పనిప్రదేశాల్లో పాలివ్వడం తప్పేమి కాదు: సుప్రీం కోర్టు | Supreme Court: Breastfeeding In Public And Work Places Shouldnt Be Stigmatised | Sakshi
Sakshi News home page

పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు: సుప్రీం కోర్టు

Published Tue, Mar 4 2025 2:25 PM | Last Updated on Tue, Mar 4 2025 5:22 PM

Supreme Court: Breastfeeding In Public And Work Places Shouldnt Be Stigmatised

పనిప్రదేశాల్లో తల్లి తన బిడ్డకు పాలివ్వడం తప్పేమి కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. మహిళల గౌరవానికి భంగం కలిగించే పద్ధతులను త్యజించాలని స్పష్టం చేసింది. పాలిచ్చే తల్లలుకు తమ బిడ్డ సంరక్షణలో అది భాగమని, దాన్ని అందరూ గౌరవించాలని పేర్కొంది. అది వారి హక్కు కూడా కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో, పనిప్రదేశాల్లో తల్లి బిడ్డకు పాలివ్వడాన్ని తప్పుపట్టొద్దని ధర్మాసనం వెల్లడించింది. 

ఈ మేరకు ప్రభుత్వ స్థలాలు, భవనాల్లో చైల్డ్‌ కేర్‌ గదుల ఏర్పాటకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సలహాలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ దాఖలైన పిటిషన్‌పై  జస్టిస్‌లు బి.వి. నాగరత్న, పి.బి. వరలేలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. అంతేగాదు ఇలా బహిరంగ ప్రదేశాల్లోనూ, పనిప్రదేశాల్లోనూ తల్లిపాలివ్వడాన్ని అవమానకరంగా చూస్తే..మహిళలు అనవసరమైన ఒత్తిడి లేదా బెదిరింపులకు గురవ్వుతారంటూ యూఎన్‌ నివేదికను వెల్లడించింది. 

అలాగే తల్లిపాలిచ్చే హక్కుని గురించి కూడా నొక్కి చెప్పింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అంతర్జాతీయ చట్టంలో పొందుపరిచిన  పిల్లల ప్రయోజనాలు, అనే ప్రాథమిక సూత్రం, 2015 జువైనల్‌ జస్టిస్‌(పిల్లల సంరక్షణ )చట్టంల నుంచి ఈ హక్కు ఉద్భవించిందని ధర్మాసనం తెలిపింది. అంటే అందుకు తగిన సౌకర్యాలు, వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత రాష్ట్రలపై ఉందని దీని అర్థం అని కూడా స్పష్టం చేసింది. 

ఈ విషయంలో ఫిబ్రవరి 27, 2024న కేంద్ర మహిళా-శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రభుత్వ భవనాల్లో ఫీడింగ్‌ గదులు, క్రెచ్లు వంటి వాటి కోసం స్థలాలు కేటాయించాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలను కోరుతూ ఆదేశించిన సలహాను ధర్మాసనం పరిగణలోకి తీసుకుని ఇలా తీర్పుని వెల్లడించింది. అంతేగాదు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15(3) కింద ఉన్న ప్రాథమిక హక్కులకు అనుగుణంగా కేంద్రం సలహా ఉందని కూడా పేర్కొంది ధర్మాసనం. 

ఇది తల్లలు గోప్యత, శివువుల ప్రయోజనార్థం సూచించన సలహాగా పేర్కొంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్య తీసుకుంటే తల్లి బిడ్డల గోప్యతకు భంగం వాటిల్లకుండా చేయడం సులభతరమవుతుందని తెలిపింది. అందువల్ల, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఆర్డర్ కాపీతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శి/నిర్వాహకుడికి రిమైండర్ కమ్యూనికేషన్ రూపంలో పైన పేర్కొన్న సలహాను చేర్చాలని సూచించింది. తద్వారా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్రం జారీ చేసిన ఈ సలహాలను పాటిస్తాయిని పేర్కొంది ధర్మాసనం. 

దీంతోపాటు ప్రస్తుత ప్రజా ప్రదేశాలలో సాధ్యమైనంతవరకు, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు పైన పేర్కొన్న ఆదేశాలు అమలులోకి వచ్చేలా చూసుకోవాలని కూడా పేర్కొంది. అలాగే అన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సలహాలు తెలియజేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరింది ధర్మాసనం. 

(చదవండి: జాతీయ భద్రతా దినోత్సవం: భద్రంగా ఉంటున్నామా..?)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement