- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
- అప్పటికప్పుడు కేసు కట్టి నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రైవేటు ఉద్యోగిని దోచుకున్న దుండగులు
Published Mon, Mar 6 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
తెనాలి రూరల్ : ఆటోలో ఇంటికి వెళ్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగిపై దాడి చేసి, ల్యాప్‌టాప్, నగదును దోచుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు ఘటన జరిగిన నాడే ఫిర్యాదు చేయగా, గోప్యంగా ఉంచిన పోలీసులు సోమవారం హడావిడిగా నిందితులను అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సేకరించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పట్టణంలోని ఐతానగర్‌కు చెందిన కానిస్టేబుల్ కొడుకైన దాసరి సాగర్ కారు కంపెనీలకు సంబంధించి నెల్లూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో సర్వీస్, కంప్యూటరైజేషన్ శిక్షకుడిగా పని చేస్తున్నాడు. గత నెల 24వ తేదీ రాత్రి ఉద్యోగం నుంచి తిరిగి వచ్చి, ఆటోలో ఇంటికి వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఇద్దరు ఆటోలోకి ఎక్కి సాగర్‌పై దాడి చేసి, అతని ల్యాప్‌టాప్, నగదును లాక్కున్నారు. కదులుతున్న ఆటోలో నుంచి దూకేసిన బాధితుడు అదే రోజు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు నిందితులను ఐతానగర్‌కే చెందిన మెరుగుమాల కిరణ్ అలియాస్ కిన్నెట్టు, తూమాటి విజయ్‌కుమార్‌లుగా గుర్తించి, సోమవారం అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement