సాక్షి, తిరుపతి: తిరుమలలో గత అర్ధరాత్రి చిరుత హల్ చల్ చేసింది. శ్రీవారి పాదాల ఆటవీ ప్రాంతం నుంచి మ్యూజియం ముందర గోడమీద దర్జాగా కూర్చుంది. చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయం తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీవారి దర్శనం అనతరం లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులు బయటకు వచ్చే రోడ్డులోనే చిరుత తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భక్తులు బసచేసే ప్రాంతాల్లో చిరుతలు సంచరించిన ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. ఇటీవల ఓ చిరుత రెండో ఘాట్ రోడ్డులో వాహన దారులపై దాడికి దిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చిరుత సంచారం అధికారులు, భక్తుల్లో కలవరం పుట్టించింది.
(చదవండి: తిరుమలలో భారీ కొండచిలువ కలకలం)
తిరుమల: గోడ మీద దర్జాగా కూర్చున్న చిరుత
Published Wed, Sep 2 2020 3:40 PM | Last Updated on Wed, Sep 2 2020 5:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment