Amit Tiwari
-
సాయిధన్సిక 'అంతిమ తీర్పు' టైటిల్ లాంచ్
సాయి ధన్సిక, అమిత్ తివారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం "అంతిమ తీర్పు". ఏ.అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అమిత్ తివారి మాట్లాడుతూ.. నిర్మాతగారిని కలిసినప్పుడు ఆయన లో ఒక ప్యాషన్ చూశాను. ఒక మంచి సినిమా తియ్యాలన్న తపన ఆయనలో కనిపించింది. డి.రాజేశ్వరరావు లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరం' అన్నారు. సాయి ధన్సిక మాట్లాడుతూ.. 'ఈ సినిమాలో అందరూ మంచి కేరక్టర్స్ చేశారు. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత అవసరమనేది ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్ధమైంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలానే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అన్నారు. డైరెక్టర్ అభిరాం మాట్లాడుతూ... ఇంతకు ముందు ముత్యాల సుబ్బయ్య గారి చాలా సినిమాలకు నేను పనిచేశాను. ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుంది. ఈ సినిమాలో సాయి ధన్సిక అద్భుతంగా చేసింది. కోటి గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు. త్వరలో ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తాం అన్నారు. -
శివారెడ్డి-అమిత్ తివారి హీరోలుగా ‘రెంట్’
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి, అమిత్ తివారి, వనితారెడ్డి, మనీషాశ్రీ,చైతన్య ప్రియ ప్రధాల పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘రెంట్’. ‘నాట్ ఫర్ సేల్’ అన్నది ఉప శీర్షిక. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కు రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ - రామ్ నాథ్ ముదిరాజ్ మూవీస్ పతాకాలపై చందక రాజ్ కుమార్ - సి.హెచ్.రామ్ నాథ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ విభిన్న కథాచిత్రం గోవా, దేవఘడ్ తదితర ప్రాంతాల్లో మూడో షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివారెడ్డి, అమిత్ తివారి మాట్లాడుతుతూ.. హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న రెంట్ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. ఈ చిత్రానికి డి.ఎస్.ఆర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా, హజరత్ (వలి) డీవోపీగా పనిచేస్తున్నారు. -
సమస్యలను మహిళలు ఎలా ఎదుర్కోవాలో చూపించాం: నిర్మాత
Commitment Movie Pre Release Event: "టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ "కమిట్ మెంట్". తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీనటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19న థియేటర్స్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది. నటుడు అమిత్ తివారి మాట్లాడుతూ.. "కమిట్ మెంట్" అంటే అందరూ ఎదో అనుకుంటారు. కానీ కమిట్ మెంట్ అంటే మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్ కోసం ఎంతదూరం వెళ్తారు, ఆలా కమిట్ మెంట్ కోసం వెళ్లినప్పుడు సొసైటీలో మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేదే ఈ "కమిట్ మెంట్". ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ మెసేజ్ ఉంటుంది. ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు'' అని తెలిపాడు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ చిత్ర నిర్మాత నీలిమ.టి మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. సొసైటీకి మంచి సినిమా చూపించాలని ఒక ఉమెన్ గా ఈ సినిమా తీశాము. ఈ సినిమా పోస్టర్స్ చూసో, క్లిప్పింగ్స్ చూసో అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ ఉన్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మహిళలు వర్క్ లో కానీ ఇలా ఇందులోనైనా కానీ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చుపించాము. అలాగే వాటిని ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క అమ్మాయికి కచ్చితంగా నచ్చుతుంది'' అని పేర్కొన్నారు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
‘నల్లమల’మూవీ రివ్యూ
టైటిల్ : నల్లమల నటీనటులు : అమిత్ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, ముక్కు అవినాష్ తదితరులు నిర్మాణ సంస్థ : నమో క్రియేషన్స్ నిర్మాత: ఆర్.ఎమ్ దర్శకత్వం :రవి చరణ్ సంగీతం : పీ.ఆర్ సినిమాటోగ్రఫీ : వేణు మురళి ఎడిటర్: శివ సర్వాణి విడుదల తేది : మార్చి 18,2022 పలు సినిమాల్లో విలన్ నటించి,మెప్పించిన అమిత్ తివారి ‘నల్లమల’తో హీరోగా మారాడు. బిగ్‌బాస్ 2 ఫేమ్ భానుశ్రీ ఇందులో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. ఆ ఒక్క పాట.. ‘నల్లమల’కు హైప్ క్రియేట్ చేసింది. ఓ మోస్తారు అంచనాల మధ్య ఈ శుక్రవారం(మార్చి 18) ప్రేక్షకుల మధ్యకు వచ్చిన ‘నల్లమల’చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘నల్లమల’కథేంటంటే.. గిరిజన యువకుడు నల్లమల(అమిత్ తివారి)కి ప్రకృతి, సాధుజంతువులపై అమితమైన ప్రేమ. నల్లమల్ల అడవి ప్రాంతంలో ఉండే ఓ గూడెంలో నివసిస్తూ అక్కడి ప్రజలకు సహాయం చేస్తుంటాడు. మొరటోడులా కనిపించే నల్లమలకు ఆవులంటే చాలా ఇష్టం. అలాగే తన గూడెంలో నివసించే వనమాలి(భానుశ్రీ)అంటే కూడా ఆయనకు ప్రాణం. ప్రకృతి, సాధుజంతువులే లోకంగా భావించే నల్లమలకు అడవిలో జరిగే అక్రమ వ్యాపారం గురించి తెలుస్తోంది. దీంతో ఆయన అక్రమ వ్యాపారం చేస్తున్నవారికి ఎదురు తిరుగుతాడు.మరి నల్లమల అటవీ ప్రాంతంలో జరిగే అక్రమ వ్యాపారం ఏమిటి? అది ఎందుకు చేస్తున్నారు? గిరిజనుడైన నల్లమల దాన్ని ఎందుకు ఎదిరించాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..? ఆవు అమ్మ లాంటిది దాన్ని కాపాడు కోకపోతే మనుగడలేదు అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు రవి చరణ్. శాస్త్రవేత్త (నాజర్)ను గిరిజనలు వెంటాడటంతో ఎమోషనల్ నోట్‌తో నల్లమల సినిమా కథ మొదలవుతుంది. ఆ తర్వాత స్కూల్ పిల్లలకు ఎలాంటి అంశాలతో పాఠ్యాంశాన్ని పుస్తకంలో చేర్చాలనే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో కథ ఆసక్తిని కలిగిస్తుంది. ఇక మాజీ నక్సలైట్ (చత్రపతి శేఖర్) చెప్పే ఫ్లాష్ బ్యాక్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆవు చుట్టూ తిరిగే భావోద్వేగమైన పాయింట్‌ను దర్శకుడు తీర్చిదిద్దిన విధానం బాగుంది. సాధారణంగా ప్రతి దర్శకుడు తన డెబ్యూ మూవీకి సేఫ్‌గా ప్రేమ కథను ఎంచుకుంటారు.కానీ రవి చరణ్ మాత్రం తొలి ప్రయత్నంలోనే ఓ మంచి సందేశాత్మక కథను ఎంచుకున్నారు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే. డెబ్యూ డెరెక్టర్‌గా కాకుండా ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. కానీ ఫస్టాప్‌లో కథ కాస్త నెమ్మదిగా సాగడం.. సెకండాఫ్ వరకు అసలు కథపై క్లారిటీ రాకపోవడం సినిమాకు కాస్త మైనస్. ప్రీ క్లైమాక్స్ లో అసలు విషయం రివీల్ అవుతుంది. దాన్ని మరింత బాగా డిజైన్ చేసుకుంటే బాగుండేది. ఎవరెలా చేశారంటే.. విలన్‌గా పలు సినిమాల్లో నటించి, టాలీవుడ్లో తనకంటే ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాధించుకున్నాడు అమిత్ తివారి. హీరోగా మారి తొలి ప్రయత్నంగా ‘నల్లమల’లాంటి కథను ఎంచుకోవడం అమిత్‌కు ప్లస్ అయింది. ఈ చిత్రంలోని ఆయన పాత్రకు అన్ని రకాల ఎమోషన్స్ పండించే అవకాశం దొరికింది. దీంతో నల్లమల పాత్రలో అమిత్ ఒదిగిపోయాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో అమిత్ అదరగొట్టాడు. భాను శ్రీ గ్లామర్ పరంగా, డ్యాన్సుల పరంగా ఆకట్టుకొంది. కొన్ని సీన్లలో భాను శ్రీ నటన, స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. శాస్త్రవేత్తగా నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్, తనికెళ్ల భరణి తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకెతిక విషయానికొస్తే.. పీ.ఆర్ సంగీతం అదిరిపోయింది. ‘ఎమున్నావే.. పిల్లా’సాంగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. అలాగే తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫి బాగుంది. అటవీ అందాలను సినిమాటోగ్రాఫర్ వేణు మురళీ తన కెమెరాలో చక్కగా బంధించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
‘నల్లమల’ అడవుల్లో అంతర్యుద్ధం..గెలించిందెవరు?
అమిత్ తివారి, భానుశ్రీ హీరో,హీరోయిన్లు నటించిన తాజా చిత్రం ‘నల్లమల’.రవిచరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. ‘1980 జూలై 23, ఇరాన్-ఇరాక్ యుద్ధం మొదలయ్యే ముందు రోజులు ఇవి. అప్పుడప్పుడే నల్లమల అడవుల్లో అంతర్యుద్ధం మొదలైంది’ అనే మాటలతో ఈ మూవీ టీజర్ మొదలైంది. ప్రతి సన్నివేశంలో అమిత్ నటన ఆకట్టుకునేలా ఉంది. ధికారం కోసం నల్లమల అటవీ ప్రాంతంలో చోటుచేసుకునే సంఘటనలు.. అందమైన అడవిలో స్వచ్ఛమైన ప్రేమకథతో ఈ సినిమా రూపుదిద్దుకున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. టీజర్ విడుదల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాకట్టా మాట్లాడుతూ. ఈ మూవీలోని ఏమున్నావే పిల్ల పాటను నేను నా ఫ్రెండ్స్‌తో హ్యాంగవుట్లో ఉంటే వింటాను. ఇలాంటి పాట నాకు ఒక్కటి కూడా లేదు అని అసూయ పడ్డాను. అమిత్‌ను మొదటిసారి చూసినప్పుడే ఇంత మంచి యాక్టర్‌వి ఎందుకు అంత తక్కువగా కనిపిస్తున్నావ్ అని అన్నాను. మంచి ఫుడ్ చాలా అరుదుగా దొరుకుతుందన్నట్టుగా అనిపించింది.ఇంత మంచి క్యాస్టింగ్‌ను పెట్టుకోవడంతోనే సినిమా సక్సెస్‌కు మొదటి మెట్టు పడ్డట్టు అయింది.ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’అని అన్నారు. దర్శకుడు రవి చరణ్ మాట్లాడుతూ.. ‘నాతో ఈ సినిమా చేసినందుకు, నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడేలా చేసిన నిర్మాత ఆర్ఎమ్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు దేవా కట్టా గారంటే చాలా ఇష్టం. టీజర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఓ రెండు విషయాలు చెబుతాను. అడవిని అడవి తల్లి.. గోవును గోమాత అని అంటాం. బానిస బతుకుల నుంచి భారతదేశం స్వేచ్చా ఆయువును పీల్చుకుంటున్న సమయంలో నల్లమల అడవుల్లోకి మానవ రూపంలో ఉన్న క్రూరమృగం ఎంట్రీ అయింది. ఆ మృగం ఎంట్రీ అయ్యాక ఏం జరిగింది అనేదే ఈ కథ. తరువాత సినిమా గురించి చాలా విషయాలు చెబుతాను. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.