మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్‌ రావడం లేదు కారణం? | periods problem solution doctor Bhavana kasu Gynecologist | Sakshi
Sakshi News home page

మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్‌ రావడం లేదు కారణం?

Published Sun, Aug 27 2023 1:46 PM | Last Updated on Sun, Aug 27 2023 2:50 PM

periods problem solution doctor Bhavana kasu Gynecologist - Sakshi

మా అమ్మాయికి పదమూడేళ్లు. పెద్దమనిషి అయినప్పటి నుంచీ పీరియడ్స్‌ రెగ్యులర్‌గా రావడంలేదు. కారణం ఏంటంటారు? 
– వి. భావన, ఖమ్మం
రజస్వల అయిన 11– 19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో చాలామందిలో నెలసరి క్రమం తప్పడం చూస్తుంటాం. ఈ టైమ్‌లో చాలామందికి బాడీ హార్మోన్స్‌ ఇంబాలెన్స్‌ ఉంటుంది. అధి బీఎమ్‌ఐ .. అంటే అధిక బరువు ఉండి.. 30 దాటినప్పుడు.. థైరాయిడ్, ఫిట్స్, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.. ఫైబ్రాయిడ్స్‌.. సిస్ట్‌లు వంటి గైనిక్‌ సమస్యలు ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది. ఒక్కోసారి నెలలో రెండుసార్లు రావడం.. లేదంటే రెండు నెలలకు ఒకసారి రావడం.. విపరీతమైన నొప్పి.. స్పాటింగ్‌.. రక్తస్రావం తక్కువగా అవడం.. లేదంటే ఎక్కువగా అవడం.. వంటి సమస్యలను చూస్తాం.

పీరియడ్‌ పెయిన్‌ చాలా ఇబ్బంది పెడుతుంది. స్కల్, కాలేజీలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మొదట పారాసిటవల్, డ్రాటిన్‌ వంటి పెయిన్‌ రిలీఫ్‌ మాత్రలను సచిస్తాం. అధిక రక్తస్రావంతో కూడిన ఇర్రెగ్యులర్‌ సైకిల్స్‌ ఉంటే ఒకసారి స్కాన్‌ చేసి సిస్ట్స్‌ ఏమైనా ఉన్నా  అని చెక్‌ చేస్తాం. రెండు .. మూడు నెలలు  ఓరల్‌ కాంట్రాసెప్టివ్‌ పిల్స్‌ ఇస్తే చాలామందిలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నిసార్లు యూరిన్, వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉంటే ఇర్రెగ్యులర్‌ స్పాటింగ్‌ కావచ్చు.

దీనికి ఒకసారి యూరిన్‌ .. థైరాయిడ్‌ టెస్ట్స్‌ చేస్తాం. నెలసరి  21 – 35 రోజుల వరకు రెండుసార్లు వస్తే స్కాన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తాం. చాలామందిలో పీసీఓస్‌ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒవేరియన్‌ హార్మోన్స్‌ స్టడీ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యామం.. పౌష్టికాహారంతో పీసీఓస్‌ని మేనేజ్‌ చెయ్యవచ్చు. 20 ఏళ్లలోపు అమ్మాయిలకు అంతగా మందులు అవసరం లేదు. చిన్న వయసులో హార్మోన్స్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వకూడదు. ముందు సమస్య ఏంటో కనిపెట్టి.. ఆ తర్వాత చికిత్స మొదలుపెట్టడం మంచిది.  

నాకిప్పుడు 55 ఏళ్లు. హాట్‌ ఫ్లషెస్‌ విపరీతంగా ఉంటున్నాయి. హార్మోన్స్‌ ట్రీట్‌మెంట్‌ని సజెస్ట్‌ చేశారు. దానివల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని వద్దనుకుంటున్నాను. మీరు ఆల్టర్‌నేట్‌ ఏదైనా సజెస్ట్‌ చేయగలరా?
– గీత కురువెళ్లి, బెంగళూరు
 మెనోపాజ్‌ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. సాధారణంగా దీన్ని 50 నుంచి 60 ఏళ్ల మధ్య చూస్తాం. ఈ సమయంలో హార్మోన్స్‌ స్థాయిల్లో సమతుల్యం లోపించడం వల్ల రకరకాల సింప్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి. హెచ్‌ఆర్‌టీ హార్మోన్‌ రిప్లేస్‌మెంట్‌ థెరపీ అని.. అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్‌ని మాత్రల రపంలో ఇస్తారు. కానీ ఈ చికిత్స వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌లు తగ్గినందువల్ల స్కిన్‌ చెంజెస్, వెజైనల్‌ డ్రైనెస్, యూరినరీ ఇన్‌ఫెక్షన్, హార్ట్‌ ఇష్యస్‌ వంటివాటిని 50 ఏళ్లు పైబడిన వాళ్లలో చూస్తాం.

ఈ హార్మోన్లను బయట నుంచి సప్లిమెంట్స్‌గా ఇస్తే కొంతమందికి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయి. అందుకే చాలామంది నాన్‌హార్మోనల్‌ ట్రీట్‌మెంట్‌నే కోరుకుంటారు. దీనివల్ల మెనోపాజ్‌ సింప్టమ్స్‌ తగ్గడమే కాకుండా.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా అంతగా కనిపించవు. ఖీఐఆౖఔౖNఉ అనేది అందులో ఒకరకం. దీనిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్‌ , ఆండ్రోజెన్‌ ఉంటాయి. అలసట, నీరసం, లో మూడ్, రాకు వంటి సైకలాజికల్‌ సింప్టమ్స్‌ ఈ ఖీఐఆౖఔౖNఉతో చాలా తగ్గుతాయి. చాలామందిని  మెనోపాజ్‌ తర్వాత ఒకటి రెండేళ్ల వరకు హాట్‌ ఫ్లషెస్‌.. చలి చెమటలు తీవ్రంగా బాధిస్తాయి. వీటిని ట్రీట్‌మెంట్‌తో తగ్గించవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్‌ ఏవైనా ఉన్నాయా అని చెక్‌ చేసి .. తర్వాత కోర్స్‌ ఆఫ్‌ ట్రీట్‌మెంట్‌ని సూస్తాము. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్స్‌తో సింప్టమ్స్‌ తగ్గి.. పరిస్థితి మెరుగుపడుతుంది. 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement