కువ. అక్కడ కంటెస్టెంట్లు, టాస్కులు, ఆట విధానం ఒకింత భిన్నంగా ఉంటాయి. ఇంటి సభ్యుల ప్రవర్తన, గొడవలు కూడా వేరే లెవల్లో ఉంటాయి. హిందీలో ఇప్పటి వరకు 13 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రస్తుతం 14 వ సీజన్ కొనసాగుతుంది. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ షోలో గత సీజన్లలో పాల్గొన్న, గెలిచిన ప్రముఖ వ్యక్తులను తీసుకు రావడం విశేషం. చదవండి: బిగ్‌బాస్: మాస్టర్‌ను ఇంటికి పంపించాల్సిందే.. 34 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌లో అయిదవ వారం కొనసాగుతోంది. ఇంట్లో ప్రస్తుతం ఇంట్లో 11 మంది ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ప్రోమో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంది. అసలే హిందీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్ల మధ్య సన్నిహిత్యం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రోమోలో ఇంటి సభ్యుల్లో కొంతమంది మరింత రెచ్చిపోయారు. అందులోనూ ఈరోజు రేపు (శని, ఆది) వీకెండ్ కావడంతో ఫన్‌తోపాటు ఎంటర్టైన్మెంట్ డోస్ ఎక్కువైనట్లు కనిపిస్తోంది. శనివారం వీకెండ్ కా వార్ ఎపిసోడ్ ప్రోమోలో జాస్మిన్ బాసిన్-అలీ గోని, అభినవ్ శుక్లా- రుబినా దిలైక్, నిక్కి తంబోలి- జాన్ కుమార్ సాను, ఐజాజ్ ఖాన్- పవిత్ర పునియా జంటలుగా ఏర్పడి ఒకరికొకరు నువ్వానేనా అన్నట్లు ప్రవర్తించారు. చదవండి: ప్రేమలో ఉన్నట్లు చెప్పిన బిగ్‌బాస్ ఫేం శనివారం నాటి ఎపిసోడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ వచ్చి ఇప్పటి నుంచి బిగ్‌బాస్ ఇంట్లో సెలబ్రెషన్స్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జాస్మిన్, అలీ హిందీ పాటకు డ్యాన్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే అభినవ్ తన భార్య రుబినాతోకలిసి హిట్ సాంగ్ తుహైబివి నెం1 అనే పాటను ఆలపించారు. అంతేగాక రియాలిటీ షోలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ఒకరినొకరు కిస్ చేసుకున్నారు. అనంతరం షారూఖ్ ఖాన్ పాటకి రాహుల్ వైద్య డ్యాన్స్ చేశాడు. ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ సినిమా నుంచి ఐ యామ్ ది బెస్ట్ పాటకు స్టెప్పులువేశాడు. అంతేగాక ఈరోజు ఎపిసోడ్లో ఓ గెస్ట్ రానున్నారు. కొరియోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన రెమో డి సౌజాతో పాటు సల్మాన్ యూసుఫ్, పునిత్ పాథక్, షాకి మోహన్..వీరంతా ఇంటి సభ్యులతో కలిసి హౌజ్‌లో సందడి చేయనున్నారు. చదవండి: నేను ప్రెగ్నెంట్ కాదు: బిగ్‌బాస్ నటి Promo precap pic.twitter.com/vzZwzvtaaO — SuzyCrxn (@suzybb14) November 6, 2020 Promo precap 2 pic.twitter.com/qitkahgMyi — SuzyCrxn (@suzybb14) November 6, 2020 -
ట్రెండీగా నిలుస్తున్న నటీనటుల వెడ్డింగ్ కార్డు
న్యూఢిల్లీ : ఎంతో కాలంగా రిలేషన్లో ఉన్న బుల్లితెర నటీనటులు రుబినా దిలాయక్, అభినవ్ శుక్లాలు ఈ నెల 21న ఒకటవ్వబోతున్నారు. వీరిద్దరూ తమ వివాహ ఆహ్వాన పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కార్డులో ప్రతి ఒక్కటీ చూడముచ్చటగా నిలుస్తోందని సోషల్ మీడియా యూజర్లంటున్నారు. వెడ్డింగ్ కార్డు చాలా ట్రెండీగా, అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ కార్డు ఎలా డిజైన్ చేయించారో తెలుసా..? పర్యావరణ పరిరక్షణగా రీసైకిల్ పేపర్‌తో ఈ కార్డును డిజైన్ చేయించారట. ఆ కార్డుపై రుబినా, అభినవ్ పేర్లలోని తొలి పదాలతో పాటు వివాహ తేదీ కూడా ఉంది. కార్డు పక్కనే ఒక చిన్న గాజు పాత్ర, దానిలో ఉంచిన ప్రకృతితో మమేకమైన పూలు, మొక్కలు ఇవన్నీ కార్డుకు ట్రెండీగా నిలుస్తున్నాయి. ‘ నిజమైన ప్రేమ మన ఆత్మను పెంపొందిస్తోంది. ఈ కార్డుతో మా కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తూ.. మా స్నేహితులకు ‘జీవితం’గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటున్నాం. మాతో కలిసి ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు’ అని రుబియా పోస్టు చేశారు. తమ ఆహ్వానం పూర్తిగా ఆర్గానిక్, బయోడిగ్రేడబుల్ లాగా ఉందని, ఈ కార్డును ఎండీఎఫ్ చెక్క, రీసైకిల్ పేపర్‌తో తయారు చేయించామని చెప్పారు. పెళ్లిళ్లు ఎంతో సంతోషభరితంగా, ప్రకృతికి అనుకూలంగా ఉండాలనే భావనను తాము ప్రోత్సహిస్తామని అన్నారు. తమ అద్భుతమైన ఈ వెడ్డింగ్ కార్డు డిజైన్ క్రెడిట్ అంతా రుబినాదే అంటూ అభినవ్, కాబోయే భార్యను పొగడ్తలతో ముంచెత్తారు. ‘ఇప్పటి వరకు చూసిన వాటిలో ఇదే ఉన్నతమైన ఆలోచన. మొక్కలే పెళ్లికి ఆహ్వానం! సేంద్రియ, ప్రకృతికి అనుకూలమైన విధంగా, ఓ ప్రత్యేకమైన ఆలోచనతో రావడం నీకు మాత్రమే సొంతం’ అని అభినవ్ అభినందించారు. తన ఆలోచనకు తగ్గట్టు కార్డును డిజైన్ చేసిన వారికి రుబియా కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్యూ మై లవ్ అంటూ అభినవ్ శుక్లాపై కూడా ప్రేమ వర్షం కురిపించారు. రుబియా, అభివన్ ఎన్నో ఏళ్లుగా పరిచయస్తులు. మార్చిలో వీరిద్దరూ తమ వివాహాన్ని ప్రకటించారు. సిమ్లాలో వీరి వివాహం జరగనుంది. అయితే అభినవ్, రుబియాలు తమ వివాహ ఆహ్వాన పత్రిక విషయంలో కోహ్లి, అనుష్క శర్మలను కాపీ కొట్టారని తెలుస్తోంది. కోహ్లి, అనుష్కల వివాహ పత్రిక కూడా ఈ విధంగానే ఉండటం గమనార్హం. -
అమ్మాయిలు ఆపదలో పడకుండా.
తమిళసినిమా: అమ్మాయిలు ఆపదలో పడకుండా అవగాహన కలిగించే చిత్రంగా ఎక్స్ స్టూడియోస్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సజోసుందర్ తెలిపారు. దర్శకుడు హరి వద్ద ఐదు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేసిన ఈయన నటుడు ప్రకాశ్‌రాజ్ తెరకెక్కించిన ధోని, ఉన్ సమయిలరయిల్ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారట. సజోసుందర్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎక్స్ స్టూడియోస్. కలర్ షాడోస్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ.స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తన తొలి చిత్రాన్ని మంచి కమర్శియల్ అంశాలతో తెరకెక్కించాలనుకున్నానన్నారు.అలాంటిది ఈ ఎక్స్ స్టూడియోస్ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో దాని కారణంగా అమ్మాయిలకు ఎదురవుతున్న ఆపదల గురించి అవగాహన కలిగించే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఎక్స్ స్టూడియోస్ చిత్రాన్ని శృంగార భరితం చిత్రంగా భావించరాదని, సామాజిక స్పృహతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఉత్కంఠంగా సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఇంటర్నెట్ అనే అంతర్జాలం ద్వారా కళాశాల విద్యార్థినులు, ఇతర వయసు అమ్మాయిలు ఎలాంటి ఆపదలో పడుతున్నారు? అలాంటి ఆపద నుంచి దూరం అవడానికి ఏం చేయాలన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నెపిల్లల భద్రతపై అవగాహన కలిగించే చిత్రంగా ఎక్స్ స్టూడియోస్ చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇందులో అభినవ్, విజయ్, షాన్, అహిరుధి హీరో హీరోయిన్లుగా నటించారు. -
అభినవ్, సాత్వికలకు టైటిల్స్
హైదరాబాద్: ఐసీఎస్ఈ, ఐఎస్సీ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ లో భాగంగా జరిగిన లాన్ టెన్నిస్ టోర్నమెంట్లో అభినవ్, సామ సాత్విక విజేతలుగా నిలిచారు. సికింద్రాబాద్‌లోని వశిష్ట టెన్నిస్ అకాడమీలో ఆదివారం జరిగిన సీనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో కె. అభినవ్ (శ్రీనిధి స్కూల్ ) 8-4తో సుశాల్ భండారి (జాన్సన్ గ్రామర్ స్కూల్) పై గెలుపొందగా... బాలికల సింగిల్స్ విభాగంలో సాత్విక (ఎన్ఏఎస్ఆర్) 8-0తో సాయి దుర్గ (షేర్వుడ్)ను చిత్తుగా ఓడించింది. అంతకు ముందు జరిగిన బాలుర సెమీస్ మ్యాచ్‌ల్లో అభినవ్ (శ్రీనిధి) 8-4తో ఆయుష్మాన్ (హెచ్‌పీఎస్)పై, సుశాల్ 7-1తో వల్లభ (షేర్వుడ్)పై గెలుపొందారు. బాలికల సెమీఫైనల్లో సాత్విక 8-0తో నక్షత్ర (జాన్సన్ గ్రామర్)పై, సాయి దుర్గ 8-0తో సరయు (ఎస్‌ఏఎస్‌ఆర్)పై విజయం సాధించారు. మరోవైపు జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో చరిత (గీతాంజలి) 8-6తో శ్రీజ (సెయింట్ జోసెఫ్)పై, బాలుర సింగిల్స్ విభాగంలో బృహత్ కాలేరు (కల్ప స్కూల్) 8-1తో రోహిత్ (హెచ్‌పీఎస్)పై గెలుపొంది విజేతలుగా నిలిచారు. జూనియర్ బాలుర డబుల్స్ విభాగంలో జోనాథన్-యువరాజ్ (జాన్సన్ గ్రామర్) జోడి 8-7తో కె. విశ్వానంద-లిఖిత్ రెడ్డి (జాన్సన్ గ్రామర్) జంటపై నెగ్గి డబుల్స్ టైటిల్‌ను కై వసం చేసుకున్నారు. -
సారీ అమ్మా..వెళ్లిపోతున్నా...
వరంగల్ నగరానికి చెందిన నర్సింగ్ విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని కొత్తవాడ బ్యాంకు కాలనీకి చెందిన నాంపల్లి అభినవ్(22) బీఎస్సీ నర్సింగ్ సెకండియర్ చదువుతున్నాడు. నాలుగు రోజులుగా ఇంట్లో నుంచి వెళ్లిన అభినవ్ శుక్రవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మతదేహం వద్ద డెత్ నోట్ లభించినట్టు రైల్వే సీఐ స్వామి తెలిపారు. ‘ఇన్ని రోజులు నేను జీవితాన్ని ఎంజాయ్ చేశాను.. దీనికి నేనే బాధ్యున్ని.. ఇక ఆ ఎంజాయ్ అయిపోయింది...ఈ లైఫ్ మీద ఇంట్రస్ట్ లేదు.. అందుకే వెళ్లిపోతున్నా.. అమ్మా సారీ...మా ఫ్రెండ్స్‌కు ఏమీ తెలియదు. వారిని ఏమీ అనొద్దు..మిస్‌యూ బడ్డీస్’ అని నోట్లో రాసి ఉంది. తన భర్త మర ణించి ఏడాదవుతుందని, అప్పటి నుంచి తన కుమారుడు అభినవ్ అదోలా ఉంటున్నాడని, ఇలా ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదని అభినవ్ తల్లి రేణుక బోరున విలపించింది. ఆమె వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేస్తున్నది. రేణుక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు రైల్వే సీఐ వివరించారు. -
అనుబంధాల ‘సారిక’
అందరితో ఆప్యాయంగా మాట్లాడేది.. ఆమె పలకరిస్తే అత్త తిట్టేది.. అభినవ్ స్కూల్లో ఆక్టివ్‌గా ఉండేవాడు.. జ్ఞాపకాలు చెబుతూ విలపించిన స్థానికులు హన్మకొండ చౌరస్తా : పిన్ని, ఆంటీ, అక్క, వదినా ఇలా ప్రతి ఒక్కరినీ వరుసలతో పలకరిస్తూ అనుబంధాలు పెనవేసుకుంటూ మాట్లాడేది.. రోజు సాయంత్రం ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకుని గల్లీలో వాకింగ్ చేస్తూ ఎదురుపడే వారిని ఆప్యాయంగా పలకరించేది.. ఇవి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజ య్య కోడలు సారికతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్థానికులు చెప్పిన మాటలు. సారికతో పాటు ముక్కు పచ్చలారని ముగ్గురు చిన్నారులు అగ్నికి ఆహుతి కాగా.. ఆ ఘట నను స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజూ తమకు కనిపించేవారు లేరన్న విషయాన్ని తలుచుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సందర్భంగా హన్మకొండ రెవెన్యూ కాలనీలో సారిక, ఆమె కుమారులు సజీవ దహనమైన గృహం వద్ద చుట్టు పక్కల వారిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు చెప్పుకొచ్చారు. సారిక అత్త రాక్షసి.. వాడలో అందరితో కలివిడిగా ఉంటే సారిక ఎవరితోనైనా మాట్లాడినట్లుగా కనిపిస్తే చాలు ఆమె అత్త(మాజీ ఎంపీ రాజయ్య భార్య) మాధవి బూతులు తిట్టేదని స్థానికులు చె ప్పారు. ఈ వాడలో ఎవరితో సఖ్యతతో ఉండడం తెలియని ఆమె రాక్షసిలా వ్యవహరించేదని పేర్కొన్నారు. గత ఏడాది సారిక ఆత్మహత్యకు యత్నించిన పదిహేను రోజుల తర్వాత ఇంటి బయట కనిపిస్తే పలకరించినందుకు వాడలో అందరిని కలిపి బూతులు తిట్టిందన్నారు. అప్పటి నుంచి సారిక అత్త ఇంట్లో ఉందటే చాలు ఆ ఇంటి ముఖం కూడా చూడకపోయేవారమన్నారు. సారిక అత్త చదువుకున్నా సం స్కారంలేని ఆడది అని ఛీత్కరించుకున్నారు. రెండో పెళ్లి చేసిందే అత్త.. రాజయ్య కొడుకు అనిల్‌కు రెండో పెళ్లి చేసిందే సారిక అత్త అని స్థానికులు చెబుతున్నారు. సారికకు పెద్ద కొడుకు పుట్టగానే కాజీపేటకు చెందిన ముస్లిం యువతితో దగ్గరుండి పెళ్లి చేసిందన్నారు. రెండో భార్యకు కూడా ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. సెంటిమెంట్‌తో అభినవ్‌కు పిలుపు.. వరంగల్ ఎంపీ స్థానానికి నామినేషన్ వేసిన రాజయ్య ఆ రోజు తన మనవడు అభినవ్‌ను పిలిపించుకున్నట్లు స్కూల్ యాజమాన్యం చెబుతోంది. అభినవ్ అంటే రాజయ్యకు ఇష్టమని, గతంలో ఎంపీగా గెలిచినప్పడు కూడా అభినవ్ చేతిత నామినేషన్ తీసుకువెళ్లినందున అదే సెంటిమెంట్‌తో ఈసారీ పిలిపించినట్లు సమాచారం. పీఎఫ్ డబ్బులతో కిరాణ సరుకులు కొనుగోలు.. సారిక సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసినప్పుడు పీఎఫ్‌గా వచ్చిన డబ్బుతోనే కిరాణ సరుకులు, బియ్యం కొనుగోలు చేసుకునేదని సమాచారం. మూడు నెలల క్రితం ఆ డబ్బు అయిపోవడంతో పాత మిత్రుల సహకారంతో కాలం వెళ్లదీ స్తున్నట్లు తెలిసింది. సాధారణ కుటుంబ మహిళగానే వ్యవహరించేదని స్థానిక కిరాణ దుకాణ సిబ్బంది తెలిపారు. అభినవ్.. ఏ ప్లస్.. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా పిల్లలకు అవి తెలియకుండా సారిక వ్యవహరించేది. రాంనగర్‌లోని మాంటిస్సోరి స్కూల్ లో సెకండ్ క్లాస్ చదువుతున్న అభినవ్ చాలా ఆక్టివ్‌గా ఉండే వాడని ఉపాధ్యాయులు తెలిపారు. అనిల్, సారిక కలిసి 2013లో అభినవ్ యూకేజీలో ఉన్నప్పుడు తమ పాఠశాలలో చేర్పించారని మాంటిస్సోరి స్కూల్ ఇన్చార్జి అశోక్‌రెడ్డి చెప్పారు. అభినవ్ ఇటీవల జరిగిన పరీక్షల్లో ఏ ప్లస్ మార్కులు రావడం విశేషం. -
మంటల వెనుక మిస్టరీ
సారిక, ముగ్గురు పిల్లల మృతిపై అనుమానాలు గ్యాస్ లీక్, మంటల వ్యాప్తికి కారకులెవరు? ఫోరెన్సిక్ నివేదికే కీలకం పోస్టుమార్టంను వీడియోలో చిత్రీకరించిన పోలీసులు ఎంజీఎం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), అయోన్(3), శ్రీయోన్(3) సజీవదహనం ఘటన దర్యాప్తులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కీలకంగా మారనుంది. నలుగురి మృతికి కారణమైన భారీ మంటలు ఎలా వ్యాపించాయనేది ఈ కేసులో మిస్టరీగా మారింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలకు గురువారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను సారిక తల్లి, ఆమె తరఫు బంధువులకు అప్పగించారు. శ్వాసనాళాల్లో పొగ.. రాజయ్య ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనువళ్లు సజీవ దహనం కాగా, ఘటన జరిగిన గదిలో వంటగ్యాస్ సిలిండర్ లీక్ కావడమే మంటలు చెలరేగడానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సారిక గ్యాస్ లీక్ చేసిందా? మరెవరైనా నిప్పంటించి హత్య చేశారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. తొలుత సారిక పెద్దకుమారుడు అభినవ్‌తో పాటు ఆమెకు మంటలు వ్యాపించాయని, ఆ తర్వాత శ్రీయోన్, అయోన్కు మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఈ సమయంలో వ్యాపించిన పొగ కారణంగా ముగ్గురు చిన్నారులు కొట్టుమిట్టాడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మృతుల శ్వాసనాళాల్లో పొగ ఆనవాళ్లను వైద్యులు కనుగొన్నట్లు సమాచారం. అలాగే, ప్రమాదం జరిగిన గదిలో గంట పాటు నిర్విరామంగా మంటలు చెలరేగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సిలిండర్లు పేలకపోవడంపై అనుమానాలు.. సారిక గదిలో ఉన్న సిలిండర్ల నుంచి గ్యాస్ లీక్ కావడం, ఆపై అగ్నిప్రమాదం జరిగినట్లు తె లుస్తున్నా.. సిలిండర్ పేలకపోవడంపై అనమానాలు వెల్లువెత్తుతున్నాయి. మంటల కారణంగా ఒకటే సిలిండర్ కాలినట్లు ఉండగా.. మరొకటి మాములుగానే ఉండడం చర్చనీ యాంశంగా మారింది. గ్యాస్‌లీక్‌తో మంట లు వస్తే పెద్దఎత్తున పేలుడు జరిగిఉండాలి. అలా జరగకపోవడం ఏమిటనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ఇక సారిక, ఆమె కుమారుల సజీ వ దహనం తర్వాత గదిలో సిలిండర్లు ప్రత్యక్షమైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఫోరెన్సిక్ నివేదికే ఆధారం.. సారికతో పాటు ముగ్గురు చిన్నారుల సజీవ దహనమైన ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే కీలకంగా మారనుంది. సారిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురయ్యిందా అనే అంశం నిర్ధారించడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే ముఖ్యమని చెప్పొచ్చు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన అంశాలు, మృతదేహాల భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. వీటిని పరిశీలించాక ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక పంపిస్తే తప్ప సారిక, ఆమె కుమారులది హత్యా, ఆత్మహత్యా అనేది ధృవీకరించడం సాధ్యం కాదని పోలీసులతో పాటు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తీసుకున్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా అనే కోణంలోనూ పోస్టుమార్టం సందర్భంగా నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎంజీఎంలో 26 గంటలు.. సారిక, ఆమె ముగ్గురు కుమారుల మృతదేహాలను బుధవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో ఎంజీఎం మార్చురీకి తీసుకురాగా, గురువారం సాయంత్రం ఐదు గంటలకు.. అంటే 26 గంటల తర్వాత పోస్టుమార్టం పూర్తయింది. కాగా, సుమారు రెండున్నర గంటల పాటు పోస్టుమార్టం నిర్వహించగా మొత్తం ప్రక్రియను వీడియోలో చిత్రీకరించారు. సజీవ దహనమైన నలుగురు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కుటుంబీకులు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేస్తున్నారు. ఇది హత్యా, ఆత్మహత్యా అనే అంశాన్ని ఛేదించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా అక్కడి నిపుణులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. -
చిత్రహింసలు పెట్టాడు: భువన
ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్ తనను చిత్రహింసలకు గురిచేసి నరకం చూపించాడని టెన్నిస్ క్రీడాకారిణి భువన వాపోయింది. బేగంపేటలోని ఓ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న తాను టెన్నిస్‌లోనూ రాణిస్తూ ఉన్న క్రమంలో గతేడాది నవంబర్‌లో ఓ జిమ్‌లో అభినవ్‌తో పరిచయం ఏర్పడిందని వివరించింది. ఓ టోర్నమెంట్లో పరాజయంతో తన తండ్రి తీవ్రంగా మందలించగా.. తనను ఓదార్చిన అభినవ్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముందూ వెనకా ఆలోచించకుండా చేసుకున్నానని తెలిపింది. తన అక్కకు పెళ్లి కాకపోవడంతో పెద్దలు నచ్చజెప్పడంతో తాను తిరిగి పుట్టింట్లోనే ఉన్నా.. తామిద్దరం కలుస్తూ ఉండేవారమని చెప్పింది. గత నెలలో అభినవ్ ఇంటికి వెళ్లగా తనను బంధించాడని, చెప్పుకోలేని రీతిలో చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది. ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేసి, తిరిగి సాయంత్రం వచ్చాకే తీసేవాడని కన్నీరు పెట్టుకుంది. అభినవ్ గతంలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు తనకు తెలిసి మరింత ఆందోళనకు గురయ్యానని భువన తెలిపింది. అభినవ్‌తో పెళ్లి తర్వాత ఆటకు, కాలేజీకి దూరమై దుర్భర జీవితాన్ని అనుభవించానని చెప్పింది. అభినవ్ నిజస్వరూపం తెలియడంతో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.. తాను రావాలని లేదా రూ.3 కోట్లు ఇవ్వాలని అతడు తన తండ్రితో బెదిరింపులకు దిగాడని వివరించింది. -
'భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు'
-
భువన కేసుకు మాకు ఏ సంబంధం లేదు: తలసాని
♦ వివరణ లేకుండా వార్తలు రాస్తారా? ♦ విలేకరులతో మంత్రి తలసాని ♦ భువన, ఆమె తల్లిదండ్రులతో కలసి మీడియా సమావేశం హైదరాబాద్: ‘మంత్రులకు కుటుంబం ఉం డదా.. మేం మనుషులం కాదా? బయట జరిగే సంఘటనలను మాకు ఆపాదిస్తే ఎలా? మీడి యా సంస్థల అధిపతులు, వారి కుటుంబ సభ్యులు తప్పతాగి హోటళ్లలో ఉండి సమస్య ల్లో ఇరుక్కుంటే ఆదుకున్న సందర్భాలు లే వా?’ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. తన కుమారునిపై కేసు నమోదు కు సంబంధించిన వార్తల నేపథ్యంలో ఆయన టెన్నిస్ క్రీడాకారిణి భువన, ఆమె తల్లిదండ్రు లు శ్రీలత, మహేంద్రనాథ్రెడ్డిలతో కలసి ఆది వారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ‘ప్రేమ వివాహం చేసుకున్న భువనను ఆమె భర్త అభినవ్ వేధించడంతో తల్లిదండ్రులకు చెప్పుకుంది. అభినవ్ ఆమె పుట్టింటికి వచ్చి గొడవచేసి మహేంద్రనాథ్‌పై దాడి చేశాడు. సమస్యను నాకు చెప్పుకునేం దుకు వచ్చారు. ఆ సమయంలో నేను అందుబాటులో లేకపోవడంతో నా కుమారుడు సమస్య అడిగి తెలుసుకున్నాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన అభినవ్ వారిపై దాడిచేశాడు. అక్కడే ఉన్న కొందరు అనుచరులు గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించి సాయికిరణ్ అనే వ్యక్తి పేరిట కేసు నమోదైతే అంతా మంత్రి కుమారుడిపై కేసు నమోదైనట్లు రాయడం ఎంతవరకు సబబు?’ అని ప్రశ్నించారు. ఓ అమ్మాయికి జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తిచూపాల్సిన మీడియా.. ఆ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తికి మద్దతుగా ప్రచారం చేయడం తగదన్నారు. తన కుమారుడితో ప్రాణహాని ఉందంటూ అభినవ్ పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇటీవల ఓ కేసు విషయంలో కొన్ని పత్రికలు తన పేరును అనవసరంగా జోడించి, ఆ తర్వాత నిజాలు తెలుసుకుని క్షమాపణ చెప్పడాన్ని ఆయన ఉదహరించారు. అభినవ్‌పై కేసు నమోదు భువన ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట మహిళా పోలీసుస్టేషన్లో అభివన్పై ఆదివారం కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ జానకి తెలిపిన వివరాల ప్రకారం.. ఈస్ట్ మారేడ్‌పల్లికి చెందిన భువనారెడ్డి ఈ ఏడాది మేలో అభినవ్‌ను వివాహం చేసుకుంది. అయితే పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి వెళ్లనీయకుండా ఇంటికి పరిమితం చేశాడని తన భర్తపై భువనారెడ్డి ఫిర్యాదులో పేర్కొంది. తన తండ్రి ఫోన్ చేసి కూమార్తెను ఇంటికి పంపించాలని కోరిన సమయంలో రూ.3 కోట్లు ఇస్తేనే పంపిస్తానని డిమాండ్ చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది. అలాగే మొదట పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టి తనను వివాహం చేసుకున్నాడని పేర్కొంది. ఈ మేరకు అభినవ్‌పై అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసినందుకు 498ఏ, మొదటి పెళ్ళి విషయాన్ని దాచి రెండో వివాహం చేసుకున్నందుకు 195 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
తలసాని కుమారుడి కేసులో కీలక మలుపు
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభినవ్-భువన వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. తమ విషయంలో జోక్యం చేసుకొని మంత్రి తలసాని కొడుకు దాడి చేశాడని అభినవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అభినవ్ భార్య భువన కీలక వివరణ ఇచ్చింది. అసలు అభినవే తనను ఇబ్బందులకు గురిచేశాడని, తన తండ్రిని విపరీతంగా కొట్టాడని చెప్పింది. తలసాని కుమారుడు ఈ వివాదంలో చిక్కుకోవడంతో స్వయంగా మంత్రి తలసాని ఈ విషయంలో జోక్యం చేసుకొని భువనను మీడియా ముందుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె పలు వివరాలను చెప్పింది. తాను అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి అని, జిమ్ కు వెళ్లే సమయంలో తనకు అభినవ్ పరిచయం అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత తమ మధ్య స్నేహం పెరిగిందని, ఈ లోగా ఓ మ్యాచ్‌లో తాను ఓడిపోవడంతో తండ్రి తిట్టాడని ఆ సమయంలో తనను అభినవ్ వాళ్లింటికి వచ్చేయమని చెప్పడంతో ఎలాంటి ముందస్తు ఆలోచన లేకుండా వెళ్లానని, ఆ మరుసటి రోజే వివాహం చేసుకున్నామని వివరించింది. ఆ విషయం రెండు రోజుల్లో తన తండ్రికి చెప్పడంతో పెద్ద కూతురు పెళ్లి కావాల్సి ఉన్నందున ఇప్పుడప్పుడే తొందరపడి బయటకు చెప్పొద్దని వచ్చే ఏడాది పెళ్లి జరిపిస్తామని చెప్పాడని పేర్కొంది. ఐదు నెలలుగా తాను తన తండ్రి వద్దే ఉంటున్నానని, 20 రోజుల కిందటే అభినవ్ వద్దకు వెళ్లానని ఈ 20 రోజుల్లోనే అతడి అసలు స్వరూపం బయటపడిందని చెప్పింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆటను ఆడనివ్వకుండా ఇంటికే పరిమితం చేశాడని, బయటకు వెళ్లేటప్పుడు ఇంట్లో పెట్టి డోర్ వేసి వెళ్లిపోయేవాడని, కాలేజీ కూడా లేకుండా చేశాడని వాపోయింది. ప్రతి రోజూ చిత్ర హింసలు పెట్టేవాడని, అసభ్యకరంగా మాట్లాడేవాడని ఆరోపించింది. తన అక్కకు పెళ్లి చూపులు కావడంతో తీసుకెళ్లేందుకు వచ్చిన తన తండ్రితో పంపించేందుకు ఒప్పుకోలేదని రూ.మూడు కోట్లు డిమాండ్ చేశాడని, అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో ఎంత ప్రాపర్టీ ఉంటే అంత అభినవ్ పేరు మీద రిజిష్టర్ చేయాలని డిమాండ్ చేశాడని చెప్పింది. తర్వాత ఏం మాట్లాడుకున్నారో.. అక్టోబర్ 24 రాత్రి తనను ఇంట్లో దింపేసి వెళ్లాడని, రెండు రోజులు అక్కడే ఉండాల్సిన తనను ఉన్నపలంగా ఇంటికొచ్చేయమన్నాడని తాను కూడా అందుకు సిద్ధమయ్యానని చెప్పింది. ఇంతలో మరో రోజు అభినవ్ వచ్చి గొడవ పెట్టుకొని తన తండ్రి మహేందర్ రెడ్డిని తీవ్రంగా కొట్టి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తన తండ్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అనంతరం అబినవ్, భువన తండ్రి మహేందర్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణను మంత్రి తలసాని మీడియాకు వినిపించారు. -
అభినవ్ పై వరకట్న వేధింపుల కేసు
-
డియర్ మోదీ..ఎనిమిదేళ్ల బాలుడి లెటర్
బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ళ బాలుడు.. భారత ప్రధాని కార్యాలయానికి ఉత్తరం ఎందుకు రాయాల్సి వచ్చింది? బెంగళూరులోని ఏ పరిస్థితి... అతడిని అంతగా వేధించింది? ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను ఇబ్బంది పెడుతున్న సంఘటన.. ఆ చిన్నారి హృదయాన్ని కుదిపేసింది. నిరంతరం రద్దీగా ఉండే వాయువ్య బెంగళూరులో కీలక జంక్షన్‌లోని గ్రిడ్ లాక్ ప్రాంతం... ప్రయాణీకుల సహనానికి పరీక్ష పెడుతుండటం ఆ పసి హృదయం తట్టుకోలేక పోయింది. అందుకు ఏం చేయాలో తీవ్రంగా ఆలోచించిన అభినవ్ చివరకు ఓ నిర్ణయానికి వచ్చాడు. దేశ ప్రధాని మోదీ కార్యాలయానికి విషయాన్ని తెలియజేయడం ఒక్కటే మార్గం అనుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ పబ్లిక్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న అభినవ్.. ప్రతిరోజూ స్కూలుకు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది. బెంగళూరు విద్యారణ్యపుర లోని దొడ్డబొమ్మసంద్రలో అభినవ్ కుటుంబం నివసిస్తుంది. అయితే కేవలం మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న స్కూలుకు చేరేందుకు ప్రతిరోజూ కనీసం 45 నిమిషాల సమయం పడుతోంది. అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలోని, గోరెగుంటెపాల్య జంక్షన్, రైల్వే క్రాసింగ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్.. ట్రాఫిక్ ఇబ్బందులకు కారణంగా మారింది. సమస్యను ప్రతిరోజూ కళ్ళారా చూస్తున్న అభినవ్.. పరిష్కారం కోసం పీఎం కార్యాలయానికి ఉత్తరం రాశాడు. అయితే అభినవ్ ఉత్తరానికి పీఎంవో కార్యాలయం వెంటనే స్పందించింది. బెంగళూరులో సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖను కోరింది. రక్షణ అధికారుల ఆంక్షల వల్ల ప్రాజెక్టు నిర్మాణం తీవ్ర ఆలస్యం అవుతోంది. 'ట్రాఫిక్ సమస్య ఒక్క ప్రజారోగ్యానికి సంబంధించినదే కాదు, నా చదువును కూడ ప్రభావితం చేస్తోంది.' అంటూ అభినవ్ రాసిన ఉత్తరం... ఇప్పుడు బెంగళూరు లోని ప్రజా సమస్యను దేశ ప్రధాని దృష్టికి చేర్చింది. -
అక్కినేని అఖిల్ పేరుతో మోసం!
-
అక్కినేని అఖిల్ పేరుతో మోసం!
హైదరాబాద్: అక్కినేని అఖిల్ పేరుతో సోషల్ మీడియా ద్వారా డబ్బు వసూలు చేస్తున్న ఓ యువకుడ్ని కూకట్‌పల్లిలో ఒక యువతి ఇరగదీసింది. ఆ యువతి చెప్పిన కథనం ప్రకారం అభినవ్ అనే యువకుడు అఖిల్ పేరుతో ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాలు తెరిచి యువతుల వద్ద డబ్బు వసూలు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో అక్కినేని నాగార్జున, అమల,అఖిల్ ఫొటోలను పోస్ట్ చేశాడు. అఖిల్ మాదిరిగా చాటింగ్ చేశాడు. అభినవ్ డబ్బు ప్రస్తావన తీసుకురావడంతో ఆ యువతి అనుమానించింది. ఈ విషయం తన అన్నయ్యకు చెప్పింది. ఈ విధంగా ఇతరులు మోసపోకూడదన్న సదభిప్రాయంతో ట్రాప్ చేసి అభినవ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఆ యువతి వాడి చెంప చెళ్లు మనిపించి, చితకబాదింది. ఆ తరువాత ఆ మోసగాడిని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, అభినవ్ని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దెయ్యాలున్నాయి..!
అభినవ్, మధులగ్న దాస్ జంటగా సాయికార్తీక్ సమర్పణలో టి. లక్ష్మీసౌజన్య గోపాల్ నిర్మించిన చిత్రం ‘గేట్’. రాజేష్ సాయి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డీజే షాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సీడీని ఆవిష్కరించి అభినవ్‌కి ఇచ్చారు. బేనర్ లోగోను రమేశ్ పుప్పాల ఆవిష్కరించారు. హారర్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రంలో కామెడీ కూడా ఉందని నిర్మాత చెప్పారు. ఆద్యంతం థ్రిల్‌కి గురి చేసే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో మంచి సందేశం ఉందని అభినవ్ చెప్పారు. ఈ వేడుకలో జీయస్ చక్రవర్తి, సాయి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
దెయ్యాలున్నాయా?
అభినవ్ (సర్దార్ పటేల్), మధుమిత జంటగా శుభోదయ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘గేట్’. ‘దెయ్యాలున్నాయి జాగ్రత్త’ అనేది ఉపశీర్షిక. సాయికార్తీక్ సమర్పణలో రాజేష్ సాయి దర్శకత్వంలో టి. లక్ష్మీసౌజన్యగోపాల్ నిర్మిస్తున్నారు. హారర్ నేపథ్యంలో సాగే చిత్రమిదని, వినోదం, సందేశం ఉన్నాయని నిర్మాత తెలిపారు. వచ్చే నెల 10న రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, 18 రోజుల్లో పూర్తి చేస్తామని మే 2న చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. వినూత్న కథాంశంతో రూపొందుతున్న సినిమా ఇదని అభినవ్ అన్నారు. బలరామ్, సంతోష్, అలీషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎస్. చక్రవర్తిరెడ్డి, సంగీతం: డిజెఎస్.