నారాయగిరి పర్వతంలోని శ్రీవారి పాదాల మండపంలో నూతన పాదాలను బుధవారం ప్రతిష్ఠిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో శ్రీనివాసరాజు మంగళవారం తిరుపతిలో వెల్లడించారు. రేపు ఉదయం 6.00 గంటలకు నూతన పాదాలను ప్రతిష్ఠిస్తామన్నారు.
అనంతరం భక్తులకు శ్రీవారి పాదదర్శనం చేసుకోవచ్చు అన్నారు. కాగా ఈ రోజు మధ్యాహ్నం 12.00 గంటల నుంచి శ్రీవారి పాదదర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల శ్రీవారి పాదాల్లోని ఓ పాదం బ్రొటన వేలు విరిగింది. అందులోభాగంగా నూతన పాదాలను ప్రతిష్టిస్తున్నట్లు శ్రీనివాసరాజు చెప్పారు.