నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్‌గానే వస్తోంది. రొటీన్ స్కాన్‌లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్‌మెంట్ తీసుకోవాలి?
– సీహెచ్. కాత్యాయిని, విజయవాడ
ఒవేరియన్ సిస్ట్‌లు అనేవి ప్రీమెనోపాజ్ ఏజ్‌లో సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్‌తో నిండి ఉన్న సింపుల్ సిస్ట్స్ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్ సిస్ట్ అంటే బ్లడ్, సాలిడ్ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్ సిస్ట్ అంటారు.
నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్ టైమ్‌లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్‌లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్‌కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్ హై రిజల్యుషన్ అల్ట్రాసౌండ్ లేదా సీటీ పెల్విక్ స్కాన్ చేయించండి. సిస్ట్ నేచర్‌ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్ సిస్ట్స్‌కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్ స్కాన్స్ చేస్తాం.
-డా. భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment