Srivari Temple
-
తిరుమల వెంకన్నస్వామికి ఘోర అపచారం
సాక్షి, తిరుపతి: కూటమి సర్కార్ పాలనలో తిరుమల వెంకన్న స్వామికి ఘోర అపచారం జరిగింది. శ్రీవారి ఆలయ నిబంధనలకు మంత్రి సవిత భద్రతా సిబ్బంది తూట్లు పొడిచారు. వెంకటేశ్వరస్వామి దర్శనానికి మంత్రి సవిత రాగా, ఆలయ ఆవరణలోకి ఆమె భద్రతా సిబ్బంది షూతో వచ్చారు. పాదరక్షలతో ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టారు. మంత్రి సెక్యూరిటీపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ పర్యవేక్షణ లోపంపై కూడా భక్తులు మండిపడుతున్నారు.కాగా, అక్టోబర్ నెలలో తిరుమల అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అన్న ప్రసాదంలో జెర్రి రావడంతో అది తింటున్న భక్తుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. మాధవ నిలయం-2 అన్న ప్రసాద కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై సదరు భక్తులు.. అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల అన్న ప్రసాదం విషయంలో ప్రభుత్వం, టీటీడీ నిర్లక్ష్యం బట్టబయలైంది.ఇదీ చదవండి: బీఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు -
రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్
సాక్షి, కుప్పం: తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారు వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు. ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు.తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని అన్నారు భరత్. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేసి అప్రతిష్టపాలు జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలను కచ్చితంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అసలు తనపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు? అవన్నీ ఆరా తీస్తానని చెప్పారు. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తన వీడియో సందేశంలో తెలిపారాయన. -
TTD: శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 16వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది.ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు. -
తిరుమలలో తెరుచుకున్న శ్రీవారి ఆలయం తలుపులు
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకుంది. గ్రహణం కారణంగా నిన్న రాత్రి ఆలయ ద్వారాలను మూసివేశారు. గ్రహణ కాలంలో కిరణాలు సోకడం కారణంగా చెడు ఫలితాలు ఉంటాయని ఆలయాలు మూసివేస్తారు. ఉదయం 3:15 నిముషాలకు ఆలయ ద్వారాలు తెరిచి పుణ్యాహవచనం చేసి, ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, అర్చన, తోమాల సేవలను నిర్వహించారు. ఉదయం 5 గంటల నుండి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుంది. నిన్న 47 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకొని, హుండీ ద్వారా 3.03 కోట్లు ఆదాయం వచ్చింది. #WATCH | Tirupati, Andhra Pradesh: After the lunar eclipse, the Tirumala Tirupati Devasthanam officials reopened the Sri Venkateswara Shrine doors on Sunday morning, cleaned the temple according to 'Shastras' and started the Suprabhata Seva. Temple Deputy EO Lokanadam, Peskar… pic.twitter.com/JpyirpnnyR — ANI (@ANI) October 29, 2023 -
శ్రీవారి ఆలయ అలంకరణకు వీవీఎస్ లక్ష్మణ్ విరాళం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వీవీఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు. దాదాపు రూ.14 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టీటీడీ ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల కట్ ప్లవర్స్ అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధగా గమనించారు. చదవండి: ‘గగన్‌యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ -
తిరుమల ఆలయంపై విమాన సంచారం.. టీటీడీ సీరియస్
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి అనేక మార్లు టీటీడీ లేఖలు రాసిన ప్రయోజనం లేకపోయింది. విమానాల రాకపోకలపై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విమాన సంచారం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా భావిస్తారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని టీటీడీ మరోసారి కోరనుంది. ఆగమ శాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. చదవండి: మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు -
శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలు!
తిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన రూపంలో హుండీలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. అందులో భాగంగా శనివారం శ్రీవారి ఆలయంలోకి స్టీల్‌తో తయారు చేసిన ఐదు అడుగుల హుండీని ప్రయోగాత్మకంగా తీసుకెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలను ఉంచి అందులో భక్తులు కానుకలు సమర్పించేలా హుండీలను, మరికొన్ని ఇత్తడి హుండీలను ఏర్పాటు చేసి వినియోగిస్తున్నారు. వీటిని శ్రీవారి సేవకులు, బ్యాంకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ట్రాలీల్లో శ్రీవారి ఆలయం నుంచి బయటకు, అక్కడి నుంచి లిప్టు ద్వారా లారీలో ఎక్కిస్తున్నారు. అక్కడి నుంచి నూతన పరకామణికి తరలిస్తున్నారు. అయితే ఇటీవల హుండీ తరలింపు సమయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో నూతన హుండీలను తయారు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కొంత మంది ఆలయంలోకి ప్రవేశించి హుండీలో భక్తులు నగదు వేస్తున్న సమయంలో హుండీ లోపలకు చేయిపెట్టి చోరీ చేసిన సంఘటనలు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఇబ్బందులు రాకుండా నూతన హుండీలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నూతన హుండీలో మూడు వైపులా భక్తులు నగదు వేయవచ్చు. అదే సమయంలో ఇందులో భక్తుడి చేయి పూర్తిగా దూరే అవకాశం లేదు. మధ్యలో ఓ ఇనుప చువ్వను ఏర్పాటు చేశారు. ఈ మేరకు నూతన హుండీ పనితీరును అధికారులు పరిశీలిస్తున్నారు. వినియోగం సులభంగా ఉంటే దీనినే ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నేడు శ్రీవారి పాదాల వద్ద ఛత్రస్థాపనోత్సవం తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవం జరుగనుంది. ఏడాదికోసారి ఈ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఆలయంలోని బంగారు బావి నుంచి తీర్థాన్ని తీసుకొచ్చి శ్రీవారి పాదాలకు తిరుమంజనం నిర్వహించి, అలంకారం, పూజ, నైవేద్యం సమర్పిస్తారు. -
శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం..
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని టీటీడీ ఆగమోక్తంగా నిర్వహించింది. జూలై 17వ తేదీన ఆణివార ఆస్థానం పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. తిరుమంజనం కారణంగా అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని నేడు విఐపీ దర్శనాలు కూడా టీటీడీ రద్దు చేసింది. -
జమ్మూలో ‘శ్రీవారి ఆలయం’ మహా సంప్రోక్షణ
సాక్షి, న్యూఢిల్లీ/తిరుపతి కల్చరల్/నెల్లూరు(దర్గావిుట్ట)/తిరుమల: జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి (సూర్యపుత్రి) నది ఒడ్డున టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ, శ్రీవారి కళ్యాణం గురువారం ఆగమోక్తంగా జరిగింది. సుప్రభాతం అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 6.30 నుండి 7 గంటల వరకు యాగశాలలో మహాపూర్ణాహుతి, కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 7.30 నుంచి 8.15 గంటల మధ్య మిథున లగ్నంలో మహాసంప్రోక్షణ, కళావాహన నిర్వహించారు. ఈ క్రతువుల ద్వారా యాగశాలలోని కలశాలలో ఇమిడి ఉన్న దేవతాశక్తిని శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి, శ్రీ గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాల్లోకి ఆవాహన చేశారు. అనంతరం అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం అందించారు. ఉదయం 10 గంటలకు భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రులు జితేంద్ర సింగ్, కిషన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ట్వీట్.. జమ్మూలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. శ్రీ బాలాజీ ఆలయ నిర్మాణాన్ని భిన్నత్వంలో ఏకత్వ వేడుకగా కేంద్రమంత్రి జితేందర్ సింగ్ అభివర్ణించారు. జమ్మూలోని శ్రీవారి ఆలయ నిర్మాణానికి సహకరించిన ఏపీ సీఎం జగన్, టీటీడీ బోర్డు చైర్మన్, సభ్యులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. హిందూ సనాతన ధర్మాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలనే లక్ష్యంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణాన్ని పెద్దఎత్తున చేపట్టామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. -
జమ్మూలో శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణకు ఆహ్వానం
సాక్షి, అమరావతి: జమ్మూలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరుకావాలని సీఎం వైఎస్ జగన్‌ను టీటీడీ ఆహ్వానించింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను గురువారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎస్వీ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్, న్యూఢిల్లీ ప్రెసిడెంట్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. జూన్ 3–8 వరకు జమ్మూలోని శ్రీవారి ఆలయంలో మహా సంప్రోక్షణ, 8న మిధున లగ్నంలో కళావాహన, ఆరాధన అనంతరం ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమాలకు హాజరుకావాలని వారు సీఎంకు ఆహ్వాన పత్రికను అందించారు. (చదవండి: ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే...) -
శ్రీవారి చెంత వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవమూర్తులు బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిముఖంగా సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ విష్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వ్రస్తాలను ధరింపచేసి పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తం గా ఉగాది ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమలలోని క్యూకాంప్లెక్స్‌లో 2 కంపార్టుమెంట్లు నిండి ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 57,559 మంది స్వామివారిని దర్శించుకుని హుండీలో రూ.4.26 కోట్లు వేశారు. టైం స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో, దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల్లో , ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్నవారికి 3 గంటల్లో దర్శనమవుతోంది. ప్రత్యేక ఆకర్షణగా ఫల పుష్పాలంకరణ ఉగాదిని పురస్కరించుకుని టీటీడీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం చెంత ఎండు కొబ్బరితో దశావతారాలు, కొబ్బరిపూలతో చేసిన శ్రీలంక ఆర్ట్ అలంకరణలు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీపద్మావతి శ్రీనివాసుల కల్యాణఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆలయం వెలుపల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని తీసుకెళుతున్న గరుత్మంతుడు అనే ఘట్టాన్ని రూపొందించారు. గొల్ల మండపం పక్కన ఉగాది లక్ష్మీదేవితో శ్రీమహావిష్ణువు, ఉద్యానవనంలో ఆడుకుంటున్న బాలల రూపంలో ఉన్న శ్రీరాముడు హనుమంతుడు, ఉగాది రోజున మామిడి వనంలో కాయలు కోస్తున్న శ్రీకృష్ణుడు, పౌరాణిక ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చి న 150 మంది పుష్పాలంకరణ కళాకారులు 3 రోజుల పాటు శ్రమించి ఆకర్షణీయమైన ఫల, పుష్ప ఆకృతులను రూపొందించారు. -
తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్
-
కరీంనగర్లో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తాం: టీటీడీ ఈవో
సాక్షి, తిరుమల: 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.09 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రూ. 39.4 కోట్ల ముండీ ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రోజుకు 70 వేల మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. 2022లో 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే.. హుండీ ద్వారా రూ. 1,450 కోట్ల ఆదాయం లభించిందన్నారు. ఈనెల 28న రథసప్తమి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి చెప్పారు. సామాన్య భక్తులకు కేటాయించే గదుల ధరలు పెంచలేదని మరోసారి స్పష్టం చేశారు. వీఐపీలకు కేటాయించే 170 గదులకు మాత్రమే ధరలు పెంపుజరిగినట్లు తెలిపారు. త్వరలో కరీంనగర్లో శ్రీవారి ఆలయం నిర్మించనున్నట్లు తెలిపారు. 10 ఎకరాల స్థలంలో నిర్మాణం జరగున్నట్లు పేర్కొన్నారు. -
27న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6–10 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహిస్తారు. ఆనందనిలయం, బంగారువాకిలి, శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేస్తారు. ఈ సమయంలో మూలవిరాట్టును వస్త్రంతో కప్పుతారు. శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేకపూజ, నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తారు. అనంతరం భక్తులను సర్వ దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా మంగళవారం బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. సోమవారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ తెలిపింది. శ్రీవారి సేవలో కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ శ్రీవారిని ఆదివారం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఇందిరేష్, జస్టిస్ నరేంద్ర ప్రసాద్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధాకిషన్ అగర్వాల్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.శ్రీనివాసరావు, బీఎస్ఎఫ్ డీజీ పంకజ్ కుమార్ సింగ్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 24 గంటలు తిరుమలలో 14 క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి.సర్వ దర్శన టోకెన్లు లేని వారికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు పడుతోంది. తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో చాలా దుకాణాలు మూతపడ్డాయి. -
వెంకన్న వద్ద 10,258.37 కిలోల బంగారం
సాక్షి, అమరావతి, తిరుమల: తిరుమల శ్రీవారి మిగులు బంగారం, నగదు డిపాజిట్లన్నీ ప్రముఖ జాతీయ బ్యాంకుల్లో భద్రంగా దాచినట్లు టీటీడీ తెలిపింది. వెంకన్న ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలు తరచూ తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్న నేపథ్యంలో బ్యాంకులో దాచిన బంగారం, బ్యాంకు డిపాజిట్లపై టీటీడీ శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది. బ్యాంకుల వారీగా ఏ బ్యాంకులో ఎంత బంగారం, డిపాజిట్లు ఉన్నాయన్న వివరాలను అందులో వెల్లడించారు. మూడేళ్లలో రూ.2,913.59 కోట్లు పెరిగిన డిపాజిట్లు ప్రస్తుతం 24 బ్యాంకుల్లో స్వామి వారి పేరిట రూ.15,938.68 కోట్లు డిపాజిట్లుగా ఉన్నట్లు టీడీపీ శ్వేతపత్రంలో వెల్లడించింది. 2019 జూన్ 30వతేదీ నాటికి రూ.13,025.09 కోట్లు ఉండగా కరోనా లాంటి అవాంతరాలు ఎదురైనా మూడేళ్లలో బ్యాంకుల్లో స్వామి వారి నగదు నిల్వ రూ.2,913.59 కోట్లు పెరగడం విశేషం. అత్యధికంగా రూ.5,358.11 కోట్లు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాలో డిపాజిట్లున్నాయి. టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో రూ.50.77 కోట్లు స్వామి వారి నగదు బ్యాంకు డిపాజిట్లుగా ఉండగా ఇప్పుడు వాటిని ఇతర జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ప్రస్తుతం ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకులో రూ.1.30 కోట్లు మాత్రమే స్వామి వారి డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొంది. 95% మిగులు బంగారం ఎస్బీఐలోనే.. 2019 జూన్ 30 తర్వాత బ్యాంకుల్లో స్వామి వారి మిగులు బంగారం నిల్వలు 2,918.63 కిలోలు పెరిగినట్లు టీటీడీ తెలిపింది. 2019 జూన్ 30 నాటికి 7,339.74 కిలోల బంగారం బ్యాంకుల్లో ఉండగా ఇప్పుడు 10,258.37 కిలోలకు పెరిగింది. భక్తులు స్వామి వారి హుండీలో సమర్పించే బంగారు కానుకలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మింట్‌లో కరిగించిన అనంతరం నిల్వలను 12 ఏళ్ల కాలానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో బ్యాంకుల్లో ఉంచినట్లు టీటీడీ పేర్కొంది. స్వామివారి మిగులు బంగారంలో 95 శాతం బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో దాచినట్లు తెలిపింది. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు శ్రీవారి బంగారం, నగదు డిపాజిట్లను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడిగా పెడుతున్నట్లు ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా కొన్నాళ్లుగా సాగిస్తున్న ప్రచారాన్ని భక్తులెవరూ విశ్వసించవద్దని టీటీడీ శ్వేతపత్రంలో విజ్ఞప్తి చేసింది. 2019 తర్వాత స్వామి ఆస్తులను భద్రపరచే అంశంపై కట్టుదిట్టమైన చర్యలను చేపట్టినట్లు వివరించింది. కరోనా సమయాల్లోనూ నిర్వహణ ఖర్చులను తగ్గించుకుని స్వామివారి ఆదాయం పెరుగుదలకే చర్యలు చేపట్టిందని, మంచి పేరున్న జాతీయ బ్యాంకుల్లో మాత్రమే ఆస్తులను భద్రపరుస్తున్నట్లు తెలిపింది. జాతీయ బ్యాంకుల్లోనే.. టీటీడీ చరిత్రలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ డబ్బులు ఇవ్వలేదు. భవిష్యత్తులోనూ ఇవ్వదు. చైర్మన్, టీటీడీపై బురద చల్లేందుకు కొందరు హిందూ మత వ్యతిరేకులు ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో టీటీడీ ఎప్పుడూ ఇన్వెస్ట్ చేయలేదు. ఇప్పటిదాకా రూ.15,900 కోట్లకుపైగా జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేశాం. ఇకపై కూడా వడ్డీ ఎక్కువ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేస్తాం. – ధర్మారెడ్డి, టీటీడీ ఈవో -
శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ
సాక్షి, తిరుమల: శ్రీవారి ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో వస్తున్న వదంతులను నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో డిపాజిట్లు చేసినట్లు టీటీడీ పేర్కొంది. ఈ మేరకు శ్రీవారి ఆస్తులకు సంబంధించి శనివారం శ్వేతపత్రం విడుదల చేసింది టీటీడీ. దీనిలో భాగంగా శ్రీవారికి మొత్తం బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపిన టీటీడీ.. శ్రీవారికి 10,258.37 కేజీల బంగారం ఉన్నట్లు పేర్కొంది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసినట్లు టీటీడీ తెలిపింది. గత మూడేళ్లలో స్వామి వారి నగదు, డిపాజిట్లు భారీగా పెరిగినట్లు తెలిపింది టీటీడీ. -
ఈ నెల 8న చంద్ర గ్రహణం.. శ్రీవారి ఆలయం మూత..
తిరుమల: ఈ నెల 8న చంద్ర గ్రహణం కారణంగా 12 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు. ఆ రోజున బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను, తిరుపతిలో ఎస్ఎస్డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. గ్రహణ సమయం ముగిసిన తర్వాత వైకుంఠం–2 నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 8న మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్ర గ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఆ రోజున ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. రాత్రి 8.30 గంటల నుంచి అన్నప్రసాద వితరణ ప్రారంభమవుతుంది. సర్వ దర్శనానికి 30 గంటలు తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. 31 క్యూ కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 30 గంటలు, రూ.300 దర్శనానికి 3 గంటలు పడుతోంది. బుధవారం అర్ధరాత్రి వరకు 68,995 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,037 మంది తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.3.71 కోట్లు వేశారు. తిరుమలలో గురువారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. కాగా, శ్రీవారిని గురువారం సినీ నటుడు అల్లు శిరీష్ దర్శించుకున్నారు. 5న డయల్ యువర్ ఈవో డయల్ యువర్ ఈవో కార్యక్రమం ఈ నెల 5న శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. భక్తులు తమ సందేహాలు, సూచనలను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి ఫోన్లో తెలపవచ్చు. ఇందుకుగాను 0877–2263261 నంబర్‌ను సంప్రదించాలి. -
Tirumala: 24, 25, నవంబర్ 8న బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఈ నెల 24న దీపావళి ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో ఆ రోజున బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా 23న సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు. అలాగే, 25న సూర్యగ్రహణం నాడు ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా ఆ రోజున బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో 24న సిఫార్సు లేఖలు స్వీకరించరు. నవంబర్ 8న చంద్రగ్రహణం నాడు ఉదయం 8.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా ఆ రోజున కూడా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. దీంతో నవంబర్ 7న సిఫార్సు లేఖలను స్వీకరించరు. కాగా, 25, నవంబర్ 8న శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా టీటీడీ రద్దు చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 20 కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వదర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు పడుతోంది. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,420 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.4.28 కోట్లు వేశారు. (క్లిక్: యాచకురాలి దాతృత్వం.. అన్నదానానికి భారీగా విరాళం) -
24న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 24వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఉదయం ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, అనంతరం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబర్ 24న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి 10 గంటలు : తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కంపార్ట్మెంట్లు 31 నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,535 మంది స్వామి వారిని దర్శించుకోగా, 37,357 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.08 కోట్లు వేశారు. శ్రీవారి దర్శనానికి 10 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. టీటీడీ వైఖానస ఆగమ సలహా మండలి సభ్యుల నియామకం తిరుమల శ్రీవారి ఆలయానికి టీటీడీ వైఖానస ఆగమ సలహా మండలి సభ్యులను నియమిస్తూ శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు, ఆలయ అర్చకులు అర్చకం రామకృష్ణ దీక్షితులు, ఎస్వీ ధర్మగిరి వేదవిజ్ఞాన పీఠం, వైఖానస ఆగమ స్మార్త పండితులు ఎన్.వి.మోహనరంగాచార్యులు, విశ్రాంత వైఖానస ఆగమ పండితులు పరాంకుశం సీతారామాచార్యులు, తిరుపతి ఎస్వీ వేదిక్ వర్సిటీ, అతిథి ఆచార్యులు, వైఖానస పండితులు వేదాంతం గోపాల కృష్ణమాచార్యులు సభ్యులుగా నియమితులయ్యారు. వీరు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా నూతన ఆగమ సలహా మండలి సభ్యులను శ్రీవిజనస ట్రస్టు కార్యదర్శి గంజాం ప్రభాకరాచార్యులు అభినందించారు. -
గ్రహణం రోజుల్లో శ్రీవారి ఆలయం మూత
తిరుమల: ఈ నెల 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. 25న సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. అలాగే, నవంబర్ 8న మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉన్న కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ రెండు రోజులూ ఆలయ తలుపులు తెరిచిన తరువాత సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ రెండు రోజులూ బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఇతర ప్రాంతాల్లో కూడా అన్నప్రసాద వితరణ ఉండదు. హోటళ్లు కూడా గ్రహణం పూర్తయ్యే వరకు మూసి ఉంచుతారు. దీనికనుగుణంగా తిరుమల యాత్రను రూపొందించుకోవాలని భక్తులను టీటీడీ కోరింది. శ్రీవారి దర్శనానికి 30 గంటలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. 32 క్యూ కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 83,223 మంది శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 36,658 మంది భక్తులు తలనీలాలు ఇచ్చారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించారు. దర్శనానికి 30 గంటలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. తిరుమలేశుని సేవలో ప్రముఖులు శ్రీవారిని మంగళవారం పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటాలతో సత్కరించారు. -
మేల్ చాట్ వస్త్ర సేవ ఎప్పుడు ప్రారంభమైంది?
శ్రీవారి ఆలయంలో స్వామివారికి నిర్వహించే సేవలు అన్నింటిలోనూ విశిష్టమైనది ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. ఈ సేవలో పాల్గొనే భక్తులకు ఒక మరపురాని దివ్యానుభూతిని కలిగిస్తుంది అంటే అతిశయోక్తి కాదేమో. ఆలయంలో స్థలాభావం దృష్ట్యా ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే మహద్భాగ్యం 130 నుంచి 140 మంది భక్తులకు మాత్రమే లభిస్తుంది. అభిషేకం జరిగే సమయంలో నిత్య కళ్యాణ శోభితుడైన స్వామివారి నిజరూప దర్శన భాగ్యం భక్తులకు లభిస్తుంది. సాధారణంగా స్వామివారిని పుష్పాలతో, ఆభరణాలతో, పట్టువస్త్రాలతో అలంకరణ చేసిన తర్వాతనే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అభిషేక సేవ సమయంలో మాత్రం ఇవేమీ లేకుండా స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. అది శ్రీవారి భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతి అని చెప్పుకోవచ్చు. 1980 కి పూర్వం స్వామి వారికి ఇప్పటిలా ప్రతి శుక్రవారం నూతన మేల్ చాట్ వస్త్రంతో అలంకరణ జరిగేది కాదు. ఏడాదికి నాలుగు సందర్భాలలో మాత్రమే స్వామివారికి నూతన పట్టువస్త్రాలను సమర్పించేవారట. దీనితో ప్రతి శుక్రవారం నూతన పట్టువస్త్రాన్ని స్వామి వారికి సమర్పించాలని అప్పటి ఈవో పీవీఆర్ కే ప్రసాద్ తలచారట. ఇది టీటీడీకి ఆర్థికంగా కాస్త భారమైన అంశం కావడంతో భక్తుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారట. అప్పట్లోనే స్వామివారి అలంకరణకు వినియోగించే వస్త్రం విలువ ఎనిమిదివేల రూపాయలు కావడంతో టీటీడీ నూతనంగా 8 వేల రూపాయలు చెల్లించిన భక్తులు పాల్గొనేందుకు మేల్ చాట్ వస్త్రం టికెట్లను ప్రారంభించింది. మేల్ చాట్ వస్త్రం టికెట్లు కలిగిన భక్తులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటు అత్యంత సమీపం నుంచి స్వామివారి అభిషేక దర్శనం వీక్షించగలుగుతారు. ఈ సేవను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరంలో ప్రతి శుక్రవారం ఎవరో ఒక భక్తుడు మాత్రమే ముందుకు వచ్చే సంప్రదాయం ఉండగా అటు తర్వాత క్రమంగా మేల్ చాట్ వస్త్రానికి ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే ఒకదశలో మేల్ చాట్ వస్త్రాన్ని ముందస్తుగా కొన్ని సంవత్సరాల ముందుగానే భక్తులు కొనుగోలు చేసేవారు. ఒకే కుటుంబానికి చెందిన వారే కొన్ని వందల టికెట్లను కొనుగోలు చేయడంతో టీటీడీ పునరాలోచనలో పడింది. దీంతో ఏడాదికి ఒక్కో కుటుంబానికి ఒక టికెట్నే పరిమితం చేస్తూ మిగిలిన టికెట్లను రద్దు చేసి వాటిని లక్కీడిప్ విధానంలో భక్తులకు కేటాయించే విధానాన్ని టీటీడీ 2009 నుంచి ప్రారంభించింది. (క్లిక్ చేయండి: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి) -
Tirumala Nitya Harathi: ఆనతినీయరా స్వామీ... నిత్య హారతికి
తిరుమల శ్రీవారిని క్షణకాలం దర్శించుకుంటే చాలు.. తమ జీవితం ధన్యమైందని భావిస్తారు భక్తులు. ఇక స్వామివారిని అత్యంత సమీపం నుంచి దర్శించుకుని స్వామివారికి ఇచ్చే హారతిని అందుకుంటే అంతకు మించిన భాగ్యం మరొకటి లేదని భావిస్తారు భక్తులు. అటువంటిది ప్రతి నిత్యం స్వామివారికి హారతిని సమర్పించుకునే భాగ్యం లభిస్తే అలాంటి అవకాశం ఒకటి వుంటుందా అంటే అన్నింటికీ అవుననే సమాధానం. నిత్యహారతుల కార్యక్రమం శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం హారతులు సమర్పించే భాగ్యం కొంతమందికి లభిస్తోంది. 1986లో ఐదుగురితో ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పుడు 22 మందికి విస్తరించింది. శ్రీవారి ఆలయంతో సంబంధం వున్న మఠాల ప్రతినిధులకు స్వామివారి ఆలయంలో కైంకర్యాలు నిర్వహించే కొన్ని కుటుంబాలకు ఈ మహద్భాగ్యం లభిస్తోంది. శ్రీవారి ఆలయంలో పూజాకైంకర్యాలను బట్టి కొన్ని రోజులలో మొదటి గంట జరుగుతున్న సమయంలో నిత్యహారతికి అనుమతిస్తుండగా మరికొన్ని రోజులలో రెండవ గంట తరువాత నిత్యహారతులకు అనుమతిస్తారు. మొదటి గంట ముగిసిన తరువాత నిత్యహారతులు సమర్పించే వారిని సన్నిధి వరకు అనుమతిస్తుండగా వారు తెచ్చిన పళ్లెంతో స్వామివారికి హారతిని అర్చకులు సమర్పిస్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో మాత్రం వారిని రాములవారి మేడ వరకు మాత్రమే అనుమతిస్తారు. మంగళ, బుధ, గురు, శుక్ర వారాలలో అయితే రెండవ గంట అయిన తర్వాత ఉత్సవమూర్తులు కళ్యాణమండపం వేంచేపు కాబడిన తర్వాత వారిని అనుమతిస్తారు. మంగళవారం అష్టదళ పాదపద్మారాధన సేవ, రెండవ గంట అయిన తర్వాత నిత్యహారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకం, రెండవ అర్చన, రెండవ గంట, సర్కార్ హారతి, శ్రీవారి వేంచేపు అయిన తర్వాత నిత్య హారతులకు అనుమతి ఇస్తారు. గురువారం రోజున మూలమూర్తికి సడలింపు కార్యక్రమం, తిరుప్పావడ సేవ తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. శుక్రవారం రెండవ తోమాల, రెండవ అర్చన, రెండవ గంట ముగిసిన తర్వాత నిత్యహారతులు సమర్పిస్తారు. విశేష ఉత్సవాలు, అత్యవసర సమయంలో మొదటిగంట, బలి అయిన వెంటనే శ్రీవారి ఉత్సవమూర్తులు కళ్యాణమండపానికి వేంచేపు చేసిన తర్వాత అనుమతిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజైన ధ్వజారోహణం రోజు రాత్రి నిత్యహారతులకు అనుమతిస్తారు. (క్లిక్ చేయండి: ఆనంద నిలయ విమాన విశిష్టత) అహోబిల మఠానికి 1997 నుంచి అనుమతి ఇవ్వగా ఆండావన్ ఆశ్రమానికి 1988లో, పరకాల స్వామి మఠానికి 1997లో, శ్రీమన్నారాయణ చిన్న జీయర్ మఠానికి 1986లో, శ్రీ ఉత్తరాది మఠానికి 1997లో, రాఘవేంద్రస్వామి మఠానికి 1997లో, శ్రీశృంగేరి శంకర మఠానికి 1986లో, శ్రీ కంచికామకోటి పీఠానికి 1988లో, ఉడిపి మఠానికి 2002లో, వల్లభాచార్య మఠానికి 1986లో, ఆర్య మైత్రేయ స్వామి వారికి 1986లో, కర్ణాటక రాష్ట్ర చారిటీస్‌కి 1986లో, నారద మందిరానికి 1986లో, తులసీదాసు మఠానికి 1986లో, రాధాకృష్ణ మందిరానికి 1988లో, వ్యాసరాజ మఠానికి 1997లో, లక్ష్మీనారాయణ మందిరానికి 1986లో, హాథీరాంజీ మఠానికి 1986లో, మూల మఠానికి 2005లో, పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థానానికి 2007లో, తాళ్ళపాక అన్నమాచార్య కుటుంబానికి 2007లో, అనంతాళ్వార్ కుటుంబానికి 2009 నుంచి నిత్యహారతులకు టీటీడీ అనుమతి ఇచ్చింది. (క్లిక్ చేయండి: శ్రీ వేంకటేశ్వర స్వామివారి మేల్కొలుపు ఇలా...) -
టీటీడీకి ముస్లిం దంపతుల రూ.1.02 కోట్లు విరాళం
తిరుమల: చెన్నైకి చెందిన సుబీనాబాను, అబ్దుల్ ఘనీ దంపతులు టీటీడీకి రూ.1.02 కోట్లు విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో దాతలు విరాళం చెక్కును టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.15 లక్షలు, ఇటీవల తిరుమలలో ఆధునీకరించిన శ్రీ పద్మావతి విశ్రాంతి భవనంలో నూతన ఫర్నిచర్, వంటశాలలో పాత్రలకు రూ.87 లక్షలు విరాళంగా అందజేశారు. శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతో పాటు పూజా సామగ్రిని శుద్ధి చేశారు. ఆలయంలో ఉదయం 6 నుంచి 11 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు చేపట్టారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పేశారు. శుద్ధి పూర్తయిన అనంతరం సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతించారు. సర్వ దర్శనానికి 12 గంటలు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 24 కంపార్ట్మెంట్లు నిండాయి. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సోమవారం అర్ధరాత్రి వరకు 67,276 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీలో రూ.5.71 కోట్లు వేశారు. -
సూర్య, చంద్ర గ్రహణ రోజుల్లో.. 12 గంటలు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 25న సూర్యగ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం కారణంగా ఆయా రోజుల్లో 12 గంటల పాటు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ మేరకు బ్రేక్ దర్శనం, శ్రీవాణి, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం 5.11 నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. నవంబర్ 8న మంగళవారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 గంటల వరకు చంద్రగ్రహణం ఉంటుంది. ఈ కారణంగా ఉదయం 8.40 నుంచి రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కాగా, తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్మెంట్లు నిండాయి. దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. -
సదా శ్రీవారి సేవలో..!
సాక్షాత్ శ్రీమహా విష్ణువే వైకుంఠాన్ని వీడి శేషాద్రీశుడై ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరుడుగా కొలువయ్యాడు. సువర్ణ కాంతులు వెదజల్లే బంగారు మేడలో కటాక్షిస్తున్న శ్రీనివాసుడిని దర్శించి..తరించడానికి రోజుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. వారందరికీ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడానికి ఎంతో మంది టీటీడీ ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తుంటారు. కొండ మీదకు చేరుకునే మొదలు శ్రీవారి దర్శనం అయినంతవరకు భక్తులు వీరి సేవలను పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో టీటీడీలో ఎన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా సేవలందిస్తున్నారనే వివరాలతో ‘సాక్షి ’ప్రత్యేక కథనం తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కనులారా దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు నిత్యం తిరుమలకు వస్తుంటారు. శ్రీవారి ఆలయంలో ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రోజుకు 80 వేల నుంచి 95 వేల మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభిస్తోంది. ఇంతమంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడానికి శ్రీవారి ఆలయంలో ఉద్యోగులు నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తుంటారు. స్వామి వారికి వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై అర్ధరాత్రి 2.30 గంటలకు ఏకాంత సేవను నిర్వహించే వరకు ఉద్యోగుల పాత్ర విశేషంగా ఉంటుంది. శ్రీవారి ఆలయ భద్రతను పర్యవేక్షించడానికి నిరంతరాయంగా భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహిస్తుంటారు. శ్రీవారి ఆలయ భద్రతా వ్యవస్థ పర్యవేక్షించడానికి టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్, ఏఆర్, ఏపీఏస్పీ పోలీసులు విధుల్లో ఉంటారు. భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించడానికి ఒక్క శ్రీవారి ఆలయంలోనే 35 విభాగాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అర్చకులు, జీయ్యంగార్ల వ్యవస్థ ఇలా... స్వామి వారి ఆలయంలో వేంకటేశ్వరునికి పూజా కైంకర్యాలు నిర్వహించడానికి గాను అర్చకులు, జీయ్యంగార్ల వ్యవస్థ ఉంటుంది. ప్రధాన అర్చకులు నలుగురు విధుల్లో ఉండగా మరో 45 మంది అర్చకులు వీరికి సహకరిస్తుంటారు. వీరికి సహకారంగా అర్చన పఠించే వ్యక్తి ఒకరు, భాష్యకార్ల సన్నిధి వద్ద ఇద్దరు, పరిచారకులు 19 మంది, తాళ్లపాక వంశస్తులు ఇద్దరు, సన్నిధి గొల్లలు ఇద్దరు, తరిగొండ వెంగమాంబ వంశస్తులు ఒకరు, వేదపారాయణదారులు ఇద్దరు, మరో 26 మంది విధుల్లో ఉంటారు. వీరంతా కూడా స్వామివారి కైంకర్యాల నిర్వహణ కోసం కేటాయించబడిన సిబ్బందే. వీరంతా ప్రతి నిత్యం మూడు షిప్టుల్లో స్వామివారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తుంటారు. స్వామి వారికి నిత్యం నిర్వహించే సేవల కోసం మంగళవాయిద్యకారులు 27 మంది ఉంటారు. స్వామివారి ఉత్సవ మూర్తులు ఊరేగింపు కోసం వాహనబేరర్లు 36 మంది విధుల్లో ఉంటారు. క్యూ లైన్ కోసం.. శ్రీవారి భక్తులు క్యూ లైన్ నిర్వహణ కోసం ఆలయానికి డిప్యూటీ ఈవో ఒకరు, ఏవోలు నలుగురు, సూపరింటెండెంట్లు 14 మంది, సీనియర్ అసిస్టెంట్లు 9 మంది, జూనియర్ అసిస్టెంట్లు 19 మంది, దఫేదార్లు 6 మంది, షరాఫ్‌లు 10 మంది, అటెండర్లు 59 మంది, తోటమాలీలు 20 మంది, మల్టీపర్పస్ ఉద్యోగులు 13 మంది, ప్యాకర్లు 7 మంది, సర్వర్లు ముగ్గురు, ఆరోగ్య సిబ్బంది 5 మంది విధుల్లో ఉంటారు. వీరికి తోడు స్వామి వారి ప్రసాదాల తయారీకి 400 మంది ఉంటారు. ఇలా మొత్తంగా క్యూ లైన్ నిర్వహణ కోసం దాదాపుగా 300 మంది విధుల్లో ఉంటే ప్రసాదాల తయారీకి 400 మంది, భధ్రత కోసం 300 మంది సిబ్బంది ఉంటారు. -
ఆగస్ట్ 1 నుంచి తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన
తిరుమల: కరోనా నేపథ్యంలో తిరుమలలో కొంతకాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం ఆగస్ట్ 1వ తేదీ నుంచి పునఃప్రారంభించనున్నట్లు టీటీడీ ఈవో ఏపీ ధర్మారెడ్డి చెప్పారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్‌లో తిరుపతిలో ప్రారంభమైన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఇప్పటివరకు 490 ఓపెన్ హార్ట్ సర్జరీలు జరిగినట్లు చెప్పారు. అక్కడ ఇటీవల 7 రోజుల పసికందుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపారు. రెండేళ్లలో శ్రీ పద్మావతి పీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తోన్న రైతులు తిరుపతిలోని గోశాలను సంప్రదిస్తే వారికి గోవులు, ఎద్దులను ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. జూన్‌లో శ్రీవారిని 23.23 లక్షల మంది దర్శించుకుని, రూ.123.74 కోట్లను హుండీలో వేసినట్లు ఈవో చెప్పారు. 12న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు ఈ నెల 17న ఆణివార అస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో 12న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 12న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. 11న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. -
వడ్డీకాసుల వాడికి కాసులే కాసులు
తిరుమల: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలలుగా ప్రతినెలా రూ.100 కోట్లకు పైగా వస్తోంది. ముందెన్నడూ లేనివిధంగా మే నెలలో అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం సమకూరింది. కోవిడ్ కారణంగా గడచిన రెండేళ్లలో శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతించడంతో ఆ కాలంలో హుండీ ఆదాయం బాగా తగ్గింది. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో శ్రీవారి దర్శనానికి భక్తులను పూర్తి స్థాయిలో టీటీడీ అనుమతిస్తోంది. కాగా, ప్రస్తుతం శ్రీవారి హుండీ ఆదాయం గతం కంటే ఎక్కువగా లభిస్తోంది. గతంలో ఏడాదికి రూ.1,200 కోట్ల వరకూ హుండీ ఆదాయం లభించేది. మే, జూన్ నెలల్లో రూ.100 కోట్ల మార్కును దాటేది. మిగిలిన నెలల్లో మాత్రం నెలనెలా వచ్చే హుండీ ఆదాయం రూ.100 కోట్ల లోపే వుండేది. ప్రస్తుతం రోజుకు సుమారు రూ.4 కోట్లు హుండీ ద్వారా వస్తోంది. వార్షికాదాయం రూ.1,500 కోట్లు దాటొచ్చు ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.128 కోట్లు రాగా, ఏప్రిల్ నెలలో రూ.127.5 కోట్లు లభించింది. మే నెలలో టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా రూ.129.93 కోట్ల ఆదాయం వచ్చింది. జూన్ నెల పూర్తి కాకుండానే రూ.100 కోట్ల మార్కును దాటింది. జూన్ 1వ తేదీ నుంచి 26వ తేదీ వరకు రూ.106 కోట్ల వరకు వచ్చింది. ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.500 కోట్ల ఆదాయం లభించడంతో.. ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయం రూ.1,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. -
కొండపై ప్లాస్టిక్ ఉండదిక..
తిరుమల: ప్రపంచంలోని హిందూ దేవాలయాల్లో తిరుమల శ్రీవారి ఆలయం ఒక రోల్ మోడల్. భద్రత, క్యూలైన్ నిర్వహణ, లక్షలాదిమంది భక్తులకు ఇబ్బందుల్లేకుండా శ్రీవారి దర్శనం కల్పించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు (టీటీడీకి) ఎంతో పటిష్టమైన వ్యవస్థ ఉంది. ప్రత్యేక సెక్యూరిటీ విభాగం, సీసీ కెమెరాల నిర్వహణ తదితరాలు టీటీడీకే సొంతం. లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు అన్నప్రసాద వితరణ, క్యూలైన్ మేనేజ్మెంట్ వరకు శ్రీవారి ఆలయం ఎంతో ఆదర్శం. అంతేకాకుండా శిక్షణలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఇక్కడికి వచ్చి పలు విషయాలపై అవగాహన పెంపొందించుకోవడం పరిపాటి. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీవారి ఆలయం ప్రత్యేకతలు ఎన్నో. ఇంతటి ప్రాధాన్యత కలిగిన తిరుమల పుణ్యక్షేత్రం పర్యావరణ పరిరక్షణలో తనదైన గుర్తింపును సొంతం చేసుకుంటోంది. అతితక్కువ కాలంలోనే దశల వారీగా ఏడుకొండలపై ప్లాస్టిక్‌ను నిషేధిస్తూ ప్లాస్టిక్ రహిత తిరుమలగా టీటీడీ తీర్చిదిద్దుతోంది. ప్రపంచానికే రోల్ మోడల్‌గా ఉన్న టీటీడీ పర్యావరణ పరిరక్షణలో కూడా అనేక దేవాలయాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల పుణ్యక్షేత్రానికి నిత్యం దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. అధికసంఖ్యలో భక్తులు ప్లాస్టిక్ వాడుతుంటారు. ఈ క్రమంలో తిరుమలలో ప్లాస్టిక్ వాడకంపై కేంద్ర పర్యావరణ సంస్థ అధికారులు టీటీడీని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ తిరుమలలో దశల వారీగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది. తొలిదశలో భాగంగా శ్రీవారి లడ్డూ వితరణ కేంద్రంలో ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ కవర్లను భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండోదశలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను నిషేధించింది. హోటళ్లు, మఠాల్లోను, స్థానిక నివాసితులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను ఉపయోగించరాదని హెచ్చరించింది. వాటికి ప్రత్యామ్నాయంగా గాజు సీసాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతో తిరుమలలో చాలావరకు ప్లాస్టిక్ వాడకం తగ్గింది. ఇక మూడోదశలో భాగంగా స్థానికులు, హోటళ్లు, దుకాణదారులతో సమావేశమైన అధికారులు ఇకపై తిరుమలలో సంపూర్ణంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా దుకాణదారులు, మఠాలు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్ ఉత్పత్తులను వినియోగిస్తే లైసెన్స్ రద్దుచేసి, చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షుణ్ణంగా తనిఖీలు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం బుధవారం నుంచే అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమల వెళ్లే స్థానికులు, వ్యాపారులు, భక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తున్నారు. స్థానిక వ్యాపారులు పంచెలు, వివిధ రకాల బొమ్మలు, ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయో డిగ్రేడబుల్ కవర్లుగానీ, పేపర్లుగానీ ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేగాకుండా నిత్యావసరాల్లో భాగంగా ఎక్కువగా ఉపయోగించే షాంపూ ప్యాకెట్లు కూడా కొండపైకి భక్తులు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులు తమ అవసరాల నిమిత్తం తీసుకొచ్చిన వాటర్ బాటిల్స్, వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్దే విజిలెన్స్ సిబ్బంది గుర్తించి డస్ట్బిన్లలో పడేస్తున్నారు. ఈ విషయమై బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా భక్తులకు సూచనలు చేస్తున్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా తీర్చిదిద్దాలంటే టీటీడీకి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులకు సూచనలు ► తిరుమలలో ప్లాస్టిక్ వాడకాన్ని టీటీడీ పూర్తిగా రద్దుచేసింది. ► అలిపిరి తనిఖీ కేంద్రం, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులను అనుమతించరు. ► తిరుమలకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, కవర్లు, షాంపు ప్యాకెట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావడం నిషిద్ధం. ► తిరుమల యాత్రకు వచ్చే భక్తులు ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్ లేకుండా రావాలి. ► వాటర్ బాటిల్స్, ఇతర ప్లాస్టిక్ వస్తువులను తిరుపతిలోని తనిఖీ కేంద్రాల వద్ద వదిలేసి రావాలి. ► తనిఖీ సిబ్బందికి సహకరించాలి. -
ఏడాది చివరకు జమ్మూలో శ్రీవారి ఆలయ పనుల పూర్తి
తిరుమల: జమ్మూ సమీపంలోని మాజిన్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులు పనుల పురోగతిని చైర్మన్‌కు వివరించారు. ఆలయ నిర్మాణానికి ఉపయోగించాల్సిన వాటిలో ఏపీలోని కోటప్పకొండలో తయారు చేస్తున్న రాతి స్తంభాలు తదితరాలు అందాల్సి ఉందని, మరికొన్ని స్థానికంగా కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. పనులు ఈ ఏడాదిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకుని అమలు చేయాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కాస్త తగ్గింది. శ్రీవారిని సోమవారం 64,157 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామి వారికి 29,720 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.3.84 కోట్లు వేశారు. ఎలాంటి టికెట్ లేకపోయినా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
ఈనెల 29న తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: ఈనెల 29వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. దాంతో మార్చి28వ తేదీన సిఫారసు లేఖలు స్వీకరించడవని టీటీడీ పేర్కొంది. మార్చి 29వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్లార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. -
త్వరలో శ్రీవారి ఆర్జిత సేవలు
తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నిబంధనలను సడలించడంతో ఆర్జిత సేవలను సడలించింది. సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్య క్రమంగా పెంచాలని నిర్ణయించింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి రూ.3,096.40 కోట్ల అంచనాలతో రూపొందించిన టీటీడీ బడ్జెట్‌ను ఆమోదించింది. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో బడ్జెట్ ఆమోదంతో పాటు మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచినట్లు జరిగిన ప్రచారం ఆవాస్తవమని చెప్పారు. ఆయన తెలిపిన వివరాలు.. ► సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు రూ.230 కోట్లతో శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం. త్వరలో సీఎం జగన్‌చే భూమిపూజ. రెండేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం. ► తిరుపతిలో నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లైఓవర్‌ను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని నిర్ణయం. ► టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యానికి రూ.25 కోట్లతో నిధి ఏర్పాటు. ► తిరుచానూరు సమీపంలోని శ్రీ పద్మావతి నిలయాన్ని బాలాజీ జిల్లా కలెక్టరేట్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ నిబంధనల మేరకు లీజుకు ఇవ్వాలని నిర్ణయం. ► తిరుమల మాతృశ్రీ తరిగొండ అన్న ప్రసాద భవనంలో స్టీమ్ ద్వారా అన్నప్రసాదాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్, డీజిల్ ద్వారా కేజి స్టీమ్ తయారీకి రూ.4.71 ఖర్చవుతోంది. సోలార్ సిస్టమ్ ద్వారా రెస్కో మోడల్ స్టీమ్‌ను కేజి రూ.2.54కు 25 సంవత్సరాల పాటు సరఫరా చేయడానికి నెడ్‌క్యాప్‌తో ఒప్పందం. తద్వారా టీటీడీకి ఏడాదికి దాదాపు రూ.19 కోట్ల ఆదా. ► తిరుమలలో హోటళ్లు, ఫాస్టు ఫుడ్ సెంటర్లు తొలగించి, అన్ని ముఖ్య కూడళ్లలో ఉచితంగా అన్న ప్రసాదాలు అందించాలని నిర్ణయం. అత్యున్నత స్థాయి నుంచి సామాన్య భక్తుడి వరకు ఒకే రకమైన ఆహారం అందిస్తారు. ఇక్కడి వ్యాపారులకు ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి లైసెన్స్‌లు ఇస్తారు. ► అలిపిరి వద్ద సైన్స్ సిటీకి మంజూరు చేసిన 70 ఎకరాల్లో 50 ఎకరాలు వెనక్కు తీసుకుని ఆధ్యాత్మిక నగరం నిర్మాణం. ఈ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన. ఇందులో సంప్రదాయ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పురాణాల లైవ్ షోలు వంటివి ఉండనున్నాయి. ► అన్నమయ్య మార్గాన్ని త్వరలో భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయం. అటవీ శాఖ అనుమతులు లభించిన తరువాత పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు ► టీటీడీ ఆయుర్వేద ఫార్మసీకి రూ.3.60 కోట్లతో పరికరాలు కొనుగోలు. రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద మందులు అందుబాటులోకి. ► శ్రీవారి ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి, గోపురానికి బంగారు తాపడం చేయించాలని నిర్ణయం. క్రేన్ సాయంతో గోపురం బంగారు తాపడంపై ఆగమ పండితులతో చర్చించాలని అధికారులకు ఆదేశం. ► పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్, కమిషనర్ హరి జవహర్లాల్, అదనపు ఈవో ఎ.వి. ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పోకల ఆశోక్ కుమార్, సనత్‌కుమార్, మారుతీ ప్రసాద్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, మధుసూదన్ యాదవ్, సంజీవయ్య, విశ్వనాథ్, శ్రీ రాములు, విద్యాసాగర్, మల్లీశ్వరి, శివకుమార్, ఢిల్లీ, చెన్నై స్థానిక సలహా మండళ్ల అధ్యక్షులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శేఖర్ రెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక మండలి సమావేశంలో శ్రీనివాస వ్రత విధానం పుస్తకాలు ముద్రించి భక్తులకు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. -
వైకుంఠవాసా.. నమో తిరుమలేశా!
ఉదయం: 4 గంటలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్రా, కర్ణాటక సీజే రితురాజ్ అవస్థి, త్రిపురా హైకోర్టు సీజే జస్టిస్ అమర్నాథ్ గౌడ్, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, గృహనిర్మాణ శాఖ మంత్రి రంగనాధ్ రాజు, మంత్రి గౌతమ్ రెడ్డి, కార్మిక శాఖమంత్రి గుమ్మనూరి జయరామ్, దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, అప్పల్ రాజు, అనీల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎమ్మెల్యేలు రోజా, సంజీవయ్య, ఎంపీలు మార్గాని భారత్, కొత్త ప్రభాకర్, వెంకటేష్, సత్యవతి, గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, మాజీ మంత్రి సునీత లక్ష్మా రెడ్డి, తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్‌ఉమేష్ లలిత్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం బుధవారం రాత్రి తిరుమల చేరుకున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థిని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. తిరుమల/సాక్షి, అమరావతి: వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినానికి తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు 12 టన్నుల పుష్ప తోరణాలు, వివిధ రకాల పండ్లతో శ్రీవారి ఆలయం, అనుబంధ ఆలయాలు, పరిసరాలను శోభాయమానంగా అలంకరించారు. వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో తిరుమల ప్రకాశిస్తోంది. వైకుంఠద్వారం నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్‌ఉమేష్ లలిత్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌చంద్రశర్మ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితురాజ్ అవస్థి తిరుమల చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి.. బుధవారం అర్ధరాత్రి తరువాత 1.45 గంటల నుంచి ఆలయంలోని వైకుంఠద్వారాలు (ఉత్తర ద్వారాలు) తెరుచుకోనున్నాయి. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ 10 రోజులపాటు భక్తులకు ఉత్తరద్వారం నుంచి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం వేకువన తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాన్ని నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి స్వర్ణరథంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్ర దీపాలంకరణ సేవ జరగనుంది. అనంతరం స్వామి ఉభయ దేవేరులతో కలిసి తిరుచ్చిపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. శుక్రవారం ద్వాదశి రోజున ఏకాంతంగా చక్రస్నానం నిర్వహిస్తారు. ఉదయం 4.30 నుంచి 5.30 గంటల వరకు శ్రీచక్రత్తాళ్వారును మాడవీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం వద్ద కొలువుదీర్చి విశేష పూజలు చేస్తారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. కోవిడ్ నిబంధనల మేరకు భక్తులను పుష్కరిణిలోకి అనుమతించడం లేదని టీటీడీ ప్రకటించింది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని పుష్పాలతో అలంకరించిన శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం శ్రీవారి ఏకాంతసేవలో సుప్రీంకోర్టు సీజే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ బుధవారం రాత్రి తిరుమల శ్రీవారిని ఏకాంతసేవలో దర్శించుకున్నారు. అంతకుముందు తిరుమలకు చేరుకున్న ఆయనకు పద్మావతి అతిథి గృహం వద్ద పుష్పగుచ్ఛంతో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి తదితరులు స్వాగతం పలికారు. ఆయన వెంట ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా తదితరులున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో జస్టిస్ ఎన్వీ రమణకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి స్వాగతం పలికారు. పద్మావతి అతిథి గృహంలో జస్టిస్ ఎన్వీ రమణతో మాట్లాడుతున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ,ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వైష్ణవాలయాలు ముస్తాబు ముక్కోటి ఏకాదశి వేడుకలకు రాష్ట్రంలోని వైష్ణవాలయాలన్నీ ముస్తాబయ్యాయి. శ్రీవేంకటేశ్వరస్వామి, లక్ష్మీనరసింహస్వామి తదితర వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో ముక్కోటి ఏకాదశిని పెద్ద పండుగగా నిర్వహించడం సంప్రదాయం. అన్ని వైష్ణవ ఆలయాల్లోను గురువారం వేకువజాము నుంచి ఉత్తరద్వార దర్శనాలకు దేవదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. తిరుమలతోపాటు ద్వారకా తిరుమల, సింహాచలం, వేదాద్రి, అంతర్వేది, అప్పనపల్లి, నరసాపురంలోని జగన్నాథస్వామి ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
ఇల 'వైకుంఠం'
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినానికి తిరుమల ముస్తాబైంది. బుధవారం అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలగనుంది. ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఈ మేరకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండు రోజులతో ప్రారంభమై... శ్రీవారి ఆలయంలో 2020కి ముందు వరకు వైకుంఠ ద్వారాన్ని రెండు రోజులపాటు మాత్రమే తెరిచి ఉంచేవారు. ఆ తర్వాత నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించేలా సంప్రదాయాన్ని టీటీడీ ప్రారంభించింది. ఈ పది రోజులలో ముక్కోటి దేవతలుగా భావించే వరుణుడు, వృషభుడు, నహుషుడు, ప్రత్యూషూడు, జయుడు, అనిలుడు, విష్ణుడు,ప్రభాసుడు, అజైతపాత, అహిర్భుద్నుడు, విరుపాక్షరుద్రుడు, సురేశ్వరుడు, జయంతరుద్రుడు, బహురూపరుద్రుడు, త్య్రంబకుడు, అపరాజితుడు,ౖ వెవస్వతరుద్రుడు, అర్యముడు, మిత్రుడు, ఖగుడు, అర్కుడు, భగుడు, ఇంద్రుడు, భాస్కరుడు, పీషుడు, పర్జన్యుడు, తృష్ణ, విష్ణువు, అజుడు, ఆదిత్యుడు, ప్రజాపతి, పావిత్రుడు, హరుడు వంటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే సమయంలో మానవులు కూడా మహావిష్ణువుని దర్శించుకుంటే అంతే మోక్షం లభిస్తుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి ప్రాధాన్యత వేంకటాచల మహత్యంలో దేవతలకు ఉత్తరాయణంలో వచ్చే 6 నెలల కాలాన్ని పగలుగా, దక్షిణాయనంలో వచ్చే 6 నెలల కాలాన్ని రాత్రిగా పేర్కొంటారు. దక్షిణాయనంలో చివరి నెల ధనుర్మాసాన్ని దేవతల నెలగా భావిస్తారు. దేవతలకు ఈ నెల బ్రహ్మ ముహూర్తం. అదే సమయంలో ముక్కోటి దేవతలు మహవిష్ణువుని దర్శించుకుంటారు. అందుకు అనుగుణంగా ధనుర్మాసం నెలను పండుగ నెలగా భావించి భక్తులు ఆలయ సందర్శనం చేస్తుంటారు. విష్ణువుకు తిథులలో ఏకాదశి, ద్వాదశి అతిముఖ్యమైనవి. వైకుంఠ ఏకాదశి నుంచి వైష్ణవ ఆలయాలలో దేవతల ద్వారంగా పేర్కొనే ఉత్తర ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఆ రోజున విష్ణువు ఉత్తరద్వారం వద్ద దేవతలకు దర్శన భాగ్యం కల్పిస్తారని ప్రతీతి. అదే సమయంలో వైష్ణవ ఆలయాల్లో కూడా ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచడంతో దేవతలకు మహవిష్ణువు దర్శనమిచ్చే సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మహావిష్ణువు భక్తులకు దర్శనమిస్తారని విశ్వాసం. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడి దర్శన భాగ్యం 1863లో ఒక్కరోజుగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం..1949లో 2 రోజులుకు.. 2020 నుంచి వైష్ణవ ఆలయాల తరహాలో 10 రోజులకు విస్తరించింది. దీంతో వైకుంఠంలో మహావిష్ణువు ముక్కోటి దేవతలకు దర్శన భాగ్యం కల్పించే 10 రోజుల సమయంలో ఇల వైకుంఠంలో భక్తులకు శ్రీమన్నారాయణుడు దర్శనభాగ్యం లభించడంపై ఆనందం వ్యక్తమవుతోంది. – వేణుగోపాల దీక్షితులు, టీటీడీ ప్రధానార్చకులు నేడు స్వర్ణరథంపై ఊరేగనున్న స్వామి వారు శ్రీవారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఈ నెల 13న అర్థరాత్రి నుంచి 22 వరకు పది రోజులపాటు భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కలగనుంది. 13న ఉదయాత్పూర్వం తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ జరుగుతుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో కలిసి తిరుచ్చిపై మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రంగనాయకుల మండపంలో అధ్యయనోత్సవ కార్యక్రమాలు చేపడతారు. ఈ నెల 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర ముక్కోటి తిరుమలలో ఏకాంతంగా జరగనుంది. శ్రీవారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. శ్రీవారి ఆలయంతోపాటు, ప్రధాన కూడళ్లలో విద్యుద్దీకరణ పనులను చేపట్టారు. దీంతోపాటుగా ప్రధాన కూడళ్లలో నూతన పూలమొక్కలను ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దారు. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
-
శ్రీవారి సేవలో 43 ఏళ్లు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో డాలర్ శేషాద్రి అంటే తెలియని వారుండరు. శ్రీనివాసుడి సన్నిధిలో 1978లో గుమస్తాగా బాధ్యతలు స్వీకరించిన ఆయన 1979లో ఉత్తర పార్ పత్తేదార్‌గా టీటీడీలో రెగ్యులర్ ఉద్యోగి అయ్యారు. తరువాత జూనియర్,సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది 2007 జూలైలో పార్ పత్తేదార్‌గా రిటైరయ్యారు. ఇలా 43 ఏళ్లపాటు శ్రీవారి సేవలో ఆయన తరించారు. 1948 జులై 15న జన్మించిన డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి, మెడలో పొడవైన డాలర్ ధరించి ఉండడంతో ఆ పేరుతో డాలర్ శేషాద్రిగా ప్రసిద్ధిగాంచారు. శేషాద్రి పూర్వీకులది తమిళనాడు రాష్ట్రంలోని కంచి. శేషాద్రి తండ్రి గోవిందరాజస్వామి ఆలయంలోని తిరుమల నంబి ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించేవారు. తిరుపతిలోనే జన్మించిన శేషాద్రి విద్యాభ్యాసాన్ని అక్కడే పూర్తిచేశారు. అప్పట్లోనే పీజీ పూర్తిచేసిన ఆయన ఆ తరువాత చంద్రమ్మను వివాహమాడారు. అయితే, వీరికి పిల్లలులేరు. శేషాద్రికి ఇద్దరు అన్నలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. విస్తృత పరిచయాలు డాలర్ శేషాద్రికి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, జడ్జీలు తదితర ప్రముఖలందరితోనూ విస్తృత పరిచయాలున్నాయి. అయితే.. 2009లో శేషాద్రికి ఊహించని దెబ్బ తగిలింది. తిరుపతికి చెందిన రైతు నాయకుడు టీటీడీలో 60 ఏళ్లకు పైబడిన వారిని కొనసాగించకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం తీర్పుతో టీటీడీ ఆ సమయంలో శేషాద్రి సహా 58 మందిని విధుల నుంచి తప్పించింది. కానీ, శేషాద్రి తన పోరాటం కొనసాగించి విజయం సాధించారు. ఇలా దాదాపు 10 నెలలపాటు శ్రీవారి సేవలకు దూరమయ్యారు. స్వామివారి వాహనాల అలంకరణలో.. 1987లో శ్రీవారి ఆలయంలో మిరాశీ వ్యవస్థ రద్దయిన సమయంలో ఆలయంలో పూజా కైంకర్యాల నిర్వహణలో టీటీడీకి ఎంతో సహాయం అందించిన వ్యక్తి డాలర్ శేషాద్రి. శ్రీవారి వాహన సేవలప్పుడు స్వామి వారిని ఏ విధంగా అలంకరించాలో కూడా అర్చకులకు చెప్పి స్వామివారి వాహనాల అలంకరణకు పూర్తిస్థాయిలో సహకరించేవారు. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పూజలకు సంబంధించి చేస్తున్న మార్పుల్లోనూ శేషాద్రి తన తోడ్పాటును టీటీడీకి అందిస్తున్నారు. శ్రీవారికి సేవలోనే.. స్వామివారి సేవలో తరిస్తున్న శేషాద్రి శ్రీవారి సేవలో వున్నప్పుడే పలుమార్లు అనారోగ్యానికి గురయ్యారు. 2013లో కిడ్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న ఆయన 2016లో తీవ్ర అస్వస్థతకు గురై తర్వాత కోలుకున్నారు. ఈ రెండుసార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలోనే ఆయన ఆస్వస్థతకు గురయ్యారు. ఇలా తన 42 ఏళ్ల సర్వీస్‌లో దాదాపు 15 నెలల కాలం మినహా మిగతా సమయం అంతా స్వామి సేవలోనే తరించారు. చివరకి తన తుది శ్వాస విడిచే సమయంలో కూడా శేషాద్రి విశాఖలో శ్రీవారి సేవలోనే ఉన్నారు. -
పుట్టినరోజు నాడు శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా
-
తిరుమల శ్రీవారి కైంకర్యాలపై సుప్రీంకోర్టులో విచారణ
-
నవంబర్ 4న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమల: శ్రీవారి ఆలయంలో నవంబర్ 4న దీపావళి ఆస్థానం నిర్వహించనున్న సందర్భంగా ఆ రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. నవంబర్ 3న వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని భక్తులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. -
ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించలేదు
తిరుమల: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసినట్టు టీటీడీ పీఆర్వో విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే, కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం జరుగుతోంది. అనేకమంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయం గుర్తించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది. రేపటి నుంచి అయోధ్య కాండ లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాప్తిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో ఈనెల 21 నుంచి నవంబర్ 16వ తేదీ వరకు అయోధ్య కాండ పారాయణ దీక్ష జరగనుంది. తిరుమల వసంత మండపంలో శ్లోక పారాయణం, ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద వి/ê్ఞన పీఠంలో జప, తర్పణ, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం బుధవారం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు అంకురార్పణ జరగనుంది. పారదర్శకంగా లడ్డూ కౌంటర్ల నిర్వహణ తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న లడ్డూ కౌంటర్ల నిర్వహణ పారదర్శకంగా జరుగుతోంది. రద్దీకి తగ్గట్టుగా కౌంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సంతృప్తిగా లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ కాంప్లెక్స్‌లో మొత్తం 62 కౌంటర్లు ఉన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం 31 లడ్డూ కౌంటర్లను నడుపుతున్నారు. వీటిలో 26 కౌంటర్లకు 6 బ్యాంకులు స్పాన్సర్షిప్ అందించాయి. నేడు పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 20న బుధవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. -
ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
నేడు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ టికెట్లు విడుదల
-
విశాఖలో కలియుగ దైవం
దొండపర్తి (విశాఖ దక్షిణ): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం విశాఖపట్నంలో ముస్తాబవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఆలయ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. తూర్పున బంగాళాఖాతానికి అభిముఖంగా సాగరతీరంలో కొండపై శ్రీవారు కొలువుదీరుతున్నాడు. పర్యాటక అందాలకు తోడు ఆధ్యాత్మిక శోభ పరిఢవిల్లేలా ఈ ఆలయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఆధ్యాత్మిక కేంద్రంగా రుషికొండ తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం మాదిరిగా రుషికొండలో ప్రకృతి రమణీయతల మధ్య ఈ ఆలయ నిర్మాణాన్ని టీటీడీ 2019లో చేపట్టింది. సాగర తీరానికి ఎదురుగా గీతం యూనివర్సిటీకి పక్కనే ఉన్న కొండపై నెలకొల్పుతున్నారు. సముద్ర మట్టానికి 60 మీటర్ల ఎత్తులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.28 కోట్ల నిధులతో టీటీడీ ఈ ఆలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతోంది. చిన్న తిరుపతి స్థాయిలో ఇక్కడ సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ ఆలయం ఎదురుగా బేడాంజనేయ స్వామి ఆలయాన్ని ఏర్పాటుచేశారు. మూల విరాట్‌కు ఒకవైపు పద్మావతి అమ్మవారి ఆలయం, మరోవైపు ఆండాళ్ అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. తిరుపతిలో ఎస్వీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషినల్ స్కల్ప్చర్ అండ్ ఆర్కిటెక్చర్ వారితో శ్రీవారు, అమ్మవార్ల విగ్రహాలను తయారుచేయించారు. బీచ్ రోడ్డులో వెళ్లే వారికి కనువిందు చేసేలా విద్యుద్దీపకాంతులతో కొండపై శంఖు, చక్ర, నామాలను ఏర్పాటుచేశారు. ప్రధానాలయం కింద ప్రత్యేకంగా ధ్యాన మందిరం, పూజలు, పెళ్లిళ్ల కోసం 100 నుంచి 150 మందికి సరిపడేలా ప్రత్యేక మండపాన్ని నిర్మించారు. బీచ్ రోడ్డు నుంచి కొండపైకి సుమారు అర కిలోమీటర్ మేర ఘాట్ రోడ్డు నిర్మిస్తున్నారు. కొండ కింద భారీ పార్కింగ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. భక్తులు విశ్రాంతి తీసుకోడానికి, టికెట్లు, ప్రసాద కౌంటర్లను సైతం ఏర్పాటుచేస్తున్నారు. ఈ ఆలయంలో ఇద్దరు ప్రధాన పూజారులు ఉండనున్నారు. ఆలయం సమీపంలోనే అర్చకుల కోసం క్వార్టర్స్‌ను సిద్ధంచేశారు. -
కశ్మీర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ
సాక్షి, ఢిల్లీ: కశ్మీర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సింహా ఆదివారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, ఆర్ఎస్ఎస్ నేత రాంమాధవ్ పాల్గొన్నారు. దేవాలయం కోసం లీజు ప్రాతిపదికన 62 ఎకరాలను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కేటాయించింది. రూ.33.52 కోట్ల వ్యయంతో 18 నెలల్లో దేవాలయ నిర్మాణం పూర్తికానుంది. దేవాలయ ప్రాజెక్ట్‌లో భాగంగా వేద పాఠశాల, భక్తులకు వసతి సదుపాయాలు కల్పించనున్నారు. చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు భక్తులకు మరింత సులభంగా వసతి గదులు -
సీఎం జగన్‌కు శ్రీవారి ఆలయ అర్చకులు కృతజ్ఞతలు
సాక్షి, తిరుమల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీవారి ఆలయ అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, 1977లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మిరాశి వ్యవస్థను రద్దు చేసిందని.. దీంతో గతంలో చాలా అర్చక కుటుంబాలు వీధిపాలయ్యాయన్నారు. 2007లో వైఎస్సార్ చేసిన చట్ట సవరణతో 26 మంది అర్చకులు కైంకర్యాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అర్చక కుటుంబాల్లోని కొత్తగా 12 మంది అర్చకులను శ్రీవారి సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన చెప్పారు. వారికి అవకాశం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చి.. అధికారులకు ఆదేశాలిచ్చారని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం రిటైరైన అర్చకులకు కూడా జీవితాంతం శ్రీవారి పాదసేవ చేసుకునే అవకాశాన్ని సీఎం జగన్ కల్పించారని వేణుగోపాల దీక్షితులు తెలిపారు. చదవండి: అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు: గౌతమ్ సవాంగ్ శ్రీకాకుళం జిల్లాలో టీడీపీకి షాక్.. -
ఆలయ నిర్మాణం.. టీటీడీకి భారీ విరాళం
సాక్షి, తిరుమల: తమిళనాడులో నిర్మించే శ్రీవారి ఆలయానికి భక్తులు భూరి విరాళం అందజేశారు. ఉల్లందూరుపేలో నిర్మించే శ్రీవారి ఆలయానికి రూ.3.16 కోట్లతో పాటు రూ.20 కోట్ల విలువైన భూమిని విరాళంగా తమిళనాడు భక్తులు అందజేశారు. టీటీడీ పాలక మండలి సభ్యులు కుమారగురు ఆధ్వర్యంలో విరాళాన్ని భక్తులు అందజేశారు. స్వర్ణ తిరుమల అతిథి గృహంలో శనివారం టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విరాళ డీడీని పాలక మండలి సభ్యులు కుమారగురు అందించారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ, త్వరలో ఉల్లందూరుపేట, జమ్మూకశ్మీర్‌లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. (చదవండి: ఏప్రిల్ నుంచి యాడ్స్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ) -
స్వర్గంలో నడిచినట్టు ఉంది: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుపతి: వైకుంఠ ఏకాదశి సందర్భంగా నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ద్వారంలో నడవటం స్వర్గంలో నడిచిన అనుభూతి కలిగిందని అన్నారు. రాబోయే 2021లో అందరి కష్టాలు తీరి శుభం కలగాలని కోరుకున్నాని పేర్కొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని, సీఎం వైఎస్ జగన్ ఆయురారోగ్యాలతో ఉండి 30 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా దీవెనలు ఇవ్వాలని ప్రార్ధించామని రోజా చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన ఆమె విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు చిన్న మెదడు చిట్లినట్టు ఉందని, అందుకే అర్థం లేని వాగుడు వాగుతున్నారని మండిపడ్డారు. భక్తులపై లాఠీ చార్జీ టీటీడీ ఎన్నడూ చేయలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. టీటీడీ ఏర్పాట్లు చాలా బాగున్నాయని, కోవిడ్ నిబంధనలు పాటిస్లూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తోందని ప్రశంసించారు. -
‘పూజాదికాల’పై కోర్టులెలా నిర్ణయిస్తాయి?
సాక్షి, అమరావతి: ‘తిరుమల శ్రీవారి ఆలయంలో పూజాదికాలను ఎలా నిర్వహించాలో కోర్టులెలా నిర్ణయిస్తాయి? భగవంతుడిని కించపరిచేలా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేయడం ఏంటి? ఈ విధంగా ఇతర మతాలపై పిటిషన్లు వేయగలరా? మసీదులో గానీ, చర్చిలో గానీ ఫలానా విధంగా ప్రార్థనలు జరుగుతున్నాయంటూ పిటిషన్ వేయగలరా? దేనికైనా పరిమితులు ఉంటాయి. అలాగే సహనం కూడా ఉంటుంది. ఇతరుల మనోభావాల గురించి కనీస ఆలోచన చేయకుండా వ్యాజ్యాలు దాఖలు చేసే పిటిషనర్ వంటి వ్యక్తుల వల్లే ఈ దేశంలో సమస్యలు వస్తున్నాయి. ఇతరుల వల్ల ఎలాంటి సమస్యల్లేవు’ అని పిటిషనర్‌ను ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజాదికాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అలా జోక్యం చేసుకునే పరిధి తమకు ఎంత మాత్రం లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుత వ్యాజ్యంలో ఎలాంటి ఉత్తర్వులివ్వలేమంది. అయితే, టీటీడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత, అవసరమైతే ఈ పిటిషన్ వెనుక ఎవరున్నారన్న దానిని తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో ఆగమశాస్త్రాల ప్రకారం శ్రీవారి పూజాదికాలు జరగడం లేదంటూ ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీవారి దాదా హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై «సోమవారం మరోసారి విచారణ జరిపిన దర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. -
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
సాక్షి, తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజున శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణోత్సవ మండపంలో వాహన సేవల జరుగుతుంది.. కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. -
తిరుమలలో అర్ధరాత్రి చిరుత హల్చల్
సాక్షి, తిరుపతి: తిరుమలలో గత అర్ధరాత్రి చిరుత హల్ చల్ చేసింది. శ్రీవారి పాదాల ఆటవీ ప్రాంతం నుంచి మ్యూజియం ముందర గోడమీద దర్జాగా కూర్చుంది. చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయం తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీవారి దర్శనం అనతరం లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులు బయటకు వచ్చే రోడ్డులోనే చిరుత తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భక్తులు బసచేసే ప్రాంతాల్లో చిరుతలు సంచరించిన ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. ఇటీవల ఓ చిరుత రెండో ఘాట్ రోడ్డులో వాహన దారులపై దాడికి దిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చిరుత సంచారం అధికారులు, భక్తుల్లో కలవరం పుట్టించింది. (చదవండి: తిరుమలలో భారీ కొండచిలువ కలకలం) -
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్
సాక్షి, తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆదివారం శుభవార్త చెప్పింది. ఆన్లైన్ దర్శనం టికెట్ల కోటాను పెంచుతున్నట్టు టీటీడీ వెల్లడించింది. ప్రతిరోజు ఇస్తున్న 6 వేల టికెట్లను జులై 1 నుంచి 9 వేల వరకు పెంచనున్నట్టు తెలిపింది. రేపు (సోమవారం) ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేస్తామని చెప్పింది. రోజుకు 9వేల చొప్పున స్లాట్ల వారిగా అందుబాటులో ఉంచనున్నామని బోర్డు ప్రకటించింది. జులై 1 నుంచి రోజుకు 3 వేల చొప్పున సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నామని తెలిపింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్‌లోని కౌంటర్ల ద్వారా.. ఒకరోజు ముందుగా భక్తులు టికెట్లు పొందొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 16న ఆణివార ఆస్థానం, జులై 30 నుంచి ఆగస్టు వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని అధికారులు పేర్కొన్నారు. (చదవండి: యూట్యూబ్ చానల్స్ ప్రతినిధుల బరితెగింపు) -
శ్రీవారి సన్నిధిలో రెండు రాష్ట్రాల మంత్రులు
సాక్షి, తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వైష్ణవాలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) గుండా శ్రీమన్నారాయణుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రముఖులు తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. వైకుంఠ ద్వారం గుండా వేల సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మరెంతో మంది భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో.. తెలంగాణ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోత్ ఉన్నారు. (చదవండి : నేడు తిరుమలలో వైకుంఠ ఏకాదశి) ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్లు సుబ్బరామిరెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి, కనుమూరి బాపిరాజు, పుట్టా సుధాకర్ యాదవ్, ఏపీ సీఎస్ నీలం సాహ్ని, గాలి జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు.. రాజేంద్ర ప్రసాద్, సునీల్, సుమలత, కమెడియన్ సప్తగిరి తిరుపతి వెంకన్న దర్శనం చేసుకున్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విషయంలో ఎలాంటి మార్పూ లేదని, అమల్లో ఉన్న సంప్రదాయాన్నే కొనసాగిస్తామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి.. అనంతరం అధ్యయనోత్సవాలు.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా యాదగిరి శ్రీలక్ష్మీ నరసింహ్మస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. బాలాలయంలో వైకుంఠ ద్వారం (ఉత్తర ద్వారo) గుండా యాదగిరీశుడు భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో యాదాద్రికి చేరుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. వైకుంఠద్వార దర్శనం అనంతరం యాదాద్రి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో యాదిగిరికి చేరుకున్నారు. నేటి నుంచి ఆరు రోజులపాటు అధ్యయనోత్సవాలు కొనసాగుతాయి. స్వర్ణాలంకార శోభిత గరుడ వాహనంపై స్వామివారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం, సాయంత్రం ఆరు రోజులపాటు వివిధ అలంకరణల్లో స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ అధికారులు తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లాలో.. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేవుని కడప వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించేకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. జిల్లాలోని వేంపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. జమ్మలమడుగు నారపుర వేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. తూర్పుగోదావరిలో.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. జిల్లాలోని రాజమండ్రి వేణుగోపాలస్వామి ఆలయం తెల్లవారుజాము నుంచే భక్తులతో నిండిపోయింది. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకుని భక్తులు తరించారు. పిఠాపురం పంచ మాధవ దివ్య క్షేత్రం శ్రీకుంతీ మాధవ స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. పశ్చిమగోదావరిలో.. జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాళ్లకూరు వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. విశాఖలో.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచల అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున్న చేరుకుంటున్నారు. సింహాద్రి నాథుని ఉత్తర ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. పాడేరు ఎమ్మెల్యే కొత్తగుల్లి భాగ్యలక్ష్మి స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలనలో అప్పన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని తెలిపారు. సూర్యాపేటలో.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ముఖ ద్వారంగా ఉన్న జిల్లాలోని మునగాల మండలం బరఖాత్ గూడెంలో శ్రీవెంకటస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీలక్ష్మీ నృసింహ స్వామిని వైకుంఠ ద్వారం గుండా భక్తులు దర్శించుకున్నారు. నల్గొండలో.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా.. నార్కట్ పల్లి మండలం శ్రీ వారిజల వేణుగోపాల స్వామి వారి ఆలయం భక్తులు బారులు తీరారు. స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకున్నారు. చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి గుట్టపై భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు. -
అమరావతిలో శ్రీవారి ఆలయం
-
ఈ ప్రణాళికతో అంతా సులువే
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తరలి వచ్చే భక్తులతో 365 రోజులూ తిరుమలకొండ కిటకిటలాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తిరుమల యాత్ర చేయాల్సిన భక్తులు తప్పనిసరిగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తిరుమలలో బస, శ్రీవారి దర్శన విషయాల్లో రిజర్వేషన్లు్ల తప్పనిసరి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఇంటర్నెట్ ద్వారా గదులు, సేవాటికెట్లు ∙ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే చాలు తిరుమలలోని బస, శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, ఆర్జిత సేవలు ముందస్తుగా రిజర్వ్ చేసుకునే సౌకర్యం ఉంది. దేశవిదేశాల్లో ఎక్కడున్నా సరే ఇంటర్నెట్ ద్వారా రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు టీటీడీ కల్పించింది. ∙ఇంటర్నెట్ ద్వారా సాధారణ సేవలైన కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు భక్తులు సులభంగా పొందవచ్చు. ఇక అతిముఖ్యమైన శ్రీవారి సుప్రభాతసేవ, అర్చన, తోమాలసేవ, విశేషపూజ, అష్ట దళ పాదపద్మారాధనసేవ, నిజపాద దర్శనం తదితర సేవలు బుక్ చేసుకునే సౌకర్యం కూడా టీటీడీ కల్పించింది. దీనికి సంబంధించిన కోటాను ప్రతి నెలా మొదటి శుక్రవారం కోటా విడుదల చేస్తారు. టికెట్ల కోసం భక్తులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం పాస్‌వర్డ్‌తో ఒకరికి ఒక టికెట్టు చొప్పున కేటాయిస్తారు. ఈ –దర్శన్ కేంద్రాల ద్వారా ముందస్తు బుకింగ్ మన రాష్ట్రంతోపాటు చెన్నయ్, బెంగళూరు, న్యూ ఢిల్లీ, ఇతర ముఖ్యనగరాల్లో మొత్తం 86 ఈ– దర్శన్ కేంద్రాలు టీటీడీ నిర్వహిస్తోంది. వీటి ద్వారా ఫోటోమెట్రిక్ పద్ధతిలో భక్తుడి వేలిముద్ర, ఫోటో ద్వారా స్వామి దర్శనం, ఆర్జితసేవలు, గదులు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ∙తిరుమలలో నిత్యం భక్తులకు 7 వేల వరకు అద్దె గదులు కేటాయిస్తుంటారు. ఇందులో పద్మావతి అతిథి గృహాల పరిధిలో మొత్తం 2 వేల గదులున్నాయి. రూ.500 నుంచి 6 వేల వరకు అద్దె కలిగిన గదులు కేటాయిస్తారు. ఫోన్ నెంబరు 877–2263731 ∙గదులు కావాలంటే ఆధార్‌కార్డు / ఓటరు కార్డు/ పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులోని ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది ∙రూ.100 నుంచి రూ.7100 (జీఎస్టీతో కలిపి) వరకు అద్దెగదుల్లో అవసరమైన గదిని పొందవచ్చు ∙సీఆర్వో విచారణ కార్యాలయ పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి. రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె కలిగిన గదులు మంజూరు చేస్తారు. వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు గదులు కేటాయిస్తారు. సిఫారసు లేఖలపై కూడా భక్తులకు ఇక్కడే గదులు కేటాయిస్తారు. ఫోన్ నెంబరు– 0822–2263492 ∙ఎంబీసీ–34లో పరిధిలో మొత్తం 3 వేల గదులున్నాయి. ఫోన్ నెంబరు : 0877–2263929, 2263523. 20 వేల మందికి నాలుగు ఉచిత యాత్రి సదన్లు భక్తులకు గదులు లభించకపోతే కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం టీటీడీ ప్రత్యేకంగా నాలుగు ఉచిత యాత్రి సదన్లు నిర్మించింది. ఇందులో లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఉచిత భోజన సౌకర్యం, కళ్యాణకట్టలు ఏర్పాటు చేశారు. భక్తులు ఎటువంటి నగదు చెల్లించకుండానే అన్ని సౌకర్యాలు ఉచితంగా పొందవచ్చు. ఇంటెర్నెట్, టీటీడీ ఈ–యాప్ ద్వారా రోజూ రూ.300 టికెట్ల కేటాయింపు ∙రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కేటాయింపులో మార్పు వచ్చింది. 2009 నుండి తిరుమలలోనే టికెట్లు కేటాయించేవారు. ఇటీవల పూర్తిగా రద్దు చేశారు. ∙ఆ కోటాలో రోజూ కేటాయించే 26 వేల టికెట్లను ఇంటర్నెట్ ద్వారా కేటాయిస్తున్నారు. టీటీడీ యాప్ ద్వారా కూడా భక్తులు తమ సెల్ఫోన్ల నుండి టికెట్లు పొందవచ్చు. ∙ఓ కుటుంబంలోని భక్తుల్లో ఒకరు తమ ఫొటో గుర్తింపు కార్డును అప్లోడ్ చేయాలి.మొదటి వ్యక్తితోపాటు మిగిలినవారి పేర్లు నమోదు చేసుకోవాలి. స్వామి దర్శనం తర్వాత ఆలయం వెలుపల ఆ టికెట్లపై భక్తులు సులభంగా లడ్డూలు పొందే అవకాశం ఉంది. ∙ఆన్‌లైన్‌తోపాటు టీటీడీ ఈ–దర్శన్ కేంద్రాల్లోనూ, మండల పోస్టాఫీసుల్లోనూ రూ.300 దర్శన టికెట్లు తీసుకునే సౌకర్యం కల్పించారు. ఇటీవల టీటీడీ ఏపీ, తెలంగాణలోని సుమారు 2500 పోస్టాïఫీసులకు విస్తరించింది. రోజుకు 5 వేల టికెట్ల వరకు భక్తులు పోస్టాఫీసుల ద్వారా పొందే అవకాశం ఉంది. లక్కీడిప్‌లో అభిషేకం, వస్త్రాలంకార సేవ టికెట్లు ∙తిరుమలేశునికి నిర్వహించే తోమాల, అర్చన, సహస్ర కలశాభిషేకం, తిరుప్పావడ, పూర్ణాభిషేకం, మేల్‌ఛాట్ వస్త్రం అరుదైన సేవల్లో సామాన్య భక్తులు స్వామిని దర్శించే భాగ్యాన్ని టీటీడీ కల్పించింది. ∙ఆయా ఆర్జిత సేవలకు ముందు రోజు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు భక్తులు తిరుమలలోని విజయాబ్యాంకు కౌంటర్లో తమ వ్యక్తిగత వివరాలు, వేలిముద్రలు, సెల్ నెంబర్ కంప్యూటర్లో నమోదు చేసుకుని టోకెన్ పొందాలి. నమోదు చేసుకున్నవారిలో కంప్యూటర్ ర్యాండమ్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఆర్జితసేవా టికెట్లు కేటాయిస్తారు. తర్వాత ఎంపికైన భక్తుడి సెల్ నెంబరుకు సమాచారం అందజేస్తారు. లడ్డూలు పొందటం సులువు ∙వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే సర్వదర్శనం క్యూలో వెళ్లే భక్తుల్లో ఒకరికి రాయితీ ధరపై రూ.20కి రెండు లడ్డూలు ఇస్తారు. మరో రూ.50 చెల్లిస్తే మరో రెండు లడ్డూలు ఇస్తారు. ఒక్కొక్కరు నాలుగు లడ్డూలు పొందవచ్చు. ∙వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోనే కాలిబాటలో వచ్చిన భక్తుల్లో ఒకరికి ఒక ఉచిత లడ్డూ, రూ.20కి రెండు రాయితీ లడ్డూలు, రూ.50కి మరో రెండు లడ్డూలు ఇస్తారు. అంటే ఒకరికి ఐదు లడ్డూలు లభిస్తాయి. ∙ రూ.300 టికెట్ల భక్తులకు టికెట్టుపై రెండు లడ్డూలతోపాటు అదనంగా రూ.50 చెల్లిస్తే మరో రెండు లడ్డూలు ఇస్తారు ∙ఇక టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు, ఈవో, జేఈవో సిఫారసులతో రూ.500 వీఐపీ టికెట్ల భక్తులు కూడా టికెట్టు తీసుకునే సందర్భంలో కనిష్ఠంగా రూ.50కి రెండు లడ్డూలు, రూ.150కి ఆరు లడ్డూలు అందజేస్తున్నారు. నడకదారిలో ఉచిత దివ్యదర్శనం టోకెన్లు ∙ఈ ఏడాది నుండి కాలిబాటల్లో నడిచి వచ్చే భక్తులకు టైమ్ స్లాట్ విధానం అమలు చేశారు. రోజుకు 20 వేల చొప్పున టికెట్లు కేటాయిస్తున్నారు. ఇందులో అలిపిరి మార్గంలో 14వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 6 వేల టికెట్లు ఇస్తున్నారు. సర్వదర్శనంలో యాక్సెస్ కార్డులు అమలు రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నుంచే సర్వదర్శనం భక్తులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు. మొత్తం 31 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. దర్శన సమయం ఎక్కువ గంటలు పడుతుంటే లోనికి వెళ్లిన భక్తులు సులభంగా బయటకు వెళ్లి రావటానికి యాక్సెస్ కార్డులు ప్రవేశ పెట్టారు. ఫొటోమెట్రిక్ విధానంతో కూడిన కార్డులు పొందిన భక్తులు అందులో నిర్ణయించిన దర్శన సమయానికి తిరిగి వచ్చే అవకాశం టీటీడీ కల్పించింది. నిత్యం వేలాది మంది భక్తులు ఈ సౌకర్యాన్ని పొందుతూ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ∙వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఉచిత టెలిఫోన్ సౌకర్యం కల్పించారు. దీని ద్వారా భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్ కంపార్ట్మెంట్ల నుండే ఉచితంగా మాట్లాడవచ్చు. ఇక్కడే భక్తులకు దర్శన సమయం తెలిపేందుకు వీలుగా శ్రీవారి సేవకులతో హెల్ప్‌డెస్క్‌లు కూడా ఏర్పాటు చేశారు. భారతీయ సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి ∙శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ సంప్రదాయం తెలియజేసేందుకు టీటీడీ కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. ప్రారంభంలో కల్యాణోత్సవం, ఆ తర్వాత అన్ని రకాల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ వస్త్రధారణ అమలు చేసింది.కొత్తగా ప్రవేశ పెట్టిన రూ.300 ఆన్లైన్ టికెట్ల దర్శనానికి వచ్చే భక్తులు కూడా విధిగా సంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలన్న నిబంధన ఉంది. పురుషులు: ధోవతి–ఉత్తరీయం, కుర్తా –పైజామా మహిళలు: చీర–రవిక, లంగా–ఓణి, చున్నీ/ పంజాబీ దుస్తులు, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది. ఇలా టీటీడీ సమాచారం తెలుసుకోవచ్చు టీటీడీ కాల్సెంటర్లో శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి సమాచారం కోసం సంప్రదించాల్సిన నెంబర్లు: 0877–22 33333, 2277777, 2264252 టీటీడీ వెబ్సైట్ :www.tirumala.org ఈ–మెయిల్:www.tirupati.org టీటీడీ కాల్‌సెంటర్: webmaster@.tirumala.org సేవలు, వసతి ఆన్లైన్ బుకింగ్:www.ttdsevaonline.com టీటీడీ దాతల విషయ వివరాల కేంద్రం: 0877–2263472 ∙ఉచిత సేవలకు డబ్బులు అడిగితే టీటీడీ విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు ∙ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో 0877–2263261 ఫోన్ చేసి నేరుగా కార్యనిర్వహణాధికారితో భక్తులు మాట్లాడవచ్చు. టీటీడీ పరిధిలో తమకు ఎదురైన సమస్యలు, సంఘటనలపై ఫిర్యాదులు, పరిష్కార మార్గాలపై సూచనలు చేయవచ్చు. ఇక్కడ ఫిర్యాదులు చేయొచ్చు అసౌకర్యానికి గురైన భక్తులు తమ ఫిర్యాదులను యంత్రాంగానికి తెలియజేసేలా కూడా టీటీడీ చర్యలు చేపట్టింది. కేంద్ర విచారణ కార్యాలయం ∙వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్నదానం, కళ్యాణకట్ట, కాటేజీ విచారణ కార్యాలయాల వద్ద ఈ ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేశారు ∙ఎక్కడైనా ఉచిత సేవలకు, ఇతర కార్యక్రమాలకు డబ్బులు అడిగితే విజిలెన్స్ టోల్‌ఫ్రీ నెం: 18004254141 సంప్రదించవచ్చు. ∙ప్రతి నెల మొదటి శుక్రవారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో నేరుగా కార్యనిర్వహణాధికారికి భక్తులు ఫిర్యాదులను, సలహాలను అందజేసే సౌకర్యం కూడా ఉంది. దాతల విభాగంలో విరాళాలు ఇవ్వవచ్చు టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.లక్ష ఆపైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర బహుమానాలను టీటీడీ అందజేస్తోంది. దాతలకు పాస్ పుస్తకాలు ఇస్తారు. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం... 087722–63472, 2263727కు సంప్రదించవచ్చు. నిత్యాన్న ప్రసాదానికి కూరగాయల విరాళం అన్నప్రసాదాల తయారీ కోసం రోజూ టన్నుల కొద్దీ కూరగాయలు వాడతారు. వాటిలో టమోటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వంటి కూరగాయల్ని భక్తులు విరాళంగా ఇస్తే టీటీడీ అధికారులు స్వీకరిస్తారు. అదనపు వివరాల కోసం 0877–226458 నెంబరుకు సంప్రదించవచ్చు. విరాళాలిచ్చే దాతలకు బస, దర్శనంలో కోటా టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులు, స్కీముల కోసం విరాళాలు ఇచ్చే భక్తులు నేరుగా తిరుమలలో ఆదిశేషు అతిథి గృహంలోని దాతల విభాగంలో అందజేయవచ్చు. ఈవో, టీటీడీ పేరుతో తీసిన డీడీ, చెక్‌లు మాత్రమే తీసుకుంటారు. నేరుగా నగదు స్వీకరించరు. రూ.1 లక్ష ఆ పైన విరాళం అందజేసిన దాతలకు బస, దర్శనం, ఇతర సత్కారాలను టీటీడీ అందజేస్తోంది. పోస్టులో పంపే డీడీలు కూడా స్వీకరిస్తారు. అదనపు సమాచారం కోసం ఫోన్:087722–63472, 2263727 నంబర్లకు సంప్రదించవచ్చు. తిరుమల పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే? తిరుమలలోని టీటీడీ పురోహిత సంఘంలో పెళ్లి చేసుకోవాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ∙భారతీయ వివాహ చట్టాల ప్రకారం వధూవరులకు నిర్ణీత వయోపరిమితి ఉండాలి ∙వధూవరుల తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు గుర్తింపు కార్డులు చూపాలి ∙ప్రభుత్వం ద్వారా వచ్చిన రేషన్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు, ఓటరు కార్డు .. వంటి వాటిల్లో ఫొటోతో ఉన్న వాటిని అందజేయాలి. -
ఏది జరిగినా మన మంచికే
రెప్పపాటు కాలం శ్రీవారిని సందర్శిస్తే చాలు కొండంత సంతోషం. జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం.. గంటల తరబడి క్యూలలో వేచి స్వామివారిని దర్శించుకున్నాక భక్తులు పొందే అనుభూతి ఇది. అలాంటిది నిమిషం కాదు..గంట కాదు..రోజు కాదు.. మాసం కాదు.. మూడున్నర దశాబ్దాల పాటు సాక్షాత్తూ శ్రీవారి చెంతనే గడిపే మహద్భాగ్యం పొందిన వ్యక్తి ఏవీ రమణ దీక్షితులు. ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసి నాలుగు నెలలుగా విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన శ్రీవారితో తనకున్న అనుబంధాన్ని సాక్షితో పంచుకున్నారు. నాన్నగారు గొల్లపల్లి వెంకటపతి దీక్షితులు. నియమ నిష్టల మధ్య పెంచారు. ఎప్పటికైనా స్వామి వారి అర్చకుడిగా ఉండాలన్న భావనతోనే నన్ను తీర్చిదిద్దారు. మడి కట్టుకోవడం నుంచి అన్ని కట్టుబాట్లు అలవాటుగా మారాయి. తిరుపతిలోనే బీఎస్సీ చదివా. సైన్స్ అంటే ఇష్టం. జువాలజీ ప్రధానాంశంగా ఎమ్మెస్సీ చేశాను. ఒకపక్క సైన్స్.. మరోపక్క శ్రీవారు. రెండు అంశాలూ మనసులో నిండి ఉండేవి. ఈ విషయంలో వైరుధ్యం లేదు. భక్తి కూడా సైన్సే అని విశ్వాసం. మాలిక్యులర్ బయాలజీలో డాక్టరేట్ పూర్తయింది. 1974లో నాన్నగారు పరమపదించారు. కుటుంబ వారసత్వంగా తిరుమల సేవకు వచ్చేశాను.1977లో లివర్ క్యాన్సర్‌పై పరిశోధనకు అమెరికా నుంచి పిలుపు వచ్చినా వెళ్లలేదు. ఆగమశాస్త్ర ప్రకారం సముద్రయానం చేయకూడదు. మ్లేచ్ఛ దేశాలకు వెళ్లితే ధర్మ భ్రష్టత్వం జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. అందుకే వెళ్లలేదు. ఏమని చెప్పను... స్వామివారి సేవకు దీర్ఘకాలం అంకితమయ్యాను. ఆ మూలమూర్తితో బంధం ఏమని చెప్పను. అత్యంత సన్నిహిత సంబంధం మాది. ఒక్కొక్కసారి ఆయనతో వాదన చేస్తుంటాను. స్వామి అలుగుతుంటారు.అప్పుడప్పుడూ స్వామితో విభేదిస్తుంటాను. మళ్లీ మామూలే. మాది తాత, మనవడి సంబంధంగా సాగింది. ఒక్కోసారి తాతగారు మనవడితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందిస్తుంటారు. కొడుకు కంటే మనవడి మీదే తాతగారికి ప్రేమ ఎక్కువుంటుంది. మాదీ అంతే. ప్రధానార్చకుడు.. దానివల్ల వచ్చిన గౌరవం, వేతనాలు.. ఇలా భౌతికంగా లభించే రూపాలన్నింటినీ పక్కనబెడితే... ఆత్మార్పణగా స్వామివారితోనే ఉన్నాను. స్మరించుకుంటే ఎదురుగా నిలబడతారు. ఎదురెదురుగా నిలబడి ఒకరితో ఒకరు సంభాషించుకుంటాం. కైంకర్యాల వేళ బిడ్డ.. ఆగమోక్తంగా స్వామివారికి సమయానుసారం కైంకర్యాలు చేయాలి. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా.. మంత్రాశనం, స్నానాశనం, అలంకారాశనం, యాత్రాశనం, భోజ్యాశనం, శయనాశనం అనే ఆరు దశలుంటాయి. స్వామివారు మంత్రాధీనం. గర్భాలయంలో ప్రవచించే వేదమంత్రాల వల్లే ప్రశాంతత నెలకొంటుంది. గర్భాలయంలోనూ తరంగాలుంటాయి. అందుకే మంత్రయుక్తంగా, శాస్త్రోక్తంగా జరిపితేనే స్వామి వారు సంతృప్తి చెందుతారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్నసూక్తంతో ప్రసాదాలను సమర్పించాలి. ప్రసాదాన్ని పవిత్రం చేయాలి. దీనివల్లే పుష్టి, తేజస్సు, దృఢత్వం లభిస్తాయి. కుడిచేతి గ్రాస ముద్రతో ప్రసాదాన్ని తాకి స్వామి కుడిచేతిని తాకిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే గోరుముద్దలు తినిపించడమన్నమాట. మంచినీళ్లిస్తాం. అభిషేకం చేసేటప్పుడు, ఆరగింపు చేసేటప్పుడు స్వామిని బిడ్డగా చూసుకుంటాం. అందుకే కైంకర్య సమయాన కన్నతల్లిగా మారిపోతాం. మిగిలిన వేళల్లో స్వామివారే యజమాని. మేమంతా సేవకులమే. సక్రమంగా జరపకపోతే అపచారం ఆగమోక్త సంప్రదాయం ప్రకారం ఆలయంలో అన్నీ జరగాలి.. అపసవ్యం జరగకూడదు. ముఖ్యంగా కైంకర్యాలన్నీ పద్ధతిప్రకారం సకాలంలో నిర్వర్తించాలి. వీఐపీలొస్తున్నారనో.. భక్తుల సంఖ్య పెరిగిందనో ఆగమేఘాలపై నిర్వహించలేం. స్వామి కార్యక్రమంలో అతి కీలకమైనది ప్రసాదం. అది కూడా ఆయనకు సక్రమంగా నింపాదిగా ఇవ్వకపోతే ఎలా.. చాలా సందర్భాల్లో ఇలాంటివి అధికారుల ఒత్తిళ్ల నుంచి ఎదుర్కొన్నాం. నా వరకూ ఏనాడూ ఇవి చెవులకు సోకకుండా కైంకర్య బాధ్యతలను నిర్వహించగలిగాను. స్వామివారు ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే భక్తులకు మంచి జరుగుతుంది. ఆగమశాస్త్రంపై కనీస అవగాహన.. దైవ నియమాలు.. భక్తి.. సంస్కృతులపై నమ్మకం లేని అధికారులుంటే మంచిది కాదు. ఆ స్వామి చలవతోనే టీటీడీ అన్న విషయం మరువకూడదు. ఆగమోక్తంగా కైంకర్యం కూడా నిర్వహించకపోతే అపచారం. త్వరలోనే తెలుగు అనువాదం సా«ధారణంగా స్వామి వారికి సమర్పించే కైంకర్యాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి భక్తులందరికీ ఉంటుంది. అందరికీ తెలిసిన ప్రసాదం లడ్డూ ఒక్కటే. కానీ ఎన్నో రకరకాల ప్రసాదాలుంటాయి. ఏ సమయంలో ఏ నైవేద్యం పెడతారు, వాటిని ఎవరు చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వాటిలో ఉండే దిట్టం ఏమిటి లాంటి అంశాలు అందరికీ తెలిసే అవకాశం తక్కువ. కైంకర్యాలకు సంబంధించిన అంశాలతో ఫుడ్స్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని ఆంగ్లంలో రాశాను. దీనిని తెలుగులో అనువదించి ప్రచురించాలని ఎక్కువమంది కోరారు. అందుకే తెలుగులో అనువదించే పనిలో పడ్డా. 80 శాతం పూర్తయింది. కొద్దిరోజుల్లో పుస్తకాన్ని తీసుకువస్తాను. ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు వైకుంఠం నుంచి తిరుమలకు రావడానికి మునుపే స్వామి తన ప్రతినిధిగా వైఖానస మహర్షిని పంపారు. వైఖానస ఆగమ శాస్త్రాన్ని సృష్టించారు. ఆ తర్వాతే స్వామివారు తిరుమలకు విచ్చేశారు. అంటే స్వామి భూలోకానికి వచ్చే సమయానికే ఆగమ శాస్త్రం అమల్లో ఉంది. ఇప్పటికీ అత్రి మహర్షి ఆలయంలో సజీవంగా ఉన్నారని భావిస్తాం. వేల సంవత్సరాల కిందట ఒక ప్రయోగం జరిగింది. దేవతలు, మహర్షులంతా కలిసి... ఆలయ ఆవరణలో పరివార దేవతల విగ్రహాలను ప్రతిష్ఠింపజేసి, వారిని స్వామివారికి రక్షణ సిబ్బందిగా నియమించారు. మంత్రపూర్వకంగా ఆవాహన చేశారు. వారంతా స్వామివారి సేవలో సజీవంగా ఉన్నారు. రక్షణ కవచంలా నిలుస్తున్న ఆ దైవశక్తులను సామాన్య మానవులు తట్టుకోలేరు. అందువల్లే స్వామివారిని దర్శనం చేసుకుని, ఆలయం వెలుపలికి వచ్చాక ఇక మళ్లీ స్వామి దివ్యమంగళ స్వరూపం గుర్తుండదు. మనసులో శూన్యత ఆవరిస్తుంది. మనమేదైనా కోరాలన్నా మరచిపోతాం. ఆ తాదాత్మ్యంలో ఏదీ గుర్తుండదు. అర్చావతారంలో కనిపించేది కూడా స్వామి వారి రూపం కాదు. అది వేరే ఉంటుందని నమ్ముతాను. ఆగమశాస్త్రంలో చెప్పబడే లక్షణాలున్న భంగిమ.. లక్షణాలతో స్వామివారున్నారని ధ్యానం చేసుకుంటుంటాను. వైఎస్ హయాంలో... వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర తర్వాత కొండకు వచ్చారు. సుదర్శనయాగం నిర్వహించాం. మా కష్టాలు విన్నారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మర్చిపోలేదు. రాష్ట్రంలోని 24 వేల దేవాలయాల్లో అర్చకులకు వంశపారంపర్య హక్కు కల్పించారు. ఇందుకోసం చట్టసవరణ చేశారు. అర్చకులకు గౌరవమిచ్చారు. కుటుంబాన్ని పోషించుకునే శక్తిని ఇచ్చారు. వేతనాలు పెంచారు. బ్రాహ్మణులంతా సంతోషించారు. ఆయన తర్వాత మళ్లీ బ్రాహ్మణులకు, పురోహితులకు కష్టాలు మొదలయ్యాయి. అంతకుముందు తొమ్మిదేళ్లపాటు ఎన్నో ఒడిదుడుకులు ..కష్టాలు పడ్డాం. అవమానాలు భరించాం. ముఖ్యంగా జాతీయ నిధిగా చెప్పుకునే వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చేశారు. రథ.. వాహన మండపాలనూ ధ్వంసం చేయించారు. అవన్నీ దివ్యపురుషుడి దేహభాగాలుగా భావిస్తాం. ఇది మహాపాపమని చెప్పినా విన్నవారెవరూ లేరు. నాలుగు నెలలుగా స్వామికి దూరంగా.. ఏదైనా స్వామి అభీష్టానికి వదిలేస్తుంటాను. ఏది జరిగినా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తాను. అన్నిటి వెనుక స్వామి దయ ఉందనే నమ్మకం. మనసా, వాచా ఏ తప్పు చేయలేదు. నాది కాని దాన్ని తీసుకోలేదు, తీసుకోను కూడా. స్వామివారి పేరు చెప్పి అక్రమంగా ఏదీ పొందలేదు. దైవ సంకల్పంతోనే ఏదైనా జరుగుతుంది. తిరుమలలో వంశపారంపర్య అర్చకులకు పదవీ విరమణ చేయించాలని చట్టాల్లో ఎక్కడా నిబంధనలు లేవు. కానీ, అలా జరిగిపోయింది. తెలతెలవారుతుండగానే గర్భగుడిలో స్వామి సేవలో తరించేవాడిని. నాలుగు నెలలుగా దూరంగా ఉన్నాను. స్వామివారిని దర్శించుకోలేకపోతున్నాననే కొరత.ఎప్పటికైనా స్వామి వారు నన్ను పిలిపించుకుంటారు. ఇప్పుడు నన్ను బయట పెట్టారంటే ఏం జరిగిందో తెలియదు. ఏదో ఒక బలమైన కారణమే ఉండి ఉంటుంది. జరిగేవన్నీ స్వామి వారి సంకల్పమే.ఏది జరిగినా మన మంచి కోసమేనన్నది నా భావన. – పక్కి సత్యారావు పట్నాయక్, తిరుపతి -
వేనవేల దర్శన ఫలాల వాహన సేవలు
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు మూలపురుషుడు బ్రహ్మదేవుడు. దేవదేవుని బ్రçహ్మోత్సవాలు ఈనాటివి కాదు... యుగయుగాల నుంచి ఆచరిస్తున్నవే. ఆ ఉత్సవాల గురించి ‘వరాహపురాణం’ మొదటి భాగంలో చక్కగా వివరించారు. కృతయుగ ప్రారంభంలో తిరుమల క్షేత్రంలో రాక్షసుల అరాచకాలను తట్టుకోలేక బ్రహ్మాది దేవతలు శ్రీమహావిష్ణువును శరణు కోరారు. ముక్కోటిదేవతల మొర ఆలకించి శ్రీమహావిష్ణువు తన పంచాయుధాలలో ఒకటైన ‘సుదర్శన చక్రాన్ని పంపించారు. వేయి చేతులు కలిగిన మానవాకృతిలో సుదర్శన చక్రం రాక్షస సంహారం చేస్తుంది. శత్రుపీడ వదలడంతో ఆనందోత్సాహంతో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీమహావిష్ణువుకి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు జరిపించాడు. బ్రహ్మ జరిపించిన ఉత్సవాలు కావడంతో అవి బ్రహ్మోత్సవాలుగా వాసికెక్కాయి. ఈ ఉత్సవాల అనంతరం ముక్కోటి దేవతల కోరికను మన్నించి భూలోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణకు మహావిష్ణువు స్వయంభువుగా తిరుమలలో వెలిశారు.దీంతో సమాధిస్థితిలో ఉండే యోగులకు సైతం కనిపించని స్వామివారు వేంకటాద్రిపై ‘శ్రీనివాసుని’గా నిలచి అందరికీ తన దర్శనభాగ్యాన్ని కల్పించారు స్వామి.వేంకటాద్రిపై ఉత్సవాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సమస్త భక్తులకు కావలసిన వసతి, ఆహారపానీయాది సౌకర్యాలను కల్పించే బాధ్యతను దేవతా వాస్తుశిల్పిౖయెన విశ్వకర్మకు అప్పగించాడు. విశ్వకర్మ స్వామివారికి దివ్య విమానాన్ని ఆలయం పైభాగంలో నిర్మించాడు. ∙బ్రçహ్మోత్సవ సమయంలో బ్రహ్మదేవుడు స్వామివారికి రకరకాలైన రుచులలో ఆహార ‡పదార్థాలను నివేదిస్తూ స్వామివారిని అశ్వం, ఏనుగు, శేషుడు, గరుడుడు... ఇలా వివిధ వాహనాలలో ఊరేగిస్తూ, ఇరుపక్కల కళాకారులతో సంగీతం, వేదఘోష, నాట్యాలు, మేలు జాతి గుర్రాలు, ఏనుగులు, ఎద్దులు ముందు, వెనుక, పక్కల నడుస్తుండగా స్వామివారు తేజోవంతంగా తమ దివ్య భవ్య దర్శనాన్ని ప్రసాదిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు యాగశాలను నిర్మించి యజ్ఞాలను కూడా నిర్వహించాడు. ఈ ఉత్సవాలలో ఎనిమిదవరోజు వేంకటేశ్వర స్వామి రత్నఖచిత మణిమయ భూషిత అలంకారాదులతో, శ్రీదేవి, భూదేవి సమేతుడై సకల ఆభరణ ధారుడై నాలుగు పార్శా్వలు కలిగిన దారు (కొయ్య) రథంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్త జన సంద్రానికి దర్శన భాగ్యాన్ని కల్గించి తిరిగి దేవాలయంలోని స్వర్ణమయమైన ఆస్థాన మండపానికి వేంచేస్తాడు. ఆస్థాన మండపంలో స్వామివారు బ్రహ్మను పిలిచి భక్తితో, అత్యంత ప్రేమానురాగాలతో, వినమ్రతతో నిర్వహించిన ఈ ఉత్సవాలు మమ్ములను మంత్రముగ్ధులను చేశాయని, ఎవరైతే ఈ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కన్యామాసంలో నిర్వహిస్తారో వారు ప్రాపంచిక ఆనందాన్ని పొంది బ్రహ్మలోక సాయుజ్యాన్ని పొందుతారని సెలవిచ్చారు. వేంకటాద్రికి వేంచేసి ఎవరైతే ఈ మహోత్సవాలను కనులవిందుగా తిలకిస్తారో వారికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పలికారు. ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తజనావళికి రాజులు (పరిపాలకులు) సకల సౌకర్యాలను కల్పిసారని సెలవిచ్చారు. భక్తులకు ఎవరైతే అన్నప్రసాదాలను అందిస్తారో వారికి సంతానప్రాప్తి కలిగి స్వర్గప్రాప్తి పొంది పరమపదాన్ని చేరుకొంటారని చెప్పారు. ఎవరైతే బ్రçహ్మోత్సవాలకు వచ్చే మూగ, చెవిటి, కనుచూపులేని భక్తులకు సహాయసహకారాలను అందిస్తారో వారికి నా కరుణాకటాక్షాలు కలకాలం ఉంటాయని, ఎవరైతే నా పర్వత సానువుల్లో నివసిస్తారో వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని ప్రబోధించారు. అలాగే ఎవరైతే ఈ ఏడుకొండలమీద దానధర్మాలను నిర్వహిస్తారో వారు ముల్లోకాలలో కీర్తి పొందటమేకాక, దివ్యత్వం కలిగి స్వర్గం ప్రాప్తిస్తుందని బ్రహ్మాదిదేవతలకు తెలియజేశారు. అనంతరం ఆనందనిలయంలోనికి శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంచేశారు. ∙ఉత్సవాలలో శ్రవణా నక్షత్రయుక్తమైన తొమ్మిదోరోజు ఉదయం శ్రీభూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌తో కూడా శ్రీవరాహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, ‘పంచామృత స్నపన తిరుమంజనం’ నిర్వహిస్తారు.తర్వాత సుదర్శన చక్రాన్ని శ్రీస్వామి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. శ్రీ సుదర్శన చక్రస్నానం వల్ల అత్యంత పవిత్రతనొందిన శ్రీస్వామి పుష్కరిణీ జలాలలో అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరస్నానం చేస్తారు. ఆ సమయంలో శ్రీవారి ద్విమూర్తుల శక్తీ, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధ శక్తి పుష్కరిణీ జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. కనుక అవభృత స్నానమనేది తెలిసీ తెలియకచేసే దోషపరిహారం కోసమై చేసే విశిష్ట ప్రక్రియ. అవభృత కార్యక్రమానంతరం యావత్ దేవతాగణం సుగంధ పరిమళాలు వెదజల్లే వివిధరకాల పుష్పాలతో, మంత్రపఠనం గావిస్తూ భక్తిశ్రద్ధలతో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ విధంగా బ్రహ్మ చేసిన మహోత్సవాలకు మంత్రముగ్ధుడైన శ్రీవారు బ్రహ్మతో– ‘‘బ్రహ్మా! నేను నీకు ఏవిధంగా ప్రతిఫలాన్ని ఇవ్వగలను! నేను నీకు ఒకటే చెల్లించగలను. అది... ‘‘నేనే నీవు నీవే నేను’’ అని పలుకగా, బ్రహ్మ మహానందాన్ని పొందినవాడై ‘‘స్వామీ మీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మాపై, మానవాళిపై ఉండాలంటే మీరు ఈ విమాన గోపురంలో శాశ్వతంగా ఉండాలి’’ అని కోరగా శ్రీమన్నారాయణుడు ‘తథాస్తు’ అని పలికాడు. బ్రహ్మ సత్యలోకానికి వెళ్లి, తన నియత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనుమతించాడు. కలియుగ ప్రత్యక్షదైవంగా పేర్కొనే శ్రీనివాసుడు యుగయుగాలకు భగవంతుడు. వారికి బ్రçహ్మోత్సవ క్రతువును నిర్వహించిన యజ్ఞకర్త సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మయే. అందుకే స్వామికి జరిగే బ్రçహ్మోత్సవ సమయంలో వివిధ వాహనాలకు ముందుగా బ్రహ్మరథం తిరగడం సాక్షాత్తు... విధాత, సృష్టికర్త అయిన బ్రహ్మకు సంకేతమే. – పోగూరి చంద్రబాబు తిరుపతి -
నేటితో ముగియనున్న మహా సంప్రోక్షణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ గురువారంతో ముగియనుంది. నేడు ఉదయం 10 : 16 గంటల నుంచి 12 గంటల లోపు తులాలగ్నం శుభముహూర్తంలో స్వామివారి మూలమూర్తిలో 48 జీవకళలను మళ్లీ ప్రవేశపెట్టి మహాసంప్రోక్షణ క్రతువును ముగిస్తారు. మహాసంప్రోక్షణకు ఈనెల 11వతేదీ రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. 12వ తేదీన ఆలయంలో వైదిక కార్యక్రమాలను వేణుగోపాల దీక్షితుల ఆధ్వర్యంలో చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 45 మంది రుత్వికులు, 20 మంది యాగ పారాయణదారులు, 50 మంది పురాణ పఠనదారులు, 40 మంది దివ్య ప్రబంధనదారులు వైదిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి సేవలందించారు. శాస్త్రోక్తంగా తిరుమంజనం మహాసంప్రోక్షణంలో భాగంగా నాలుగో రోజు బుధవారం ఉదయం శ్రీవారి మూలమూర్తికి ఇతర పరివార దేవతలకు క్షీరాధివాస తిరుమంజనం క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోపురాల కలశాలను అద్దంలో తిలకించి వాటి ప్రతిబింబాలకు అభిషేకం నిర్వహించారు. శ్రీ విమాన వేంకటేశ్వరస్వామి, శ్రీ గరుడాళ్వార్, శ్రీవరదరాజస్వామి, శ్రీభాష్యకారులు, శ్రీ యోగనరసింహస్వామివారికి, ధ్వజస్తం భం, శ్రీ బేడి ఆంజనేయస్వామివారి గోపురాల కలశాలకు పవిత్ర జలం, పాలతో అభిషేకం చేశారు. వాస్తు హోమం.. మహాసంప్రోక్షణ మొదటి ఘట్టంలో ఉదయం స్వామివారికి నిర్వహించే సేవల అనంతరం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో హోమగుండాలు వెలిగించారు. పుణ్యాహవచనం అనంతరం వాస్తుహోమం చేశారు. దేహ శుద్ధి కోసం ఆకల్మషా హోమాన్ని అర్చకులు నిర్వహించారు. ప్రాతఃకాలంలో ప్రత్యేక హోమాలు, పూజలు జరిగాయి. ఈ కార్యక్రమాలన్నీ మధ్యాహ్నం 12 గంటల లోపు పూర్తి చేశారు. 12 గంటల నుంచి శ్రీవారి ఆలయంలోకి భక్తులను అనుమతించారు. రాత్రి 7 గంటలకు వైదిక కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. రాత్రి 9 గంటలకు వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారం ముందుగా కలకర్షణ కార్యక్రమం చేశారు. అష్టదిక్కుల్లో సంధి బంధనం వైఖానస ఆచార్యుల ఆధ్వర్యంలో సంప్రదాయ శిల్పాచార్యుల సహకారంతో అష్టబంధన ద్రవ్యాలను సేకరించి, ఆయా ద్రవ్యాలకు సంబంధించిన దేవతలను ఆరాధించి అష్టబంధనం తయారు చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం రుత్వికులు శాస్త్రోక్తంగా అష్టబంధనం ద్రవ్యాలను సేకరించారు. శ్రీవారి మూలమూర్తితోపాటు ఇతర దేవతామూర్తుల విగ్రహాలకు అష్టబంధనాన్ని సమర్పిస్తారు. 8 రకాల ద్రవ్యాలతో.. ఎనిమిది రకాల ద్రవ్యాలతో అష్టబంధనాన్ని తయారు చేస్తారు. వీటిలో శంఖచూర్ణం 25.5 తులాలు, మధుజ (తేనెమైనం) 3.5 తులాలు, లాక్షా(లక్క) 3.75 తులాలు, గుగ్గులు(వక్షపు బంక) 9 తులాలు, కార్పాసం(ఎర్ర పత్తి) 1 తులం, త్రిఫలం(ఎండిన ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ) 7.5 తులాలు, రక్తశిలాచూర్ణం (గైరికము) 7.5 తులాలు, మాహిష నవనీతం (గేదె వెన్న) 15 తులాలు ఉంటాయి. వీటికి ఔషధ గుణాలుంటాయి. ఆగమోక్తంగా అష్టబంధనం సమర్పణ గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన గరుడాళ్వార్, పోటు తాయార్లు, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి, విష్వక్సేన, భాష్యకార్లు, వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు. అధివాసం... విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్వంలోని శక్తిని ఆవాహన చేసేందుకు అధివాసం నిర్వహిస్తారు. ప్రాణప్రతిష్ట ద్వారా విగ్రహాలు అనంతమైన శక్తిని పొందుతాయి. విగ్రహరూపంలో ఉన్న దేవతలను దర్శించడం ద్వారా కోరిన కోరికలు తీరడంతోపాటు మానసిక శాంతి చేకూరుతుంది. అధివాసం రకాలు శాస్త్రాల ప్రకారం ఆలయాల ప్రాణప్రతిష్ఠ సమయంలో క్షీరాధివాసం, జలాధివాసం, ఫలాధివాసం, ఛాయాధివాసం, ధాన్యాధివాసం, పుష్పాధివాసం, శయనాధివాసం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తారు. క్షీరాధివాసం... శ్రీవారి మూలమూర్తిని పవిత్రమైన పాలతో అభిషేకం చేయడాన్నే క్షీరాధివాసం అంటారు. ’క్షీరసాగర తరంగ శిఖర సార తరకిత చారుమూర్తే’ అంటూ ముకుందమాల స్తోత్రంలో శ్రీకులశేఖరాళ్వార్ క్షీరాధివాసం వైశిష్ట్యాన్ని తెలియజేశారు. -
వెంకన్న స్వామీ..నీ కొండకు నీవే రక్ష!
సాక్షి, తిరుపతి: ఏడు కొండలపై వెలసిన శ్రీవెంకటేశ్వరుడే తన ఆస్తులను కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు రగిల్చిన చిచ్చు రోజురోజుకూ రాజుకుంటోంది. తాజాగా టీటీడీ మాజీ సీవీఎస్ఓ రమణకుమార్ డాలర్ శేషాద్రి గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తిరుపతి పోలీస్ అతిథిగృహంలో మాజీ సీవీఎస్ఓ రమణకుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తిరుమల శ్రీవారి ఆలయంలో చోటు చేసుకున్న ముఖ్యమైన విషయాల గురించి ప్రస్తావించారు. అదేవిధంగా మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు. తిరుమల అలిపిరి పాదాల మండపం వద్ద సన్నిధి గొల్లలు టీటీడీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఒకేరోజు ఇన్ని పరిణామాలు జరగడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరుమల శ్రీవారి ఆభరణాల్లోని 300 బంగారు డాలర్లు గతంలో కనిపించకుండా పోయిన విషయాన్ని మాజీ సీవీఎస్ఓ రమణకుమార్ గుర్తుచేశారు. ఆ సమయంలోనే పింక్ డైమండ్ కూడా పోయిందని రమణ దీక్షితులు చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ఆ సమయంలో రమణ దీక్షితులతో పాటు నరసింహ దీక్షితులు కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లోనే శ్రీవారికి రూ.లక్ష కోట్లు విలువచేసే ఆభరణాలు ఉండేవని మాజీ ఈఓ రమణాచారి వెల్ల డించిన విషయాన్ని తెలియజేశారు. ఇంకా రూ.50వేల కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు కూడా ఉండేవని తన నివేదికలో పేర్కొన్నట్లు వివరించారు. ఆ తాళాలు డాలర్ శేషాద్రి వద్దే.. వేల కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను భద్రపరచే గది తాళాలు రెండూ అప్పట్లో టీటీడీ డాలర్ శేషాద్రి వద్దే ఉంచిన విషయాన్ని మాజీ సీవీఎస్ఓ రమణమూర్తి తప్పుబట్టారు. డాలర్ శేషాద్రి అనే వ్యక్తి మొదట్లో టీటీడీలో పారుపత్తేదారుగా ఉద్యోగంలో చేరారు. ఆయన టీటీడీలో మంత్రాలు, ఆశీర్వాదాలు చేసే స్థాయికి ఎదిగిన విషయాన్ని రమణకుమార్ ప్రస్తావించారు. పదవీ విరమణ పొందిన డాలర్ శేషాద్రి అనే వ్యక్తి మంత్రాలు పఠించడం, ఆశీర్వాదాలు చేయడాన్ని తప్పుబట్టారు. బంగారు ఆభరణాలు భద్రపరిచే గది తాళాలు రెండూ డాలర్ శేషాద్రికి అప్పగించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఆ తాళాలు రెండింటిలో ఒకటి డెప్యూటి ఈఓ వద్ద, మరొకటి పేష్కార్ వద్ద ఉండాలన్నారు. ఇదిలా ఉంటే డాలర్ శేషాద్రి రిటైర్ అయినా ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో టీటీడీలో కొనసాగించడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. 1933 నుంచి ఉండాల్సిన రికార్డులు 1952 నుంచే ఉండడంపై అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కోరినట్లు సీబీఐ దర్యాప్తు జరిగితే ఆయన అవకతవకలే వెలుగు చూస్తాయని రమణకుమార్ వెల్ల డించారు. అయితే చివరగా శ్రీవారి ఆలయంలోని ఆభరణాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని చెప్పడం గమనార్హం. ఇదిలావుంటే టీటీడీ మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు టీటీడీ బోర్డు నియామకంపై ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. అన్యమతస్తురాలు ఎమ్మెల్యే అనితను సభ్యురాలిగా నియమిం చేందుకు నిర్ణయం తీసుకున్నపుడే టీటీడీ ప్రతిష్ట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. సన్నిధి గొల్లల ఆందోళన.. టీటీడీ పాలకమండలి తీసుకున్న 65 ఏళ్లకే రిటైర్మెంట్ నిర్ణయాన్ని సన్నిధి గొల్లలు తప్పుబడుతున్నారు. రమణ దీక్షితులను తొలగించినట్లే సన్నిధి గొల్లలను ఉద్యోగులుగా పరిగణించి రిటైర్మెంట్ ఇచ్చేందుకు టీటీడీ ప్రయత్నాలు ప్రారంభించిందని వారు ఆరోపిస్తున్నారు. అందుకు నిరసనగా ఆదివారం సన్నిధి గొల్లలు, యాదవులు సంప్రదాయ వృత్తుల వేషధారణలో అలిపిరి పాదాల మండపం వద్ద నిరసన తెలియజేశారు. టీటీడీలో కులరాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను టీటీడీలో పనిచేసే కొందరు మంటగలుపుతున్నారని మండిపడ్డారు. తాము టీటీడీలో ఉద్యోగులం కాదని, శ్రీవారి సేవకులం మాత్రమేనని స్పష్టం చేశారు. సేవకులకు రిటైర్మెంట్ ఉండదని గుర్తుచేశారు. -
శ్రీవారి ఆలయంలో అపచారం
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. స్వామివారి సన్నిధిలోని రాములవారి మేడ వద్ద భూదేవి అమ్మవారి విగ్రహం కిందపడింది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి ఆలయంలో గర్భాలయ మూలమూర్తితోపాటు నాలుగు అతిముఖ్యమైన విగ్రహాలున్నాయి. సోమవారం మధ్యాహ్నం ఆలయం వెలుపల వైభవోత్సవ మండపంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. సహస్ర దీపాలంకార సేవ రద్దు చేయటంతో అర్చకులు 3.30 గంటలకు ఉత్సవమూర్తులను బంగారు వాకిలి వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆలయంలోకి తీసుకెళ్తుండగా భూదేవి అమ్మవారి విగ్రహం రాములవారి మేడ వద్ద ప్రమాదవశాత్తు కిందపడింది. అర్చకుల అజాగ్రత్త కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా విగ్రహ కిరీటం, పీఠం భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనను అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఆలయంలో అర్చకుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఈ ఘటనకు పరోక్ష కారణమని తెలుస్తోంది. -
31న శ్రీవారి ఆలయం మూసివేత
సాక్షి, తిరుమల: ఈనెల 31వ తేదీన తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఉదయం నుంచి రాత్రివరకు మూసివేయనున్నారు. ఆరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మూసి ఉంచనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. -
తిరుమలలో సర్వ దర్శనానికి 26 గంటలు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. 29, 30లలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ శుద్ధి కారణంగా ఉదయం 11 గంటల వరకు దర్శనం నిలిపివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కానుంది. 28 నుంచి ఐదు రోజులపాటు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వ దర్శనానికి 26 గంటలు పట్టే అవకాశం ఉంది. సోమవారం 88,507 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగింది. 33,102 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. స్వామివారికి హుండీ ఆదాయం రూ.4కోట్లు వచ్చింది. -
1న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
సాక్షి, తిరుమల : నవంబర్ 1న కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించనున్నారు. స్థితికారుడైన మహావిష్ణు వును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. కైశిక ద్వాదశి మహోత్సవాన్ని టీటీడీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంది. స్నపనమూర్తిగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కైశిక ద్వాదశి రోజు మాత్రమే తెల్లవారుజామున 4.30 నుంచి 5.30 గంటల్లోపు ఆలయ అర్చకులు తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 నుంచి 7.30 గంటల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా నిర్వహిస్తారు. ఆ రోజు సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆరోజు వారపు ప్రత్యేక సేవ సహస్రకలశాభిషేకాన్ని టీటీడీ రద్దు చేసింది. -
జూబ్లీహిల్స్‌లో వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణం
శంకుస్థాపన చేసిన టీటీడీ చైర్మన్ చదలవాడ హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే సేవలు, పూజలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జూబ్లీహిల్స్‌లోని మూడున్నర ఎకరాల స్థలంలో రూ.28 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ మహాగణపతి దేవాలయాలు నిర్మిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆయన ఆలయ నిర్మాణ పనులకు టీటీడీ పాలక మండలి సభ్యులు కె.రాఘవేంద్రరావు, చింతల రాంచంద్రారెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సుచరిత, అరికెల నర్సారెడ్డిలతో కలసి శంకుస్థాపన చేశారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏడాదిలోగా ఆలయ నిర్మాణం పూర్తవుతుందన్నారు. కురుక్షేత్ర, కన్యాకుమారిలో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తున్నామన్నారు. తన నియోజక వర్గంలో ఈ ఆలయం నిర్మితమవడం ఆనందంగా ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే,టీటీడీ పాలకమండలి సభ్యుడు, చింతల రాంచంద్రారెడ్డి తెలిపారు. -
నేటినుంచి టీటీడీ నమూనా ఆలయం ప్రారంభం
తిరుపతి అర్బన్: పవిత్ర కృష్ణా పుష్కరాల సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం ఆదివారం ఉదయం ప్రారంభం కానుందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు విజయవాడ పీడబ్ల్యూడీ మైదానంలో నమూనా ఆలయం వద్ద ఉదయం 7 నుంచి 9 గంటల వరకు మహా సంప్రోక్షణ శాస్త్రోక్తంగా నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం కృష్ణానది నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో సంప్రోక్షణ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నామన్నారు. ఈ నమూనా ఆలయంలో వైఖాసన ఆగమోక్తంగా సేవలన్నీ స్వామి వారికి ఏకాంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందులో ఉదయం ప్రారంభం అయ్యే తొలి సుప్రభాతం, అనంతరం తోమాల సేవ, కొలువు, అర్చన, నివేదన, శాత్తుమొర, ఊంజల్ సేవల, ఏకాంత సేవలను తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో నిర్వహించేందుకు టీటీడీ అర్చకులు అన్ని చర్యలు తీసుకున్నారని వివరించారు. లక్షమంది భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. భక్తులకు అన్నప్రసాదం, తీర్థప్రసాదాలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. రోజూ సాయంత్రం నమూనా ఆలయం నుంచి పద్మావతి ఘాట్ వెళ్లి పుష్కర హారతి ఇవ్వడం ద్వారా కృష్ణమ్మకు శ్రీవారి ఆశీస్సులు అందిస్తారని తెలిపారు. -
విజయవాడలో శ్రీవారి నమూనా ఆలయం
-
తిరుమలలో కొత్త బూందీ పోటు
భక్తులు కోరినన్ని లడ్డూలివ్వాలని టీటీడీ యోచన సాక్షి, తిరుమల: తిరుమలలో పెరుగుతున్న లడ్డూ డిమాండ్‌కు అనుగుణంగా ఆలయం వెలుపల కొత్త బూందీ పోటు నిర్మించాలని టీటీడీ భావిస్తోంది. శ్రీవారి ఆలయంలో రోజూ 2 నుంచి 3 లక్షలు, రద్దీ రోజుల్లో 3 నుంచి 4 లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తున్నారు. దీనివల్ల లడ్డూకు అవసరమైన బూందీ తయారు చేయటానికి ఆలయం వెలుపల బూందీ పోటు చాలటం లేదు. ఇక్కడ కేవలం 40 గ్యాస్‌స్టౌలు ఉన్నాయి. వీటి ద్వారా భక్తుల డిమాండ్‌కు తగ్గట్టుగా బూందీ తయారీ సాగటం లేదు. అయినప్పటికీ నిర్విరామంగా సాగిం చటం వల్ల అనుకోని అగ్నిప్రమాదాలు ఎదురయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆలయం వెలుపల ప్రస్తుతం ఉన్న బూందీ పోటుకు అనుబంధంగా సరికొత్త శాస్త్రీయ, సాంకేతిక పద్ధతులతో కొత్త బూందీ పోటు నిర్మించాలని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు యోచిస్తున్నారు. ఇందులో భాగంగా నిపుణుల బృందం సలహాలు తీసుకోవటంలో నిమగ్నమయ్యారు. త్వరలోనే కొత్త బూందీ పోటు నిర్మాణం పనులు సాగించే అవకాశం ఉంది. కొత్త బూందీ పోటు నిర్మాణం పూర్తయితే భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చే అవకాశం ఉంది. బూందీ పోటుకు కొత్త పైకప్పు నిర్మాణం పూర్తి శ్రీవారి ఆలయం వెలుపల అగ్నిప్రమాదానికి గురైన బూందీ పోటులో శనివారం మరమ్మతు పనులు పూర్తి చేశారు. ఎగిసిపడిన మంట లకు కాలిన పైకప్పును పూర్తిగా తొలగిం చారు. కాలిన యంత్రాలు, విద్యుత్ వైర్లు, రేకులు, పనిముట్లు కూడా తొలగించారు. దాని స్థానంలో కొత్త రేకులతో పైకప్పు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో ఇక బూందీ తయారీ నిర్విరామంగా కొనసాగనుంది. ఈ పనులను శనివారం ఈవో పరిశీలించారు. -
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల: జూన్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్లైన్లో శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 49,046 టికెట్లను అధికారులు విడుదల చేశారు. ఆన్లైన్లో www.ttdseva-online.com వెబ్సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పద్మావతి పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ మూడు రోజుల పాటు తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు. సేవా టికెట్లు వివరాలు: సుప్రభాతం 6,157 తోమాల 140 అర్చన 140 విశేషపూజ 750 అష్టదళపాదపద్మారాధన 80 నిజపాద దర్శనం 1,115 కల్యాణోత్సవం 10,874 ఊంజల్‌సేవ 2,900 వసంతోత్సవం 6,880 ఆర్జిత బ్రహ్మోత్సవం 6,235 సహస్రదీపాలంకరణ సేవ 13,775 -
నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా
నేటి ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి.. సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో నిర్వహించే వివిధ ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్ల కోటాను టీటీడీ అధికారుల శుక్రవారం విడుదల చేస్తారు. అదేరోజు ఉదయం 11 గంటల నుంచి ఆన్లైన్లో www.ttdseva-online.com వెబ్సైట్ ద్వారా ముందస్తుగా రిజర్వు చేసుకోవచ్చు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు పద్మావతి పరిణయోత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ మూడు రోజుల పాటు తోమాల, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేశారు. తిరుమలలో ప్రతి నెలా మొదటి శుక్రవారం నిర్వహించే డయల్ యువర్ టీటీడీ ఈవో కార్యక్రమం శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు నిర్వహించనున్నారు. టీటీడీ పరిధిలో ఎదురయ్యే సమస్యలు, సూచనలపై భక్తులు 0877-2263261 నంబరుకు ఫోన్ ద్వారా టీటీడీ ఈవో డాక్టర్ డి.సాంబశివరావుకు తెలియజేయవచ్చు. -
కొత్త జంటలకు శ్రీవారి లడ్డూలు
తిరుమల : తిరుమల కల్యాణవేదికలో బుధవారం పెళ్లి చేసుకున్న జంటలకు పది చిన్న లడ్డూలు, శ్రీవారి ఆలయం నుంచి అక్షింతలు, కంకణాలు, తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ తెప్పించి అందజేశారు. తిరుమలలోని పురోహిత సంఘంలోని కల్యాణవేదిక కేంద్రంగా ఈనెల 25వ తేది నుంచి టీటీడీ ఉచిత వివాహాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం 25 గ్రాముల బరువు కలిగిన 10 ఉచిత లడ్డూలు బహుమానంగా అధికారులు అందజేశారు. అలాగే, శ్రీవారి ఆలయం నుంచి కంకణాలు, అక్షింతలతోపాటు తిరుచానూరు అమ్మవారి ఆలయం నుంచి తెప్పించిన పసుపు, కుంకుమ అందజేశారు. కల్యాణకట్ట డిప్యూటీ ఈవో బేబీ సరోజిని వాటిని కొత్త జంటకు అందజేసి ఆశీర్వదించారు. మలివిడతలో కొత్త జంటలకు శ్రీవారి కానుకగా ఇదే సందర్బంగా ఉచితంగా రూ. 300 టికెట్లతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. -
ముంబయిలో శ్రీవారి ఆలయం
స్థల పరిశీలన మహారాష్ట్ర సీఎంను కలసిన టీటీడీ చైర్మన్, ఈవో తిరుపతి: ముంబయి మహా నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించదలచిన శ్రీవారి ఆలయం, సమాచార కేంద్రం స్థలాలను టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ సాంబశివరావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ముంబయిలో కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన లేఖను అందజేశారు. ముంబయి నుంచి తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, వారికి కావాల్సిన సౌకర్యాలను తిరుపతి, తిరుమలలో కల్పిస్తున్న వైనాన్ని ఆయనకు వివరించారు. అందులో భాగంగానే ముంబయిలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి స్థలం కేటాయిస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అందుకు మహారాష్ర్ట సీఎం ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. త్వరలో జరగనున్న తమ మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై చర్చించి ఆమోదిస్తామని ఫడ్నవీస్ హామీ ఇచ్చినట్లు చదలవాడ పేర్కొన్నారు. అనంతరం నవీ ముంబయిలోని బేలాపూర్ ప్రాంతంలోని 2.4 ఎకరాల స్థలాన్ని టీటీడీ చైర్మన్‌తో పాటు ఈవో, జేఈవో పోలా భాస్కర్ పరిశీలించారు. ఈ స్థలంలో అయితే ఆలయం, సమాచార కేంద్రం, ఈ-దర్శన్ కౌంటర్ల నిర్మాణానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కూడా టీటీడీ బృందం కలసి స్థల అంశాన్ని ప్రస్తావించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
మార్చి 9న సూర్యగ్రహణం
12 గంటలపాటు శ్రీవారి ఆలయం మూసివేత సాక్షి, తిరుమల: వచ్చేనెల... మార్చి 9 వ తేదీ ఉదయం 5.47 నుంచి ఉదయం 9.08 గంటల మధ్య సూర్యగ్రహణం సంభవించనుంది. ఈసందర్భంగా శ్రీవారి ఆలయం సుమారు 12 గంటలపాటు మూసివేయనున్నారు. మార్చి 8న మంగళవారం రాత్రి 8.30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి మార్చి 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవచనం, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాతే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈసందర్భంగా మార్చి 9వ తేదీన సహస్రకలశాభిషేకం రద్దుచేశారు. ఇతర సేవల్ని ఏకాంతంగా నిర్వహిస్తారు. -
నోటు విలువ కోటి రూపాయలు!
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్నకు విదేశీ కరెన్సీ వెల్లువెత్తింది. సోమవారం శ్రీవారి ఆలయ హుండీల్లోని ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో 11 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు లభించినట్టు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు చెప్పారు. ఇందులో టర్కీ దేశానికి చెందిన 5 లక్షల లిరసీ నోటు (భారత కరెన్సీ ప్రకారం రూ.1,14,48,362.12) ఉంది. అమెరికా డాలర్లు 265, సౌదీ అరేబియన్ రియాల్స్ 730, ఖతర్ రియాల్ 1, యూఏఈ దర్హమ్స్ 60, మలేషియా రింగిట్స్ 170, కెనడా డాలర్లు 5, యూరోలు 10, సింగపూర్ డాలర్లు 7, కువైట్ దినార్ 1, నేపాల్ రూ.10 నోటు ఒకటి హుండీలో లభ్యమయ్యాయి. -
ప్రత్యేక అలంకరణలో శ్రీవారి ఆలయం
నూతన సంవత్సరానికి భారీ ఏర్పాట్లు చేసిన టీటీడీ సాక్షి, తిరుమల: నూతన సంవత్సరానికి తిరుమల ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలోనూ అదనపు క్యూలు ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా సీసీ కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు వీఐపీ దర్శనం ప్రారంభించనున్నారు. అందరికీ లఘుదర్శనం అమలు చేయాలని నిర్ణయించారు. గంటలోపే వీఐపీలకు దర్శనం పూర్తిచేసి, తర్వాత సర్వదర్శనం, కాలిబాట భక్తులకు దర్శనం కల్పించనున్నారు. రూ.300 టికెట్ల భక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేశారు. దర్శనానికి అనుమతించలేదని భక్తుల ఆందోళన సాక్షి , తిరుమల: శ్రీవారి దర్శనానికి అనుమతించలేదని టీటీడీ ట్రస్టులకు విరాళాలిచ్చిన భక్తులు గురువారం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద ఆందోళనకు దిగారు. నూతన సంవత్సరం సంద ర్భంగా డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు. ఈ సమాచారాన్ని టీటీడీ వెబ్సైట్, ఈ-మెయిల్ ద్వారా భక్తులకు చేరవేశారు. అయితే గురువారం 50 మందికిపైగా విరాళాలిచ్చిన భక్తులను దర్శనానికి అను మతించలేదు. తాము రూ.30 లక్షల వరకు టీటీడీకి విరాళాలిచ్చామని, ముందస్తు సమాచారం లేకుం డా దర్శనానికి అనుమతించకపోవడం సబబుకాదని ఆందోళనకు దిగారు. అనంతరం టీటీడీ ఈవో సాంబశివరావు, జేఈవో శ్రీనివాసరాజు ఆదేశాలతో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ ఆ భక్తులను స్వామి దర్శనానికి అనుమతించారు. -
శ్రీవారి ఆలయ సమీపంలోనే విమాన ప్రయాణం
తిరుమల: గగనతలంపై తిరుమల ఆలయానికి సమీపంలోనే బుధవారం ఓ విమానం ప్రయాణించింది. ఉదయం 8 గంటల సమయంలో ఆలయ గగనతలంలో పడమర దిశ నుంచి తూర్పు దిశగా విమానం వెళ్లింది. ఆలయానికి అతి సమీపంలో విమానాలు ప్రయాణించడం భద్రతా కారణాల రీత్యా టీటీడీని కలవరపెడుతోంది. దీనిపై కేంద్రానికి టీటీడీ ఫిర్యాదు కూడా చేసింది. ఆలయ సమీప ప్రాంతంలో విమాన ప్రయాణాన్ని నిషేధిస్తామని సాక్షాత్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ప్రకటించినా అమలు కాలేదు. -
తిరుమలలో ‘చిరు’ సందడి
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం సినీనటుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి సందడి చేశారు. చాలా రోజుల తర్వాత తన సతీమణి సురేఖ, కుమార్తెలు సుష్మిత, శ్రీజ, పెద్దల్లుడు విష్ణుప్రసాద్, ముగ్గురు మనుమరాళ్లతో కలసి ఆయన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. ఆలయం వెలుపల చేయి చాచిన భక్తులు, అభిమానులను ఆప్యాయంగా పలకరించారు. చిరంజీవిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకున్నారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది అష్టకష్టాలు పడ్డారు. కొన్ని మధురం... మరికొన్ని చేదు తిరుపతి, తిరుమలతో చిరంజీవికి ఎంతో అనుబంధం ఉంది. సినీనటుడుగా ఆయన ఎన్నోసార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన 2008 ఆగస్టు 26వ తేదీన తిరుపతిలోనే ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తన జీవితంలో మధుర జ్ఞాపకమని అప్పట్లోనే చిరంజీవి ప్రకటించారు. 2009లో ఎన్నికల్లో ఎమ్మెల్యే పాలకొల్లులో, తిరుపతిలో పోటీ చేశారు. పాలకొల్లులో ఓటమిపాలై, తిరుపతిలో గెలుపొందారు. తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని 2011, ఫిబ్రవరి 6న కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అది లక్షలాదిమంది అభిమానుల్లో చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. అతితక్కువ కాలంలోనే తన ఎమ్మెల్యే పదవికి 2012, మార్చి 29న రాజీనామా చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా నియమితులై కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. తిరుపతిని సుందరంగా అభివృద్ధి చేస్తానని, తిరుమల స్థానికుల సమస్యలు పరిష్కరిస్తానని హామీల వర్షం కురిపించారు. ఆ సందర్భంగా పలుమార్లు తిరుపతి నియోజకవర్గంలో తిరిగారు. అయినా ఎక్కడి సమస్యలు అక్కడే దర్శనమిచ్చాయి. చిరంజీవి ఎమ్మెల్యేగా ఉన్నపుడు ఆయన హామీని నమ్మి తమ ఇళ్లు ఖాళీ చేసిన తిరుమల బాలాజీనగర్వాసులకు తిరిగి ఇళ్లు దక్కలేదు. మూడేళ్లుగా సత్రాల్లోనే జీవనం సాగిస్తూ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. చాలా కాలం తర్వాత తిరుపతి, తిరుమలలో కాలుమోపిన చిరంజీవికి పాత జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇదిలా ఉంటే.. చిరంజీవిని కలిసేందుకు శనివారం బాలాజీనగర్ బాధితులు అతిథిగృహానికి వచ్చారు. అప్పటికే ఆయన తిరుగు ప్రయాణం కావడంతో వారు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. -
అపచారం.. అపచారం
-
మే 1న టీటీడీ పాలకమండలి ప్రమాణం
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్తగా ఏర్పడిన ధర్మకర్తల మండలి మే 1వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనుంది. తిరుమలలో బుధవారం ఉదయం ఆలయ జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం చైర్మన్ సహా పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. కాగా టీటీడీ పాలకమండలి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి నియమితులైన విషయం తెలిసింది. చదలవాడతో పాటు సుమారు 18 మంది సభ్యులు టీటీడీ పాలకమండలిలో నియమితులైయ్యారు. -
వైభవంగా శ్రీవారి ఉగాది ఆస్థానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం శ్రీమన్మథనామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభవంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతం, అభిషేకం శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. ఉదయం బంగారు వాకిలిలో నిర్వహించిన ఆస్థానంలో భా గంగా సర్వభూపాల వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారిని వేంచేపు చేశారు. ఆలయ జీయర్ స్వాములు, టీటీడీ ఈవో సాంబశివరావు, ప్రధాన అర్చకులు రమణదీక్షితులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆ స్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. తిథి, వార, నక్షత్రాల తోపాటు నూతన సంవత్సర ఫలితాలు, లాభ నష్టాలు, నవ గ్రహాలు, సస్యవృద్ధి, పశువృద్ధి, 27 నక్షత్ర జాతకుల కందాయ ఫలాలు, రాజపూజ్యత, అవమానాలు స్వామివారికి వినిపించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. -
'రెండు నెలల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు'
తిరుమల: రెండు నెలల్లో టీటీడీ పాలకమండలి ఏర్పాటు కానున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు పేర్కొన్నారు. ఆదివారం శ్రీవారి ఆలయం ముందు మహామణి మండపాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. భద్రతా కారణాల దృష్ట్యా నారాయణగిరి ఉద్యానవనంలో మహామణి మండపాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సూచించిందని మాణిక్యాలరావు చెప్పారు. -
బంగారు వాకిలి తాళం మొరాయింపు
శ్రీవారి ఆలయంలో హైరానా - కట్‌చేసి తాళం తొలగింపు - యథావిధిగా సుప్రభాత సేవ సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం అనుకోని సంఘటన ఎదురైంది. వేకువజామున సుప్రభాత వేళకు ముందు బంగారు వాకిలికి అమర్చిన తాళం మొరాయించింది. వెల్డింగ్ యంత్రంతో కట్‌చేసి తాళం తొలగించి యథావిధిగా సుప్రభాత సేవను నిర్వహించారు. గర్భాలయానికి సుమారు 70 అడుగుల ముందు బంగారు వాకిలి ఉంది. ప్రతిరోజూ రాత్రి 12.30 గంటలకు ఏకాంత సేవ ముగిసిన వెంటనే బంగారు వాకిలి ద్వారం మూసివేసి మూడు తాళాలు వేస్తారు. అందులో ఒకదానికి సీలు వేస్తారు. తాళం చెవులు జీయర్, అర్చకులు, ఆలయ పేష్కారు వద్ద ఉంటాయి. మరుసటి రోజు వేకువన 2.20 గంటలకు సుప్రభాత సేవకు ముందు తాళాలు తొలగించి సేవను నిర్వహిస్తారు. బుధవారం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన బృందం కూడా సుప్రభాత సేవకు హాజరైంది. దీంతో ఆలయ బంగారు వాకిలిని ఐదు నిమిషాలకు ముందే 2.15 గంటలకు తెరిచేందుకు అర్చకులు ప్రయత్నించారు. రెండు తెరుచుకున్నాయి. సీలు వేసిన తాళంలోని లివర్స్ తెగిపోవడం వల్ల అర్చకులు, అధికారులు ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు. అప్పుడే శ్రీలంక బృందంతో ఆలయంలోకి ప్రవేశించిన ఈవో సాంబశివరావుకు సమాచారం ఇచ్చారు. ఆవయన ఆదేశాలతో కట్టర్‌తో తాళాన్ని కోసి తొలగించారు. అప్పటికే 2.48 నిమిషాలైంది. తర్వాత గర్భాలయంలో వైదిక కార్యక్రమాలు జరిగాయి.ఈ సంఘటనలో మానవ తప్పిదం లేకపోయినా ముందస్తు చర్యలు తీసుకోకపోవడంపై ఈవో ఆలయ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జాప్యంలేదు : డిప్యూటీ ఈవో ‘‘సాక్షాత్తు శ్రీవేంకటేశ్వర స్వామివారి మీదే ప్రమాణం చేస్తున్నా.. శ్రీవారి సుప్రభాత సేవ 3 గంటలకే ప్రారంభమైంది’’ అని ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తెలిపారు. జాప్యం జరిగిందన్నది అవాస్తవమన్నారు. -
శ్రీవారి ఆలయానికి భద్రత పెంచండి
* లోక్‌సభలో ఎంపీ పెద్దిరెడ్డి * మిథున్‌రెడ్డి డిమాండ్ సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయానికి భద్రత మరింత పెంచాలని లోక్‌సభలో రాజం పేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసి.. భక్తుల మనోభావాలను పరిరక్షించాలని కోరారు. లోక్‌సభలో మంగళవారం జీరో అవర్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ దేశ, విదేశాల నుంచి భక్తులు రోజూ సగటున లక్ష మంది తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు శ్రీవారిని కొలుస్తున్నారన్నారు. కొన్ని ఉగ్రవాద సంస్థలు శ్రీవారి ఆలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇటీవల జారీచేస్తున్న హెచ్చరికలు భక్తుల్లో ఆందోళన నింపుతున్నాయని వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో శ్రీవారి ఆలయానికి భద్రత కల్పిస్తున్నారని చెప్పారు. శ్రీవారి ఆలయ భద్రతలో కేంద్రం కూడా పాలుపంచుకుంటే బందోబస్తు పటిష్టమవుతుందని సూచించారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్(ఐబీ) వంటి నిఘా సంస్థలు కేంద్రం నేతృత్వంలో పనిచేస్తున్న నేపథ్యంలో.. ఉగ్రవాద కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వానికన్నా కేంద్ర ప్రభుత్వం వద్దే ఎక్కువ సమాచారం ఉండే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భద్రతను కల్పిస్తే ఉగ్రవాదుల నుంచి ఎలాంటి ముప్పు ఉండదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్న నేపథ్యంలో తక్షణం కేంద్రం స్పందించి శ్రీవారి ఆలయానికి భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి జీవో అవర్‌లో లేవనెత్తిన ఈ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో బుధవారం గానీ, గురువారంగానీ రాతపూర్వక సమాధానం ఇవ్వనున్నారు.