employ
-
టీటీడీ ఉద్యోగిపై టీటీడీ బోర్డ్ మెంబర్ బూతుపురాణం
సాక్షి,తిరుమల : తిరుమల శ్రీవారి మహా ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ బూతులతో విరుచుకుపడడం కొండపై హాట్టాపిగ్గా మారింది. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహాద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు. అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. భయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఉంచుకోవద్దని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. -
బస్కింగ్.. జోష్!
సాక్షి, సిటీబ్యూరో: మనం ఏదైనా బజార్లో షాపింగ్ చేస్తూ మన జేబులకు పనిచెబుతుంటాం... అక్కడే మూల ఖాళీగా ఉన్న ప్లేస్‌లో సంగీత బృందం మన చెవులకు పనికలపిస్తుంది.. మనం ఏదో ఖాళీ మైదానంలో వాకింగ్ చేయడానికి వెళతాం... అప్పటికే అక్కడ ఇద్దరో ముగ్గురో మ్యుజీషియన్లు కొన్ని వాయిద్యాలతో సంగీతాన్ని నడిపిస్తుంటారు.ఇలా ప్రజలు సంచరించే వీధుల్లో తమ కళను కళాకారులు ప్రదర్శించడాన్నే బస్కింగ్గా పేర్కొంటారు. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఈ బస్కింగ్ మన దేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. తాజాగా బస్కింగ్ను మెట్రో మెడ్లీ ద్వారా పూర్తి ప్రాచర్యంలోకి తెచ్చిన తొలి నగరంగా హైదరాబాద్ నిలిచింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 19 నుండి 22 వరకూ నగరంలోని మెట్రో స్టేషన్ల కారిడార్లలో గోథే–జెంట్రమ్ హైదరాబాద్ ‘మెట్రో మెడ్లీ’ని నిర్వహిస్తోంది.మెట్రో ప్రయాణికుల కోసం..ఈ ఈవెంట్లో దాదాపు 100 మందికి పైగా సంగీత విద్వాంసులు పాల్గొంటున్నారు. రోజువారీ ప్రయాణికులను ఆనందపరుస్తోంది. అమీర్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎంజీబీ, పరేడ్ గ్రౌండ్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, ఉప్పల్ వంటి మెట్రో స్టేషన్లలో బస్కింగ్ ఈవెంట్ జరుగుతుంది. ‘నగరవాసుల మెట్రో ప్రయాణానికి సంగీతంతో ఆనందాన్ని జత చేయడమే బస్కింగ్ ఉద్దేశమని’ అని గోథే–జెంట్రమ్ హై ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నూరియా వాహనవతి ‘సాక్షి’తో చెప్పారు.జాజ్, టాలీవుడ్, రాక్ నుంచి బాలీవుడ్ వరకూ వివిధ సంగీత శైలులు వీనుల విందు చేస్తాయన్నారు. కళాకారులకు ప్రత్యక్షంగా సంగీత ప్రియుల స్పందన తెలియజేయడం ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. సంగీత కళాకారులను 20 గ్రూపులుగా విభజించారు, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ప్రదర్శన ఇచ్చిన ఏకం బ్యాండ్ గాయకుడు స్లోక రాజు మాటల్లో..చెప్పాలంటే ఇదో వైవిధ్యభరిత అనుభూతి.. బుధవారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో ప్రదర్శన అందించిన కలెక్టివ్ సభ్యుడు, సాక్సాఫోన్ వాయించడంలో పేరొందిన జార్జ్ హల్ మాట్లాడుతూ, ‘నిజ జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సంగీతం..వాటికి రిలాక్సేషన్ అందిస్తుంది. బస్కింగ్ నగరవాసులకు ఓ వింత అనుభూతి’ అని చెప్పారు.నాటిదే.. నేటికీ..తోలుబొమ్మల ప్రదర్శనలు లేదా పాము మంత్రగాళ్లు వంటి సంప్రదాయ వీధి ప్రదర్శనలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం, అయితే అలాంటి కళారూపాలు కనుమరుగయ్యాయి. మరికొన్ని అరుదైపోయాయి. ఈ నేపధ్యంలో బస్కింగ్ పేరిట ఔత్సాహిక కళాకారుల్ని ప్రోత్సహించే ఆధునిక సంస్కృతి నగరానికి పరిచయం కావడం ఆహా్వనించదగ్గ పరిణామమే..బస్కింగ్కి వెల్కమ్..ఎటువంటి ముందస్తు అంచనాలూ లేకుండా ప్రజలకు సంగీత విందును పంచడం మరోవైపు కళాకారులకు ప్రోత్సాహం అందించడం...లక్ష్యాలుగా తొలిసారి నగరంలో బస్కింగ్ ట్రెండ్‌కి నాంది పలికాం. పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణమైన ఈ శైలికి ఈ స్థాయిలో వెల్కమ్ చెప్పిన తొలి నగరం మనదే. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.–నూరియా వాహనవతి, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ గోథే–జెంట్రమ్ఇవి చదవండి: 'సెల్-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి... -
రెగ్యులరైజ్ చేయలేం
-
ప్రైవేటు ఉద్యోగిని దోచుకున్న దుండగులు
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం అప్పటికప్పుడు కేసు కట్టి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తెనాలి రూరల్ : ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగిపై దాడి చేసి, ల్యాప్‌టాప్, నగదును దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఘటన జరిగిన నాడే ఫిర్యాదు చేయగా, గోప్యంగా ఉంచిన పోలీసులు సోమవారం హడావిడిగా నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణంలోని ఐతానగర్‌కు చెందిన కానిస్టేబుల్ కొడుకైన దాసరి సాగర్ కారు కంపెనీలకు సంబంధించి నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో సర్వీస్, కంప్యూటరైజేషన్ శిక్షకుడిగా పని చేస్తున్నాడు. గత నెల 24వ తేదీ రాత్రి ఉద్యోగం నుంచి తిరిగి వచ్చి, ఆటోలో ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఇద్దరు ఆటోలోకి ఎక్కి సాగర్‌పై దాడి చేసి, అతని ల్యాప్‌టాప్, నగదును లాక్కున్నారు. కదులుతున్న ఆటోలో నుంచి దూకేసిన బాధితుడు అదే రోజు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు నిందితులను ఐతానగర్‌కే చెందిన మెరుగుమాల కిరణ్ అలియాస్ కిన్నెట్టు, తూమాటి విజయ్కుమార్లుగా గుర్తించి, సోమవారం అరెస్ట్ చేశారు. -
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సమస్య
-
ప్రభుత్వ వైద్యశాలలో బినామీ ఉద్యోగులు
ప్రభుత్వ వైద్యశాలలో బినామీ ఉద్యోగులు విధులు నిర్వహిస్తూ పట్టుబడ్డ బయటి వ్యక్తులు రోగి బంధువుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో వెలుగులోకి 8 నెలలుగా సాగుతున్న తంతు గుంటూరు మెడికల్: ఎవరు సిబ్బంది..ఎవరు కాదో కూడా తెలియని స్థితిలో గుంటూరు జీజీహెచ్ ఉంది. ప్రై వేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ తమ పని కానిచ్చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రెండునెలల క్రితం బయట ల్యాబ్ వ్యక్తి జీజీహెచ్‌కు వచ్చి రక్తపు శాంపిళ్ళు తన ల్యాబ్‌కు తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇది మరువక ముందే ఆస్పత్రి ఉద్యోగికి బదులు బయట వ్యక్తి విధులను నిర్వహిస్తున్న ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే... వడ్లమూడి గ్రామానికి చెందిన వాసుభక్త శ్రీను అనే వ్యక్తికి పక్షవాతం రావటంతో చికిత్స కోసం ఈనెల 9న కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌లో చే ర్పించారు. ఆస్పత్రి ఇన్‌పేషెంట్ విభాగంలోని 329 నెంబర్ గదిలో శ్రీనుకు వైద్యులు పరీక్షలు చేసి శుక్రవారం సీటీ స్కాన్ చేయించమని చెప్పారు. స్కానింగ్ గది వద్దకు రోగిని తీసుకెళ్ళేందుకు కరుణాకర్, తమ్మిశెట్టి మణికంఠ అనేవారు వచ్చి శ్రీను భార్య లక్ష్మి వద్ద రూ.400 డిమాండ్ చేశారు. తన వద్ద అన్ని డబ్బులు లేవని రూ.250లు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న వారు ఇరువురు స్కానింగ్ గది వద్దకు రోగిని తీసుకు వెళ్లి అక్కడే స్ట్రెచర్‌ను వదిలివచ్చారు. డబ్బులు తీసుకుని కూడా వార్డుకు తీసుకెళ్ళకుండా రోగిని స్కానింగ్ గది వద్దే వదిలి వెళ్ళటంతో లక్ష్మి లిఖిత పూర్వకంగా ఆర్ఎంఓ డాక్టర్ యనమల రమేష్‌కు సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఆయన వారిని పిలిచి విచారించగా అసలు వారు ఆస్పత్రి ఉద్యోగులే కాదని తెలిసింది. ఆస్పత్రిలో నాల్గోతరగతి ఉద్యోగి(ఎంఎన్ఓ)గా పనిచేస్తున్న దుర్గం శివయ్య ఎనిమిది నెలలుగా తాను విధులు నిర్వహించకుండా తన స్థానంలో ప్రై వేటు వ్యక్తి తమ్మిశెట్టి మణికంఠను నియమించాడు. మణికంఠ కరుణాకర్‌తో కలిసి పనిచేస్తున్నాడు. తన విధులను నిర్వహిస్తున్న మణికంఠకు నెలకు రూ.5,000ల చొప్పున శివయ్య చెల్లిస్తుండగా..మణికంఠ తనకు వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తం కరుణాకర్‌కు ఇస్తున్నాడు. శుక్రవారం ఆర్ఎంఓ విచారించగా వీరిరువురూ రోగుల వద్ద కొంత కాలంగా ఇదే తరహాలో అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆర్ఎంఓ డాక్టర్ రమేష్ జీజీహెచ్ ఉద్యోగి శివయ్య, ప్రై వేటు వ్యక్తులు మణికంఠ, కరుణాకర్‌లపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి ఉద్యోగి పనిచేయకుండా బయట వ్యక్తులు వచ్చి పనిచేస్తూ డబ్బులు సైతం తీసుకుంటున్నా సార్జంట్‌లు ఏం చేస్తున్నారంటూ ఆర్ఎంఓ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సార్జంట్ కాంతారావు, శ్రీహరిలను ఆదేశించారు. కాగా, సీసీ కెమెరాలు... సెక్యూరిటీ సిబ్బంది... గేట్పాస్ విధానం అమలులో ఉన్నా పెద్దాసుపత్రిలో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకోవటం అధికారుల పనితీరును తెలియచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వివక్ష..! అవమానాలు!!
సాక్షి ప్రతినిధి, కడప: ఆమె ఓ చిరుద్యోగి. పిచుకపై బ్రహ్మస్త్రం అన్నట్లుగా రాజకీయ నాయకులు, ఓ ఉన్నతాధికారి కత్తి కట్టారు. అవమానాలతో పాటు వేధింపులకు గురయ్యా.. న్యాయం చేయండని జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ అధికారులందరినీ ఆమె అభ్యర్థించారు. ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ సైతం సానుకూలంగా స్పందించినా జిల్లా యంత్రాంగం కరుణించలేదు. పైగా అట్రాసిటి కేసు ఉపసంహరించుకోకపోతే, ఉద్యోగం ఊడుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఎవరికీ చెప్పుకోలేక, ఎటూ పాలుపోక, ఇంతకాలం చేసిన పోరాటం వృథా అవుతోందనే ఆవేదన ఓవైపు ఆమెను కృంగదీసింది. దీంతో మనసైథర్యం కోల్పోయినా ఆ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. వేధింపులు భరిస్తూనే.. ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా ముద్దనూరులో ఎం. మేరి విధులు నిర్వర్తిస్తున్నారు. ముద్దనూరు ఎంపీడీఓ మనోహర్‌రాజు వేధింపులు అధికమయ్యాయని ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. తుదకు ఇక్కడి నుంచి బదిలీ చేయండనీ స్వయంగా పీడీ రమేష్‌కు ఏప్రిల్ 21న రాతపూర్వకంగా మొరపెట్టుకుంది. ఆరు మండలాలను ఆఫ్షన్ ఇస్తూ బదిలీ చేయాలని అభ్యర్థించింది. ఎలాంటి తప్పు చేయలేదు, మీరేందుకు బదిలీ కావాలి, తామున్నామంటూ ఉన్నతాధికారులు అప్పట్లో నోటిమాటలు చెప్పారు. ఉపాధి కూలీల నుంచి ఎలాంటి ఆరోపణలు లేకపోగా, ఉన్నతాధికారులు సైతం అండగా ఉండటంతో ఓవైపు వేధింపులు భరిస్తూనే విధులు కొనసాగిస్తున్నట్లు సమాచారం. చివరకు విసిగిపోయి జేసీ శ్వేతను జూన్ 2న ఆశ్రయించినట్లు తెలుస్తోంది. జేసీ సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. గత జూన్ 24న ముద్దనూరు పోలీసుస్టేషన్లో ఎంపీడీఓపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని మేరి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అనంతరం వార్నింగ్‌లు.... ఫిర్యాదు చేసిన మరుసటి రోజు నుంచి మేరికి వార్నింగ్‌లు ఆరంభమైనట్లు తెలుస్తోంది. కేసు ఉపసంహరించుకోకపోతే ఉద్యోగం మనుగడ కష్టమని హెచ్చరికలు తీవ్రతరమయ్యాయి. ఎలాంటి పరిస్థితిలో వెనక్కి తగ్గేది లేదని మేరి గట్టిగా ఉన్నతాధికారుల ఎదుట వాధించినట్లు సమాచారం. మహిళగా మేరి తెగువను అభినందించాల్సి పోయి, శాఖపరంగా మరింత వేధింపులు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌కు స్వయంగా ఆమె తన ఆవేదన చెప్పుకున్నట్లు సమాచారం. ఒంటరి పోరాటం.. దక్కని న్యాయం ఏ తప్పు చేయలేదు, ఉన్నది ఉన్నట్లు ఉన్నతాధికారులకు వివరించాను. అండగా ఉండాల్సిన వారు సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ఎంతవరకూ సమంజసమంటూ నిలదీస్తూ జిల్లా అధికారుల నుంచి రాష్ట్ర అధికారుల వరకూ టెక్నికల్ అసిస్టెంట్ మేరీ పోరాటం చేయసాగింది. అత్యున్నతాధికారులతోపాటు ఎస్సీ,ఎస్టీ జాతీయ సభ్యురాలు కమలమ్మ, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఎస్సీ,ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావులను కలిసి తనకు జరుగుతున్న అన్యాయంపై వివరించారు. అయినా న్యాయం జరగకపోగా మరోమారు అవమానాలకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం ఉద్యోగం కావాలో? కేసు కావాలో తేల్చుకోవాలనే అల్టిమేటం జారీ అయినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని డ్వామా పీడీ రమేష్‌కు ఉదయాన్నే మేరీ ఫోన్లో మొరపెట్టుకున్నట్లు సమాచారం. అమె ఆవేదన విన్పించుకోకుండా ఫోన్ కట్ చేయడంతో మనస్తాపానికి గురైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలో గత్యంతరం లేక కడపకు చేరుకుని ఎస్పీ కార్యాలయం బయట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. చిరుద్యోగి, అందునా మహిళ, పైగా ఎస్సీ వర్గానికి చెందిన మహిళ ఇంతటి వివక్షకు గురికావడం వెనుక ఓ ఎమ్మెల్యే అదృశ్య హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఏకపక్ష చర్యలను వీడాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. -
ఆర్టీసీలో సొమ్ము స్వాహా
-ఉద్యోగి ఘనకార్యం -విధులకు గైర్హాజరు -విజిలెన్స్ అధికారుల విచారణ ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) ఏలూరు డిపో పరిధిలో రూ. 8 లక్షల అవినీతి జరిగింది. దీనిపై ఉద్యోగులు, కార్మికుల్లో చర్చ జరుగుతోంది. ఏలూరు డిపో పరిధిలోని కొత్త బస్టాండు, పాత బస్టాండుల్లో ఏర్పాటు చేసిన దుకాణాల ద్వారా సంస్థకు అద్దెల రూపంలో వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని ఒక ఉద్యోగి వాడుకుని అప్పటి నుంచి విధులకు గైర్హాజరయ్యాడు. అసలేం జరిగిందంటే.. ఏలూరు ఆర్టీసీ డిపో పరిధిలో కొత్త బస్టాండులో 49, పాత బస్టాండులో 39, పెదపాడు బస్‌స్టేçÙన్లో 5, చింతలపూడి బస్ స్టేషన్లో 8, ద్వారకా తిరుమల బస్ స్టేషన్లో 8 కలిపి మొత్తం 109 దుకాణాలు ఉన్నాయి. వీటిని వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. వీటి ద్వారా సంస్థకు ప్రతినెలా రూ. 9.31 లక్షల ఆదాయం రావాల్సి ఉంది. అయితే కొంతమంది దుకాణదారులు ప్రతినెలా అద్దెలు చెల్లించకుండా రెండుమూడు నెలలకొకసారి చెల్లిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా ఈ ఆదాయంలో ప్రతినెలా రూ.12లక్షల లోటు కనిపిస్తోంది. జూనియర్ అసిస్టెంట్ పాత్రపై అనుమానం ప్రతినెలా వస్తున్న లోటుపై ఎట్టకేలకు అధికారులకు అనుమానం వచ్చింది. సంబంధిత పద్దులు చూసే జూనియర్ అసిస్టెంట్ పాత్రపై నిఘాపెట్టారు. సుమారు ఏడాదిన్నర క్రితం కష్ణాజిల్లాలో కండక్టర్‌గా పని చేస్తూ పదోన్నతిపై ఇక్కడికి వచ్చిన శ్రీనివాస్ ఈ దుకాణాలపై వచ్చే అద్దెలు, బకాయిలు, ఖాళీగా ఉన్న దుకాణాలు వంటి పద్దులు చూసే జూనియర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు స్వీకరించాడు. దుకాణదారులు ప్రతినెలా అద్దెలు చెల్లించకుండా బకాయిలు పెట్టడాన్ని నిశితంగా పరిశీలించిన అతను దానిని అవకాశంగా తీసుకుని ప్రతినెలా వస్తున్న అద్దెమొత్తంలో కొంత పక్కదారి పట్టిస్తూ వచ్చాడు. ఆ మొత్తం ఇప్పటివరకూ సుమారు రూ.8లక్షలకు చేరుకున్నట్టు అంచనా. రెండు నెలలుగా గైర్హాజరు ఈ నేపథ్యంలో ప్రతినెలా కనిపిస్తున్న లోటుపై ఆ ఉద్యోగిని అధికారులు ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది. దుర్వినియోగమైన మొత్తాన్ని చెల్లించాలని అతనిపై అధికారులు ఒత్తిడి పెంచారు. దీంతో ఆ ఉద్యోగి విధులకు డుమ్మాకొట్టాడు. అయినా పట్టువదలని అధికారులు అతనిపై ఇంకా ఒత్తిడిపెంచారు. తొలుత ఆ మొత్తాన్ని చెల్లించివేస్తానని అధికారులకు చెప్పిన ఆ ఉద్యోగి గత నెలలో తిరిగి విధులకు హాజరయ్యాడు. కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేసి తిరిగి అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గైర్హాజరయ్యాడు. దీంతో అధికారులు అతనిస్థానంలో మరో ఉద్యోగికి బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా.. ఈ వ్యవహారంపై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించినట్టు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఉన్నతాధికారుల దష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. గుంబనంగా అధికారులు.. ఈ వ్యవహారంపై అధికారులు మాత్రం గుంబనంగా వ్యవహరిస్తున్నారు. విషయాన్ని బయటకు పొక్కకుండా చూడడానికి నానా తంటాలూ పడుతున్నట్టు తెలుస్తోంది. సదరు ఉద్యోగి దుర్వినియోగానికి పాల్పడిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిపో మేనేజర్‌తో పాటు మరికొందరు రీజనల్ కార్యాలయ అధికారులపైనా చర్యలు తీసుకునే అవకాశమున్నట్టు కార్మికవర్గాల్లో, దుకాణదారుల్లోనూ చర్చ జరుగుతోంది. 2 నెలల క్రితమే గుర్తించాం.. దుకాణాల అద్దెకు సంబంధించిన డబ్బు దుర్వినయోగమవుతున్నట్టు రెండు నెలలకు ముందే గుర్తించాం. వెంటనే ఆ గుమాస్తాని విచారించి రూ.5 లక్షలు వసూలు చేశాం. మరో రూ.1.80 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. ఈ విషయంపై విచారణ చేస్తున్నాం. గుమాస్తా విచారణకు హాజరు కావడం లేదు. విచారణకు హాజరైతే పూర్తి వివరాలు తీసుకుని అతనిని విధుల నుంచి తొలగిస్తాం. ఎస్.ధనుంజయరావు, రీజనల్ మేనేజర్ -
కానిస్టేబుల్ కాబోయి.. మృత్యుఒడికి..
కొలువు సాధనలో యువకుడి మృత్యువాత శ్వాసప్రక్రియ వ్యాయామం చేస్తుండగా దుర్ఘటన గణపవరంలో విషాదం గణపవరం(మునగాల) ; పోలీస్‌శాఖలో కొలువు సాధించాలనదే ఆ యువకుడి లక్ష్యం.. అందుకు అనుగుణంగా కఠోరంగా శ్రమిస్తున్నాడు.. అందులో భాగంగానే శ్వాసప్రక్రియ వ్యా యామం చేస్తూ మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాదకర ఘటన మునగాల మండల పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలు.. గణపవరం గ్రామానికి చెందిన సారెడ్డి నారాయణరెడ్డి, బుచ్చమ్మ దంపతుల ఏకైక కుమారుడు సారెడ్డి పాపిరెడ్డి(26) డిగ్రీ పూర్తి చేశాడు. ఇంటి వద్ద వ్యవసాయ పనులు చూసూకుంటూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. గతంలో పోలీస్‌శాఖలో ఉద్యోగం సం పాదించాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ ఏడాది కానిస్టేబుల్ పోస్టులకు జరిగిన అర్హత పరీక్షలో ఉత్తీర్ణుడైన పాపిరెడ్డి ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా స్నేహితులతో కలిసి ప్రతి రోజుఉదయం దేహదారుఢ్య పరీక్షలకు సాధన చేస్తున్నాడు. గంట వ్యవధిలోనే.. ఎప్పటిలాగానే పాపిరెడ్డి తన స్నేహితులతో కలిసి పక్క గ్రామమైన పెనపహాడ్ మండలం చీదెళ్ల శివారులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో వ్యాయామం కోసం ఉదయం వెళ్లాడు. మిగతా స్నేహితులు రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా పాపిరెడ్డి ఛాతీ పెరిగేందుకు శ్వాసప్రక్రియ వ్యాయామం ప్రారంభించాడు. శ్వాసను గట్టిగా పీల్చి తన స్నేహితుడిని కొలతవేయమని కోరాడు. ఈ లోగా ఒక్కసారిగా పాపిరెడ్డి వెనుకకు పడిపోయాడు. రొప్పుతూ ఉండడంతో మిగతా స్నేహితులు పాపిరెడ్డి గుండె నిమురుతూ ఉండగానే క్షణాల్లో నోటినుంచి రక్తం పడుతుండడంతో ఆందోళన చెందారు. వెంటనే బైక్‌పై పాపిరెడ్డిని సమీపంలో ఉన్న ఆర్ఎంపీ వద్దకు తరలించగా అప్పటికే మృతిచెందాడు. అప్పటివరకు అందరినీ నవ్వుతూ పలకరించిన పాపిరెడ్డి గంట వ్యవధిలోనే మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
దొంగ చేతికే తాళాలు ఇవ్వనున్న బ్యాంకు!
న్యూఢిల్లీ: ఇండియన్ బ్యాంక్ అధికారులు ఓ సాహసానికి ఒడిగట్టారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. మంచి ప్రవర్తన, ఆర్హతలున్న వ్యక్తికి బ్యాంకు వ్యవహారాల్ని నిర్వహించే బాధ్యతల్ని అప్పగించారు. తీహార్ జైలులో గత కొద్ది సంవత్సరాలుగా ఇండియన్ బ్యాంక్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తొంది. వంద కోట్లకు పైగా బ్యాంకు వ్యవహరాలు నమోదయ్యాయి. మా బ్యాంక్ లో తీహార్ ఖైదీకి ఉద్యోగం ఇవ్వాలంటూ ఓ ప్రతిపాదన వచ్చింది. బ్రాంచ్ కూడా ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. త్వరలోనే అధికారికంగా ఖైదీ బ్యాంక్ వ్యవహారాలను చూస్తాడు అని ఇండియన్ బ్యాంక్ ఎండీ టీఎం భాసిన్ తెలిపారు. సెమీ ఓపెన్ జైలులో ఖైదీల అర్హత, ప్రవర్తన, మానసిక, శారీరక పటుత్వాన్ని బట్టి ఫ్యూన్, సెక్యూరిటీ గార్డు, కంపూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను ఇస్తున్నామని తీహార్ జైలు అధికారి సునీల్ గుప్తా తెలిపారు. ఖైదీల వివరాలను అధికారులకు అందిస్తామని, నియామకాలపై తుది నిర్ణయం బ్యాంకు తీసుకుంటుందని జైలు అధికారులు తెలిపారు. గత నెలలో 66 మంది ఖైదీలు తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నారని.. జైలు ఆవరణలో జరిగిన నియామకాల ప్రక్రియలో వేదాంత గ్రూప్, తాజ్ మహల్ గ్రూప్ తోపాటు వివిధ ప్రైవేట్ కంపెనీలు ఖైదీలను ఉద్యోగులుగా ఎంపిక చేసుకున్నారని అధికారులు తెలిపారు. తీహార్ జైల్లో 8 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తూ.. ఇగ్రో నుంచి సోషల్ వర్క్ లో డిగ్రీ సాధించిన రాజు ప్రశాంత్ అనే ఖైదీకి నెలకు 35 వేల జీతంతో అసిస్టెంట్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ ఉద్యోగం లభించింది. Follow @sakshinews