
సాక్షి, తిరుపతి: తిరుచానూరు శిల్పరామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫన్ రైడ్‌లో భాగంగా క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెండగా.. మరో మహిళ గాయపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. తిరుచానూరు శిల్పారామం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. శిల్పారామం క్యాంటీన్ వద్దగల ఫన్ రైడ్‌లో ప్రమాదం జరిగింది. క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ఇరవై అడుగులు ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు.