రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్‌ | YSRCP MLC Bharat On Fake cases Against Him At Kuppam | Sakshi
Sakshi News home page

రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్‌

Published Tue, Aug 6 2024 4:05 PM | Last Updated on Tue, Aug 6 2024 5:05 PM

YSRCP MLC Bharat On Fake cases Against Him At Kuppam

సాక్షి, కుప్పం: తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారు వైఎస్సార్‌సీపీ కుప్పం ఎమ్మెల్సీ కేఆర్‌జే భరత్‌. తాను ఒక బ్యూరోక్రట్‌ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్‌ అధికారి అని తెలిపారు. ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు.

తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్‌ఓ ఎవరూ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని అన్నారు భరత్‌. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేసి అప్రతిష్టపాలు జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. 

తనపై జరుగుతున్న కుట్రలను కచ్చితంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అసలు తనపై  ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు? అవన్నీ ఆరా తీస్తానని చెప్పారు. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తన వీడియో సందేశంలో తెలిపారాయన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement