Shilparamam
-
శిల్పారామంలో మూడు రోజుల పాటు ఒడిశా ఫుడ్ అండ్ క్రాఫ్ట్ మేళా
మాదాపూర్ : హైదరాబాద్‌లో ఒడిశా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒడియాఫుడ్, క్రాఫ్ట్ మేళాను శిల్పారామంలో శుక్రవారం ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించనున్న మేళాను స్వాభిమాన్ ఒడియా ఉమెన్స్ వరల్డ్, శిల్పారామం సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రదర్శనలో ఒడిశా సంప్రదాయ వంటకాలు, హస్తకళా ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. ప్రతి రోజూ సాయంత్రం యాంఫీథియేటర్‌లో 5.00 గంటలకు ఒడిశా సంప్రదాయ నృత్యాలను కళాకారులు ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకోనున్నారు. మూడు రోజుల ఉత్సవం సందర్శకులకు ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుందని సంస్థ అధ్యక్షురాలు సుస్మితా మిశ్ర తెలిపారు. ఒడిశాలోని ప్రసిద్ధ సంబల్పురి, బొమ్కై, కోట్‌ప్యాడ్ అల్లికలతో పాటు, క్లిష్టమైన పెయింటింగ్‌లు, ధోక్రా మెటల్‌వర్క్, ప్రముఖ కళాకారులచే అప్లిక్ వర్క్‌లను ప్రదర్శించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఒడిశా కళాత్మక వారసత్వానికి ప్రాణం పోసే ఒడిస్సీ నృత్యం, జానపద, గిరిజన నృత్య ప్రదర్శనలు సందర్శకులను అలరించనున్నాయి. ఇదీ చదవండి: Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!ఒడిశా సంప్రదాయ వంటకాలు.. రసగొల్ల, చెనపోడ, కిర్మోహణ, ఒడియా స్ట్రీట్‌ఫుడ్ గప్‌చుప్, దహీబారా, ఆలూదమ్, ఆలూచాప్ తదితరులు వంటకాలు అందుబాటులో ఉంచనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ -
తుపాకి రాముడుతో.. సరదా సంక్రాంతి
-
సాంస్కృతిక సోయగం.. శిల్పారామం..
గచ్చిబౌలి: పల్లె వాతావరణమైన శిల్పారామంలో హరినామస్మరణ, గంగి రెద్దుల విన్యాసాలు, నృత్యకారుల గవ్వల సవ్వడి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాయి. వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జానపద కళాకారులు.. రాజమండ్రికి చెందిన విభూతి బ్రదర్స్ బృందం హరిదాసులు, బుడబుక్కలు, జంగమ దేవర, సోది చేప్పే వేషధారణలతో ఆకట్టుకున్నారు. దాదాపు పది మంది కళాకారులు వివిధ అలంకరణలో సందర్శకులను ఆకట్టుకున్నారు. అంకిరెడ్డి పాలెం, వలిగొండకు చెందిన కళాకారులు గంగిరెద్దుల విన్యాలతో అబ్బురపరిచారు. సాయంత్రం ఆంపిథియోటర్లో కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. మంగళవారం సురభి కారులు ‘మాయ బజార్’ నాటకాన్ని ప్రదర్శిస్తారు. శేరిలింగంపల్లి సురభి కాలనీకి చెందిన దయానంద్ బృంధం, మరికొందరు కళాకారులు కూచిపూడి, భరత నాట్యాన్ని ప్రదర్శిస్తారు. -
శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్స్ మేళా ఈ నెల 31 వరకు
మాదాపూర్ : మాదాపూర్‌లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ చేనేత హస్తకళా మేళలో భాగంగా గురువారం మద్దాలి ఉషాగాయత్రి శిష్యబృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించి అలరించారు. ఇందులో జతిస్వరం, బాలాకనకమయ, పదవర్ణం, చక్కనితల్లికి, తిల్లాన, నగుమోము కలవని, అలరులు, మంగళం తదితర అంశాలను కళాకారులు వాసవి, నీరజ, సహస్ర, వాస్తల్య, రసజ్ఞ, భవాని, దీక్షిత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: జుట్టుండాలేగానీ.. మతి పోయే స్టైల్స్ ఇదిగో ఇలా! కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా అలరించాయి. సౌత్‌జోన్ కల్చరల్ సెంటర్ తంజాపూర్ సంయుక్త నిర్వహణలో రూప్ చంద్ బృందం పురూలియా చౌ ఆకట్టుకుంది. మేళాలో చేనేత హస్త కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను నగరవాసులు విరివిగా కొనుగోలు చేశారు. పట్టుచీరలు, డ్రస్మెటీరియల్స్, కొండపల్లి బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. -
సిద్దిపేట ‘శిల్ప’విలాపం!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా సిద్దిపేట ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి పర్యాటకంగా మరిన్ని సొబగులు అద్దేందుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించింది. కోమటి చెరువు దగ్గర శిల్పారామం, నెక్లెస్‌రోడ్ పనుల పూర్తి, రంగనాయకసాగర్ దగ్గర పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సంవత్సరం నుంచి ముందుకు సాగడం లేదు. పిల్లర్ల దశలోనే కాటేజీలుచిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో 3 టీంఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తయారు చేసేందుకు రూ.100 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. నీటిలో తేలియాడే కాటేజీలు, వాటర్ షోలు, పెద్ద బంకెట్ హాల్ వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.కాటేజీల నిర్మాణం పనులు పిల్లర్ల దశలోనే నిలిచి పోయాయి. ఇప్పటికే రంగనాయకసాగర్‌ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు, ప్రజలు ఎదురు చుస్తున్నారు. 10 ఎకరాల్లో శిల్పారామం కోమటి చెరువు సమీపంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.23 కోట్లతో శిల్పారామం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా అలాగే చేనేత హస్తకళా ప్రదర్శన, పలు కుల వృత్తులకు చేయూతనందించేందుకు పనులను ఏప్రిల్, 2023లో ప్రారంభించారు. శిల్పారామం పనులు డిసెంబర్ 2023 వరకు వేగంగా సాగాయి. తర్వాత అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్రాఫ్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ ఇలా అన్ని రకాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. నిలిచిన ఆర్టిఫిషియల్ బీచ్ సిద్దిపేట శిల్పారామంలో ఆర్టిఫిషియల్ బీచ్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. బీచ్ నిర్మాణం పూర్తయితే సముద్రం బీచ్ దగ్గర పొందే అనుభూతి సిద్దిపేటలో లభిస్తుందని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆ పనులు కూడా నిలిచిపోయాయి. అలాగే కోమటి చెరువు నెక్లెస్‌రోడ్ పూర్తి నిర్మాణం కోసం రూ.15 కోట్లను కేటాయించారు. ఆ పనులూ ఆగిపోయాయి. సిద్దిపేటలో మహతి ఆడిటోరియం కోసం రూ.50 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ని«ధులు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తయ్యే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాంట్రాక్టర్లు తప్పుకున్నారు పలు పనులకు సంబంధించిన పాత కాంట్రాక్టర్లు తప్పుకున్నారు. పనులు జరుగుతుంటే రన్నింగ్ బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశారు. అలాగే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సమయం కూడా ముగిసింది. – నటరాజ్, డీఈ, పర్యాటక శాఖ -
మాదాపూర్ శిల్పారామంలో లోక్ మంథన్ ఉత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్‌తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్‌మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్‌మంథన్‌కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్‌మంథన్‌లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్‌పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
1500 కళాకారులు.. 350 ఎగ్జిబిట్స్, 100 స్పీకర్స్, 12 దేశాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు. అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్‌మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్‌మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి. భాగ్యనగరం వేదికగా.. ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్‌మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టునగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే ఈ లోక్‌మంథన్‌కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.మనది అడవి బిడ్డల సంస్కృతి నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం. – నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ -
శిల్పారామంలో ప్రమాదం.. మహిళ అడికక్కడే మృతి
సాక్షి, తిరుపతి: తిరుచానూరు శిల్పరామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫన్ రైడ్‌లో భాగంగా క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెండగా.. మరో మహిళ గాయపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుచానూరు శిల్పారామం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. శిల్పారామం క్యాంటీన్ వద్దగల ఫన్ రైడ్‌లో ప్రమాదం జరిగింది. క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ఇరవై అడుగులు ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
పులివెందులలో శిల్పారామం ప్రారంభించిన సీఎం జగన్
-
వైఎస్ఆర్ కడప జిల్లాకు సీఎం జగన్.. పులివెందులలో పర్యటించనున్న సీఎం జగన్
-
పులివెందులలో పర్యటించిన సీఎం జగన్
సాక్షి, పులివెందుల: అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణాన్ని దేశానికే ఆదర్శనీయం.. అని సగర్వంగా తెలుపుకుంటున్నానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా గురువారం జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్.. మొదటి రోజు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ. 64.54 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ముందుగా అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 1.30 గంటలకు పులివెందుల భాకరాపురం హెలిప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి ఘన స్వాగతం లభించింది. ►భాకరాపురం రింగురోడ్డు సర్కిల్ లో 4 ఎకరాల విస్తీర్ణంలో రూ.4.54 కోట్ల వ్యయంతో నూతనంగా, అద్భుతంగా నిర్మించిన శ్రీకృష్ణ దేవాలయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని ముఖ్యమంత్రి పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలను అందించగా, వేదపండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనాలు అందించారు. ►రూ.9.96 కోట్ల పాడా నిధులతో ఏపీ కార్ల్ నందు నిర్మించిన అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ►అగ్రికల్చర్ కళాశాలలో ...60 సీట్లు బీఎస్సీ (Hon) అగ్రికల్చర్, హార్టికల్చర్ కు సంభంధించి బీఎస్సీ (Hon) హార్టికల్చర్ 61 సీట్లతో కోర్సులను అందిస్తున్నాయి. ►ఏపీ కార్ల్ నందు రూ. 11 కోట్ల వ్యయం నిర్మించిన స్టేట్ ఆఫ్ ఆర్ట్ సెంట్రల్ టెస్టింగ్ లాబొరేటరీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. పాలు, పాల ఉత్పత్తుల కల్తీని తనిఖీ చేయడం, నాణ్యతా పరీక్ష డయాగ్నస్టిక్ సేవలు, నిర్దిష్ట వ్యాధికారక క్రిములను ఉత్పత్తులను పరీక్షించడం , టెక్నో కమర్షియల్ మార్గాల్లో అమలు చేయడం, ఆహార ధాన్యాలు, తృణధాన్యాలు పప్పుల నమూనాలను , ఫార్మా అప్లికేషన్ పరీక్షల నిర్వహణకై దీన్ని ఏర్పాటు చేశారు. ►పులివెందుల వాసులకు అత్యంత ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ..మొత్తం 38 ఎకరాలలో రూ .14.04 కోట్లతో నిర్మించిన శిల్పారామం నందు ఫేస్ లిఫ్టింగ్ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇందులో 28 ఎకరాల్లో శిల్పారామం కాగా 10 ఎకరాల్లో ఫంక్షన్ హాల్ ►మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ విత్ గ్యాలరీ, హిల్ టాప్ టవర్ విత్ 16.5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి విగ్రహం, హిల్ టాప్ పార్టీ జోన్, జిప్ లైన్ (రోప్ వే), బోటింగ్ ఐలాండ్ పార్టీ జోన్, చైల్డ్ ప్లే జోన్ ,వాటర్ ఫాల్, ఫుడ్ కోర్ట్, ఆర్టిసన్స్ స్టాల్ల్స్ తో పాటు 5 అడుగుల దివంగత ముఖ్యమంత్రి డా.వై ఎస్ .రాజశేఖర్ రెడ్డి కూర్చున్న విగ్రహం తో ఆకట్టుకునే ఎంట్రీ ప్లాజా, సిసి రోడ్లు, పార్కింగ్ ఏరియా, ఆహ్లాదకరమైన గ్రీనరీ ఈ శిల్పారామం ప్రత్యేకతలు. శిల్పారామంలో ఆకట్టుకున్న ప్రదర్శనలు సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శిల్పారామం వద్దకు రాగానే సంప్రదాయ వాయిద్యాలైన సన్నాయి, డోలు బృందంతో ముఖ్యమంత్రికి పూర్ణకుంభంతో శిల్పారామంలోకి ఘన స్వాగతం పలికారు. అక్కడే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సంప్రదాయ సంగీత వాయిద్యాలైన బూర వాయిద్యాలు, డప్పు కళాకారుల దరువు, మోరగల్లు ప్రదర్శనలు, తోలు బొమ్మలాట , చెక్క భజనలు, జానపద నృత్యాల నడుమ పల్లెసీమ ఉట్టి పడేలా ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి కొద్ది దూరంలోనే చేతి వృత్తుల తయారీ అయిన జూట్ బ్యాగ్‌లు, కలంకారి పెయింటింగ్, మిల్లెట్స్ , కలంకారీ చీరలు, ఆకట్టుకునే సంపద్రాయ ఆభరణాలు కళ్లకు మిరుమిట్లు గొలిపేలా ప్రదర్శించారు. అక్కడే బోటింగ్ వద్ద పెద్ద స్క్రీన్ పై క్రికెట్ మ్యాచ్ లైవ్ ప్రసారాలను ప్రదర్శించారు. అక్కడికి సమీపంలోనే ఎంబీ థియేటర్ వద్ద పులివెందుల ఉమెన్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థినుల చేత సాంస్కృతిక ప్రదర్శనలు కనులపండువగా నిర్వహించారు. అక్కడి నుంచి హిల్ టాప్ పైకి వెళ్లగానే ముందుగా కీలుగుర్రాలు, ఎద్దు వేషాలు డప్పు దరువుల మధ్య సాదర స్వాగతం ఆకట్టుకుంది. అనంతరం హిల్ టాప్‌పైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అక్కడి నుంచే శిల్పారామం వ్యూ పాయింట్‌ను పరిశీలించారు. దిగువన మ్యూజిక్ వాటర్ ఫౌంటెన్‌ను ప్రదర్శించగా సీఎం వీక్షించారు. అనంతరం సీఎం అధికారులతో గ్రూప్ ఫోటో దిగి ఉత్సాహంగా శిల్పారామం కలియతిరిగారు. శ్రీస్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన రూ. 60 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న శ్రీ స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. మొదటి దశలో రూ.25 కోట్లు, రెండవ దశలో రూ.35 కోట్లు ఈ పాఠశాల నిర్మాణానికి ఖర్చు చేయనున్నారు. ఇందులో కేజీ నుంచి 12వ తరగతి వరకు ఉండగా, వసతి గృహం, ఇండోర్ ఔట్ డోర్ క్రీడా మైదానాలు, డైనింగ్ హాల్, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్, మాథ్స్ లాబ్స్, ఆక్టివిటీ రూమ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ తదితర నిర్మాణాలు చేయనున్నారు. ఆదిత్య బిర్లా యూనిట్‌ను సందర్శించిన సీఎం సీఎం జగన్ పర్యటనలో భాగంగా ఆదిత్య బిర్లా గార్మెంట్స్‌ను సందర్శించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇందులో లో దాదాపు 500 మంది పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలతో సీఎం కాసేపు ముచ్చటించారు. అలాగే సిబ్బందితో గార్మెంట్స్ ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడ పని చేస్తున్న మహిళలు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతో పాటు ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పులివెందుల ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ►అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ ఎంపీపీ గౌస్ మహ్మద్ రఫీ కుటుంబ సభ్యుల వివాహా వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. రాజధాని ఫంక్షన్ హాల్లో జరిగిన వేడుకల్లో వరుడు మహ్మద్ నిహాజ్, వధువు నూర్ ఈ చష్మిలను సీఎం ఆశీర్వదించారు. ►శాసన మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానం కుమారుడి వివాహ వేడుకకు సీఎం జగన్ హాజరయ్యారు. నూతన దంపతులను సీఎం ఆశీర్వదించారు. -
శిల్పారామాలు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శిల్పారామాలు పర్యాటకులతో నిత్యం కళకళలాడుతున్నాయి. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే 125 శాతం మేర సందర్శకుల తాకిడి పెరిగింది. కోవిడ్ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న శిల్పారామం సొసైటీ ఏడాది కాలంలోనే అనూహ్యంగా వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మెరుగైన రాబడి లభించింది. గతంలో ఎప్పుడూ నష్టాల్లోనే నడిచిన శిల్పారామాలు 2022–23లో ఏకంగా రూ.2 కోట్ల వరకు లాభం గడించడం రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది శిల్పారామాలు ఉండగా సగటున ప్రతినెల 1.25 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి గ్రామీణ వాతావరణానికి ప్రతీకలుగా నిలిచే శిల్పారామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుపతి, కడప శిల్పారామాల్లో మల్టీపర్పస్ హాల్, డైనింగ్ హాల్, టాయిలెట్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా శిల్పారామాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా బోటింగ్ (జలవిహారం) కార్యకలాపాల పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్–జిమ్, సందర్శకులను ఆకట్టుకునేలా పెయింటింగ్ డిస్ప్లేలను ఏర్పాటు చేసింది. మిగిలిన శిల్పారామాల్లోను ఈ తరహా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గుంటూరు శిల్పారామం పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పులివెందుల శిల్పారామంలో పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కొత్త శిల్పారామాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, రాయచోటిల్లో అర్బన్ హట్స్ (శిల్పారామాల) నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లతో కర్నూలులో, రూ.9.20 కోట్లతో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బండపల్లిలో శిల్పారామాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీ, భూ సేకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు విశాఖ, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరుల్లో ఒక్కోచోట రూ.1.50 కోట్లతో హస్తకళల మ్యూజియాల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. జిల్లాకో శిల్పారామం ప్రతి జిల్లాలో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాటా స్కీమ్‌లను సది్వనియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శిల్పారామాల్లో పచ్చదనాన్ని కాపాడుతూనే ఆధునికీకరణ చేపడుతున్నాం. అందుకే రాష్ట్ర విభజన తర్వాత గణనీయమైన వృద్ధిని సాధించాయి. నెలకు 1.25 లక్షల మంది సందర్శకులు రావడం ఇందుకు నిదర్శనం. – ఆర్.కె.రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి చక్కని ఆటవిడుపు కేంద్రాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా శిల్పారామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాం. చక్కని ఆటవిడుపు కేంద్రాలుగా పిల్లలు, పెద్దలు కూడా సంతోషంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ముఖ్యంగా బోటింగ్ కార్యకలాపాలపై దృష్టిసారించాం. హస్తకళలు, కళాకారుల కోసం శిల్పారామాల్లో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్, స్టేజ్‌లను అందిస్తున్నాం. – శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, సీఈవో, శిల్పారామం సొసైటీ -
హైదరాబాద్ : శిల్పారామంలో సంక్రాంతి సంబురాలు (ఫొటోలు)
-
హోప్ ఆధ్వర్యంలో ‘అచీవర్స్’ అవార్డులు
మాదాపూర్: మాదాపూర్‌లోని శిల్పారామంలో హోప్ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్ ఇండియన్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవేళ్ళ ఎంపీ రంజిత్‌రెడ్డి, సీతారెడ్డిలు హజరయ్యారు. కోవిడ్ సమయంలో అత్యుత్తమ సేవ చేసినందుకు డాక్టర్ మనీష్ రాందాస్, సంస్కృతంలో డాక్టరేట్ చేసినందుకు డాక్టర్ మృదుల అశ్విన్, మొదటి సారే సివిల్ సర్వీసెస్‌కు సెలెక్ట్ అయినందుకు కుమారి మేఘనలకు అఛీవర్స్ అవార్డులను అందజేశారు. -
Shilpa Ramam: ‘శిల్పారామం’లో శుభకార్యాలకు ధరలు ఎంతో తెలుసా..
సాక్షి, మాదాపూర్(హైదరాబాద్): పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తూ సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్న మాదాపూర్ శిల్పారామం వివాహాది శుభకార్యాలకు వేదికగా కూడా నిలుస్తోంది. మొత్తం 45 ఎకరాల్లో శిల్పారామం విస్తరించి ఉంది. కేవలం సందర్శకులు తిలకించేందుకే కాకుండా వివాహాది శుభకార్యాలు చేసుకొనేందుకూ అధికారులు అందరికీ అవకాశం కల్పిస్తున్నారు. ఇందు కోసం ప్రత్యేక ప్రదేశాలను శిల్పారామంలో అందుబాటులో ఉంచారు. శిల్పారామంలోని వేదికలు ఇవే.. ► శిల్పారామంలో వివాహాది శుభకార్యాల కోసం ఈ కింది వేదికలు ఇస్తారు. ► ఏ ప్రదేశాన్ని బుకింగ్ చేసుకున్నా.. తప్పనిసరిగా రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సందర్శకులను ఆకట్టుకొనేందుకు... ► చిన్నపిల్లలు, తల్లిదండ్రులు సరదాగా గడిపేందుకు ఉయ్యాలలు, పిల్లలకు మేధాశక్తి పెరిగేందుకు ఉపయోగపడే ఆటవస్తువులు అందుబాటులో ఉంచారు. ► కోనసీమ, బోటింగ్, బ్యాటరీకారు, ఎడ్లబండి వంటివి ఆకట్టుకునేలా ఉంటాయి. గ్రీనరీ, పూలమొక్కలు, ఆకర్షణీయమైన చెట్లు ఇక్కడి ప్రత్యేకతలు: ► సందర్శకులకు మరింత ఆకట్టుకునేలా రకరకాల పక్షులను పెంచుతున్నారు. ► వివిధ రకాల పక్షుల కోసం 12 కేవ్లు ఏర్పాటు చేశారు. ► రాతితో తయారు చేసిన సందేశాత్మక విగ్రహాలు ఏర్పాటు చేశారు. ► సందర్శకులు వీటి వద్ద ఫొటోలకు ఫోజులిస్తూ సరదాగా గడుపుతుంటారు. ► వీకెండ్స్‌లో ఆంపీ థియేటర్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏటా మేళాల నిర్వహణ ... ► ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి సంక్రాంతి వరకు నిర్వహించే మేళాలో దాదాపు 550 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. విద్యార్థులు, దివ్యాంగులకు రాయితీ.. ► 10వ తరగతి వరకు చదివేవారికి 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ► పాఠశాల నుంచి లేఖ తీసుకొచ్చి కార్యాలయంలో అందజేయాలి. ► దివ్యాంగులు, స్వచ్చంద సంస్థల వారికి కూడా 50 శాతం రాయితీ ఇస్తారు. ఆఫ్‌లైన్ లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు.. శిల్పారామం అంటే కేవలం సందర్శకులకే కాకుండా శుభకార్యాలను నిర్వహించుకునేందుకు కూడా అవ కాశం కల్పిస్తున్నాం. వీటి కోసం ప్రత్యేక స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేశాం. ఇక్కడ తరచూ శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ వేదిక కోసం ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్‌లోనూ ముందుగా బుక్ చేసుకోవాలి. – జి.అంజయ్య, శిల్పారామం జనరల్ మేనేజర్ చదవండి: వినూత్న ఆలోచనలను ఆవిష్కరించండి -
నీకు నువ్వే ఆయుధమవ్వాలి: తనికెళ్ళ భరణి
సాక్షి, మాదాపూర్: అమ్మగా, చెల్లిగా, అక్కలా, ఆలిగా ఇలా మహిళ నిత్యం ఎన్నో పాత్రలు పోషించినా నేటికీ ఆమె బానిసత్వంలోనే ఉండిపోతోంది. మహిళ గొప్పదనాన్ని తెలుపుతూ మాదాపూర్ శిల్పారామంలో గోగ్రహణం పేరిట ఆదివారం వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా రచయిత తనికెళ్ళ భరణి హాజరై నాటకాన్ని ప్రారంభించారు. నిజజీవితంలో స్త్రీ ఎన్నో పాత్రలు పోషించినా బానిసత్వం ఆమెను చేతగాకుండా చేస్తోందన్నారు. అబలవంటూ చట్టాలు, న్యాయాలు వెక్కిరిస్తున్నాయని అన్నారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానమై, ఆత్మవిశ్వాసం నిండిన ఆదిశక్తివై నీకు నువ్వే ఆయుధం అవ్వాలనే సందేశానిస్తూ గోగ్రహణం నాటికను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. -
శిల్పారామంలో ట్రాన్స్‌జెండర్స్ ఫ్యాషన్ ర్యాంప్ వాక్ ఫోటోలు
-
బెజవాడలో శిల్పారామం
సాక్షి, విజయవాడ: విజయవాడలో శిల్పారామం ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం శిల్పారామం కార్యాలయం మాత్రమే నగరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దీని ఏర్పాటుకు అనువైన స్థలం కోసం అధికారులు వెతుకుతున్నారు. విజయవాడకు అవసరం.. రాష్ట్రంలో ఇప్పటికే పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరంలలో శిల్పారామాలు ఉన్నాయి. చిత్తూరులో స్థలం ఏర్పాటు చేయడంతో అక్కడ శిల్పారామం నిరిస్తున్నారు. ప్రతి జిల్లాలోనూ శిల్పారామాన్ని ఏర్పాటు చేసి చేతివృత్తుల వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే అవకాశం కల్పించాలని అధికారులు యోచిస్తున్నారు. కృష్ణా జిల్లాలో కొండపల్లి బొమ్మలు, మచిలీపట్నం రోల్డ్‌గోల్డ్ ఉత్పత్తులు, మంగళగిరి, పెడనలలోని చేనేత వస్త్రాలు మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం అవసరం. అలాగే ఇతర ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారి ఉత్పత్తులను ఇక్కడకు తీసుకువచ్చి మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. విజయవాడ ప్రముఖ రైల్వే కూడలి కావడంతో ఇక్కడకు వచ్చి పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. స్థలం కోసం వినతి.. విజయవాడ వంటి నగరాల్లో శిల్పారామం ఏర్పాటు చేయాలంటే కనీసం 10 నుంచి 15 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. ఈ స్థలాన్ని ఏర్పాటు చేయమని శిల్పారామం అధికారులు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌కు, సీఆర్డీఏ అధికారులకు లేఖ రాశారు. విజయవాడలో అంత స్థలం లేకపోతే విజయవాడ పరిసర ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, కొండపల్లి తదితర ప్రదేశాల్లోనైనా ఇప్పించాలని ఆ లేఖలో కోరారు. గతంలో భవానీ ఐల్యాండ్‌లోనే 20 ఎకరాలు కేటాయించి అక్కడ శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ద్వీపాన్నే పర్యాటకులకు అనుకూలంగా మార్చాలనే ఉద్దేశంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టారు. నున్నలో స్థలం చూసినప్పటికీ అది శిల్పారామానికి దక్కలేదు. ఎందుకీ శిల్పారామం.. శిల్పారామం (ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ విలేజ్) ఏర్పడితే.. చేతివృత్తులు, హస్తకళలకు మార్కెటింగ్ పెంచవచ్చు. అంతేకాకుండా మన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి కూచిపూడి నృత్యం, నాటికలు, పెయిటింగ్స్లను ప్రోత్సహించవచ్చు. అంతరించిపోతున్న కళల్ని వెలికి తీసి ఆ కళాకారులకు జీవనోపాధి కల్పించవచ్చు. భావితరాలకు ఆ కళలను గురించి తెలియజేయవచ్చు. ఇతర ప్రాంతాల కళలను ఇక్కడ ప్రదర్శించి ఇతర ప్రాంతాల్లో ఉన్న శిల్పారామాల్లో మన ప్రాంత కళల్ని పరిచయం చేయవచ్చు. శిల్పారామం లోపల బయట చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించవచ్చు. ఇక్కడ శిల్పారామం అవసరం.. విజయవాడ ప్రాంతంలో శిల్పారామం చాలా అవసరం. ఇక్కడ చేతి వృత్తుల వారు అనేక మంది ఉన్నారు. వారి ఉత్పత్తులన్నీ ఒక చోటకు చేర్చి మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనికి శిల్పారామం ఎంతో ఉపయోగపడుతుంది. రాజధాని ప్రాంతం కావడంతో ఇతర జిల్లాల వారు ఇక్కడకు వస్తారు. వారు శిల్పారామం సందర్శించే అవకాశం ఉంటుంది. – జయరాజ్, సీఈవో, శిల్పారామం -
తిరుపతి శిల్పారామానికి రూ.10 కోట్లు
సాక్షి, అమరావతి: తిరుపతిలోని శిల్పారామాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేయడంతోపాటు.. శ్రీకాకుళంలో కొత్తగా శిల్పారామం ఏర్పాటుకు తొలిదశలో రూ.3 కోట్లు కేటాయించినట్టు పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఇక రాష్ట్రంలోని శిల్పారామాల్లోకి మంగళవారం నుంచి సందర్శకులను అనుమతిస్తున్నట్టు వెల్లడించారు. కానీ, ఫిల్మ్స్ ప్రదర్శనలు, వినోద క్రీడలకు అనుమతి లేదని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి శిల్పారామం మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా పార్కును రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖపట్నంలో శిల్పారామం అభివృద్ధికి రూ.10.92 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించామని ఆయన తెలిపారు. వాటికి నిధులు కేటాయిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. -
శిల్పారామాలకు పరిపాలనా అనుమతులు జారీ
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం, తిరుపతిలలో శిల్పారామాల నిర్మాణానికి, నిధుల వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శిల్పారామాల అభివృద్ధితో పాటు వివిధ నిర్మాణాల కోసం 10 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. శ్రీకాకుళంలో కొత్త శిల్పారామం ఏర్పాటుకు పర్యాటక, సాంస్కృతిక శాఖ తొలివిడతగా 3 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాలు చేపట్టాల్సిందిగా ప్రభుత్వం సూచనలు చేసింది. (టీడీపీలో అసంతృప్తి సెగ: అలిగిన శిరీష) -
చూపరులను కట్టిపడేస్తున్న కళాకృతులు
సాక్షి, హైదరాబాద్: శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు సంక్రాంతి పర్వదినం కావడంతో శిల్పారామానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. పండగ సందర్భంగా శిల్పరామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు, ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే కళారూపాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. శిల్పారామంలో ఎంతో వేడుకగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు రేపటితో ముగియనున్నాయి. చదవండి: ప్రతి రోజూ పండగే -
ఆయన నిర్ణయాలు విప్లవాత్మకం..సాహసోపేతం..
సాక్షి, విశాఖపట్నం: మధురవాడ శిల్పారామంలో సంక్రాంతి సంబరాలను మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ వినయ్ చంద్, జీవీఎంసీ కమిషనర్ సృజన, జేఏసీలు వేణుగోపాల్, శివశంకర్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. బొమ్మల కొలువు, పులివేషాలు, తప్పెటగుళ్ళు, డప్పు వాయిద్యాలు, హరిదాసు కోలాహలం తో మధురవాడ శిల్పారామం ప్రాంగణం సందడి గా మారింది. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 8 నెలల పరిపాలన కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అభివృద్ధిలో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు. రాజకీయ లబ్ధికోసం రాజధాని ప్రజలను ప్రతిపక్ష నేత చంద్రబాబు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు ఉదయం లేచిందే మొదలు రాజకీయం కావాలని.. అదే బాటలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా నడుస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మొద్దని..ఆయనది వాడుకుని వదిలేసే నైజం అని..పవన్‌ను కూడా అలాగే చేస్తారని తెలిపారు. అమరావతి రైతులకు సీఎం జగన్ న్యాయం చేస్తారని వెల్లడించారు. అందరికి నవరత్నాలు.. ప్రజలందరికి నవరత్న పథకాలు అందించాలనే సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. సంక్రాంతి పండగ అంటే సంప్రదాయం గా తరతరాలుగా వస్తున్న ఆచారం అని పేర్కొన్నారు. ఆ ఆచారాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రతి ఇంట సంక్రాంతి.. ప్రజలంతా సంతోషంగా ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారని జీవీఎంసీ కమిషనర్ సృజన అన్నారు. ప్రతి ఇంటికి సంక్రాంతి ఆనందాన్ని తీసుకెళ్ళాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. -
ప్రతి రోజూ పండగే
సాక్షి, హైదరాబాద్/కంటోన్మెంట్/గచ్చిబౌలి: నగరం సంక్రాంతి సంబురాలకు ముస్తాబవుతోంది. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ కైట్, స్వీట్ ఫెస్టివల్‌కు ముస్తాబవ్వగా, శిల్పారామం పల్లెసీమకు వేదికగా నిలవనుంది. శిల్పారామం సోమవారం నుంచి 19 వరకు సంప్రదాయ కళారూపాలను ఆవిష్కరించేందుకు ముస్తాబైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు పరేడ్ గ్రౌండ్లో ఐదో అంతర్జాతీయ కైట్ అండ్ మూడో స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకు పలు కళారూపాల ప్రదర్శన, సాయంత్రం 7 నుంచి రాత్రి 10 వరకు 25 రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల కళాప్రదర్శనలు నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. స్వీట్ ఫెస్టివల్.. పాల్గొనేవారు: 22 దేశాల మహిళా హోమ్ మేకర్స్‌తో పాటు 25 రాష్ట్రాలకు చెందిన 2500 మంది హోమ్ మేకర్స్. ఎన్ని రకాలు: 1,200 ఏఏ రకాలు: తెలంగాణ సంప్రదాయ వంటలు, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రతో పాటు ఇతర దేశాలకు చెందిన మహిళలు తయారు చేసిన స్వీట్లు ప్రదర్శించనున్నారు. ఇవి ప్రత్యేకం: మధుమేహంతో బాధపడే వారి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన స్వీట్లు. కైట్ ఫెస్టివల్... వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నిర్వహణ: పర్యాటక, సాంస్కృతిక శాఖ తేదీలు: ఈ నెల 13 నుంచి 15 వరకు కైట్ ఫెస్టివల్లో పాల్గొనేవారు: 30 దేశాల నుంచి 100 మందికిపైగా అంతర్జాతీయ స్థాయి కైట్ ప్లేయర్స్, సుమారు 80 దేశవాళీ కైట్ క్లబ్స్ సభ్యులు. పల్లెసీమలో కళాప్రదర్శనలు... వేదిక: శిల్పారామంలోని పల్లెసీమ తేదీలు: ఈ నెల 13 నుంచి 19 వరకు నేటి ప్రదర్శనలు: ఉదయం నుంచి గంగిరెద్దుల ఆట, హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవర, కొమ్మదాసర్లు, పిట్టల దొర, పులి వేశాలు ప్రదర్శిస్తారు. సాయంత్రం ఆంపీ థియేటర్లో కాలిఫోర్నియా నుంచి వచ్చిన కుమారి శరణ్య భరతనాట్యం, ముసునూరి ఇందిరా శిష్య బృందంచే కూచిపూడి నృత్యం, సంక్రాంతి పాటలు ఉంటాయి. 14న: శిల్పారామంలోని నగరాజ్ లాన్లో 11 సంవత్సరాల లోపు పిల్లలకు శిల్పారామంలో భోగి పండ్లు పోసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం నుంచి గంగిరెద్దుల ఆటలతో పాటు జానపద కళాకారులు సందడి చేస్తారు. సాయంత్రం ఆంపీ థియేటర్లో స్వర్ణ మంగళంపల్లి బృందం భోగి పాటలు ఆలపిస్తారు. రమణి సిద్ధి బృందం గోదా కళ్యాణం నృత్య రూపకం చేస్తారు. 15న: అందరికీ సెలవు దినం కావడంతో సందర్శకులు ఎక్కువ సంఖ్యలో తరలిరానున్నారు. ఉదయం గంగిరెద్దుల ఆటలు, జానపద కళాకారుల కోలాహలంతో ఆకట్టుకోనున్నారు. సాయంత్రం ప్రియాంక, మేఘన కూచిపూడి నృత్యం, విశాఖ ప్రకాష్ శిష్య బృందం అండాల్ చరిత నృత్య రూపకం ప్రదర్శిస్తారు. 16న: గంగిరెద్దుల ఆటలతో పాటు విభూతి బృందం హరిదాసులు, బుడబుక్కలు, జంగమదేవర, కొమ్మదాసర్లు, పిట్టల దొర, పులివేశాలు ప్రదర్శిస్తారు. రేణుక ప్రభాకర్ గోదా కళ్యాణం, ముంబైకి చెందిన రమేష్ కోలి బృందం భరత నాట్యం ప్రదర్శిస్తారు. 17న: సాయంత్రం చెన్నైకు చెందిన లత రవి బృందం గోదాదేవి నృత్య రూపక ప్రదర్శన. 18న: సాయంత్రం బెంగళూర్‌కు చెందిన అనీల్ అయ్యర్ భరతనాట్యం. 19న: సాయంత్రం బెంగళూర్‌కు చెందిన క్షితిజా కాసరవల్లీ భరత నాట్యం, కుమారి హిమాన్సి కాట్రగడ్డ బృందం కూచిపూడి నృత్యం ప్రదర్శన. -
శిల్పారామంలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
-
సంక్రాంతి సంబరాల్లో ఉప రాష్ట్రపతి..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని శిల్పారామం సంక్రాంతి శోభను సంతరించుకుంది. గురువారం శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ.. తాను సాధారణ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి స్థాయి వరకు వెళ్లానని.. నాకు వేరే ఆశలు లేవన్నారు. ఈ సంక్రాంతి ప్రజలందరికి క్రాంతి ప్రసాదించాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని..కట్టు,బొట్టు మరిచిపోకూడదని పిలుపునిచ్చారు. సంపాదించిన దాంట్లో కొంత ఇతరులకు సాయం చేయాలన్నారు. తెలుగు భాష అమ్మఒడి లాంటిదని అందరూ కాపాడుకోవాలన్నారు. శిల్పారామంలో గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సంక్రాంతి సంబరాల్లో నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, హీరో వెంకటేష్, ముప్పవరపు కుటుంబ సభ్యులు, సుజనా చౌదరి, పరిటాల శ్రీరామ్, అశ్వినీదత్, ఎమ్మెల్సీ రామచంద్రారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ గవర్నర్ తమిళి సై, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. నిజ జీవితంలోనూ ఆయన రోల్‌మోడల్.. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా సంక్రాంతి పండగ జరుపుకోవడం గొప్పగా ఉందని గవర్నర్ తమిళసై అన్నారు. రాజకీయాల్లోనే కాదని..నిజ జీవితంలోనూ వెంకయ్యనాయుడు రోల్‌మోడల్ అని కొనియాడారు. ఎంతో మంది పేదలకు సేవలందిస్తున్న స్వర్ణభారతి ట్రస్ట్‌ను అభినందించారు. నిరుద్యోగులకు చేదోడువాదోడుగా నిలిచారు.. ఢిల్లీకి రాజైన తల్లికి మాత్రం కొడుకే అనే విధంగా సొంతగడ్డకు వెంకయ్యనాయుడు సేవలు అందిస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా కొన్ని సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. నిరుద్యోగ యువతకు వెంకయ్యనాయుడు చేదోడు వాదోడుగా నిలిచారన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉంటున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలకు జాతీయ ప్రాజెక్టులను తెచ్చి రైతాంగానికి నీరివ్వాలని కోరారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి.. పేదలకు ఏదో ఒకటి చేయాలనే కోరుకునే వ్యక్తి వెంకయ్యనాయుడు అని, తన లాంటి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ముప్పువరపు ఫౌండేషన్,స్వర్ణ భారతి ట్రస్ట్‌తో వేలాది మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. సంక్రాంతికి నా సినిమా విడుదల కావడం సంతోషంగా ఉంది.. సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు పండగ సంక్రాంతి అని..ఇదే పండగకు తన సినిమా విడుదల కావడం సంతోషంగా ఉందని హీరో మహేష్ బాబు అన్నారు. -
‘మహబూబ్‌నగర్, సిద్దిపేటలో శిల్పారామాలు’
మాదాపూర్: నగరంలో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న శిల్పారామాలను మహబూబ్‌నగర్, సిద్దిపేటలో త్వరలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వెల్లడించారు. అనంతరం దశల వారీగా రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రా ల్లోనూ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పారామంలో ఆలిండియా క్రాఫ్ట్ మేళాను మంత్రి ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరవాసులు సేద తీరేందు కు, ఆహ్లాదకరంగా ఉండేందుకు శిల్పారామం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. పీఆర్వోల పాత్ర కీలకం: శ్రీనివాస్‌గౌడ్ సనత్‌నగర్: సమాజంలో ప్రజా సంబంధాల అధికారుల ( పీఆర్వో) పాత్ర కీలకమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మూడ్రోజులుగా బేగంపేటలో ఓ ప్రైవేట్ హోటల్లో ‘పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ముగింపు సదస్సుకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి చేతులమీదుగా అవార్డులు పీఆర్ఎస్ఐ చాప్టర్ అవార్డులను శ్రీనివాస్‌గౌ డ్ చేతుల మీదుగా అందజేశారు. ఉత్తమ చాప్టర్ చైర్మన్ అవార్డును హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ పి.వేణుగోపాల్‌రెడ్డి, జైపూర్ చాప్టర్ చైర్మన్ రవిశంకర్ శర్మ అందుకున్నారు. బెస్ట్ ఎమర్జింగ్ చాప్టర్‌గా తిరుపతి చాప్టర్ జాతీయ అవార్డు పొందింది. ఉత్తమ కార్యక్రమాలు నిర్వహించిన కోల్‌కతా, గువాహటి, భోపాల్, అహ్మదాబాద్ చాప్టర్లకు అవార్డులు దక్కాయి -
హైదరాబాద్: కార్తీక మాసం..వనభోజనాల సందడి
-
ప్రతి జిల్లాకో శిల్పారామం రావాలి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రతి జిల్లాకో శిల్పారామం రావాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆకాంక్షించారు. శనివారం ఉప్పల్‌లో ఏర్పాటైన శిల్పారామం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిల్పారామం ఉప్పల్ ప్రాంతంలో ఏర్పాటుకావటం ఇక్కడి ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుందన్నారు. కళాకారులను ప్రోత్సహించడానికి శిల్పారామం ఓ మంచి వేదికగా పేర్కొన్నారు. కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఉప్పల్‌లో శిల్పారామం ఏర్పాటైందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా ఉండాలని అన్నారు. మూసీ దుర్వాసనను పోగొట్టవచ్చు ఉప్పల్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన శిల్పారామం పక్కన ట్రీట్ మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పనున్నామని, దాని వల్ల మూసీ నది నుంచి వచ్చే దుర్వాసనను పోగొట్టవచ్చునని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఉప్పల్‌లో ఏర్పాటైన శిల్పారామం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబంతో సహా శిల్పారామం వచ్చి సంతోషంగా గడపవచ్చునన్నారు. రూ.1800 కోట్లతో యాదాద్రిని కడుతున్నామన్నారు. చేతి వృత్తుల వాళ్లకు ఉపాది కల్పించడమే శిల్పారామం ప్రత్యేకతగా పేర్కొన్నారు. -
ఉప్పల్‌లో మరో శిల్పారామం
-
6 నుంచి ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు శిల్పారామంలో ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు కేంద్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ ఫెస్టివల్‌ను ప్రతి సంవత్సరం ఢిల్లీలో నిర్వహించేవారు. అయితే ఈ సారి హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.జగదీశ్వర్ తెలిపారు. ఉమెన్ ఆఫ్ ఇండియా ఆర్గానిక్ ఫెస్టివల్ ఏర్పాట్ల నేపథ్యంలో సోమవారం శిల్పారామంలోని సంప్రదాయ హాల్లో సంచాలకులు బోయి విజయేందిరతో కలసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సేంద్రియ పద్ధతుల్ని ప్రోత్సహించి ఆరోగ్య భారతాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 150 మంది మహిళా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. సేంద్రియ రంగంలో కృషి చేస్తున్న మహిళలు ఇక్కడ ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేసి సేంద్రియ సాగు ఉత్పత్తులు, విత్తనాలు, బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలను ఇక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉంటాయని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్ని మరింత ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని, పురుగుమందులు, రసాయనిక ఎరువుల వినియోగం అధికమవుతుండటంతో మనుషులపై వాటి దుష్ప్రభావాలు పెరిగాయన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. -
చేనేత అందాలు..
-
రాణితోటపై రాబందుల కన్ను
– 10 ఎకరాల ప్రభుత్వ స్థలం కాజేసేందుకు యత్నం – ప్రజావసరాలకు కేటాయించాలని గ్రామ పెద్దలు డిమాండ్ – రెండు పర్యాయాలు పేదలకు పట్టాలిచ్చి... స్థలాలు చూపని వైనం ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు కొందరు రాబంధులా వాలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని పథకాలు రచిస్తారు. మండల పరిధిలోని చిన్నటేకూరు గ్రామ రెవెన్యూలోని పది ఎకరాల రాణితోటపై ఇప్పుడు కొందరి కన్ను పడింది. పరిశ్రమల స్థాపన పేరుతో కాజేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కల్లూరు: 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే రాణితోట పేరుతో 10.81 ఎకరాల భూమి ఉంది. 89 సర్వే నెంబరులో 4.47 ఎకరాలు, 90/2లో 3.44 ఎకరాలు, 92/2లో 2.90 ఎకరాలు ఉంది. ప్రజల అవసరాలకు ఈ భూమిని కేటాయించాలని గ్రామ పెద్దలు కోరుతున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రస్తుతం భూ విలువలు భారీగా పెరగడంతో కొందరు అక్రమార్కులు ఈ భూమిని కబ్జా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇటీవల శంకర్ అనే ప్రైవేట్ వ్యక్తి ఈనెల 17వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో జేసీబీ సహాయంతో ముళ్లపొదలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. గమనించిన గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. గ్రామ రెవెన్యూ అసిస్టెంట్‌ను సంఘటన స్థలానికి పంపించి అక్రమార్కులు చేపట్టిన పనులను నిలిపివేయించారు. పరిశ్రమల స్థాపన, ఇతర యూనిట్ల స్థాపన పేరుతో కొందరు రాణితోట స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఆర్డీఓ, తహసీల్దార్, వీఆర్ఓలు స్థలాలను నిత్యం పరిశీలిస్తూనే ఉన్నారు. ఈనెల 22న ఆర్డీఓ, తహశీల్దార్లు, 23న కల్లూరు, కర్నూలు వీఆర్ఓలు స్థలాన్ని, మ్యాప్‌లను పరిశీలించారు. ప్రజా ప్రతినిధులకు విన్నవించినా స్పందన కరువు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గ్రామ పెద్దలు డిమాండ్ చేయగా 2004లో 270 మంది పేదలకు ఒక్కొక్కరికి 1.50 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తూ నాటి రెవెన్యూ అధికారులు ఇంటి పట్టాలు జారీ చేశారు. పట్టాలు పొందిన వారికి స్థలాలు చూపించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారు. అనంతరం కల్లూరు మండలం అర్బన్, రూరల్ మండలాలుగా విభజన కానున్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. రూరల్ మండలం అయితే చిన్నటేకూరు గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటుచేసి రాణితోట 10 ఎకరాలలో ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేసేందుకు సద్వినియోగం చేసుకోవాలని భావించారు. మళ్లీ రెండవ పర్యాయం 2014లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు నాటి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. పట్టాలు రూపుదిద్దుకున్నా పంపిణీకి నోచుకోలేదు. ఏడాది క్రితం మళ్లీ గ్రామపెద్దలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని కలిసి రాణితోట స్థలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడా మైదానం ఏర్పాటుచేయాలని విన్నవించారు. మరోపక్క హైదరాబాద్ శిల్పారామం నుంచి కొందరు స్థలం కావాలని ప్రతిపాదనలు అందజేసినట్లు సమాచారం. ఇందుకోసం వీఆర్ఓ స్థలాన్ని పరిశీలించినట్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి : మల్లికార్జున, చిన్నటేకూరు చిన్నటేకూరు గ్రామానికి సమీపంలో ఉలిందకొండ, లక్ష్మీపురం, బొల్లవరం, పర్ల గ్రామాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ పదవ తరగతి ఉత్తీర్ణులైన వారందరూ జూనియర్ కళాశాలలో చేరాలంటే కర్నూలు నగరానికి వెళ్లాలి. చిన్నటేకూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాలను రాణితోటలో ఏర్పాటుచేస్తే 5 గ్రామాల్లోని విద్యార్థులకు ఉన్నత చదువు అందుతుంది. ఇతరులకు కట్టబెడితే ఊరుకోం: రామాంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు రాణితోట స్థలంలో పేదలకు ఇళ్లు కేటాయించాలి. రూరల్ మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తే ఆ స్థలంలో ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. అలా కాకుండా వ్యాపార వేత్తలకు, పారిశ్రామికవేత్తలకు స్థలాలు కేటాయిస్తే గ్రామస్తులమంతా కలిసి ఉద్యమిస్తాం. -
శిల్పారామంలో 12రాష్ట్రాల కళాకారులతో ఉగాది ఉత్సవాలు
-
కళల తరంగం
-
శిల్పారామంలో నాట్యాంజలి
-
శిల్పారామం ప్రకటన గుర్తుందా..
►పట్టిసీమపై పెదవి విప్పేనా? ► కొల్లేరు కాంటూరు కుదింపుపై నోరు మెదిపేనా! ► ఏలూరు శిల్పారామం గుర్తుకు తెచ్చేనా ? ► లేక అధినేత ఉసిగొల్పితే ప్రతిపక్షాలపై రెచ్చిపోవడానికే పరిమితమవుతారా ! ► శాసనసభా సమావేశాల్లో మన ఎమ్మెల్యేల వ్యూహం ఏంటి? ► నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి తీసుకుచ్చేందుకు కీలకపాత్ర పోషించిన పశ్చిమగోదావరి జిల్లా రుణం తీర్చుకుంటా.. అన్ని స్థానాలూ గెలిపించిన ఈ జిల్లా తర్వాతే నాకు ఏదైనా సరే..’ అని జిల్లాకు వచ్చిన ప్రతిసారీ మొహమాటపడకుండా ఇదే ‘‘ముచ్చట’’ చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంతవరకు జిల్లా ప్రగతి రూపురేఖలు మార్చే సమగ్ర కార్యాచరణే ప్రకటించలేదు. జిల్లా పర్యటనల్లో ఆయన ప్రకటించిన చిన్నాచితకా ప్రాజెక్టులకే అతీగతీ లేకుండా పోయింది. ఇక గతేడాది మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ సాక్షిగా చేసిన ప్రకటనలూ కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా ఎమ్మెల్యేలు జిల్లా సమస్యలను ప్రస్తావిస్తారా.. ప్రధానంగా జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీటి ఇబ్బందులను సభ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారం దిశగా కృషి చేస్తారా.. లేదంటే షరామామూలుగానే అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెప్పుపొందేందుకు ప్రతిపక్షాలపై నోరుపారేసుకుని రాద్ధాంతం చేస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టిసీమ విపరిణామాలను ప్రస్తావించే ధైర్యం ఎవరికో? ఉభయగోదావరి జిల్లాల డెల్టా రైతాంగం భయపడినట్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం విపరిణామాలు తొలిఏడాదే తీవ్రంగా ప్రభావం చూపాయి. పట్టిసీమ నుంచి కేవలం నాలుగైదు మోటార్లతో గోదావరి నీళ్లను తోడి కృష్ణా డెల్టాకు ఎత్తిపోసిన ఫలితంగానే మునుపెన్నడూ లేనివిధంగా ఈ రబీ సీజన్లో డెల్టాలో సాగునీటి సంక్షోభం ఎదురైంది. ఇక 24 మోటార్లు, 24పంపులతో పూర్తిస్థాయిలో గోదావరి నీటిని తోడేసి కృష్ణాకు తరలిస్తే గోదావరి డెల్టా భవితవ్యం ఏమవుతుందనే భయాందోళన పశ్చిమ రైతాంగం నుంచి వ్యక్తమవుతోంది. మార్చి నెలాఖరు నాటికి పట్టిసీమను పూర్తి చేసి వచ్చే సీజన్లో మళ్లీ నీటిని తరలించేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి వరదల సీజన్లో సముద్రంలోకి పోయే వృథా జలాలను మాత్రమే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా గోదావరి ఎండిపోయేలా నీటిని తరలించుకుపోయింది. ఫలితంగా రబీ సీజన్లో సాగునీటి సంక్షోభం తలెత్తి మూడు నెలలు ముందుగానే సీలేరు జలాలపై రబీ సాగు ఆధారపడాల్సిన దుస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో పట్టిసీమ దుష్ఫలితాలపై శాసనసభలో మాట్లాడే సాహసం ఏ ఎమ్మెల్యే చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పట్టిసీమ వల్లే ఈ సీజన్లో రబీ సాగుకు ఇబ్బంది ఎదురైందని గతంలో వ్యాఖ్యానించారు. జిల్లాలోని అందరి ప్రజాప్రతినిధుల్లో అదే అభ్రిపాయమున్నా.. అధినేత బాబు వద్ద చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా ప్రస్తావించి పట్టిసీమ విపరిణామాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో చూడాలి. కొల్లేరుపై ఏం మాట్లాడతారో కొల్లేరు కాంటూరు కుదింపుపై ఎన్నికల ముందు చంద్రబాబు స్పష్టమైన హామీనిచ్చారు. కానీ ఎన్నికల తర్వాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో మొక్కుబడి తీర్మానం చేసి చేతులు దులుపుకున్న సర్కారు కాంటూరు కుదింపు దిశగా చర్యలు చేపట్టలేదు. కుదింపు ప్రక్రియ కేంద్రప్రభుత్వం పరిధిలో ఉందని చెబుతూ కాలయాపన చేస్తూ వస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపించి ఒప్పించాల్సిన బాధ్యతను విస్మరించింది. ఈ నేపథ్యంలో కొల్లేరులో నిత్యం రావణకాష్టంలా రగులుతున్న కాాంటూరు సమస్యపై ఈసారైనా అసెంబ్లీ స్పష్టంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తుందా అనేది చూడాలి. ఇక ప్రభుత్వం కొల్లేటిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఇప్పటికి పలుమార్లు ప్రకటించింది. కానీ నిధులు మాత్రం కేటాయించలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా ఆ ప్రస్తావన తీసుకువస్తుందో లేదో చూడాలి. ఏడాదిన్నర కిందట అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలూ గాలికేనా? సరిగ్గా ఏడాదిన్నర కిందట కిందట జరిగిన శాసనసభ సమావేశాల్లో జిల్లాలో ఉద్యాన పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నిట్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తున్నందున, నిఫ్ట్ ఏలూరులోనూ ఏర్పాటయ్యే అవకాశముందని ప్రకటించారు. జిల్లాలో సిరామిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని, భీమవరంలో ఫుడ్ ప్రోసెసింగ్ పరిశ్రమలను స్థాపిస్తామని, జిల్లాలో లేస్ పార్కు ఏర్పాటుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సాగు ప్రధాన జిల్లా కావడంతో నూనెశుద్ధి, కొబ్బరిపీచు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. నరసాపురం వద్ద మినీ ఫిషింగ్ హార్బర్ నెలకొల్పి, జల రవాణాను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. కానీ గత బడ్జెట్ సమావేశాల్లోనే ఎక్కడా వీటి ప్రస్తావన తీసుకు రాలేదు. ప్రకటన గుర్తుందా.. ఇక జిల్లా కేంద్రం ఏలూరులో శిల్పారామం ఏర్పాటు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి యనమల గతేడాది మార్చి బడ్జెట్లో ప్రకటించారు. ఏలూరుతో సహా రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో శిల్పారామాలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన2015జూన్ నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. కానీ ఆ తర్వాత ఆ ఊసే ఎవ్వరూ పట్టించుకోలేదు. -
శిల్పారామం సకల కళాధామం
-
దసరా సంబరం
-
గోపాల గోపాల
మణిపూర్ వైభవానికి ప్రతీకగా నిలిచిన నృత్యరీతులు ‘వసంత్‌రాస్.. పుంగ్ చోలమ్’. ఈ జంట నృత్యాల సవ్వడిలో శిల్పారామంలోని అంఫీథియేటర్ ఆదివారం మార్మోగింది. ఇంఫాల్‌కు చెందిన జవహర్లాల్ నెహ్రూ మణిపురీ డ్యాన్స్ అకాడమీకి చెందిన కళాకారులు ప్రదర్శించిన నాట్యం ఆహూతులను ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా డ్యాన్స్ అకాడమీ డెరైక్టర్ ఉపేంద్రశర్మ సిటీప్లస్ తో పంచుకున్న విశేషాలు .. - వాంకె శ్రీనివాస్ వసంత్‌రాస్.. రాధాకృష్ణుల రాసలీలను కళ్లకుకడుతుంది. వసంత రాస్.. మణిపూర్‌కు వరంగా దొరకడం వెనుక పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. బృందావనంలో గోపికల సమేతంగా రాధాకృష్ణులు రసరమ్య కేళిని.. పార్వతీదేవి చూడాలనుకుంటుంది. ఆమె కోరిక మేరకు శివుడు పార్వతితో కలసి మణిపూర్‌లోని ఓ అందమైన ప్రాంతంలో ఆనందలాస్యం చేశాడని ప్రతీతి. ఆనాటి నుంచి వసంత రాస్.. మణిపురీల సొంతమైంది. పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం పొందిన వసంత్‌రాస్ నాట్యం మణిపూర్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. హైదరాబాదీలు కూడా వసంత్‌రాస్ నాట్యం అభ్యసించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. నాట్య గోవిందం.. ఈ నాట్యంలో రాధాకృష్ణుల ఆనందకేళి, గోపాలుడితో గోపికల అల్లరి.. కళ్లకు కట్టడమే వసంతరాస్ నాట్యంలో ప్రధానాంశం. తరతరాలుగా ఎందరో మహానుభావులు ఈ నృత్యరీతికి తమ ప్రతిభతో అదనపు సొబగులు అద్దుతున్నారు. ఈ నృత్యంలో నర్తకిలు చేతివేళ్లతో ప్రదర్శించే ముద్రలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గోపికలంతా శ్రీ కృష్ణుడి చుట్టూ చేరి.. ఆరాధన భావనతో అతనివైపే చూస్తూ నాట్యంలో లీనమైపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆనాడు యమునా తీరంలో కృష్ణుడి వైభోగాన్ని ఈ కళాకారులు మన కళ్లముందుంచుతారు. మృదంగలాస్యం.. ఇక మణిపురి నట సంకీర్తన పుంగ్ చోలమ్కు విశేష ఆదరణ ఉంది. పుంగ్ అంటే మృదంగం వాయించడం.. చోలమ్ అంటే కదలికలు అని అర్థం. కళాకారులు మృదంగాలు వాయిస్తూ.. పాదాలు చకచకా కదుపుతూ.. గాలిలో ఎగురుతూ చేసే నృత్యం అద్భుతంగా కనిపిస్తుంది. 600 ఏళ్ల క్రితం దీనికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. మణిపూర్‌లోని పల్లెల్లో హోలీ సందర్భంగా ఈ నృత్యం చేసేవారు. కాలక్రమంలో పల్లె దాటిన ఈ నృత్యం.. ప్రపంచ వేదికపై కూడా తన వైభవాన్ని చాటింది. -
పల్లెక్రాంతి
పొద్దు పొడుస్తూనే ముంగిట గంగిరెద్దు విన్యాసాలు.. మంగళ వాయిద్యాలు. శృతి తప్పని చిడతల భజనలు... హరిదాసుల ఆశీస్సులు. పిలిచి మరీ పలుకరించే పగటి వేషగాళ్లు. పేడతో అలికిన వాకిళ్లలో... రంగురంగుల ముగ్గులు... వాటిలో అలంకరించుకున్న గొబ్బెమ్మలు. జనారణ్యంగా మారిన మహానగరంలో అచ్చతెలుగు సంక్రాంతి శోభ కనుమరుగవుతోంది. ఆ ముచ్చట ఉన్నా తీర్చుకోలేకపోతున్న నగరవాసుల కోసం పల్లె అందాలను సిటీలో ప్రతిబింబిస్తోంది మాదాపూర్‌లోని శిల్పారామం. మెట్రో కల్చర్‌లో మనం కోల్పోయిన సంప్రదాయ సిరులతో వెలిగిపోతోంది. సంక్రాంతి వేళ శిల్పారామంలో అడుగుపెడితే అచ్చమైన పల్లె వీధుల్లో విహరించినట్టు అనిపిస్తుంది. హరిదాసులు మొదలు బుర్రకథ చెప్పేవారి వరకూ అందరూ ఒకేచోట కనిపిస్తారు. ఈ వేడుక కోసం పదిరోజుల ముందు నుంచే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.‘సంక్రాంతి సమయంలో మూడు రోజుల పాటు కళాకారుల ప్రదర్శనలు, ప్రత్యేక స్టాల్స్‌తో కళకళలాడుతుంది. ఎప్పటిలానే ఈసారి కూడా అన్ని రకాల కళకారులు తమ ప్రతిభను చాటడానికి సిద్ధంగా ఉన్నారు. యక్షగానం, పల్లెసుద్దులు, డప్పు వాయిద్యాలు, వొగ్గుడోలు, హరికథ, బుర్రకథ, కోలాటాలు, చిడతల భజన... ఒక్కటేమిటి, పల్లెలో కనిపించే ప్రతిఒక్క కళారూపం ఇక్కడ కనిపిస్తుంది. అన్ని జిల్లాల్లో కళావృత్తుల్లో ఉన్న ఉత్తమ కళాకారులను ఎంపిక చేసి ఇక్కడికి ఆహ్వానించాం’ అని చెప్పారు శిల్పారామం జనరల్ మేనేజర్ సాయన్న. యక్షగానమైనా, వొగ్గుడోలైనా, హరికథైనా... పల్లెలో ఆ కళను నమ్ముకుని బతికేవారికి ఇక్కడికొచ్చే అవకాశాన్ని కల్పిస్తున్నారు. మంచి ఆదరణ... సంక్రాంతి సమయంలో శిల్పారామానికి గత ఐదేళ్లుగా వస్తున్న పగటివేషం కళాకారుడు పిల్లుట్ల సాయిలు... పల్లె కంటే శిల్పారామమే నయమంటాడు. ‘మాది వరంగల్ జిల్లా జనగాం. పగటివేషం మా కులవృత్తి. ఏటా పండగ సమయంలో శిల్పారామానికి వచ్చి బోలెడన్ని వేషాలేసి, సందర్శకుల్ని సంతోషపెడుతున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉంటుంది. అమ్మోరు, పరశురాముడు, ఎల్లమ్మ, జాంబవంతుడు, పోతరాజు వంటి వేషాలతో అలరిస్తుంటాం. ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోంది’ అంటాడు సాయిలు. పల్లెసుద్దులు... పండగ వేళ రకరకాల పాటలు పాడుతూ పల్లెసుద్దులు చెప్పే కళాకారులు, హరినామ స్మరణతో భక్తుల కానుకులు కోరే హరిదాసులు చేసే సందడి... చూస్తుంటే ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ‘నెత్తిన భిక్షపాత్ర, చేతిలో చిడతలు పట్టుకుని హరినామ స్మరణ చేస్తూ శిల్పారామం వీధుల్లో తిరిగడం చక్కని జ్ఞాపకం. మా ఊళ్లో అయితే అందరూ తెలిసినవారే. కానీ శిల్పారామంలో అంతా కొత్తవారు... పైగా పట్నం వాసులు. పల్లెముఖం తెలియని చిన్నారులు మమ్మల్ని చూసి ఎంతో ఆశ్చర్యంతో ముఖాలింత చేసుకుని చూస్తూ దగ్గరికొచ్చి ఆశీస్సులు తీసుకుంటుంటారు’ అని ఆనందంగా చెప్పుకొచ్చాడు నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన హరిదాసు శంకర్. నిజమే... వొగ్గు కథలు మొదలు బుర్రకథల వరకూ ఆ వృత్తులనే నమ్ముకున్న నిజమైన కళాకారులకు ఆతిథ్యం కల్పిస్తున్న శిల్పారామం నగరంలోని అచ్చమైన పల్లెటూరు. ఆ ఊరికెళ్లే వారంతా ఓ గంట పల్లెను దర్శించుకున్న అనుభూతితో బయటకొస్తారనడంలో సందేహం లేదు. -
తెలంగాణ సంస్కృతిని చాటాలి
* రాష్ట్ర యువజనోత్సవాల ప్రారంభోత్సవంలో మంత్రి మహేందర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను జాతీయ స్థాయిలో చాటిచెప్పాలని మంత్రి పి.మహేందర్‌రె డ్డి కళాకారులకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని శిల్పారామంలో రాష్ట్ర యువజనోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ కళాకారుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అస్సాంలోని గౌహతిలో ఈ నెల 8 నుంచి జరిగే జాతీయ యువజనోత్సవాలలో తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా ప్రదర్శనలుండాలని సూచించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె.వి.రమణాచారి, రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడల కార్యదర్శి లవ్ అగర్వాల్, టెన్నిస్ క్రీడా కారిణి నైనా జైస్వాల్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. కాగా, అట్టహాసంగా ప్రారంభమైన యువజనోత్సవాల్లో 18 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నారు. 10 జిల్లాల నుంచి దాదాపు 650 మంది కళాకారులు విచ్చేశారు. పల్లే అందాలు సింగారించుకున్న శిల్పారామంలో కళాకారుల కోలాహలం నెలకొంది. సంప్రదాయ వేదికలో సంప్రదాయ నృత్యాలు, యాంఫీ థియేటర్లో జానపద నృత్యా లు, గేయాలు, శిల్పసంధ్యా వేదికలో సంప్రదాయ వాయిద్యాలు, క్రాఫ్ట్ సెంటర్లో వ్యాస రచన, వక్తృత్వం, మిమిక్రీ తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలు గౌహతిలో జరిగే జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొంటారు. -
భాగ్యనగరిలో ‘న్యూ’జోష్..
-
మనోహరం..
-
కొండపల్లిలో శిల్పారామం!
15 ఎకరాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కసరత్తు ఆలస్యమైతే కేంద్రం ఇచ్చిన రూ.5కోట్లు వృథా ప్రతిష్టాత్మక శిల్పారామం కొండపల్లి ఖిల్లా సమీపంలో ఏర్పాటుచేయాలని జిల్లాయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖిల్లా సమీపంలో ఉన్న 15 ఎకరాలను ఇందుకు కోసం కేటాయించాలని నిర్ణయించింది. విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి కేంద్రమైన విజయవాడలో ప్రతిష్టాత్మక శిల్పారామం ఏర్పాటు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో స్థలాలను అన్వేషిస్తోంది. ప్రాథమికంగా కొండపల్లి అనుకూలమని, ఇక్కడ 15 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధమని అధికారులు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తొలుత భవానీద్వీపంలో ఏర్పాటుచేయాలని భావించారు. ఇందుకోసం 20 ఎకరాలు కేటాయించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవెలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీగా వ్యవహరించిన చందనాఖాన్ ఆదేశించారు. అయితే, ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించడంతో జిల్లా యంత్రాంగం మళ్లీ స్థలం కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతం కొండపల్లి ఖిల్లా సమీపంలో 15 ఎకరాల భూమి ఉందని, దాన్ని ఏపీటీడీసీకి కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనికి శిల్పారామం సొసైటీ సానుకూలంగా స్పందిస్తుందా లేదా అని దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రూ.5 కోట్లకు గ్రహణం నగరంలో శిల్పారామం ఏర్పాటుకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారు రూ.5కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులు వచ్చే ఏడాది మార్చిలోపు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో సకాలంలో పనులు ప్రారంభమవుతాయా.. అనే సందేహం నెలకొంది. సకాలంలో పనులు ప్రారంభంకాకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. -
పర్యాటక క్షేత్రంగా శిల్పారామం!
కబ్జాలను నిర్మూలించి పూర్వవైభవం తీసుకొస్తాం హస్తకళలల ప్రదర్శన ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలో మినీ శిల్పారామం కాకతీయ శిల్పసంపదనుకాపాడిన నిజాములు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ కళాఖండంగా తీర్చి దిద్దుతామని, శిల్పారామా న్ని అద్భుత కళాక్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా మార్చుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. శిల్పారామంలో అఖిలభారత హస్తకళల ప్రదర్శనను సోమవారం సీఎం ప్రారంభించి అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. పర్యాటక కేంద్రాలతో పాటు, జిల్లా కేంద్రాల్లో శిల్పారామాలను ఏర్పాటు చేస్తామన్నారు. శిల్పారామానికి ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల్లో 24 ఎకరాలు కొందరు దుర్వినియోగం చేశారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాల క్రయావిక్రయాల నిషేధపుస్తకంలో దీన్ని గత ప్రభుత్వం నమోదు చేయకపోవడంతోనే కబ్జాకు గురయిందన్నారు. పల్లె సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా ఉండాల్సిన శిల్పారామంలో సిమెంట్ నిర్మాణాలు జరిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగుళం స్థలం కూడా కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వప్రధాన కార్యదర్శిని, హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. శిల్పారామం ప్రత్యేకాధికారి కిషన్‌రావు తన రక్తం ధారవోసి దీన్ని నిర్మించారని ఈ సందర్భంగా కేసీఆర్ ప్రశంసించారు. శిల్పాలను కాపాడిన అసఫ్జాహీలు... నిర్మల్ బొమ్మలు, పోచంపల్లి చీరలు, రామప్ప శిల్పాలు, గద్వాల్ చేనేత వస్త్రాలు తెలంగాణకు తలమానికమన్నారు. కాకతీయుల కళావైభవాన్ని స్మరించుకుంటూ ‘కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప’ అనే చరణాన్ని తానే రాశానని సీఎం కేసీఆర్ చెప్పారు. కాకతీయుల కళారూపాలను అసిఫ్జాహీ రాజులు సైతం ఎంతో అపురూపమైనవిగా పరిగణించి కాపాడారని తెలిపారు. నిజాం కాలంలో జరిగిన ఓ ఉదంతాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. నాటి వరంగల్ జిల్లా కలెక్టర్ రామప్పగుడిలో అమర్చిన ఓ చిన్న శిల్పాన్ని తీసుకెళ్లి తన కార్యాలయం బల్లపై పెట్టుకోగా, విచారణ జరిపించిన నిజాం వెంటనే కలెక్టర్ హోదాను తగ్గించి అక్కడి నుంచి బదిలీ చేసి, ఆ శిల్పాన్ని గుడిలో యథాస్థానంలో ప్రతిష్ఠింపజేశారని వివరించారు. ‘మనుషులుగా మనం ఈ రోజు వుంటాం. రేపు ఉండం. సాంస్కృతికి వైభవం ఓ తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతూ ఉంటది. దానిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నెల 31 వరకు మేళా... 19వ అఖిల భారత హస్తకళా మేళ ఈ నెల 31వ వరకు కొనసాగుతుంది. హస్తకళా మేళాలో నిర్వహించిన మహబూబ్‌నగర్ బైండ్ల కళాకారుల జమిడిక మోత, కరీంనగర్ కళాకారుల డప్పు దరువులు, వరంగల్ లంబాడి నృత్యాలు, పోతురాజుల ఆటలు, పంజాబీ దాండియా రక్తికట్టించాయి. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, మంత్రి జగదీశ్‌రెడ్డి,సలహాదారు పాపారావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి ఎస్.వేణుగోపాలచారి, పర్యాటక శాఖ కార్యదర్శి బీపీ ఆచార్య, ప్రత్యేకాధికారి కిషన్‌రావు, జనరల్ మేనేజర్ సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
అందరి బంధువయా
పట్నం తీరు గురించి నాంపల్లి స్టేషన్‌కాడ రాజలింగాన్ని అడిగితే.. ఉందామంటే నెలవే లేదు.. చేద్దామంటే కొలువే లేదని గోడు వెళ్లబోసుకుంటాడు. కళను నమ్ముకుని కలలు తీర్చుకునే దారిలో హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులను ఇదే ప్రశ్న అడిగి చూడండి.. భాగ్యనగరాన్ని కళల కాణాచిగా అభివర్ణిస్తారు. పొట్టచేత పట్టుకుని ఒట్టి చేతులతో ఇక్కడకు వచ్చే వారిని సైతం ఆదరించే ఈ నగరం.. హస్తకళను పట్టుకుని వచ్చిన వారిని మాత్రం పట్టించుకోకుండా ఉంటుందా..! వారి కళకు సలామ్ చేస్తోంది. కలకాలం నిలిచేలా చేస్తుంది. ఇదే మాటను నొక్కి మరీ చెబుతున్నారు.. పలు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కళాకారులు. సిటీ అందరి బంధువని కొనియాడుతున్నారు. హస్తకళను నమ్ముకుని శిల్పారామం వేదికగా ఏళ్లకేళ్లుగా జీవనం సాగిస్తున్న కళాకారుల మనసులో మాట... - శిరీష చల్లపల్లి ఆదరణకు పెట్టనికోట... మాకు బతుకుదెరువు ఇచ్చింది హైదరాబాదే. 14 ఏళ్లుగా ఈ సిటీనే నమ్ముకుని నా కుటుంబాన్ని పోషిస్తున్నా. మా ఫ్యామిలీ కోల్‌కతాలోనే ఉంటుంది. నేను, మా తమ్ముడు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం. టైట బొమ్మలంటే దేశవ్యాప్తంగా మంచిపేరు ఉంది. హైదరాబాద్‌వాసులు మా బొమ్మలను ఆదరిస్తున్నారు. ఆత్మీయంగా వాళ్ల ఇళ్లలో చోటిస్తున్నారు. వాటిని చూసి బాగున్నాయని పొగుడుతుంటే హ్యాపీగా ఉంటుంది. మా కళను ఆదరిస్తున్న ఈ మహానగరం అంటే మాకెంతో అభిమానం. ఇక్కడ మా స్టాల్ అద్దె ఆరు వేల రూపాయలు. మా ఇంటి అద్దె రెండున్నర వేలు. అన్ని ఖర్చులు పోగా నెలకు రూ.15 వేలు మిగులుతోంది. ఈ మొత్తాన్ని మా ఇంటికి పంపిస్తాం. - పింటూ పురమని, కోల్‌కతా బొమ్మల కొలువు స్వస్థలం నెల్లూరు జిల్లా కావలి. చదివింది పదో తరగతే. పదేళ్ల కిందట మా ఆయనతో కలసి హైదరాబాద్ వచ్చా. మొదట్లో ప్రింటింగ్, డిజైనింగ్ చేసుకునేవాళ్లం. ఎనిమిదేళ్ల కిందట శిల్పారామంలో వండర్ డాల్స్ పేరుతో సాఫ్ట్ టాయ్స్ స్టాల్ నిర్వహిస్తున్నాం. మా దగ్గర 15 మంది పని చేస్తున్నారు. అందరూ ఆడపిల్లలే. సైడ్ పౌచెస్, టెడ్డీబేర్స్, జంతువులు, పక్షుల బొమ్మలు, ఇంటీరియర్ డెకార్స్, దేవుని ప్రతిమలు ఇలా అనేక రకాల కళాకృతులు తయారు చేస్తున్నాం. మా వ్యాపారం బాగుంది. నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో మా ఉత్పత్తులు అమ్ముకునేలా ప్రాంచైజీలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. - ఇందిర, కావలి బేరాలాడకుంటే... మాది ఒడిశా. బట్ట ముక్కలతో వాల్ హ్యాంగిగ్స్, కొబ్బరి పీచుతో పిచ్చుక గూడు, జంతువుల బొమ్మలు, అద్దాలతో మోడ్రన్ ఆప్లిక్, బెడ్ కవర్లు... ఇలా రకరకాల గృహాలంకరణ వస్తువులు రూపొందిస్తుంటాం. నాలుగు రోజులు 9 గంటల చొప్పున కుడితే గానీ ఒక బెడ్‌షీట్ పూర్తికాదు. మేం తిన్నా తినకపోయినా.. ఒంట్లో బాగున్నా లేకున్నా.. పని చేయాల్సిందే. 15 ఏళ్లుగా మా కుటుంబాన్ని ఆదరించిన శిల్పారామం, హైదరాబాదీలన్నా మాకు ఎనలేని గౌరవం. - శైలబాల సాహూ, ఒడిశా కశ్మీర్ కీ కథ... కశ్మీర్ నుంచి బతుకుదెరువు కోసం 11 ఏళ్ల కిందట నగరానికి వచ్చా. మా కశ్మీరీ ప్రొడక్ట్స్‌కు ఇక్కడ ఆదరణ ఎక్కువ. కలప, పేపర్ మేడ్ వస్తువులు, వాల్ హ్యాంగింగ్స్, జ్యువెలరీ బాక్సులు, బ్యాంగిల్స్, బెడ్ ల్యాంప్స్, క్యాండెల్ స్టాండ్స్ ఇలా ఎన్నో చేసి అమ్ముతుంటా. ఒక్క గాజును కశ్మీరీ డిజైన్‌లో తీర్చిదిద్దడానికి 4 గంటలు పడుతుంది. శిల్పారామంలో మా స్టాల్ ఉంది. కొండాపూర్‌లో అద్దెకుంటున్నా. నా భార్య, పిల్లలు కశ్మీర్‌లోనే ఉంటున్నారు. మూడు నెలలకోసారి మా ఇంటికి వెళ్లొస్తా. నేను అక్కడికి వెళ్లగానే నా భార్య ఇక్కడికి వస్తుంది. ఇలా కష్టపడితేగానీ పూట గడవదు. మా కష్టాన్ని గుర్తించి మాకు జీవనోపాధి కల్పిస్తున్న హైదరాబాదీలను ఎన్నటికీ మరచిపోలేను. - జావీద్, కశ్మీర్ -
శిల్పారామం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: శిల్పారామం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంలో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటలో నిర్మాణ సమగ్రి పూర్తిగా కలిపోయింది. -
కేథరిన్‌తో షికారు
‘ఎర్రబస్సు’ సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఆ సినిమా హీరోయిన్ కేథరిన్ కూడా ఈ పిల్లలతో కలిసి శిల్పారామంలో కాసేపు కేరింతలు కొట్టింది. తన సినిమా విశేషాలను పిల్లలకు చెప్పి పిల్లల వివరాలు తెలుసుకుంది. బ్యాటరీ కార్లో శిల్పారామం ఆవరణలో కాసేపు షికారు చేసింది. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైనాఫ్ అయింది. ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే? మాసాయిపేట మానసపుత్రి రుచితజడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే..‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’ నల్లగొండ ఖేల్ రత్న వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’ మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే.. ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’ అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే.. ‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు. -
కేథరిన్‌తో షికారు..
ఎర్రబస్సు ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఆ సినిమా హీరోయిన్ కేథరిన్ కూడా ఈ పిల్లలతో కలిసి శిల్పారామంలో కాసేపు కేరింతలు కొట్టింది. తన సినిమా విశేషాలను పిల్లలకు చెప్పి పిల్లల వివరాలను తను తెలుసుకుంది. బ్యాటరీ కార్లో శిల్పారామం ఆవరణలో కాసేపు షికారు చేసింది. పిల్లల భవిష్యత్ లక్ష్యాలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సైనాఫ్ అయింది. ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నారంటే? * మాసాయిపేట మానసపుత్రి రుచిత జడ్జి ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘పేదవాళ్లకు న్యాయం చేయడానికి. అన్యాయం చేసినవాళ్లను కఠినంగా శిక్షించడానికి’ * నల్లగొండ ఖేల్త్న్ర వైజయంతి పోలీస్ ఆఫీసర్ ఎందుకు కావాలనుకుంటుందంటే.. ‘ఆడవాళ్ల తరఫున నిలబడడానికి. వాళ్ల మీద జరుగుతున్న దాడులకు చెక్ పెట్టేందుకు’ * మయూర అగ్రికల్చర్ జర్నలిస్ట్ ఎందుకవ్వాలనుకుంటుందంటే.. ‘దేశానికి వెన్నుముక రైతన్న. ఆయన ఏలే వ్యవసాయరంగాన్ని కలంతో ప్రపంచానికి పరిచయం చేయాలని’ * అర్చన సైంటిస్ట్ ఎందుక్కావాలనుకుంటుందంటే.. ‘ఇంకెన్నో కొత్త విషయాలను కనిపెట్టాలి... ప్రపంచ శాస్త్రీయ పరిశోధనలకు మనం కొత్తమార్గం చూపించేందుకు’ ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆలోచనలున్న ఈ పిల్లలు నిజంగా మణిమాణిక్యాలే. వాళ్ల ఊళ్లకు వెళ్లడానికి వెహికిల్ ఎక్కిన బాలల్ని ఈ హైదరాబాద్ ట్రిప్ ఎలా అనిపించింది అని అడిగితే ‘సూపర్! దాసరి నారాయణరావు తాతయ్యను కలవడం.. ఆయనతో మాట్లాడటం ఇంకా హ్యాపీ. కేథరీన్ మా ఫేవరేట్ హీరోయిన్. అనుకోకుండా ఆమెను కలవడమూ మరీ ఆనందంగా ఉంది’ అని చెప్పారు. -
మన భోజనం
ఆలయాల్లో శివారాధన.. వనంలో సమారాధన.. కార్తీకమాసం స్పెషల్స్. పల్లెల్లో అయితే కార్తీకం వచ్చిందంటే వన భోజనాలతో సామూహిక సందడి మొదలవుతుంది. సిటీవాసులకు తరలిరాని ఆనందాన్ని శిల్పారామం తీసుకొస్తుంది. కార్తీక మాసం సందర్భంగా వన భోజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 25, 26, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీలలో ఈ వనవిందుకు పసందైన ఏర్పాట్లు చేస్తోంది. వనభోజన వివరాలను, టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ఆయా తేదీలకు ఒకరోజు ముందుగా సంప్రదించాలని శిల్పారామం జనరల్ మేనేజర్ సాయన్న పేర్కొన్నారు. శిల్పారామం, టూరిజం ప్లాజా, బేగంపేట్‌లోని గ్రీన్ ల్యాండ్స్, యాత్రినివాస్, సికింద్రాబాద్‌లోని తెలంగాణ టూరిజం కౌంటర్, ట్యాంక్‌బండ్ సమీపంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్, బషీర్‌బాగ్‌లోని నిజాం షుగర్ బిల్డింగ్ లలో టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-6451864, 8886652030, 8886652004 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. -
శిల్పారామంలో దాండియానైట్స్..
శిల్పారామంలో దాండియా ఆటపాటలతో మహిళలు హోరెత్తించనున్నారు. శిల్పారామంలోని లాన్గార్డెన్లో శుక్ర, శని, ఆదివారాల్లో ‘దాండియా నైట్స్’ నిర్వహించనున్నారు. వరుసగా మూడు రోజులు సాయంత్రం 7.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు దాండియా ఆటపాటలు సాగనున్నాయి. ఇందులో పాల్గొనే మహిళలకు దాండియా నేర్పించేందుకు నిష్ణాతులైన శిక్షకులను, పర్యవేక్షకులను నియమించినట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి వి.మధుసూదన్ చెప్పారు. -మాదాపూర్ -
సాక్షి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
సాక్షి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని శిల్పారామంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ సంబరాల్లో తెలంగాణ రాజకీయ, సినీ రంగ, ఉద్యోగ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో శిల్పారామం దద్దరిల్లింది. దాండియాతో అమ్మాయిలు అదరగొట్టారు. ఆద్యంతం తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేలా బతుకమ్మ సంబరాలు సాగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు డీకే అరుణ, శ్రీనివాస గౌడ్, మాజీ మేయర్ కార్తీక రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శిల్పారామంలో బతుకమ్మ వేడుక
-
శిల్పారామంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శిల్పారామంలో గత అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దసరా ఉత్సవాలు సందర్భంగా శిల్పారామంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో 10 షాపులు దగ్దమైనాయి. భద్రత సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫైరింజన్లతో సహా అక్కడికి చేరుకుని మంటలు అర్పివేశాయి. అగ్రిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఖాదీ హ్యాండ్ లూమ్స్‌తో మోడల్స్ సందడి
-
అసంపూర్తిగా శిల్పారామం పనులు
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: పట్టణ శివారులోని మహబూబ్‌సాగర్ చెరువుకట్ట సమీపంలో మూడు ఎకరాల విస్తీర్ణం లో నిర్మాణం జరుగుతున్న శిల్పారామం పనులు అసంపూర్తిగా నిలిచాయి. దీంతో పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. శిల్పారామం పనులు పూర్తి కాకపోయి నా ఫిబ్రవరి 19న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభోత్సవం చేశా రు. 2013న నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు ఎకరాల విస్తీర్ణంలో ఆర్ట్స్, క్రాఫ్ట్, కల్చరర్ సొసైటీ ఆధ్వర్యంలో రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కల్యాణమండపం, స్మిమ్మిం గ్‌ఫూల్, డ్యాన్సింగ్ అకాడమీ పనుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎన్నికల కోడ్ సమీపిస్తుందన్న భావనతో పను లు పూర్తికాకుండానే విప్ హోదా లో జగ్గారెడ్డి అసంపూర్తిగా ఉన్న వాటినే ప్రారంభించారు. విచిత్రం ఏమిటంటే ప్రారంభించిన మరుసటి రోజు నుంచి ఇప్పటివరకు పనులు జరుగలేదు. దీంతో శిల్పారామం పరిధిలోని కల్యాణ మండపాల షెడ్ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. మండపాల ఆవరణలో రోడ్లు, మూత్రశాలలు, వధూవరుల గదులు తదితర పనులు నేటికీ పూర్తి కాలేకపోయాయి. నిర్మాణం పూర్తై షెడ్లలో సైతం విద్యుత్ సరఫరా, ఇతర సౌకర్యాలను కల్పిం చలేకపోయారు. దీంతో పట్టణ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
శిల్పారామంలో హోలీ సంబరాలు
-
ఫీట్ చేస్తుండగా గొంతులోకి దిగబడిన కత్తి
హైదరాబాద్ : హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న యువజనోత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. మార్షల్ ఆర్ట్స్ విభాగంలో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి వచ్చిన కుమార్, గొంతుపై కత్తి ఉంచుకుని ఫీట్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు కత్తి గొంతులోకి దిగబడింది. దీంతో అతడికి స్వల్పగాయమైంది. అయితే మార్షల్ ఆర్ట్స్‌కు ఎంతలేదన్నా 20 నిమిషాలైనా ఇవ్వాలని, కానీ నిర్వాహకులు తక్కువ సమయం ఇచ్చినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని కుమార్ ఆరోపిస్తున్నాడు. అందరికీ ఇచ్చినంత సమయమే ఇచ్చామని నిర్వాహకులు వాదిస్తున్నారు.