Picnic programs
-
విజయవాడ భవానీ ఐలాండ్ లో వన భోజనాల సందడి (ఫొటోలు)
-
విహారం.. కాకూడదు విషాదం
విహారం సర్వదా ఆనందదాయకం. అయితే ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది విషాదమవుతుంది. కొంతమంది అత్యుత్సాహం, సెల్ఫీలకోసం ఆరాటం మృత్యువు ముంగిటకు నెడుతోంది. ఇటీవల ప్రతి సన్నివేశాన్ని సెల్ఫీగా బంధించడం అలవాటైంది. కొందరికి అదే చివరిసెల్ఫీ అవుతోంది. కార్తీకమాసం కావడంతో ఎక్కువ మంది పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. పర్యాటక ప్రదేశానికి వెళ్లేవారు అక్కడ సెల్ఫీలు తీసుకునే సమయంలో, ఇతర సందర్భాలలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే ఆనందం...విషాదంగా మారుతుందని, అప్రమతంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అచ్యుతాపురం(యలమంచిలి): కార్తీకమాసంలో పిక్నిక్ల సందర్భంగా రూరల్ జిల్లాలో ముత్యాలమ్మపాలెం, తంతడి, పూడిమడక, సీతపాలెం, వాడపాలెం, కొత్తపట్నం, రేవుపోలవరం, పెంటకోట తీరాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లోని జలపాతాలను పర్యాటకులు సందర్శిస్తారు. ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న వారికి మినహా మిగిలిన వారికి అక్కడి పరిస్థితుల గురించి అంతగా తెలియదు. సముద్ర తీరంలో పరుచుకున్న ఇసుక తిన్నెలు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మునిగిపోయేంత లోతు లేకపోవడంతో ఈత వచ్చినా, రాకపోయినా పిల్లలు సముద్రస్నానం చేస్తారు. కెరటాలరాకపోకలపై అవగాహన లేకపోవడంతో తమకు తెలియకుండానే లోతుకు జారుకుంటారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. కెరటాల రాకపోకలను గమనించాలి సముద్రంలో స్నానంచేసేటప్పుడు కెరటాల తాకిడి, ఎత్తు, కోతను గుర్తించాలి. చాతీలోతు వరకూ వెళ్లి తాము సురక్షితంగా ఉన్నామని భావిస్తారు. అన్నికెరటాలు ఒకే ఎత్తు ఉండవు. కెరటాన్ని అధిగమించడానికి ఎత్తుకి ఎగిరేవారు కొందరైతే నీటిలో మునిగేవారు ఇంకొందరు. కొన్ని పరిస్థితుల్లో కెరటం తాకిడితో ఒడ్డుకు వచ్చేస్తారు. కొత్తగా సముద్ర స్నానంచేసేవారు ఈ విషయాలన్నీ పరిగణించరు. దీంతో ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతున్నారు. తీరానికి దూసుకువచ్చే కెరటం తిరుగుప్రయాణంలో నేలను తాకుతూ వేగంగా వెళ్తుంది. ఈ క్రమంలో కాళ్ల దిగువన ఉన్న ఇసుకను తీసుకుపోతుంది. కొన్నిసార్లు నాలుగు అడుగుల లోతు గొయ్యి ఏర్పడుతుంది. ఈ క్రమంలో స్నానంచేసేవ్యక్తి మునిగిపోయి, ప్రవాహంలో సముద్రంలోకి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. తీరం కోతకు గురయ్యేటప్పుడు కెరటం వచ్చేదిశ ఒకలాగుంటే తిరుగుప్రయాణం వేరేదిశలో ఉంటుంది. స్నానం చేసేవ్యక్తి రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. తీరానికి సమీపంలో ఈత సాధ్యపడదు. ఈత వచ్చినవారు దీమాతో సాహసించి లోతుకు వెళ్తే ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఉంది. ఆవలోనూ జాగ్రత్త కొండకర్ల ఆవలో దోనెషికారుచేసేటప్పుడు సెల్ఫీలుప్రమాదకరంగా మారాయి రెండు దోనె లను మంచంతో కలిపి ఉంచుతారు. నాలుగు అం గులాల అం చు మాత్రమే నీటిపైతేలుతుంది. సెల్ఫీహడావుడి లో పడి ఇటుఅటూ కదిలితే దోనెలోకి నీరుచేరుతుంది. దీంతో మునగిపోవ డం ఖాయం. మునిగిన వారు ఊబిలో ఇరు క్కొని ప్రాణాలు కోల్పోయేపరిస్థితి ఉంది. స ముద్రంలో కెరటాల తాకిడిని మరిచిపోయి ఫో టోలుతీసుకోవడంకోసం ఆరాటçపడుతుం టా రు. ఇంతలో పెద్దకెరటం విరుచుకుపడుతంది. రాళ్లు ఉన్న ప్రదేశం మరీ ప్రమాదం.. ఈతరానివారు.. రాళ్లు ప్రదేశాన్ని ఎన్నుకుం టారు. తంతడి బీచ్‌లో రాళ్లు ప్రదేశం ఎక్కువగా ఉంది. రాళ్లపై కూర్చుని వచ్చిపోయే కెరటం తాకితే స్నానం అయిపోతుందని ప్రమాదం జరగకుండా రాళ్లఆధారం ఉంటుందని ఆప్రదే శాలను ఎన్నుకుంటారు. సెల్ఫీలుతీసుకోవడానికి కూడా యువతీ యువకుల ఆ ప్రదేశాన్ని ఎన్నుకుంటున్నారు. ప్రేమికులు ఏకాంత కోసం రాళ్లమాటున కూర్చుంటున్నారు. దీర్ఘకాలికంగా సముద్రనీటిలో ఉన్న రాళ్లు మొనదేరి ఉంటా యి. నాచుపట్టి జారుతుంటాయి. కెరటం తాకిడికి రాళ్లుతగిలి గాయపడి చనిపోయే పరిస్థితి ఉంది. రాళ్ల మధ్యలో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలు తీరానికి కొట్టుకురావు. 2013లో తంతడి తీరంలో ప్రమాదానికి గురైన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల మృతదేహాలు ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. -
మన భోజనం
ఆలయాల్లో శివారాధన.. వనంలో సమారాధన.. కార్తీకమాసం స్పెషల్స్. పల్లెల్లో అయితే కార్తీకం వచ్చిందంటే వన భోజనాలతో సామూహిక సందడి మొదలవుతుంది. సిటీవాసులకు తరలిరాని ఆనందాన్ని శిల్పారామం తీసుకొస్తుంది. కార్తీక మాసం సందర్భంగా వన భోజన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నెల 25, 26, నవంబర్ 1, 2, 8, 9, 15, 16 తేదీలలో ఈ వనవిందుకు పసందైన ఏర్పాట్లు చేస్తోంది. వనభోజన వివరాలను, టికెట్లు బుకింగ్ చేసుకునేందుకు ఆయా తేదీలకు ఒకరోజు ముందుగా సంప్రదించాలని శిల్పారామం జనరల్ మేనేజర్ సాయన్న పేర్కొన్నారు. శిల్పారామం, టూరిజం ప్లాజా, బేగంపేట్‌లోని గ్రీన్ ల్యాండ్స్, యాత్రినివాస్, సికింద్రాబాద్‌లోని తెలంగాణ టూరిజం కౌంటర్, ట్యాంక్‌బండ్ సమీపంలోని ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్, సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్, బషీర్‌బాగ్‌లోని నిజాం షుగర్ బిల్డింగ్ లలో టికెట్ బుకింగ్ సౌకర్యం కల్పించామని తెలిపారు. మరిన్ని వివరాలకు 040-6451864, 8886652030, 8886652004 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.