Sai dhansika
-
కబాలి భామ సరికొత్త లేడీ ఓరియంటెడ్ చిత్రం!
2006లో తిరుడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి సాయి దన్సిక. అయితే 2009లో జయం రవితో నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. తరువాత మాంజావేలు, నిల్ గమనీ సెల్లాదే, పరదేశీ వంటి చిత్రాల్లో కథానాయకిగా సత్తాచాటారు. 2016లో రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించిన ఈమె ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాగా తాజాగా ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమె నటించిన ది ప్రూఫ్ చిత్రాన్ని నృత్య దర్శకురాలు రాధిక తెరకెక్కించడం విశేషం. ఈమె మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శశికుమార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) -
సాయిధన్సిక 'అంతిమ తీర్పు' టైటిల్ లాంచ్
సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అంతిమ తీర్పు". ఏ.అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ.. నిర్మాతగారిని కలిసినప్పుడు ఆయన లో ఒక ప్యాషన్ చూశాను. ఒక మంచి సినిమా తియ్యాలన్న తపన ఆయనలో కనిపించింది. డి.రాజేశ్వరరావు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం' అన్నారు. సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో అందరూ మంచి కేరక్టర్స్ చేశారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత అవసరమనేది ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్ధమైంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలానే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు. డైరెక్టర్ అభిరాం మాట్లాడుతూ... ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య గారి చాలా సినిమాలకు నేను పనిచేశాను. ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో సాయి ధన్సిక అద్భుతంగా చేసింది. కోటి గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. -
సైకో థ్రిల్లర్
సాయిధన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘దక్షిణ’. ఓషో తులసీరామ్ దర్శకత్వంలో కల్ట్ కాన్సెప్ట్స్ పతాకంపై అశోక్ షిండే నిర్మిస్తున్నారు. ఆదివారం (నవంబరు 20) సాయిధన్సిక బర్త్ డే సందర్భంగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ‘‘సైకో థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. సాయి ధన్సిక హై ఓల్టేజ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తయింది. డిసెంబరులో విశాఖలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ కంప్లీట్ అవుతుంది’’ అన్నారు అశోక్ షిండే. బెంగాలీ హీరో రిషవ్ బసు విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: బాలాజీ. -
షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది
‘‘షికారు’లో మంచి కథతో పాటు వినోదం ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రంపై నిర్మాత బాబ్జీగారు పూర్తి నమ్మకంతో ఉన్నారు’’ అని సాయి ధన్సిక అన్నారు. హరి కొలగాని దర్శకత్వం వహించిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పీఎస్ఆర్ కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చితం ప్రీ రిలీజ్ వేడుకలో హరి కొలగాని మాట్లాడుతూ– ‘‘నెల్లూరులో కాలేజీ విద్యార్థులకు మా సినిమా ప్రీమియర్ షో వేశాం.. వారి స్పందన మాకు మరింత ఎనర్జీ ఇచ్చింది’’ అన్నారు. ‘‘అందరికీ తెలిసిన కథే ఇది.. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు పీఎస్ఆర్ కుమార్. చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ సైబర్ పోలీసుకు సీనియర్ నటి ఫిర్యాదు -
చమ్మక్ చంద్ర.. 'దేవదాసు పారు వల్లే బ్యాడు' సాంగ్ విన్నారా?
సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘షికారు’. ఈ చిత్రానికి హరి కొలగాని దర్శకుడు. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్‌పై పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదలవుతోంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ చిత్రంలోని ‘దేవదాసు పారు వల్ల బ్యాడు.. మజ్ను లైఫ్ లైలా వల్లే సాడ్’ అనే పాటను విడుదల చేశారు. హరి కొలగాని మాట్లాడుతూ– ‘‘ఎంటర్టైన్మెంట్ను బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఓ పాట ద్వారా యువతకు సందేశం చెప్పాలనిపించింది. ‘దేవదాసు పారు వల్ల బ్యాడు..’ అనే పాటను నేనే రాశాను’’అన్నారు. ‘‘సమాజంలోని సంఘటనలను ఈ చిత్రంలో వినోదాత్మకంగా చెబుతున్నాం’’ అన్నారు బాబ్జీ. చదవండి: ఈ ఓటీటీల్లో ఫ్రీగా చూసేయొచ్చు సల్మాన్‌కు కొత్త సబ్బు కనిపిస్తే చాలు బ్యాగులో వేసుకుంటాడట! -
రెండు సీన్లు చూసి ఆ సినిమాను ఎక్కువ రేటుకు కొన్నారు
Shikaaru Movie Trailer: ‘‘నా ‘ఆది’ సినిమా అప్పుడు జస్ట్ రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయనకు జడ్జిమెంట్ బాగా తెలుసు. బాబ్జీని ఒప్పించి, దర్శకుడు హరి ఈ సినిమా చేయడం గొప్ప విషయం. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరున్న బాబ్జీ నిర్మించిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో హరి కొలగాని దర్శకత్వంలో పీఎస్ఆర్ కుమార్ (బాబ్జీ) నిర్మించిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ ప్రధాన తారలుగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం ట్రైలర్‌ను వీవీ వినాయక్ ఆవిష్కరించారు. బాబ్జీ మాట్లాడుతూ– ‘‘చక్కని కామెడీతో హరిగారు ఈ సినిమాని తెరకెక్కించారు. శేఖర్ చంద్ర చక్కని బాణీలు సమకూర్చారు’’ అన్నారు. ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందిన చిత్రం ఇది’’ అని తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్ అన్నారు. -
నా కళ్లు చూసి హీరోయిన్గా అవకాశమిచ్చారు
సాయి దన్సిక, తేజ్ కూర పాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం షికారు. హరి కొలగాని దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతున్న సందర్బంగా సోమవారం ఫిలిం ఛాంబర్లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బాబ్జి మాట్లాడుతూ.. 'కరోనా ఇబ్బందులు దాటుకొని సినిమా పూర్తి చేశాం, షికారు టైటిల్ లాగానే సినిమా కూడా బాగా వచ్చింది. మా హీరోయిన్ ధన్సిక, నలుగురు యువ హీరోలు చాలా బాగా చేశారు, సిద్ శ్రీ రామ్ పాడిన పాట బాగా వచ్చింది. ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక చాలా పెద్ద హిట్ అవుతుంది, మా డైరెక్టర్ హరి గారు కధ చెప్పునప్పుడు ఎంత ఎక్సయిట్ అయ్యానో, సినిమా తీసిన విధానం చూసి అంతకు మించి ఎక్సయిట్ అయ్యాను. జనవరి 26న మా సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. డైరెక్టర్ హరి మాట్లాడుతూ.. 'ఒక చిన్న సినిమా ముందుకు రావాలి అంటే ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేయమని నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ బాబ్జిగారికి థాంక్స్, నేను ఏ ఆర్టిస్ట్ లు కావాలంటే వాళ్ళని నాకు ఇచ్చారు బాబ్జి గారు. రైటర్ కరుణ్ నాకు నా సినిమాకి బ్యాక్ బోన్ అని చెప్పాలి, ఆర్ట్ డైరెక్టర్ షర్మిల కూడా ఈ రోజు తన మ్యారేజ్ పనుల్లో బిజీ గా ఉండి ఇక్కడకి రాలేక పోయారు, తనకి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను' అన్నారు. బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. 'ప్రొడ్యూసర్ బాబ్జి ఇండస్ట్రీలో తెలుగు సినిమా చరిత్రలో ఆరువందల సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసారు. ప్రొడ్యూసర్‌గా చేయటం తన డ్రీం. ఈ సినిమా ఆయనకి నిర్మాతగా మంచి జర్నీకి పునాది కావాలి అని కోరుకుంటున్నాను' అని తెలిపారు. హీరోయిన్ సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమా నాకు చాలా స్పెషల్, తమిళంలో చాలా ఫిల్మ్స్ చేశాను, కబాలిలో చేశాను, హరి గారు చెన్నయ్ వచ్చి కథ చెప్పారు. నా కళ్ళు చూసి ఈ క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అని హరి గారు చెప్పారు, ఈ క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్' అని చెప్పుకొచ్చింది. -
యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్
‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రానికి బుధవారం కొబ్బరికాయ కొట్టారు. ఈ చిత్రంతో హరి కొలగాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీ సాయి లక్ష్మీ క్రియేష¯Œ ్స పతాకంపై పి.యస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. తొలి సన్నివేశానికి నిర్మాత బి.వి.యస్. ఎన్. ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు వీవీ వినాయక్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత ‘దిల్’ రాజు తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) మాట్లాడుతూ–‘‘డిస్ట్రిబ్యూటర్‌గా తెలుగు సినిమా పరిశ్రమతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను నిర్మాతగా మారడంలో బెక్కం వేణుగోపాల్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు. ‘‘శబ్దాలయా, అన్నపూర్ణ సంస్థలలో డైరెక్షన్ డిపార్ట్ మెంట్లో పనిచేశాను. యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది. ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ నేటి నుంచి ప్రారంభమై ఇరవై రోజుల పాటు హైదరాబాద్‌లో జరుగుతుంది’’ అన్నారు హరి కొలగాని. ‘‘ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తాను’’ అన్నారు సాయి ధన్సిక. ఈ చిత్రానికి సమర్పణ: వాగేశ్వరి (పద్మ), కెమెరా: వాస్లి శ్యాం ప్రసాద్, సంగీతం: శేఖర్ చంద్ర, సహ నిర్మాతలు: పవన్, సుమన్, లైన్ ప్రొడ్యూసర్: వెంకట యస్‌కె కులపాక. -
యోగి ఈజ్ బ్యాక్
తెలుగులో ‘యోగి’ అనగానే ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం గుర్తొస్తుంది. అలాగే రజనీకాంత్ ‘కబాలి’ సినిమాలో ‘యోగి’ అనగానే నటి సాయిధన్సిక గుర్తుకురాకమానరు. ఈ పాత్రతో ఆమె కెరీర్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిందని చెప్పవచ్చు. ‘కబాలి’లో సాయి ధన్సిక అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో రజనీకాంత్...‘కబాలిదా’ (తెలుగులో ‘కబాలి రా’) అనే పవర్ఫుల్ డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఈ డైలాగ్‌ను కొంచెం మార్చి ‘యోగిదా’ అనే టైటిల్‌తో ఓ సినిమా రూపొందనుంది. సాయిధన్సికనే టైటిల్ రోల్ చేయనున్నారు. టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. గౌతమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు. జి. అరుణగిరి, చె. రాజ్ కుమార్ నిర్మాతలు. ‘‘యోగి ఈజ్ బ్యాక్. సినిమా చిత్రీకరణ నేటి నుంచి మొదలవుతుంది. ప్రముఖ సంగీతదర్శకుడు ఏఆర్. రెహమాన్ సిస్టర్ ఇశ్రత్ఖాద్రీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు’’ అని సాయిధన్సిక పేర్కొన్నారు. -
నో డూప్
గాల్లో తేలియాడుతున్నారు హీరోయిన్ సాయిధన్సిక. ఊహల్లో కాదండీ బాబు! నిజంగానే. అయ్యో... ఆమెకు ఎందుకంత కష్టం. అంటారా? కష్టం కాదు ఇష్టం. కన్నడ చిత్రం ‘ఉద్ఘర్ష’ కోసం ఆమె డూప్ లేకుండా రియల్‌గా స్టంట్స్ చేస్తున్నారు. సునైల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో అనూప్‌సింగ్ థాకూర్, సాయి ధన్సిక, తాన్యా హోప్, కబీర్ దుహాన్ సింగ్, కిశోర్, హర్షికా పోనాచా ముఖ్య తారలుగా నటిస్తున్న ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని డబ్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రం కోసమే రియల్‌గా స్టంట్స్ చేస్తున్నారు ధన్సిక. ‘‘కొన్నిసార్లు జీవితంలో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పేర్కొన్నారు ధన్సిక. రజనీకాంత్ ‘కబాలి’ సినిమాలో యోగి పాత్రలో ఆమె చేసిన యాక్షన్‌కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. మరి.. ఈ ‘ఉద్ఘర్ష’ లో «ధన్సిక చేసిన యాక్షన్ ఆడియన్స్‌కి ఏ మాత్రం నచ్చుతుందో చూడాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. -
అయ్యో పాపం
ఇక్కడి ఫొటోలో ఉన్నది ఎవరో తెలుసుగా! అదేనండీ.. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాలో యోగి క్యారెక్టర్లో రఫ్పాడించిన సాయి ధన్సికనే. ఇంతకీ ఆమె చేతులు, కాళ్లు ఎందుకు కట్టేశారు? అంటే సినిమా కోసం అన్నమాట. ఇంకోమాట.. ఫొటోలో ధన్సిక కూర్చున్నది స్నూకర్ టేబుల్‌పైన అని అర్థం అవుతోంది కదూ. పాపం.. అలానే రాత్రంతా కూర్చున్నారట. సునీల్ కుమార్ దేశాయ్ దర్శకత్వంలో కన్నడలో రూపొందుతున్న ‘ఉద్ఘర్ష’ సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ సీన్లో ధన్సిక ఇలా కనిపించనున్నారు. తెలుగు సినిమాలు ‘రోగ్, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, ఆచారి ఆమెరికా యాత్ర’ సినిమాల్లో విలన్‌గా నటించిన అనూప్ సింగ్ ఠాకూర్ ఈ సినిమాలో ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అన్నట్లు.. తెలుగులో ధన్సిక స్ట్రయిట్ సినిమా ‘వాలుజడ’ చేస్తున్నారు. -
కంటతడిపెట్టిన సాయిధన్సిక
తమిళసినిమా: నటి సాయిధన్సికకు సభా నాగరికత తెలియదంటూ సీనియర్ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ ఆమెను కంటతడిపెట్టించిన సంఘటన కోలీవుడ్‌లో కలకలానికి దారి తీసింది. మీరా కదిరన్ దర్శకత్వం వహించిన చిత్రం విళిత్తిరు. కృష్ట, విధార్థ్, ఏపీబీ.చరణ్, వెంకట్‌ప్రభు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రంలో నటి సాయి ధన్సిక కథానాయకిగా నటించారు. ఈ చిత్రం కోసం టి.రాజేందర్ ఒక పాట రాసి, పాడి, అందులో నటించారు. ఈ చిత్ర విలేకరుల సమావేశం ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమంలో నటి సాయి ధన్సిక చిత్రం గురించి మాట్లాడి, వేదికపై ఉన్న వారి గురించి ప్రస్తావించలేదు. ఆనంతరం మాట్లాడిన టి.రాజేందర్ సాయిధన్సిక చర్యలను తప్పుపడుతూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిధన్సికకు సభా నాగరికత తెలియదని విమర్శంచారు. సాయిధన్సికను కబాలి చిత్ర హీరోయిన్ అంటున్నారని, కానీ అంతకంటే ముందే తను విళిత్తిరు చిత్రంలో నటించారని గుర్తు చేశారు. అయినా రజనీకాంత్‌తో నటిస్తే టి.రాజేందర్ పేరు తెలియదా? అంటూ విమర్శలు గుప్పిస్తుండగా మధ్యలోనే సాయిధన్సిక లేచి టీఆర్‌కు క్షమాపణ చెప్పారు. అయినా అదేమీ పట్టించుకోకుండా టి.రాజేందర్ సాయిధన్సికను విమర్శించడంతో ఆమె కన్నీళ్ల పర్యంతం అయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సం ఘం కార్యదర్శి విశాల్ టి.రాజేందర్ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం మీద ఈ సంఘటన కోలీవుడ్‌లో పెద్ద కలకలానికే దారి తీసింది. -
కబాలి కూతురి వాలుజడ!
ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? ‘కబాలి’లో రజనీకాంత్ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక. ‘కబాలి’లో మోడ్రన్‌గా కనిపించిన ధన్సిక కొత్త సినిమా కోసం ఇలా ట్రెడిషనల్‌గా మారారు. తమిళ దర్శకులు చేరన్, గౌతమ్ మీనన్, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె. కుమార్ల వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన రమణ మల్లం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా ‘వాలుజడ’. ‘శరణం గచ్ఛామి, జానకి రాముడు’ సినిమాల ఫేమ్ నవీన్ సంజయ్, సాయి ధన్సిక జంటగా నటిస్తున్నారు. హిందీ నటుడు నానా పటేకర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి ధన్సిక ఫస్ట్ లుక్‌ను కాజల్ అగర్వాల్ విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రమిది. తమిళంలో ‘కుజాళి’గా రూపొందిస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూరై్తంది. సెప్టెంబర్‌లో భారీ షెడ్యూల్ మొదలవుతుంది’’ అన్నారు దర్శకుడు రమణ మల్లం. ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ రామస్వామి, కూర్పు: కె.ఎల్. ప్రవీణ్, కళ: కిరణ్, స్టంట్స్: అన్బు–అరియు, సాహిత్యం: చంద్రబోస్, కందికొండ, సంగీతం: రధన్. -
దెయ్యం లేని హర్రర్ చిత్రం ఉరు
సాధారణంగా హర్రర్ కథా చిత్రాలంటే దెయ్యాలు, భూతాలు, పిశాచాలు ఉంటాయి. అయితే అవేవీ లేకుండానే హర్రర్ కథాంశంతో భయపెట్టడానికి రెడీ అయ్యింది ‘ఉరు’ చిత్రం. వినడానికే ఆసక్తిగా ఉంది కదూ వైఎం మీడియా పతాకంపై వీపీ. విజీ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను విక్కీఆనంద్ నిర్వహించారు. కలైయరసన్, సాయి ధన్సిక హీరోహీరోయిన్లుగా నటించిన ఇందులో మైమ్‌గోపీ, డేనియల్ ఆణి, తమిళ్‌సెల్వి, కార్తీక ముఖ్య పాత్రలు పోషించారు. మెట్రో చిత్రం ఫేమ్ జోహన్ సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్తో ఈ నెల 16న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వివరాలను తెలుపుతూ ‘ఉరు’ అంటే భయం అనే అర్థం ఉందన్నారు. ఈ చిత్రం భయం ఇతివృత్తంగా రూపొందడంతో ఉరు అనే టైటిల్‌ను పెట్టినట్లు చెప్పారు. ఇది సైకో థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పారు. హర్రర్ కథా చిత్రం అయినా ఇందులో దెయ్యాలు ఉండవన్నారు. కోడైకెనాల్, మేఘమలై ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఎక్కువగా షూటింగ్ చేసినట్లు చెప్పారు. ఇందులో హీరో కలైయరసన్ రచయిత అని తెలిపారు. మంచి కుటుంబ ఇతివృత్తాలతో నవలను రాసే ఆయనకు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ తరహా నవలకు ఆదరణ తగ్గుతుందన్నారు. దీంతో హర్రర్ నవల రాసేందుకు మేఘమలై వెళతాడన్నారు. అక్కడ నవల రాయడం మొదలెట్టిన కళైయరసన్‌కు కొన్ని సంఘటనులు ఎదురవుతాయన్నారు. అవేమిటీ? వాటి కారణంగా ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర కథ అని చెప్పారు.