మన భోజనం | Karthika masam Picnic programs organized by Shilparamam | Sakshi
Sakshi News home page

మన భోజనం

Published Sat, Oct 25 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 3:19 PM

మన భోజనం

మన భోజనం

ఆలయాల్లో శివారాధన.. వనంలో సమారాధన.. కార్తీకమాసం స్పెషల్స్. పల్లెల్లో అయితే కార్తీకం వచ్చిందంటే వన భోజనాలతో సామూహిక సందడి మొదలవుతుంది. సిటీవాసులకు తరలిరాని ఆనందాన్ని శిల్పారామం తీసుకొస్తుంది. కార్తీక మాసం సందర్భంగా వన భోజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 25, 26, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీలలో ఈ వనవిందుకు పసందైన ఏర్పాట్లు చేస్తోంది.
 
 వనభోజన వివరాలను, టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ఆయా తేదీలకు ఒకరోజు ముందుగా సంప్రదించాలని శిల్పారామం జనరల్ మేనేజర్ సాయన్న పేర్కొన్నారు. శిల్పారామం, టూరిజం ప్లాజా, బేగంపేట్‌లోని గ్రీన్ ల్యాండ్స్, యాత్రినివాస్, సికింద్రాబాద్‌లోని తెలంగాణ టూరిజం కౌంటర్, ట్యాంక్‌బండ్ సమీపంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్, బషీర్‌బాగ్‌లోని నిజాం షుగర్ బిల్డింగ్ లలో టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. మరిన్ని వివరాలకు  040-6451864, 8886652030, 8886652004 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement