
శిల్పారామంలో దాండియానైట్స్..
శిల్పారామంలో దాండియా ఆటపాటలతో మహిళలు హోరెత్తించనున్నారు. శిల్పారామంలోని లాన్‌గార్డెన్‌లో శుక్ర, శని, ఆదివారాల్లో ‘దాండియా నైట్స్’ నిర్వహించనున్నారు. వరుసగా మూడు రోజులు సాయంత్రం 7.00 నుంచి రాత్రి 10.00 గంటల వరకు దాండియా ఆటపాటలు సాగనున్నాయి. ఇందులో పాల్గొనే మహిళలకు దాండియా నేర్పించేందుకు నిష్ణాతులైన శిక్షకులను, పర్యవేక్షకులను నియమించినట్లు శిల్పారామం ప్రత్యేక అధికారి వి.మధుసూదన్ చెప్పారు.
-మాదాపూర్