శిల్పారామంలో..సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంపు.. | Summer Art Camp At Shilparamam Hyderabad | Sakshi

శిల్పారామంలో..సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంపు..

Apr 18 2025 8:47 AM | Updated on Apr 18 2025 12:47 PM

Summer Art Camp At Shilparamam Hyderabad

పరీక్షలు అయిపోయాయి.. వేసవి సెలవులు వచ్చాయి.. మరి సెలవులను వృథా చేసుకోకుండా విద్యార్థులు ఏం చేయాలి? వారికి నచ్చిన రంగాల్లో, ఆసక్తి ఉన్న అంశాల్లో శిక్షణ ఇప్పిస్తే సరి.. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ.. నేర్చుకున్నవారికి నేర్చుకున్నంత.. మాదాపూర్‌లోని శిల్పారామం ప్రతి ఏడాది సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంప్‌ చేపడుతోంది. ఈ ఏడాది కూడా మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ఆర్ట్‌ క్యాంపు నిర్వహిస్తోంది. దీనిలో మట్టికుండల తయారీ విధానం, పెన్సిల్‌ స్కెచ్, మధుబని పెయింటింగ్, ట్రైబల్‌ పెయింటింగ్, మండల పెయింటింగ్, ఆక్రిలిక్‌ పెయింటింగ్, సీసెల్‌ క్రాఫ్ట్, భగవద్గీత శ్లోకాల పఠనం, సంస్కృతంలో మాట్లాడటం వంటి అంశాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు.  

శిక్షణ తరగతుల ద్వారా విద్యార్థులకు ఏఏ రంగాలపై ఆసక్తి ఉందో తెలుస్తుంది. విద్యార్థులు ఎంచుకున్న రంగంలో రాణించేందుకు అధ్యాపకులు శిక్షణ ఇస్తారు. కేవలం విద్యార్థులే కాకుండా గృహిణులు, ఉద్యోగినులు సైతం వివిధ రంగాల్లో శిక్షణ తీసుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు.  

గత ఏడాది శిక్షణ పొందిన మహిళలు వివిధ రకాల బట్టలపై పెయింటింగ్‌లు వేసి ఆర్థికంగా 
సంపాదిస్తున్నారు. 

కొంత మంది మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. 6 సంవత్సరాలకుపై బడినవారు ఎవరైనా సమ్మర్‌ ఆర్ట్‌ క్యాంపులో పాల్గనవచ్చు.  

చిన్నారులకు భగవద్గీత, సంస్కృత భాషలను నేర్పడం వల్ల వారు ప్రయోజకులు కావడంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రత్యేకతను తెలుసుకుంటారని అధ్యాపకులు 
తెలుపుతున్నారు.  

కేవలం సరదాగా నేర్చుకోవడమే కాకుండా వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.  

వివిధ అంశాలలో శిక్షణ పొందేందుకు నామమాత్రపు రుసుముతో వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

సంస్కృతంలో అనర్గళంగా మాట్లాడవచ్చు..  
సంస్కృత భాషకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి భాషను నేరి్పంచడం అరుదు. శిల్పారామం విద్యార్థులకు, ఆసక్తిగల వారికి సమ్మర్‌ క్యాంపు ద్వారా ఈ అవకాశాన్ని కలి్పస్తోంది. సులభ పద్ధతిలో సంస్కృత భాషను నేర్చుకోవచ్చు. సంస్కృత భాషను పూర్తి స్థాయిలో నేర్చుకోవడం వల్ల అనేక గ్రంథాలను, పుస్తకాలను చదువుకొని అర్థం చేసుకోవచ్చు.  
– సంతోష్‌, అధ్యాపకుడు, సంస్కృత భాష 

మధుబని పెయింటింగ్‌లో శిక్షణ 
మధుబని పెయింటింగ్‌ను ఆసక్తితో నేర్చుకోవాలి. ప్రత్యేకత ఉన్న మధుబని పెయింట్‌లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. గృహిణులు ఇంట్లో సరదాగా వేసి అమ్ముకోవచ్చు. ఆర్థికంగా ఎదిగేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పూర్తిస్థాయిలో నేర్చుకున్న వారు మరి కొంతమందికి శిక్షణ ఇవ్వవచ్చు. 
– రాజేశ్, మధుబని పెయింటింగ్‌ అధ్యాపకుడు 

ఆసక్తి గలవారు 8886652030,
8886652004లలో సంప్రదించగలరు. 
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు. మే 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరుగుతాయి. అలాగే ఆరు నుంచి 60 సంవత్సరాల వారు ఎవరైనా శిక్షణ 
పొందవచ్చు. మొత్తం  9 అంశాలలో శిక్షణ 

(చదవండి: హెరిటేజ్‌ వాక్‌..ఎక్స్‌పర్ట్స్‌ టాక్‌..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement