బస్కింగ్‌.. జోష్‌! | Hyderabad Is The First City To Fully Promote Busking Through Metro Medley | Sakshi
Sakshi News home page

బస్కింగ్‌.. జోష్‌!

Published Fri, Jun 21 2024 1:19 PM | Last Updated on Fri, Jun 21 2024 1:19 PM

Hyderabad Is The First City To Fully Promote Busking Through Metro Medley

వరల్డ్‌ మ్యూజిక్‌ డేతో అంకురార్పణ

మెట్రో మెడ్లీతో శ్రీకారం చుట్టిన తొలి సిటీ

సాక్షి, సిటీబ్యూరో: మనం ఏదైనా బజార్‌లో షాపింగ్‌ చేస్తూ మన జేబులకు పనిచెబుతుంటాం... అక్కడే మూల ఖాళీగా ఉన్న ప్లేస్‌లో సంగీత బృందం మన చెవులకు పనికలపిస్తుంది.. మనం ఏదో ఖాళీ మైదానంలో వాకింగ్‌ చేయడానికి వెళతాం... అప్పటికే అక్కడ ఇద్దరో ముగ్గురో మ్యుజీషియన్లు కొన్ని వాయిద్యాలతో సంగీతాన్ని నడిపిస్తుంటారు.

ఇలా ప్రజలు సంచరించే వీధుల్లో తమ కళను కళాకారులు ప్రదర్శించడాన్నే బస్కింగ్‌గా పేర్కొంటారు. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఈ బస్కింగ్‌ మన దేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. తాజాగా బస్కింగ్‌ను మెట్రో మెడ్లీ ద్వారా పూర్తి ప్రాచర్యంలోకి తెచ్చిన తొలి నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్‌ 19 నుండి 22 వరకూ నగరంలోని మెట్రో స్టేషన్ల కారిడార్‌లలో గోథే–జెంట్రమ్‌ హైదరాబాద్‌ ‘మెట్రో మెడ్లీ’ని నిర్వహిస్తోంది.

మెట్రో ప్రయాణికుల కోసం..
ఈ ఈవెంట్‌లో దాదాపు 100 మందికి పైగా సంగీత విద్వాంసులు పాల్గొంటున్నారు. రోజువారీ ప్రయాణికులను ఆనందపరుస్తోంది. అమీర్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్,  ఎంజీబీ, పరేడ్‌ గ్రౌండ్, కూకట్‌పల్లి, హైటెక్‌ సిటీ, ఉప్పల్‌ వంటి మెట్రో స్టేషన్లలో బస్కింగ్‌ ఈవెంట్‌ జరుగుతుంది. ‘నగరవాసుల మెట్రో ప్రయాణానికి సంగీతంతో ఆనందాన్ని జత చేయడమే బస్కింగ్‌ ఉద్దేశమని’ అని గోథే–జెంట్రమ్‌ హై ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ నూరియా వాహనవతి ‘సాక్షి’తో చెప్పారు.

జాజ్, టాలీవుడ్, రాక్‌ నుంచి బాలీవుడ్‌ వరకూ వివిధ  సంగీత శైలులు వీనుల విందు చేస్తాయన్నారు. కళాకారులకు ప్రత్యక్షంగా సంగీత ప్రియుల స్పందన తెలియజేయడం ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. సంగీత  కళాకారులను 20 గ్రూపులుగా విభజించారు,  హైటెక్‌ సిటీ మెట్రో స్టేషన్‌ లో ప్రదర్శన ఇచ్చిన ఏకం బ్యాండ్‌ గాయకుడు స్లోక రాజు మాటల్లో..చెప్పాలంటే ఇదో వైవిధ్యభరిత అనుభూతి.. బుధవారం అమీర్‌పేట్‌ మెట్రో స్టేషన్‌లో ప్రదర్శన అందించిన కలెక్టివ్‌ సభ్యుడు, సాక్సాఫోన్‌ వాయించడంలో పేరొందిన జార్జ్‌ హల్‌ మాట్లాడుతూ, ‘నిజ జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సంగీతం..వాటికి రిలాక్సేషన్‌ అందిస్తుంది. బస్కింగ్‌ నగరవాసులకు ఓ వింత అనుభూతి’ అని చెప్పారు.

నాటిదే.. నేటికీ..
తోలుబొమ్మల ప్రదర్శనలు లేదా పాము మంత్రగాళ్లు వంటి సంప్రదాయ వీధి ప్రదర్శనలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం, అయితే అలాంటి కళారూపాలు కనుమరుగయ్యాయి. మరికొన్ని అరుదైపోయాయి. ఈ నేపధ్యంలో బస్కింగ్‌ పేరిట ఔత్సాహిక కళాకారుల్ని ప్రోత్సహించే ఆధునిక సంస్కృతి నగరానికి పరిచయం కావడం ఆహా్వనించదగ్గ పరిణామమే..

బస్కింగ్‌కి వెల్‌కమ్‌..
ఎటువంటి ముందస్తు అంచనాలూ లేకుండా ప్రజలకు సంగీత విందును పంచడం మరోవైపు కళాకారులకు ప్రోత్సాహం అందించడం...లక్ష్యాలుగా తొలిసారి నగరంలో బస్కింగ్‌ ట్రెండ్‌కి నాంది పలికాం. పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణమైన ఈ శైలికి ఈ స్థాయిలో వెల్‌కమ్‌ చెప్పిన తొలి నగరం మనదే. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.–నూరియా వాహనవతి, ప్రోగ్రామ్‌ కో–ఆర్డినేటర్‌ గోథే–జెంట్రమ్‌

ఇవి చదవండి: 'సెల్‌-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement