![Sai Dhanshika, Amit Tiwari Movie Titled As Antima Teerpu - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/24/sai-dhanshika.jpg.webp?itok=XuLA_f3B)
సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అంతిమ తీర్పు". ఏ.అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ.. నిర్మాతగారిని కలిసినప్పుడు ఆయన లో ఒక ప్యాషన్ చూశాను. ఒక మంచి సినిమా తియ్యాలన్న తపన ఆయనలో కనిపించింది. డి.రాజేశ్వరరావు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం' అన్నారు.
సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో అందరూ మంచి కేరక్టర్స్ చేశారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత అవసరమనేది ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్ధమైంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలానే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు. డైరెక్టర్ అభిరాం మాట్లాడుతూ... ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య గారి చాలా సినిమాలకు నేను పనిచేశాను. ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో సాయి ధన్సిక అద్భుతంగా చేసింది. కోటి గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment