tiruchanur
-
ముగిసిన శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
-
చంద్రగిరి : స్వర్ణరథంపై సౌభాగ్యలక్ష్మీమగా శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
చంద్రగిరి : శ్రీమహాలక్ష్మి అలంకరణలో శ్రీ పద్మావతి అమ్మవారు (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
శిల్పారామంలో ప్రమాదం.. మహిళ అడికక్కడే మృతి
సాక్షి, తిరుపతి: తిరుచానూరు శిల్పరామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫన్ రైడ్‌లో భాగంగా క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఇద్దరు మహిళలు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతిచెండగా.. మరో మహిళ గాయపడటంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. తిరుచానూరు శిల్పారామం వద్ద విషాదకర ఘటన చోటుచేసుకుంది. శిల్పారామం క్యాంటీన్ వద్దగల ఫన్ రైడ్‌లో ప్రమాదం జరిగింది. క్రాస్ వీల్ తిరుగుతున్న సమయంలో ఇరవై అడుగులు ఎత్తు నుండి ఇద్దరు మహిళలు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు. -
అమ్మవారి సేవలో ఖడ్గం హీరోయిన్.. !
సినీనటి సంగీత.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఖడ్గం చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి వంటి చిత్రాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరైంది. చివరగా 2010లో కారా మజాకా చిత్రంలో కనిపించిన సంగీత ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చింది. దాదాపు 10ఏళ్ల విరామం అనంతరం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూవీ రీఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాదిలోనే మసూద చిత్రంతో పలకరించింది. అయితే తాజాగా సినీనటి సంగీత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. సంగీత గురువారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లను చేశారు. అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా.. అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
గజ వాహనంపై శ్రీమహాలక్ష్మి దర్శనం
చంద్రగిరి(తిరుచానూరు): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీమహాలక్ష్మిగా గజ వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారిని వేకువజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఎనిమిది గంటలకు జగన్మోహిని అలంకరణలో తిరువీధుల్లో అమ్మవారు పల్లకీలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మధ్యాహ్నం స్నపన తిరుమంజనం అనంతరం అమ్మవారికి వసంతోత్సవం వేడుకగా జరిగింది. సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారి ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ నిర్వహించారు. రాత్రి 6.30 గంటలకు అమ్మవారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి గజ వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం పట్టుపీతాంబర వజ్రవైఢూర్య స్వర్ణాభరణాలతో పాటు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకొచ్చిన సహస్ర లక్ష్మీకాసుల హారాన్ని అమ్మవారికి అలంకరించారు. రాత్రి ఏడు గంటలకు సంప్రదాయ భక్తి సంగీత, భజన, కోలాట బృందాలు, మంగళ వాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం, కళాకారుల విచిత్ర వేషధారణల నడుమ అమ్మవారు గజేంద్రునిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు పట్టారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం సర్వభూపాల వాహనం సేవ, రాత్రి గరుడ వాహన సేవ జరగనున్నాయి. -
తిరుచానూరులో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
తిరుచానూరు(తిరుపతి జిల్లా): తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం శ్రీవరలక్ష్మీ వ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజామున సహస్రనామార్చన, నిత్యార్చన, మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించిన ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అషో్టత్తర శత నామావళి నిర్వహించారు. అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హారతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది. సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై ఆశీనులై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అమ్మవారి రథాన్ని లాగేందుకు మహిళలు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి దంపతులు, జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, తిరుపతి మున్సిపల్ కమిషనర్ హరిత, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ పాల్గొన్నారు. -
అహింసా మార్గంలో స్వతంత్ర పోరాటానికి గాంధీ నడిపారు: సీజేఐ ఎన్వీ రమణ
-
తిరుమల సందర్శకులకు తీపికబురు!
తిరుమల తిరుపతి వెళ్లే శ్రీవారి భక్తులకు శుభవార్త. ఐఆర్సీటీసీ టూరిజం పంచదేవాలయం టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ కింద తిరుమలలోని శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు. భక్తులు తిరుపతి చేరుకున్న తర్వాత నుంచి ప్యాకేజీ మొదలవుతుంది. తిరుపతికి చేరుకునే భక్తులు శ్రీవారి దర్శనంతో పాటు ఇతర ఆలయాలను సందర్శించడం కోసం ఈ ప్యాకేజీని రూపొందించారు. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ. పంచదేవాలయం టూర్ ప్యాకేజీలో ట్రిపుల్ ఆక్యుపెన్సీ(ముగ్గరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.5,270 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ(ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.7,010, సింగిల్ ఆక్యుపెన్సీ (ఒకరు మాత్రమే) ధర రూ.11,750. ప్యాకేజీలో తిరుపతిలో ఒక రోజు అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. -
హిజ్రాను వివాహమాడిన యువకుడు
చిత్తూరు : తిరుచానూరు అమ్మవారి ఆలయం ముందు బెంగళూరుకు చెందిన మనోజ్ శుక్రవారం రాత్రి సబీ అనే హిజ్రాను వివాహం చేసుకున్నాడు. ఆలయం ముందు వివాహ తంతు జరుగుతుంటే స్థానికులు, భక్తులు ఆశ్చర్యపోయి చూశారు. హిజ్రాలే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. అవును..వాళిద్దరూ ఒకటయ్యారు... మరోవైపు ఓ హిజ్రాను మరో హిజ్రా పెళ్లాడిన సంఘటన తిరుపతిలోని దామినేడులో చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఇందిరమ్మ గృహాల్లో నివసిస్తున్న హిజ్రాలలో ఓ ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇదేంటి ఒక హిజ్రా, ఇంకో హిజ్రాను పెళ్ళి చేసుకోవటం ఇదేమి విచిత్రం అనుకున్నా సరే వారిద్దరూ పెళ్ళి అనే బంధంతో ఒకటయ్యారు. కేవలం దాంపత్య సుఖం మాత్రమే కాదని, ఒకరికి ఒకరు కష్టాల్లో, సుఖాల్లో తోడు నీడగా ఉండాలని పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. -
‘పద్మావతి’ సన్నిధితో గవర్నర్ దంపతులు
సాక్షి, తిరుచానూరు: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ దంపతులు శనివారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్, డిప్యూటీ ఈవో ఝాన్సీ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల: చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-2 వాహక నౌక నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు. రెండు నెలల అనంతరం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుంటుందన్నారు. వర్షం వల్ల చంద్రయాన్-2 ప్రయోగానికి ఎలాంటి అంతరాయం కలగదని శివన్ తెలిపారు. -
ఎస్ఐపై గల్లా అనుచరుల దాడి
► నలుగురు యువకుల బరితెగింపు ► రాజీ కోసం తీవ్రంగా కృషిచేసిన సీఐ ► ఇన్స్పెక్టర్ తీరుపై రగిలిపోతున్న పోలీసులు తిరుచానూరు: తిరుచానూరు ఎస్ఐపై బుధవారం రాత్రి గల్లా అరుణకుమారి అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎస్ఐ రామాంజనేయులు రాత్రి సింధూ జంక్షన్ వైపు వెళుతుండగా నలుగురు యువకులు ఓ ఆటో డ్రైవర్‌తో గొడవ పడుతుండ డాన్ని గమనించి వారిని వారించే యత్నం చేశారు. ఆ యువకులకు, ఎస్ఐకి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఎస్ఐ ఓ యువకుడిపై చేయి చేసుకోవడంతో ఆ నలుగురు కలసి ఎస్ఐపై దాడిచేసి పారిపోయారు. వారు టీడీపీకి చెందిన సునీల్, అతని అనుచరులని అక్కడున్నవారు తెలిపారు. ఎస్ఐ స్టేషన్‌కు వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడ్డ వారు అధికార పార్టీకి చెందినవారు కావడంతో ‘‘ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా చూడాలి. నువ్వు కొత్తగా వచ్చావు. అధికార పార్టీ నాయకులను చూసీ చూడనట్టు వ్యవహరించాలి’’ అని సీఐ సలహా ఇచ్చారు. దీంతో ఎస్ఐ మనస్తాపానికి గురైనట్టు తెలిసింది. సాక్షాత్తూ ఎస్ఐపై దాడిచేస్తే కేసు నమోదు చేయకుండా రాజీ యత్నం చేయడంతో సీఐపై పోలీసులు రగిలిపోతున్నారు. ఎస్పీ అయినా స్పందించాలని కోరుతున్నారు. -
అమ్మవారి సేవలో పలువురు ప్రముఖులు
తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని పలువురు ప్రముఖులు శనివారం దర్శించుకున్నారు. వీరిలో గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి, ఏపీ శాసనమండలి చైర్మన్ చక్రపాణి ఉన్నారు. కుటుంబ సమేతంగా వీరు అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
వైభవంగా అమ్మవారి రథోత్సవం
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించారు. భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి రథోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఊరేగింపు ముందు భక్తులు కోలాటం ప్రదర్శించారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలలో వేచి ఉన్నారు -
సర్వభూపాల వాహనంపై పద్మావతీ అమ్మవారు
తిరుపతి: కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుచానూరులో గురువారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారిని సర్వభూపాల వాహనంపై ఊరేగించారు. వాహనంపై ఊరేగుతున్న అమ్మవారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వచ్చారు. భక్తులు సర్వభూపాల వాహనాన్ని మోసేందుకు పోటీపడ్డారు. -
కల్పవృక్ష వాహనంపై ఊరేగిన అమ్మవారు
తిరుపతి: తిరుచానూరులోని శ్రీ ద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కల్పవృక్ష వాహనంపై అమ్మవారు తిరుమాడ వీధులలో ఊరేగించారు. వేలమంది భక్తులు ఊరేగింపును తిలకించారు. కళాకారులు కోలాటం, నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
-
వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు
– శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో 3రోజుల పాటు నిర్వహించే వార్షిక పవిత్రోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో నిర్వహించే నిత్యకైంకర్యాలు, వార, మాస, వార్షిక ఉత్సవాలు, ఇతరత్రా పూజాధి కార్యక్రమాల్లో తెలిసో తెలియకో జరిగిన తప్పుల వల్ల ఏర్పడ్డ దోష నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక యాగశాలకు శ్రీపద్మావతి అమ్మవారు, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి, విశ్వక్సేనులు, చక్రతాళ్వార్లను వేంచేపుగా తీసుకొచ్చి కొలువుదీర్చారు. ఉదయం 8.30గంటలకు యాగశాలలో పవిత్ర జలంతో నిండిన కలశాన్ని ఆలయ అర్చకులు నెలకొల్పి, పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా ద్వారతోరణ ద్వజకుంభ ఆవాహనం, చక్రాది మండలపూజ, చతుస్థానార్చన, అగ్నిప్రతిష్ట, హోమం, పవిత్ర ప్రతిష్ట చేశారు. మధ్యాహ్నం 2గంటలకు శ్రీపద్మావతి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 8గంటల వరకు యాగశాలలో హోమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, మాధవకుమార్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గురవయ్య, ఏవీఎస్వో రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. పవిత్రోత్సవాల్లో నేడు : పవిత్రోత్సవాల్లో భాగంగా రెండవరోజైన గురువారం ఉదయం 7నుంచి 11.30గంటల వరకు యాగశాలలో హోమపూజలు, 11.30గంటలకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5నుంచి 8గంటల వరకు హోమ పూజలు జరుగుతాయి. -
నేడు అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం
– సాయంత్రం స్వర్ణర థోత్సవం తిరుచానూరు : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ప్రతి ఏటా శ్రావణ మాసం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకోసం ఆస్థానమండపంలో వరలక్ష్మీ వ్రత మండపాన్ని ఆలయ, ఇంజినీరింగ్ అధికారులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయం, ఆస్థానమండపాన్ని పచ్చని తోరణాలు, వివిధ రకాల పుష్పాలు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. సాయంత్రం 6గంటలకు స్వర్ణరథంపై అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. వరలక్ష్మీవ్రతం సందర్భంగా శుక్రవారం అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, ఊంజల్‌సేవలను రద్దు చేశారు. టికెట్లకు పోటెత్తిన భక్తులు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కౌంటర్లో గురువారం వరలక్ష్మీ వ్రతం టికెట్లు భక్తులకు విక్రయించారు. వ్రతం టికెట్లు కొనుగోలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్లు ఇవ్వనున్నట్లు ముందస్తుగా ప్రకటించారు. 200 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని, సిఫార్సులతో సంబంధం లేకుండా ముందు వచ్చిన వారికే టికెట్లు ఇస్తామని చెప్పడంతో భక్తులు ఉదయం 5 గంటల నుంచి బారులు తీరారు. గుర్తింపు కార్డులను తనిఖీ చేసిన తరువాతనే భక్తులకు టికెట్లు జారీ చేశారు. గంటల సమయంలో క్యూలో వేచి ఉండి టికెట్లు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ రాధాకృష్ణ, సూపరింటెండెంట్లు రవి, బాలాజీ, పవన్, ఆర్జితం ఇన్స్పెక్టర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. -
సూర్యగ్రహణం కారణంగా ఆలయం మూసివేత
తిరుచానూరు (చిత్తూరు జిల్లా) : సూర్యగ్రహణం కారణంగా చిత్తూరు జిల్లా తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం రాత్రి 9-30 గంటల నుండి బుధవారం ఉదయం 10 గంటల వరకూ మూసివేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. -
తిరుచానూరులో విషాదం
-
తిరుచానూరులో ఘనంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 8.00 గంటలకు కల్పవృక్ష వాహనంపై అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే రాత్రి 8.00 గంటలకు హనుమంతు వాహనంపై తిరువీధుల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణాస్వామి ముఖమండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6.00 గంటలకు ఆస్థాన మండలంలో ఊంజల్ సేవ జరుగుతాయి. అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు నేడు నాలుగోరోజుకు చేరాయి. -
విద్యార్థులపై ఎలుకల దాడి
తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరుకు సమీపంలోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో శనివారం రాత్రి విద్యార్థులపై ఎలుకలు దండెత్తాయి. సుమారు పది మందిని కొరకడంతో వారికి గాయాలయ్యాయి. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం, సిబ్బంది గట్టి ప్రయత్నమే చేపట్టారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం రాత్రి మీడియా దృష్టికి తీసుకురావడంతో విషయం వెలుగుచూసింది. -
తిరుచానూరు రథసప్తమి వేడుకల్లో అపశృతి
రథసప్తమి పర్వదినం సందర్భంగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వాహనసేవలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనంపై పద్మావతీ అమ్మవారు ఊరేగుతుండగా... ఉత్తర మాడవీధిలో వాహనంపై ఉన్న అమ్మవారి విగ్రహం ఒక్కసారిగా కుడివైపు ఒరిగింది. గమనించిన అర్చకులు వెంటనే అమ్మవారి విగ్రహాన్ని పట్టుకున్నారు. తిరిగి సరిగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించినా కుదరకపోవడంతో విగ్రహాన్ని అలా పట్టుకునే వాహన సేవను నిర్వహించారు. విగ్రహాన్ని సరిగా కూర్చోబెట్టకపోవడం వల్లే అలా జరిగినట్టు డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి వివరించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా పద్మావతీ అమ్మవారు సోమవారం మొత్తం ఏడు వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. -
ఐదేళ్ళ చిన్నారిని చంపేసిన మేనమామ
-
హంస వాహనంపై అమ్మవారు
-
హంస వాహనంపై అమ్మవారు
తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లోగురువారం రాత్రి అలమేలు మంగమ్మ సరస్వతీ దేవి రూపంలో హంస వాహనంపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం పెద్దశేష వాహనంపై ఊరేగారు. తిరుచానూరు : పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన గురువారం ఉదయం పెద్దశేష వాహనసేవ వైభవంగా జరిగింది. వైకుంఠనాథుని అలంకరణలో అమ్మవారు పెద్దశేషునిపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను ఆశీర్వదించారు. ఇందులో భాగంగా అమ్మవారిని వేకువజామున 4 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు అమ్మవారిని సన్నిధి నుంచి వేంచేపుగా వాహనమండపానికి తీసుకొచ్చి పెద్దశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర, వజ్రవైఢూర్య ఆభరణాలతో వైకుంఠనాథునిగా అలంకరించారు. అనంతరం 8 గంటలకు భక్తుల కోలాటం, మంగళవాయిద్యాలు, జియ్యర్ స్వాముల ప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సాయంత్రం జరిగిన హంస వాహనసేవలో అమ్మవారు సరస్వతీదేవి అలంకరణలో భక్తులను కటాక్షించారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, తిరుపతి జేఈవో పోలా భాస్కర్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ స్పెషల్‌గ్రేడ్ డెప్యూటీ ఈవో చెంచులక్ష్మి, ఎస్ఈ రామచంద్రారెడ్డి, ఏఈవో నాగరత్న, సూపరింటెండెంట్లు శేషాద్రిగిరి, వరప్రసాద్ పాల్గొన్నారు. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజైన శుక్రవారం ఉదయం 8 గంటలకు ముత్యపుపందిరి వాహనం, రాత్రి 8గంటలకు సింహవాహనంపై తిరువీధుల్లో పద్మావతి అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఆస్థాన మండపంలో ఊంజల్‌సేవ జరుగుతాయి. తిరుచానూరు : శ్రీపద్మావతి అమ్మవారికి పలు రకాల ప్రసాదాలను నైవేద్యంగా అర్చకులు ని వేదిస్తారు. ప్రతిరోజూ తెల్లవారుజామున, ఉద యం, సాయంత్రం అమ్మవారికి ప్రసాదాలను నివేదిస్తారు. ఈ ప్రసాదాలను అమ్మవారి ఆల యంలోని పోటులో తయారుచేస్తారు. మొదటి నివేదన : అమ్మవారికి తెల్లవారుజామున మొదటి నివేదనకు దద్దోజనం(పెరుగన్నం), పులిహోర, వెన్ పొంగల్, చక్కెర పొంగలి, మాత్ర(తిరుగబాత పెట్టకుండా పెరుగు, వెన్నతో చేసిన అన్నం), లడ్డు, వడ, సీర(కేసరి) నైవేద్యంగా అమ్మ వారికి సమర్పిస్తారు. రెండో నివేదన ఉదయం 9గంటలకు నిర్వహించే రెండవ నివేదనలో పులిహోర, చక్కెర పొంగలి, వెన్ పొంగళ్, దద్దోజనాన్ని సమర్పిస్తారు. మూడో నివేదన సాయంత్రం 6.30గంటలకు నిర్వహించే మూ డవ నివేదనలో దద్దోజనం, పులిహోర, చక్కెర పొంగలి, మిరియాల పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. శుక్రవారం రోజు : శుక్రవారం వేకువజాము నిర్వహించే అభిషేకానికి వెన్పొంగళ్, లక్ష్మీపూజకు సీర, కల్యాణోత్సవానికి చక్కెర పొంగలి, పులిహోర, వెన్పొంగళ్, అప్పంను సమర్పిస్తారు. అలాగే కదంబం(కూరగాయలతో చేసిన అన్నం), పా యసం, మధ్యాహ్నం ఉద్యానవనంలో జరిగే అభిషేకానికి అమ్మవారికి కారం పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తారు. తిరుప్పావడ సేవకు : ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావడ సేవకు లడ్డు, వడ, జిలేబి, మురుకు, దోసె, అప్పం సమర్పిస్తారు. ధనుర్మాసంలో.. ధనుర్మాసంలో అమ్మవారికి వెన్పొంగళ్, బెల్లం దోసె, సుఖీలను నైవేద్యంగా సమర్పిస్తారు. బ్రహ్మోత్సవంలో.. బ్రహ్మోత్సవంలో అన్ని ప్రసాదాలతో పాటు వాహన సేవ సమయంలో గంగుండ్ర మం డపం వద్ద అమ్మవారికి దోసెను నైవేద్యంగా సమర్పిస్తారు. పర్వదినాల్లో : పర్వ దినాల్లో ప్రత్యేకంగా క్షీరాన్నం(పాలు కలిపిన అన్నం), కొబ్బరి అన్నం, చిత్రాన్నం, వడపప్పు, సుండల్, పానకం, బాదుషా, మైసూర్పాకును నైవేద్యంగా సమర్పిస్తారు. -
వెంకన్న దర్శనానికి 20 గంటలు
సాక్షి, తిరుమల : భక్తులతో శుక్రవారం తిరుమల కిటకిటలాడింది. వేకువజామున 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 32,326 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయూయి. వీరి దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. రద్దీ పెరగడంతో సాయంత్రం 5 గంటలకు రూ. 300 టికెట్ల దర్శనాన్ని నిలిపివేశారు. కాలిబాట భక్తులకు ఏడు గంటల సమయం పడుతోంది. కాగా, బ్లాక్ డే సందర్భంగా శుక్రవారం తిరుమలలో తనిఖీలు ముమ్మరంగా జరిగాయి. వైభోగం.. అమ్మవారి రథోత్సవం తిరుచానూరు, న్యూస్‌లైన్: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజామున 4.15గం.కు అమ్మవారిని రథంపై కొలువుదీర్చి దివ్యమంగళ స్వరూపిణిగా అలంకరిం చారు. అమ్మవారు ప్రసన్నమూర్తిగా కొలువుదీరి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. రాత్రి అశ్వవాహనంపై పురవీధు ల్లో అమ్మవారు విహరించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన చివరి ఘట్టం పంచమీతీర్థం (చక్రస్నానం) శనివారం మధ్యాహ్నం 12.10గం.కు అత్యంత వేడుకగా జరగనుంది. రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. -
స్వర్ణరథంపై దివ్యతేజోమయి
తిరుచానూరు, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లా తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం సాయంత్రం స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గరుడోత్సవానికి ముందు అమ్మవారిని స్వర్ణరథంపై ఊరేగించడం ఆనవాయితీ. ఉదయం 7 గంటలకు అమ్మవారు సర్వభూపాల వాహనంపై కొలువుదీరి బకాసురుని వధించే శ్రీకృష్ణుని రూపంలో భక్తులను కటాక్షించారు. మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం 4.30గంటలకు అమ్మవారిని సుందరంగా అలంకరించి రథమండపానికి తీసుకొచ్చి స్వర్ణరథంపై కొలువుదీర్చారు. భక్తుల కోలాటాలు, భజన బృం దాల నడుమ 5 గంటలకు దివ్యతేజోమయి అయిన అమ్మవారు స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి అమ్మవారు గరుడ వాహనంపై ఊరేగారు. శ్రీవారి దర్శనానికి ఐదు గంటలు తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. రెండు రోజులుగా తిరుమల కొండ ఖాళీగానే ఉంది. బుధవారం వేకువజామున 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 25,678 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 5 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. -
తిరుచానూరులో ఫలపుష్ప ప్రదర్శన
-
పెద్ద శేష వాహనంపై పద్మావతి అమ్మవారు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు అమ్మవారు పెద్దశేష వాహనంపై ఊరేగారు. తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. శ్రీరంగం నుంచి వచ్చిన శ్రీవైష్ణవులు అమ్మవారిని పల్లకిలో తీసుకెళుతున్నారు. భక్తుల కోలాటాలు, డప్పు వాయిద్యాల మధ్య పద్మావతి అమ్మవారు పెద్దశేష వాహనంపై ముందుకు సాగారు. కాగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉదయం, రాత్రి వేళల్లో అమ్మవారు వివిధ వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. తొలిరోజు శుక్రవారం రాత్రి అమ్మవారు చిన్నశేష వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. -
కాలుజారి కిందపడ్డ టీటీడీ ఈవో గోపాలన్ సతీమణి
తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం సేవ సందర్భంగా టీటీడీ ఈవో గోపాల్ సతీమణి జానకి గాయపడ్డారు. మంగళవారం తిరుమంజనం సేవలో ఈవో గోపాల్ దంపతులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జానకి అనుకోకుండా కాలుజారి కిందపడటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు అమ్మవారు రథంపై తిరువీధుల్లో ఊరేగనున్నారు. -
తిరుమలలో శేషవాహనంపై ఊరేగనున్న శ్రీవారు
నాగులచవితి సందర్భంగా ఈ రోజు సాయంత్రం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడు తిరుమాడ వీధుల్లో శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కాగా తిరుమలలో భక్తులు రద్దీ కాస్తా తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 9 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. తిరుచానురులో శ్రీ పద్మావతి దేవి అమ్మవారు ఉత్సవాలు ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తిరుమలలో శ్రీవారికి జరిగే విధంగానే ఆ ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపింది. -
బోసిపోయిన అమ్మవారి ఆలయం
తిరుచానూరు, న్యూస్‌లైన్: పద్మావతీదేవి కొలువైన తిరుచానూరులోని ఆలయానికి మంగళవారం సమైక్య సెగ తగిలింది. అమ్మవారి ఆలయం భక్తులు లేక వెలవెలబోయింది. సమైక్య రాష్ట్రం కోరుతూ మంగళవారం జిల్లాలో బంద్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉద్యోగ జేఏసీతో పాటు వివిధ ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొని హైవేలలో వాహనాలను దిగ్బంధం చేశారు. వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తిరుపతికి చేరుకున్న భక్తులు సైతం బస్సులు, ఇతరత్రా వాహనాలు లేకపోవడంతో ఆలయానికి చేరుకోలేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో అమ్మవారి ఆలయం భక్తులు లేక బోసిపోయింది. క్యూలు ఖాళీగా దర్శనమిచ్చాయి. కొందరు కాలినడకతో ఆలయానికి చేరుకున్నారు. రద్దీ లేకపోవడంతో భక్తులు పద్మావతి అమ్మవారిని తనివి తీరా దర్శించుకున్నారు.