మాదాపూర్ : మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చేనేత హస్తకళా మేళలో భాగంగా గురువారం మద్దాలి ఉషాగాయత్రి శిష్యబృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించి అలరించారు. ఇందులో జతిస్వరం, బాలాకనకమయ, పదవర్ణం, చక్కనితల్లికి, తిల్లాన, నగుమోము కలవని, అలరులు, మంగళం తదితర అంశాలను కళాకారులు వాసవి, నీరజ, సహస్ర, వాస్తల్య, రసజ్ఞ, భవాని, దీక్షిత తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జుట్టుండాలేగానీ.. మతి పోయే స్టైల్స్ ఇదిగో ఇలా!
కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా అలరించాయి. సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ తంజాపూర్ సంయుక్త నిర్వహణలో రూప్ చంద్ బృందం పురూలియా చౌ ఆకట్టుకుంది. మేళాలో చేనేత హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నగరవాసులు విరివిగా కొనుగోలు చేశారు. పట్టుచీరలు, డ్రస్‌మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment