తిరుచానూరు: చిత్తూరు జిల్లా తిరుచానూరుకు సమీపంలోని ఓ ప్రైవేటు రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో శనివారం రాత్రి విద్యార్థులపై ఎలుకలు దండెత్తాయి. సుమారు పది మందిని కొరకడంతో వారికి గాయాలయ్యాయి. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆదివారం తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు.
అయితే ఈ విషయాన్ని బయటకు పొక్కనీయకుండా కళాశాల యాజమాన్యం, సిబ్బంది గట్టి ప్రయత్నమే చేపట్టారు. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం రాత్రి మీడియా దృష్టికి తీసుకురావడంతో విషయం వెలుగుచూసింది.