తమిళసినిమా: అమ్మాయిలు ఆపదలో పడకుండా అవగాహన కలిగించే చిత్రంగా ఎక్స్ స్టూడియోస్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు సజోసుందర్ తెలిపారు. దర్శకుడు హరి వద్ద ఐదు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేసిన ఈయన నటుడు ప్రకాశ్‌రాజ్ తెరకెక్కించిన ధోని, ఉన్ సమయిలరయిల్ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేశారట. సజోసుందర్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఎక్స్ స్టూడియోస్. కలర్ షాడోస్ ఎంటర్‌టెయిన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం సాయంత్రం స్థానిక వడపళనిలోని ఆర్‌కేవీ.స్టూడియోలో జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తన తొలి చిత్రాన్ని మంచి కమర్శియల్ అంశాలతో తెరకెక్కించాలనుకున్నానన్నారు.అలాంటిది ఈ ఎక్స్ స్టూడియోస్ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో దాని కారణంగా అమ్మాయిలకు ఎదురవుతున్న ఆపదల గురించి అవగాహన కలిగించే చిత్రంగా ఈ చిత్రం ఉంటుందన్నారు. ఎక్స్ స్టూడియోస్ చిత్రాన్ని శృంగార భరితం చిత్రంగా భావించరాదని, సామాజిక స్పృహతో రూపొందిస్తున్న ఈ చిత్రం ఉత్కంఠంగా సాగే థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
ఇంటర్నెట్ అనే అంతర్జాలం ద్వారా కళాశాల విద్యార్థినులు, ఇతర వయసు అమ్మాయిలు ఎలాంటి ఆపదలో పడుతున్నారు? అలాంటి ఆపద నుంచి దూరం అవడానికి ఏం చేయాలన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రం ఇదని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే కన్నెపిల్లల భద్రతపై అవగాహన కలిగించే చిత్రంగా ఎక్స్ స్టూడియోస్ చిత్రం ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇందులో అభినవ్, విజయ్, షాన్, అహిరుధి హీరో హీరోయిన్లుగా నటించారు.
Comments
Please login to add a commentAdd a comment