Rats
-
అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు
సమయం అర్థరాత్రి ఒంటి గంట.. నగరం గాఢ నిద్రలోకి జారుకున్న వేళ.. హఠాత్తుగా బ్యాంకు సైరన్ పెద్దగా మోగింది... స్థానికులకు ఉలిక్కిపడి లేచారు. అటు బ్యాంకు అధికారులు, ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు... బ్యాంకులోకి దొంగలెవరో ప్రవేశించారని అనుకున్నారు. అయితే వారు బ్యాంకు దగ్గరకు చేరుకుని అక్కడ జరిగినదేమిటో తెలుసుకుని నవ్వాలో ఏడవాలో తెలియక తెల్లముఖం వేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటుచేసుకుంది.హర్డోయ్: ఉత్తరప్రదేశ్‌లోని షాహాబాద్‌లోని హర్దోయ్‌లో రాత్రి ఒంటి గంటకు అకస్మాత్తుగా బ్యాంక్ సైరన్ మోగింది. అప్రమత్తమైన స్థానిక పోలీసులు బ్యాంకు దగ్గరకు చేరుకున్నారు. బ్యాంకు క్యాషియర్‌ను పిలిపించి, లోపల తనిఖీలు చేశారు. గంటల తరబడి వెదికినా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఎలుకలు సైరన్ వైరును కొరికినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అందుకే ఎమర్జెన్సీ సైరన్ మోగిందని తెలుసుకున్నారు. ఊహించిన విధంగా ఏమీ జరగకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చకున్నారు.షహబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్దనున్న ఆర్యవర్ట్ గ్రామీణ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో బ్యాంకులోని ఎమర్జెన్సీ అలారం ఒక్కసారిగా మోగింది. దీంతో పోలీసులు అప్రమత్తమై బ్యాంకు చుట్టుపక్కల దొంగలెవరైనా ఉన్నారేమోనని తనిఖీలు కూడా చేశారు. అయితే ఎలుకల కారణంగా సైరన్ మోగిందని తెలుసుకుని నవ్వుకున్నారు. ఇది కూడా చదవండి: నవ్వుతూ.. నవ్విస్తూ.. -
ఎలుకలు కరిచి ఐదుగురు విద్యార్థినులకు గాయాలు
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి బీఆర్ అంబేడ్కర్ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలో మంగళవారం ఐదుగురు ఇంటర్ విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. గాయపడిన విద్యార్థినులకు నరసన్నపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందించారు. వివరాల్లోకి వెళితే... రెసిడెన్షియల్ కళాశాల భవనంలోని డారి్మటరీలో ఉదయం 9.30 నుంచి 10 గంటల మధ్య ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని రోహిణి, ఫస్ట్ ఇయర్ విద్యార్థినులు స్రవంతి, హారిక, బాలామణి, సౌజన్య ఉండగా రెండు పెద్ద ఎలుకలు ఒకేసారి వచ్చి దాడి చేశాయి. ఐదుగురు విద్యార్థినుల కాళ్లను కరిచాయి. దీంతో వారు అక్కడి నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. గమనించిన కళాశాల సిబ్బంది వెంటనే విద్యార్థినులను నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఎలాంటి ప్రమాదం లేదని ఏఆర్వీ(యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్) చేస్తే సరిపోతుందని అక్కడి వైద్యులు వెల్లడించారు. కళాశాల సిబ్బంది నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రెసిడెన్షియల్ కళాశాలల జిల్లా సమన్వయకర్త బాలాజీ నాయక్ వెంటనే కళాశాలకు చేరుకున్నారు. ఎలుకల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ కృష్ణతారను ఆదేశించారు. -
పాక్ పార్లమెంటులో ఎలుకల వేట!
మనకు రామాయణంలో పిడకల వేట తెలుసు. ఇప్పుడు పాక్ పార్లమెంట్ ఎలుకల వేట సాగుతోంది! పార్లమెంటు భవనంలో ఎలుకలు విపరీతంగా పెరిగిపోయాయట. 2008 నుంచి జరిగిన సమావేశాల రికార్డులను పరిశీలించాలని అధికారిక కమిటీ ఒకటి కోరడంతో సమస్య తీవ్రత వెలుగులోకి వచ్చింది. రికార్డులన్నీ కాగితం ముక్కలై కనిపించడంతో ఇదెవరి పనా అని ఆరా తీస్తే ఎలుకల నిర్వాకమని తేలింది.వాటి ఆకారాలు కూడా అలా ఇలా లేవట. ‘‘ఎలుకలు ఎంత పెద్దగా ఎన్నాయంటే, బహుశా పిల్లులు కూడా వాటికి భయపడిపోతాయేమో! మా సిబ్బందికంటే వాటిని చూసీ చూసీ అలవాటైపోయింది. కానీ తొలిసారి వచ్చేవాళ్లంతా ఈ ఎలుకల విరాట్ స్వరూపాలను చూసి వణికిపోతున్నారంటే అతిశయోక్తి కాదు’’ అని నేషనల్ అసెంబ్లీ అధికార ప్రతినిధి జాఫర్ సుల్తాన్ వాపోయారు. రికార్డులు మొదలుకుని దొరికిన దాన్నల్లా ఈ ఎలుకలు హాం ఫట్ అనిపిస్తున్నాయట. దాంతో వాటి వేటకు పిల్లుల కొనుగోలు తదితరాలకు వార్షిక బడ్జెట్లో 12 లక్షలు కేటాయించాల్సి వచి్చంది! ఎలుకలను ట్రాప్ చేయడానికి ప్రత్యేక నెట్ కిటికీలు ఏర్పాటు చేస్తున్నారు. ‘పార్లమెంటులో మనుషుల అలికిడి ఉన్నప్పుడు చడీచప్పుడూ లేకుండా ఎక్కడో నక్కుతాయి. అంతా నిర్మానుష్యం కాగానే పార్లమెంట్ ఆవరణను మారథాన్ ట్రాకుగా మార్చేసుకుంటున్నాయి. ఇంత తెలివైన ఎలుకలను నేనెప్పుడూ చూడలేదు’’ అని జాఫర్ చెప్పుకొ చ్చారు. విపక్ష నాయకుని కార్యాలయం, స్టాండింగ్ కమిటీల భేటీలు జరిగే తొలి అంతస్తులోనే ఎలుకలు విపరీతంగా ఉన్నట్టు గుర్తించారు. చివరికి వీటి కట్టడికి పెస్ట్ కంట్రోల్ కంపెనీల కోసం పేపర్ ప్రకటనలు కూడా ఇవ్వాల్సి వచి్చందట! -
చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్
చచ్చిన ఎలుకలను కనుగొనేందుకు భారతీయ రైల్వే వివిధ స్టేషన్లలో బోరెస్కోపిక్ కెమెరాలను వినియోగించనుంది. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని ముంబైలో ప్రారంభించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్ హాల్, ఆఫీసు, క్యాంటీన్లోని మూలల్లో ఎలుకలు చనిపోతుంటాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. చచ్చిన ఎలుకల నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తరచుగా అందుతుండటంతో చచ్చిన ఎలుకలను వెతికేందుకు సెంట్రల్ రైల్వే రెండు అత్యాధునిక బోరోస్కోపిక్ కెమెరాలను కొనుగోలు చేసింది.బోరోస్కోపిక్ కెమెరా అతి చిన్న ప్రదేశంలోకి కూడా వెళుతుంది. సాధారణంగా చూడలేని ప్రాంతాన్ని కూడా స్కాన్ చేసి చూపిస్తుంది. దీని సాయంతో ఆయా ప్రాంతాల్లో స్కాన్ చేసి చచ్చిన ఎలుకలను గుర్తిస్తారు. తరువాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఈ కెమెరాలను ప్రయోగపూర్వకంగా ఉపయోగించినప్పుడు స్టేషన్ లాబీ, టాయిలెట్, వాష్‌రూమ్ సీలింగ్ వెనుక కొన్ని చచ్చిన ఎలుకలు కనిపించాయి. అనంతరం ఆ ఎలుకలను తొలగించారు. ప్రస్తుతానికి ముంబై స్టేషన్లో రెండు కెమెరాలు అమర్చినట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. త్వరలో ఇతర స్టేషన్లలోనూ ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. -
‘గురుకులం’లో హడలెత్తిస్తున్న ఎలుకలు
డిండి(నల్లగొండ): నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురులకు పాఠశాల(బాలికలు)లో ఎలుకలు హడలెత్తిస్తున్నాయి. ఇటీవల 16 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో వారు ఆస్పత్రి పాలయ్యారు. ఈ విషయం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గురుకుల పాఠశాలలో 635 మంది విద్యార్థినులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడం, గదుల గోడలకు ఏర్పడిన రంధ్రాల్లో ఎలుకలు, పాములు తిరుగుతున్నాయి. విద్యార్థినులు నిద్రిస్తున్న సమయంలో ఈ నెల 2న ఆరుగురు, 3న మరో ఆరుగురు, 5న నలుగురు విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. దీంతో వారు స్థానిక పీహెచ్సీలో యాంటీ రేబిస్ టీకాను వేయించుకున్నారు. ఈ నెల 2వ తేదీన మండల వైద్యాధికారి ఎస్.శైలి గురుకుల ఆవరణను పరిశీలించి వెంటనే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీఓ, ఎంఈఓకు లేఖ రాశారు. ప్రిన్సిపాల్ పద్మ విద్యార్థినుల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తున్నారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని శనివారం విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ధర్నా చేశారు. -
కోట్ల రూపాయల కారు గిఫ్ట్.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ 2022లో భూల్ భూలయ్యా- 2తో సక్సెస్ అందుకున్నారు. అంతేకాకుండా గతేడాది షెహజాదా, సత్యప్రేమ్ కీ కథ చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన నటించిన చిత్రం చందు ఛాంపియన్. ఈ సినిమాను కబీర్ ఖాన్ తెరకెక్కించారు. భారత తొలి పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు.అయితే భూల్ భూలయ్యా- 2 ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఏకంగా రూ. 4.72 కోట్ల విలువైన మెక్లారెన్ కారును బహుమతిగా అందుకున్నారు. టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ ఈ కారును కార్తీక్‌కు బహుమతిగా ఇచ్చారు.అయితే ఆ కారే ఇప్పుడు హీరోకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఇటీవల ఆ కారులోని మ్యాట్‌ను ఎలుకలు పాడుచేశాయని ఆయన తెలిపారు. కేవలం మ్యాట్స్ వేసేందుకే లక్షల రూపాయల్లో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని అతను వెల్లడించాడు. ప్రస్తుతం ఆ కారును గ్యారేజీలో పార్క్ చేసినట్లు పేర్కొన్నారు. కార్తీక్ నటించిన తాజా చిత్రం చందు ఛాంపియన్ జూన్ 14న విడుదల కానుంది. -
ధర్మాసుపత్రిలో ఎలుకల గోల
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఎలుకలు బెంబేలెత్తిస్తున్నాయి. ఆస్పత్రిలో సంచరిస్తూ రోగు లు, వైద్య సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తున్నా యి. ఆస్పత్రి నిర్వహణను అధికారులు, సానిటేషన్ కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని, దీంతో తరచూ ఎలుక కాటు సంఘటనలు చోటు చేసుకుంటున్నా యని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి లో శనివారం చోటుచేసుకున్న ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులపై తీవ్రంగా మండిపడినట్లు తెలిసింది. ఈ ఘటనలో ఐసీయూ విభాగంలో ఇద్దరు డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. ఎలుక కొరుకుడు ఘటనలు.. ► నాలుగేళ్ల క్రితం మార్చురి గదిలో ఉన్న ఓ వ్యక్తి మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. నోరు, ముక్కు, చెవులు, చేతివేళ్లు, కాళ్లను ఎలుకలు పీక్కు తిన్నాయి. ఈ అంశంపై అప్పట్లో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ► 2022 ఏప్రిల్ 11వ తేదీన జిల్లా ఆస్పత్రిలోని ట్రా మాకేర్, ఐసీయూ విభాగాలలో చికిత్స పొందుతు న్న రోగులను ఎలుకలు గాయపరిచాయి. ఈ విషయాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజా గా ఇదే ఆస్పత్రిలో మళ్లీ శనివారం రాత్రి రోగులను ఎలుకలు కరిచాయి. హౌసింగ్‌బోర్డు కాలనీకి చెంది న షేక్ ముజీబ్‌ను రక్తం వచ్చేలా గాయపరిచాయి. అదే రోజు మరో ఇద్దరు రోగులను సైతం కరిచాయి. సానిటేషన్ నిర్వహణ గాలికి.. జిల్లా కేంద్ర ఆస్పత్రి భవనంలో 28 విభాగాలున్నాయి. దీంతోపాటు మెడికల్ కళాశాల సైతం ఇందులోనే ఏర్పాటు చేశారు. దీంతో భవనం ఇరుకుగా మారింది. వాహనాల పార్కింగ్‌కు స్థలం సరిపోవ డం లేదు. రోగులు, వారి బంధువులు భోజనం చే యడానికి సరైన స్థలం లేదు. దీంతో ఆస్పత్రిలోని మంచాల వద్ద, మెట్లపై, ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి, మిగిలిన తినుబండరాలు, వ్యర్థాలను అక్కడే పడేస్తున్నారు. దీంతో ఎలుకలు ఆహారం కో సం బయటకు వచ్చి, ఆస్పత్రి అంతా కలియ తిరు గుతున్నాయి. ఆక్సిజన్ పైపుల గుండా సంచరిస్తూ ఏసీలను పాడు చేస్తున్నాయి. మంచాల వద్దకు వచ్చి రోగులను గాయపరుస్తున్నాయి. ఆస్పత్రి బయట ప్రాంతంలో, కిచెన్ షెడ్లో ఎక్కడ చూసినా ఎలుకల బొరియలే కనిపిస్తాయి. సానిటేషన్ నిర్వహణ సరి గా లేకపోవడంతో ఎలుకల స్వైర విహారానికి అడ్డుకట్ట పడడం లేదు. ఎలుకల కోసం గమ్ ప్యాడ్లు, బోనులను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, వాటి బెడద తప్పించడానికి సరైన చ ర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎలుకల నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరమ్మతులు చేయిస్తాం భవన నిర్మాణ పనులు జరగడం, రోగులు, వారి బంధువులు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసి వ్యర్థాలను పడేస్తుండడంతో ఎలుకలు వస్తున్నాయి. ఎలుకలు రాకుండా చర్యలు తీసుకుంటాం. అవసరమైనచోట మరమ్మతులు చేయించి, ఎలుకలు రాకుండా చూస్తాం. – విజయలక్ష్మి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, కామారెడ్డి పరామర్శించిన బర్రెలక్క బర్రెలక్క అలియాస్ శిరీష ఆదివారం జిల్లా ఆస్పత్రిని సందర్శించి, ఎలుక కరిచిన రోగిని పరామర్శించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయల క్ష్మితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి ఆస్పత్రిలో నెలకొన్న స మస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. -
ఐసీయూలో పేషెంట్లను కొరికిన ఎలుకలు..
-
రైల్వే కిచెన్‌లో ఎలుకల సంచారం.. అధికారుల స్పందన ఇది..!
ముంబయి: రైల్వేలలో ఆహారం నాణ్యతపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఆహారంలో అపరిశుభ్రమైన వస్తువులు రావడం తరచూ చూస్తుంటాం. కానీ తాజాగా రైల్వే కిచెన్(ప్యాంట్రీ)లో ఏకంగా ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. రైల్వే కిచెన్‌లో ఎలుకలు సంచరిస్తున్న వీడియోను ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను మడగావ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ఈ దృశ్యాలను చూశానని ఆ ఘటనపై ఇలా పేర్కొన్నాడు. '11099 నెంబర్‌గల మడ్గావ్ ఎక్స్‌ప్రెస్‌లో అక్టోబర్ 15న ప్రయాణిస్తున్నాను. అప్పటికే మధ్యాహ్నం 1:45 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలస్యమైంది. రైలు వెనుకభాగంలోకి వెళ్లి చూస్తే ప్యాంట్రీలో ఎలుకలు దర్శనమిచ్చాయి. ఆహార పదార్థాలను ఎలుకలు తింటూ కనిపించాయి.' అని ఆ యూజర్ తెలిపాడు. View this post on Instagram A post shared by RF Drx. Mangirish Tendulkar (@mangirish_tendulkar) ఈ ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసుకు తెలిపినా ప్రయోజనం లేకపోయిందని ఆ ప్రయాణికుడు తెలిపాడు. రైల్వే ట్రాక్‌పై ఉండే ఎలుకలు లోపలికి దూరి ఉండవచ్చని సాధారణంగా మాట్లాడి నిరుత్సాహపరిచాడు. ఆ తర్వాత అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ మీనాకు ఫిర్యాదు చేస్తే ప్యాంట్రీ మేనేజర్‌తో మాట్లాడామని వెల్లడించారు. అయితే.. రైలు కోచ్‌లలో లోపాల కారణంగానే ఎలుకలు లోపలికి ప్రవేశిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చివరికి రైల్వే పెద్దలు ఈ ఘటనపై స్పందించి.. తగు నివారణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్యాంట్రీలో శుభ్రతపై తగు జాగ్రత్తలు తీసుకుంటామని సోషల్ మీడియాలో రిప్లై ఇచ్చారు. The matter is viewed seriously and suitable action has been taken.Pantry Car Staff have been sensitised to ensure hygiene and cleanliness in the pantry car. The concerned have been suitably advised to ensure effective pest and rodent control measures which is being ensured. — IRCTC (@IRCTCofficial) October 18, 2023 ఇదీ చదవండి: కశ్మీరీ వలస కుటుంబాలకు ఇకపై నెలకు రూ.27 వేలు -
యాదాద్రి భువనగిరి: మృతదేహాన్ని కొరికేసిన ఎలుకలు!
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీలో ఉన్న ఓ మృతదేహాన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఏపీలోని గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం బాయపాలెం గ్రామానికి చెందిన పెరికల రవికుమార్ (38) కుటుంబం 2016లో భువనగిరికి వలస వచ్చింది. రవికుమార్‌కు వివాహం జరగా, ఒక కుమార్తె జన్మించింది. కొంతకాలానికి ఆమె చనిపోవడంతో, రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఏడాది క్రితం రెండో భార్య రవికుమార్‌ను వదిలివెళ్లింది. దీంతో ఆయన తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి పట్టణంలోని ప్రగతినగర్‌లో అద్దెకు ఉంటున్నాడు. డ్రైవర్‌గా పనిచేస్తున్న రవికుమార్ కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు. తగాదా పడుతుండడంతో తల్లిదండ్రులు, పిల్లలు సమీపంలోని తెలిసిన వారి ఇంటికి వెళ్లారు. తిరిగి రాత్రి 11:30 నిమిషాలకు ఇంటికి వచ్చేసరికి రవికుమార్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మార్చురీ గదిలోని ఫ్రీజర్‌లో కాకుండా బయట భద్రపరిచారు. ఆ ఆనవాళ్లు చూసి.. రవికుమార్ మృతదేహాన్ని చూసేందుకు సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో పాటు బంధువులు మార్చురీకి వచ్చారు. అప్పటికే మృతదేహం ముఖం, చెంపలు, నుదుటిపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఎలుకలు కొరికినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆస్పత్రి సూపరింటెండెంట్ చిన్నానాయక్ తెలిపారు. -
22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి: కోర్టుకు తెలిపిన చెన్నై పోలీసులు
22 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయి: కోర్టుకు తెలిపిన చెన్నై పోలీసులు -
Stroke: ఈ చికిత్స అందిస్తే..ఈజీగా రికవరీ అవ్వచ్చు!
స్ట్రోక్ వస్తే సత్వరమే చికిత్స అందుబాటులో ఉన్నా అవన్నీ తాత్కలికమే. ఎందుకంటే ఒక్కోసారి భవిష్యత్తులో మళ్లీ రావచ్చు లేదా రాకపోవచ్చు. అంతేగాదు రోగికి అలాంటి సమయంలో త్వరితగతిన కోలుకోవడం కూడా ఒక్కొసారి సమయం పడుతుంటుంది. పైగా రోగి అంగవైకల్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కానీ ఇక నుంచి అలా కాకుండా రోగులను త్వరితగతిన కోలుకునేలా చేయవచ్చని తాజా అధ్యయనాల్లో వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు స్వీడన్ యూనివర్శిటీ ఆఫ్ గోథెన్బర్గ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ జర్నల్‌లో ఆ పరిశోధనలు గురించి వెల్లడించింది. పరిశోధకులు అందుకోసం ఎలుకలపై చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ప్రయోగంలో భాగంగా ఎలుకలకు నాసిల్ చికిత్స విధానం ఉపయోగించి.. నాసిక గుండా సీ3ఏ పెప్టైడ్ ఆస్ట్రోసైట్ల డ్రాప్స్‌ను ఇచ్చారు. ఈ చుక్కలను తీసుకున్న ఎలుకలు స్ట్రోక్ తర్వాత చాలా చురుకుగా యథావిధిగా ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు స్వీడన్, జర్మనీలలో చేసిన ప్రయోగాల్లో కూడా ఇలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ అధ్యయనాలు చెక్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లోని పరిశోధకుల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మేరకు గోథెన్బర్గ్ విశ్వవిద్యాలయంలోని న్యూరో ఇమ్యునాలజీ ప్రోఫెసర్ మార్సెలా పెక్నా మాట్లాడుతూ..ఈ చికిత్స క్లినిక్స్‌లో ఉపయోగించవచ్చన్నారు. స్ట్రోక్‌కి గురై ఆస్పత్రులకు వచ్చిన వారు కూడా అంగవైకల్యానికి గురి కాకుండా త్వరితగతిన కోలుకోగలుగుతారని పెక్నా చెప్పారు. అంతేగాదు ఈ నాసిల్ డ్రాప్ చికిత్స విధానం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స అందించగలమని చెప్పారు. (చదవండి: విచిత్ర ఘటన: ఓ వృద్ధుడు బతికుండగానే.. తన అంత్యక్రియలు తానే..) -
రాజ భవనంలాంటి ఆ బంగ్లా.. ఎలుకలు ఉన్నాయని కూల్చేస్తున్నారు!
ఒకప్పటి అమెరికా టెలివిజన్ టాక్ షో సృష్టికర్త, నిర్మాత ఫిల్ డోనాహ్యూ బంగ్లా నేలమట్టమవుతోంది. ఇంద్ర భవనం లాంటి ఆ బంగ్లా ఒక చిన్న కారణంతో ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఆయన హయాంలో అది దాదాపు 200 కోట్లకు విక్రయించిన విలావంతమైన భవనాన్ని నిర్ధాక్షణ్యంగా కూల్చేందుకు రెడీ అవుతున్నారు ప్రస్తుత యజమానులు. బీచ్ వద్ద ఎంతో ఆకర్షణీయంగా చూపురులను కట్టిపడేసే ఆ కట్టడం కనుమరుగువుతుందంటే చుట్టు పక్కల నివాసితులు సైతం కలత చెందారు. అంతలా అందర్నీ కట్టిపడేసిన భవనం ఎందుకు కూల్చేయాలనకుంటున్నారు? ప్రధాన కారణం ఏమిటో వింటే అవాక్కవుతారు. వివరాల్లోకెళ్తే..రాజభవనంలా ఉండే గోల్డ్ కోస్ట్ భవనం 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనానికి రైనర్ ఆమె భర్త గ్యారీ యజమానులు. వెస్ట్‌పోర్ట్‌లో హాలీవుడ్ ఆఫ్ ది ఈస్ట్‌లో భాగమైన ఈ ఆకర్షణీయమైన ఈ బంగ్లా కొద్ది రోజుల్లోనే కనుమరుగవనుంది. 80వ దశకంలో టాక్ షో సృష్టికర్త డోనాహ్య, అతని భార్య, నటి మార్లో థామస్ వేసవిలో ఈ బంగ్లాలో సేద తీరేవారు. ఈ బంగ్లాలో ఇతర వెస్ట్పోర్ట్ నివాసితులు, మరికొందరూ నటీనటులు ఎందరో ఇక్కడ గడిపి వెళ్లేవారు. 2006లో డొనహ్యు ఆ బంగ్లా దగర్లోనే మరో మల్టి మిలియన్ డాలర్ గోల్డ్ కోస్ట్‌ని కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ బంగ్లాను రికార్డు స్థాయిలో 200 కోట్లకు అల్లిసన్‌కు అనే ఫైనాన్షియర్‌కి విక్రయించి వార్తల్లో నిలిచాడు. అల్లిసన్ అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా వద్ద అసిస్టెంట్ ట్రెజరీ కార్యదర్శిగా పనిచేసేవాడు. నాటి ఒబామా సైతం బీచ్ వద్ద ఉండే ఈ అందమైన భవనం కోసం డబ్బును వెచ్చించేందుకు యత్నించినట్లు సమాచారం. 2013లో అల్లిసన్ మరణం తర్వాత ఆ భవనాన్ని పర్యవేక్షించేవాళ్లు లేరు. 2020లో రైనర్ దంపతులు కేవలం రూ. 136 కోట్లకు ఈ బంగ్లాను కొనుగోలు చేశారు. వారు కొనుగోలు చేసే సమయంలో ఆ భవనం పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉంది. అది రాత్రి పూట సంచరించే ఎలుకలకు నిలయంగా మారింది. దీంతో ఆ దంపతులు ఈ బంగ్లాను కూల్చివేసేలా అనుమతించాలని హిస్టారిక్ కమిషన్‌కి దరఖాస్తు చేసుకున్నారు. హిస్టారిక్ డిస్డ్రిక్ కమిషన్ మాత్రం ఈ అందమైన కట్టడం కూల్చడం కోసం 180 రోజుల నిరీక్షించాలని ఆ దంపతులకు స్పష్టం చేసింది. ఈలోగా ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తామని కమిషన్ వెల్లడించింది. అలాగే అందులో ఉండే అద్భుతమైన కళాఖండాన్ని తిరిగి ఉపయోగించుకునే అవకాశం తోపాగు అందులో ఉపయోగించిన రాతి స్తంభాలను పరిరక్షించాలని కమిషన్ యత్నిస్తోంది. (చదవండి: కుక్క కంటే మనిషి కరిస్తేనే..ఇంత దారుణంగా ఉంటుందా? కోలుకోవడానికే..) -
వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి?
లండన్: బ్రిటన్ ప్రజలు ఇప్పుడు ఎలుకల పేరు చెబితేనే వణికిపోతున్నారు. వీధుల్లో చెత్తకుండీల వద్ద కుప్పలుకుప్పలుగా కన్పిస్తున్న మూషికాలను చూసి హడలిపోతున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో 20-30 కోట్ల ఎలుకలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి పొరపాటున బ్రిటన్ను చుట్టుముట్టి ప్లేగు వ్యాధిని వ్యాపింపజేస్తే పరిస్థితి అత్యంత భయంకరంగా ఉంటుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజులు మారుతున్న కొద్ది బ్రిటన్ ప్రజలు ఆహారపు అలవాట్లు కూడా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఫాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఫుడ్‌ను ఇష్టపడుతుత్నారు. బేకరీలు, ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లలో కస్టమర్లు తినివదిలేసిన ఆహారం చెత్తకుండీల్లో పడేస్తున్నారు. వీటిని ఆరగించేందుకు ఎలుకలు డస్ట్బిన్ల వద్ద కుప్పలుకుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వీటిని చూసి అటువైపు వెళ్లే వాళ్లు జడుసుకుంటున్నారు. (చదవండి: కొత్త జంటపై విధి చిన్న చూపు.. పెళ్లై గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం) కస్టమర్లు వదిలేసిన ఆహార పదార్థాలు తిని బ్రిటన్‌లో ఎలుకలు ఫ్యాటీగా తయారవుతున్నాయి. కొవ్వు పదార్థాలు అధికమై ఊబకాయం బారినపడుతున్నాయి. దీంతో వాటి పరిమాణం చిన్నసైజు కుక్క స్థాయికి పెరిగిపోతుంది. వీటిని చూస్తేనే హడలిపోయేలా కన్పిస్తున్నాయి. ఊబకాయంతో విషం తట్టుకునే శక్తి.. ఎలుకలు ఫ్యాటీగా తయారు కావడంతో వాటిని చంపేందుకు మందుపెట్టి విషప్రయోగం చేసినా అవి తట్టుకుంటున్నాయి. బ్రిటన్‌లో మూషికాలను చంపేందుకు 1950 నుంచి ఉపయోగిస్తున్న పెస్ట్ కంట్రోల్‌ను ప్రయోగించినా అవి చావడం లేదని పారిశుద్ధ్య నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 78 శాతం ఎలుకలు విషాన్ని సైతం తుట్టుకునే నిరోధక శక్తి కలిగి ఉన్నాయని వాపోతున్నారు. అయితే ఎలుకల సంఖ్య గణనీయంగా పెరగడానికి పారిశుద్ధ్య ప్రమాణాలు, పరిశుభ్రత సరిగ్గా పాటించకపోవడమూ ఓ కారణమని పలువురు అభిప్రాయపడ్డారు. వాటిని ఎప్పుడో నియంత్రించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. లండన్ గ్రీన్విచ్ యూనివర్శిటీలోని నేచురల్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్లో ఎకాలజీ ప్రొఫెసర్ స్టీవ్ బెల్మైన్ ఎలుకల సంఖ్య గురించి మాట్లాడుతూ.. 'ఇక్కడ కనీసం 200 నుంచి 300 మిలియన్ల(సుమారు 30 కోట్లు) ఎలుకలు ఉన్నాయని నేను ఊహించగలను' అని అన్నారు. వ్యాధి ప్రాబల్యాన్ని పరీక్షించడానికి నార్ఫోక్, ఎసెక్స్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకలను బోణుల ద్వారా ట్రాప్ చేస్తున్నట్లు తెలిపారు. బ్రిటన్‌లో 2018లో బోర్న్మౌత్ పెస్ట్ హంటర్ పట్టుకున్న ఓ ఎలుక 21 అంగుళాల పొడవు ఉంది. అంటే ఇది చిన్న కుక్క సైజులో ఉంటుందన్నమాట. బ్రిటన్‌లో అప్పటివరకు పట్టుకున్న ఎలుకల్లో ఇదే అతిపెద్దది కావడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎలుకల పరిమాణం ఇంకా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలాఉండగా.. 2021 లెక్కల ప్రకారం బ్రిటన్ జనాభా సుమారు 7 కోట్లు. చదవండి: ప్రాణులకు ప్లాస్టికోసిస్ ముప్పు -
మూషికమా.. మజాకా!
సాక్షి, సిటీబ్యూరో: గతంలో నిమ్స్‌లోని ఓ రోగిపై ఎలుకల దాడి సంగతి.. తాజాగా నగరంలోని ఓ ప్రముఖ ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌లో బాలుడిపై ఎలుక దాడి తెలిసిందే. ఆస్పత్రి సంగతి ఎలా ఉన్నా.. అత్యాధునికంగా, పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇలాంటి సంఘటన జరగడం గమనార్హం. ఈ రకమైన ఎలుకల వీరంగానికి కరోనా లాక్డౌన్ కూడా కారణమంటున్నారు కొందరు నిపుణులు. అరుదు కాదు.. ఎలుకలు కొరుకుతున్న ఘటనలు నగరంలో అరుదుగానో ఎప్పుడూ జరగని సంఘటనలుగానో తీసిపారేయడం కాదు, బహిరంగ ప్రదేశాల్లో జరిగినవి మాత్రమే బయటకు తెలుస్తున్నాయి కానీ... ఇప్పటికే నగరంలో ఎలుక కొరుకుడు పెద్ద సమస్యగా మారిన సంగతి చాలా మందికి తెలుసు. ఇప్పటి వరకు ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 250కి పైగా ఎలుకలు కొరికిన కేసులు నమోదవడం దీనికి నిదర్శనం. గత పక్షం రోజుల్లో, ముగ్గురు ఎలుక కాటుకు గురయ్యారు. వీరిలో ఫుడ్ చైన్ అవుట్‌లెట్‌లో ఎనిమిదేళ్ల బాలుడితో పాటు కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఉమెన్స్ హాస్టల్లో ఇద్దరు విద్యార్థులు సైతం ఉన్నారు. ఒక పెద్ద ఎలుక బాలుడి ప్రైవేట్ భాగాలను కొరికితే, హాస్టల్లో నిద్రిస్తున్న మహిళల కాళ్లూ చేతుల్ని కొరికేశాయి. లాక్ డౌన్.. ర్యాట్స్ అప్.. బహిరంగ చెత్త డంప్‌లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు ఆస్పత్రుల్లో పరిశుభ్రత లేకపోవడం ఎలుకల సంఖ్య భారీగా పెరగడానికి దోహదపడుతోంది. కోవిడ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని పలువురు వ్యాపారులు అంటున్నారు. ముఖ్యంగా రెస్టారెంట్లు, ఆస్పత్రులు, వాణిజ్య సముదాయాల్లో ఎలుకల వ్యాప్తికి లాక్డౌన్ దోహదం చేసింది. ఎలుకల విజృంభణకు సంబంధించి 80% కాల్స్ లాక్డౌన్ తర్వాతే పెరిగాయని క్రిట్టర్ డిఫెన్స్ పెస్ట్ కంట్రోల్ సర్వీసెస్ సహ వ్యవస్థాపకుడు రిత్విక్ కిషోర్ అన్నారు. మరోవైపు ఇతర మెట్రో నగరాల మాదిరిగా కాకుండా, హైదరాబాద్‌లో ఎలుకలు పందికొక్కులకు ప్రత్యేక నియంత్రణ విభాగం లేకపోవడం కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. ఓల్డ్ సిటీలో ఎక్కువగా.. ● ఓల్డ్ సిటీలో కూడా ఎలుకల సమస్య బాగా పెరిగిందని నగరానికి చెందిన ఒక పెస్ట్ కంట్రోల్‌కు చెందిన కృష్ణ్ణ వరప్రసాద్ అంటున్నారు. ‘ఎలుకలు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతాలలో మురుగు కాల్వలు చెత్త డంప్‌లు ప్రధానమైనవని, ముఖ్యంగా పాతబస్తీలో ఇలాంటి పరిస్థితులు బాగా ఎక్కువని అంటున్నారాయన. మూసీ సమీపంలోని అఫ్జల్‌గంజ్, ఆసిఫ్ నగర్, గోషామహల్ ఇతర పరిసర ప్రాంతాల నుంచి ఎలుకల గురించి ఫిర్యాదులు బాగా వస్తున్నాయి అని వరప్రసాద్ చెప్పారు. తక్షణమే వైద్య సహాయం పొందాలి.. ● ‘ఎవరికై నా ఎలుక కొరికిన తర్వాత జ్వరం వచ్చినట్లయితే తక్షణమే వైద్య సహాయం తీసుకోవాలి. లేదంటే అది ప్రాణాంతకమైన బాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా మారవచ్చు. టెటానస్ ఇంజెక్షన్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి‘ అని జనరల్ సర్జన్ డాక్టర్ సాగర్ ప్రతాప్ చెప్పారు. ఎలుక కాటు అనేది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తప్ప మిగిలిన వారికి అంత ప్రమాదకరం ఏమీ కాదని ఫీవర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శంకర్ చెప్పారు. రక్తం వచ్చే స్థాయిలో గాయం ఉన్నప్పుడు వెంటనే తగిన ప్రాథమిక చికిత్స, అవసరాన్ని బట్టి టీటీ ఇంజక్షన్ తీసుకుంటే సరిపోతుందంటున్నారు. -
విద్యార్థిని కాలు కొరికిన ఎలుకలు
కేయూ క్యాంపస్: కేయూ మహిళా హాస్టల్ డీ బ్లాక్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి చెందిన మొదటి సంవత్సరం విద్యార్థిని పాదం మడిమెను ఆదివారం రాత్రి ఎలుకలు కొరికాయి. విద్యార్థిని ఆదివారం రాత్రి పడుకున్న సమయంలో కొరికినట్లు హాస్టల్ సిబ్బందికి తెలపగా.. టీటీ వేయించుకోవాలని సూచించినట్లు సమాచారం. ఎలుక కొరికిన విషయమై ఆ విద్యార్థిని సంబంధిత విభాగం ప్రొఫెసర్ల దృష్టికి సోమవారం తీసుకెళ్లారు. అంతకుముందు రోజు కూడా మరో విభాగం విద్యార్థినిని కూడా ఎలుకలు కొరికినట్లు తెలుస్తోంది. మహిళా హాస్టల్లోని డీ బ్లాక్‌లో ఎలుకలు ఉన్నాయని విద్యార్థినులు చెబుతున్నా వాటిని నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
శత్రు సైన్యంపై మూషికాస్త్రం!
యుద్ధ క్షేత్రంలో శత్రు శిబిరం ఎత్తుగడలు, రహస్యాలను తెలుసుకోవడానికి సైన్యం రకరకాల మార్గాల్లో ప్రయత్నించడం తెలిసిందే. శత్రువులు ఎక్కడెక్కడ ఏయే ఆయుధాలు మోహరించారో తెలుసుకోవడం యుద్ధంలో కీలకం. ఇలాంటివి పసిగట్టే ఎలుకలపై భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) నిర్విరామంగా ప్రయోగాలు సాగిస్తోంది. డీఆర్డీఓలో అంతర్భాగమైన అసిమ్మెట్రిక్ టెక్నాలజీ ల్యాబ్ ప్రస్తుతం ఇదే పనిలో నిమగ్నమైంది. మొదటి దశను విజయవంతంగా పూర్తిచేసి, రెండో దశలోకి ప్రవేశించింది. ఏమిటీ ప్రయోగం? సైనికులు జంతువులు, పక్షులను ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదు. రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే ఎలుకలను రంగంలోకి దించాలన్నదే భారత సైన్యం వ్యూహం. ఇవి ఏమాత్రం అనుమానం రాకుండా శత్రు సైనికుల శిబిరాల్లోకి వెళ్లి, అక్కడి సమాచారాన్ని అందిస్తాయి. ఆ సమాచారం ఆధారంగా సైన్యం వ్యూహాలు సిద్ధం చేసుకోవచ్చు. ఈ ఎలుకలను యానిమల్ ౖసైబర్గ్స్ అని పిలుస్తున్నారు. ఏడాదిన్నర క్రితమే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దీనిగురించి ఇటీవల జరిగిన 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్‌లో డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ ఒక ప్రజంటేషన్ ఇచ్చారు. యానిమల్ సైబర్గ్స్ అంటే? జీవించి ఉన్న ఎలుకల సామర్థ్యాన్ని మరింత పెంచుతారు. ఇందుకోసం ఎలక్ట్రికల్, మెకానికల్ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ఎలుకలు చేయలేని ఎన్నో పనులను ఇవి సులువుగా చేసేస్తాయి. కేవలం సైన్యంలోనే కాదు, పరిశోధనలు, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, భూమిల పాతిపెట్టిన బాంబుల జాడ కనుక్కోవడంతోపాటు శస్త్రచికిత్సల్లోనూ యానిమల్ సైబర్గ్స్ సేవలను వాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ జంతువుల్లో మార్పులు చేయడాన్ని జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. జంతువుల్లోని సహజ సామర్థ్యాలను దూరం చేయడం వాటిని బాధకు గురిచేయడమే అవుతుందని అంటున్నారు. ఎలుకలే ఎందుకు? భారత్‌లో ఎలుకలపై మొదటి దశ ప్రయోగాలు ముగిశాయి. ఎలుకల కదలికలను నియంత్రించడానికి సర్జరీల ద్వారా వాటి శరీరంలో ఎలక్ట్రోడ్లు అమర్చారు. ఇక సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వాటిని పరీక్షించబోతున్నారు. కొండలను ఎంత వరకు అధిరోహించగలవో చూస్తారు. మొదటి దశ ప్రయోగంలో ఎలుకలు కొంత ఇబ్బందికి గురయ్యాయని డీఆర్డీఓ సైంటిస్టు పి.శివప్రసాద్ వెల్లడించారు. కార్యాచరణకు సిద్ధమైన ఎలుకలను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించవచ్చు. ఏ దిశగా వెళ్లాలి? ఎంత దూరంగా వెళ్లాలి? ఎక్కడ ఆగాలి? ఎంతసేపు ఆగాలి? అనేదానిపై వాటి మెదడుకు ఎప్పటికప్పుడు సంకేతాలు అందిస్తారు. ప్రయోగానికి ఎలుకలనే ఎన్నుకోవడానికి కారణంగా ఏమిటంటే.. అవి వేగంగా కదులుతాయి. లోతైన బొరియల్లోకి సైతం తేలిగ్గా వెళ్లగలవు. గోడలు, చెట్లు ఎక్కగలవు. యానిమల్ ౖౖసైబర్గ్స్ను చైనాలో ఇప్పటికే అభివృద్ధి చేశారు. యానిమల్ సైబర్గ్స్ సినిమాల్లో కూడా ఉన్నాయి. స్టార్‌వార్స్ సినిమాలోని చ్యూబాకా కూడా ఇలాంటిదే. ఒళ్లంతా రోమాలతో కనిపించే వింత జంతువు చ్యూబాకాలో శరీరం లోపల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
మనుషుల్లాగా మాకు గంజాయి తాగే అలవాటు లేద్సార్!
మనుషుల్లాగా మాకు గంజాయి తాగే అలవాటు లేద్సార్! -
వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, పాములు
-
ఇదెక్కడి గోసరా నాయనా! దోమల ఆకర్ష ఆకర్ష.. వైరస్లు ఒంటి వాసననూ మార్చేస్తాయా?
వాషింగ్టన్: కరోనా వైరస్ చూసి ప్రపంచమంతా భయపడుతున్న వేళ..ఇతర రకాల వైరస్ల సామర్థ్యంపై కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వైరస్లు ఇతర జీవుల చర్మ వాసనలను సైతం మార్చేసి దోమలు కుట్టేందుకు ప్రేరేపించేలా చేయగల శక్తి ఉందని తాజాగా తేలింది. కనెక్టికట్ యూనివర్సిటీలోని ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పెంగ్వా వాంగ్ ఎలుకలపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. దోమల ద్వారా సంక్రమించే మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ, జికా, గున్యా జ్వరాలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోతున్నారు. ఈ బాధితులను కుట్టిన దోమ ఆ వైరస్‌ని, అది కుట్టిన మరో వ్యక్తికి వ్యాపింపజేస్తుంది. ఇలా అతిథేయిపై వాలి కుట్టేందుకు దోమలను ప్రేరేపించే అంశాలను పెంగ్వా వాంగ్ గుర్తించారు. వైరస్ బాధిత జీవి చర్మంపై తయారయ్యే అసిటోఫెనోన్ అనే ఒక సువాసన తయారవుతుందని, దీనివల్లనే ఆరోగ్యవంతుల కంటే 10 రెట్లు ఎక్కువగా దోమలు బాధితులనే కుడుతున్నట్లు గుర్తించారు. పేగులు, చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియానే అసిటోఫెనోన్ తయారీలో కీలకం. డెంగ్యూ, జికా వైరస్లు చర్మంపై నుండే బాసిల్లస్ బ్యాక్టీరియా రెల్మా అనే కణ తయారీని అడ్డుకుని అసిటోఫెనోన్ను పెంచుతోంది. ప్రయోగంలో చివరిగా వైరస్ బాధిత ఎలుకలకు ఎల్మాను ప్రేరేపించే విటమిన్ ఏను అందజేసి, వాటి శరీరంపై బాసిల్లస్ బ్యాక్టీరియాను తగ్గించినప్పుడు తిరిగి ఆరోగ్యవంతంగా మారాయి. మనుషులపైనా ఇవే ప్రయోగాలను చేపట్టి, ఫలితాల ఆధారంగా అంతిమంగా వాటిని బాధితులకు వర్తింపజేయడానికి ప్రయత్నిస్తామని పెంగ్వా వాంగ్ చెప్పారు. తమ ప్రయోగాలు పలు ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంతో మేలుచేస్తాయన్నారు. -
పోయిన నగలు ‘భలే’గా దొరికాయి.. సుందరి ప్రాణం లేచొచ్చింది
అరుదైన ఘటనలు అంటారు కదా! ఆ జాబితాలో ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కచ్చితంగా ఉంటుంది. బంగారం తాకట్టు పెట్టి బాకీలు తీర్చాలనుకున్న ఓ తల్లికి.. ఊహించని కష్టం వచ్చిపడింది. ఆమె మంచి మనసే.. ఆమెతో కన్నీళ్లు పెట్టించింది. చివరకు పోలీసుల ప్రయత్నంతో కథ సుఖాంతం కావడమే కాదు.. పోయిన ఆమె పది తులాల బంగారం ఓ డ్రైనేజీలో ‘భద్రం’గా దొరికింది కూడా. ఆమె అదృష్టం చేజారిపోలేదని నిరూపించిన ఘటన.. మహారాష్ట్ర ముంబై ఆరే కాలనీలో జరిగింది. స్థానిక నివాసి అయిన 45 ఏళ్ల సుందరి ప్లనిబెల్.. గోరేగావ్ గోకుల్ ధామ్ కాలనీలోని ఇళ్లలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. తనకున్న పది తులాల బంగారు నగలను.. బ్యాంకులో డిపాజిట్ చేసి అప్పులు తీర్చాలని అనుకుందామె. జూన్ 13వ తేదీన పని ముగించుకుని బ్యాంకుకు వెళ్తున్న టైంలో.. ఓ ఇంటి ఓనర్ మిగిలిపోయిన కడక్ పావ్‌ను సుందరికి ఇచ్చింది. అయితే సుందరి బ్యాంకుకు వెళ్తున్న మార్గంలో.. ఓ తల్లి చంటి బిడ్డను ఎత్తుకుని కనిపించింది. బిడ్డ ఆకలితో ఉందేమో అనుకుని తన దగ్గరున్న కడక్పావ్ సంచిని ఆ తల్లికి ఇచ్చేసిందామె. తీరా బ్యాంకుకు వెళ్లి చూడగా, తన వద్ద ఉండాల్సిన నగలు కనిపించలేదు. రోడ్డు మీద కనిపించిన ఆ తల్లికి ఇచ్చిన సంచిలోనే నగలు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చింది. పరుగున వెళ్లి ఆ తల్లీబిడ్డల కోసం చూసింది. కానీ, వాళ్లు కనిపించలేదు. ఆలస్యం చేయకుండా.. దిన్దోషి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిందంతా చెప్పి విలపించింది సుందరి. ఆ నగలు లేకపోతే అప్పులు తీర్చలేనని, తనకు చావే శరణ్యమని పోలీసులను వేడుకుంది. దీంతో ఆమె కన్నీళ్లకు కరిగిపోయి.. పోలీసులు రంగంలోకి దిగారు. కనిపించకుండా పోయిన ఆ తల్లీబిడ్డల ఆచూకీ కోసం ఏరియాలో అందరినీ అడిగారు. చుట్టుపక్కల గల్లీలన్నీ జల్లెడ పట్టారు. రెండు గంటల వెతుకులాట తర్వాత.. మొత్తానికి వాళ్లను దొరకబుచ్చుకున్నారు. అయితే.. ఆ బ్రెడ్డు మీద ఆసక్తి లేకపోవడంతో అక్కడే చెత్త కుప్పలో దానిని పడేశామని ఆ తల్లి చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ చెత్త వ్యాను గనుక దానిని ఎత్తేసి ఉంటే పరిస్థితి ఏంటని అనుకుంటూనే.. ఆ ప్రాంతానికి చేరుకున్నారు. చెత్తలో ప్రతీ సంచినీ క్షుణ్ణంగా వెతికి చూశారు. లాభం లేకపోయింది. ఈ సమయంలో.. అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాపై ఏఎస్సై సూరజ్ రౌత్ కన్నుపడింది. దానిని పరిశీలించాడాయన. అయితే అందులో ఓ సంచి దానికి అదే కదులుతూ వెళ్లడం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. అందులో బ్రెడ్డు ఉండడంతో అది ఎలుకల పనే అని నిర్ధారించుకున్నారు. వెంటనే.. దగ్గర్లోని ఎలుకల కలుగులను పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. చెత్త కుప్పకు కాస్త దగ్గర్లో.. మురికినీరు పోయే ఓ రంధ్రంలో ఎలుకలు అటు ఇటు కదలాడుతున్నాయి. ఆ రంధ్రం నుంచి తొంగి చూసిన పోలీసులకు ఓ బ్యాగ్ కనిపించింది. వెంటనే దానిని బయటకు తీసి చూడగా.. అందులో నగలు భద్రంగానే ఉన్నాయి. ఆ నగలను అలాగే అప్పగించిన దిన్దోషి పోలీసులకు కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది ఆ తల్లి. నమ్మశక్యంగా లేదు కదూ!. -
‘బ్యాక్‌ప్యాక్’ హీరోలు!
ఈసారి ప్రపంచంలో ఎక్కడైనా భారీ భూకంపం సంభవిస్తే శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సరికొత్త ‘హీరోలు’రంగంలోకి దిగనున్నారు! వీపుపై మైక్రోఫోన్లు, వీడియో కెమెరాలు, లొకేషన్ ట్రాకర్లతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లు తగిలించుకొని చిన్నచిన్న రంధ్రాల్లోకి సైతం అలవోకగా దూసుకెళ్లనున్నారు!! హీరోలేమిటి.. రంధ్రాల్లోకి దూరడమేమిటని ఆశ్చర్యపోతున్నారా? కానీ మీరు చదివింది నిజమే.. కానీ ఈ హీరోలు ఆరడుగుల బుల్లెట్లు కాదు... కేవలం మన అరచేయికి కాస్త అటుఇటు సైజులో ఉండే ఎలుకలు!! ఇంతకీ విషయం ఏమిటంటే.. భూకంపాలు వచ్చినప్పుడు కుప్పకూలే భవనాల శిథిలాల్లో చిక్కుకున్న క్షతగాత్రులను కచ్చితత్వంతో గుర్తించడం సహాయ సిబ్బందికి పెను సవాలే. దీనికితోడు సమయంతో పోటీపడాల్సి ఉంటుంది. ఈ జాప్యాన్ని నివారించేందుకు, క్షతగాత్రులు శిథిలాల్లో ఎక్కడ చిక్కుకున్నారో కచ్చితత్వంతో గుర్తించేందుకు శాస్త్రవేత్తలు తాజాగా ఎలుకలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ పనిని శునకాలు సైతం చేస్తున్నప్పటికీ వాటితో పోలిస్తే ఎలుకలు ఎన్నో రెట్లు చిన్నగా ఉండటం, చిన్నచిన్న ఖాళీ ప్రదేశాల్లోకి అలవోకగా వెళ్లే సామర్థ్యం ఉండటంతో ఇందుకోసం వాటిని ఎంచుకున్నారన్నమాట. ట్రైనింగ్‌లో ‘ర్యాట్’దేలుతూ.. టాంజానియాలోని మొరోగొరోలో ఎలుకలకు శిక్షణ ఇచ్చే అపోపో అనే ఎన్జీవో సంస్థతో కలసి శాస్త్రవేత్తలు సుమారు ఏడాదిగా పనిచేస్తున్నారు. తమ పరిశోధనకు హీరో ర్యాట్స్ అనే పేరుపెట్టారు. ప్రస్తుతం ఖాళీ బ్యాక్పాక్లతో వాటిని ‘డమ్మీ శిథిలాల్లో’కి వదిలి అక్కడ బాధితులెవరైనా కనపడగానే ఒక బటన్ నొక్కేలా వాటికి శిక్షణ ఇస్తున్నారు. అలాగే ‘బీప్’శబ్దం వినపడగానే ఎలుకలు తిరిగి తమ వద్దకు వచ్చేలా నేర్పుతున్నారు. ఎలుకల వీపులపై అమర్చే సాంకేతిక పరికరాలతో కూడిన బ్యాక్‌ప్యాక్‌లను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఎలుకల బ్యాక్పాక్లలో సాంకేతిక పరికరాలను సిద్ధం చేశాక శిథిలాల్లోకి వెళ్లే ఎలుకలు ఎక్కడ ఉన్నాయో లొకేషన్ ట్రాకర్ల ద్వారా గుర్తిస్తామని... అప్పుడు ఎలుకల వద్ద ఉండే మైక్రోఫోన్ల ద్వారా క్షతగాత్రులతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న స్కాట్లాండ్లోని గ్లాస్గోకు చెందిన డాక్టర్ డోనా కీన్ చెప్పారు. ప్రస్తుతం ఏడు ఎలుకలకు శిక్షణ ఇచ్చామని... కేవలం రెండు వారాల్లోనే శిక్షణ వేగం పుంజుకుందని చెప్పారు. త్వరలోనే మొత్తంగా 170 ఎలుకలను భూకంపాలు ఎక్కువగా సంభవించే టర్కీకి తరలించనున్నారు. ఎలుకల సాయంతో భూకంప శిథిలాల్లో గాలింపు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అంగీకరించడం విశేషం. ఇదంతా బాగానే ఉంది కానీ... మనమంటే మానవత్వం కోసం తోటివారిని కాపాడాలనుకుంటాం... మరి ఎలుకలు ఎందుకు మనుషులకు సాయం చేస్తాయనే డౌట్ మీకు వచ్చిందా? దానికీ ఓ ఆన్సరుంది. ఇలా శిథిలాల్లోకి వెళ్లి చెప్పిన పని చేసొచ్చే ఎలుకలకు రుచికరమైన ఆహారాన్ని సిరంజీల ద్వారా లంచంగా ఇస్తున్నారట. దీంతో ఎలుకలు ఉత్సాహంగా పనిచేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ మరికొన్ని ప్రమాదకర టాస్కుల్లోనూ... ల్యాండ్మైన్ల వంటి పేలుడు పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంతోపాటు పశువులకు సోకే టీబీ, బ్రుసెల్లోసిస్ వంటి ప్రమాదకర రోగాలను కనిపెట్టడంలోనూ ఎలుకల సాయం తీసుకోవాలనుకుంటున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. పేలుడు పదార్థాల్లో ఉపయోగించే టీఎన్టీ (ట్రైనైట్రోటోల్యూని) లేదా టీబీ పాజిటివ్ నమూనాల వాసనలను ఎలుకలు పసిగట్టేలా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. శునకాలతో పోలిస్తే నామమాత్రమైన బరువుండే ఎలుకలు పేలుడు పదార్థాలపై కాలుమోపినా పేలుళ్లు జరగవని... అలాగే శునకాల తరహాలోనే వాటి గ్రాహణ శక్తి కూడా అమోఘమని పేర్కొన్నారు. -
కామారెడ్డి ఆస్పత్రి ఐసీయూలో ఎలుకలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుకలు తిరుగుతుండగా ఆదివారం కొందరు రోగులు గమనించి ఫొటోలు తీశారు. ఐసీయూతో పాటు ట్రామాకేర్ సెంటర్, అత్యవసర మందులుంచే చోట కూడా ఎలుకలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. గోడలు, ఆక్సిజన్ పైప్‌ల వద్దకే కాకుండా పడకలపైకి కూడా వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. దీనిపై కాగా, జిల్లా ఆస్పత్రి ఆర్ఎంవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ‘ఆస్పత్రిలోకి ఎలుకలు రాకుండా నెట్లు ఉన్నాయి. ఎలా వచ్చాయో తెలియదు. సోమవారం శానిటేషన్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. -
చెత్తా చెదారం.. ఎలుకల సంచారం
వరంగల్‌లో పేరొందిన మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వాసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న ఒక రోగిని ఇటీవల ఎలుకలు దారుణంగా కొరికి గాయపరిచిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సుమారు ఐదేళ్ల క్రితం ఉస్మానియా మార్చురీలో భద్రపరిచిన యువతి శవాన్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన ఘటన కూడా అప్పట్లో కలకలం రేపింది. మెదక్ ఆస్పత్రి మార్చురీలో కూడా మూడేళ్ల క్రితం ఓ మృతదేహాన్ని పందికొక్కులు పీక్కుతిన్నాయి. తాజాగా వరంగల్ ఘటనలో రోగి (కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఇతను తర్వాత హైదరాబాద్ నిమ్స్‌లో చనిపోయాడు) కాళ్ల నుంచి రక్తస్రావం అయ్యేలా ఎలుకలు కొరికేయడం.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల పరిస్థితి, నిర్వహణపై చర్చకు తెరతీసింది. ఐసీయూలోనే ఇలా ఉంటే సాధారణ వార్డులు, గదులు ఎలా ఉంటాయోనన్న సందేహాలకు తావిచ్చింది. దీంతో ‘సాక్షి’.. రాజధాని హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వాసుపత్రులతో పాటు పలు జిల్లా కేంద్రాల్లోని సర్కారు దవాఖానాలను సందర్శించి పరిస్థితులను పరిశీలించింది. సాక్షి, నెట్వర్క్/గాంధీ ఆస్పత్రి/నాంపల్లి /అఫ్జల్‌గంజ్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడింది. అపరి శుభ్ర వాతావరణం రాజ్య మేలుతోంది. ఎటు చూసినా చెత్తాచెదా రం, ప్లాస్టిక్ కవర్లు దర్శనమిచ్చాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ అపరిశుభ్ర వాతావరణం ఎలుక లు, పంది కొక్కులు ఆస్పత్రులను తమ ఆవాసాలు గా చేసుకునేందుకు దోహదపడుతోంది. మరోవైపు రోగులు, వారి సహాయకులు.. తినగా మిగిలిన ఆహారాన్ని, ఇతర తినుబండారాలను పడవేస్తున్నారు. ఈ ఆహార వ్యర్థాల కోసం ఎలుకలు, పంది కొక్కులు ఆసుపత్రుల ఆవరణలో, వార్డుల్లో స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆస్పత్రి ఆవరణను, వార్డులను శుభ్రంగా ఉంచాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో కుక్కలు, కోతులు, పాములు కూడా తిరుగుతున్నట్లు రోగులు, వారి సహాయకులు చెబుతున్నారు. ఇది మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి దుస్థితి. పాత ఐసీయూ వెనుక భాగంలో చెత్తా చెదారం పేరుకుపోయింది. పందులు, ఎలుకలకు ఆవాసంగా మారింది. నిర్లక్ష్యానికి కేరాఫ్ నిలోఫర్ నగరంలోని ప్రముఖ నవజాత శిశువుల సంరక్షణా కేంద్రమైన నిలోఫర్ ఆసుపత్రి అపరిశుభ్రతకు కేరాఫ్‌గా మారింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారంతో నిండిపోయింది. పాత, కొత్త, లోపల, బయట అనే తేడా లేకుండా ఆసుపత్రిలోని అన్నిచోట్లా అపరిశుభ్రత నెలకొంది. రోగులు, సహాయకులు పడేసే ఆహారం కోసం చుట్టుపక్కల ఉన్న బస్తీల నుంచి ఎలుకలు ఆసుపత్రి వైపు వస్తున్నాయి. డ్రైనేజీ మ్యాన్‌హోల్స్‌లో ఉంటూ రాత్రివేళ ఆస్పత్రిలో సంచరిస్తున్నాయి. గాంధీ సెల్లార్లో ఫుల్లు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సెల్లార్లో ఎలుకలు, పందికొక్కులు స్వైర విహారం చేస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేక అక్కడ మురుగునీరు చేరుతోంది. ప్రధాన భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గైనకాల జీ, లేబర్‌వార్డు, పీడియాట్రిక్, పీఐసీయూ, ఎస్ఎన్సీయూ తదితర వార్డుల్లో ఎలుకల సంచా రం తరచూ కనిపిస్తోందని పలువురు రోగులు తెలిపారు. 2015లో నవజాత శిశువులకు వైద్యం అందించే ఎస్ఎన్సీయూ వార్డులో ఎలుకలు కనిపించడంతో అప్పట్లో చర్యలు చేపట్టారు. తాజాగా వరంగల్ ఎంజీఎం ఘటనతో అప్రమత్తమైన గాంధీ ఆస్పత్రి అధికార యంత్రా ంగం ఎలుకల నివారణకు గుళి కల ప్రయోగం చేపట్టడంతో పాటు పలు వార్డుల్లో బోన్లు, ర్యాట్ ప్యాడ్లను ఏర్పాటు చేశారు. పందికొక్కులకు ‘చిరునామా’ జనగామ జిల్లా వందపడకల ఆస్పత్రి ఆవరణలో డ్రెయినేజీలను తోడేస్తున్నాయి. జనరేటర్ ఏర్పాటు చేసిన గది ఆవరణ, ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించే ల్యాబ్ ముందు భాగం, జనరల్ వార్డు వెనకాల పెద్ద పెద్ద కన్నాలు ఏర్పడ్డాయి. ఎలుకల కోసం పాములు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి భవనం ముందు భాగాన్ని ఇటీవల అం దంగా తీర్చిదిద్దారు. కానీ లోపల వార్డులు, ఆసుపత్రి పరిసరాలు మాత్రం అధ్వానంగా ఉన్నాయి. వెనుక భాగం చెత్తాచెదారం, చెట్ల పొదలతో నిండిపోయింది. గత ఏడాది డిసెంబర్ 21న రాత్రి సమయంలో పేషెంట్ కేర్‌టేకర్‌గా పనిచేసే వేముల సంపత్‌ను ఆసుపత్రి ప్రాంగణంలోనే పాము కాటేసింది. అంతకుముందు కూడా ఆసుపత్రిలో పనిచేసే మరొకరిని పాము కాటు వేసింది. వార్డుల్లో ఎలుకలు తిరుగుతుండడంతో వాటి కోసం పాములు వస్తున్నాయని చెబుతున్నారు. పాత భవనం కావడంతో వార్డుల్లో గోడలకు కన్నాలు ఉండడం, అం దులో ఎలుకలు, బొద్దింకలు చేరడంతో వాటి కోసం పాములు వస్తున్నాయి. వంద పడకల యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణ చుట్టూ పందికొక్కులు రంధ్రాలు చేశాయి. పగలు, రాత్రి తేడాలేకుండా సంచరిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రిలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆస్పత్రి మార్చురీలో 4 ఫ్రీజర్ బాక్స్‌లు ఉండగా అవి పనిచేయడం లేదు. దీంతో రెండు శవాలను కిందపడేశారు. వాటి ని పురుగులు, దోమలు, ఈగలు పీక్కు తింటుండటంతో గుర్తుపట్టలేని విధంగా తయారయ్యాయి. ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోంది. కాగా శానిటేషన్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఉస్మానియాలో కుక్కల వీరంగం పేదల పెద్దాసుపత్రి హైదరాబాద్‌లోని ఉస్మానియాలో కుక్కలు, కోతులు, పిల్లుల బెడద ఎక్కువగా ఉంది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్కలు వీరంగం సృష్టిస్తుంటే, కోతులు రోగులు వారి సహాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఆసుపత్రి నుండి రోగి కోలుకొని తిరిగి వెళ్లే సమయంలో కొబ్బరికాయలు కొడుతుండడంతో వాటి కోసం కోతులు ఎగబడుతున్నాయి. 2017లో ఆత్మహత్యకు పాల్పడిన అఫ్జల్‌సాగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన కుటుంబసభ్యులు.. ముక్కు, పెదవుల్ని ఎలుకలు, పందికొక్కులు కొరికిన స్థితిలో ఉన్న యువతి శవాన్ని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించింది. -
ఎలుకలు పట్టాలా.. వైద్యం చేయాలా
ఎంజీఎం: ‘ఎలుకలు పట్టమంటారా.. లేకపోతే రోగులకు చికిత్స చేయమంటారా. మేమే పనిచేయాలో చెప్పండి’.. అంటూ ఎంజీఎం వైద్యులు ఎలుకల బోన్లను పట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో వైద్యులపై చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజీడీఏ) ఆధ్వర్యంలో ఆస్పత్రి ప్రాంగణంలో వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ప్రాంగణంలో నల్లబ్యాడ్జీలు ప్రదర్శించి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగిని ఎలుకలు కొరికిన సంఘటనలో నిజమైన బాధ్యులను వదిలేసి వైద్యులను అభద్రతాభావానికి గురిచేసేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైద్యులపై చర్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీడీఏ అధ్యక్షుడు రాజ్‌మోహన్, కార్యదర్శి హరిదేవ్, వైద్యులు పవన్, చంద్రబాను, అన్వర్‌మియా పాల్గొన్నారు. -
ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్ కు కారణమైన ఎలుకలు
-
ఎలుకల నుంచే ఒమిక్రాన్!
Omicron Variant Updates In Telugu: ఒమిక్రాన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని మళ్లీ వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్. ఇప్పటికే ఉన్నవి చాలనట్టు ఈ కొత్త వేరియంట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందనే ఆందోళన అంతటా వ్యక్తమవుతోంది. దీనిపై శాస్త్రవేత్తలు ఇప్పటికే పరిశోధనలు మొదలుపెట్టారు. కరోనా రూపుమార్చుకుని (మ్యూటేషన్ చెంది) కొత్త వేరియంట్‌గా ఎలా మారిందన్నది పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎలుకల్లో కరోనా మ్యూటేట్ అయి ‘ఒమిక్రాన్’ పుట్టిందని అంచనా వేస్తున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ రోగ నిరోధక శక్తిని బట్టి.. సాధారణంగా వైరస్లు తమకు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకునేందుకు మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తి సరిగా లేనివారిలో, హెచ్ఐవీ బాధితుల్లో లేదా కరోనా ప్రభావానికి గురయ్యే జంతువుల్లో మ్యూటేషన్లకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొత్త వేరియంట్ పుడుతుంటాయి. ప్రస్తుతం వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా.. రోగ నిరోధక శక్తి దెబ్బతిన్న హెచ్ఐవీ రోగిలో మ్యూటేట్ అయి ఉంటుందని ఇప్పటికే కొందరు శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఈ వేరియంట్ ఎలుకల్లో పుట్టి.. ‘రివర్స్ జూనోసిస్’ పద్ధతిలో మనుషులకు సంక్రమించి ఉంటుందని మరికొందరు శాస్త్రవేత్తలు తాజాగా ప్రకటించారు. ‘ఒమిక్రాన్’లోని కొన్ని అసాధారణమైన మ్యూటేషన్లే దీనికి ఆధారమని తెలిపారు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు. అమెరికాకు చెందిన స్క్రిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ట్యూలేన్ యూనివర్సిటీ, అరిజోనా యూనివర్సిటీల శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. ఏమిటీ ‘రివర్స్ జూనోసిస్’? జంతువులు, పక్షుల్లో ఉండే కొన్నిరకాల వైరస్లు మనుషులకు కూడా సంక్రమిస్తుంటాయి. దీనిని ‘జూనోసిస్’ అంటారు. అలాంటి వైరస్లు కలుగజేసే వ్యాధులను ‘జూనోటిక్’ వ్యాధులు అంటారు. కరోనా వైరస్ కూడా ఇలా గబ్బిలాల నుంచి మనుషులకు సోకిన ‘జూనోసిస్’ వైరసే. జంతువుల నుంచి మనుషులకు సోకి రూపు మార్చుకున్న (మ్యూటేట్ అయిన) వైరస్లు.. తిరిగి ఇతర జంతువులకు సోకడాన్ని ‘రివర్స్ జూనోసిస్’ అంటారు. ఇలా మనుషుల నుంచి జంతువులకు సోకిన వైరస్లు.. ఆయా జంతువులకు తగ్గట్టు మళ్లీ మ్యూటేట్ అవుతాయి. ఇలా మార్పులు జరిగాక రెండోసారి సులువుగా మనుషులకు వ్యాపించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2020 మధ్యలోనే ఎలుకలకు వెళ్లి.. కరోనా తొలివేవ్ సమయంలోనే అంటే 2020 సంవత్సరం మధ్యలోనే ఆ వైరస్ ఎలుకలకు వ్యాపించి ఉంటుందని.. అప్పటి నుంచీ వివిధ మ్యూటేషన్లు జరిగాక ఇప్పుడు మనుషులకు వ్యాపించి ఉంటుందని స్క్రిప్స్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్త క్రిస్టియన్ అండర్సన్ తెలిపారు. ‘ఒమిక్రాన్’ వేరియంట్లో వచ్చిన మ్యూటేషన్లే దీనికి ఆధారమని వెల్లడించారు. ఒమిక్రాన్‌లో కనిపించిన మ్యూటేషన్లలో ఏడు మ్యూటేషన్లు ఆ వైరస్ ఎలుకలకు సంక్రమించడానికి వీలు కల్పించేవేనని.. ఆల్ఫా, బీటా, డెల్టా సహా ఇతర వేరియంట్లలో ఈ తరహా మ్యూటేషన్లు పెద్దగా కనిపించలేదని ట్యూలేన్ యూనివర్సిటీ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ రాబర్ట్ గారీ తెలిపారు. అంతేకాదు ఇతర వేరియంట్లు వేటిలోనూ లేని కొన్ని అసాధారణ మ్యూటేషన్లు కూడా.. ఈ కొత్త వేరియంట్‌పై అనుమానాలు రేకెత్తిస్తున్నాయని చెప్పారు. ఎందుకింత గందరగోళం? సాధారణంగా ఏ వైరస్ అయినా.. వ్యాపిస్తూ వెళ్లినకొద్దీ మ్యూటేట్ అవుతూ వస్తుంది. ప్రతి కొత్త వేరియంట్లో దానికన్నా ముందటి వేరియంట్‌కు సంబంధించిన మ్యూటేషన్లతోపాటు, కొత్త మ్యూటేషన్లు కూడా కనిపిస్తాయి. కానీ ‘ఒమిక్రాన్’లో ప్రస్తుతమున్న వేరియంట్లలోని మ్యూటేషన్లు లేవని.. అంతేగాకుండా ఒక్కసారిగా అతి ఎక్కువగా కొత్త మ్యూటేషన్లు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే కరోనా వ్యాప్తి మొదలైన కొత్తలోనే (ఆల్ఫా, బీటా, డెల్టా వేరియంట్లు పుట్టకముందే) విడివడిన ఒక వేరియంట్.. భారీగా మ్యూటేషన్లు జరిగాక తిరిగి వ్యాపించడం మొదలుపెట్టిందని అంటున్నారు. చదవండి: OCD Wife: నావల్లకాదు మహప్రభో.. దయచేసి విడాకులిప్పించండి!. చదవండి: Madhya Pradesh: ఎందు‘కని' పారేస్తున్నారు? -
ఈసారి కరోనా వస్తే ఎలుకల నుంచే!
రెండేళ్ల కింద మొదలైన కరోనా వైరస్ దాడి ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా ఒక్కటే కాదు.. దీనికి ముందు పంజా విసిరిన సార్స్, మెర్స్ వంటి వైరస్లు గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపించినట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. కానీ ఇక ముందు ఎలుకల నుంచి కూడా కరోనా వంటి వైరస్లు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ పరిశోధన ఏమిటి, ప్రమాదం ఏమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ గబ్బిలాల నుంచి వచ్చినట్టుగా.. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (సార్స్ కోవ్–2) వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు సోకినట్టు ఇప్పటికే గుర్తించారు. చైనాలో ఉండే హార్స్‌షూ రకం గబ్బిలాల్లో కరోనా వంటి వైరస్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని.. ఆ గబ్బిలాలు వైరస్‌ను తట్టుకుని సహజీవనం చేస్తున్నాయని తేల్చారు. ఈ నేపథ్యంలోనే మనుషులకు దగ్గరగా ఉండే మరేవైనా జంతువులు, పక్షుల్లో ఈ తరహా పరిస్థితులు ఉన్నాయా, వాటి నుంచి మనుషులకు వైరస్లు వ్యాపించే ప్రమాదం ఉందా అన్న దానిపై అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. జన్యుపరమైన పోలికలున్న జీవులతో.. మనుషులకు దగ్గరగా ఉండే కోతులు, చింపాంజీలతోపాటు ఇతర జంతువుల్లో.. కరోనా వంటి వైరస్ల ప్రభావానికి లోనయ్యే వాటిని శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకున్నారు. వాటి శరీరకణాల్లో ఏసీఈ–2 రిసెప్టార్ల (కరోనా వైరస్లు శరీర కణాలకు అతుక్కునేందుకు కారణమయ్యే ప్రోటీన్) తీరును పరిశీలించారు. ఆ జంతువులు కరోనాకు ఎంతగా ప్రభావితం అవుతున్నాయి? ఎలా ఎదుర్కొంటున్నాయి? లక్షణాలు ఎలా ఉంటున్నాయి? అన్నది క్షుణ్నంగా గమనించారు. మిగతా అన్ని జంతువుల్లో కరోనా లక్షణాలు కనిపిస్తూ, ఆ వైరస్‌తో పోరాడుతుంటే.. ఎలుకలు మాత్రం వైరస్‌ను తట్టుకుంటున్నట్టు గుర్తించారు. ఈ ఎలుకలు కరోనా వంటి వైరస్ల ప్రభావానికి లోనుకాకుండా వాటిలోని ఏసీఈ–2 రిసెప్టార్లు పరిణామం చెందినట్టు తేల్చారు. వైరస్‌లకు రిజర్వాయర్లుగా.. ఈ ఎలుకల ముందు తరాలు తరచూ కరోనా వంటి వైరస్ల దాడికి గురవడంతో.. వాటిని తట్టుకునేశక్తిని పెంచుకున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రాఫెసర్లు షీన్ కింగ్, మోనా సింగ్ వెల్లడించారు. అందువల్లే శరీరంలో వైరస్ పెద్ద సంఖ్యలో ఉన్నా కూడా.. ఆ ఎలుకల్లో ఎటువంటి లక్షణాలు, అనారోగ్యం కనిపించడం లేదని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎలుకలు సదరు వైరస్‌లకు నిలయం (రిజర్వాయర్లు)గా మారిపోతాయని.. భవిష్యత్తులో ఆ వైరస్లు మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. ఒక్క ఎలుకలనే కాకుండా.. మరికొన్ని రకాల జంతువులు, పక్షులు కూడా ఇలా పరిణామం చెంది ఉండవచ్చని.. అలాంటి వాటిని గుర్తిస్తే భవిష్యత్తులో ముందు జాగ్రత్తలకు వీలవుతుందని స్పష్టం చేశారు. జూనోటిక్ వ్యాధులే ఇలా.. సాధారణంగా జంతువులు, పక్షుల్లో ఉండే వైరస్లు.. ఇతర జంతువులు/పక్షులు, మనుషులకు వ్యాపించడం వల్ల వచ్చే వ్యాధులను జూనోటిక్ డిసీజెస్ అంటారు. ఈ వైరస్లు ఒకదాని నుంచి మరొకదానికి వ్యాపించే క్రమంలో.. కొన్నిరకాల జంతువులపై ఎక్కువగా, మరికొన్ని రకాలపై తక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఇది ఆయా జంతువుల్లో వైరస్ల పట్ల నిరోధకత, జన్యుపరిణామం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. ♦జంతువులు ఎక్కువకాలం ఏదైనా వైరస్/ఇతర సూక్ష్మజీవుల దాడికి గురవుతూ ఉంటే.. తమను రక్షించుకునేలా శరీరంలో మార్పులు చేసుకుంటుంటాయి. వాటి తర్వాతి తరంలో ఈ మార్పులు మరింతగా పెరుగుతాయి. అలా అలా సదరు వైరస్/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి పెరుగుతూ ఉంటుంది. ♦మనుషుల్లో కూడా ఇదే తరహాలో ఇప్పటికే ఎన్నో రకాల వైరస్లు/సూక్ష్మజీవులను తట్టుకునే శక్తి సమకూరింది. కరోనా వైరస్ దాడి ఇలాగే సాగితే.. భవిష్యత్తులో అది ఒక సాధారణ జలుబు స్థాయికి మారిపోతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. -
దాచుకున్న డబ్బును కొరికేసిన ఎలుకలు : మహబూబాబాద్
-
పాడు ఎలుకలు.. ఆపరేషన్ కోసం దాచుకున్న డబ్బును..
మహబూబాబాద్ రూరల్: అసలే నిరుపేద... ఆపై అనారోగ్యం.. ఆపరేషన్ నిమిత్తం రూ.రెండు లక్షలు అప్పు చేశాడు.. ఆ డబ్బుకు సంబంధించిన నోట్లను తన పూరి గుడిసెలో దాచుకోగా ఎలుకలు ముక్కలు ముక్కలుగా కొరికేశాయి. బాధితుడు లబోదిబోమంటూ బ్యాంకులను ఆశ్రయించగా అవి చెల్లవని చెప్పారు. దీంతో ఎవరైనా ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో శనివారం వెలుగుచూసింది. వివరాలు... మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన భూక్యా రెడ్యా తోపుడుబండిపై కూరగాయలు అమ్ముకుని జీవిస్తున్నాడు. తన కడుపులో ఏర్పడిన కణితిని ఆపరేషన్ చేసి తొలగించేందుకు రూ.2 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో తెలిసినవారి వద్ద అప్పు చేశాడు. వాటితోపాటు కూరగాయలు అమ్మగా వచ్చిన రూ.50 వేల నగదును ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇంట్లోని చెక్క బీరువాలో దాచాడు. రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో డబ్బును పరిశీలించేందుకు బీరువా తెరిచి చూడగా రూ.2 లక్షలకు సంబంధించిన నోట్లను ఎలుకలు పనికిరాకుండా కొరికేశాయి. ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. -
మద్యం దుకాణంలో ఎలుకల రచ్చ.. 12 వైన్ బాటిళ్లు తాగేశాయ్!
ఇంట్లో ఎలుకలు ప్రవేశించాయంటే అవి చేసే గోల అంతా ఇంతా కాదు.. వంటలు, బియ్యం.. ఇలా అన్నిట్లో నేనున్నానంటూ చేయి పెట్టి చిందర వందర చేస్తాయి. అంతేగాక ఎంతో ఇష్టంగా కొనుకున్న కొనుకున్న దుస్తులను సైతం దేనికి పనికిరాకుండా చింపి నాశనం చేస్తాయి. ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఒంటరిగా ఉండవు. తమతోపాటూ...పెద్ద ఫ్యామిలీని వెంట తెస్తాయి. వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం ఓ సవాలు లాంటిది. అప్పటి వరకు ప్రశాంతత ఉండదు. అయితే ఇటీవల ఎలుకల నోటికి కొత్త రుచి కావాల్సి వచ్చిందేమో. వైన్ షాప్‌లోకి దూరి ఏకంగా 12 వైన్ బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేశాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేశారు. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం వైన్ షాప్ తెరిచి చూసేసరికి 12 ఖాళీ వైన్ బాటిళ్లు ఒపెన్ చేసి ఉండటంతో తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది. ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి.. ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారు. లాక్డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయని, బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి అన్నారు. ఎలుకలు ఖాళీ చేసినవైన్ విలువ 1500 ఉంటుందని తెలిపారు. కేవలం వైన్ బాటిల్స్‌నే టార్గెట్ చేశాయని, బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు.. ఎలుకల్లో కూడా మందుబాబులు ఉన్నారని, ఏమాత్రం కిక్కుఏక్కిందో అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
వైరల్: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని..
మెల్బోర్న్ : ఎలుకల సమస్యతో ఆస్ట్రేలియా రైతులు అల్లాడిపోతున్నారు. చేతికందిన పంటల్ని నాశనం చేస్తున్న వాటిపై పీకల్లోతు కోపంతో ఉన్నారు. వాటి బెడదను తప్పించుకోవటానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఓ రైతు వాటిపై కోపం నశాలానికి అంటి దారుణానికి ఒడిగట్టాడు. వాటిని మంటల్లో పడేసి కాల్చాడు. వివరాలు.. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన ఆండ్రూ అనే రైతు పొలంలో ఎలుకల ఆగడాలు ఎక్కువయ్యాయి. వాటి వల్ల తరచూ పంట నష్టమవుతుండటంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో పొలంలో ఓ చోట ఓ పెద్ద ఇనుప డ్రమ్ము పెట్టి, దాంట్లో మంట పెట్టాడు. అనంతరం ధాన్యాన్ని సేకరించే మిషన్ మూతిని మంట దగ్గర ఉంచి ఆన్ చేశాడు. దీంతో అందులో ధాన్యం కోసం పాగా వేసిన వందలాది ఎలుకలు మంట్లో పడి ప్రాణాలు విడిచాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నాకు ఎలుకలంటే నచ్చదు.కానీ, వాటినలా చంపటం మంచి పద్ధతికాదు’’.. ‘‘వాటిని కాల్చేకంటే ప్రాణాలతో నీళ్లలో పడేసుంటే బాగుండు..’’.. ‘‘ నేను శాకాహారిని కాదు. కానీ, వాటిని కచ్చితంగా కాల్చకుండా ఉండాల్సిందని మాత్రం చెప్పగలను’’ అని కామెంట్లు చేశారు. ఆ కామెంట్లకు ఆండ్రూ రిప్లై ఇస్తూ.. ‘‘ సమస్య మీది కాదు కాబట్టి ఎన్నైనా చెబుతారు.. వాటిని కాల్చకుండా ఏం చేస్తే బాగుండేదో మీరే చెప్పండి’’ అంటూ మండిపడ్డాడు. చదవండి : వరదలో చిక్కిన మహిళ.. ప్రాణాలు అరచేతుల్లో పట్టుకుని.. -
ఆస్ట్రేలియాకు వింత సమస్య.. సాయం చేయనున్న భారత్
సిడ్నీ: ప్రపంచం మొత్తం కరోనాతో సతమతమవుతుంటే ఆస్ట్రేలియాకు మాత్రం అనుకోని సమస్య వచ్చిపడింది. ప్రస్తుతం అక్కడ ఎలుకలు పెద్ద సమస్యగా మారాయి. పెద్ద గుంపుగా ఏర్పడి పంట పొలాలపై దాడి చేస్తు సర్వనాశనం చేస్తున్నాయి. వివరాలు.. గత కొన్ని రోజులుగా న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలో ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పంట పొలాలను నాశనం చేయడమేగాక ఇళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఎక్కడ చూసిన ఎలుకలే దర్శనమిస్తుండడంతో ఏం చేయాలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్లేగు వ్యాది ప్రబలే అవకాశం కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఎలుకల సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ను సాయం కోరింది. భారత్‌లో ఎలుకల నివారణకు బ్రోమాడియోలోన్ అనే విషపదార్థాన్ని వాడేవారు. ప్రస్తుతం ఈ మందు భారత్‌లో నిషేధంలో ఉంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి దాదాపు 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కాగా న్యూ సౌత్‌వేల్స్ ప్రభుత్వం ఎలుకలను నివారించేందుకు రూ. 3,600 కోట్లు నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. భారత్ నుంచి బ్రోమాడియోలోన్ మందు రాగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతితో ఎలుకలను చంపేందుకు కార్యచరణ మొదలుపెట్టనున్నారు. చదవండి: మూసేసిన స్కూల్లో 215 మంది పిల్లల అస్థిపంజరాలు లభ్యం -
ప్రాణాలు తీసిన పుచ్చకాయ!
రామగుండం: ఎలుకలు కొరికిన పుచ్చకాయ తినడం ఆ కుటుంబం పాలిట శాపంగా మారింది. ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విసంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. విసంపేట గ్రామానికి చెందిన దారబోయిన కొమురయ్య, సారమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు.. వృద్ధాప్యం కారణంగా పెద్ద కొడుకు శ్రీశైలం, కోడలు గుణవతి వద్ద ఉంటున్నారు. శ్రీశైలం దంపతులకు ఇద్దరు కుమారులు శివానంద్ (12), శరణ్ (10) ఉన్నారు. గత సోమవారం గ్రామానికి వచ్చిన వ్యక్తి వద్ద పుచ్చకాయలు కొనుగోలు చేశారు. సాయంత్రం కుటుంబ సభ్యులంతా సగం పుచ్చకాయ తిన్నారు. మిగతా సగం ఇంట్లోని సెల్ఫ్‌లో ఉంచారు. అదేరోజు రాత్రి కొమురయ్య ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయని తవుడులో విషం కలిపి పెట్టాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు మిగతా సగం పుచ్చకాయ తినగా, కొమురయ్య మాత్రం తినలేదు. ఆ రోజు ఇంట్లో ఎల్లమ్మ పూజలు చేసుకోవడంతో మాంసాహారం తిన్నారు. కాగా, సాయంత్రం నుంచి పుచ్చకాయ తిన్న వారికి మాత్రమే వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యారు. తొలుత మాంసాహారంతోనే అస్వస్థతకు గురైనట్లు భావించి స్థానికంగా ఆర్ఎంపీ వద్ద చికిత్స చేయించుకున్నారు. ఎల్లమ్మ పూజల నేపథ్యంలో శ్రీశైలం కుటుంబంతోపాటు అతని సోదరులు కనకరాజు, ప్రభాకర్ కుటుంబాలు సైతం భోజనం చేశాయి. వారికి ఎలాంటి అస్వస్థత లేకపోగా, శ్రీశైలం తండ్రి కొమురయ్య సైతం ఆరోగ్యంగా ఉండడంతో, పుచ్చకాయతోనే అనారోగ్యం బారిన పగినట్లు గుర్తించారు. విషం తిన్న ఎలుకలు పుచ్చకాయను కొరకవడంతో అది విషపూరితమైనట్లు భావిస్తున్నారు. అస్వస్థతకు గురైనవారి పరిస్థితి క్షీణిస్తుండడంతో గురువారం ఉదయం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో శివానంద్, శరణ్‌లను చేర్పించారు. శ్రీశైలం, గుణవతి మరో ఆస్పత్రిలో చేరారు. చిన్నారుల పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి శివానంద్, శుక్రవారం వేకువజామున శరణ్ మృతిచెందారు. శ్రీశైలం, గుణవతిలకు శ్వాస సంబంధ సమస్య తీవ్రం కావడంతో బంధువులు వారిని హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు చెప్పారని బంధువులు తెలిపారు. శ్రీశైలం తల్లి సారమ్మ సైతం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆమె ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని తెలిసింది. -
ప్రేమ ఎందుకు పుడుతుందో తెలుసా?
ఏదో సినిమాలో ప్రేమ ఎందుకు విఫలమైందంటే వంద కారణాలు చెప్పవచ్చు, కానీ ఎందుకు పుట్టిందంటే కారణం చెప్పలేము. నిజమే.. జీవుల్లో సుదీర్ఘకాల ప్రేమ ఫలానా కారణం వల్ల పుడుతుందని చెప్పలేం. అసలింతకీ ప్రేమంటే? డిక్షనరీ చూస్తే ‘‘లోతైన ఆప్యాయత యొక్క తీవ్రమైన భావన’’అని ఉంటుంది. ప్రేమికులేమో ఒకరికోసం ఒకరు అనే ఫీలింగే ప్రేమంటారు. పెద్దవాళ్లేమో జీవితాంతం కలిసుండాలని భావించే ఇద్దరి మధ్య ఏర్పడే బంధం అంటారు. ఆక్సిటోసిన్ సహా పలు హార్మోన్ల విడుదలతో పాటు మెదడులో పలు రసాయన చర్యల ఫలితమే ప్రేమని సైన్సు చెబుతోంది. భగ్న ప్రేమికులేమో అంతా ట్రాష్ అంటారు. ఇందులో ఏది నిజమంటే అన్నీ నిజమనే అనుకోవచ్చు. ప్రేమ ఒక సార్వజనీన భావన. కేవలం మనుషుల్లో మాత్రమే లాంగ్‌టర్మ్ రిలేషన్‌కు కారణమయ్యే ప్రేమ ఉంటుందనుకుంటే పొరపాటే! పలు ఇతర క్షీరదాల్లో, ఉదాహరణకు గబ్బిలాలు, తొడేళ్లు, బీవర్లు, నక్కలు, ముంగీసలు, లెమూర్లలాంటివాటిల్లో సైతం ఈ దీర్ఘకాలిక కలిసుండే ప్రేమ భావన కనిపిస్తుంది. మరి అన్ని ప్రేమలూ ఒకటేనా అంటే సైన్సు కాదంటుంది. జంతువును బట్టి మెదడులో ప్రేమ కారక బ్రెయిన్ సర్క్యూట్లు మారతాయని శాస్త్ర విజ్ఞానం తేల్చిచెబుతోంది. ముంగీసల్లో జీవితంలో మూడింట ఒక భాగం ఏక భాగస్వామితో కలిసి జీవించడం కనిపిస్తే, లెమూర్లలాంటి వాటిలో దీర్ఘకాలిక ప్రేమ కాస్త స్వల్పకాలికంగా మారుతుంటుంది. ఎలుకలు చెప్పాయి క్షీరదాల్లోని 6500 జాతుల్లో(స్పీసిస్) కేవలం 3–5 శాతం జాతుల్లోనే ఈ దీర్ఘకాలిక ప్రేమ భావన(మోనోగమస్) కనిపిస్తుంది. 90 శాతం పక్షుల్లో జీవిత భాగస్వామి పట్ల విశ్వాసం చూపడం కనిపిస్తుంది. ఎందుకు జీవుల్లో ఈ బేధం అన్న విషయమై డ్యూక్ యూనివర్సిటీ పరిశోధనలు చేసింది. దాదాపు 30సంవత్సరాల పాటు ప్రేమ ఫార్ములా కనుక్కోవడంపై జరిపిన పరిశోధనల్లో రెండు హార్మోన్లు కీలకమని తేలింది. ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే హార్మోన్లు ఎక్కువ చురుగ్గా ఉండే జీవుల్లో మోనోగమీ (దీర్ఘకాలిక ప్రేమ) నమోదయింది. దీంతో కేవలం హార్మోన్ల ప్రభావమే ప్రేమకు కారణమని సైంటిస్టులు తొందరపాటు నిర్ధారణకు వచ్చారు. ఎలుకలపై జరిపిన పరిశోధనలను తిరిగి లెమూర్లపై జరిపితే ఈ హార్మోన్లు అన్ని రకాల లెమూర్లపై(మోనోగమీ, పాలీగమీ జరిపేవి) ఒకే ప్రభావం చూపుతున్నట్లు నమోదయింది. దీంతో తిరిగి ప్రేమ ఫార్ములా రూపొందించే పని మొదటికొచ్చింది. పైన చెప్పిన హార్మోన్లు మరో జీవిపై ఆకర్షణను పెంచే లవ్టానిక్లాగా పనిచేయవచ్చు కానీ, కేవలం వాటివల్లే ప్రేమ పుడుతుందనలేమంటూ విసిగిపోయిన సైంటిస్టులు ప్రస్తుతానికైతే ప్రేమ ఎందుకు పుడుతుందో చెప్పలేమని చేతులెత్తారు. కానీ ఎప్పటికైనా దీన్ని కనిపెట్టితీరతామంటున్నారు. సో.. ఇప్పటికైతే ప్రేమకు ఎలాంటి ఫార్ములా లేదనేదే ఖాయం. -
అయ్యలారా అమ్మలారా ఒక్కసారి ఇటు వచ్చిపోండి!
ఇప్పుడొస్తున్న కొత్త ట్రెండ్ యానిమల్ స్కానర్స్. మాదక ద్రవ్యాలు, పేలుడు పదార్థాలను పసిగట్టడంలో శునకాల ప్రతిభ మనకు తెలియందేమీ కాదు. ఆ తరువాత వాటి నైపుణ్యం మలేరియా, క్యాన్సర్, పార్కిన్సన్స్ను గుర్తించే వరకు విస్తరించింది. తాజా కబురు ఏమిటంటే శిక్షణ పొందిన శునకరాజాలు కరోనా వైరస్‌ను గుర్తిస్తున్నాయి. పసిగట్టడంలో కచ్చితత్వం 92 నుంచి 99 శాతం వరకు ఉంటుందట. పొంచి ఉన్న కరోనా వైరస్‌ను పసిగట్టడానికి చిలీ, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్ విమానాశ్రయాల్లో శునకాలను మోహరిస్తున్నారు. మరోవైపు చూస్తే... క్యాన్సర్ సెల్స్‌ను పావురాలు చక్కగా గుర్తించగలుగుతున్నాయని ‘సైంటిఫిక్ అమెరికన్’ తెలియజేసింది. అమెరికా సైంటిస్టులు బర్డ్‌ఫ్లూను గుర్తించడంలో ఎలుకలకు శిక్షణ ఇస్తే శబ్భాష్ అనిపించుకున్నాయట! -
ముంచుతున్న మూషికం!
రెండో పంటకు నీరివ్వడం.. తెగుళ్ల బెడద తక్కువగా ఉండడంతో రబీలో దిగుబడి ఆశాజనకంగా ఉంటుందని రైతులు నమ్మకంతో ఉన్నారు. కానీ వారి ఆశలపై మూషికాలు నీళ్లు చల్లుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో పంటలపై ఎక్కువగా దాడి చేసే ఎలుకలు రబీలో కూడా విజృంభిస్తున్నాయి. ఏపుగా పెరిగిన అపరాలతో పాటు వరిపంటను కూడా దెబ్బతీస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను ఎలుకల నుంచి కాపాడుకునేందుకు అన్నదాతలు నానాతంటాలు పడుతున్నారు. సాక్షి, మచిలీపట్నం: ఖరీఫ్‌లోనే కాదు.. రబీలో కూడా మూషికాలు అన్నదాతలను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి రబీలో తెగుళ్ల బెడద పెద్దగా లేకున్నప్పటికీ ఎలుకల బెడద మాత్రం చాలా ఎక్కువగా ఉంది. జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 5,01,481 ఎకరాలు కాగా, దాంట్లో ఇప్పటివరకు 4,77,959 ఎకరాల్లో పంటలు పడ్డాయి. బోర్ల కింద ఈసారి 63,450 ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా, ఈసారి రెండో పంటకు నీరివ్వడంతో కనీసం లక్షన్నరవేల ఎకరాలకు పైగా సాగవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 90వేల ఎకరాల్లో రెండో పంట సాగైంది. ఇక మిగిలిన పంటల విషయానికి వస్తే 38,318 ఎకరాల్లో మొక్కజొన్న, 6,593 ఎకరాల్లో శనగలు, 12,645 ఎకరాల్లో పెసలు, 3,10,528 ఎకరాల్లో మినుములు సాగయ్యాయి. రబీలో వరితో పాటు మినుము, పెసలు, శనగలు, మొక్కజొన్న పంటలపై ఎలుకల ప్రభావం ఎక్కువగా ఉంది. తినేది తక్కువే అయినా.. ఎలుకలు తినేది తక్కువ.. నష్టం చేసేది ఎక్కువ. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పంటలను నాశనం చేసే ఎలుకలు ఈసారి రబీలో కూడా తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. అపరాలు, వరికి ఎలుకలు చేసే నష్టం అపారంగా ఉంటోంది. ఊడ్పులు, పిలకలు, పొట్ట దశలో పంటను కోసుకుంటూ పోతున్నాయి. తద్వారా ఎకరాకు 3 నుంచి 4 బస్తాల దిగుబడిపై ప్రభావం చూపుతోంది. ఎలుకల దాడి నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు. బందరు, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి, మొవ్వ, నాగాయలంక, చల్లపల్లి, ఘంటసాల, పామర్రు గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, కైకలూరు, నాగాయలంక తదితర పాంతాల్లో ఎలుకుల బెడద ఎక్కువగానే కనిపిస్తుంది. ఎకరాకు రెండున్నరవేలకు పైగా భారం ఎలుకల నిర్మూలనకు రైతులు సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నారు. బొరియల్లో పొగబెట్టడం, బుట్టలు వాడటం, పురుగు మందులు వినియోగించడం ద్వారా నివారణా చర్యలు చేపడుతున్నారు. కొన్నిచోట్ల ఎలుకులను పట్టే వారికి రప్పించి వాటిని మట్టుబెట్టేందుకు యత్నిస్తున్నారు. ఒక్కో దానికి రూ.15ల నుంచి రూ.20లు, కళ్లుతెరవని పిల్లలైతే మూడింటికి రూ.20లు చొప్పున తీసుకుంటున్నారు. ఎలుకల ఉధృతిని బట్టి పూత దశ నుంచి కాయ దశ వరకు రెండు నుంచి నాలుగుసార్లు ఎలుకలు బుట్టలు పెట్టాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. దుబ్బులను కొరికివేయడంతో పంటకు నష్టం వాటిల్లి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఎలుకల నిర్మూలనకు ఎకరాకు సుమారు రూ.రెండున్నర వేలకు పైగా రైతులపై ఆర్థిక భారం పడుతోంది. నివారణ ఇలా.. బ్రోమో డయోలిన్ను 0.25 శాతం పొడి మందును ఎర పదార్థాలతో కలిపి పేపరుతో 10 గ్రాముల పొట్లాలుగా కట్టి ఎలుకుల కన్నాల్లో వేయాలి. దీన్ని తింటే నాలుగు రోజుల తర్వాత ఎలుక చని పోతుంది. బ్రోమోడయోలిన్ మందును ప్రభుత్వం అందిస్తుంది. దానిలో కలిపేందుకు అవసరమ య్యే నూకలు, ఆయిల్‌ను పంచాయతీ అధికారులు సమకూర్చుతున్నారు. ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఎలుకల సమస్య నుంచి బయటపడాలని అధికారులు సూచిస్తు న్నారు. రైతులు సామూహికంగా ఎలుకల నివారణను చేపడితే పూర్తిస్థాయిలో వాటి సమస్యను పరిష్కరించవచ్చు. దీనిపై పొలంబడి, ఇతర కార్యక్రమాల ద్వారా అన్నదాతలకు వ్యవసాయశాఖాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. -
మార్చురీలో ఎలుకలపై విచారణ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహం కనుగుడ్లు, కనురెప్పలను ఎలుకలు తినివేసిన సంఘటనపై ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం ఏలూరు జిల్లా ఆసుపత్రిలో వైద్యవిధాన పరిషత్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ వాణి, ఏపీ మెడికల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు విచారణ చేశారు. మార్చురీ, ఆస్పత్రి ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.శంకరరావు, డీఎంహెచ్ఓ బి.సుబ్రహ్మణ్యేశ్వరి, ఆ సుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏఎస్ రామ్‌తో కలిసి పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రి మార్చురీ నిర్వహణ ఎలా ఉందో స్వయంగా తనిఖీ చేశారు. మార్చురీలోని ఫ్రీజర్ బాక్సులను, సౌకర్యాలను గమనించారు. ఫ్రీజర్ బాక్సులకు రంధ్రాలు ఉండటాన్ని చూసి రీజనల్ డైరెక్టర్ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలుకలు ఎందుకు వెళ్లకుండా ఉంటాయంటూ వైద్యాధికారులను ప్రశ్నించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలాగంటూ అధికారులు, సిబ్బంది తీరుపై మండిపడ్డారు. ఫ్రీజర్ బాక్సులకు మరమ్మతులు ఆసుపత్రి ప్రాంగణంలోని రెండు మార్చురీ గదులను పరిశీలించామని, ఒక గదిలో సరిగా సౌకర్యాలు లేకపోవటంతో దానిని సీజ్ చేయాలని ఆదేశించినట్టు ఆర్డీ వాణి తెలిపారు. ఫ్రీజర్ బాక్సులకు మరమ్మతులు చేయించాలని ఆదేశించామని, ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపడతామన్నారు. ఆసుపత్రి పారిశుధ్య విభాగానికి సంబంధించి ఫెస్ట్ కంట్రోల్ కాంట్రాక్ట్ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, ఆ సంస్థ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు. ఏపీ మెడికల్ కౌన్సిల్ బోర్డు మెంబర్ డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు మాట్లాడుతూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారని, పూర్తి జాగ్రత్త తో చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. డీసీహెచ్ఎస్ డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ ఏలూరు జిల్లా ఆసుపత్రిలో ఈగల్ హంటర్ అనే సంస్థకు ఫెస్ట్ కంట్రోల్ బాధ్యతలు అప్పగించామన్నారు. ఎలుకలు, పాములు, పందులు, కుక్కలు, క్రిమికీటకాలు లేకుండా ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచటమే వారి బాధ్యత అన్నారు. ఈ ఫెస్ట్ కంట్రోల్ సంస్థకు నెలకు రూ.40 వేలు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. సంస్థ ఇద్దరు సిబ్బందిని నియమించి, రాత్రి, పగలు పనిచేసేలా చూస్తారని తెలిపారు. ఆ రోజు రాత్రి విధులు నిర్వర్తించిన వెంకటేశ్వరరావును బాధ్యతల నుంచి తొలగించామని, వేరే సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. రెడ్‌క్రాస్ ౖచైర్మన్ జయప్రకాష్, ఆర్ఎంవో తవ్వా రామ్మోహనరావు, క్వాలిటీ మేనేజర్ మనోజ్ తదితరులు ఉన్నారు. -
అన్ని ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు!
వాషింగ్టన్: అన్ని రకాల ఫ్లూ వైరస్‌లను నిరోధించేందుకు అమెరికా శాస్త్రవేత్తలు కొత్త యాంటీ బయాటిక్‌ను కనుగొన్నారు. దాని పేరు 1జీ01. 2017లో ఫ్లూ జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఒక రోగి శరీరంలో దీనిని గుర్తించారు. ఎలుకలపై పరిశోధనలు నిర్వహించగా ఈ యాంటీ బయాటిక్ మనుషుల్లో సోకే ఫ్లూ వైరస్లు సహా 12 రకాల వైరస్‌లను నిరోధించింది. మొదట ఎలుకలకు ఫ్లూ వైరస్లు ఎక్కించి 3 రోజుల తర్వాత యాంటీ బయాటిక్ ఇవ్వగా అది సమర్థంగా పని చేసింది. తాజా పరిశోధనల దృష్ట్యా భవిష్యత్తులో అన్ని రకాల ఫ్లూ వైరస్‌లకు ఒకే మందు తయారు చేస్తామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. -
ఎలుకలు తెచ్చిన ఉపద్రవం!
చిత్తూరు, గుడుపల్లె : కరెంటు షాక్‌కు గురై యువతి మృతి చెందిన సంఘటన గురువారం సాయంత్రం మండలంలోని అగరం జ్యోగిండ్లులో చోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన సరోజ(19) కరెంటు స్తంభానికి కట్టిన కమ్మీలపై దుస్తులు ఆరవేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై పడిపోయింది. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఎలుకలే ఆమె మృతికి కారణమయ్యాయని పరిశీలనతో తేలింది. అసలేం జరిగిందంటే..కరెంటు స్తంభానికి అమర్చిన స్విచ్ బాక్సులోని తీగలను ఎలుకలు ఇష్టానుసారంగా కొరికివేశాయి. దీంతో ఆ స్తంభానికి కరెంటు సరఫరా అవుతున్నా ఎవరూ గుర్తించలేదు. ఈ నేపథ్యంలో ఉతికిన దుస్తులు అక్కడి కమ్మీపై సరోజ ఆరవేస్తున్న సమయంలో స్తంభం నుంచి కమ్మీలోకి సైతం కరెంటు సరఫరా కావడంతో షాక్ కొట్టి, మృత్యువాత పడింది. -
పైలెట్ వాటర్ స్కీమ్‌లో ఎలుకలు
సాలూరు: పట్టణంలోని బంగారమ్మపేట దళితవాడలో గల పైలెట్ వాటర్ స్కీమ్‌లో చచ్చిన ఎలుకలు పడిఉండడం స్థానికంగా కలకలం సృష్టించింది. మూడు రోజుల కిందటే మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురాగా... సోమవారం నాడు వాటర్ ట్యాంకులో చచ్చిపడివున్న ఎలుకలు కనిపించడంతో ఆ ప్రాంతవాసులు అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే.. మూడు రోజుల కిందటే మున్సిపాలిటీ సిబ్బంది వాటర్ స్కీమ్‌కు మరమ్మతులు చేపట్టి నీటి అవసరాలు తీర్చారు. అయితే పైపుల నుంచి చిన్నపాటి ధారగా నీరు వస్తుండడంతో ఏదైనా అడ్డు పడి ఉంటుందని భావించిన మహిళలు స్థానికులకు తెలియజేశారు. దీంతో స్థానిక యువత ట్యాంక్ లోపలికి తొంగి చూసి అవాక్కయ్యారు. లోపల చచ్చిన ఎలుకలు కనిపించడంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోయారు. మూడు రోజులుగా పైపుల నుంచి చిన్నధారే వస్తోందని... అంటే ఎలుకలు చనిపోయి మూడు రోజులై ఉంటుందని అభిప్రాయపడ్డారు. మూడు రోజులుగా కలుషిత నీరే వినియోగిస్తుండడంతో ఎటువంటి రోగాలు ప్రబలుతాయోనని గగ్గోలు పెడుతున్నారు. ఇదిలాఉంటే కొంతకాలంగా ట్యాంక్‌కు పైకప్పు లేకపోవడంతో పాటు మీద చెట్ల కొమ్మలు వేలాడడంతో వాటిపైనుంచి ఎలుకలు జారిపడి ఉండొచ్చని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని బ్లీచింగ్ వేసి ట్యాంక్‌ను శుభ్రం చేశారు. మూడు రోజుల పాటు నీటిని వినియోగించవద్దని సూచించారు. భయమేస్తోంది... కలుషిత నీటిని మూడు రోజుల పాటు వినియోగించాం. ఎటువంటి అంటురోగాలు ప్రబలుతాయోనని భయంగా ఉంది. ఎలుకలు చనిపోవడంతో నీరు బాగా పాడైపోయింది. అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు ట్యాంకులు శుభ్రం చేస్తే ఇటువంటి సమస్యలు తలెత్తవు.– వరమ్మ, బంగారమ్మపేట -
నిమ్స్ ఈఎండీలో ఎలుకల దండయాత్ర
సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్‌లో ప్రాణాపాయస్థితిలో ఉన్న రోగులు చికిత్స పొందే అత్యవసర విభాగం (ఈఎండీ)లో విచ్చలవిడిగా ఎలుకలు తిరుగుతున్నాయి. ఆక్సిజన్ పైప్లైన్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. రోగులకు సంబంధించిన కీలక కేస్‌షీట్లు, మెడికల్ రిపోర్టులను పాడు చేస్తున్నాయి. రోగుల మధ్యే తిరుగుతున్న ఎలుకలు, బొద్దింకలు, ఇతర కీటకాలను ఎప్పటికప్పుడు నిర్మూలించాల్సిన పారిశుద్ధ్య విభాగం అసలు ఈ విషయాన్ని పట్టించుకోక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నల్లులు, ఎలుకలపై ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిమ్స్ అత్యవసర విభాగంలో నిత్యం వంద మందికిపైగా చికిత్స పొందుతుంటారు. సాధారణ వార్డులతో పోలిస్తే అత్యవసర విభాగం(ఈఎండీ) కొంత భిన్నమైంది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో రోగులను మినహా ఇతరులెవరినీ లోనికి అనుమతించరు. నిమ్స్‌లోనూ ఆంక్షలు ఉన్నప్పటికీ..రద్దీ ఎక్కువగానే ఉంటుంది. నిత్యం రోగులు, వారి బంధువులతో రద్దీగా ఉంటే అత్యవసర విభాగంలోనూ ఎలుకలు సంచరిస్తుండటం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసే వెంటిలేటర్లు, ఆక్సిజన్ పైపులపై తిరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. అంతర్గత ఇన్ఫెక్షన్కు ఇదే కారణం ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, పెస్ట్ కంట్రోల్ పనుల కోసం నెలకు రూ.రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఎలుకలు, పరుపుల కింద నల్లులు, గోడలపై బల్లులు, బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరిస్తూనే ఉన్నాయి. బ్యాక్టీరియా, వైరస్లు వ్యాపించి అంతర్గత ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయి. ఫలితంగా వారం రోజుల్లో కోలుకోవాల్సిన రోగులు పదిహేను రోజుల వరకు ఆస్పత్రిలోనే మగ్గాల్సి వస్తుంది. అంతర్గత ఇన్ఫెక్షన్ల బారి నుంచి బయటపడేందుకు ఖరీదైన యాంటీబయాటిక్స్ మందులను వాడాల్సిన దుస్థితి నెలకొంది. -
‘మాకేం తెలీదు.. ఎలుకలే తాగాయి’
లక్నో : అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి స్టోర్ రూమ్‌లో భద్రపరిచారు పోలీసులు. కొన్ని రోజుల తర్వాత చూడగా ఖాళీ బాటిల్లు పోలీసులను వెక్కిరిస్తూ కనిపించాయి. స్టోర్ రూమ్‌లో భద్రపరిచిన మద్యం మాయమవడం కంటే.. దానికి పోలీసులు చెప్పిన కారణం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. స్టోర్ రూమ్‌లో దాచిన మద్యాన్ని ఎలుకలు తాగాయంటున్నారు పోలీసులు. అది కూడా దాదాపు 1000 లీటర్ల మద్యాన్ని. మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం అంటూ తేల్చారు పోలీసులు. బరేలీ కంటోన్మేంట్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఈ సంఘటన. వివరాలు.. పిచ్చికుక్క ఒకటి పోలీస్ స్టేషన్ స్టోర్ రూమ్‌లో దూరింది. బయటకు వచ్చే దారిలేక అక్కడే మరణించింది. కొన్ని రోజుల తర్వాత స్టోర్ రూమ్ నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో స్టోర్ రూమ్‌ని తెరిచారు. ఆ సమయంలో సీజ్ చేసి అక్కడ భద్రపరిచిన అక్రమ మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. ఆ పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. దాంతో ఎలుకలే మద్యం తాగాయని తేల్చారు పోలీసులు. ఈ విషయం గురించి పోలీస్ స్టేషన్ హెడ్ క్లర్క్ నరేష్ పాల్ మాట్లాడుతూ.. ‘నేను తలుపులు ఓపెన్ చేసినప్పుడు అక్కడ కొన్ని మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించాయి. వాటి పక్కనే కొన్ని ఎలుకలు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది ఎలుకల పనే’ అన్నారు. అయితే పోలీసులు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేకపోవడానికి కారణం మాయమయ్యింది లీటరో.. రెండు లీటర్లో కాదు ఏకంగా వెయ్యి లీటర్ల మద్యం. దాంతో డిపార్ట్మెంట్లోని వారే మద్యం బాటిళ్లను స్వాహా చేసి ఎలుకల మీద తోస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం గురించి ఓ రిటైర్డ్ జువాలజీ ప్రొఫేసర్ మాట్లాడుతూ.. నీరు దొరకనప్పుడు ఎలుకలు మద్యాన్ని తాగుతాయి. అయితే పోలీసులు చెప్పినంత భారీ మొత్తంలో మాత్రం తాగలేవు అన్నారు. గతంలో బిహార్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. పోలీసులు సీజ్ చేసిన అక్రమ మద్యం మాయమయ్యింది. అప్పుడు బిహార్ పోలీసులు కూడా ఎలుకలే మద్యం తాగాయని ఆరోపించారు. -
అమ్మో..ఎలుకలు!
దివిసీమలో ఎలుకలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కష్టపడి పెంచుకున్న పంట మూషికపరం కావడంతో రైతులకు దిక్కుతోచడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంటను నాశనం చేస్తున్న ఎలుకల నివారణకు బుట్టలు, మందులు పెట్టినా ప్రయోజనం లేదని కొందరు రైతులుఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా, అవనిగడ్డ : దివిసీమలో ఈ ఏడాది 97 వేల ఎకరా ల్లో రైతులు వరి సాగు చేశారు. ఘంటసాల, చల్లç ³ల్లి, మోపిదేవి మండలాల్లో ముందుగా సాగు చేసిన వరి పంట ఈనెక, పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆలస్యంగా సాగు చేసిన అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాల్లో పిలక, చిరు పొట్ట దశలో ఉంది. చిరుపొట్ట, ఈనెక దశలో ఉన్న పొలాలకు ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. వర్షాలు లేకపోవడం, సాగు నీరు తక్కువుగా అందడం వల్ల ఎలుకలు పెరిగిపోయాయి. కొన్నిచోట్ల నాలుగు రోజులకొకసారి ఎలుకల నివారణకు బుట్టలు పెడుతున్నా వాటి బెడద తగ్గడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ.7 వేల వరకు ఖర్చు.. అవనిగడ్డ మండలం బందలాయిచెరువు, అశ్వరా వుపాలెం, మోదుమూడి, వేకనూరు, కోడూరు మండలం వి కొత్తపాలెం, విశ్వనాధపల్లి, పిట్ట ల్లంక, సాలెంపాలెం, మాచవరం, నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం, నంగేగడ్డ, మర్రి పాలెం, ఏటిమొగ ప్రాంతాల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో రెండు రోజులకొకసారి ఎలుకల నివారణకు మందులు, బుట్టలు పెడుతున్నారు. బుట్టలు పెడితే ఒక్కో ఎలుకకు రూ.20 తీసుకుంటున్నారు. ఎలుకల నివారణకు ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.7 వేలు ఖర్చు చేసినట్టు రైతులు చెప్పారు. కొట్టేసిన వరి దుబ్బులను కూలీలతో ఏరించేందుకు ఎకరాకు రూ.2 వేల వరకూ ఖర్చులు అవుతున్నాయని తెలిపారు. సామూహిక నివారణకు చర్యలేవీ.. ఎలుకల నివారణకు బుట్టలు పెట్టించడం, ఒకరిద్దరు రైతులు మందు పెట్టినా ప్రయోజనం ఉండటం లేదు. సామూహిక ఎలుకల నివారణ చర్యలు చేపడితేనే వాటి నివారణ సాధ్యమవుతుందని రైతులంటున్నారు. వ్యవసాయ శాఖాధికారులు సామూహిక ఎలుకల నివారణకు చర్యలు చేపట్టాలని వారుకోరుతున్నారు. రూ.17వేల ఖర్చయింది ఈ ఏడాది ఎలుకల బెడద ఎక్కువగానే ఉంది. నారుమళ్ళు పోసిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ ఎనిమిది సార్లు ఎలుకల బుట్టలు పెట్టించాను. మూడెకరాలకు రూ.17 వేలు ఖర్చులు అయ్యాయి. ఎలుకలు కొట్టిన వరి దుబ్బులను కూలీలతో ఏరిస్తున్నాను. సామూహిక ఎలుకల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.– గాజుల రాంబాబు (రాముడు), రైతు, బందలాయిచెరువు -
డ్యాన్స్ మాస్టర్ దారుణ హత్య
సాక్షి, నాయుడుపేట టౌన్: డ్యాన్స్ మాస్టర్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది. అయితే మృతదేహాన్ని భద్రపరచడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పోస్టుమార్టం గదిలో శవపేటిక మూతను మూయకపోవడంతో ఎలుకలు అతడి ముఖాన్ని కొరికేశాయి. దీంతో అతడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు, కుటుంబసభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని సంజయ్‌గాంధీ కాలనీలో నివాసముంటున్న జెడ శ్రీనివాసులు (31) డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేస్తూ జీవన సాగిస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున అతను పాత రెవెన్యూ కార్యాలయం సమీపంలో అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులను స్థానిక ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మృతి చెందాడు. అందరితో సఖ్యతగా ఉండే తన కుమారుడు శ్రీనివాసులును దారుణంగా కొట్టి చంపేశారని మృతుడి తల్లి భాగ్యమ్మ చెబుతోంది. పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో గుర్తు తెలియని వ్యక్తులు శ్రీనివాసులుపై మూకుమ్మడి దాడి చేసినట్లు అక్కడి ఆనవాళ్లను బట్టి గుర్తించారు. మృతుడి బూట్లు తలో దిక్కు పడి ఉండటం, సమీపంలోని జిమ్ వెనుక గోడలకు రక్తపు మరకలు ఉండటాన్ని సైతం గుర్తించారు. శ్రీనివాసులుపై దాడి చేసి పాత తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పడివేయడంతో, రాత్రి సమయంలో ఎవరూ గుర్తించలేకపోయినట్లు బాధితురాలు వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముఖాన్ని కొరికేసిన ఎలుకలు శ్రీనివాసులు మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్య శాల పోస్టుమార్టం గదిలో భద్రపరచగా, అక్కడ సిబ్బంది శీతల శవపేటిక మూత మూయకండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడి ముఖాన్ని ఎలుకలు కొరికేశాయి. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం రాత్రి ఆందోళన చేపట్టారు. సిబ్బందికి చెప్పినా వారు చాలా సేపటి తర్వాత స్పందించి శవపేటికపై మూత వేసినట్లు మృతుడి సోదరుడు అంకయ్య దేవరాజ్ వాపోయాడు. -
ఎలుకలు కొరికిన హామీలు
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా నాడు పసికందును ఎలుకలు కొరికాయి. ఆ తల్లికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా ఎలుకలే కొరికేశాయా?! జబ్బుతో ఉన్న పసికందును బతికించుకోవాలనే ఆశతో విజయవాడ నుంచి గుంటూరు జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగానికి తీసుకొస్తే అక్కడి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి బలయ్యాడు. బిడ్డను ఎలుకలు కొరుకుతున్నాయంటూ చెప్పినా పట్టించుకోకుండా పచ్చి బాలింతను అప్పుడు అవహేళన చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు మంజూరు చేయమని కాళ్లరిగేలా తిరుగుతుంటే ఇప్పుడు హేళనగా మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును రెండుసార్లు కలిసి గోడు వెళ్లబోసుకున్నా ఫలితం శూన్యం. ముగిసిపోయిన అధ్యాయం అంటూ మంత్రులు, అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. కనీసం బిడ్డ చనిపోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి శిక్ష అయినా పడుతుందంటే అదీ లేకుండా పోయింది. కోర్టులో పిటిషన్ వెనక్కు తీసుకోవాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘‘బిడ్డ చనిపోయి మూడేళ్లు దాటుతున్నా ప్రభుత్వం నుంచి సాయం అందడం లేదు.. అందుతుందనే ఆశా పోయిందంటూ.. ఎలుకల దాడిలో మృతిచెందిన పసికందు తల్లి చావలి లక్ష్మి ‘సాక్షి’ ఎదుట బోరున విలపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఆమె పడుతున్న మనోవేదన ఆమె మాటల్లోనే..! గుంటూరు జీజీహెచ్‌లో శిశు శస్త్రచికిత్స విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న నా బిడ్డను 2015 ఆగస్టు 26వ తేదీన ఎలుకలు కొరుక్కుతిన్నాయి. అప్పటికి మూడు రోజుల ముందు ఎడమ చెయ్యి ఐదు వేళ్లు, కుడిచెయ్యి రెండు వేళ్లను ఎలుకలు కొరికి వేశాయి. మా బాబును మాకు ఇచ్చేయండి, ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళతామని బతిమలాడాను.. అయినా అక్కడి డాక్టర్లు పట్టించుకోలేదు. డాక్టర్ వెళ్లాక అక్కడి నర్సులు సైతం నన్ను హేళనగా మాట్లాడారే తప్ప, బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉందని కనీస కనికరం చూపలేదు. తెల్లవారుజామున ఎలుకలు కొరికిన విషయం చెప్పినప్పటికీ మధ్యాహ్నం 2 గంట వరకు డాక్టర్లు రాలేదు. అప్పటికే నా బిడ్డ ప్రాణాలు విడిచాడు. చనిపోయిన బిడ్డకు ట్రీట్మెంట్ చేయడానికి వస్తారా.. అంటూ నేను వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినా ఎవరూ సమాధానం చెప్పలేదు. అప్పట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, కలెక్టర్ కాంతిలాల్ దండే, మరికొందరు ఉన్నతాధికారులు నన్ను పిలిచి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియాతోపాటు ఉద్యోగం, ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు అయితే ఇచ్చారు కాని, ఇంత వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏ ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. ఉద్యోగం గానీ, ఇల్లు గానీ మంజూరు చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రితో గోడు వెళ్లబోసుకున్నా..! నా బిడ్డ చనిపోయిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగం, ఇల్లు మంజూరు చేయాలంటూ అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ముఖ్యమంత్రిని కలిసి గోడు వెళ్ళబోసుకున్నా. జులై 23వ తేదీన సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి నా ఆవేదన.. నేను పడుతున్న ఇబ్బందుల గురించి వివరించి న్యాయం చేయాలంటూ వేడుకున్నా. పక్కనే ఉన్న అధికారులను పిలిచి రూ. 50 వేలు నగదు, ఇల్లు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశించడంతో న్యాయం జరుగుతుందని ఆశించా. అయితే సీఎం కార్యాలయంలోని అధికారులు నన్ను హేళనగా మాట్లాడారు. బియ్యం పెట్టగానే అన్నం అవుతుందా.. అన్నం ఉడకగానే కడుపు నిండుతుందా అంటూ సూటిపోటి మాటలు అన్నారు. అయినా భరించాను. 15 రోజుల తరువాత మరోసారి వెళ్లి సీఎం చంద్రబాబును కలిసి దీనంగా విలపించాను. మీ సమస్య ఇంకా పరిష్కారం కాలేదా అన్నారే తప్ప, అధికారులకు గట్టిగా చెప్పకుండానే వెళ్లిపోయారు. దీంతో అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. రెండు వారాల క్రితం మరోసారి కలుద్దామని వెళితే ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కలేదు. నా బిడ్డ చనిపోయి మూడేళ్లు దాటింది. అప్పటి నుంచి ఇచ్చిన హామీ ప్రకారం ఇల్లు మంజూరు చేయమని ప్రాధేయపడుతూనే ఉన్నా. కేసు వెనక్కు తీసుకోమని బెదిరిస్తున్నారు ఎలుకల కొరికి నా బిడ్డ చనిపోయిన కేసులో నాకు ఇప్పటి వరకు సమన్లు రాలేదు. కేసు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. కేసును పక్కదారి పట్టిస్తున్నారని, కేసులో మరికొందరి పాత్ర కూడా ఉందంటూ విజయవాడకు చెందిన ఓ న్యాయవాది ద్వారా కోర్టులో íపిటిషన్ వేయించాను. ఆ కేసు గురించి తెలుసుకునేందుకు గుంటూరు కోర్టుకు వెళ్లాను. అయితే అక్కడ నన్ను కలిసిన కొందరు కేసు వెనక్కు తీసుకోవాలంటూ బెదిరించారు. కేసు వెనక్కు తీసుకుంటే రూ. 2 లక్షలు ఇస్తామని, లేదంటే ఇబ్బందులు పడతావంటూ పరోక్షంగా హెచ్చరికలు చేశారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యానికి నా బిడ్డ బలయ్యాడనే విషయం దేశం మొత్తం తెలుసు. ఇలాంటి వారిని క్షమించి ఎలా వదిలేయాలి? అలా వదిలేస్తే నాలాంటి ఎందరో తల్లులకు కడుపు కోత తప్పదు. నాలా ఏ తల్లి బాధపడటానికి వీల్లేదు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని చెప్పారు చావలి లక్ష్మి.. హామీల పేరుతో మోసం చేశారు ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ప్రభుత్వం, జీజీహెచ్ అధికారులపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు, ప్రత్యక్ష ఆందోళనలకు దిగడంతో అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, జిల్లా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు జీజీహెచ్‌కు వచ్చి మృతిచెందిన పసికందు తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలతో చర్చించి అన్ని విధాలా ఆదుకుంటామంటూ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా రూ. 5 లక్షల నగదుతోపాటు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం, సొంత ఇల్లు మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చి, గొడవ పెద్దది కాకుండా సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. ఏదైనా దుర్ఘటన జరిగిన ప్రతిసారి నష్టపరిహారం పేరుతో ఇష్టానుసారం హామీలు ఇచ్చేసి పరిస్థితి చక్కబడగానే పట్టించుకోకుండా వదిలేయడం ప్రభుత్వానికి పరిపాటిగా మారింది. గతంలో జరిగిన అనేక ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పసికందు మృతిచెంది మూడేళ్లు దాటుతున్నా ఇచ్చిన హామీ ప్రకారం బాధితులకు ఇల్లు మంజూరు చేయకుండా తిప్పుకోవడమే కాకుండా అవహేళనగా మాట్లాడుతూ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – ఎన్.మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు -
ఖాకీలను పరుగులు పెట్టించిన ఎలుకలు..
లక్నో : బ్యాంకులో దోపిడీ జరుగుతోందంటూ అలారం మోగిందని సమాచారం రావడంతో పోలీస్ స్టేషన్ నుంచి హుటాహుటిన తరలివెళ్లిన ఖాకీలకు ఎలుకలు కనిపించడంతో విస్తుపోయారు. బ్యాంకులో దోపిడీ జరిగినట్టు గానీ తాళాలు పగులగొట్టిన ఆనవాళ్లు లేకపోగా ఎలుకలు అటూఇటూ తిరుగుతూ కనిపించాయి. నగరంలోని ఓ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్‌లో అలారం మోగిన శబ్ధం వినిపించిందంటూ స్ధానికులు, బ్రాంచ్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. అయితే అక్కడ దోపిడీ జరిగిన తీరుతెన్నులు లేకపోవడం, కొద్ది సంఖ్యలో ఎలుకలు అలారం వద్ద పోగవడంతో అలారం మోగించింది ఎలుకలే అంటూ పోలీసులు తేల్చేశారు. ఎలుకలు చేసిన పనికే సైరెన్ మోగిందని ఖాకీలు చెప్పారు. కృష్ణాష్టమి కావడంతో బ్యాంకు అధికారులెవరూ బ్రాంచ్‌లో లేరని పోలీసులు చెప్పారు. కాగా అసోంలో ఇటీవల ఏటీఎం యంత్రంలోని రూ 12 లక్షల నగదును ఎలుకలు కొరికి తినేసిన ఘటనను ప్రస్తావిస్తూ అదృష్టవశాత్తూ బ్యాంకులో ఇలాంటి ఘటన చోటుచేసుకోలేదని స్ధానికులు పేర్కొన్నారు. -
డ్రగ్స్ ఏవి?.. ఎలుకలు తినేశాయి..!
న్యూఢిల్లీ : మన దేశంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న విభాగాలు అంటే ముందగా గుర్తుకు వచ్చేది వైద్యం విభాగం, న్యాయ విభాగం. డాక్టర్ల సంఖ్య, అలానే పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇప్పుడు కోర్టులో కేసు వేస్తే అది విచారణకు రావాలంటే ఏళ్లు పడుతుంది. ఆ లోపు జీవితాలు, సాక్ష్యాలు తారుమారు అయ్యే అవకాశాలు అధికం. ఇందుకు ఉదాహరణగా నిలిచారు ఢిల్లీ పోలీసులు. కొన్నేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధాలను కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందుకు పోలీసులు ఆ డ్రగ్స్‌ని ఎలుకలు తినేశాయంటూ వింత సమాధానం ఇచ్చారు. వివరాల ప్రకారం.. మూడు, నాలుగేళ్ల క్రితం ఫైల్ అయిన డ్రగ్స్ కేసులను విచారించడానికి సుప్రీంకోర్టు, జస్టిస్ మదన్ బీ. లోకూర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో భాగంగా ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను కోర్టుకు చూపించాల్సిందిగా ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. అందుకు పోలీసులు అప్పుడు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ ప్రస్తుతం తమ వద్ద లేవని.. వాటిని ఎలుకలు తినేశాయంటూ వింత సమాధానం ఇవ్వడంతో విస్తుపోవడం న్యాయమూర్తుల వంతయ్యింది. పోలీస్ స్టేషన్లో డ్రగ్స్ భద్రపరిచిన గదుల్లో ఎలుకలు ఉన్నాయని, అవే వాటిని తినేశాయని పోలీసులు చెప్పుకొచ్చారు. గతంలో బిహార్ పోలీసులు కూడా ఇదే తరహా సమాధానం చెప్పారు. గతేడాది బిహార్‌లో కూడా పోలీసులు ఇలాంటి విచిత్రమైన సమాధానమే చెప్పారు. అక్రమంగా స్వాధీనం చేసుకున్న మద్యాన్నంతా ఎలుకలు తాగుతున్నాయన్నారు. దాదాపు 9లక్షల లీటర్ల మద్యాన్ని ఎలుకలు తాగేశాయని చెప్పారు. -
ఎలుకలే వారికి జీవనాధారం
మెదక్‌రూరల్ : కాలంతో పోటీ పడలేక.. అనేక మంది కులవృత్తులనే నమ్ముకుంటున్నారు. పొద్దంతా కష్టపడినా మూడు పూటలా తిండి దొరకక కాలం వెళ్లదీస్తున్నారు. పంటలను నాశనం చేసే ఎలుకలను పట్టుకొని జీవనోపాధి పొందుతున్న వారిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..వరి పంటలను నాశనం చేసే ఎలుకలను పట్టుకోవడమే వారి వృత్తి. తాతల కాలంగా కులవృత్తిగా మార్చుకొని జీవనోపాధి పొందుతున్నారు. కట్టెలతో తయారు చేసిన బుట్టల్లో ఎలుక పడితేనే బుక్కెడు బువ్వ దొరుకుతుందని వృత్తిదారులు వాపోతున్నారు. పొద్దున లేచింది మొదలు బతుకుదెరువు వెత్తుక్కుంటూ పొలాల గట్ల వెంబడి తిరగాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. వెదురుతో బుట్టలు తయారు చేసి.. రైతుల పిలిస్తే వారి పొలాలకు వెళ్లి.. అక్కడి పొలం గట్లలో ఉండే ఎరుకలను బంధిస్తుంటారు. ఇలా ఒక్కో ఎలుకను పట్టుకున్నందుకు రూ.10 వసూలు చేస్తారు. రోజుకు సుమారు 50 నుంచి 80 ఎలుకలు బుట్టల్లో పడతాయని చెబుతున్నారు. కులవృత్తులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టుగానే తమను ఆదుకోవాలని వారంతా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎలుకని పడితేనే పూట గడుస్తది వరి పంటలను నాశనం చేసేఎలుకలను బుట్టల్లో బంధిస్తుంటాం. ఒక్కో ఎలుకకు రూ.10 చొప్పున తీసుకుంటాం. బుట్టలో ఎలుక పడితేనే పూట గడుస్తది. దీంతో పొద్దంతా పొలాల గట్ల వెంబడి తిరిగాల్సిందే. మమ్మల్ని ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఆదుకోలేదు. పొద్దంతా కష్టం చేసినా కుటుంబ పోషణ భారంగానే ఉంటుంది. – గిరిబాబు, మాచవరం, మెదక్ మండలం ప్రభుత్వం ఆదుకోవాలి తాతల కాలం నుంచి ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్నాం. మేము ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సహకరించాలి. రైతులు ఫోన్ చేస్తే వెళ్లి పొలాల్లో ఉండే ఎలుకలను పట్టుకుంటాం. రోజుకు దాదాపు 70 ఎలుకలు బట్టులో పడతాయి. ఒక్కోసారి కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు. – ఫణీంద్ర, మాచవరం, మెదక్ మండలం -
అదే నిర్లక్ష్యం
రాజధాని ఆస్పత్రిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి(జీజీహెచ్)లో అంతులేని నిర్లక్ష్యం వేళ్లూనుకుంది. రోగుల భద్రతపై రోజురోజుకూ నీలినీడలు కమ్ముకుంటూనే ఉన్నాయి. చిన్నపిల్లల వార్డులో ఎలుకలు కరిచి పసికందు ప్రాణాలు కోల్పోయినా, ఆపరేషన్ థియేటర్లోకి పాములు వచ్చాయని వైద్యులు ఆపరేషన్లు నిలిపివేసినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వీడటంలేదు. సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. వార్డుల వద్ద ఎలుకలు పగలు, రాత్రి తేడా లేకుండా యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రికి వస్తున్న రోగులకు ఇక్కడి అపరిశుభ్రత మరిన్ని వ్యాధులు సోకేలా చేస్తోంది. పారిశుద్ధ్యం మెరుగుదలపై శ్రద్ధ చూపాల్సిన ప్రభుత్వం, వైద్య విద్య ఉన్నతాధికారులు నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. ఎలుకల దాడిలో పసికందు మృతి చెందినా, పాములు తిరుగుతున్నాయని వైద్యులు ఆపరేషన్లు నిలిపివేసినా ప్రభుత్వం, వైద్యవిద్య ఉన్నతాధికారుల తీరు మారడం లేదు. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు తాత్కాలిక చర్యలతో హడావుడి చేయడం మినహా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలుకల దాడిలో చిన్నారి మృతిచెందిన ఘటన నేపథ్యంలో ప్రక్షాళన పేరుతో పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌ను ఉన్నతాధికారులు తొలగించారు. అతనికి ఇచ్చే సొమ్మును రెట్టింపు చేసి కొత్తవారికి పారిశుద్ధ్య బాధ్యతలు అప్పగిం చారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడం గమనార్హం. ముఖ్యంగా చిన్నపిల్లల వార్డుల వద్ద పారిశుధ్యం అధ్వానంగా ఉంది. వార్డు చుట్టూ ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆ వార్డులో చికిత్సపొందుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2015 ఆగస్టు 26వ తేదీన శిశు శస్త్రచికిత్సా విభాగంలో వెంటిలేటర్‌పై ఉన్న పదిరోజుల పసికందును ఎలుకలు కొరికి చంపేశాయి. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఇది జరిగి మూడేళ్లు కావస్తున్నా జీజీహెచ్‌లో పారిశుద్ధ్యం ఇప్పటికీ అధ్వానంగానే ఉంది. ఎలుకల నివారణకు తూతూమంత్రపు చర్యలు మినహా శాశ్వత పరిష్కారం తీసుకోలేదు. ఫలితంగా చిన్నారులచికిత్సా విభాగం చుట్టుపక్కల పారిశుధ్యం అధ్వానంగా ఉంది. మురుగు కూడా తిష్టవేసింది. దీంతో ఎలుకలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. పసికందు మృతి తరువాత కూడా ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు కనువిప్పు కలగలేదని రోగులు, వారి బంధువులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఘటన జరిగిన కొంత కాలం ఎలుకలు ఉన్నాయనే కారణంతో వైద్యులు 15 రోజులు సర్జికల్ ఆపరేషన్ థియేటర్ (ఎస్ఓటీ)లో ఆపరేషన్లు చేయకుండా నిలిపివేశారు. ఆ తరువాత తమకేమీ పట్టనట్లే వ్యవహరిస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్‌లోకి ఎలుకలు రాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సిన జీజీహెచ్ అధికారులు అది మరిచి ఎలుకలు, పాములు కనిపించినా ఎవరికీ చెప్పొద్దంటూ సిబ్బంది, రోగులకు హుకుం జారీ చేశారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎవరైనా సమాచారాన్ని బయటకు పంపితే వారిపై చర్యలు తీసుకునేందుకూ వెనకాడటం లేదు. పారిశుద్ధ్యం నిల్.. మార్కులు ఫుల్ జీజీహెచ్‌లో పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు గతంలో చెల్లించిన మొత్తం కంటే రెట్టింపు ముట్టజెబు తున్నా పారిశుద్ధ్యం మాత్రం మెరుగు పడని పరిస్థితి. నిత్యం పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షించి సక్రమంగా లేకపోతే వారికి మార్కులు తగ్గించి నెలానెలా చెల్లించే డబ్బులో తగ్గించాల్సి ఉంది. అయితే జీజీహెచ్ ఉన్నతాధికారులు మాత్రం పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌కు ఫుల్‌గా మార్కులు వేసేస్తున్నారు. ఎలుకల దాడి ఘటనకు ముందుకు పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ మూడు విభాగాలకు కలిపి కాంట్రాక్టర్‌కు నెలకు రూ.21 లక్షలు చెల్లించేవారు. ఆ తరువాత ప్రక్షాళన పేరుతో కాంట్రాక్టర్‌ను తొలగించి అధికార పార్టీకి చెందిన ఓ ఎంపీ అనుచరుడికి కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించారు. ఇతనికి పారిశుద్ధ్యం, పెస్ట్ కంట్రోల్ రెండు విభాగాలకే ఏకంగా రూ.50 లక్షలు చెల్లిస్తున్నారు. పారిశుద్ధ్యం ఆ స్థాయిలో మెరుగు పడిందా అంటే అదీ లేదు. పిల్లల వార్డు వద్ద అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యం వారికి కనిపిం చడం లేదా అంటూ జీజీహెచ్ సిబ్బంది, రోగులు గుసగుసలాడుతున్నారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంటే మార్కులు కట్ చేస్తాం జీజీహెచ్‌లో నూతన భవన నిర్మాణాలు జరుగుతుండటంతో కొంత పారిశుద్ధ్యం సమస్య ఉన్న మాట వాస్తవమే. ఎలుకల నివారణకు పెస్ట్ కంట్రోలర్ కాంట్రాక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇస్తాం. పారిశుద్ధ్యంపై నిరంతర పరిశీలన జరుపుతాం. అప్పటికీ మెరుగు పరచుకోకపోతే మార్కులు కట్ చేసి వారికి చెల్లించే డబ్బులు తగ్గిస్తాం. జీజీహెచ్‌లో పారిశుద్ధ్యాన్ని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. – ఆదినారాయణ, ఆర్ఎంఓ -
పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న ఎలుకలు
-
ఎలుకల వల్లే ఫ్లై ఓవర్‌పై పగుళ్లు..!
చంఢీగఢ్ : లూథియానాలోని గిల్ చౌక్ ఫ్లైఓవర్‌పై ఆదివారం రాత్రి పగుళ్లు ఏర్పడ్డాయి. వెంటనే స్పందించిన అధికార యత్రాంగం ఫ్లైఓవర్‌పై రాకపోకలు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల ఎవరికి అపాయం జరగలేదని అధికారులు తెలిపారు. దీనిపై లూథియానా మున్సిపల్ అధికారి ధరమ్ సింగ్ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ కింది భాగంలో ఎలుకలు నివాస స్థలాన్ని ఏర్పరుచుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అన్నారు. ఎలుకల కన్నాల వల్లే ఫ్లైఓవర్‌పై పగుళ్లు వచ్చాయని తెలిపారు. ఫ్లైఓవర్ పగుళ్లకు ఎలుకలే కారణమని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్థానికలు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ కింది భాగంలోని నేల కోతకు గురవుతుందని.. దీని వల్ల ప్రమాదం పొంచివుందని మున్సిపల్ శాఖకు ఆర్నేళ్ల క్రితమే తెలిపినప్పటికీ.. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. -
సింహం, పులి కలిసే పోటీ: సీఎం
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఎలుకల గురించి బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మండలిలో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. మండలిలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సింహం, పులి కలిసి 2019 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని పరోక్షంగా బీజేపీ- శివసేన బంధం గురించి పేర్కొన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత రాధాకృష్ణ వీకే పాటిల్.. సచివాలయంలో ఎలుకలు ఉన్నాయన్న ఏక్నాథ్ ఖడ్సే వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘ఎలుకలన్నీ కలిసి బీజేపీని సింహాసనం నుంచి కూలదోస్తాయి అంటూ ఎద్దేవా చేశారు. దీనికి స్పందనగా సీఎం మాట్లాడుతూ.. ‘పులి(శివసేన గుర్తు), సింహం కలిసే ఉన్నాయి. ఎలుకలు మమ్మల్ని ఏమీ చేయలేవు. సింహం, పులి కలిసి ఎలుకల్ని నాశనం చేస్తాయంటూ’ ధీటుగా బదులిచ్చారు. స్పందించిన ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ మాట్లాడుతూ.. ‘మాకు పులి గురించి తెలుసుగానీ, సింహం ఎవరనేదీ తెలియడం లేదంటూ’ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ‘ఎలుకలు మీకు దారి ఇవ్వచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికల్లో జంతువులకు వాటి స్ధానాన్ని తప్పక తెలియజేస్తార’ని ఎద్దేవా చేశారు. సీఎం వ్యాఖ్యలను వీకే పాటిల్ ఉటంకిస్తూ.. ‘సింహం, పులిల మధ్య ఉన్న ప్రేమానురాగాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న వారి బంధం ఎంతటి బలమైందో కూడా వారికి తెలుసు అంటూ’ వ్యాఖ్యానించారు. కాగా, బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీ సమావేశాల్లో... మంత్రాలయంలో(సచివాలయం) ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపుతూ.. మంత్రాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు కాంట్రాక్ట్ సంస్థ చెప్పిందని గుర్తు చేశారు. వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందనీ, కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని చర్చలేవనెత్తిన విషయం తెలిసిందే. -
జీజీహెచ్‌లో ఎలుకల వేట
గుంటూరు మెడికల్: మీరు జీజీహెచ్‌కు చికిత్స కోసం వెళుతున్నారా.. అయితే ఎలుకలు ఉంటాయన్న విషయం గమనించి జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే ఎలుకలు దాడి చేసే ప్రమాదం ఉంది. సోమవారం ఒక్క రోజే 11 ఎలుకలు ఆస్పత్రిలో పట్టుబడ్డాయి. రోజురోజుకు ఎలుకలు పెరిగిపోతున్నాయి తప్ప, తగ్గడం లేదు. ఎలుకల నివారణ చర్యలు తీసుకుంటున్నామన్న ఆస్పత్రి అధికారుల మాటలు నీటిమూటలుగానే ఉంటున్నాయి. ప్రతిరోజూ వివిధ వార్డుల్లో అధిక మొత్తంలో పట్టుబడుతున్న ఎలుకలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రెండు నెలల కిందట సాక్షాత్తు ఆస్పత్రి సూపరింటెండెంట్ చికిత్స అందిం చే క్యాన్సర్ వైద్య విభాగంలోనే ఎలుకలు కరిచాయంటూ రోగులు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదులు అధికారులకు చేరుతున్నా నివారణ చర్యలు మాత్రం తూతూమంత్రంగా ఉంటున్నాయే తప్ప, ఎలుకల నిర్మూలనకు శాశ్వత పరిష్కారాన్ని అధికారులు చూపించలేకపోతున్నారు. దీంతో వార్డుల్లో ఉంటున్న రోగులు అప్పుడప్పుడు ఎలుకల బెడదతో బెంబేలెత్తిపోతున్నారు. కొనసాగుతున్న వేట.. గుంటూరు జీజీహెచ్‌లో 2015 ఆగస్టులో ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిం చింది. దీంతో ప్రభుత్వం శానిటేషన్‌పై దృష్టి సారించి అధిక మొత్తంలో బడ్జెట్లు కేటా యించింది. అప్పటి వరకు శానిటేషన్, ఫెస్ట్ కంట్రోల్, సెక్యూరిటీ నిర్వహణ బాధ్యతలు కేవలం ఒకేఒక్క కాంట్రాక్టర్‌కు ఉండటం తో, నూతన శానిటేషన్ పాలసీలో భాగంగా ఒక్కో బాధ్యతను ఒక్కో కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కాంట్రాక్టర్లకు బడ్జెట్లు పెంచినా, బాధ్యతలు తగ్గించినా పనితీరులో మాత్రం మార్పు రాలేదనే దానికి ప్రతిరోజూ ఆస్పత్రిలో పట్టుబడుతున్న ఎలు కలే నిదర్శనం. అయినప్పటికీ ఆస్పత్రి అధికారులు పెస్ట్ కంట్రోల్ కాంట్రాక్టర్‌కు పనితీరు బాగుం దంటూ ఎక్కువ మార్కులు వేస్తూ అధిక మొత్తంలో అతనికి నిధులు వచ్చేలా చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. కాగా ఫెస్ట్ కంట్రోల్ సిబ్బందికి రెండేళ్లుగా వేతనాలు పెంచకుండా, పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా, సిబ్బంది వేతనాల్లో మాత్రం కోత కోస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి.ఆస్పత్రి అధికారులు ఇకనైనా స్పందించి ఆస్పత్రిలో ఎలుకల నిర్మూలన చర్యలను చిత్తశుద్ధితో నిర్వహించేలా చూడాలని రోగులు కోరుతున్నారు. -
సచివాలయంలో 3 లక్షల ఎలుకలు...!
ముంబై : సచివాలయంలో మూడు లక్షల ఎలుకలు ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఇది చదవాల్సిందే.. మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎలుకలపై ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ సీనియర్ నేత ఏక్నాథ్ ఖడ్సే అసెంబ్లీ సమావేశాల్లో... మంత్రాలయంలో(సచివాలయం) ఎలుకల నిర్మూలనకు కాంట్రాక్టు సంస్థ సమర్పించిన బిల్లులలోని లోపాలను ఎత్తి చూపారు. మంత్రాలయంలోని 3,19,400 ఎలుకలు ఉన్నట్టు కాంట్రాక్ట్ సంస్థ చెప్పడంతో వాటి నిర్మూలన కోసం ప్రభుత్వం ఆ సంస్థకు ఆరు నెలల సమయం ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ఆ సంస్థ కేవలం ఏడు రోజుల్లోనే 3 లక్షల ఎలుకలను చంపినట్టు ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని ఖడ్సే తెలిపారు. అసలు మంత్రాలయంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత మంది పని చేస్తున్నారు, ఆ స్థాయిలో అసలు ఎలుకలు ఉన్నాయా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో కాంట్రక్ట్ సంస్థపై మండిపడ్డారు. అలాగైతే రోజుకి ఎన్ని ఎలుకలు చంపారు, ఏ విధంగా చంపారు, చంపిన ఎలుకలను ఎక్కడికి తరలించారో తెలపాలని సదురు సంస్థను ప్రశ్నించారు. సరాసరి రోజుకు 45,628.57 ఎలుకలను చంపారనుకుంటే అందులో 0.57 మాత్రం కొత్తగా పుట్టిన ఎలుక పిల్లలు అయి ఉంటాయని ఖడ్సే అనడంతో సభలోని అందరూ ఒక్కసారిగా నవ్వారు. నగరంలోని ఆరు లక్షల ఎలుకలను చంపడానికి బృహన్ ముంబాయి మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ)కే రెండు సంవత్సరాలు పట్టిందని ఖాడ్సే ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేవలం ప్రభుత్వం నుంచి ఎక్కువ డబ్బులు పొందేందుకే సంస్థ తప్పుడు సమాచారం సమర్పించిందని అన్నారు. దీనిపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. -
శిశువు మృతదేహాన్నికొరికిన ఎలుకలు
నర్సాపూర్: పోస్టుమార్టం గదిలో ఉన్న మూడు నెలల శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. కౌడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బతుకమ్మ తండాకు చెందిన సురేఖ, కిషన్ దంపతుల కూతురు పుట్టిన కొన్ని రోజులæ నుంచి అనారోగ్యంతో ఉంది. గురువారం ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో వైద్యం చేయించేందుకు సురేఖ మెదక్‌కు వెళుతుండగా పాప మార్గమధ్యంలో మృతి చెందింది. శిశువు తండ్రి కిషన్‌తోపాటు అతడి తరఫువారు గురువారం సాయంత్రం వరకు రానందున మృతదేహాన్ని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో పెట్టి తాళం వేశారు. శుక్రవారం ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు వైద్య సిబ్బంది వెళ్లి చూసేసరికి శిశువు మృతదేహంపై పలు చోట్ల గాయాలు కనిపించాయి. ఎలుకలు కొరికిన విషయాన్ని శిశువు కుటుంబీకులకు చెప్పకుండా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని వారికి అప్పచెప్పారు. అయితే శిశువు మృతదేహంపై కుడి వైపు పెదవిని, చెంపతోపాటు ఎడమ చేయి వేలును కొరికాయి. అంతేగాక కుడికాలు తొడపై సైతం గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కౌడిపల్లి ఎస్ఐ శ్రీనివాస్ చెప్పారు. -
మృతశిశువును కొరుక్కుతిన్న ఎలుకలు
-
ఎలుకలు పట్టేందుకు వెళ్లి..
పొదలకూరు: మండలంలోని విరువూరు గ్రామంలో శుక్రవారం గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై అల్లూరు జగత్సింగ్ కథనం మేరకు వివరాలు.. వరిచేలల్లో ఎలుకలను పట్టేందుకు వచ్చిన నల్లబోతుల గంగయ్య(38) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం నెల్లూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పిల్లల బళ్లో ఎలుకలు పడ్డాయ్
చిన్నారులతో కళకళలాడాల్సిన అంగన్వాడీ బడి ఎలుకలు..పందికొక్కులకు ఆవాసమైంది. గ్రామంలోని బాలింతలకు, గర్భిణులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కదారి పట్టింది. ఒకటి రెండు కాదు నెలరోజులుగా బడి తలుపులు తెరుచుకోకపోయినా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. కడప కోటిరెడ్డి సర్కిల్: నగర శివార్లలోని మోడంమీదపల్లె (పాత కడప) దళితవాడలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించి పుణ్యం కట్టుకోవాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. నెలరోజులుగా అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తిగా తెరవలేదని వారు ఆరోపించారు. బాలింతలకు, గర్భిణులకు, పిల్లలకు నెలకు రెండు గుడ్లు, బియ్యం, కంది పప్పు మాత్రమే ఇంటికిస్తారన్నారు. పాలు ఎవరికి ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. పిల్లలకు అన్నం వండి పెట్టిన పాపాన పోలేదన్నారు. బడి లోపల ఎలుకలు, పంది కొక్కులు, బండల సందులలో ఉన్న ఇసుకను బయటికి తీస్తున్నా శుభ్రం చేసేవారు కరువయ్యారన్నారు. తాము వెళ్లి ఏదైన విషయం అడిగితే గొడవ పడి మీ బుద్ధి పుట్టిన వారికి చెప్పుకోపోండి అని ఆయా, కార్యకర్త చెబుతున్నారని ప్రజలు ఆవేదనతో తెలిపారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. అధికారులు అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం నగర శివార్లలోని మోడంమీదపల్లెలో అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త, ఆయా నెల రోజుల నుంచి స్కూలు మూసివేసిన విషయం తన దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని అర్బన్ సీడీపీవో అరుణకుమారిని ఆదేశించాం. నివేదిక రాగానే కార్యకర్త, ఆయా పై చర్యలు తీసుకుంటాం. –మమత, జిల్లా ప్రాజెక్టు డైరక్టర్, ఐసీడీఎస్. కడప అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపించండి... మా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తెరిపిం చాలి. పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అం దించాలనే ఉద్దేశంతో స్కూల్ ఏర్పా టు చేస్తే కార్యకర్త, ఆయా అవేమి పట్టించుకోవడం లేదు. గతనెలంతా స్కూలు తెరవలేదు. –సుబ్బలక్షుమ్మ, స్థానికురాలు నెలకు రెండు గుడ్లే.... బాలింతలకు, గర్భిణులకు రెండు గుడ్లు మాత్రమే ఇస్తారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం ఇదేనా? స్కూలులో ఏమేమి ఇస్తారో మెను కూడా లేదు. ఇంత అధ్వానంగా ఆయా, కార్యకర్త వ్యవహరిస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్లు.–బేబి, స్థానికురాలు -
ఇదిగో పాము... వచ్చారో జాగ్రత్త
తూర్పుగోదావరి, అమలాపురం: కొబ్బరిచెట్టుపై పాము బొమ్మలు చూశారా? తోటలకు దిష్టి తగలకుండా వేసిన బొమ్మకాదు ఇది. కొబ్బరి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసే ఉడతలు. ఎలుకలు దాడి నుంచి కొబ్బరి చెట్టును..దిగుబడిని రక్షించుకునేందుకు రైతులు ఇలా పాము బొమ్మలను గీస్తున్నారు. సాధారణంగా ఎలుకలు, ఉడతలు కొట్టడంతో చెట్టు పలురకాలుగా ధ్వంసమవుతోంది. కొబ్బరి పిందెలను, చిన్నపాటి కాయలను సైతం ఇవి కొట్టేస్తుంటాయి. అలాగే డొలకలు, కొబ్బరి ఆకులు మొత్తాల్లో చేరి మొవ్వును తినేస్తాయి. ఇలా చేయడం వల్ల కొబ్బరి చెట్టు కూడా దెబ్బతిన చనిపోయే ప్రమాదముంది. రైతులు వీటిని సకాలంలో గుర్తించకుంటే కొబ్బరితోట నాశనమవుతోంది. కొబ్బరితోట ఒక్కటే కాదు.. దాని అంతర పంటగా సాగు చేసే కోకో ఎలుక, ఉడతల దాడివల్ల ఎక్కువగా నష్టపోతోంది. దీంతో పాటు ఇతర అంతర పంటలకు కూడా నష్టం వాటిల్లితోంది. వీటిని నిర్మూలించాలంటే మట్టుబెట్టడం మిన హా మరో మార్గం లేదు. కానీ కొంతమందికి ఉడతను చంపడానికి సెంటిమెంట్ అడ్డువస్తోంది. ఇటువంటి రైతులు వాటిని భయపెట్టేందుకు, చెట్టు ఎక్కకుండా చేసేందుకు ఇలా పాము బొమ్మలను వేస్తున్నారు. ఎలుక నివారణకు ఆల్యూమినియం రేకు మంచిది... ఎలుకలు, ఉడతల నివారణకు పాము బొమ్మలు వేయడం మంచిదే. కానీ ఇది అన్నిసార్లు మంచి ఫలితాన్నివ్వదని అమలాపురానికి చెందిన ఆదర్శ రైతు అబ్బిరెడ్డి రంగబాబు తెలిపారు. కొబ్బరి, కోకో, ఇతర అంతర పంటపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన ఎలుకల నివారణ ‘సాక్షి’కి ఆయన తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే... ♦ ఎలుకలు చాలా తెలివైనవి. ముఖ్యంగా చెట్లు ఎక్కే ఎలుకల జాతి రకాన్ని రేటస్..రేటస్ అంటారు. కొబ్బరి చెట్లపై పాము బొమ్మలుంన్నా ఎలుకలు చెట్టు ఎక్కడం మానవు. పాము బొమ్మలను ఒకటి, రెండుసార్లు చూపి భయపడి చెట్టు ఎక్కకున్నా, తరువాత అవి బొమ్మలని ఎలుకలు పసిగట్టగలవు. చెట్టు ఎక్కి యథావిధిగా ధ్వంసం చేస్తాయి. వీటి నిర్మూలనకు పలు పద్ధతులున్నాయి. ♦ పుస్తకాలకు వేసే అట్టలు (ట్రాన్స్‌ప్లంట్ పేపర్)ని చెట్టుకు చుట్టాలి. కొబ్బరి చెట్టు కాండం గరుకుగా ఉండడం వల్ల ఎలుక ఎక్కేందుకు సలువుగా ఉంటుంది. కాబట్టి అట్ట పుస్తకాలకు వేసే అట్టలాంటి ట్రాన్స్పెంట్ పేపరును చుట్టడం మంచి ఫలితానిస్తోంది. దీనివల్ల ఎలుక, ఉడతలు కాళ్లు జారి కింద పడిపోతాయి. ♦ ఆట్టలకు వేసే పేపరుకన్నా ఉత్తమమైన పద్ధతి అల్యూమినియం రేకులను తొడగడం. ఇలా చేయడం వల్ల కూడా ఎలుకలు జారిపడతాయి. ♦ అల్యూమినయం రేకు, ప్లాస్టిక్ రేకుతో గరాటా ఆకారంలో చెట్టు మధ్యలో ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల అక్కడకు వెళ్లే ఎలుకలు, ఉడతలుపైకి వెళ్లేందుకు అవకాశముండదు. ♦ గ్రీజులో మోనోక్రోటోఫాస్ మందును రాస్తే ఎలుక కాళ్లకు గ్రీజు అంటుకుంటుంది. దీన్ని నోటితో శుభ్రపరుచుకుంటాయి. అప్పుడు విషం నోటిలోకి వెళ్లి ఎలుక చనిపోతోంది. ♦ చెట్టు దిగువ భాగంలో కొబ్బరి డొక్కల మధ్యలో ఎలుకల నివారణ ముందు ఉంచాలి. (ఫెర్మనెంట్ బైట్ స్టేషన్) ఎలుకలు చెట్టుమీదకు దిగినప్పుడు ఈ మందు తిని చనిపోతాయి.) -
మృత్యుఘోష
సాక్షి, గుంటూరు: వెంటిలేటర్‌పై ఉన్న పసికందును ఎలుకలు పీక్కుతిన్నాయి.. బతికున్న పసికందు చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారిస్తే స్మశానం వద్ద కదిలాడాడని కుటుంబ సభ్యులు వెనక్కు తెచ్చారు.. డబ్బు కోసం బిడ్డల్ని మార్చారంటూ ఆరోపణలు.. బాలింత చనిపోతే పది గంటల వరకూ చూడనేలేదు.. స్కానింగ్ కోసం వెళ్లిన గర్భిణిని పట్టించుకోకపోవడంతో గంటల కొద్దీ నిరీక్షించి స్కానింగ్ కేంద్రం వద్దే కిందపడిపోయి అక్కడే ప్రసవించింది. ఆ నెత్తుటి మరకలను గర్భిణి తల్లితోనే తుడిపించారు. బతికుండగానే స్ట్రెచర్‌తో సహా ఓ వృద్ధుడ్ని బయటకు గెంటేశారు. సూదిమందు డ్యూటీ తమది కాదంటే తమది కాదంటూ వైద్యులు, స్టాఫ్ నర్సులు ఓ రోజంతా వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య సోదరికే సూది మందు ఇవ్వకుండా ఉంచిన విచిత్ర ఘటన.. మానవత్వానికే మచ్చ తెచ్చేలా ఉన్న ఇవన్నీ మారుమూల పీహెచ్సీలో కాదు.. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నగరంగా ఉన్న గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జీజీహెచ్)లో జరుగుతున్న వరుస దారుణాలు.. ఇక్కడ నిత్యం 20 మందికిపైగా మృత్యువాత పడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు క్లినిక్లకే అధిక సమయం అధికారికంగా 1177 పడకలు, అనధికారికంగా 1700కుపైగా పడకలతో అతి పెద్దదిగా పేరొందిన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి పరిస్థితి ఊరుగొప్ప.. పేరుదిబ్బలా తయారైంది. అత్యవసర వైద్యసేవలు పొందాలంటే రోగులకు కష్టంగా మారింది. ఫలితంగా ఈ ఆసుపత్రిలో మరణాల రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వైద్య ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆస్పత్రిలో అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేటు క్లినిక్లకే వారు అధిక సమయం కేటాయిస్తున్నారు. క్యాజువాల్టీ, ట్రామాకేర్, ఐసీయూ, ఇతర ఎమర్జెన్సీ, గైనిక్ వార్డుల్లో రోగులకు సకాలంలో వైద్యసేవలందక మరణాలు పెరుగుతున్నాయి. కొందరు వైద్యాధికారుల తప్పిదాల కారణంగా ఆస్పత్రి మొత్తానికే చెడ్డ పేరు వస్తోంది. నాలుగు వేలకుపైగా అవుట్ పేషెంట్లు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి గుంటూరుతోపాటు చుట్టుపక్కల ఆరు జిల్లాల ప్రజలు వస్తారు. రోజుకు దాదాపు 3, 500 నుంచి 4,000 వరకు అవుట్ పేషెంట్లు ఉంటారు. ఆస్పత్రిలోని వివిధ వార్డుల్లోకి రోగులు, వారి వెంట సహాయకులు కలిపి మొత్తం రోజుకు 10 వేల మంది వస్తుంటారు. ఇటీవల ఆస్పత్రి వైద్యుల సేవల తీరుపై భారీగా ఫిర్యాదులందుతున్నాయి. ఏ వార్డులోనూ సంబంధిత వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదు. ఉన్నతాధికారులు తనిఖీల పేరుతో వార్డులు తిరుగుతున్నా వైద్య సిబ్బంది వ్యవహారశైలిని మాత్రం గాడిలో పెట్టలేకపోతున్నారు. జీజీహెచ్‌లోని పలు వార్డుల్లో గుండెల్ని పిండేసే ఘటనలు రోజుకొకటి కనిపిస్తున్నాయి. పెరుగుతున్న మరణాల సంఖ్య జీజీహెచ్‌లో 2017 జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ తొమ్మిది నెలల్లో 5, 321 మంది మృతి చెందినట్లు అధికారిక లెక్క చెబుతున్నాయి. ఇంకా ఇక్కడ సరైన వైద్యం అందక వేరే ఆసుపత్రులకు తరలిస్తున్న సమయంలో జరిగిన మరణాలు చాలానే ఉన్నాయి. అత్యవసర వార్డుల్లో చేరిన రోగులే సకాలంలో వైద్యసేవలు అందక ప్రాణాలొదులుతున్నట్లు తెలుస్తోంది. క్యాజువాల్టీ , ట్రామాకేర్, ఎక్యుట్మెడికల్ కేర్ యూనిట్ (ఏఎంసీ), ఇంటెన్సివ్ మెడికల్ కేర్ యూనిట్ (ఐసీయూ)ల మరణాల రేటు ఎక్కువగా నమోదవుతోంది. తీరుమార్చుకోని జీజీహెచ్ అధికారులు ఆస్పత్రిలో అత్యవసర వైద్య చికిత్సల తీరును నిత్యం పర్యవేక్షించాల్సిన రెసిడెంట్ మెడికల్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేసే వైద్యులు ఎంత మంది ప్రైవేట్ ప్రాక్టీసులు చేస్తున్నారు, వారు ఆసుపత్రిలో ఉంటున్నారా.. మధ్యలోనే వెళ్తున్నారా అనే విషయాలపై ఇంటిలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇవ్వడం, ప్రభుత్వం కొందరిపైనే చర్యలు తీసుకోవడం తెలిసిందే. ఒక్కోమారు రాత్రిళ్లు కనీసం ఇంజెక్షన్లు చేయడానికి కూడా సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. దీంతో అత్యవసర వార్డుల్లో మరణాల సంఖ్య అధికంగా నమోదవుతోంది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ పోస్టులు అనేక ఏళ్లుగా సీనియర్లను కాదని రాజకీయ ఒత్తిళ్లతో తమకు ఇష్టమొచ్చిన వారిని కూర్చోబెడుతున్నారు. దీంతో సీనియర్ వైద్యులెవరూ వీరి మాటలు లెక్క చేయడం లేదు. ఇన్‌ఛార్జిలు కావడంతో వీరు సైతం వైద్యులు, సిబ్బందిపై సీరియస్‌గా దృష్టి సారించలేకపోతున్నారు. దీంతో జీజీహెచ్‌లో మరణాల సంఖ్య తగ్గడం లేదు. -
శవాన్ని పీక్కుతిన్న ఎలుకలు
► జగిత్యాల ధర్మాసుపత్రిలో మరో దారుణం ► సిబ్బంది నిర్లక్ష్యంపై బంధువుల ఆందోళన జగిత్యాల : మొన్న... డ్యూటీ డాక్టర్ ఫోన్లో చెబితే నర్సులు ఓ నిండు గర్భిణీకి ఆపరేషన్ చేశారు.. కళ్లు తెరవ కుండానే నవజాత శిశువు కన్నుమూసింది! నేడు... కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకు న్నాడు.. హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్తే చనిపోయాడని నిర్ధారించిన వైద్యులు శవాన్ని మార్చురీకి తరలించారు.. తెల్లారి బంధువులు వెళ్లి చూసేసరికి ఆ శవాన్ని ఎలుకలు పీక్కుతిన్నాయి!! ...జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వా సుపత్రిలో దారుణాలివీ. మనుషుల ప్రాణాల కే కాదు.. ఇక్కడ శవాలకు కూడా రక్షణ లేకుండా పోతోందని రోగులు మండిపడుతు న్నారు. తాజాగా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు ఛిద్రం చేయడం కలకలం రేపింది. శవాన్ని అంతా పొడిచి పీక్కుతినడంతో ముఖం గుర్తు పట్టకుండా మారిపోయింది. సిబ్బంది నిర్లక్ష్యా న్ని నిరసిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంత నిర్లక్ష్యమా..? జగిత్యాలలోని అమీనాబాద్‌కు చెందిన షేక్ అర్షద్పాషా(36) స్థానిక చల్గల్లోని మామిడి మార్కెట్లో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య ఆయేషా, ముగ్గురు కొడుకులున్నారు. శనివారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో అర్షద్ రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసు కున్నాడు. గమనించిన కుటుంబీకులు, చుట్టు పక్కల వారు అర్షద్‌ను జిల్లాస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాత్రి సమయం కావడంతో పోస్టుమార్టం చేయ లేదు. దీంతో వైద్య సిబ్బంది.. అర్షద్ బంధు వులను సంప్రదించి మృతదేహాన్ని ఆస్పత్రి లోని మార్చురీకి తరలించారు. రాత్రంతా ఆస్ప త్రిలోనే వేచి ఉన్న బంధువులు ఆదివారం ఉదయం పోస్టుమార్టం విభాగం నిర్వాహకుడు తాళం తీయగానే.. ఆయన తోపాటు లోపలికి వెళ్లి చూశారు. అర్షద్ ముఖం, కాలు, చేతులపై గాయాలు చూసి ఆందోళన చెందారు. చివరికి మృతదేహాన్ని ఎలుకలు పీక్కుతిన్నట్లు వారు నిర్ధారణకు వచ్చారు. బంధువుల ఆందోళన ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి, సీఐ ప్రకాశ్ ఆస్పత్రికి వచ్చి వారితో మాట్లాడారు. ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించి మృతదేహాన్ని తీసుకెళ్లారు. చర్యలు తీసుకుంటాం.. వంద పడకల ఆస్పత్రిలో రోగుల సంఖ్య రెండింతలు పెరిగింది. అందుకే అప్పుడప్పుడు.. అనుకోకుండా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇందులో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమాత్రం లేదు. శవాన్ని ఎలుకలు కొరికిన ఘటనపై విచారణ జరిపిన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అశోక్‌కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ -
ఎలుకలకు రూ.60లక్షలు ఖర్చు చేసిన ఏపీ
కర్నూలు: ప్రజా సంక్షేమం కోసం రూపాయలు ఖర్చుపెట్టడానికి చేతురాని ఏపీ ప్రభుత్వం చిన్న చిన్న విషయాలకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఒక్క రోజు డిన్నర్‌కు రూ.19లక్షలు ఖర్చు చేసి విమర్శలు ఎదుర్కొన్న బాబు ప్రభుత్వం మరో సంచలనాత్మక పని చేసింది. ఏకంగా ఎలుకలు పట్టుకోవడం కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. గతేడాది కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కొరకడంతో చిన్నారి మృతి చెందిన ఘటన తెలిసిందే... అయితే ఎలుకల నివారణ కోసం ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.. ఇందుకోసం ఏకంగా ఓ సంస్థతో ఒప్పందంకూడా చేసుకున్నారు. ఇందులో విశేషం ఏమీ లేదు. కాకపోతే ఖర్చు కాస్త ఎక్కువ పెట్టారు. ఎంతంటే రూ.60 లక్షలు ఖర్చుపెట్టారు. 2016 నుంచి 2017 వరకు ఆసంస్థ 300 ఎలుకలను పట్టుకుంది. అంటే ఒక్కో ఎలుకను పట్టుకోవడానికి బాబు సర్కార్ రూ.20వేలు ఖర్చు చేసింది. -
ఎలుకలు లక్షల లీటర్ల మందు తాగేశాయ్!
పట్నా(బిహార్): బిహార్ రాష్ట్రంలో మూసిక రాజాలు రెచ్చిపోతున్నాయి. ఒకటీ రెండూ కాదు.. ఏకంగా తొమ్మిది లక్షల లీటర్ల మందు తాగేశాయి. మందు మనుషులు కాకుండా ఎలుకలు తాగటం ఏంటీ, అందులోనా మద్యనిషేధం ఉన్న రాష్ట్రంలో ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా..! కానీ ఇది నిజం అంట.. ఇది ఎవరో చెబుతున్న విషయం కాదు.. సాక్షాత్తూ బిహార్ పోలీసులే చెప్తున్నారు. విషయం ఏమిటంటే.. గత ఏడాది నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలవుతోంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ యంత్రాంగం మద్యం తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. మద్యం అక్రమ విక్రయాలను బట్టబయలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో మద్యాన్ని ధ్వంసం చేశారు. కొంత స్వాధీనం చేసుకుని పోలీస్ ఠాణాల గోదాముల్లోకి తరలించారు. అయితే, పట్టుబడిన మద్యంలో చాలాభాగం రవాణా చేసేటప్పుడు వృథా అయిందట. ఇదిపోగా దాదాపు 9 లక్షల లీటర్ల మద్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఠాణాల గోదాముల్లో భద్రపరిచారు. ఇందుకు సంబంధించి ఇటీవల అధికారులు లెక్కలు తీయగా ఆ మద్యం మాయమైందని అధికారులు బదులిచ్చారు. అదెలాగని అడిగితే.. గోదాముల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని..అవి ఉన్న మందంతా తాగేశాయని చెప్పేశారు. బిత్తరపోయిన ఉన్నతాధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. నివేదిక అందాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పోలీస్‌స్టేషన్‌లోనే మందు తాగి చిందేసిన ఘటనలో బిహార్ పోలీస్ అధికారుల సంఘం ప్రెసిడెంట్ నిర్మల్ సింగ్‌తోపాటు సంఘం సభ్యుడు శంషేర్సింగ్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఎలక ఎక్కిరించె!
– ఫలితం ఇవ్వని ఎలుకల నిర్మూలన కార్యక్రమం – రూ.20 లక్షలు వృథా – పంటలపై ఎలుక దాడి ఉధృతం – చేసేది లేక రైతులు సొంతంగా ఖర్చు చేసుకుంటున్న వైనం ఉండి : పిల్లి గుడ్డిదైతే ఎలక ఎక్కిరించిందన్నది సామెత. ఈ ఏడాది సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం ఫలితం చూస్తే ఈ సామెత గుర్తుకురాకమానదు. జిల్లావ్యాప్తంగా మూషికాల నిర్మూలనకు వ్యవసాయ శాఖ రూ.20 లక్షలు ఖర్చు చేయగా పంచాయతీలు ఇంకా ఎక్కువగా ఖర్చు చేశాయి. ఫలితం మాత్రం శూన్యం. సామూహిక ఎలుకల నిర్మూలన పేరుతో ప్రభుత్వం చేసిన హంగామా అంతాఇంతా కాదు. వారం ముందు నుంచి వారం తరువాత వరకు ప్రచారం చేస్తూనే ఉన్నారు. రైతును ఆదుకుటున్నాం అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే ప్రయోజనం శూన్యం. ఆగస్ట్ 21, 22 తేదీల్లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. దీని కోసం జిల్లావ్యాప్తంగా 52 మండలాల్లో 903 గ్రామాల్లో ఆయా గ్రామ పంచాయతీల పరిధిలోని రైతులకు రూ.20 లక్షల ఖర్చుతో వ్యవసాయ శాఖ ఎలుకల మందును అందించింది. అంతే కాకుండా సొసైటీలు ఉచితంగా నూకలు అందించాయి. అంతేకాకుండా గ్రామ పంచాయతీలు ఒక్కొక్కటి సుమారుగా రూ.2 వేల చొప్పున ఖర్చు చేశాయి. ఇలా జిల్లాలోని గ్రామ పంచాయతీలు సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. ఫలితం శూన్యం సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపట్టాలంటూ ప్రభుత్వం భారీగా ప్రచారం కూడా చేసింది. రైతులు ఎన్నో ఆశలతో ఈ కార్యక్రమం చేపట్టారు. జిల్లాలో 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుండగా పూర్తిస్థాయిలో ఎలుకల మందును వినియోగించారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. ప్రస్తుతం వరిచేలల్లో ఎలుకలు ఉధతి విపరీతంగా ఉంది. ప్రభుత్వం సరఫరా చేసిన ఎలుకల మందు ఏమాత్రం ఫలితం ఇవ్వలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దాదాపు 3 లక్షల ఎకరాల్లో ఎలుకల ఉధతి ఎక్కువగా ఉంది. ప్రభుత్వం అందించిన ఎలుకల మందు పెట్టాము కదా అనే ఆలోచనలో ఉన్న రైతన్నలకు ఎలుకలు సామూహికంగా దాడి చేసి విపరీతమైన పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. దీంతో చేసేది లేక రైతులు తమ సొంత ఖర్చులతో ఎలుకలను పట్టిస్తున్నారు. సొంత రైతులు అయితే కొంతమేర ఇబ్బంది లేదు గాని కౌలు రైతులు అధిక ఖర్చుతో అల్లాడిపోతున్నారు. రైతులంతా ఒకేసారి ఈ కార్యక్రమం చేపట్టడంతో ఎలుకలు పట్టుకునే వారికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక్కో ఎలుకకు రైతుల నుంచి రూ.40 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ఎలుకల మందును వాడినందుకు తగిన ఫలితాన్ని అనుభవించాము అని రైతులు వాపోతున్నారు. ఏమాత్రం ప్రయోజనం లేదు ప్రభుత్వం అందించిన ఎలుకల మందు వాడటం వల్ల పెద్దగా ప్రభావం చూపడం లేదు. చెప్పినంతగా ఫలితాలు రావడం లేదు. ఎలుకల ఉధతి పంటపై తీవ్రంగా ఉండడంతో సొంత ఖర్చుతో నిర్మూలించుకోవాల్సి వస్తోంది. దీంతో ఖర్చు తడిసిమోపెడవుతోంది. – పీవీ గోపాలకష్ణంరాజు, రైతు, యండగడి అధిక వర్షాల వల్లే.. సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో కొంత మేర ఫలితాలు వచ్చాయి. వర్షాలు అధికంగా కురవడంతో ఎలుకల మందు అంతగా ఫలించలేదు. అయితే రైతులంతా సామూహికంగా ఎలుకల నిర్మూలన చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. – వై.సాయిలక్ష్మీశ్వరి, జేడీ, వ్యవసాయ శాఖ -
రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు
-
రైల్వే మంత్రికి ప్రముఖ నటి ఫిర్యాదు
ముంబై: రైలులో ప్రయాణిస్తుండగా తన బ్యాగును ఎలుక కొరికేసిందని ప్రముఖ మరాఠి నటి నివేదిత సరాఫ్.. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు ఫిర్యాదు చేశారు. రైళ్లలో ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. రైలులో తనకెదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రికి వివరించారు. సెప్టెంబర్ 22న లాతూర్ ఎక్స్‌ప్రెస్ లో ఏసీ బోగీలో ఆమె ప్రయాణించారు. తన బ్యాగును తల పక్కన పెట్టుకుని నిద్రపోయింది. లేచి చూసేసరికి ఆమె బ్యాగును ఎలుక కొరికేసింది. రైలు ప్రయాణం తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని ఆమె వాపోయింది. ఎలుక కొరికిన బ్యాగు ఫొటో కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిపై సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ స్పందించారు. ఎలుకలను పెస్ట్ కంట్రోల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పట్టుకుంటారని చెప్పారు. ప్రయాణికులు ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తున్నామని సెంట్రల్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. నివేదిత సరాఫ్ ఫిర్యాదు నేపథ్యంలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని పెస్ట్ కంట్రోల్ సిబ్బందికి చెబుతామన్నారు. 22 Sept Latur Express A1 27 rat did this to my bag while I was sleeping. bag was near my head. horrible @RailMinIndia @sureshpprabhu pic.twitter.com/9HYJaLKY8d — Nivedita Saraf (@nivisaraf) 26 September 2016 -
మూషికాలయం
టూర్‌దర్శన్ : కర్ణిమాత ఆలయంలో ఎక్కడ చూసినా ఎలుకలే ఎలుకలు... వేల సంఖ్యలో ఎలుకలు... గుంపులు గుంపులుగా ఎలుకలు.. ఎవరి పాదాల మీదుగా ఆ ఎలుకలు పరుగులు తీస్తాయో వారికి అమ్మ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నట్టు, అదృష్టం కలిసొచ్చే కాలం దగ్గర్లోనే ఉన్నట్టు భక్తుల నమ్మకం. ఎలుకలు ఉన్న ప్రసాదమే భక్తులకు పంపకాలు.. ఇలా ఎన్నో వింతలు గల ఈ ఆలయానికి వెళ్లొద్దాం రండి... ప్రపంచంలో ఎలుకలకు ఆలయం ఉన్న ఒకే ఒక్క ప్రాంతం మన దేశంలోని రాజస్థాన్‌లోని దేష్నోక్ గ్రామం. ఇది రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ సరిహద్దులో ఉంది. బికనీర్ జిల్లాను ఒంటెల దేశంగా పిలుస్తారు. దేష్నోక్ గ్రామాన్ని గతంలో ‘దస్నోక్’ అని పిలిచేవారు. ఈ గ్రామం పది చిన్నగ్రామాల మూలల భాగాల నుంచి ఏర్పడింది కాబట్టి ఆ పేరు వచ్చిందని చెబుతారు. ఈ గ్రామమే కర్ణిమాత దేవాలయానికి ప్రసిద్ధి. పాలరాతి గోడలు.. వెండి ద్వారాలు... హిందువుల దేవతైన దుర్గామాత మరో అవతారమే కర్ణిమాతగా కొలుస్తారు. సిందూరం రాసిన ఏకశిల మీద అమ్మవారు చతుర్భుజాలతో దర్శనమిస్తుంది. ఒక చేత త్రిశూలం, మరో చేత రాక్షస తల పట్టుకొని సింహవాహినిగా భక్తుల చేత పూజలందుకుంటుంది. జోధ్‌పూర్, బికనీర్ రాజవంశీయులకు కర్ణిమాత కులదైవం. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో గంగాసింగ్ అనే రాజు నిర్మించినట్టుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయం 20వ శతాబ్దపు మొదట్లో పునర్నిర్మించారు. మొఘలుల శిల్పకళానైపుణ్యం ఇక్కడి గోడల మీద ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆలయం ముందు భాగమంతా పాలరాతి వైభవంతో విరాజిల్లుతుంది. వెండి తాపడం చేసిన ద్వారాలు అబ్బురపరుస్తాయి. ఈ ఆలయానికి వెండి ద్వారాలు, నగిషీలు చెక్కిన పాలరాతిని హైదరాబాద్‌కు చెందిన కర్ణి ఆభరణ తయారీదారులు ఇచ్చినట్టు కథనాలు ఉన్నాయి. ఈ ఆలయంలోనే దాదాపు 20 వేలకు పైగా ఎలుకలు ఉన్నాయి. భక్తుల రాకపోకలకు ఏమాత్రం జంకకుండా అవి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. భక్తుల పాదాల మీదుగా పరుగులు తీస్తుంటాయి. భక్తులు పెట్టిన నైవేద్యాలను, పాలు, పెరుగు, పండ్లు, స్వీట్లు ఆరగిస్తుంటాయి. కథలకు నెలవు కర్ణిమాత కర్ణిమాత బాల్యం నుంచి దుర్గాదేవి ఉపాసకురాలు. ఈమె 150 సంవత్సరాలు జీవించిందని తెలుస్తోంది. పుట్టుకతోనే ఈమెకు అతీంద్రియ శక్తులు ఉండేవని ప్రచారం. తనకున్న శక్తులతో పేదలు, భక్తుల సమస్యలు పరిష్కరించేదని ప్రతీతి. అందుకే ప్రజలు ఆమెను దేవతలా కొలవడం ప్రారంభించారు. ఒకరోజు ఆమె ఆకస్మాత్తుగా తన ఇంట్లోనే అదృశ్యమైంది. ఎవరికీ కనిపించలేదు. ఆమెకు అక్కడే ఆలయం నిర్మించి, నాటి నుంచి పూజలు జరిపారు. కొంతకాలానికి భక్తులతో ఆమె మాట్లాడుతూ తమ వంశస్థులంతా త్వరలోనే చనిపోతారని, వారంతా ఎలుకలుగా జన్మించి ఇక్కడే ఉంటారని, వారికి అన్నపానీయాలు సమర్పించి ధన్యులు కమ్మని చెప్పిందట. ఆ సమయంలో కర్ణిమాత వంశంలో దాదాపు 600 కుటుంబాలు ఉండేవట. మాత చెప్పిన విధంగానే కొన్ని రోజులకు ఆ కుటుంబాల వారంతా మరణించడం, ఆ తర్వాతే ఈ ఆలయంలో ఎలుకలు గుంపులు గుంపులుగా రావడం చూసిన వారంతా కర్ణిమాత వంశీయులే ఎలుకలుగా మారారని భావించారు. నాటినుంచే ఈ ఎలుకలను కర్ణిమాతతో సమానంగా పూజించడం మొదలుపెట్టారట. ఆలయం వద్ద దాదాపు 20 వేల ఎలుకలు తిరుగాడుతుండటం వెనక మరో జానపద కథ కూడా వినిపిస్తుంది. 20 వేల మంది బలమైన సైన్యం ఒకానొక యుద్ధంలో ఓడిపోయి, పారిపోయి దేష్నోక్ గ్రామానికి చేరుకుంది. ఆ ప్రాంతానికి వచ్చాక యుద్ధం నుంచి పారిపోవటం మహాపాపమని, దానికన్నా మరణమే మేలు అని తెలుసుకున్న వారు తమకు తామే మరణశిక్ష విధించుకున్నారు. కర్ణిమాత వారి ఆత్మహత్య దోషం పోవడానికి ఈ ఆలయంలో ఎలుకలుగా ఉండిపొమ్మని చెప్పిందట. సైనికులంతా కర్ణిమాతకు తమ కృతజ్ఞతలు తెలియజేస్తూ అక్కడే ఉండిపోయారట. అలా మానవులే ఎలుకలుగా పునర్జన్మ ఎత్తినట్టుగా భావిస్తారు. ఇక్కడ ఎలుకల రెట్టలు గానీ, వాటి నుంచి ఎటువంటి వాసన కూడా రాకపోవడం విచిత్రం. తెల్లని ఎలుకలు దేవతాస్వరూపాలు... వేల కొలది నల్లని ఎలుకల మధ్య కొన్ని తెల్లని ఎలుకలు కనిపించడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. కర్ణిమాతకు ముగ్గురు పిల్లలు పుట్టి పురిట్లోనే కన్నుమూశారు. దీంతో ఆమె తన భర్తకు సొంత చెల్లెలినే ఇచ్చి వివాహం చేసింది. వారి కుమారుడు ఒకసారి ఆడుకుంటూ కపిల్ సరోవర్‌లో పడి చనిపోయాడు. కర్ణిమాత ఆ బిడ్డ ప్రాణాలను ఇవ్వమని యముడిని వేడుకుంది. యముడు ఆమె ప్రార్థనలకు కరగలేదు. కర్ణిమాత దుర్గాదేవి అనుగ్రహంతో ఆ కుమారుడిని బతికించుకుంది. అంతేకాదు ఆ కుమారుడితో పాటు ఆమె మిగతా ముగ్గురు బిడ్డలూ తిరిగి బతికారట. ఈ ఆలయంలో కనిపించే నాలుగు తెల్లని ఎలుకలు కర్ణిమాత బిడ్డలేనని, ఆ నాలుగు ఎలుకలు కనిపించిన వారికి కర్ణిమాత పూర్తి ఆశీస్సులు లభించినట్టే అని భక్తుల నమ్మిక. అందుకే ఆ నాలుగు తెల్లని ఎలుకలు కనిపించేదాక భక్తులు అక్కడే కూర్చొని ఓపికగా ఎదురుచూస్తుంటారు. అయితే, ఈ తెల్ల ఎలుకలు ముఖ్యమైన వేడుకలలో మాత్రమే కనిపించడం విశేషం. వివిధ ప్రాంతాలలో కర్ణిమాత ఉదయపూర్ మచ్లా హిల్స్‌లో మరో కర్ణిమాత దేవాలయం ఉంది. అలాగే రాజస్థాన్ చారిత్రక పట్టణమైన అల్వార్‌లో కర్ణిమాత దేవాలయం ఉంది. ఇక్కడ అమ్మవారి మూర్తిని దర్శించుకోవచ్చు గానీ, ఎలుకలు మాత్రం ఉండవు. వెండి ఎలుక ఎలుకలకు ఆహారం ఇవ్వడం గొప్ప వరంగా భక్తులు భావిస్తారు. అయితే, ఈ ఆలయంలో పొరపాటున ఎవరి వల్లనైనా ఎలుక చనిపోతే వారు అంతే బరువు గల వెండి ఎలుకలను ఆలయానికి ఇచ్చి దోషాన్ని పోగొట్టుకోవాలి. అమ్మవారి ఎదుట ఎలుకలున్న నైవేద్యాన్నే భక్తులకు ప్రసాదంగా పంచుతారు. ఏడాదికి రెండుసార్లు ఉత్సవాలు కర్ణిమాత ఆలయంలో ఉదయం 4 గంటలకు తొలి పూజ మొదలవుతుంది. పూజారులు అమ్మవారికి నైవేద్యాలు, మంగళహారతి సమర్పించి, మృదంగ ధ్వనులను వినిపిస్తారు. అప్పటి వరకు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని ఎలుకలన్నీ గర్భాలయం నుంచి బిరబిరా బయటకు వస్తాయి. పెద్ద పెద్ద పళ్లాలలో పెట్టిన నైవేద్యాన్ని ఆబగా ఆరగిస్తాయి. ఆ తర్వాత భక్తులు సమర్పించే నైవేద్యాలను తింటూ, ఆలయంలో తిరుగుతూ రోజంతా గడిపేస్తాయి. తిరిగి రాత్రి సమయంలో గర్భాలయంలోకి వెళ్లిపోతాయి. ప్రతీ ఏటా ఈ ఆలయంలో మొదటి వేడుక చైత్ర మాసంలో (మార్చ్-ఎప్రిల్) లో, రెండవ వేడుక ఆశ్వీయిజ మాసం( సెప్టెంబర్ - అక్టోబరు)లో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ నవరాత్రుల సందర్భంగా వేలాది భక్తులు కాలినడకన అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఎలా వెళ్లాలంటే ⇒ బికనీర్ ప్రాంతానికి దేష్నోక్ 30 కిలోమీటర్ల దూరం ⇒ బికనీర్ నుంచి దేష్నోక్ చేరుకోవడానికి బస్సు సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి టికెట్ రూ.20 ⇒ దేష్నోక్ కి విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలలో తేలికగా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం జోధ్‌పూర్‌లో ఉంది. ఇక్కడ నుంచి కలకత్తా, చెన్నై, బెంగుళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు విమాన సదుపాయాలున్నాయి ⇒ జోధ్‌పూర్‌లో రైల్వేస్టేషన్ ఉంది ఆగ్రా, ఢిల్లీ, అజ్మీర్, జోధ్‌పూర్, అహ్మదాబాద్, జైపూర్, జైసల్మేర్, ఉదయపూర్, బర్మార్.. నగరాల నుండి ప్రతిరోజూ బస్సు సదుపాయాలున్నాయి ⇒ అన్ని కాలాలలోనూ ఉష్ణోగ్రతలు అధికమే. సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి నెలలు సందర్శనకు అనుకూలం ⇒ ఇక్కడ విజయ్స్ గెస్ట్ హౌస్‌లు ఉన్నాయి. వీటిని క్యామెల్ మ్యాన్స్ గెస్ట్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇందులో గది రూ.500 నుంచి రూ. 800లకు లభిస్తాయి. అల్పాహారం రూ.125, లంచ్ 150, డిన్నర్ 150. వైఫై సదుపాయం ఉంటుంది. కంప్యూటర్ ఉపయోగించుకోవాంటే గంటకు రూ. 60. సమీప దర్శనీయ స్థలాలు: బికనీర్ జిల్లాలో జునాగఢ్ కోటతో పాటు పెద్ద పెద్ద మహల్లు ఉన్నాయి. లాల్‌గడ్ ప్యాలెస్, శివ్బరి ఆలయం, గంగా గోల్డెన్ జూబ్లీ మ్యూజియమ్, గజ్నేర్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, ప్రాచీన మ్యూజియమ్, కోట్ గేట్, భండాసర్ జైన్ టెంపుల్, ఒంటెల జాతీయ పరిశోధన కేంద్రం, లక్ష్మీనారాయణ దేవాలయం, ఎర్రటి రాతి కోటలు, కట్టడాలు .. ఇలా ఎన్నో సందర్శించదగినవి ఈ ప్రాంతంలో కొలువుదీరాయి. - నిర్మలా రెడ్డి -
టీ సచివాలయంలో ఎలుకలు వీరవిహారం
-
‘వరి’లో ఎలుకలను నివారిద్ధాం ఇలా...
గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ సలహాలు, సూచనలు గజ్వేల్: వరిలో ఎలుకల బెడద రైతులను కలవరానికి గురిచేస్తున్నది. శాస్త్రీయంగా ఆలోచించి రైతులు కొన్ని చిట్కాలను, క్రిమిసంహారక మందులను వాడితే పంటలను రక్షించుకోవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్(సెల్ః 7288894469) అందించిన సలహాలు, సూచనలివి... ఎలుకల నివారణకు చర్యలు పంట చేలలోని గెట్లపై ఎలుకల రంధ్రాలలో పొగపెట్టినట్లయితే ఎలుకలు కొన్ని చనిపోవడం, మరికొన్ని ఆ వ్యవసాయ క్షేత్రం నుండి వెళ్లిపోవడం జరుగుతుంది. అంతేకాక ఎలుకలు గెట్లపై ఏర్పర్చుకున్న రంద్రాల వద్ద ఎలుక బోన్లు పెట్టడం ద్వారా వాటిని çపట్టవచ్చు. కానీ ఈ విధానాలు రైతులకు కొద్దిగా శ్రమతో కూడుకున్న పని. ఓపికగా పాటిస్తే ఎలాంటి రసాయనిక మందులు వాడకుండానే నివారించవచ్చు. చిట్కాలతో నివారణ వరి పైర్లలో మూడునాలుగు మీటర్లకు ఒక కర్రను పాతి దానికి కొద్దిగా ధ్వని వచ్చే విధంగా ఏవైనా పాలితిన్ కవర్లను, వరి గడ్డిని వేసి బురదను పెట్టి ఉంచాలి. ఎలుకలు మామూలుగా పంటచేనులో విచ్చల విడిగా అక్కడా ఇక్కడా తిరుగుతుంటాయి. తిరిగినపుడు ఈ కట్టెను తాకగానే మనిషి ఉన్నట్లుగానే అవి భయానికి గురవుతాయి. ఆ ప్రాంతానికి రావడానికి సాహసించవు. అలాగే రెండుమూడు మీటర్లకు ఒకటి చొప్పున వరి పొలంలో మొత్తం పాతితే చాలా వరకు ఎలుకలను నివారించవచ్చు. ఈ చిట్కాను పాటించడం రైతులకు చాలా తేలిక. క్రిమిసంహారక మందులతో నివారణ శాస్త్రీయ పద్దతి ప్రకారం ఎలుకల నివారణకు క్రిమిసంహారక మందులను వాడటం వల్ల నివారించవచ్చు. కానీ రైతులు ఈ మందుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బ్రొమోడలైన్ 50మి.గ్రా. రెండు కిలోల బియ్యంలో కలిపి పెడితే ఎలుకలు మృత్యువాతకు గురవుతాయి. బియ్యం, నూనె కలిపి మందు కలపకుండానే రెండ్రోజులు ఎలుకలు ఏర్పర్చుకున్న రంధ్రాల వద్ద పెట్టాలి. వాటికి ఇవి తినొచ్చు అనే నమ్మకం కలిగిన తర్వాత బియ్యంలో మందు కలిపి పెట్టినట్లయితే తింటాయి. తినగానే వెంటనే చనిపోతాయి. మందు పెట్టడంలో రైతులు జాగ్రత్త వహించకపోతే హాని కలిగే అవకాశమున్నది. అల్యూమినియం పాస్పేట్, జింక్ సల్ఫేట్‌తో తయారు చేసిన బిస్కెట్ పెట్టడం వల్ల కూడా ఎలుకలు చనిపోతాయి. ఆ బిస్కెట్ గాలి ద్వారా వ్యాపించి ఎలుకలు గాలిని పీల్చగానే మృత్యువాతకు గురవుతాయి. కానీ ఈ విధానం రైతులకు నష్టం వాటిల్లే అవకాశమున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఈ మందును ప్రయోగించడం మంచిది. -
ఎలుకలు, బొద్దింకల్లో జీపీఎస్!
వాషింగ్టన్: కొత్త పరిసరాలను కనుక్కోవడానికి ఎలుకలు, బొద్దింకలు తమ మెదళ్లలో ఉన్న గ్లోబల్ పొషిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) వంటి విధానాన్ని ఉపయోగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవులలాగే వివిధ జంతువులు కూడా ఈ పద్ధతిని వినియోగిస్తున్నాయని పరిశోధకులు తెలిపారు. బొద్దింకలు తమని తాము ఎలా నావిగేట్ చేసుకుంటాయన్న దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. క్షీరదాలు కొత్త ప్రాంతానికి వెళ్లినపుడు, ఏ దిశలో వెళ్లాలో తెలియక చుట్టూ మార్గాన్ని వెతుక్కుంటాయనని అమెరికాలోని కేస్ వెస్టర్న్ రిజర్వ్ వర్సిటీ ప్రొఫెసర్ రాయ్ రిజ్మన్ తెలిపారు. మానవుడితోపాటు క్షీరదాలన్నీ మెదడు సంకేతాలపై ఆధారపడి సాగుతాయన్నారు. -
సిబ్బంది నిర్లక్ష్యం... రోగిని కొరుక్కుతిన్న ఎలుకలు
-ప్రాణాపాయస్థితిలో రోడ్డుపై బాధితుడి ఆర్తనాదాలు -పోలీసుల చొరవతో తిరిగి ఆస్పత్రికి నెల్లూరు : నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో మానవత్వం మంటకలిసింది. ఆస్పత్రిలో ఉన్న రోగికి సపర్యలు చేయాల్సి వస్తుందని భావించిన కొందరు సిబ్బంది రోగిని రోడ్డుపై పడేశారు. నడవలేని స్థితిలో రెండు రోజులుగా డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్న రోగి కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ప్రాణాపాయస్థితిలో సదరు రోగి ఆర్తనాదాలు చేస్తుండటంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల చొరవతో ఆ రోగిని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ హృదయ విదారక సంఘటనకు జిల్లా ప్రభుత్వ బోధనాస్పత్రి వేదికైంది. వివరాలు ఇలా ఉన్నాయి.... ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు కాళ్లు చచ్చుబడిపోయి తీవ్ర అనారోగ్యంతో నెల్లూరు చెరువు వద్ద పడి ఉండడాన్ని 108 సిబ్బంది గుర్తించారు. ఈ నెల 25వ తేదీన అతడ్ని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో చేర్పించారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కాని రెండురోజులుగా ఆ రోగి ఆస్పత్రి బయట (మెటర్నిటీ హాస్పిటల్‌కు వెళ్లే గేటు సమీపంలో) డ్రైనేజీ కాలువ వద్ద పడి ఉన్నాడు. కాలువ పక్కనే పడి ఉండటంతో అతని కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరుక్కు తిన్నాయి. దీంతో వేళ్లలోని కండరాలు బయటకు వచ్చాయి. శనివారం వేసవి వేడికి అతడు బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు ఈ విషయాన్ని గమనించి ఆస్పత్రి సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఐదోనగర ఎస్ఐ జగత్సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోగి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండటంతో వెంటనే అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి వైద్యులు అతడికి పరీక్షలు నిర్వహించి ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. అతనికి నా అనే వారు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. దీంతో అతనికి అన్ని సేవలు వైద్యసిబ్బందే చేయాల్సి ఉంది. మూత్ర, మల విసర్జన సైతం బెడ్‌పైనే. దీంతో ఇవ్వన్నీ చేయలేకనే మానవత్వం మరచిన వైద్య సిబ్బంది స్థానిక సెక్యూరిటీ గార్డుల సాయంతో రాత్రికి రాత్రే రోగిని ఆస్పత్రి బయట వదిలివేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండురోజులుగా సదరు రోగి రోడ్డుపైనే నరకయాతన పడుతున్నా ఎవరికీ కనికరం కలగలేదు. ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది అటువైపుగా నిత్యం రాకపోకలు సాగిస్తున్నా కనీసం పట్టించుకొన్న దాఖలాలు లేవు. చివరకు స్థానికులు స్పందించి పోలీసుల చొరవతో రోగిని ఆస్పత్రిలో చేర్పించారు. ఇది ఇలా ఉంటే ఈ ఘటనపై వైద్యసిబ్బంది మాత్రం మరోలా చెబుతున్నారు. సదరు రోగికి మతిస్థిమితం లేదనీ... దీంతో అతడు తరచూ ఆస్పత్రిలోనుంచి బయటకు నడుచుకుంటూ వెళ్లిపోయేవాడని ... తాము పలుమార్లు అతడిని పట్టుకొచ్చినా ఫలితం లేకుండాపోయిందని చెబుతున్నారు. రెండు కాళ్లు చచ్చుబడి తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన రోగి నడుచుకుంటూ ఎలా వెళుతాడని ప్రశ్నించగా దానిపై మాత్రం ఆసుపత్రి సిబ్బంది సమాధానం దాటేశారు. అక్కడున్న కొందరు రోగులు మాత్రం రెండురోజులు కిందటే ఆస్పత్రి సిబ్బందే అతడ్ని బయట పడేశారని చెబుతున్నారు. ప్రభుత్వ బోధానాస్పత్రిలో ఇలాంటి ఘటనలు షరా మామూలేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటోంది. సకాలంలో వైద్య సేవలు అందక ఎందరో మృతి చెందిన ఘటనలు లేకపోలేదు. కొందరు చివరి పరిస్థితుల్లో బతుకు జీవుడా అంటూ ప్రైవేటు హాస్పిటల్స్‌కు తరలివెళుతున్నారు. ఆస్పత్రి ప్రాంగణం పరిశీలిస్తే నిత్యం ఎంతో మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి బయటే పడుకొని ఉండటం దర్శనమిస్తుంది. వారికి కనీస వైద్యసేవలు అందించాలన్న చిత్తశుద్ధి అటు వైద్యుల్లో... ఇటు సిబ్బందిలో కొరవడింది. -
మనుషుల్లో టీబీని గుర్తించే ఎలుకలు
బ్రస్సెల్స్: శిక్షణ పొందిన ఎలుకల ద్వారా మందుపాతరలను కచ్చితంగా గుర్తిస్తూ వచ్చిన అపోపో (ఏపీఓపీఓ) అంతర్జాతీయ సంస్థ ఇప్పుడు ఆఫ్రికాకు చెందిన ఎలుకలకు శిక్షణ ఇవ్వడం ద్వారా మనుషుల్లో టీబీ (ట్యూబర్క్లోసిస్)ని కచ్చితంగా గుర్తిస్తోంది. కొన్ని కేసుల్లో ల్యాబ్ టెక్నీషన్ కూడా టీబీని గుర్తించడంలో విఫలం చెందవచ్చని, కానీ తమ సంస్థ డాక్టర్లు శిక్షణ ఇచ్చిన ఎలుకలు మాత్రం టీబీని కచ్చితంగా గుర్తిస్తున్నాయని అపోపో, అమెరికా డెరైక్టర్ చార్లీ రిక్టర్ తెలియజేస్తున్నారు. ఓ మనిషిలో టీబీని గుర్తించాలంటే ల్యాబ్ టెక్నీషన్కు కనీసం నాలుగు రోజులు పడుతోందని, అదే శిక్షణ పొందిన ఓ ఎలుక 20 నిమిషాల్లో వంద శాంపుళ్లను గుర్తిస్తుందని రిక్టర్ వివరించారు. చాలా చౌకైన ఈ విధానాన్ని ప్రస్తుతం టాంజానియా, మొజాంబిక్ జైళ్లలో అమలు చేస్తున్నామని, త్వరలోనే ఈ విధానాన్ని ఈ దేశాల్లోని అన్ని జైళ్లలో అమలు చేస్తామని ఆయన తెలిపారు. పేద దేశాలకు ఈ విధానం ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. కఫంలోని శ్లేష్మం వాసనను పసిగట్టడం ద్వారా ఎలుక టీబీని గుర్తిస్తుందని, శాంపిల్‌లో టీబీ ఉన్న విషయాన్ని గుర్తించినట్లయితే ఎలుక కాసేపు దానిపైనే తచ్చాడుతుందని ఆయన వివరించారు. అయితే ఎలుక ద్వారా టీబీని గుర్తించే విధానాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడం లేదు. ఏ కొత్త విధానమైనా ల్యాబరేటరీ టెస్ట్‌లకు నిలబడాలని, కచ్చితమైన డాటా ఉండాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదన. వైద్య విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన నేటి కాలంలో కూడా ఎయిడ్స్ తర్వాత ఎక్కువ మంది టీబీ కారణంగా మృత్యువాత పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 90 లక్షల మంది టీబీ బారిన పడుతుంటే అందులో 20 లక్షల మంది మరణిస్తున్నారు. -
ఎలుకలు తిరుగుతున్నాయ్ జాగ్రత్త!
డీఆర్ఓ ధర్మారెడ్డి సాక్షి, రంగారెడ్డి జిల్లా : కలెక్టరేట్ ఆవరణలో ఇష్టానుసారంగా ఆహార వ్యర్థాలను వేయడంతో ఎలుకలు సంచరిస్తున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి అన్నారు. పరిశుభ్రత పాటిస్తే వాటి బెడద ఉండదని గుర్తుచేశారు. స్వచ్ఛ్భారత్‌లో భాగంగా బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రతి 15 రోజులకోసారి కార్యాలయ అధికారి తనిఖీ చేయాలన్నారు. త్వరలో కలెక్టరేట్లోని ప్రతి కార్యాలయానికి రెండు చెత్తబుట్టలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. -
జీజీహెచ్‌లో 1,251 ఎలుకల పట్టివేత
గుంటూరు మెడికల్ : ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ఎలుకల వేట కొనసాగుతోంది. బుధవారం నాటికి 1,251 ఎలుకలను పట్టుకున్నారు. గత ఏడాది ఆగస్టు 26న ఎలుకల దాడిలో పసికందు మృతి చెందిన సంఘటనతో అధికారులు ఎలుకల నిర్మూలన కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. జిల్లాలోని వట్టిచెరుకూరుకు చెందిన సీహెచ్ హనుమంతురావు, నాగలక్ష్మి దంపతులు ప్రతి రోజూ వార్డుల్లో ఎలుకలను పట్టే బోన్లు అమర్చుతున్నారు. బోనులో ఉన్న ఆహారం కోసం వచ్చిన ఎలుకలు వాటిలో ఇరుక్కొని చనిపోతున్నాయి. చనిపోయిన వాటిని వెంటనే అధికారులకు లెక్క చూపించి మళ్లీ నూతనంగా బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి ఆస్పత్రి అధికారులు ఎలుకను పట్టినందుకు రూ.20 చొప్పున అందిస్తున్నారు. శానిటేషన్ కాంట్రాక్టర్ నుంచి నెలకు రూ.6 వేలు వేతనం ఇప్పిస్తున్నారు. ఎలుకలు పూర్తిగా నిర్మూలన అయ్యేవరకు ఎలుకల వేట ఆస్పత్రిలో కొనసాగుతుందని అధికారులు తెలిపారు. -
ఎలుకలు కొరికాయి...రూ.10లక్షలు చెల్లించండి
రాంచి: రైలులో ఎలుకల స్వైర విహారం వివాదాన్ని సృష్టించింది. రాంచీ నుంచి హౌరా వెళ్లేందుకు గాను రిటైర్డ్ ఛీప్ ఇంజనీర్ పీసీ సిన్హా , అతని భార్య అల్కా గత ఏడాది డిసెంబర్ 30 న టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్ లో సుఖంగా ప్రయాణం చేద్దామనుకున్న ఈ సీనియర్ దంపతులు మూషికాలతో అష్టకష్టాలు పడ్డారు. సుఖం, సౌకర్యం మాట దెవుడెరుగు చివరకు ఆసుపత్రి మెట్లుఎక్కి, టీకాలు వేయించుకోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే ... బొకారో స్టీల్ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసి రిటైర్ అయిన సిన్హా, ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అల్కా టికెట్స్ బుక్ చేసుకుని రైలు ఎక్కారు. అర్ధరాత్రి దాటిన తరువాత ఆ బోగీలోని ప్రయాణీకులకు కంటిమీద కునుకు కరువైంది. కంపార్ట్మెంట్లో ఎక్కడ చూసిన ఎలుకల మయం. ఎలుకల విసర్జకాలతో దుర్గంధపూరితంగా తయారైంది అక్కడి వాతావరణం. అక్కడితో వీరి కష్టాలు ఆగిపోలేదు. దొరికిని వారిని దొరికినట్టు ఎలుకలు కొరికేయడం మొదలుపెట్టాయి. దీంతో సిన్హాతో పాటు మరో నలుగురి ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఎలుకల సంచారంతో పరిస్థితి అంతా గజిగజి గందరగోళంగా తయారవ్వడంతో సత్రంగంజ్ స్టేషన్లో దాదాపు అరగంటసేపు రైలును ఆపివేశారు. ఈ క్రమంలో సిన్హా దంపతులు గ్రీవియెన్స్ సెల్లో ఫిర్యాదు చేశారు. రైల్వే శాఖ సిబ్బంది నిర్వాకం వల్ల తమకు కలిగిన అసౌకర్యానికి గాను 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాల్సిందిగా డిమాండ్ చేశారు. హై క్లాస్ బోగీల్లో ఎలుకల స్వైర విహారంపై సిన్హా మండిపడ్డారు. తన జీవితంలో ఇంత పెద్ద ఎలుకల్ని ఎక్కడా చూడాలేదని ఆయన అన్నారు. ఒకవైపు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ గురించి విస్రృతంగా ప్రచారం చేస్తోంటే, మరోవైపు రైల్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఎలుకల కాటు వల్ల అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉందన్నారు. అసలే డయాబెటిక్ రోగినైన తనను ఎలుకలు 3 మిల్లీమీటర్ల మేర కొరికి పారేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి కోలకత్తా చేరిన తరువాత రాబిస్ టీకాలు వేయించుకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ రైళ్లను శుభ్రంగా ఉంచడం తెలియని ప్రభుత్వాలు బుల్లెట్ ట్రెయిన్ల కోసం కలలు కంటున్నాయని సిన్హా భార్య అల్కా మండిపడ్డారు. సిన్హా దంపతుల ఫిర్యాదును పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆగ్నేయ రైల్వే అధికారి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ఇంకా తనకు సమాచారం అందలేదని, ఫిర్యాదు అందిన అనంతరం అవసరమైన చర్యలను తీసుకుంటామని రాంచి డివిజనల్ రైల్వే మేనేజర్ దీపక్ కుమార్ చెప్పారు. -
కుక్కంత ఎలుక!
మెల్బోర్న్: ప్రస్తుత ఎలుకలకు దాదాపు పది రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉన్న ఏడు భారీ ఎలుక శిలజాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి ఏకంగా శునకం పరిమాణంలో ఉన్నట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ జూలియన్ లూయిస్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం తూర్పు తైమూర్‌లో ఈ శిలాజాలను గుర్తించింది. ఇప్పటివరకూ గుర్తించిన ఎలుక జాతుల్లో ఇవే అతిపెద్దవని లూయిస్ తెలిపారు. ఇవి ఐదు కిలోలకు పైగా ఉన్నట్లు చెప్పారు.సాధారణంగా ఎలుకలు అరకిలో ఉంటాయని తెలిపారు. తాజాగా గుర్తించిన ఎలుక జాతులు అంతరించిపోవడానికి గల కారణాలపై ప్రస్తుతం దృష్టిసారించినట్లు చెప్పారు. ఖనిజ పనిముట్లు వాడకం ప్రారంభమైన తరువాత పెద్ద సంఖ్యలో అడవులు నరికివేత కారణంగా ఈ ఎలుక జాతులు కనుమరుగై ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఈశాన్య ఆసియాలో తొలి మానవ సంచారం గురించి తెలుసుకునే ప్రాజెక్టులో భాగంగా లూయిస్ బృందం పనిచేస్తోంది. -
ఎలుకలు, పిల్లులు, కుక్కలను రానివ్వొద్దు
అవసరమైతే వీటి నియంత్రణకు ప్రత్యేక ఏజెన్సీ ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ తాజా నివేదిక హైదరాబాద్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకల దాడిలో శిశువు మృతి చెందిన ఘటన అటు ఆస్పత్రికి, ఇటు సిబ్బందికి ఇప్పటికీ భయాందోళన కలిగిస్తూనే ఉంది. బోధనాసుపత్రుల్లో ఇప్పటికీ ఎలుకలు వేల సంఖ్యలో కనిపిస్తున్నాయి. శిశువుల వార్డులో తల్లిదండ్రులతో పాటు నర్సులకు నిద్ర కరువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ఆవరణలో ఎలుకలు, పిల్లులు, కుక్కలు, పందులు, పందికొక్కులు వంటివాటి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, లేదంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అవసరమైతే వీటి నిర్మూలనకు ప్రత్యేక ఏజెన్సీని నియమించైనా ఇలాంటి వాటిని నియంత్రించాలని సూచించారు. మళ్లీ వస్తూనే ఉన్నాయి.. ప్రధానంగా ఆస్పత్రుల్లో ప్రతి వార్డులోనూ ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయని, ఎన్ని పట్టినా మళ్లీ వస్తూనే ఉన్నాయని, వీటికోసం ఇప్పటికే మందులు ఉపయోగించడం, బోన్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని సూచించారు. రోగులు, రోగుల సహాయకుల భోజన వసతులకు ప్రత్యేక గదులు కేటాయించి, భోజనానంతరం వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు పడేసేందుకు చర్యలు తీసుకుంటే బావుంటుందని నివేదికలో పేర్కొన్నారు. గుంటూరు ఘటన అనంతరం పారిశుధ్య కాంట్రాక్టర్ పూర్తిగా ఎలుకల మీదనే దృష్టి సారించారని, ఎలుకల నివారణకు మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలని కోరారు. ప్రభుత్వాసుపత్రుల్లో దోమల కారణంగా ఇన్‌పేషెంట్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటికైనా నెట్ (దోమతెర)లు ఏర్పాటు చేస్తే బావుంటుందని సూచించారు. ఇకపై పారిశుధ్య కాంట్రాక్టర్ పనితీరు, 96 శాతానికి మించితేనే 100 శాతం బిల్లులు ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నారు. -
లగేజ్‌లో ఎలుకలు..బల్లులు.. పాములు
విదేశాలకు వెళ్లిన వారు తిరుగు ప్రయాణంలో సాధారణంగా అక్కడ ఉండే ప్రత్యేక, అమూల్యమైన వస్తువులను వెంటతెచ్చుకుంటారు. కానీ గురువారం చెన్నై విమానాశ్రయంలో రోజువారి తనిఖీలలో భాగంగా విదేశాల నుండి వచ్చిన ఓ వ్యక్తి లగేజ్‌ను చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు. దానికి కారణం.... మలేసియా నుండి 'మలేసియన్ ఎయిర్ లైన్స్' విమానంలో చెన్నైకి వచ్చిన హబీబ్ అనే ప్రయాణికుడు తనతో పాటుగా ఎలుకలు, బల్లులు, పాములను వెంట తెచ్చుకున్నాడు. తనిఖీలలో లభించిన తెల్ల ఎలుకలు, బల్లులు, పాములను కస్టమ్స్ అధికారుల వెంటనే అటవీశాఖ అధికారులకు అప్పగించారు. తమిళనాడులోని రామనాధపురం జిల్లాకు చెందిన హబీబ్.... తన ఇంట్లో పెంచుకోవడానికి ఈ సరిసృపాలను వెంట తెచ్చుకున్నట్లు ఆ జంతు ప్రేమికుడు విచారణలో చెప్పటంతో అధికారులు తెల్లబోయారు. -
'ఇంట్లో ఎలుకల్నే కంట్రోల్ చేయలేకపోతున్నాం'