![Rats In ICU At Kamareddy District Central Hospital - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/11/RATS%5D.jpg.webp?itok=00b-NsnE)
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుకలు తిరుగుతుండగా ఆదివారం కొందరు రోగులు గమనించి ఫొటోలు తీశారు. ఐసీయూతో పాటు ట్రామాకేర్ సెంటర్, అత్యవసర మందులుంచే చోట కూడా ఎలుకలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. గోడలు, ఆక్సిజన్ పైప్‌ల వద్దకే కాకుండా పడకలపైకి కూడా వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. దీనిపై కాగా, జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ‘ఆస్పత్రిలోకి ఎలుకలు రాకుండా నెట్‌లు ఉన్నాయి. ఎలా వచ్చాయో తెలియదు. సోమవారం శానిటేషన్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment