gynic problems
-
కలబందతో శానిటరీ న్యాప్కిన్స్ తయారీ..ఆ సమస్యలకు చెక్
పీరియడ్స్.. అందరు అమ్మాయిల జీవితంలో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఇప్పటికీ ఎందుకో ఈ విషయంపై చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు. అదేదో మాట్లాడకూడని సబ్జెక్ట్ అన్నట్లు చూస్తారు. దీని ఆధారంగా బాలీవుడ్లో ప్యాడ్‌మ్యాన్ పేరుతో ఓ సినిమాను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రుతస్రావం, నాప్‌కీన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పీరియడ్స్ సాధారణమే అయినా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు పెట్టే వాళ్లూ లేకపోలేదు. అందుకే కొన్ని కంపెనీల్లో ప్రత్యేకంగా పీరియడ్ లీవ్స్ని కూడా ప్రవేశ పెట్టారు. పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ సమయంలో హైజీన్ మరింత అవసరం. మంచి నాణ్యత కలిగిన ప్యాడ్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ఎంత వరకు ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకమే. కొందరు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఫైబర్ క్లోరిన్‌తో బ్లీచ్ చేస్తారు. దీనివల్ల డయాక్సైన్, ప్రమాదకరమైన కలుషితాలు విడుదలవుతాయి. వీటి కారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు, హార్మోన్ల సమస్యలు, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి శానీటరీ న్యాప్కిన్స్ను వాడాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ మనూ ప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం తాజాగా తక్కువ ధరకే ప్యాడ్స్‌ను అందిస్తోంది. సాధారణంగా ప్యాడ్స్ తయారీకి ఎక్కువ మొత్తంలో కాటన్ అవసరం ఉంటుంది. కానీ వీళ్లు కాటన్ అవసరం లేకుండానే సిసల్(కలబంద)మొక్కను ఉపయోగించి తక్కువ ధరకు ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు. ఇది సాధారణ ప్యాడ్స్ మాదిరిగానే చాలా సాఫ్ట్‌గా ఉంటాయని, అంతేకాకుండా వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చని వివరించారు. -
నెలసరి సమయంలో విపరీతమైన కడుపునొప్పి.. సిస్ట్స్ ఉంటే?
నాకు 45 ఏళ్లు. నెలసరి రెగ్యులర్‌గానే వస్తోంది. రొటీన్ స్కాన్‌లో కుడివైపు ఓవరీలో 4 సెం.మీ సిస్ట్ ఉందని తేలింది. ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? – సీహెచ్. కాత్యాయిని, విజయవాడ ఒవేరియన్ సిస్ట్లు అనేవి ప్రీమెనోపాజ్ ఏజ్‌లో సర్వసాధారణం. రక్తపు అవశేషాలు లేకుండా ఫ్లూయిడ్‌తో నిండి ఉన్న సింపుల్ సిస్ట్స్ ఉంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదమూ ఉండదు. వీటికి ఎలాంటి చికిత్సా అవసరం ఉందు. అండాశయంలో సాధారణంగా అండాలు రెండు నుంచి మూడు సెం.మీ. ఉంటాయి. సిస్ట్ అంటే 3 సెం.మీ. కన్నా ఎక్కువ సైజులో ఉండడం. కాంప్లెక్స్ సిస్ట్ అంటే బ్లడ్, సాలిడ్ కూడా ఉంటాయి. వీటిని ఎండోమెట్రియోమా, డెర్మోయిడ్ సిస్ట్ అంటారు. నెలసరి క్రమం తప్పడం.. పీరియడ్స్ టైమ్‌లో విపరీతమైన కడుపు నొప్పి, యూరిన్లోనూ నొప్పి ఉంటాయి. ఇలాంటి సిస్ట్స్కి చికిత్స అవసరం. అందుకే మీరు ఒకసారి డీటెయిల్డ్ హై రిజల్యుషన్ అల్ట్రాసౌండ్ లేదా సీటీ పెల్విక్ స్కాన్ చేయించండి. సిస్ట్ నేచర్‌ను బట్టి తర్వాత చికిత్స ఉంటుంది. సింపుల్ సిస్ట్స్కి అయితే ఆరునెలలకు ఒకసారి ఫాలో అప్ స్కాన్స్ చేస్తాం. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
''పీరియడ్స్ ప్రాబ్లమ్..పిల్లలు పుట్టే అవకాశం ఉందా?''
నాకు 20 ఏళ్లు. పీరియడ్స్ రెగ్యులర్‌గా రావు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నా సమస్య వల్ల రేపు పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టరేమోనని భయంగా ఉంది. దీనికేమైనా ట్రీట్మెంట్ ఉందా? – పి.రజిత, మామిడిపల్లి నెలసరి రెగ్యులర్‌గా ఉన్నప్పుడు చాలామంది అమ్మాయిలకు ఆరోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. భవిష్యత్తులో గర్భందాల్చే అవకాశాలు కూడా తగ్గవు. ఇరవై ఏళ్ల వయసులో టీనేజ్లోలా కాకుండా శరీరంలోని హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇర్రెగ్యులర్గా రెండు మూడు నెలలకోసారి రావడం లేదా మందులు వాడితేనే గాని రాకపోవడం కనుక ఉంటే, వెంటనే డీటెయిల్డ్ హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. కొందరిలో ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో పాటు మొటిమలు, అవాంఛిత రోమాలు, గడ్డంపైన, పైపెదవిపైన వెంట్రుకలు రావడం, తలమీద జుట్టు రాలిపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ (పీసీఓఎస్) అంటాం. కొందరికి షుగర్, బీపీ కూడా ఉండవచ్చు. అధిక బరువు ఉంటే శరీరంలో కొవ్వులు అసాధారణంగా ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు స్కానింగ్, రక్తపరీక్షలు చేయించుకుని, సమస్యను గుర్తించి తగిన మందులు వాడితే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గకుండా ఉంటాయి. దీనికి మొదటి చికిత్స ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలి అనే చెబుతాం. థైరాయిడ్ సమస్య ఏదైనా ఉందా అని పరీక్షలు చేస్తాం. అలాగే టీబీ వంటి ఇతర ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా పరీక్షిస్తాం. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, యోగా, నడక, డాన్సింగ్, సైక్లింగ్ వంటివి కచ్చితంగా చేయాలి. డైట్ కౌన్సెలర్‌ను సంప్రదించి, ఆహార విషయంలో వారి సలహాలను పాటించాలి. రక్తపరీక్షల రిపోర్ట్స్ బట్టి హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా లేదా నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్ చేయాలా అని గైనకాలజిస్ట్ నిర్ణయం తీసుకుంటారు. ఈ సమస్యకు మూడు నుంచి ఆరునెలల ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. -డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ -
ప్రెగ్నెన్సీలో షుగర్.. తల్లీ, బిడ్డకు ప్రమాదం, ఆ ట్యాబ్లెట్‌తో..
నాకిప్పుడు ఏడో నెల. షుగర్ ఉందని చెప్పారు. Metformin 100mg అనే మాత్రలు వేసుకోమన్నారు. ఇది ప్రెగ్నెన్సీలో వేసుకోవచ్చా? మాత్రలు వేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలి? – పి. కృష్ణశ్రీ, భీమవరం Metformin అనే మాత్రలను ప్రెగ్నెన్సీలో వాడవచ్చు. డయాబెటిస్‌కి ఇది మంచి మెడిసిన్. ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్‌ని 80 శాతం స్ట్రిక్ట్ డైట్‌తో మేనేజ్‌చేస్తారు. కానీ షుగర్ పెరిగినప్పుడు మాత్రలు లేదా ఇన్సులిన్‌ను సజెస్ట్ చేస్తారు. షుగర్ నియంత్రణలో లేకపోతే తల్లికి, బిడ్డకు ప్రమాదం ఉంటుంది. ఈ జెస్టేషనల్ డయాబెటిస్‌ని సులభంగా గుర్తించి .. స్ట్రిక్ట్‌గా హోమ్ మానిటరింగ్ చేసి నియంత్రణలోకి తెస్తే షుగర్ వల్ల తలెత్తే సమస్యల ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద ఉండదు. బిడ్డ అధిక బరువుతో పుట్టడం, ప్రసవమప్పుడు ఇబ్బందులు, అధిక రక్తస్రావం, అత్యవసరంగా ఆపరేషన్ చేయాల్సి రావడం వంటి చాన్సెస్ తగ్గుతాయి. Metformin .. .. షుగర్ మరీ డౌన్ కాకుండా.. hypoglycemia episodes రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇన్సులిన్‌తో ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ఈ మాత్రతో ఉండే ఏకైక ఇబ్బంది.. కడుపు ఉబ్బరం. అందుకే మాత్రలను ఎప్పుడూ తిన్న వెంటనే వేసుకోవాలి. తక్కువ మోతాదులో మొదలుపెట్టి.. నాలుగు రోజులకు మోతాదు పెంచి కావలసిన మోతాదుకు అడ్జస్ట్ చేస్తారు. షుగర్ రీడింగ్స్ నార్మల్ అయితే అదే మోతాదును కొనసాగిస్తారు. రెండు వారాల్లో కంట్రోల్ కాకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ సజెస్ట్ చేస్తారు. మాత్రల విషయానికి వస్తే.. రోజూ ఇంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మానిటరింగ్ చేస్తూ మాత్రల మోతాదును నిర్ధారిస్తారు. -
మా అమ్మాయికి పదమూడేళ్లు... పీరియడ్స్ రావడం లేదు కారణం?
మా అమ్మాయికి పదమూడేళ్లు. పెద్దమనిషి అయినప్పటి నుంచీ పీరియడ్స్ రెగ్యులర్‌గా రావడంలేదు. కారణం ఏంటంటారు? – వి. భావన, ఖమ్మం రజస్వల అయిన 11– 19 ఏళ్ల మధ్య ఆడపిల్లల్లో చాలామందిలో నెలసరి క్రమం తప్పడం చూస్తుంటాం. ఈ టైమ్‌లో చాలామందికి బాడీ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. అధి బీఎమ్ఐ .. అంటే అధిక బరువు ఉండి.. 30 దాటినప్పుడు.. థైరాయిడ్, ఫిట్స్, అనీమియా వంటి ఆరోగ్య సమస్యలున్నప్పుడు.. ఫైబ్రాయిడ్స్.. సిస్ట్లు వంటి గైనిక్ సమస్యలు ఉన్నప్పుడు నెలసరి క్రమం తప్పుతుంది. ఒక్కోసారి నెలలో రెండుసార్లు రావడం.. లేదంటే రెండు నెలలకు ఒకసారి రావడం.. విపరీతమైన నొప్పి.. స్పాటింగ్.. రక్తస్రావం తక్కువగా అవడం.. లేదంటే ఎక్కువగా అవడం.. వంటి సమస్యలను చూస్తాం. పీరియడ్ పెయిన్ చాలా ఇబ్బంది పెడుతుంది. స్కల్, కాలేజీలో ఉన్నప్పుడు మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకే మొదట పారాసిటవల్, డ్రాటిన్ వంటి పెయిన్ రిలీఫ్ మాత్రలను సచిస్తాం. అధిక రక్తస్రావంతో కూడిన ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఒకసారి స్కాన్ చేసి సిస్ట్స్ ఏమైనా ఉన్నా అని చెక్ చేస్తాం. రెండు .. మూడు నెలలు ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తే చాలామందిలో ఈ ప్రాబ్లం తగ్గుతుంది. కొన్నిసార్లు యూరిన్, వెజైనల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇర్రెగ్యులర్ స్పాటింగ్ కావచ్చు. దీనికి ఒకసారి యూరిన్ .. థైరాయిడ్ టెస్ట్స్ చేస్తాం. నెలసరి 21 – 35 రోజుల వరకు రెండుసార్లు వస్తే స్కాన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా అని చూస్తాం. చాలామందిలో పీసీఓస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఒవేరియన్ హార్మోన్స్ స్టడీ చెయ్యాలి. క్రమం తప్పకుండా వ్యామం.. పౌష్టికాహారంతో పీసీఓస్ని మేనేజ్ చెయ్యవచ్చు. 20 ఏళ్లలోపు అమ్మాయిలకు అంతగా మందులు అవసరం లేదు. చిన్న వయసులో హార్మోన్స్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదు. ముందు సమస్య ఏంటో కనిపెట్టి.. ఆ తర్వాత చికిత్స మొదలుపెట్టడం మంచిది. నాకిప్పుడు 55 ఏళ్లు. హాట్ ఫ్లషెస్ విపరీతంగా ఉంటున్నాయి. హార్మోన్స్ ట్రీట్మెంట్ని సజెస్ట్ చేశారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వద్దనుకుంటున్నాను. మీరు ఆల్టర్నేట్ ఏదైనా సజెస్ట్ చేయగలరా? – గీత కురువెళ్లి, బెంగళూరు మెనోపాజ్ అంటే నెలసరి పూర్తిగా ఆగిపోవడం. సాధారణంగా దీన్ని 50 నుంచి 60 ఏళ్ల మధ్య చూస్తాం. ఈ సమయంలో హార్మోన్స్ స్థాయిల్లో సమతుల్యం లోపించడం వల్ల రకరకాల సింప్టమ్స్, ఇబ్బందులు ఉంటాయి. హెచ్ఆర్టీ హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ అని.. అసమతుల్యంగా ఉన్న హార్మోన్స్‌ని మాత్రల రపంలో ఇస్తారు. కానీ ఈ చికిత్స వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు తగ్గినందువల్ల స్కిన్ చెంజెస్, వెజైనల్ డ్రైనెస్, యూరినరీ ఇన్ఫెక్షన్, హార్ట్ ఇష్యస్ వంటివాటిని 50 ఏళ్లు పైబడిన వాళ్లలో చూస్తాం. ఈ హార్మోన్లను బయట నుంచి సప్లిమెంట్స్‌గా ఇస్తే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకే చాలామంది నాన్‌హార్మోనల్ ట్రీట్మెంట్నే కోరుకుంటారు. దీనివల్ల మెనోపాజ్ సింప్టమ్స్ తగ్గడమే కాకుండా.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా అంతగా కనిపించవు. ఖీఐఆౖఔౖNఉ అనేది అందులో ఒకరకం. దీనిలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ , ఆండ్రోజెన్ ఉంటాయి. అలసట, నీరసం, లో మూడ్, రాకు వంటి సైకలాజికల్ సింప్టమ్స్ ఈ ఖీఐఆౖఔౖNఉతో చాలా తగ్గుతాయి. చాలామందిని మెనోపాజ్ తర్వాత ఒకటి రెండేళ్ల వరకు హాట్ ఫ్లషెస్.. చలి చెమటలు తీవ్రంగా బాధిస్తాయి. వీటిని ట్రీట్మెంట్తో తగ్గించవచ్చు. మీకు ఫ్యామిలీ హిస్టరీ క్యాన్సర్స్ ఏవైనా ఉన్నాయా అని చెక్ చేసి .. తర్వాత కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ని సూస్తాము. సాధారణంగా మూడు నెలల నుంచి ఆరు నెలల కోర్స్‌తో సింప్టమ్స్ తగ్గి.. పరిస్థితి మెరుగుపడుతుంది. -
ప్రెగ్నెన్సీ మూడో నెలలో అబార్షన్..మళ్లీ గర్భం వచ్చే ఛాన్స్ ఉందా?
అయిదు నెలల కిందట నాకు మూడో నెల ప్రెగ్రెన్సీ అబార్షన్ అయిపోయింది. డాక్టర్ దగ్గరకేమీ వెళ్లలేదు. తర్వాత నెల నుంచి కూడా మామూలుగానే పీరియడ్స్ వస్తున్నాయి. కానీ కొంచెం కడుపు నొప్పి ఉంటోంది. ఇది అబార్షన్ వల్లే అంటారా? ఇప్పుడు డాక్టర్‌కి చూపించు కోవాలా? మళ్లీ గర్భం వచ్చే చాన్స్ ఉంటుందా? – మమత గ్రేస్, సామర్లకోట ప్రతి అయిదుగురిలో ఒకరికి ఇలా మూడునెలల లోపే గర్భస్రావం అవుతుంటుంది. అయితే ఇది మళ్లీ మళ్లీ రిపీట్ అయ్యే చాన్సెస్ తక్కువ. మళ్లీ గర్భం దాల్చినప్పుడు సక్సెస్ అయ్యే చాన్స్ 90 శాతం పైనే ఉంటుంది. సాధారణంగా.. క్రోమోజోమ్స్, జన్యు లోపాలతో కూడిన పిండం వల్లే గర్భస్రావం అవుతూంటుంది. కానీ ఇలా గర్భస్రావం అయినప్పుడు కచ్చితంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ తప్పకుండా చేయించుకుని అంతా నార్మల్‌గానే ఉందా.. ఏమైనా ముక్కలు ఉండిపోయాయా అని చెక్ చేయడం మంచిది. కడుపు నొప్పి చాలారోజుల వరకు కొనసాగుతుంటే ఇంటర్నల్ వెజైనల్ ఎగ్జామినేషన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని కూడా చెక్ చేయాలి. మీకు మళ్లీ నెలసరి సరిగ్గా వస్తోంది అంటే గర్భసంచికి ప్రాబ్లమ్ ఏమీ లేదు అనే అర్థమవుతోంది. అయితే ఎందుకు మీకు మూడో నెలకు అబార్షన్ అయింది.. ఇప్పుడు కడుపు నొప్పి ఎందుకు వస్తోంది అనేది తేలాలి. ఇందుకు ఒకసారి మీరు డాక్టర్‌ను సంప్రదించాలి. కొన్ని రకాల రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తరువాత ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు మీరు థైరాయిడ్, బ్లడ్ సుగర్ టెస్ట్‌లు చేయించుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి కనీసం నెల ముందు నుంచి ఫోలిక్ యాసిడ్ మాత్రలను తీసుకుంటే మంచిది. పౌష్టికాహారం తప్పనిసరి. అధిక రక్తస్రావం, దుర్వాసన, జ్వరం ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. -
పిజ్జాలు, బర్గర్ల వల్ల మహిళల్లో పీసీఓడీ సమస్యా? అసలెందుకు వస్తుంది?
మాతృత్వం.. మహిళలకు దేవుడిచ్చిన వరం. మరోజీవికి ప్రాణం పోసే అపూర్వమైన అవకాశం. అయితే హార్మోన్ల అసమతుల్యత కారణంగా పలువురు స్త్రీలు ఈ అపురూప భాగ్యానికి దూరమవుతున్నారు. పీసీఓడీ (నీటి బుడగలు) సమస్యలతో నెలసరి గాడి తప్పి గర్భధారణకు నోచుకోలేకపోతున్నారు. అమ్మా అనే పిలుపు కోసం అలమటిస్తున్నారు. పల్లె సీమల్లో కంటే పట్టణా ప్రాంతాల్లోనే బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలో పిల్లలపై ప్రేమను చంపుకోలేక నిత్యం వందల మంది ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు ముట్టజెప్పి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నెలల తరబడి చికిత్సలు పొందుతున్నారు. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. మందులను క్రమం తప్పకుండా వాడడంతోపాటు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తే ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వాస్పత్రులోనే ట్రీట్మెంట్ పొందే వెసులుబాటు ఉందని వెల్లడిస్తున్నారు. ►తిరుపతి ఎమ్మార్పల్లెకు చెందిన కోమల అనే మహిళకు 36ఏళ్లు. ఇంతవరకు సంతానం కలగలేదు. టీవీలో ప్రకటనలు చూసి రెండేళ్ల క్రితం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. రూ.30 వేలు చెల్లించి భార్యభర్తలు అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్ వారి ఫలితాలను పరిశీలించి గర్భధారణ కలగాలంటే ఫీజుగా రూ.5 లక్షలు అడిగారు. ఆ దంపతులు ఖర్చుకు వెనకాడకుండా అడిగినంతా ముట్టజెప్పారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టారు. ► చిత్తూరు మండలానికి చెందిన సుమనప్రియ (28)కు 9ఏళ్ల క్రితం వివాహమైంది. కానీ సంతానం కలగలేదు. తీరా ఆస్పత్రిలో పరీక్షిస్తే.. పీసీఓడీ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె ఓ నాటు వైద్యుడిని ఆశ్రయించారు. ఆరు నెలల పాటు ఆకు మందు తీసుకున్నారు. ఇందుకోసం ప్రతి నెల రూ. 2వేలు చెల్లించారు. అయినప్పటికీ గర్భం రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నార. ► చిత్తూరు నగరం తోటపాళ్యానికి చెందిన దంపతులకు పిల్లలు లేరు. వివాహమై రెండేళ్లు గడుస్తున్నా గర్భం దాల్చకపోవడంతో జిల్లా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు పీసీఓడీ సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో 8నెలల పాటు ఆమెను పర్యవేక్షణలో ఉంచారు. ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ మందులు వాడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 10వ నెలలో ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పీసీఓడీ ఎందుకొస్తుందంటే... ప్రతి స్త్రీలోనూ రుతు క్రమం వచ్చినప్పుడు అండాశయంలో అండం పరిపక్వత చెంది విడుదల అవుతంంది. నెలసరి తర్వాత 11–18 రోజుల మధ్యకాలంలో అండం విడుదల ప్రక్రియ జరుగుతుంది. ఇందుకు ఈస్ట్రోజన్ హార్మోన్ అవసరమవుతుంది. ఈ హార్మోన్ లోపం తలెత్తినప్పుడు క్రమంగా పీసీఓడీకి దారితీస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో విడుదలయ్యే అండం పూర్తి ఎదగక, అది అండాశయంలో నీటి బుడగ రూపంలో ఉండిపోతుంది. అలాగే జీవనశైలిలో వచ్చిన మార్పులు, నిద్రలేమి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, ఎత్తుకు తగ్గ బరువు ఉండకపోవడం, పని ఒత్తిడి, బయట తిండికి అలవాటు పడడం వంటి కారణాలతో కూడా పీసీఓడీ బారినపడుతుంటారని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. లక్షణాలు ఇలా ఉంటాయి నెలసరి సక్రమంగా రాదు ఎక్కువగా బ్లీడింగ్, రుతుక్రమం సమయంలో కడుపు నొప్పి ఉంటుంది అధిక బరువు, ఆకారణంగా జుట్టు రాలడం నెలసరి రాకపోవడంతో ముఖం, కాళ్ల మీద అవాంఛిత రోమాలు పుట్టుకొస్తాయి. బరువు పెరిగిపోతారు. శరరీంలో ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగిపోతుంది. వ్యాధులు ఇలా ఎండోమెట్రియల్ క్యాన్సర్ కొలెస్ట్రాల్ పెరుగుదల అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు గర్భస్రావాలు, సంతాన లేమి మధుమేహం మానసిక జబ్బులు అసాధారణ గర్భాశయ రక్తస్రావం క్రమ రహిత రుతుక్రమం పీసీఓడీని నిర్థారించడానికి గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. వారి సూచనల మేరకు హార్మోన్ల స్థాయిని లెక్కించడానికి రక్త పరీక్షలు చేస్తారు. అండాశయం, గర్భాశయం రూపాన్ని తెలుసుకోవడానికి అ్రల్టాసౌండ్ స్కానింగ్ చేసి నిర్థారిస్తారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే... జీవనశైలిలోని మార్పులు కూడా పీసీఓడీకి కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఫాస్ట్ఫుడ్లు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. విటమిన్ –బి లోపం రాకుండా చేపలు, గుడ్డు, ఆకుకూరలు, క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఇలాచేస్తే నెలసరి క్రమంగా వచ్చి సమస్య నుంచి బయటపడుతారు. దీనికి తగట్టు వ్యాయమం అవసరం. ఫీజులు గుంజేస్తున్నారు.. గతంలో పిల్లలు పుట్టకుంటే వ్రతాలు, నోములు నోచేవాళ్లు. దేవాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. ప్రస్తుతం కార్పొరేట్ మాయాజాలంలో పలువురు దంపతులు కొట్టుకుపోతున్నారు. మాతృత్వం పొందేందుకు రూ.లక్షల్లో ఫీజులు ముట్టుజెబుతున్నారు. పీసీఓడీ సమస్యతో బాధపడేవారిని కార్పొరేట్ ఆస్పత్రుల వారు సైతం యథేచ్ఛగా దోచుకుంటున్నారు. దంపతుల బలహీనతను అడ్డుపెట్టుకుని రూ.3 నుంచి రూ.10లక్షల వరకు ఫీజులు గుంజేస్తున్నారు. చిత్తూరు, తిరుపతి వంటి నగరాల్లో సైతం రూ.లక్షలు వసూలు చేసేస్తున్నారు. మరికొందరు నాటువైద్యం అంటూ అనారోగ్య సమస్యలను తెచ్చుకుంటున్నారు. పీసీఓడీ నివారణకు ప్రభుత్వాస్పత్రిలోనే పూర్తి స్థాయిలో సేవలు ఉన్నాయని వైద్యులు గుర్తు చేస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి మహిళలను ఇటీవల కాలంలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య పీసీఓడీ. దీని బారిన పడితే నెలసరి తప్పడం, అవాంఛిత రోమాలు రావడం ఉంటుంది. గర్బధారణ కూడా ఇబ్బందికరంగా మారుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యంగా వస్తున్న సమస్యలతో ఇలాంటి కేసులు పెరుగుతున్నాయి. గర్బధారణకు చికిత్స పేరుతో మోసపోకండి. నాటు మందుల జోలికి వెళ్లొద్దు. సంబంధిత డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. ఇందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నారు. – డాక్టర్ ప్రభావతిదేవి, డీఎంహెచ్ఓ, చిత్తూరు నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పీసీఓడీ అనేది 14–45 ఏళ్ల లోపు ఉన్న మహిళల్లో అధికంగా వస్తోంది. ఈ మధ్య కాలంలో పీసీఓడీ కేసులు పెరిగాయి. చాలా మందికి పని ఒత్తిడి, టీవీలు, మొబైల్ ఫోన్లు గంటల తరబడి చూడడం. పిజ్జాలు, బర్గర్లు తినడం. బరువు పెరగడం కారణంగా పీసీఓడీ సమస్య తలెత్తుతోంది. లక్షణాలు బట్టి లేదా..వివాహమై ఏడాది గడిచినా గర్భధారణ జరగకుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. నిర్లక్ష్యం వహిస్తే సమస్యలు తప్పవు. – డాక్టర్ ఉషశ్రీ, గైనకాలజిస్ట్, చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి -
తొలిసారి సిజేరియన్... రెండోసారీ తప్పదా? తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు..
మొదటిసారి సిజేరియన్ చేసి బిడ్డను తీస్తే... అదే మహిళకు రెండోసారి ప్రసవంలోనూ సిజేరియన్ తప్పదనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ అది సరికాదు. రెండోసారి నార్మల్ డెలివరీకి అవకాశం ఉందా లేక సిజేరియనే అవసరమా అనే అంశం చాలా విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మొదటి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎన్నో నెలలో చేశారు వంటివి. ఎందుకు... అన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే... మొదటిసారి బిడ్డ ఎదురుకాళ్లతో ఉందనుకుందాం. కానీ... ఈసారి డెలివరీ టైమ్‌కు ఒకవేళ బిడ్డ తల కిందివైపునకు తిరిగి ఉంటే సిజేరియన్ తప్పనిసరి కాకపోవచ్చు. మొదటిసారి బిడ్డ చాలా బరువు ఉండి... ఆ బిడ్డ ప్రసవం అయ్యే మార్గంలో సాఫీగా వెళ్లే అవకాశం లేదనీ, తత్ఫలితంగా మామూలుగా ప్రసవం అయ్యే పరిస్థితి లేదని డాక్టర్ నిర్ధారణ చేస్తే మొదటిసారి సిజేరియన్ చేస్తారు. అదే ఈసారి బిడ్డ బరువు సాధారణంగా ఉండి, ప్యాసేజ్ నుంచి మామూలుగానే వెళ్తుందనే అంచనా ఉంటే మామూలు డెలివరీ కోసం ప్రయత్నించవచ్చు. అయితే కొందరిలో బిడ్డ బయటకు వచ్చే ఈ దారి చాలా సన్నగా (కాంట్రాక్టెడ్ పెల్విస్) ఉంటే మాత్రం సిజేరియన్ తప్పదు. తల్లి ఎత్తు 135 సెం.మీ. కంటే తక్కువ ఉన్నప్పుడు, ఆమె బిడ్డ బయటకు వచ్చే దారి అయిన ‘పెల్విక్ బోనీ క్యావిటీ’ సన్నగా ఉండే అవకాశాలు ఎక్కువ. ఇలాంటివారిలో చాలాసార్లు సిజేరియన్ ద్వారానే బిడ్డను బయటకు తీయాల్సి రావచ్చు. ఈ అంశాలను బట్టి మనకు తెలిసేదేమంటే... మొదటిసారి సిజేరియన్ అయినంత మాత్రాన రెండోసారి కూడా తప్పనిసరిగా సిజేరియనే అవ్వాల్సిన నియమం లేదు. మొదటి గర్భధారణకూ, రెండో గర్భధారణకూ మధ్య వ్యవధి తప్పనిసరిగా 18 నెలలు ఉండాలి. ఎందుకంటే మొదటిసారి గర్భధారణ తర్వాత ప్రసవం జరిగాక దానికి వేసిన కుట్లు పూర్తిగా మానిపోయి, మామూలుగా మారడానికి 18 నెలల వ్యవధి అవసరం. ఒకవేళ ఈలోపే రెండోసారి గర్భం ధరిస్తే మొదటి కుట్లు అంతగా మానవు కాబట్టి అవి చిట్లే ప్రమాదం ఉంది. అలా జరిగితే బిడ్డకే కాదు... తల్లి ప్రాణానికీ ప్రమాదం. చదవండి: Fashion: డిజైన్లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి! Cancer Awareness: రొమ్ము నుంచి నీరులాంటి స్రావాలా? లోదుస్తులు బాగా బిగుతుగా ఉంటే.. -
బాలింతగా ఉన్నప్పుడు అలా చేయొచ్చా? సలహా ఇవ్వండి..
నేను నెల్లాళ్ల కిందట ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాను. ఇటీవలే డెలివరీ అయి, పాప పుట్టింది. బాలింతగా ఉన్నప్పుడు వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవచ్చా? ఒకవేళ తీసుకుంటే పాటించాల్సిన జాగ్రత్తలు ఏమిటి? వివరించగలరు. –శ్రావ్య, నకిరేకల్ బాలింతలు ఎప్పుడైనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు కాని, రెండో డోసు కాని తీసుకోవచ్చు. అందరిలో లాగానే కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాలింతల్లో కూడా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, చలిగా ఉన్నట్లు ఉండటం, ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర కొద్దిగా నొప్పి, వాపు వంటి చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు. అలా ఉంటే లక్షణాలను బట్టి పారాసెటిమాల్ మాత్రలు రోజుకు రెండు మూడుసార్లు వేసుకోవచ్చు. ఆ సమయంలో బిడ్డకు మామూలుగానే తల్లిపాలు పట్టించవచ్చు. అంతకంటే పెద్దగా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం లేదు. తల్లి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఏర్పడే యాంటీబాడీస్ తల్లి పాల ద్వారా బిడ్డకు చేరి, బిడ్డకు కరోనా వ్యాధి రాకుండా కాపాడతాయి. కాబట్టి వేరే భయాలేవీ పెట్టుకోకుండా కోవిషీల్డ్ రెండో డోసు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. నా వయసు 23 ఏళ్లు, ఎత్తు 5.2, బరువు 49 కిలోలు. ఏడాది కిందట పెళ్లయింది. ఇప్పుడు నాకు మూడో నెల. ఏ కాస్త తిన్నా వెంటనే వాంతులు అవుతున్నాయి. ప్రెగ్నెన్సీ మొదటి నెలల్లో ఇదంతా మామూలేనని చెబుతున్నారు. తిన్న ఆహారమేదీ కడుపులో ఇమడకుండా ఉంటే కడుపులో బిడ్డకు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – కీర్తి, ఏలూరు గర్భందాల్చిన తర్వాత చాలామందికి మొదటి మూడు నెలల్లో పెరిగే పిండం నుంచి విడుదలయ్యే హెచ్‌సీజీ హార్మోన్ మోతాదును బట్టి, దాని ప్రభావం వల్ల వికారం, నీరసం, వాంతులు వంటి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. చాలామంది తింటే ఎలాగూ వాంతి అయిపోతుందని తినడానికే భయపడతారు. తినకపోవడం వల్ల ఎసిడిటీ, అజీర్తి ఏర్పడి ఇంకా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి వాంతులు అయినా ఫర్వాలేదు అనుకుని కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండాలి. అందులో కొద్దిగా అయినా ఆహారం పొట్టలోకి చేరుకుంటుంది. ఆహారంలో భాగంగా ఎక్కువగా కొబ్బరినీళ్లు, ఎలక్ట్రాల్, గ్లూకోన్–డి, మజ్జిగ, పెరుగు లస్సీ, పండ్లరసాలు, పండ్లు వంటివి తీసుకోవచ్చు. ఆహారంలో నూనెవస్తువులు, పచ్చళ్లు, కారాలు, మసాలాలు, కాఫీ, టీ, కూల్డ్రింకులు వంటివి తీసుకోకపోవడం మంచిది. గైనకాలజిస్టును సంప్రదించి, వాంతులు తగ్గడానికి డాక్సినేట్, ఓన్‌డన్‌సెట్రాన్ వంటి మందులను తగిన మోతాదులో వాడుకోవడం వల్ల వాంతులు అదుపులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాంతులు ఎక్కువ అయిపోయి మరీ నీరసంగా ఉంటే, అవసరాన్ని బట్టి గ్లూకోజ్ సెలైన్లు పెట్టించుకోవాల్సి రావచ్చు. చాలావరకు మొదటి మూడునెలల్లో ఎక్కువ వాంతుల వల్ల బిడ్డ పెరుగుదలకు పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కాబట్టి మీరు కంగారు పడకుండా పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ, గైనకాలజిస్టును సంప్రదించి తగిన మందులు తీసుకోవడం మంచిది. - డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: 120 కేజీల బరువున్న బాలికతో రోజుకు 3 వేల స్కిప్పింగ్‌లు.. చివరికి.. -
14 ఏళ్లకు మెచ్యూర్ అయ్యాను, పీరియడ్ వచ్చినప్పుడల్లా విపరీతమైన నొప్పి.. తగ్గేదెలా?
నా వయసు 22 సంవత్సరాలు. నేను 14 ఏళ్ల వయసులో మెచ్యూర్ అయ్యాను. నాకు రెగ్యులర్‌గా 45 రోజులకు పీరియడ్స్ వస్తాయి. వచ్చినప్పుడల్లా మొదటి రోజు విపరీతంగా కడుపునొప్పి ఉంటుంది. పీరియడ్స్‌లో కడుపు నొప్పి సాధారణమే అయినా, ఇలా విలవిలలాడేంతగా ఉండదని, ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? – శ్రుతి, విజయవాడ పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వల్ల గర్భాశయ కండరాలు బాగా కుదించుకున్నట్లయి, అది పట్టి వదిలేస్తూ బ్లీడింగ్ బయటకు వస్తుంది. ఇది కొందరిలో పొత్తికడుపు నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి ప్రోస్టాగ్లాండిన్స్ విడుదలవ్వచ్చు. అవి విడుదలయ్యే మోతాదును బట్టి వాటి ప్రభావం వల్ల పీరియడ్స్‌లో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కొందరిలో నొప్పి కొద్దిగా ఉంటుంది. కొందరిలో నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే పీరియడ్స్ సమయంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీని ప్రభావం వల్ల గర్భాశయం లోపలి ఎండోమెట్రియమ్ పొరకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కుంచించుకుపోయి, ఎండోమెట్రియమ్ పొర ఊడిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కూడా పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండే అవకాశాలు ఉంటాయి. పైన చెప్పిన కారణాల వల్ల వచ్చే పీరియడ్స్ నొప్పి వల్ల ఇబ్బందులేమీ ఉండవు. కాకపోతే నొప్పి విపరీతంగా ఉన్నప్పుడు నొప్పి నివారణ మందులు వాడుకోవచ్చు. అలాగే ఆ సమయంలో పొత్తికడుపు మీద వేడి కాపడం పెట్టవచ్చు. యోగా, ప్రాణాయామం వంటి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా ఉపశమనం దొరుకుతుంది. కాకపోతే కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, ఇన్ఫెక్షన్స్, చాక్లెట్ సిస్ట్స్, అండాశయంలో సిస్ట్లు వంటి అనేక కారణాల వల్ల పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో విపరీతమైన నొప్పి, నడుం నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, పెల్విక్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని, సమస్య ఏదైనా ఉందా లేదా తెలుసుకోవడం మంచిది. సమస్య ఉంటే దానికి తగిన చికిత్స తీసుకోవచ్చు. సమస్య ఏమీ కనిపించకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. నా వయసు 28 ఏళ్లు. నాకు పీసీఓడీ సమస్య ఉంది. పెళ్లయి ఆరేళ్ళయినా ఇంతవరకు పిల్లలు లేరు. డాక్టర్‌ను సంప్రదిస్తే ఫోలిక్ యాసిడ్ మాత్రలు, ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు రాసిచ్చారు. నాలుగు నెలలు వాడినా ఫలితం ఏమీ కనిపించలేదు. నా సమస్యకు ఎలాంటి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది? – సౌజన్య, గుత్తి గర్భాశయం రెండువైపులా ఉండే అండాశయాల్లో హార్మోన్ల అసమతుల్యత, జన్యుపరమైన కారణాలు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల అనేక చిన్న చిన్న అండాలు ఉండే ఫాలికిల్స్ పెరగకుండా నీటిబుడగల్లా ఏర్పడతాయి. వీటినే పీసీఓడీ (పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇందులో మగవారిలో ఎక్కువగా విడుదలయ్యే టెస్టోస్టిరాన్ వంటి ఆండ్రోజన్ హార్మోన్లు ఆడవారిలో విడుదలవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, అండం సరిగా పెరగకపోవడం వంటి సమస్యలు ఏర్పడి, దాని వల్ల పిల్లలు కలగడానికి ఇబ్బంది అవుతుంది. ఇందులో చికిత్సలో భాగంగా హార్మోన్ల అసమతుల్యత ఇంకా పెరగకుండా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ మాత్రలు ఇవ్వడం జరుగుతుంది. ఇవి వాడే సమయంలో గర్భం రాదు. అవి కొన్ని నెలలు వాడిన తర్వాతే అండం పెరగడానికి మందులు వాడుతూ గర్భం కోసం ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో కాంట్రాసెప్టివ్ మందులతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేస్తూ, మితమైన ఆహార నియమాలు పాటిస్తూ, బరువు ఎక్కువగా ఉంటే బరువు తగ్గడం వల్ల కూడా అవి ఆపేసిన కొన్ని నెలల తర్వాత హార్మోన్ల అసమతుల్యత తగ్గి, గర్భం అదే నిలుస్తుంది. ఒకవేళ ఆలస్యం అవుతుంటే అప్పుడు అండం పెరగడానికి, గర్భం నిలవడానికి మందులతో చికిత్స తీసుకోవచ్చు. బిడ్డలో కొన్ని అవయవ లోపాలు రాకుండా ఉండటానికి ఫోలిక్‌యాసిడ్ మాత్రలను గర్భం కోసం ప్రయత్నం చేసే మూడు నాలుగు నెలల ముందు నుంచే వాడమని సలహా ఇవ్వడం జరుగుతుంది. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
లాక్డౌన్ ఎఫెక్ట్: 18.5 లక్షల అబార్షన్లు
హైదరాబాద్: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రులన్ని కరోనా రోగుల చికిత్సకే అధిక ప్రాధాన్యత ఇచ్చాయి. ఈ క్రమంలో లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా 18.5 లక్షల అబార్షన్లు గైనకాలజిస్ట్ సలహా లేకుండానే జరిగాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మహిళలల్లో సురక్షిత, చట్టబద్ధమైన అబార్షన్ల గురించి అవగాహన కల్పించే ఐపాస్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) ఈ సర్వేను నిర్వహించింది. లాక్డౌన్ మొదటి మూడు దశల్లో మహిళలకు అందిన వైద్య సౌకర్యాలపై ఈ సర్వే దృష్టి పెట్టింది. లాక్డౌన్1, 2 దశల్లో(మార్చి 25 నుంచి మే 3 వరకు) 59 శాతం మహిళలకు అబార్షన్ అంశంలో ఆస్పత్రికి వెళ్లడం, వైద్యులను కలవడం వంటి సదుపాయాలు లభించలేదని తెలిపింది. అన్‌లాక్ దశలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందని.. ఈ సంఖ్య 33 శాతానికి పడిపోయిందని సర్వే తెలిపింది. (సర్కారు దవాఖానాల్లో దారుణం) ఈ క్రమంలో ఐడీఎఫ్ సీఈఓ వినోజ్ మానింగ్ మాట్లాడుతూ.. ‘18.5 లక్షల మంది మహిళలకు అబార్షన్ విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో.. కెమిస్ట్ అవుట్లెట్లలో అవసరమైన సౌకర్యాలు, సదుపాయాలు లభించలేదు. కరోనా మహమ్మారిగా మారినందున వైద్య సిబ్బంది పూర్తి శ్రద్ధ, కృషి వైరస్ నియంత్రణ మీదనే ఉంది. ఫలితంగా మిగతా వైద్య సేవలు, ముఖ్యంగా సురక్షితమైన గర్భస్రావం వంటి సేవలకు అంతరాయం కలిగింది. మెజారిటీ ప్రజారోగ్య సౌకర్యాలు, వైద్య సిబ్బంది కోవిడ్-19 చికిత్సలపై దృష్టి సారించారు. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రులు మూసివేశారు. దాంతో సురక్షితమైన గర్భస్రావం పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి’ అని తెలిపారు. అంతేకాక ‘ఇది చాలా సున్నితమైన అంశం. సురక్షితమైన గర్భస్రావ సేవలను కోరుకునే మహిళలను లాక్డౌన్ ఆంక్షలు ఎలా ప్రభావితం చేశాయో తెలపడమే గాక.. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు ఈ విషయంలో దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ఈ అధ్యయనం జరిగింది అని వినోజ్ మానింగ్ తెలిపారు. (కరోనా మృత్యుపాశం) -
గర్భధారణ, వృషణాల సమస్యలపై కౌన్సెలింగ్..
చెమటకాయల్లా కనిపిస్తున్నాయి... ఏం చేయాలి? నా వయసు 28. నా పురుషాంగం మీద, వృషణాల మీద చిన్న చిన్న చెమటకాయల్లా వచ్చాయి. వాటి సైజ్ క్రమంగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించుకున్నాను. సబేషియస్ సిస్ట్స్ అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయిస్తే ఇవి తగ్గుతాయా? అవి కనిపించినప్పట్నుంచి నాలో అంగస్తంభనలు కూడా లేవు. నేను పెళ్లి చేసుకోవచ్చా? భవిష్యత్తులో సంసారజీవితానికి పనికివస్తానా? తగిన సలహా ఇవ్వండి. - బి.వి.ఆర్., అనంతపురం వృషణాల మీద ఉన్న చర్మంపై తెల్లటి పచ్చటి రంగుల్లో బుడిపెల్లాగా వచ్చే వాటిని సబేషియస్ సిస్ట్స్ అంటారు. ఇవి పూర్తిగా చర్మం పైపొర నుంచే వస్తాయి. సబేషియస్ సిస్ట్స్తో పాటు ఆ కొద్దిపాటి చర్మాన్ని తీసివేస్తే అది పూర్తిగా నయమయినట్లే. కాకపోతే... ఇలాంటి వి చాలా ఉన్నప్పుడు వాటిననన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. ఎన్ని తొలగించినా - అది కేవలం చర్మం పైభాగం మాత్రమే కాబట్టి వృషణాలకు గాని, అంగస్తంభనలకు గాని, వీర్యం తయారీకి గాని ఈ సర్జరీతో ఏమాత్రం సంబంధం ఉండదు. కాకపోతే ఇవి మళ్లీ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు మళ్లీ వాటిని తొలగించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ తర్వాత మామూలుగానే సెక్స్ చేయవచ్చు. దీనికీ... పిల్లలు కలగడానికి ఏమాత్రం సంబంధం లేదు. మీరు నిర్భయంగా పెళ్లి చేసుకోవచ్చు. మీకు అంగస్తంభనలు లేకపోవడానికి కారణం కేవలం మానసికంగా కలిగిన జంకు మాత్రమే. నాకు 25 ఏళ్లు. ఈమధ్యనే పెళ్లయ్యింది. ఈమధ్య ఒకసారి సెక్స్ చేశాక వీర్యంలో కొంచెం రక్తం వచ్చింది. ఆ తర్వాత ఒకసారి హస్తప్రయోగంలో కూడా రక్తం వచ్చింది. అయితే అంగస్తంభనలు బాగానే ఉంటున్నాయి. ఇలా వీర్యంలో రక్తం రావడానికి కారణం ఏమిటి? నాకు భయంగా ఉంది. తగిన సలహా ఇవ్వండి. - ఎస్.ఆర్.డి., తాడేపల్లిగూడెం మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకిలా వీర్యంలో రక్తం రావడం పెద్ద ప్రమాదకరమైన పరిస్థితి కాకపోవచ్చు. వీర్యంలో ఇన్ఫెక్షన్ ఉన్నా, టీబీ ఉన్నా, వీర్యం వచ్చే మార్గంలో నీటిబుడగలు (సిస్ట్స్) ఉన్నా, ఏవైనా గడ్డలు ఉన్నా ఇలా వీర్యంతో పాటు రక్తం రావచ్చు. కాని ఎక్కువమందిలో ఇలా జరగడానికి ఏ కారణం కనిపించదు. చికిత్స చేసినా చేయకపోయినా ఈ పరిస్థితి దానంతట అదే తగ్గిపోవచ్చు. ఆందోళన పడాల్సిందేమీ లేదు. చాలావరకు అది నిరపాయకరమైన సమస్యే అవుతుంది. మీరు ఒకసారి యూరిన్ పరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని యూరాలజిస్ట్‌ను కలవండి. -డాక్టర్ వి.చంద్రమోహన్, యూరోసర్జన్, ఆండ్రాలజిస్ట్, ప్రీతి యూరాలజీ - కిడ్నీ హాస్పిటల్, కెపిహెచ్బి, హైదరాబాద్ గర్భధారణ సమయంలో ఎందుకీ నీరసం..? నాకు ఇప్పుడు ఐదో నెల. కాళ్లవాపులు కూడా కనిపిస్తున్నాయి. అదేమన్నా ప్రమాద హేతువా? గత కొంత కాలంగా ఏ చిన్నపని చేసినా అలసిపోతున్నాను. నా అలసట తగ్గడానికి ఏం చేయాలి? - సునంద, చీపురుపల్లి మీరు చెప్పిన లక్షణాలతో గతంలోనూ, ఇప్పుడూ మీకు రక్తహీనత (అనీమియా) ఉండవచ్చని తెలుస్తోంది. మనదేశంలో రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణం. రక్తహీనత అనే కండిషన్లో రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే తొందరగా అలసిపోవడం, నిస్సత్తువగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్‌కు సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) చేయించాలి. ఈ పరీక్ష ద్వారా రక్తహీనత తీవ్రతతో పాటు దానికి కారణం కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తదుపరి పరీక్షలను నిర్ణయిస్తారు. ఇక చికిత్స విషయానికి వస్తే రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం, అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది చాలా సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 16వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే బాగా రక్తం పడుతుంది. అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మొదట కాస్త టిఫిన్ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తుంటాం. దీంతో రక్తం బాగాపడుతుంది. ఇక మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ డాక్టర్‌ను సంప్రదించి, ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేయించుకుని, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకుంటే, దాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోండి. ఇక రక్తహీనత నివారణ కోసం... మాంసాహారం తినేవారైతే మాంసం, కాలేయం, చేపలు... శాకాహారం తినేవారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినాలి. దాంతో రక్తం బాగా పడుతుంది. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి
నా వయసు 15. రెండేళ్ల క్రితం మెన్సెస్ రావడం మొదలైంది. అప్పట్నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదమా? భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి. - ధరణి, ఏలూరు రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలామంది యువతుల్లో ఇది కనిపించడం మామూలే. దీన్ని చాలామంది ఒక జబ్బుగానో, లోపంగానో పరిగణిస్తారు. పిల్లలు పుడతారో లేదోనని అపోహలు పెంచుకుంటారు. అయితే ఇది చాలా సహజమైన అంశం. చాలామంది యువతులు పీరియడ్స్ సమయాన్ని అండం విడుదలైన దశగా (ఓవ్యులేషన్ పీరియడ్‌గా) భావిస్తారు. కానీ... నిజానికి దీనికి 14 రోజుల ముందే అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందే ఓవ్యులేషన్ పీరియడ్. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం అన్నది పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ ఓవ్యులేటెడ్ పీరియడ్‌గా పరిగణించాలి. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతుల్లో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే నొప్పి తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి పన్నెండు గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. ఇలా రుతుసమయంలో వచ్చే నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా అలాగే వస్తున్నా, లేదా నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి తగ్గనంతటి తీవ్రతతో వస్తున్నా, లేదా పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... డాక్టర్‌ను సంప్రదించండి. అంతేతప్ప పైన పేర్కొన్నట్లు సాధారణంగా వచ్చే రుతు సమయపు నొప్పి గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్