
అమరావతి, సాక్షి: తిరుపతి డిప్యూటీ మేయర్ అక్రమ ఎన్నికపై కూటమి ప్రభుత్వానికి తొలి దెబ్బ పడింది. ఈ ఎన్నికకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను బుధవారం విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా జరిగిన హింసపై బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ పిల్‌ను విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ థాకూర్ బెంచ్.. ఎన్నికపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలంటూ ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.
Dr Subramaniam @Swamy39 today appeared before the Andhra High Court at Amravati in a PIL challenging the irregularities in the Dy Mayor elections in Tirupati Municipal Corporation, the division bench of the Honble High Court led by Honble Chief Justice Thakur issued notice to the… pic.twitter.com/eiqg91GFpV
— Jagdish Shetty (@jagdishshetty) March 12, 2025
Today, AP HC issued notice on my PIL seeking investigation in the Tirupati Dy Mayor Elections. Status report by the police department was also directed. Shri Yugandhar Reddy & Ms Palak Bishnoi, Advocates assisted me in the Court.
— Subramanian Swamy (@Swamy39) March 12, 2025
అలాగే పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు జారీ అయినట్లు సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక(Tirupati Deputy Mayor Election) సందర్భంగా జరిగిన ఘటనలను దురదృష్టకరమైన సంఘటనలుగా ఆయన ఇంతకు ముందు అభివర్ణించిన సంగతి తెలిసిందే.
‘‘చాలామందిని భయపెట్టి దాడులు చేశారు. ఎన్నికల సమయంలో హింసను నివారించేందుకు తీవ్రమైన చర్యలు తీసుకోవాలి అని పిల్ వేశా’’ అని ఆయన అన్నారు. తిరుపతి ఘటనలో కేవలం ఎఫ్‌ఐఆర్ మాత్రమే వేశారని, ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఈ విషయంపై కోర్టు చర్యలు తీసుకుంటే గనుక దేశవ్యాప్తంగా ఇదొక చట్టంగా మారుతుంది అని ఆయన అభిప్రాయడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment