
చిత్రహింసలు పెట్టాడు: భువన
ప్రేమించి పెళ్లి చేసుకున్న అభినవ్ తనను చిత్రహింసలకు గురిచేసి నరకం చూపించాడని టెన్నిస్ క్రీడాకారిణి భువన వాపోయింది. బేగంపేటలోని ఓ కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న తాను టెన్నిస్‌లోనూ రాణిస్తూ ఉన్న క్రమంలో గతేడాది నవంబర్‌లో ఓ జిమ్‌లో అభినవ్‌తో పరిచయం ఏర్పడిందని వివరించింది. ఓ టోర్నమెంట్‌లో పరాజయంతో తన తండ్రి తీవ్రంగా మందలించగా.. తనను ఓదార్చిన అభినవ్ పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ముందూ వెనకా ఆలోచించకుండా చేసుకున్నానని తెలిపింది. తన అక్కకు పెళ్లి కాకపోవడంతో పెద్దలు నచ్చజెప్పడంతో తాను తిరిగి పుట్టింట్లోనే ఉన్నా.. తామిద్దరం కలుస్తూ ఉండేవారమని చెప్పింది.
గత నెలలో అభినవ్ ఇంటికి వెళ్లగా తనను బంధించాడని, చెప్పుకోలేని రీతిలో చిత్రహింసలకు గురిచేశాడని వాపోయింది. ఉదయం ఆఫీసుకు వెళ్లే సమయంలో ఇంటికి తాళం వేసి, తిరిగి సాయంత్రం వచ్చాకే తీసేవాడని కన్నీరు పెట్టుకుంది. అభినవ్ గతంలో ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు తనకు తెలిసి మరింత ఆందోళనకు గురయ్యానని భువన తెలిపింది. అభినవ్‌తో పెళ్లి తర్వాత ఆటకు, కాలేజీకి దూరమై దుర్భర జీవితాన్ని అనుభవించానని చెప్పింది. అభినవ్ నిజస్వరూపం తెలియడంతో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.. తాను రావాలని లేదా రూ.3 కోట్లు ఇవ్వాలని అతడు తన తండ్రితో బెదిరింపులకు దిగాడని వివరించింది.