women problems
-
మహిళకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి: సత్య కృష్ణణ్
-
కలబందతో శానిటరీ న్యాప్కిన్స్ తయారీ..ఆ సమస్యలకు చెక్
పీరియడ్స్.. అందరు అమ్మాయిల జీవితంలో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఇప్పటికీ ఎందుకో ఈ విషయంపై చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు. అదేదో మాట్లాడకూడని సబ్జెక్ట్ అన్నట్లు చూస్తారు. దీని ఆధారంగా బాలీవుడ్లో ప్యాడ్‌మ్యాన్ పేరుతో ఓ సినిమాను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రుతస్రావం, నాప్‌కీన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పీరియడ్స్ సాధారణమే అయినా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు పెట్టే వాళ్లూ లేకపోలేదు. అందుకే కొన్ని కంపెనీల్లో ప్రత్యేకంగా పీరియడ్ లీవ్స్ని కూడా ప్రవేశ పెట్టారు. పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ సమయంలో హైజీన్ మరింత అవసరం. మంచి నాణ్యత కలిగిన ప్యాడ్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ఎంత వరకు ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకమే. కొందరు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఫైబర్ క్లోరిన్‌తో బ్లీచ్ చేస్తారు. దీనివల్ల డయాక్సైన్, ప్రమాదకరమైన కలుషితాలు విడుదలవుతాయి. వీటి కారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు, హార్మోన్ల సమస్యలు, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి శానీటరీ న్యాప్కిన్స్ను వాడాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ మనూ ప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం తాజాగా తక్కువ ధరకే ప్యాడ్స్‌ను అందిస్తోంది. సాధారణంగా ప్యాడ్స్ తయారీకి ఎక్కువ మొత్తంలో కాటన్ అవసరం ఉంటుంది. కానీ వీళ్లు కాటన్ అవసరం లేకుండానే సిసల్(కలబంద)మొక్కను ఉపయోగించి తక్కువ ధరకు ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు. ఇది సాధారణ ప్యాడ్స్ మాదిరిగానే చాలా సాఫ్ట్‌గా ఉంటాయని, అంతేకాకుండా వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చని వివరించారు. -
మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్ రావడం లేదు కారణం?
మా అమ్మాయికి పదమూడేళ్లు. పెద్దమనిషి అయినప్పటి నుంచీ పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. కారణం ఏంటంటారు? – వి. భావన, ఖమ్మం రజస్వల అయిన 11– 19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో చాలామందిలో నెలసరి క్రమం తప్పడం చూస్తుంటాం. ఈ టైమ్‌లో చాలామందికి బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. అధి బీఎమ్ఐ .. అంటే అధిక బరువు ఉండి.. 30 దాటినప్పుడు.. థైరాయిడ్, ఫిట్స్, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.. ఫైబ్రాయిడ్స్.. సిస్ట్లు వంటి గైనిక్ సమస్యలు ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది. ఒక్కోసారి నెలలో రెండుసార్లు రావడం.. లేదంటే రెండు నెలలకు ఒకసారి రావడం.. విపరీతమైన నొప్పి.. స్పాటింగ్.. రక్తస్రావం తక్కువగా అవడం.. లేదంటే ఎక్కువగా అవడం.. వంటి సమస్యలను చూస్తాం. పీరియడ్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. స్కల్, కాలేజీలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మొదట పారాసిటవల్, డ్రాటిన్ వంటి పెయిన్ రిలీఫ్ మాత్రలను సచిస్తాం. అధిక రక్తస్రావంతో కూడిన ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒకసారి స్కాన్ చేసి సిస్ట్స్ ఏమైనా ఉన్నా అని చెక్ చేస్తాం. రెండు .. మూడు నెలలు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తే చాలామందిలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నిసార్లు యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కావచ్చు. దీనికి ఒకసారి యూరిన్ .. థైరాయిడ్ టెస్ట్స్ చేస్తాం. నెలసరి 21 – 35 రోజుల వరకు రెండుసార్లు వస్తే స్కాన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తాం. చాలామందిలో పీసీఓస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒవేరియన్ హార్మోన్స్ స్టడీ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యామం.. పౌష్టికాహారంతో పీసీఓస్ని మేనేజ్ చెయ్యవచ్చు. 20 ఏళ్లలోపు అమ్మాయిలకు అంతగా మందులు అవసరం లేదు. చిన్న వయసులో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ముందు సమస్య ఏంటో కనిపెట్టి.. ఆ తర్వాత చికిత్స మొదలుపెట్టడం మంచిది. నాకిప్పుడు 55 ఏళ్లు. హాట్ ఫ్లషెస్ విపరీతంగా ఉంటున్నాయి. హార్మోన్స్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేశారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వద్దనుకుంటున్నాను. మీరు ఆల్టర్నేట్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? – గీత కురువెళ్లి, బెంగళూరు మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. సాధారణంగా దీన్ని 50 నుంచి 60 ఏళ్ల మధ్య చూస్తాం. ఈ సమయంలో హార్మోన్స్ స్థాయిల్లో సమతుల్యం లోపించడం వల్ల రకరకాల సింప్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి. హెచ్ఆర్టీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని.. అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్‌ని మాత్రల రపంలో ఇస్తారు. కానీ ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గినందువల్ల స్కిన్ చెంజెస్, వెజైనల్ డ్రైనెస్, యూరినరీ ఇన్ఫెక్షన్, హార్ట్ ఇష్యస్ వంటివాటిని 50 ఏళ్లు పైబడిన వాళ్లలో చూస్తాం. ఈ హార్మోన్లను బయట నుంచి సప్లిమెంట్స్‌గా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే చాలామంది నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్నే కోరుకుంటారు. దీనివల్ల మెనోపాజ్ సింప్టమ్స్ తగ్గడమే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా కనిపించవు. ఖీఐఆౖఔౖNఉ అనేది అందులో ఒకరకం. దీనిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ , ఆండ్రోజెన్ ఉంటాయి. అలసట, నీరసం, లో మూడ్, రాకు వంటి సైకలాజికల్ సింప్టమ్స్ ఈ ఖీఐఆౖఔౖNఉతో చాలా తగ్గుతాయి. చాలామందిని మెనోపాజ్ తర్వాత ఒకటి రెండేళ్ల వరకు హాట్ ఫ్లషెస్.. చలి చెమటలు తీవ్రంగా బాధిస్తాయి. వీటిని ట్రీట్మెంట్తో తగ్గించవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసి .. తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని సూస్తాము. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్స్‌తో సింప్టమ్స్ తగ్గి.. పరిస్థితి మెరుగుపడుతుంది. -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్‌కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్‌గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
ప్రెగ్నెన్సీ కోసం ఏ ఏజ్ వరకు ట్రై చేయాలంటే..
-
సంతానోత్పత్తి సామర్థ్యం మెరుగవ్వాలంటే... తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
-
ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే ముందు...కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి...
-
మహిళల్లో గుండెపోటు రావడానికి కారణాలు ఇవే
-
ఏ గర్భిణీ ఇబ్బంది పడకూడదు...అందుకే ఈ పధకం
-
ఆడవారి ఆరోగ్య సమస్యలకు కారణాలు ఇవే
-
ఆడవాళ్ళలో గర్భ సమస్యలకు ప్రధాన కారణం అదే
-
స్మార్ట్ ఫిల్మ్; ఉమెన్ @ 40
మానసిక కల్లోలం, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు.. 40 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు ఈ లక్షణాలన్నీ లేదా వీటిలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంటారు. మెనోపాజ్‌కి కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నందువల్లనో, ప్రీ మెనోపాజ్ దశను అధిగమించలేకనో నాలుగుపదులు దాటిన వారి జీవితం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గి@40 (ఉమన్ ఎట్ ఫార్టీ) పేరుతో 12 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌ను తీశారు స్మితా సతీష్. స్మితా సతీష్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ ట్రైనర్. గతంలో స్మిత జువైనల్ జస్టిస్ బోర్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఉంటారు ఈమె. 43 ఏళ్ల స్మిత తన వ్యక్తిగత జీవితంలో చూసినవి, తనను కలిసిన కొంత మంది మహిళల సమస్యలను ఉదాహరణగా తీసుకుని 40 ఏళ్లు దాటిన గృహిణి పరిస్థితులతోబాటు, వారికి కుటుంబ మద్దతు ఎంత వరకు అవసరమో గి@40 షార్ట్ ఫిల్మ్‌లో కళ్లకు కడుతుంది. హాట్ ఫ్లాష్ ఈ ఏడాది మొదట్లో ‘హాట్ ఫ్లాష్’ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు స్మిత. ముందస్తు మెనోపాజ్ లక్షణాలలో ఒకటైన హాట్ ఫ్లాష్‌తో (అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, తీవ్రమైన చమట పట్టడం) ఉన్న నలభై ఏళ్ల గృహిణి గురించి వివరించారు. ఉన్నట్టుండి చిరాకుగా మారడం, కోపం తెచ్చుకోవడం లేదా కారణం లేకుండా ఏడవడం, అందరూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించడం .. ఇవన్నీ డాక్టర్, సైకాలజిస్ట్ సహాయంతో అధిగమించడం వరకు పాత్ర భావోద్వేగ ఎత్తుపల్లాల గుండా వెళుతుంది. ‘శరీరం మార్పులకు లోనవుతుంటుంది. రుతుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో నలభై దాటిన వారి ప్రతి చర్యలను గమనించిన తర్వాత ఏదైనా చేయాలనుకున్నాను. అలా ఈ లఘు చిత్రాన్ని తీశాను’ అంటారామె. ఈ ఫిల్మ్‌కి స్మిత ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఇతర నటీనటులు వివిధ రంగాలలో ఉన్నవారు మొదటిసారి నటించారు. మహిళలకు అవగాహన తప్పనిసరి నలభై ఏళ్ల దాటిన మహిళల రోజువారీ సాధారణ లక్షణాలను హైలైట్ చేయడానికి ఆమె వివిధ పాత్రల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ‘మీరు బాగున్నారా?’ అనే ప్రశ్న సాధారణంగా మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ, సమస్య ఏంటంటే, ఈ దశలో ఉన్న మహిళలు తాము ఎందుకు కష్టంగా ఉన్నారో వారికై వారే అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులకు కూడా ఈ మహిళల మానసిక కల్లోలం, ప్రవర్తనలో మార్పుల గురించి ఏ మాత్రం తెలియదు’ అంటారు స్మిత. అలాంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫిల్మ్ సాయపడుతుంది. ‘చాలామంది ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం డిప్రెషన్ గురించి ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. అలాగే, ప్రీ మెనోపాజ్ లేదా మెనోపాజ్ గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరి పరిస్థితులలో అవసరం అనుకుంటే వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల చికిత్సను సూచిస్తారు. (క్లిక్ చేయండి: తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...) ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వారి ప్రపంచం అందంగా మారుతుంది. అభిరుచులను పెంచుకోవడానికి, సృజనాత్మకమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుటుంబం, స్నేహితులు వారికి అండగా ఉండాలి. వారి సమస్యలు అందరి చెవికెక్కాలి’ అనే విషయాన్ని స్మిత తన ఫిల్మ్ ద్వారా వివరించారు. డబ్ల్యూ ఎట్ ఫార్టీ ఫిల్మ్ నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలకు చక్కటి సూచికలా ఉపయోగపడుతుంది. (క్లిక్ చేయండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి) -
సమస్యలను మహిళలు ఎలా ఎదుర్కోవాలో చూపించాం: నిర్మాత
Commitment Movie Pre Release Event: "టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తూ నాలుగు కథలతో వస్తున్న ఇంట్రస్టింగ్ మూవీ "కమిట్ మెంట్". తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్, తనిష్క్ రాజన్, అమిత్ తివారి, సూర్య శ్రీనివాస్, అభయ్ సింహా రెడ్డి నటీనటులుగా లక్ష్మి కాంత్ చెన్న దర్శకత్వంలో బల్ దేవ్ సింగ్, నీలిమ.టిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. సెన్సార్ సభ్యుల ప్రశంసలతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగష్టు 19న థియేటర్స్‌లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఫంక్షన్ ను ఏర్పాటు చేసింది. నటుడు అమిత్ తివారి మాట్లాడుతూ.. "కమిట్ మెంట్" అంటే అందరూ ఎదో అనుకుంటారు. కానీ కమిట్ మెంట్ అంటే మన వర్క్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్, ప్రొఫెషన్ కోసం ఎంతదూరం వెళ్తారు, ఆలా కమిట్ మెంట్ కోసం వెళ్లినప్పుడు సొసైటీలో మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేదే ఈ "కమిట్ మెంట్". ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో పవర్ ఫుల్ మెసేజ్ ఉంటుంది. ఆగష్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు'' అని తెలిపాడు. చదవండి: ప్రభాస్ విషయంలో ఆ నిర్మాత వెనుకడుగు.. కారణం అదేనా? మహేశ్ బాబు థియేటర్లో దళపతి విజయ్.. వీడియో వైరల్ చిత్ర నిర్మాత నీలిమ.టి మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. సొసైటీకి మంచి సినిమా చూపించాలని ఒక ఉమెన్ గా ఈ సినిమా తీశాము. ఈ సినిమా పోస్టర్స్ చూసో, క్లిప్పింగ్స్ చూసో అందరూ బోల్డ్ కంటెంట్ ఉంటుంది అనుకోవద్దు. ఇందులో కొంత బోల్డ్ సీన్స్ ఉన్నా అవి ఎందుకు ఉన్నాయి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మహిళలు వర్క్ లో కానీ ఇలా ఇందులోనైనా కానీ ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అనేది ఈ సినిమాలో చుపించాము. అలాగే వాటిని ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనేది కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క అమ్మాయికి కచ్చితంగా నచ్చుతుంది'' అని పేర్కొన్నారు. చదవండి: నేను పెళ్లి చేసుకునే సమయానికే ఆమెకు ఒక బాబు: బ్రహ్మాజీ బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో బాలిక గ్యాంగ్ రేప్ ఘటనతో తల్లిదండ్రులు పట్టపగలు కూడా ఆడపిల్లలను బయటకు పంపేందుకు భయపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ’బచావో హైదరాబాద్’ పేరుతో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రేవంత్‌రెడ్డితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మల్లు రవితోపాటు సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్టీపీ నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ గ్యాంగ్‌రేప్‌కు సంబంధించిన ఎడిటెడ్, లిమిటెడ్ వీడియోను ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగానే లీక్ చేశారని ఆరోపించారు. గ్యాంగ్‌రేప్ ఎక్కడ జరిగిందో ఇప్పటికీ హైదరాబాద్ సీపీ చెప్పడం లేదని, దేవుని పేరును ఆలంబనగా చేసుకొని ఎదగాలని చూసే పార్టీ కూడా గ్యాంగ్‌రేప్ జరిగిన ప్రదేశం గురించి అడగడం లేదన్నారు. నిజాయితీగా పనిచేసే ఐపీఎస్ అధికారులను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారని, రిటైర్డ్ అధికారులకు మళ్లీ పోస్టింగ్‌లు ఇచ్చి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఘటనలో 8 మంది నిందితులుగా ఉంటే ఆరుగురిపై కేసు పెట్టారని, మిగతా ఇద్దరు ఏమయ్యారని ప్రశ్నించారు. ఎయిర్ పోర్ట్‌లో కేసీఆర్ బంధువులు పబ్‌లు పెట్టి అడ్డగోలుగా నడుపుతున్నారని, ఎయిర్‌పోర్టు పార్కింగ్ వద్ద గల పబ్‌లో అరాచకం నడుస్తోందని, సర్కారును నడిపేవాళ్లే నేరగాళ్లుగా మారారని ధ్వజమెత్తారు. మహిళా సమస్యలపై సమీక్షల్లేవు:కోదండరాం మహిళల సమస్యలపై ఎనిమిదేళ్లుగా ఒక్క సమీక్ష కూడా జరగలేదని, చివరిసారిగా రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఎం.కోదండరాం అన్నారు. జూబ్లీహిల్స్ కేసుతోపాటు ప్రతి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్, ఎంఐఎంకు చెందిన నేతల కొడుకులు, మనవళ్లు ఉన్న జూబ్లీహిల్స్ కేసులో న్యాయం జరిగేలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ ఉన్నతమైన సమాజం వస్తుందని ఆశించామని, కానీ పరిస్థితి దిగజారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా దాసోజు శ్రావణ్ తీర్మానాలు ప్రవేశపెట్టగా, సభ్యులు ఆమోదించారు. సమావేశంలో ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, మల్లు రవి (కాంగ్రెస్), బాలమల్లేష్ (సీపీఐ), జ్యోత్స్న (టీడీపీ), తూడి దేవేందర్ రెడ్డి (వైఎస్సార్టీపీ), మామిడాల జ్యోతి (బీఎస్పీ) తదితరులు హాజరయ్యారు. -
వితంతువులను గౌరవిద్దాం...
ప్రపంచ వ్యాప్తంగా వితంతువులు ఏదో ఒక రూపంలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ బహిష్కరణ, గృహ హింస, వివక్షత, మూఢాచారాలు, పేదరికం లాంటి ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని బతుకుబండి లాగుతున్నారు. అనునిత్య జీవితంలో సమస్యలను ఎదుర్కొంటున్న వితంతువులకు అండగా ఉంటూ ఆదరణ చూపించడానికై ఐక్యరాజ్య సమితి 2011 జూన్ 23వ తేదీని అంతర్జాతీయ వితంతువుల దినోత్సవంగా ఏర్పాటుచేసి వితంతు వివక్ష విముక్తి కోసం పోరాడాలని పిలుపు ఇచ్చింది. గత పదేళ్లుగా తెలుగు రాష్ట్రాలలో వితంతు విముక్తి ఉద్యమాన్ని ప్రజలందరి భాగస్వామ్యంతో ముమ్మరంగా నడుపుతున్న బాల వికాస సామాజిక సేవా సంస్థ, వరంగల్ వారు ప్రపంచ చరిత్రలోనే 10,000 మంది వితంతువులతో అతి పెద్ద మహాసభను 2018 జూన్ 23న హైద్రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేశాము. ఈ సభకు వచ్చిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలు వితంతు వివక్ష అనేది ఏ మతంలోనూ ప్రోత్సహించరని, జరుగుతున్న తంతు అంతా కూడా ఒక సామాజిక మూఢ నమ్మకం, మూఢాచారం మాత్రమే అని చాటి చెప్పారు. భారదేశంలో సుమారు నాలుగున్నర కోట్ల వితంతువులు ఆధరణ నోచుకోకుండ, ఆత్మాభిమానం కోల్పోయి జీవిస్తున్నారు. గ్రామాలలో, పట్టణాలలో అనేక మంది వితంతువులు అనేక పరిస్థితులలో భయంకర వివక్షతను అనుభవిస్తున్నారు. పండుగల్లో, కుటుంబ శుభకార్యాలలో వివక్షత. కనీసం కన్నబిడ్డ వివాహాల్లో మనస్పుర్తిగా ఆశీర్వదించలేని అభాగ్యురాలిగా, సాటి మహిళలలాగా సాధారణ బట్టలు వేసుకోలేక, పురుషులలాగా రెండో పెళ్ళి చేసుకోలేక, ముఖ్యంగా యువ వితంతువులు ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, వితంతువులు సాటి మహిళతో సమానత్వం కావాలనీ, కనీసం తనను మనిషిలా చూడాలని కన్నీళ్ళు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో చూస్తున్నాము. ప్రభుత్వాలతోపాటు, సమాజంలోని అందరు వితంతువులపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటే ప్రజల ఆలోచనలు మారి, ఆచరణలో మార్పు వచ్చినప్పుడు సమాజం మార్పు చెందుతుంది. ఈ వితంతు వివక్షా విముక్తి ఉద్యమంలో భాగస్వాములై మన అమ్మ, అక్క, చెల్లి, కూతురు అందరూ ఆత్మగౌరవంగా జీవించే హక్కు కల్పిద్దాం. – సింగారెడ్డి శౌరిరెడ్డి బాల వికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొబైల్: 98491 65890 -
‘అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న’
‘‘తల్లయిన తర్వాత ఎవరైనా బరువు పెరుగుతారు. ఆ బరువుని అసహ్యించుకోవడం మంచిది కాదు. అలానే ‘ఏంటీ లావయ్యారు?’ అని ఎవరైనా అడిగితే ఆత్మన్యూనతాభావానికి గురి కాకూడదు. మన శరీరం.. మనిష్టం. మనం ఎలా ఉన్నామో అలానే మనల్ని మనం అంగీకరించాలి’’ అని ఆ మధ్య ఓ పాపకి జన్మనిచ్చిన సందర్భంలో అన్నారు సమీరా రెడ్డి. తాజాగా పెళ్లి గురించి ఓ విషయం పంచుకున్నారు. సమీరా మాట్లాడుతూ – ‘‘నా పెళ్లికి ముందు వరకూ ‘ఏంటీ ఇంకా పెళ్లవ్వలేదా’ అనే ప్రశ్న పదే పదే నాకు ఎదురయ్యేది. ‘35 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లవ్వకపోవడం ఏంటి’ అనేవారు. అది వినగానే నాలో తెలియని ఒత్తిడి పెరిగేది. అమ్మాయంటే చాలు.. పెళ్లయ్యేవరకూ అదే ప్రశ్న. పెళ్లయ్యాక ‘పిల్లలెప్పుడు’? అనే ప్రశ్న. అమ్మాయికి ఓ తోడు ఉండాలని సమాజం అంటుంది. పెళ్లి, పిల్లలు ఉంటేనే ఆ అమ్మాయి జీవితం పరిపూర్ణం అవుతుందని అంటారు. ఇంకో విషయం ఏంటంటే.. మొదటి బిడ్డ పుట్టాక.. ఇంకో బిడ్డను ప్లాన్ చేస్తున్నారా? లేక ఒక్కరే చాలా? అని ఓ ప్రశ్న. ఈ ప్రశ్నలు ఎదుర్కోలేక చాలామంది అమ్మాయిలు భయాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మహిళలకు స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా వాళ్లకేం కావాలో ఆ నిర్ణయాలే తీసుకుంటారు. భయంతో కాదు... ఆత్మవిశ్వాసంతో తీసుకుంటారు’’ అన్నారు. 2014లో అక్షయ్ వార్దేని పెళ్లాడారు సమీరా. అప్పుడు ఆమెకు 36ఏళ్లు. ఈ దంపతులకు ఒక బాబు, ఒక పాప ఉన్నారు. అక్షయ్ అర్థం చేసుకునే భర్త అని పలు సందర్భాల్లో సమీరా పేర్కొన్నారు. చదవండి: 24 ఏళ్లు.. కానీ 23వ బర్త్‌డే చేసుకుంటా : హీరోయిన్ తాప్సీ, అనురాగ్ కశ్యప్‌పై ఐటీ గురి -
మహిళల సమస్యకు చాకొలెట్లు, ‘టీ’లే ఔషధం!
అందరూ అన్నీ చేసేస్తున్నారు. ఇక కొత్తగా నేనేం చేయాలి? ఇంతమంది మధ్యలో నేను పెట్టిన స్టార్టప్ మనుగడ సాధ్యమేనా? సొంతంగా పరిశ్రమ స్ఠాపించాలనుకునే యువతలో ఇలా ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. అయినా ఒక సమస్యకు పరిష్కారాన్ని మించిన ఉపాధి మరేముంటుంది? తన కళ్ల ముందున్న సమస్య నుంచి కెరీర్ మొదలుపెట్టారు షీతా మిట్టల్. ఆ సమస్య కూడా నిరంతరం ఉండేదే అయినప్పుడు ఆ పరిష్కారం కూడా భూమి ఉన్నంత కాలం ఉండి తీరుతుంది. ఇంతకీ ఆమె ప్రారంభించిన పరిశ్రమ ఏమిటంటే.. మహిళల ఆరోగ్య ఉత్పత్తుల తయారీ. సమాజం మాట్లాడడానికి సందేహించే ఆరోగ్య సమస్యలకు ఆహారంతో పరిష్కారం చెబుతున్నారు షీతా మిట్టల్. ‘‘ఆహార ఉత్పత్తులు, హెల్త్ డ్రింకులు తయారు చేసే కంపెనీలన్నీ మహిళల మహిళల ఎముకల పటిష్టత వరకే ఆలోచిస్తున్నాయి. వార్ధక్యం లో ఎదురయ్యే కీళ్ల నొప్పుల గురించి మాట్లాడుతున్నాయి. అక్కడితోనే ఆగిపోతున్నాయి. నిజానికి మహిళలను తీవ్రంగా ఇబ్బంది పెట్టే గర్భాశయ సమస్యల గురించి మాట్లాడవలసింది చాలా ఉంది. ఇప్పటికీ సమాజంలో ఆ విషయంలో గోప్యత, కళంక భావన బలంగానే ఉంది. ఆ శూన్యతను భర్తీ చేసే ప్రయత్నం చేశాను. మా అమ్మ తన ఆరోగ్యం విషయంలో ఎంత బాధపడిందో స్వయంగా చూశాను. అమ్మ శారీరకంగా బాధపడుతుంటే, నాది మానసికమైన వేదన. ఆమె బాధ చూస్తుంటే గుండె పిండేసినట్లయ్యేది. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఇంకా ఈ ఇబ్బందులకు పరిష్కారం లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించేది. ఆ పని నేనే ఎందుకు చేయకూడదు... అనే ఆలోచనకు ప్రతిరూపమే ‘అండ్ మీ’! మూడేళ్ల కిందట మొదలైన మా సంస్థ ఈ కరోనా సమయంలో కూడా ప్రయోగాలను కొనసాగించి... మెనోపాజ్ కుకీస్‌ను తయారు చేసింది. మెనోపాజ్ దశకు చేరిన మహిళలు తీసుకోవాల్సిన ఆహారం ప్రత్యేకమైనదై ఉండాలి. అయితే ఆధునిక మహిళకు ఆ దినుసులన్నీ మార్కెట్లో సేకరించి, వండుకుని తినగలిగే సమయం ఉండడం లేదు. అందుకే తినడానికి సిద్ధంగా కుకీస్ తయారు చేశాం. ప్రతి ఉత్పత్తినీ గైనకాలజిస్టులు, పోషకాహార నిపుణుల సూచనలను పాటించి తయారు చేస్తాం. తయారైన వాటిని ల్యాబ్‌లో పరీక్ష చేసిన తర్వాత మాత్రమే మార్కెట్లో విడుదల చేస్తున్నాం’’ అని చెప్పారు షీత. లక్ష్యం కోసం కలిశారు ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన షీతా మిట్టల్ యూఎస్‌లోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేశారు. యోగా శిక్షకురాలు కూడా. ఐదేళ్ల కిందట యూఎస్‌లోని స్టాన్ఫోర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతున్న అంకుర్ గోయెల్ కూడా తన తల్లి ఆరోగ్యం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ అధ్యయనంలో అతడికి తెలిసిన సంగతి ఏమిటంటే... ‘మనదేశంలో ఐరన్‌లోపం ఉన్న మగవాళ్లు 23 శాతం ఉంటే మహిళలు 54 శాతం మంది. అలాగే క్యాల్షియం లోపం కూడా మగవాళ్లలో 25 శాతంలో ఉంటే ఆడవాళ్లలో 50 శాతం మందిలో ఉంది. ఈ పోషకాల లోపం జీవనశైలితోపాటు సామాజిక, సాంస్కృతిక కారణాల వల్ల వస్తోంది’ అని. షీతా మిట్టల్ కూడా అదే ప్రయత్నంలో ఉండడంతో ఇద్దరూ కలిసి మహిళలకు ఎదురయ్యే అనారోగ్యాలను తగ్గించే ఆహారం మీద దృష్టి పెట్టారు. అవసరాలను గుర్తించారు కరోనా సమయంలో అన్ని పరిశ్రమలూ స్తంభించిపోయినట్లే షీతా మిట్టల్ పరిశ్రమ కూడా ఒడిదొడుకులను ఎదుర్కొంది. కానీ అవసరం ఆగదు కదా! ఆన్లైన్లో రిక్వెస్ట్‌లు ఎక్కువయ్యాయి. దాంతో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రయోగాలను, ఉత్పత్తులను తిరిగి ప్రారంభించిందామె. బెంగళూరు నుంచి మనదేశంలో ప్రముఖ నగరాలకు, విదేశాలకు కూడా విస్తరించించాయి ‘అండ్ మీ’ మహిళల ఆరోగ్య ఉత్పత్తులు. ప్రస్తుతం షీతామిట్టల్ పరిశ్రమ పెద్ద కంపెనీలకు దీటుగా సాగుతోంది. సమాజం లోని అవసరాన్ని మానవీయ కోణంలో చూడగలిగి, మనసు పెట్టి పరిష్కారాన్ని అన్వేషిస్తే... అంతకు మించిన ఉపాధి రంగం మరొకటి ఉండదని నిరూపించారు షీతామిట్టల్. చాకొలెట్లు, ‘టీ’లే ఔషధం! షీతా మిట్టల్ ‘అండ్ మీ’ పరిశ్రమ ద్వారా పీసీఓఎస్‌ను అదుపు చేసే పానీయంతోపాటు పీరియడ్స్ సమయంలో నొప్పిని నివారించే చాకొలెట్లు, టీ తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో మహిళలను తరచూ వేధిస్తున్న యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గించే మూలికా పానీయంతోపాటు యువతులను ఇబ్బంది పెడుతున్న యాక్నే, జుత్తు రాలడం, చర్మం పేలవంగా మారడం వంటి సమస్యలకు కూడా పోషకాలతో కూడిన ప్రత్యామ్నాయాలను రూపొందించింది. -
ఇక్కడే ఉంది.. నరకం
కూటి కోసం, కూలి కోసం దేశం విడిచి బయలుదేరిన ఆ మహిళకు ఎంత కష్టం... కాయకష్టం చేసినా పొట్టనిండని బతుకులు... గూడూ, గుడ్డలేని జీవనం... ఎన్నాళ్లిలా...కువైట్ వెళ్తే నాలుగు రాళ్లు వెనుకేసుకొని... కనీసం ఇల్లయినా కట్టుకోవచ్చునని ఆ దంపతులు ఆలోచించారు. ముందుగా మధ్యవర్తి ద్వారా భార్యను పంపించిన ఆ భర్తకు పిడుగులాంటి వార్త... ‘నేను పని చేస్తున్న ఇంటి యజమాని నరకం చూపిస్తున్నాడు. తన లైంగిక వాంఛలను తీర్చమంటున్నాడు. కాదన్నందుకు ఎక్కడబడితే అక్కడ కాల్చిన సిగరెట్‌తో వాతలు పెడుతున్నాడు. చెప్పుకోలేని విధంగా వికృత చేష్టలు. అంత హింస పెడుతున్నా లొంగలేదు. ప్రతిఘటిస్తూనే ఉన్నాను. పీకమీద కత్తి పెట్టి భయపెడుతున్నాడు. ఎవరికీ చెప్పుకోలేవని, తాను చెప్పినట్టు నడుచుకోవాలని, ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి నిన్నెవరు కాపాడతాడంటూ వికటాట్ట హాసం చేస్తున్నాడు అని భార్య విలాపం. ‘ఏదో ఒకటి చేసి నన్ను ఇండియాకు రప్పించే ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉండలేను. నన్ను బాబా చంపేస్తాడు... వెంటనే తీసుకెళ్లి రక్షించండ’ంటూ ఆర్తనాదం. – ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఓ మహిళ తన భర్తకు ఫోన్లో చెప్పుకున్న రోదనిదీ.. బయటపడింది ఈ ఒక్క గొంతు... వినిపించని వేలగొంతులెన్నో... సాక్షి ప్రతినిధి, కాకినాడ : కువైట్, మస్కట్, ఖతర్, దుబాయి, అబుదాబి తదితర గల్ఫ్ దేశాలకు ఉపాధికోసం వెళ్తున్నారా? వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మధ్యవర్తులు ఎలాంటి వారు? పనికోసం పెట్టుకుంటున్న యజమానులు ఎలాంటి వారో తెలుసుకోకపోతే ఇదిగో ఇలానే చిత్రహింసలకు గురికావల్సి వస్తుంది. కోనసీమలోని పలు గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్తున్నారు. సుమారు 20 వేల మంది వరకు ఇలా వెళ్లినవారిలో ఉన్నారు. ఇంకా వెళ్తూనే ఉన్నారు. వెళ్లినవారిలో ఎక్కువమంది ఇలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడికి తీసుకు వెళ్లే వరకే మధ్యవర్తులు బాధ్యత తీసుకుంటున్నారు తప్ప వారి యోగక్షేమాలను తెలుసుకోకపోవడంతో పనికి పెట్టుకున్న ఇంటి యజమానులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న చిత్రహింసలపై వీడియో క్లిప్పింగ్స్ అనేకం వస్తూనే ఉన్నాయి. ఫేస్బుక్, వాట్సాప్‌లలో హల్చల్ చేస్తున్నాయి. అయితే, అవి ఎవరివి? ఏమిటనేది మహిళల కుటుంబీకులు, బంధువులకు మాత్రమే తెలుస్తున్నాయి. ఎక్కడ పరువు పోతుందోనని బయటకు చెప్పలేక ఇక్కట్లు పడుతున్న కుటుంబాలెన్నో... ఫిర్యాదుతో వెలుగులోకి... ఇరవై రోజుల కిందట ఉపాధి కోసమని కువైట్ వెళ్లిన కాట్రేనికోన మండలానికి చెందిన ఓ మహిళ ఆక్రందన వింటే ఎవరికైనా హృదయం ద్రవించకమానదు. ఉన్న అప్పులు తీర్చి, సొంతిల్లు కట్టుకోవచ్చన్న ఆశతో కువైట్ వెళ్లిన మహిళ అక్కడ చిత్రహింసలకు గురవుతోంది. మాన ప్రాణాలను పోగొట్టుకునే పరిస్థితిలో ఉంది. ఇప్పుడామెను మన దేశానికి రప్పించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆ మహిళ భర్త కె. వెంకటరమణ ఐ.పోలవరం పోలీసులను ఆశ్రయించాడు. తనకున్న అప్పులను తీర్చి, తదుపరి సంపాదనతో సొంతిల్లు నిర్మించుకోవచ్చన్న ఆశతో కువైట్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయినవిల్లి మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే మధ్యవర్తిని ఆశ్రయించాడు. తొలుత తన భార్యను పంపించి, తర్వాత తాను వెళ్దామని భావించాడు. మధ్యవర్తి ద్వారా కువైట్ పంపించేందుకు దాదాపు రూ. 70 వేలు ఖర్చు పెట్టాడు. అతి కష్టం మీద పాస్‌పోర్టు సంపాదించి 20 రోజుల క్రితం భార్యను పంపించాడు. కువైట్‌లో ఓ బాబా ఇంట్లో పని మనిషి కింద మధ్యవర్తి పెట్టించాడు. మూడు రోజులు బాగానే ఉన్నా తర్వాత ఆ మహిళపై వేధింపులు మొదలయ్యాయి. ఆ ఇంటి యజమాని తనను శారీరకంగా హింసించడం ప్రారంభించాడు. తన లైంగిక వాంఛలను తీర్చాలని ప్రతిరోజూ మీద పడడం... వినకపోతే సిగరెట్‌తో కాల్చి వాతలు పెడుతున్నాడు. ఎంతకీ ఒప్పుకోకపోవడంతో పీక మీద కత్తి పెట్టి మరీ బెదిరిస్తున్నాడు. అంతేకాకుండా శరీరంపై ఎక్కడపడితే అక్కడ తడుముతూ అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడు. గత పది రోజులుగా ఈ వేధింపులు అధికమవడంతో ఆమె నేరుగా తన భర్తకు ఫోన్ చేసి జరిగిందంతా విలపిస్తూ చెప్పుకుంది. తాను చేసిన వికృత చేష్టలను సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి, దాన్ని చూపిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని బోరున విలపించింది. ఎలాగైనా ఇక్కడి నుంచి ఇండియాకు తీసుకెళ్లిపోవాలని మొరపెట్టుకుంది. తనతోపాటు అదే ప్రాంతంలో మరో తొమ్మిది మంది జిల్లా మహిళలు కూడా ఇదేరకంగా నరకం చూస్తున్నారని చెప్పుకొచ్చింది. తన భార్యకు జరిగిన అన్యాయం బయట ప్రపంచానికి తెలియాలని వెంకటరమణ తన భార్య వాయిస్‌ను రికార్డు కూడా చేశాడు. మధ్యవర్తికి ఫోన్ చేసి ఆ నరకం నుంచి కాపాడాలని వేడుకున్నాడు. కానీ మధ్యవర్తి పట్టించుకోలేదు సరికదా... కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ సెట్ అయిపోతాయని సమర్ధిస్తూ వస్తుండటంతో మరింత ఆందోళనకు గురయ్యాడు. దీంతో బాధితుడు వెంకటరమణ ‘సాక్షి’తోపాటు ఐ.పోలవరం పోలీసులను ఆశ్రయించాడు. భార్యతో మాట్లాడిన వాయిస్ రికార్డులను కూడా అటు పోలీసులకు, ఇటు ‘సాక్షి’కి అందజేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని మధ్యవర్తితో మాట్లాడటమే కాకుండా పోలీసు స్టేషన్‌కు రమ్మని ఆదేశించారు. అయితే, మధ్యవర్తి మాత్రం వెంకటరమణ భార్యను తీసుకొచ్చేస్తానని, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నానని పోలీసులకు చెప్పుకొచ్చాడు. ఇదే విషయమై మధ్యవర్తి సుబ్రహ్మణ్యంకు ‘సాక్షి’ ఫోన్ చేయగా స్పందించలేదు. నమ్మించి మోసగించిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా తమను ఆదుకోవాలని భర్త వెంకటరమణ ప్రాధేయ పడుతున్నాడు. వాస్తవానికైతే, ఇటువంటి ఫిర్యాదులు జిల్లాలో అనేక చోట్ల వస్తున్నాయి. కాకపోతే, మధ్యవర్తులు చాకచక్యంగా మేనేజ్ చేసుకుని బయటికి రాకుండా చూసుకుంటున్నారు. ఫిర్యాదు మేరకు మధ్యవర్తితో మాట్లాడాం తన భార్యను కువైట్‌లో చిత్ర హింసలు పెడుతున్నారని వెంకటరమణ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించాం. మధ్యవర్తిగా ఉన్న వ్యక్తితో వెంటనే మాట్లాడాం. ఇండియాకు తీసుకొచ్చేస్తానని ఆ మధ్యవర్తి చెప్పాడు. నాలుగైదు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. – డి.దుర్గా శేఖర్‌రెడ్డి, ఎస్సై, ఐ.పోలవరం -
అది మహిళల ప్రాథమిక హక్కు
న్యూఢిల్లీ: స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం అనే అంశం చర్చకు రాగానే ఎవరైనా పనిచేసే చోట లింగభేదం లేకుండా సమాన వేతనం ఇవ్వాలని ఠక్కున అనేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సహస్రాబ్దుల్లో 60 శాతం మంది దీనికే ఓటేశారని ‘ది గ్లోబల్ షాపర్స్’ వార్షిక సర్వే కూడా ఇటీవల వెల్లడించింది. ఇంట్లో మరుగుదొడ్లు, ముఖ్యంగా మహిళల సౌకర్యార్థం ఏర్పాటు చేసినప్పుడు నిజమైన సమానత్వం సాధించినట్లు అవుతుందనేది ఎంత మంది అంగీకరిస్తారో తెలియదు. గ్రామీణ భారతంలో ఇప్పటికీ మహిళలు రోడ్డు పక్కన బహిర్భూమికి వెళుతున్నారంటే పౌరులుగా మనం సిగ్గు పడాల్సిందే. తెల్లవారకముందే లేదా చీకటి పడ్డాక బహిర్భూమికి మహిళలు వెళ్లడం ఎంత కష్టం. తేళ్లు, పాములు కరిచే ప్రమాదమే కాకుండా మానవ మృగాలు కూడా కాటువేసే ప్రమాదం వారికి పొంచి ఉంటుంది. దేశంలో టాయ్లెట్ల కన్నా సెల్ఫోన్లు పెరిగిపోయిన నేటి పరిస్థితుల్లో ఆలయాలకన్నా ముందు మరుగుదొడ్లు నిర్మించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునివ్వడం ఎంతో సమంజసం. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ దేశంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఓ ఉద్యమంలా చేపట్టాలని పదే పదే ఉద్బోధించారు. దేశంలో 63.60 కోట్ల మంది భారతీయులకు మరుగుదొడ్లు లేవనే విషయాన్ని గుర్తించిన ఆయన వీటి నిర్మాణం కోసం వంద కోట్ల డాలర్లను విడుదల చేశారు. ఇప్పటికీ దేశంలో 2.40 కోట్ల మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించిందని ఇటీవల ఆయన ఓ సందర్భంలో తెలిపారు. 2019 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి సౌకర్యం ఉండాల్సిందేనని ఆయన ఆశించారు. మరుగుదొడ్లు కలిగి ఉండడం మహిళల ప్రాథమిక హక్కుకాగా, వాటిని ఏర్పాటు చేయడం మనందరి బాధ్యత. (ఢిల్లీలో ఆరు, ఏడు తేదీల్లో జరుగుతున్న భారత ఆర్థిక సమ్మేళనం సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రచురించిన వ్యాసం నుంచి) -
మహిళల గోడు వినని చంద్రబాబు
చిత్తూరు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంవ ప్రజల గోడునే పట్టించుకోవడంలేదు. మహిళల సమస్యలు వినడానికి కూడా ఆయన సిద్దంగాలేరు. చంద్రబాబు మాటలు వింటే కోటలు దాటుతాయి. సొంత ప్రజల గోడు కూడా పట్టించునే స్థితిలో ఆయనలేరు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఏ అమావస్యకో కానీ సొంత నియోజకర్గానికి వెళ్లని చంద్రబాబు ఏవేవో పనులు పెట్టుకుని ఈ రోజు అక్కడికి వెళ్లారు. శాంతిపురం నుంచి రామకుప్పం మధ్యలో చంద్రబాబు వెళ్తున్నారని తెలిసి మఠం దగ్గర మహిళలు కాపుకాశారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు. తీరా చంద్రబాబు వచ్చాకైనా వాళ్లకు అవకాశం దొరికిందా అంటే లేదు. పోలీసులు అంత దూరంలోనే జనాన్ని అడ్డుకుని కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే అనుమతించారు. చంద్రబాబు ఆ వినతిపత్రం తీసుకుని వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలోనే జనం పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల ప్రజల గోడు ఏమి పట్టించుకుంటారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనలో ఆయన ప్రసంగాలు కూడా ఎందుకు వచ్చారో చెప్పకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని విమర్శించడమే సరిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు.