
Shikaaru Movie Trailer: ‘‘నా ‘ఆది’ సినిమా అప్పుడు జస్ట్ రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయనకు జడ్జిమెంట్ బాగా తెలుసు. బాబ్జీని ఒప్పించి, దర్శకుడు హరి ఈ సినిమా చేయడం గొప్ప విషయం. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరున్న బాబ్జీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో హరి కొలగాని దర్శకత్వంలో పీఎస్‌ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మించిన చిత్రం ‘షికారు’.
సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ ప్రధాన తారలుగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌ను వీవీ వినాయక్ ఆవిష్కరించారు. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘చక్కని కామెడీతో హరిగారు ఈ సినిమాని తెరకెక్కించారు. శేఖర్ చంద్ర చక్కని బాణీలు సమకూర్చారు’’ అన్నారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది’’ అని తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment