
టాలీవుడ్ దర్శకుడు వివి వినాయక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, క్రిటికల్ కండీషన్ లో ఉన్నారని సోషల్ మీడియాలో నిన్నంత ఒక న్యూస్ వైరల్ అయింది. అయితే అందులో నిజం లేదని చెబుతూ ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
(ఇదీ చదవండి: ఆస్కార్ ఉత్తమ చిత్రం ఓ బోల్డ్ మూవీ.. ఏంటి 'అనోరా' స్పెషల్?)
'ప్రముఖ దర్శకులు వివి వినాయక్ ఆరోగ్యంపై కొన్ని మాధ్యమాలలో వస్తున్న వార్తలు అవాస్తవం. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకుండా, వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని మనవి. ఇకపై ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే వారిపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకొంటాం' అని వినాయక్ టీమ్ చెప్పారు.
తాజాగా 'దిల్' టీమ్ అంతా అంటే నిర్మాత దిల్ రాజు, అప్పుడు సినిమాకు రైటర్స్ గా పనిచేసిన సుకుమార్, వాసువర్మ, డాలీ తదితరులు డైరెక్టర్ వినాయక్ ఇంట్లో కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకొచ్చింది. ఇందులో వినాయక్ కాస్త బక్కగా ఉన్నట్లు కనిపించడంతో, అనారోగ్యం ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. టీమ్ క్లారిటీ ఇవ్వడంతో అలాంటిదేం లేదని తేలిపోయింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)

Comments
Please login to add a commentAdd a comment