మహిళల గోడు వినని చంద్రబాబు
చిత్తూరు: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంవ ప్రజల గోడునే పట్టించుకోవడంలేదు. మహిళల సమస్యలు వినడానికి కూడా ఆయన సిద్దంగాలేరు. చంద్రబాబు మాటలు వింటే కోటలు దాటుతాయి. సొంత ప్రజల గోడు కూడా పట్టించునే స్థితిలో ఆయనలేరు.
చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఏ అమావస్యకో కానీ సొంత నియోజకర్గానికి వెళ్లని చంద్రబాబు ఏవేవో పనులు పెట్టుకుని ఈ రోజు అక్కడికి వెళ్లారు. శాంతిపురం నుంచి రామకుప్పం మధ్యలో చంద్రబాబు వెళ్తున్నారని తెలిసి మఠం దగ్గర మహిళలు కాపుకాశారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసులు వాళ్లను అడ్డుకున్నారు.
తీరా చంద్రబాబు వచ్చాకైనా వాళ్లకు అవకాశం దొరికిందా అంటే లేదు. పోలీసులు అంత దూరంలోనే జనాన్ని అడ్డుకుని కేవలం ఇద్దరు ముగ్గురిని మాత్రమే అనుమతించారు. చంద్రబాబు ఆ వినతిపత్రం తీసుకుని వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలోనే జనం పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగతా ప్రాంతాల ప్రజల గోడు ఏమి పట్టించుకుంటారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పర్యటనలో ఆయన ప్రసంగాలు కూడా ఎందుకు వచ్చారో చెప్పకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని విమర్శించడమే సరిపోయిందని పలువురు విమర్శిస్తున్నారు.