Shikaaru Movie
-
షికారు అందరికీ తెలిసిన కథే, తప్పకుండా నచ్చుతుంది
‘‘షికారు’లో మంచి కథతో పాటు వినోదం ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రంపై నిర్మాత బాబ్జీగారు పూర్తి నమ్మకంతో ఉన్నారు’’ అని సాయి ధన్సిక అన్నారు. హరి కొలగాని దర్శకత్వం వహించిన చిత్రం ‘షికారు’. సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కేవీ ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించారు. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పీఎస్ఆర్ కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ చితం ప్రీ రిలీజ్ వేడుకలో హరి కొలగాని మాట్లాడుతూ– ‘‘నెల్లూరులో కాలేజీ విద్యార్థులకు మా సినిమా ప్రీమియర్ షో వేశాం.. వారి స్పందన మాకు మరింత ఎనర్జీ ఇచ్చింది’’ అన్నారు. ‘‘అందరికీ తెలిసిన కథే ఇది.. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు పీఎస్ఆర్ కుమార్. చదవండి: ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ మూవీ రివ్యూ సైబర్ పోలీసుకు సీనియర్ నటి ఫిర్యాదు -
Shikaaru:‘మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే..’
సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కెవి ధీరజ్, నవకాంత్ లను హీరోలుగా పరిచయం చేస్తూ శ్రీమతి వాగేశ్వరి(పద్మ) సమర్పణలో శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తోన్న చిత్రం `షికారు`. హరి కొలగాని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ ఆలపించిన మనసు దారి తప్పెనే.. పాటను మెగాహీరో వరుణ్ తేజ్ ఈ రోజు విడుదల చేశారు. ‘మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే..అరే అరే అరే హాయ్ అంటే నువ్వు పెదవిపై నవ్వు ఆగనె ఆగదే..ఆగనె ఆగదే..’ అంటూ సాగే ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించారు. ఇక సిద్ శ్రీరామ్ తన వాయిస్‌లోని మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేశారు. శేఖర్ చంద్ర బాణీలు శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.