![Hari Kolagani About Shikaaru Movie - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/1/shikaaru.jpg.webp?itok=_6p-Xfkf)
‘‘షికారు’లో మంచి కథతో పాటు వినోదం ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రంపై నిర్మాత బాబ్జీగారు పూర్తి నమ్మకంతో ఉన్నారు’’ అని సాయి ధన్సిక అన్నారు. హరి కొలగాని దర్శకత్వం వహించిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పీఎస్‌ఆర్ కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.
ఈ చితం ప్రీ రిలీజ్ వేడుకలో హరి కొలగాని మాట్లాడుతూ– ‘‘నెల్లూరులో కాలేజీ విద్యార్థులకు మా సినిమా ప్రీమియర్ షో వేశాం.. వారి స్పందన మాకు మరింత ఎనర్జీ ఇచ్చింది’’ అన్నారు. ‘‘అందరికీ తెలిసిన కథే ఇది.. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు పీఎస్‌ఆర్ కుమార్.
చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ
సైబర్ పోలీసుకు సీనియర్ నటి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment