
సాక్షి, హైదరాబాద్: శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు సంక్రాంతి పర్వదినం కావడంతో శిల్పారామానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. పండగ సందర్భంగా శిల్పరామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అలంకరణలు, ఆకృతులు ఆకట్టుకుంటున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని తలపించే కళారూపాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. శిల్పారామంలో ఎంతో వేడుకగా జరుగుతున్న సంక్రాంతి సంబరాలు రేపటితో ముగియనున్నాయి.
చదవండి: ప్రతి రోజూ పండగే