Srivari padalu
-
తిరుమలలో అర్ధరాత్రి చిరుత హల్చల్
సాక్షి, తిరుపతి: తిరుమలలో గత అర్ధరాత్రి చిరుత హల్ చల్ చేసింది. శ్రీవారి పాదాల ఆటవీ ప్రాంతం నుంచి మ్యూజియం ముందర గోడమీద దర్జాగా కూర్చుంది. చిరుత కదలికలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ విషయం తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. శ్రీవారి దర్శనం అనతరం లడ్డూ ప్రసాదం తీసుకుని భక్తులు బయటకు వచ్చే రోడ్డులోనే చిరుత తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భక్తులు బసచేసే ప్రాంతాల్లో చిరుతలు సంచరించిన ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. ఇటీవల ఓ చిరుత రెండో ఘాట్ రోడ్డులో వాహన దారులపై దాడికి దిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద చిరుత సంచారం అధికారులు, భక్తుల్లో కలవరం పుట్టించింది. (చదవండి: తిరుమలలో భారీ కొండచిలువ కలకలం) -
తిరుమల: గోడ మీద దర్జాగా కూర్చున్న చిరుత
-
తిరుమలలో గజరాజుల హల్చల్
సాక్షి, తిరుమల : తిరుమల తిరుపతి ఘాట్‌లో ఏనుగులు మరోసారి హల్చల్ చేశాయి. కాలినడక ప్రాంతంలో శ్రీవారి పాదాల వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో గజరాజుల గుంపు సంచారం చేసింది. దీంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్పందించిన అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. శ్రీవారి పాదాలకు సాయంత్ర సమయంలో వచ్చే భక్తులను నిలిపివేశారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా అన్నమయ్య మార్గాన్ని మూసివేశారు. -
శ్రీవారి పాదాల వద్ద రెండు కార్లు ఢీ
తిరుమల: తిరుమలలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. సోమవారం మధ్యాహ్నం శ్రీవారి పాదాలు సమీపంలో సుమో, ఇండికా కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయలయ్యాయి. గాయపడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన దినేష్‌తో పాటు, ఓ చిన్నారి ఉంది. క్షతగాత్రులను స్థానిక అశ్వని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. -
వైభవంగా శ్రీవారి నూతన పాదాల ప్రతిష్టాపన
తిరుపతి : నారాయణగిరి పర్వత శ్రేణుల్లో పాదాల మండలంలో ఇటీవల బొటవేలు దెబ్బతిన్న శ్రీవారి పాదాల స్థానంలో నూతన పాదాల ప్రతిష్టాపన బుధవారం ఉదయం వైభవంగా జరిగింది. దెబ్బతిన్న పాదాల స్థానంలో నూతన పాదాలను ఈరోజు ఉదయం మీన లగ్నంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య సంప్రదాయ బద్ధంగా పండితులు ప్రతిష్ట చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. అయితే.. ఇప్పుడే శ్రీవారి పాదాలను దర్శించుకోవడానికి వెంకటేశ్వరుడి భక్తులకు అనుమతి ఇవ్వడంలేదు. సోమవారం వరకు పనులు జరుగనున్నాయి. అప్పటి వరకు భక్తుల దర్శనాలను నిలిపేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బొటనవేలు విరిగిన శ్రీవారి పాదాలను దేవాలయానికి చెందిన మ్యూజియంలో భద్రపరుస్తామన్నారు. కొత్తగా ప్రతిష్ఠించిన శ్రీవారి పాదాల పరిరక్షణ కోసం ... గాజుతో ఓ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే తిరుమలలో శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతం సందర్బంగా శ్రీవారికి చక్రస్నానం నిర్వహించారు. ప్రతియేటా బ్రహ్మోత్సవాల చివరి రోజు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి, అనంత పద్మనాభస్వామి చతుర్దశి రోజు చక్రస్నానం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 5.30 గంటలకు ఆలయం నుంచి సుదర్శన చక్రతాళ్వార్‌ను ఊరేగింపుగా పురవీధుల గుండా పుష్కరణి వద్దకు తీసుకు వచ్చారు. అక్కడ ఆగమబద్దంగా పూజలు, స్నపన తిరుమంజనం నిర్వహించి, పవిత్ర స్నానం చేయించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. -
రేపు శ్రీవారి నూతన పాదాల ప్రతిష్ఠ
నారాయగిరి పర్వతంలోని శ్రీవారి పాదాల మండపంలో నూతన పాదాలను బుధవారం ప్రతిష్ఠిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. రేపు ఉదయం 6.00 గంటలకు నూతన పాదాలను ప్రతిష్ఠిస్తామన్నారు. అనంతరం భక్తులకు శ్రీవారి పాదదర్శనం చేసుకోవచ్చు అన్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటల నుంచి శ్రీవారి పాదదర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల శ్రీవారి పాదాల్లోని ఓ పాదం బ్రొటన వేలు విరిగింది. అందులోభాగంగా నూతన పాదాలను ప్రతిష్టిస్తున్నట్లు శ్రీనివాసరాజు చెప్పారు.