![Ttd Serious About The Flight Over Tirumala Temple - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/7/The-Flight-Over-Tirumala-Temple.jpg.webp?itok=Z1F7MRff)
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లడంపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కేంద్రానికి అనేక మార్లు టీటీడీ లేఖలు రాసిన ప్రయోజనం లేకపోయింది. విమానాల రాకపోకలపై అధికారులు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని టీటీడీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
విమాన సంచారం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా భావిస్తారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కేంద్రాన్ని టీటీడీ మరోసారి కోరనుంది. ఆగమ శాస్త్ర నియమం ప్రకారం తిరుమల ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే తరచూ ఆలయ పైభాగంలో విమానాలు వెళుతున్నాయి. తాజాగా ఘటన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది.
చదవండి: మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు
Comments
Please login to add a commentAdd a comment