సమస్యలను మహిళలు ఎలా ఎదుర్కోవాలో చూపించాం: నిర్మాత | Commitment Movie Pre Release Event | Sakshi
Sakshi News home page

Commitment Movie: ప్రతి అమ్మాయికి కనెక్ట్‌ అయ్యే 'కమిట్‌మెంట్'

Published Tue, Aug 16 2022 8:19 PM | Last Updated on Tue, Aug 16 2022 8:28 PM

Commitment Movie Pre Release Event - Sakshi

Commitment Movie Pre Release Event: "టాలీవుడ్‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ  నాలుగు  కథలతో  వస్తున్న ఇంట్ర‌స్టింగ్ మూవీ "కమిట్ మెంట్". తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీనటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన  ఈ సినిమా టీజ‌ర్, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి  చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19న థియేటర్స్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది.

నటుడు అమిత్ తివారి మాట్లాడుతూ.. "కమిట్ మెంట్" అంటే అందరూ ఎదో అనుకుంటారు. కానీ కమిట్ మెంట్ అంటే మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్ కోసం ఎంతదూరం వెళ్తారు, ఆలా కమిట్ మెంట్ కోసం వెళ్లినప్పుడు సొసైటీలో మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేదే ఈ "కమిట్ మెంట్". ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ మెసేజ్ ఉంటుంది. ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు'' అని తెలిపాడు.

చదవండి: ప్రభాస్‌ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా?
మహేశ్‌ బాబు థియేటర్‌లో దళపతి విజయ్.. వీడియో వైరల్‌


చిత్ర నిర్మాత నీలిమ.టి మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. సొసైటీకి మంచి సినిమా చూపించాలని ఒక ఉమెన్ గా ఈ సినిమా తీశాము. ఈ సినిమా పోస్టర్స్ చూసో, క్లిప్పింగ్స్ చూసో అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ ఉన్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మహిళలు వర్క్ లో కానీ ఇలా ఇందులోనైనా కానీ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చుపించాము. అలాగే వాటిని ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి  ఒక్క అమ్మాయికి కచ్చితంగా నచ్చుతుంది'' అని పేర్కొన్నారు.

చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ
బిగ్‌బాస్‌ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement