
సాక్షి,తిరుమల : తిరుమల శ్రీవారి మహా ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ బూతులతో విరుచుకుపడడం కొండపై హాట్‌టాపిగ్గా మారింది.
కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహాద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్.
ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. భయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఉంచుకోవద్దని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు.
Comments
Please login to add a commentAdd a comment