icu
-
జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమం
న్యూఢిల్లీ: ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. 73 ఏళ్ల హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి కొద్ది రోజులుగా బాగా విషమించింది. దాంతో రెండు వారాల క్రితం అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆయన మరణించినట్టు వార్తలొచ్చాయి. జాకీర్ హుస్సేన్ సన్నిహితుడు, ప్రముఖ వేణువాద కళాకారుడు రాకేశ్ చౌరాసియా కూడా తొలుత దాన్ని ధ్రువీకరించారు. కాసేపటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. ‘‘దేశం సంగీత ధ్రువతారను కోల్పోయింది. సంగీత ప్రపంచానికి ఆయన సేవలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. విపక్ష నేత రాహుల్ గాం«దీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, యోగి ఆదిత్యనాథ్, హిమంత బిశ్వశర్మ తదితరులు సంతాపం తెలిపారు. కానీ జాకీర్ హుస్సేన్ మృతి వార్తలను ఆయన సోదరి ఖుర్షీద్ ఖండించారు. ‘‘నా సోదరుని పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్న మాట నిజమే. కానీ ప్రస్తుతానికి ఆయన ప్రాణాలతోనే ఉన్నారు’’ అని తెలిపారు. ‘‘జాకీర్ హుస్సేన్ మరణించారంటూ మీడియాలో, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వార్తలు మమ్మల్నెంతో బాధిస్తున్నాయి. వాటిని నమ్మొద్దని మీడియాకు, ఆయన అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన కోలుకోవాలని అంతా ప్రారి్థంచాల్సిందిగా కోరుతున్నాం’’ అని పీటీఐ వార్తా సంస్థకు వెల్లడించారు. జాకీర్ హుస్సేన్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకు మార్చినట్టు ఆయన మేనేజర్ నిర్మలా బచానీ కూడా పేర్కొన్నారు. కాసేపటికే ఐ అండ్ బీ శాఖ కూడా ఎక్స్‌లో చేసిన సంతాప పోస్ట్‌ను తొలగించింది. బహుముఖ ప్రజ్ఞాశాలి: బహుముఖ సంగీత ప్రజ్ఞకు జాకీర్ హుస్సేన్ నిలువెత్తు నిదర్శనం. హిందూస్తానీ క్లాసికల్ మ్యూజిక్‌తో పాటు జాజ్ ఫ్యూజన్లోనూ తిరుగులేని నైపుణ్యం సాధించారు. గ్రేటెస్ట్ తబలా ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్‌లో ఒకరిగా నిలిచారు. సంగీత దర్శకునిగా కూడా తనదైన ముద్ర వేశారు. ఇన్ కస్టడీ, ద మిస్టిక్ మాసా వంటి సినిమాలకు సంగీతం అందించారు. పలు సినిమాల్లో నటించారు కూడా. ఆయన ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ అల్లా రఖా ఖాన్ కుమారుడు. 1951 మార్చి 9న ముంబైలో జని్మంచిన ఆయన అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. తండ్రి బాటలో నడుస్తూ ఏడేళ్ల చిరుప్రాయంలోనే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయునిగా పేరు తెచ్చుకున్నారు. గొప్ప కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు గడించారు. దేశ విదేశాల్లో లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చారు. జాకిర్ హుస్సేన్ అందుకున్న జాతీయ, అంతర్జాతీయ బహుమతులకు, పురస్కారాలకూ లెక్కే లేదు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. పదేళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. -
'లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్'..!
‘లాస్ట్ హోప్ కాదు... బెస్ట్ కేర్ ఎవరినైనా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చారు అనగానే... ఇక వారు తిరిగి మామూలు వ్యక్తిగా వెనక్కు రావడం అసాధ్యమనేది చాలామంది సాధారణ ప్రజల్లో ఉండే అ΄ోహ. కాసేపు కోలుకున్నట్లుగా కనిపించినా ఐసీయూలో చేర్చేవారిలో చాలామంది ఆరోగ్యం క్రమంగా విషమిస్తుందని అనుకుంటూ ఉండేవారి సంఖ్య ఎక్కువ. కేవలం కొందరు మాత్రమే కోలుకుంటారనే అభిప్రాయాలు చాలా మందిలో వినిపిస్తుంటాయి. నిజానికి ఐసీయూలో గనక చేర్చకపోతేనే మరణావకాశాలు ఎక్కువ. అసలు ఐసీయూలో ఎలాంటి వసతులుంటాయి, అక్కడ అత్యంత ముప్పు ఉన్న బాధితుల విషయంలో డాక్టర్లు ఏం చేస్తారు, ఎలాంటి చికిత్స అందిస్తారు, ఏయే జాగ్రత్తలు తీసుకుంటారనే విషయాలను తెలుసుకుందాం. మానవ శరీరం అనేక ఖనిజ లవణాలతో ఎన్నో సంక్లిష్టమైన జీవరసాయన చర్యలు జరుగుతుండటం వల్లనే సజీవంగా ఉంటూ, ఆరోగ్యకరంగా పనిచేస్తుంటుంది. ఎవరైనా ఏదైనా తీవ్రమైన జబ్బుల బారిన పడ్డా లేదా ఏదైనా ప్రమాదంలో గాయపడ్డా ఈ జీవరసాయన క్రియల్లోనూ, శరీరంలోని ఇతర ఖనిజ, లవణాల వంటి రసాయనిక అంశాల్లోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫలితంగా దేహంలోని ఎన్నెన్నో భాగాలు వేగంగా మార్పులకూ, వివిధ పరిణామాలకు లోనవుతూ ఉంటాయి. దాంతో చాలా దుష్పరిణామాలకు అవకాశాలెక్కువ. శరీరంలో ఉంటే సహజమైన సమతుల్యత (హోమియోస్టేసస్) కూడా దెబ్బతింటుంది. బాధితులకు వచ్చే ప్రమాదాలూ... అధిగమించే పద్ధతులు... ఐసీయూలో చేర్చాల్సి వచ్చిన బాధితుల్లో కనిపించే కొన్ని హటాత్పరిణామాలు ఇలా ఉండవచ్చు... ఉదాహరణకు హటాత్తుగా గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోవడం, గుండె సరిగా పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తలెత్తడం, మెదడులోగానీ, కడుపులోగాని రక్తస్రావం కావడం వంటి సమస్యలు ఒక్కోసారి శరీరం వెంటనే కోలుకునే అవకాశం లేకుండా చేయవచ్చు. ఇలాంటి సమయాల్లో రోగి పరిస్థితి చాలా వేగంగా క్షీణించడం మొదలువుతుంది. కొందరిలో ఇది ప్రాణాపాయానికీ దారితీయవచ్చు. ఇలాంటి హటాత్పరిణామాల్లో ఏది వస్తుందో, ఏది రాదో ముందే ఊహించడం సాధ్యం కాదు. అయితే క్రిటికల్ కండిషన్లో ఉన్న బాధితులు ఐసీయూలో గనక ఉన్నట్లయితే వారిలో ఆయా సమయాలకు వచ్చే అనర్థాలనూ, ప్రమాదాలనూ వెంటనే గుర్తించి, వెనువెంటనే స్పందించి, వచ్చిన సమస్యకు అనుగుణంగా అవసరమైన చికిత్సను తక్షణం అందించడం సాధ్యమవుతుంది. ఉదాహరణకు ఊపిరి అందనప్పుడు ఐసీయూలోని వెంటిలేటర్లను ఉపయోగించడం, మూత్రపిండాలు పనిచేయకపోతే వెంటనే డయాలసిస్ వంటి ప్రాణరక్షణ యంత్రాన్ని వాడటం వంటివి చేసేందుకు వెసులుబాటు ఉంటాయి. గుండె లయలో తేడా వచ్చినప్పుడు సరిచేయడానికి డిఫిబ్రిలేటర్లు ఉంటాయి. క్రిటికల్ కేర్ నిపుణులతో తక్షణ వైద్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే క్రిటికల్ కేర్ వైద్యనిపుణులు శరీరంలో ఎప్పుడే మార్పు వచ్చినా దానికి అనుగుణంగా స్పందిస్తారు. ఉదాహరణకు గుండె ఆగి΄ోయినా తక్షణమే తిరిగి పనిచేయించడానికి సీపీఆర్ చేయడం, షాక్‌లు ఇచ్చి, బాధితులను విజయవంతంగా బతికించడం చేసిన కేసులే ఎక్కువ. కిడ్నీ పని చేయక΄ోతే రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ, కాలేయం పనిచేయకపోతే ఉపయోగించే మార్స్... ఇలా అందుబాటులో ఉండే ఉపకరణాలూ, పరికరాలతో చికిత్స అందిస్తారు. మందుల్ని అనుకున్న మోతాదుల్లో పంపేందుకు ఇన్ఫ్యూజన్ పంపులు ఉంటాయి. ఇక బీపీని, నాడిని లోపలి నుంచి వచ్చే ప్రతి బీట్నూ కొలిచే వీలుంటుంది. ఇక బాధితులను చూసుకోడానికి ఏడాదిలో ప్రతిరోజూ 24 గంటలూ జాగ్రత్తగా చూసుకోడానికి నిపుణులైన ఫిజీషియన్లు, నర్సులు, శ్వాస అందేలా చూడటానికి రెస్పిరేటరీ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. ఏ కొద్ది తేడా వచ్చినా వెంటనే పై నిపుణులంతా చురుగ్గా స్పందించడంతో తక్షణ వైద్యచికిత్సలు మొదలవుతాయి. ఇవన్నీ చాలా క్రిటికల్‌గా ఉండే బాధితులకు అవసరమైనవి. అప్పటికే పరిస్థితి బాగా విషమించి΄ోయిన సందర్భాల్లో తప్ప... నిజానికి ఇప్పుడు విజయవంతమైన చికిత్సతో ఐసీయూలోంచి బయటకు వచ్చేవారి సంఖ్యే ఎక్కువ. ఐసీయూలో ఏం చేస్తారంటే... బాధితులను ఐసీయూలో ఉంచినప్పుడు దేహంలో వచ్చే మార్పులనూ, అలాగే దేహంలోని అనేక కీలకమైన పనులు జరగడానికి తోడ్పడుతుండే జీవరసాయన చర్యలూ, వాటిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, జరిగిన ప్రతికూల మార్పులను మళ్లీ యథాస్థితికి (నార్మల్కు) తెచ్చేందుకూ, వాటిని క్రమబద్ధంగా జరిగేలా చూసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు. బాధితులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటారు కాబట్టీ, వాళ్లను నార్మలైజ్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు కాబట్టి... ఆ డాక్టర్లను ‘క్రిటికల్ కేర్’ నిపుణులుగా చెబుతారు.ఐసీయూలోని సౌకర్యాలేమిటంటే... శరీరం తాలూకు సహజ సమతౌల్య స్థితి (హోమియోస్టేసస్)తిరిగి పొందేందుకు అవసరమైన అన్ని చికిత్సల కోసం కావాల్సిన సౌకర్యాలన్నీ ఐసీయూలో ఉంటాయి. ఏదైనా వ్యాధికి లోనైన శరీర భాగాలు వాస్తవానికి తమను తాము రిపేర్ చేసుకునే స్వాభావికమైన (నేచురల్) గుణం... దాదాపుగా అన్ని అవయవాలకూ ఉంటుంది. కానీ కీలకభాగాలైన మెదడు, గుండె, శ్వాసకోశ వ్యవస్థ, కాలేయం, కిడ్నీలు, రక్తం దెబ్బతింటే అవి నేచురల్‌గానే కోలుకోవాలంటే పట్టే సమయం అతడు బతికి కోలుకోవడం కోసం సరిపోదు. అవి వీలైనంత త్వరగా కోలుకునేలా చేయగలిగితేనే ఆ బాధితుడి మనుగడ (సర్వైవల్) సాధ్యమవుతుంది. ఆ వ్యవస్థలను వీలైనంత త్వరగా మామూలు స్థితికి తెచ్చే సౌకర్యాలన్నీ ఐసీయూలో ఉంటాయి.(చదవండి: గుమ్మడి పండంటి బిడ్డ... రిస్క్ టాస్క్..) -
కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు
బనశంకరి: బెంగళూరులో కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.కొంతసేపటికే విషమంవివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్ చనిపోగా, బాలరాజ్, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.పోలీసుల విచారణకేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.అనేక సందేహాలుఓ వ్యక్తి స్విగ్గీలో కేక్ ఆర్డర్ చేసి తరువాత క్యాన్సిల్ చేయడంతో బాలరాజ్ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. -
కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతి.. ఐసీయూలో తల్లిదండ్రులు
బనశంకరి: బెంగళూరులో కేక్ తిని ఐదేళ్లు బాలుడు మృతిచెందగా అతని తల్లిదండ్రులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కేపీ అగ్రహార పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.కొంతసేపటికే విషమంవివరాలు... భువనేశ్వరినగరలో బాలరాజ్, నాగలక్ష్మీ దంపతులు ఐదేళ్ల కొడుకు ధీరజ్‌తో కలిసి ఉంటున్నారు. బాలరాజ్ స్విగ్గీ డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఓ కేక్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. భార్య, కొడుకుతో కలిసి తిన్నారు. కొంతసేపటికే వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఇరుగు పొరుగు చూసి ముగ్గురిని సమీప కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో చికిత్స అందించారు. కానీ బాలుడు ధీరజ్ చనిపోగా, బాలరాజ్, నాగలక్ష్మీలకు విషమంగా ఉంది.పోలీసుల విచారణకేపీ అగ్రహార పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సమాచారం సేకరించారు. ఆ కేక్‌ను ఏ బేకరి నుంచి తీసుకువచ్చారు, అందులో ఏమైనా కలిపారా? అనేది ఆరా తీశారు. కేక్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల నివేదిక కోసం పోలీసులు వేచిచూస్తున్నారు.అనేక సందేహాలుఓ వ్యక్తి స్విగ్గీలో కేక్ ఆర్డర్ చేసి తరువాత క్యాన్సిల్ చేయడంతో బాలరాజ్ ఆ కేక్‌ను ఇంటికి తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసు అనేక అనుమానాలకు తావిస్తోంది. కేక్ కలుషితం కావడం వల్ల జరిగిందా? లేక ఎవరైనా కావాలనే విషం కలిపారా? లేదా బాలరాజే కేక్‌లో ఏదైనా కలిపి కుటుంబం ఆత్మహత్య ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు నెలకొన్నాయి. కేక్ నమూనాలను పోలీసులు పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. బాలుని పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని తెలిపారు. విష పదార్థం కలిసి ఉండే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు. -
ఐసీయూలో వెంటిలేటర్‌పై తండ్రి, ఆసుపత్రిలోనే కూతుళ్ల పెళ్లి...వైరల్ వీడియో
అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది. ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024 -
మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక
మీరట్: పదో తరగతి పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు చూసి మూర్చపోయి ఐసీయూలో చేరాడో విద్యార్థి. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 10వ తరగతి విద్యార్థి తనకు బోర్డు పరీక్షల్లో చెప్పుకోదగ్గ 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయాడు. రిజల్ట్స్ చూసి కుప్పకూలిపోవడంతో ఐసీయూలో చేర్చవలసి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ బోర్డ్ హైస్కూల్ లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఫలితాలను శనివారం ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.మీరట్‌లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్‌కు చెందిన అన్షుల్ కుమార్ తన పరీక్షలలో 93.5 శాతం మార్కులు సాధించాడు. అయితే, ఫలితాలను చూడగానే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్షుల్ తండ్రి, పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేసే సునీల్ కుమార్ తెలిపారు. కాగా అన్షుల్ పరిస్థితి ప్రస్తుతం కుదటపడినట్లు తెలిసింది. -
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి అస్వస్థత.. ఐసీయూలో చికిత్స!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతనికి చికిత్స అందించేందుకు జైలు నుంచి బందా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అన్సారీకి ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపధ్యంలో పోలీసులు మెడికల్ కాలేజీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం ముఖ్తార్ అన్సారీ తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొన్నాడు. ముక్తార్ అన్సారీ తనపై విషం ప్రయోగించేందుకు కుట్ర జరుగుతున్నదంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ ఉదంతంలో స్పందించిన కోర్టు అన్సారీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బందా జైలులోని జైలర్, ఇద్దరు డిప్యూటీ జైలర్లను సస్పెండ్ చేసింది. ఒక కేసులో ముఖ్తార్ అన్సారీ గత గురువారం కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. అయితే అదే సమయంలో అన్సారీ తనకు ప్రాణహాని ఉందంటూ న్యాయవాది ద్వారా న్యాయమూర్తికి లేఖ పంపారు. మార్చి 19న తనకు ఇచ్చిన ఆహారంలో విషపూరితమైన పదార్థాలు కలిశాయని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో రాశాడు. ఆ ఆహారం తిన్న తర్వాత తాను అస్వస్థతకు గురయ్యానని, తనకు చేతులు, కాళ్ల నరాల్లో విపరీతమైన నొప్పి వచ్చిందని ముఖ్తార్ అన్సారీ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆరోజు తాను చనిపోతానేమోనని భయపడ్డానని లేఖలో పేర్కొన్నాడు. ఘాజీపూర్ నకిలీ ఆయుధాల లైసెన్స్ కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) అవ్నీష్ గౌతమ్ ముఖ్తార్ అన్సారీకి ఈ శిక్ష విధించారు. 2023లో జరిగిన ఒక హత్య కేసులో ముఖ్తార్ అన్సారీకి కోర్టు జీవిత ఖైదు విధించింది. ముక్తార్‌కు ఇప్పటివరకు ఏడు కేసుల్లో శిక్ష పడింది. ఎనిమిదో కేసులో దోషిగా తేలాడు. -
ముఖ్యమంత్రి తండ్రి ఆరోగ్యం విషమం.. ఐసీయూలో చికిత్స!
రాజస్థాన్ నూతన ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు సమాచారం. మీడియాకు అందిన వివరాల ప్రకారం కిషన్ స్వరూప్ శర్మ.. జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే సీఎం భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ అకస్మాత్తుగా అనారోగ్యం పాలవడంతో శుక్రవారం అర్థరాత్రి ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆయనకు పరీక్షలు చేసి, చికిత్సనందిస్తోంది. శుక్రవారం సీఎం భజన్‌లాల్ శర్మ పుట్టినరోజు.. అదే రోజు ఆయన రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేత భజన్ లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా సీఎం భజన్‌లాల్ శర్మ తండ్రి కిషన్ స్వరూప్ శర్మ శుక్రవారం తన కుమారుడి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకోసం ఆయన భరత్పూర్ నుంచి జైపూర్ వచ్చారు. అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం జైపూర్‌లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇది కూడా చదవండి: ‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్ భరోసా! -
అంతర్జాతీయస్థాయిలో ‘టిమ్స్’ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: టిమ్స్ (తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఆస్పత్రులను అంతర్జాతీయస్థాయిలో నిర్వహిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న టిమ్స్ ఆస్పత్రుల్లో వెయ్యి పడకలు ఉంటాయని, ఎయిమ్స్(ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్), నిమ్స్(నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) తరహాలోనే ‘టిమ్స్’పనితీరు ఉంటుందన్నారు. ప్రతి ఆస్పత్రికి ప్రత్యేకంగా పాలకమండలి ఉంటుందని మంత్రి తెలిపారు. వీటన్నింటిని కలిపి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేస్తామని, దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. టిమ్స్ ఆస్పత్రులకు స్వయంప్రతిపత్తి ఉంటే త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని, ప్రస్తుతం నిమ్స్‌కు ఈ హోదా కల్పించడంతో వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. ఆదివారం ఆయన శాసనమండలిలో ‘టిమ్స్ బిల్లు– 2023’ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో టిమ్స్ ఆస్పత్రుల ఏర్పాటుతో దాదాపు 10వేల సూపర్ స్పెషాలిటీ బెడ్స్ అందుబాటులోకి వస్తామన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో 10వేల బెడ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య 34వేలకు చేరిందన్నారు. అతిత్వరలో వీటి సంఖ్య 50వేలకు చేరనుందని మంత్రి సభలో వెల్లడించారు. టిమ్స్ ఆస్పత్రుల్లో 16 స్పెషాలిటీ, 15 సూపర్ స్పెషాలిటీల్లో పీజీ కోర్సులు ఏర్పాటవుతాయని, సూపర్ స్పెషాలిటీల్లో నర్సింగ్, పారామెడికల్ కోర్సులతో పాటు గుండె, మూత్రపిండాలు, లివర్, ఊపిరితిత్తులు, కేన్సర్, ట్రామా, ఎండోక్రైనాలజీ, ఎలర్జీ, రుమటాలజీ తదితర 30 విభాగాలుంటాయన్నారు. 200 మంది ఫ్యాకల్టి, 500 మంది వరకు రెసిడెంట్ వైద్యులు, 26 ఆపరేషన్ థియేటర్లు, గుండెకు సంబంధించి క్యాథ్ ల్యాబ్, కిడ్నీలకు డయాలసిస్, కేన్సర్‌కు రేడియేషన్, కీమోథెరపీతో పాటు సీటీస్కాన్, ఎంఆర్ఎస్ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రతి ఆస్పత్రిలో 300 ఐసీయూ పడకలతోపాటు వెంటిలేటర్ బెడ్లు కూడా ప్రత్యేకంగా ఉంటాయన్నారు. మంత్రి హరీశ్ మండలిలో ప్రవేశపెట్టిన టిమ్స్ బిల్లు–2023ని సభ ఆమోదించింది. వీటితో పాటు కర్మాగారాల సవరణ బిల్లు–2023, జైనులను మైనార్టీలుగా గుర్తిస్తూ మైనార్టీ కమిషనర్ సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, పంచాయతీ సవరణ బిల్లుల్ని కూడా శాసనమండలి ఆమోదించింది. -
కాటేస్తున్న కల్తీ కల్లు.. వణికిపోతున్న ఉమ్మడి పాలమూరు జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కల్తీ కల్లు ఉమ్మడి పాలమూరు జిల్లాను వణికిస్తోంది. ఇప్పటికే మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూరుకి చెందిన హరిజన ఆశన్న (58) మృతిచెందగా.. బుధవారం మరో మహిళ, మరో యువకుడు మరణించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. చికిత్స చేసినా ఫలితం లేక.. మహబూబ్‌నగర్ పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ (29) ఈ నెల ఏడో తేదీన వింతగా ప్రవర్తిస్తూ జిల్లా ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం వెంటనే అతడిని వైద్యులు ఇంటికి పంపించారు. అయితే తెల్లారి కూడా అదేవిధంగా ప్రవర్తించడంతో బంధువులు మళ్లీ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అప్పట్నుంచీ ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో మృతి చెందాడు. విష్ణుప్రకాశ్ భూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో పోస్టల్ శాఖ ఏబీపీఎంగా ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోగా.. తపాలా శాఖలోనే పనిచేసే తండ్రి కూడా కొన్నాళ్ల క్రితమే మరణించాడు. తండ్రి స్థానంలో విష్ణుప్రకాశ్ ఉద్యోగంలో చేరాడు. అయితే అతనికి పెళ్లి కాకపోవడం, ఒంటరితనంతో మందు కల్లుకు బానిస అయినట్లు తెలుస్తోంది. అయితే ఫిట్స్ (మూర్ఛ) రావడంతో విష్ణుప్రకాశ్‌ను ఆస్పత్రిలో చేర్పిం చగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని మేనత్త భువనేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలావుండగా జిల్లా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న మహబూబ్‌నగర్ రూరల్ మండలం దొడ్డలోనిపల్లికి చెందిన రేణుక (55) కూడా బుధవారం రాత్రి మృతి చెందింది. మరోవైపు జడ్చర్ల మండలం మల్లెబోనిపల్లికి చెందిన రేణుక పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. కాగా జనరల్ ఆస్పత్రిలోని సాధారణ వార్డుల్లో మరో పది మంది వరకు కల్తీ కల్లు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. మృతి చెందిన వారిలో మెటబాలిక్ ఎన్సెఫలోపతి లక్షణాలు ఉన్నాయని.. పోస్టుమార్టం అనంతరం నమూనాలను హైదరాబాద్ ల్యాబ్‌కు పంపనున్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకిషన్ తెలిపారు. ఆస్పత్రిలో చేరాలంటే చెప్పినట్లు వినాలి..! కల్తీ కల్లు అలవాటుతో మహబూబ్‌నగర్ మండలంలోని దొడ్డలోనిపల్లి, తిమ్మసానిపల్లి, కోయనగర్, అంబేడ్కర్ నగర్ కాలనీలతో పాటు జడ్చర్ల, నవాబ్‌పేట మండలాలకు చెందిన పలువురు అస్వస్థతకు గురై చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వ చ్చారు. తలవెనక్కి వాలడం, నాలుక బయటకు రావడం, నత్తి, శరీరంలో చలనం లేకపోవడం వంటి లక్షణాలు వారిలో ఉ న్నాయి. ఇది గమనించిన వైద్యులు బాధితులతో వచ్చి న సహా యకులకు ముందస్తు సూచనలు చేసినట్లు సమాచారం. ‘ఎవరడిగినా కల్తీ కల్లు కాదు.. ఎండదెబ్బ తాకింది.. కడుపునొప్పి, ఫిట్స్‌తో వచ్చి నట్లు చెప్పాలి.. అలా అయితేనే చికిత్స అందజేస్తాం.. లేకుంటే వేరే హాస్పిటల్‌కు వెళ్లొచ్చు..’అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఆశన్న, విష్ణుప్రకాశ్ బంధువులు కూడా డాక్టర్ల సూచన మేరకే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ బాధితులు! కల్తీ కల్లుకు అలవాటు పడిన పలువురు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, కిందిస్థాయి సిబ్బంది 40 నుంచి 50 మంది వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో చేరితే బయటకు తెలుస్తుందని.. పరువు పోతుందనే కారణంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. -
నర్సు కాదు దేవత
ఐసీయూలో పేషెంట్లకు సేవ చేసే నర్సులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.లేకుంటే కొన్ని వ్యాధులు అంటుకునే ప్రమాదం ఉంది.ఢిల్లీ ఎయిమ్స్‌లో పని చేసే దివ్య సోజల్మూడుసార్లు టి.బి బారిన పడింది.అయినా సరే రోగుల సేవ మానలేదు.‘నా కర్తవ్యం నుంచి నేను పారి పో ను’ అంటున్న ఆమెను ప్రాణాంతక రోగులు మనిషి అనరు. దేవత అంటుంటారు. దివ్య సోజల్ ఐసీయూలో ఉందంటే పేషెంట్లకే కాదు తోటి స్టాఫ్‌కు కూడా ఎంతో ధైర్యం. ఐసీయూలో ఉండే పేషెంట్లను చూసుకోవడంలో ఆమెకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం ఉన్నాయి. అయితే అవి చాలామందిలో ఉంటాయి. అందరూ ఐసీయూలో ఉండటానికి ఇష్టపడరు. కాని దివ్య సోజల్ మాత్రం తనకు తానుగా ఐసియులో ఉండే పేషెంట్ల సేవను ఎంచుకుంది. ప్రాణాపాయంలో ఉన్న వారిని కాపాడుకోవడంలో నాకో సంతృప్తి ఉంది’ అంటుంది సోజల్. అయితే ఆ పనిలో ప్రమాదం కూడా ఉంది. అదేమిటంటే అలాంటి రోగులకు సేవ చేసేటప్పుడు కొన్ని వ్యాధులు అంటుకోవచ్చు. సోజల్ మూడుసార్లు అలా టి.బి బారిన పడింది. కేరళ నర్స్ దివ్య సోజల్ది కేరళలోని పత్తానంతిట్ట. చదువులో చురుగ్గా ఉండేది. ముంబైలోని పీడీ హిందూజా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ నుంచి జనరల్ నర్సింగ్‌లో డిప్లమా చేసి 2011 నాటికి హిందూజా హాస్పిటల్లో ఐసీయూ నర్స్‌గా పని చేయడం మొదలు పెట్టింది. అప్పటికి ఆమె వయసు 23. ఆ సమయంలోనే ఒకరోజు నైట్ డ్యూటీలో ఆమెకు శ్వాసలో ఇబ్బంది ఎదురైంది. ఎక్స్‌రే తీసి చూస్తే ఊపిరితిత్తుల్లో నీరు చేరింది అని తేలింది. పరీక్షలు చేస్తే టి.బి . అని తేలింది. అదే హాస్పిటల్‌లోని వైద్యులు ఆమెకు ఆరు నెలల ట్రీట్మెంట్లో పెట్టారు. రోజూ నాలుగు రకాల మందులు తీసుకోవాల్సి వచ్చేది. వాటిని తీసుకుంటూ టి.బి. నుంచి బయట పడింది. అయితే వృత్తిని మానేయలేదు. ఐసీయూను వదల్లేదు. ఢిల్లీ ఎయిమ్స్‌లో 2012లో బి.ఎస్సీ నర్సింగ్ చేయడానికి ఢిల్లీ ఎయిమ్స్‌కు వచ్చింది దివ్య. ఆ తర్వాత అక్కడే న్యూరోసైన్స్ నర్సింగ్‌లో పి.జి. చేరింది. న్యూరోలాజికల్ ఐసీయూలో పని చేయడానికి నిశ్చయించుకోవడం వల్లే ఆ కోర్సులో చేరింది. ఆ సమయంలో అంటే 2014లో మళ్లీ టి.బి. బారిన పడింది దివ్య. నెల రోజులు హాస్పిటల్లో ఉంచారు. నీడిల్‌తో ఫ్లూయిడ్‌ను బయటకు తీయాల్సి వచ్చింది నాలుగైదు సార్లు. మూడు నెలల పాటు రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చేది. ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా నేరుగా రంగంలో దిగి దివ్య ట్రీట్మెంట్ను పర్యవేక్షించాడు. దివ్య సేవాతత్పరత ఆయనకు తెలియడం వల్లే ఇది జరిగింది. దాంతో రెండోసారి టి.బి నుంచి విజయవంతంగా బయటపడింది దివ్య సోజల్. ఈ దశలో ఎవరైనా సులభమైన పని ఉండే వార్డుల్లో పని చేయడానికి మారి పో తారు. కాని దివ్య మారలేదు. డ్యూటీని కొనసాగించింది. ఆహారం సరిగా తినక ఐసీయూలో ఉద్యోగం అంటే నైట్ డ్యూటీస్ ఉంటాయి. దివ్య సరిగా ఆహారం తినేది కాదు డ్యూటీలో. నిజానికి తినడానికి టైమ్ కూడా ఉండేది కాదు. అది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బ తీసింది. అప్పటికి దివ్య పెళ్లి చేసుకుంది. జీవితం ఒక మార్గాన పడింది అనుకుంది. కాని 2019లో విదేశాలలో ఉద్యోగానికి అప్లై చేసేందుకు చేయించుకున్న రొటీన్ పరీక్షల్లో మూడోసారి టీబీ బయటపడింది. విషాదం ఏమంటే ఈసారి వచ్చింది డ్రగ్ రెసిస్టెంట్ అంటే మందులకు లొంగని వేరియెంట్. ‘ఈ వార్త విన్నప్పుడు చాలా కుంగి పో యాను’ అంది దివ్య. ‘నేను కేరళలోని మా ఊరికి వచ్చి ట్రీట్మెంట్ కొనసాగించాను. లెక్కలేనన్ని మాత్రలు మింగాల్సి వచ్చేది. ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వచ్చేది. బరువు తగ్గాను. నాసియా ఉండేది. నా తల్లిదండ్రులు నన్ను జాగ్రత్తగా చూసుకుని కాపాడుకున్నారు’ అంటుంది దివ్య. ఇంత జరిగినా ఆమె ఉద్యోగం మానేసిందా? ఐసీయూను వదిలిపెట్టిందా? ఢిల్లీ ఎయిమ్స్‌కు వెళ్లి చూడండి. ్రపాణాపాయంలో ఉన్న రోగులను అమ్మలా చూసుకుంటూ ఉంటుంది. ఇటువంటి మనిషిని నర్సు అని ఎలా అనగలం? దేవత అని తప్ప. టి.బి రోగులలో స్థయిర్యానికి ‘నేను ఒకటి నిశ్చయించుకున్నాను. టి.బి రోగుల్లో ధైర్యం నింపాలి. వాళ్లు నన్ను చూసే ధైర్యం తెచ్చుకోవాలి. మూడుసార్లు టి.బి వచ్చినా నేను బయటపడగలిగాను. అందువల్ల ఆ వ్యాధి వచ్చినవారు కుంగి పో వాల్సిన పని లేదు. సరైన మందులు సరిగ్గా తీసుకోవాలి. అంతే కాదు నర్సులు కాని సామాన్య ప్రజలు కాని మంచి తిండి తిని సమయానికి తిని రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. అప్పుడు అంటువ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఇప్పుడు నేను ఆ చైతన్యం కోసం కార్యక్రమాలు చేస్తున్నాను. ప్రచారం చేస్తున్నాను’ అంటుంది దివ్య. -
ఐసీయూలో ప్రముఖ బుల్లితెర నటి.. ఎనిమిది రోజులుగా నరకం..!
బాలీవుడ్ బుల్లితెర నటి, నాగిని-6 ఫేమ్ మహేక్ చాహల్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె న్యూమోనియాతో బాధపడుతున్నట్లు సమాచారం. శ్వాస తీసుకోలేకపోయా: నటి ఆవేదన మహేక్ చాహల్ మాట్లాడుతూ.. 'నాకు న్యుమోనియా వచ్చింది. అది ఛాతీలో ఎక్కువగా ఇబ్బంది పెడుతోంది. దీంతో ఒక్కసారి కూడా శ్వాస తీసుకోలేకపోయా. జనవరి 2 నుంచి ఆసుపత్రిలో ఉన్నా. ప్రస్తుతం బాగానే ఉన్నా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సమస్య ఎక్కువగా ఉంది. నేను దగ్గిన ప్రతిసారీ చాలా బాధగా ఉంది. చాలా భయానికి గురయ్యా.నేను ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది'. అని వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న చాహల్ తల్లి రెండు రోజుల తర్వాత నార్వే నుంచి వచ్చింది. మహేక్ చాహల్ ఒక నార్వేకు చెందిన నటి, మోడల్. ఆమె హిందీ సినిమాలు, టెలివిజన్‌లో నటిస్తోంది. ఆమె 2002లో తెలుగు చిత్రం నీతో మూవీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత 2003లో నయీ పదోసన్తో హిందీలోకి ప్రవేశించింది. ఆమె హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ చిత్రాల్లో అనేక సాంగ్స్‌లో కనిపించింది. -
ఉద్యోగం నుంచి తీసేశారని..బీపీఓ కంపెనీ హెడ్‌పై కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్ సింగ్ అనే వ్యక్తి గేట్రర్ నోయిడా సెక్టార్2లో ఎన్సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్‌లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్ సద్రూల్ ఇస్లాం అనూప్‌ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. ఐతే గత నెల అనూప్ మేనేజర్ సద్రూల్ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్ అంగీకరించ లేదు. దీంతో అనూప్ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్ దేశీయ తుపాకీతో మేనేజర్ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్ సద్రూల్ని హుటాహుటినా కైలాష్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
ఘోర ప్రమాదం..ఏకంగా నెత్తిమీద ఉన్న చర్మంతో సహా జుట్టు ఊడి..
భారత సంతతి టీనేజ్ అమ్మాయికి దారుణమైన ప్రమాదం బారిన పడింది. ఏకంగా నెత్తిపై జుట్టుతో సహా చర్మం ఊడొచ్చి.. వెన్నుకి సైతం తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. వివరాల్లోకెళ్తే..దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో గేట్‌వే మాల్లో భారత సంతతికి చెందిన క్రిస్టినా అనే టీనేజ్ అమ్మాయి గో కార్ట్ అనే స్పోర్ట్స్ కారుని నడుపుతోంది. అనుహ్యంగా ఆమె జుట్టు ఆ కారు చక్రాల్లో ఇరుక్కుపోయింది. దీంతో తలపై ఉన్న హెల్మట్ పడిపోయి.. నెత్తిమీద ఉన్న జుట్టుతో సహా చర్మం ఊడొచ్చేసింది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. అంతేకాదు ఈ ప్రమాదంలో ఆమె వెన్నుకి కూడా తీవ్రగాయాలయ్యయి. ఈ ఘటన డర్బన్‌లోని ప్రముఖ గేట్ వే మాల్లోని ఎంటర్టైన్మెంట్ సెంటర్లో గత బుధవారం జరిగింది. కానీ క్రిస్టినా ఇప్పటికీ ఐసీయూలోనే చికిత్స పొందుతోంది. ఈ మేరకు బాధితురాలి తండ్రి వెర్నాన్ గోవేందర్ మాట్లాడుతూ...రేసింగ్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నియనిబంధనలు పాటించిందని అన్నారు. కానీ ఆ గో కార్ట్(స్పోర్ట్స్) కారులోని పరికరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆరోపించారు. ఆమె తన జుట్టును కూడా పోనీటైల్లా కట్టేసిందని చెబుతున్నారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే యాజమాన్యం తక్షణ సాయం అందించడంలో విఫలమైందని చెప్పారు. ఆ సమయంలో తన కూతురు వద్ద తన 13 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని ఈ ఘటన గురించి చెప్పేందుకు గో కార్ట్ కార్యాలయానికి కూడా వెళ్లాడని చెప్పారు. ఐతే అప్పటికే కార్యాలయాన్ని మూసేసి, వారంతా వెళ్లిపోయినట్లు వాపోయారు. రేసింగ్ కోర్సులో భాగంగా తన కూతురు క్రిస్టినా గో కార్ట్‌ని నేర్చుకుంటుండగా.. స్పిన్ అవుతున్న సమయంలో గో కార్ట్‌లోని చట్రంలో ఆమె జుట్లు ఇరుక్కుపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వెల్లడించారు. మరొకరెవరూ.. ఇలాంటి ఘోరమైన ప్రమాదం బారినపడకూదని..సదరు గోకార్ట్ యాజమాన్యంపై ఫిర్యాదు చేయనున్నట్లు బాధితురాలి తండరి గోవేందర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో సదరు యాక్షన్ కార్టింగ్ గేట్‌వే యజమాని స్టీవెన్ పూల్ మాట్లాడుతూ.."రేస్ జరుగుతున్న ట్రాక్ వద్ద అన్ని భద్రతా చర్యలు తీసుకున్నాం. ఎనిమిదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి అనుహ్య ఘటన జరగలేదు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది సాయం చేసేందుకు ముందుకు వచ్చిందని, కానీ ఆ సమయంలో బాధితురాలు క్రిస్టినా మామ చాలా దూకుడుగా ప్రవర్తించాడు. మాకు ఆ కుటుంబం పట్ల సానుభూతి ఉంది. క్లైయింట్స్ అందరికీ సంరక్షణ పద్ధతులకు సంబంధించిన రేసింగ్ వీడియోని చూపిస్తాం. అలాగే కార్ట్‌ని ఎలా నడపాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేదానిపై కూడా మాకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆఖరికి ఇలాంటివి చేసేటప్పుడూ..జుట్టును ఎలా కట్టుకోవాలో కూడా పూర్తిగా వివరిస్తాం. ఐతే ఒకప్పుడూ ఈ రేసింగ్ నేర్చుకుంటున్న వాళ్లకి తమ సిబ్బందే జుట్టును దగ్గరుండి ముడివేసి కట్టేదని, కానీ తల్లిదండ్రుల అయిష్టత చూపడం తోపాటు ఫిర్యాదుల చేయడంతో వారి వ్యక్తిగతానికే వదిలేశామని" వివరించాడు స్టీవెన్ పూల్. (చదవండి: భార్య పిల్లలను చంపేందుకు పక్కా ప్లాన్? కొండపై నుంచి కారును అమాంతం..) -
Rishabh Pant: ఐసీయూ నుంచి ప్రైవేటు గదికి రిషభ్ పంత్.. కారణమిదే?
కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడిని ప్రైవేట్ సూట్ తరలించారు. ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ వెల్లడించారు. కాగా పంత్‌ను ఆస్పత్రిలో చేరిపించినప్పటి నుంచి శ్యామ్ శర్మ అక్కడే ఉన్నారు. శ్యామ్ శర్మ ఎన్డిటీవీతో మాట్లాడుతూ.. రిషబ్ పంత్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఇన్ఫెక్షన్ భయంతో ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్‌కి మార్చాము. మేము అతడి కుటుంబానికి, ఆసుపత్రి నిర్వాహకులకు మేము ఈ విషయం చెప్పాము. అతడు త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని అతడు పేర్కొన్నాడు. అదే విధంగా పంత్‌ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావద్దని శ్యామ్ శర్మ సూచించారు. ఎక్కువగా విజిటర్లు రావడంతో పంత్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు శర్మ తెలిపారు. కాగా పంత్ పూర్తి స్థాయిలో కోలు కోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ సిరీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. Get well soon#RishabhPant Praying for speedy recovery . My SandArt at Puri beach pic.twitter.com/54d5QnPGVl — Sudarsan Pattnaik (@sudarsansand) January 1, 2023 చదవండి: Rishabh Pant: డ్రైవర్‌ను పెట్టుకునే స్థోమత ఉన్నపుడు ఎందుకిలా: టీమిండియా దిగ్గజం -
ములాయం సింగ్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: ఐసీయూలో చికిత్స పొందుతున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు సిద్ధమని, తనను ఎప్పుడైనా సంప్రదించవచ్చని అఖిలేశ్‌కు ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనారోగ్యంత గురుగ్రాంలోని మేదాంత ఆస్పత్రిలో చేరిన 82 ఏళ్ల ములాయం సింగ్‌కు మొదట ప్రవేటు వార్డులో చికిత్స అందించారు వైద్యులు. అయితే అకస్మాతుగా ఆక్సీజన్ స్థాయిలు తగ్గడంతో ఆదివారం మధ్యాహ్నం హూటాహుటిన ఐసీయూకు తరలించారు. దీంతో అఖిలేశ్ సహా ఇతర కుటుంబసభ్యులంతా ఆదివారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే ఉన్నారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ములాయం ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ అఖిలేశ్‌తో ఫోన్లో మాట్లాడినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రి వైద్యులకు కూడా యోగి ఫోన్ చేశారని, అత్యంత మెరుగైన చికిత్స అందించాలని సూచించినట్లు పేర్కొన్నాయి. అయితే ములాయం సింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అఖిలేశ్ యాదవ్ ఎస్పీ కార్యకర్తలకు తెలిపారు. ఆయనను చూసేందుకు ఆస్పత్రికి అభిమానులు భారీగా తరలిరావడంతో ఈ మేరకు ఆదివారం వెల్లడించారు. చదవండి: మోగిన ఎన్నికల నగారా.. 6 రాష్ట్రాల్లో 7 సీట్లకు ఉప ఎన్నిక -
ఐసీయూలో పాక్ దిగ్గజ క్రికెటర్
పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్ జహీర్ అబ్బాస్ ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు సమాచారం. లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నట్లు తెలిసింది. నెల కిత్రం పని నిమిత్తం దుబాయ్ నుంచి లండన్‌కు వచ్చిన జహీర్ అబ్బాస్ కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. కరోనా నుంచి కోలుకున్న ఆయన మూడు రోజుల క్రితం చాతిలో నొప్పి ఉందని చెప్పడంతో లండన్‌లోని సెయింట్ మేరీస్ ఆసుపత్రికి తరలించారు. న్యుమోనియాతో బాధపడుతున్న అబ్బాస్‌కు వైద్యులు డయాగ్నసిస్ నిర్వహించారు. ''ప్రస్తుతం జహీర్ అబ్బాస్ పరిస్థితి బాగానే ఉందని.. అయితే ఊపిరి తీసుకోవడంలో కాస్త ఇబ్బంది ఉండడంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచామని.. త్వరలోనే ఆయన కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తునట్లు'' వైద్యులు తెలిపారు. కాగా పాక్ దిగ్గజ క్రికెటర్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. మహ్మద్ హఫీజ్, అలన్ విల్కిన్స్ సహా పలువురు క్రికెటర్లు, అభిమానులు జహీర్ అబ్బాస్ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఇక పాకిస్తాన్ క్రికెట్లో దిగ్గజ ఆటగాడిగా పేరు పొందిన జహీర్ అబ్బాస్ 1969లో న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ స్టార్ బ్యాటర్‌గా పేరు పొందిన జహీర్ అబ్బాస్ 72 టెస్టుల్లో 5062 పరుగులు, 62 వన్డేల్లో 2752 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 459 మ్యాచ్‌లాడిన జహీర్ అబ్బాస్ 34, 843 పరుగులు చేశాడు. ఇందులో 108 సెంచరీలు, 158 అర్థసెంచరీలు ఉండడం విశేషం. ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఒక టెస్టు, మూడు వన్డేలకు ఐసీసీ మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. 2020లో జాక్వెస్ కలిస్, లిసా సాత్లేకర్లతో సంయుక్తంగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు సంపాదించాడు. Get well soon Zed Bhai. You are an asset of our country. All the Duaas and Prayers for your health🤲🏻 #GetWellSoon pic.twitter.com/6EDn1SFmy2 — Waqar Younis (@waqyounis99) June 22, 2022 Wishing speedy recovery & complete health to Zaheer Abbas sb. Get well soon. Aameen 🤲🏼 https://t.co/ld5VH2nj7f — Mohammad Hafeez (@MHafeez22) June 21, 2022 చదవండి: Ben Stokes: ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. కెప్టెన్‌కు అస్వస్థత 'ప్రపంచంలోనే చెత్త క్రికెటర్ అంట'.. ఇలాంటి బౌలింగ్ చూసుండరు! -
దగ్గుబాటికి గుండెపోటు
సాక్షి, హైదరాబాద్: సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంగళ వారం గుండెపోటుకు గురయ్యారు. హుటా హుటిన ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి 2 స్టెంట్లు వేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న దగ్గుబాటిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. -
కామారెడ్డి ఆస్పత్రి ఐసీయూలో ఎలుకలు
కామారెడ్డి టౌన్: కామారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఐసీయూలో ఎలుకలు తిరుగుతుండగా ఆదివారం కొందరు రోగులు గమనించి ఫొటోలు తీశారు. ఐసీయూతో పాటు ట్రామాకేర్ సెంటర్, అత్యవసర మందులుంచే చోట కూడా ఎలుకలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. గోడలు, ఆక్సిజన్ పైప్‌ల వద్దకే కాకుండా పడకలపైకి కూడా వస్తున్నాయని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఎలుకల నివారణకు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు. దీనిపై కాగా, జిల్లా ఆస్పత్రి ఆర్ఎంవో శ్రీనివాస్‌ను వివరణ కోరగా, ‘ఆస్పత్రిలోకి ఎలుకలు రాకుండా నెట్లు ఉన్నాయి. ఎలా వచ్చాయో తెలియదు. సోమవారం శానిటేషన్ కాంట్రాక్టర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటాం’అని తెలిపారు. -
లతా మంగేష్కర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన..
Lata Mangeshkar Health Update: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిపై ఆమె అధికార ప్రతినిధి కీలక ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆమె ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లతా మంగేష్కర్ ఆరోగ్యం క్షీణించిందటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఆమె అధికార ప్రతినిధి ఖండించారు. ఈ వదంతులను నమ్మవద్దంటూ క్లారిటీ ఇచ్చారు. లతా దీదీ ఇంకా ఐసీయూలోనే ఉంది. డాక్టర్ ప్రతీత్ సందానీ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దయచేసి పుకార్లను ప్రచారం చేయవద్దు. లతా మంగేష్కర్ కుటుంబానికి, వైద్యులకు ప్రైవసీ ఇవ్వాలి అంటూ ప్రకనటలో పేర్కొన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దంటూ విఙ్ఞప్తి చేశారు. #LataMangeshkar health update: She's showing signs of improvement, still in ICUhttps://t.co/h5TekiPHOp — India Today Showbiz (@Showbiz_IT) January 22, 2022 -
లతా మంగేష్కర్ హెల్త్ అప్డేట్, స్వల్పంగా కోలుకున్న ఇండియన్ నైటింగల్
Lata Mangeshkar Latest Health Bulletin Released: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న లతా మంగేష్కర్ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు. చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. స్వల్పంగా కోలుకున్నారని లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పష్టం చేశారు. కాగా 92 ఏళ్ల లతా మంగేష్కర్ గత రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. -
ఇంకా ఐసీయూలోనే లతా మంగేష్కర్.. లేటెస్ట్ హెల్త్ బులెటిన్ విడుదల
Lata Mangeshkar Latest Health Bulletin Released: కరోనాతో ఆసుపత్రిలో చేరిన లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. తాజాగా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ రిలీజ్ అయ్యింది. 'ప్రస్తుతం కోవిడ్ పాజిటివ్‌తో బాధపడుతున్న లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూ వార్డులోనే చికిత్స పొందుతున్నారు. మరో 10-12 రోజుల పాటు ఆమె అబ్జర్వేషన్లో ఉండనున్నారు. కోవిడ్‌తో పాటు న్యూమోనియాతో బాధపడుతున్నారు' అని తెలిపారు. ఈ మేరకు లతా మంగేష్కర్‌కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సంధాని హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కాగా తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. "Singer Lata Mangeshkar continues to be in the ICU ward. She will be under observation for 10-12 days. Along with COVID, she is also suffering from pneumonia," says Dr Pratit Samdhani, who is treating her at Mumbai's Breach Candy Hospital pic.twitter.com/Z0e3KUip4g — ANI (@ANI) January 12, 2022 -
ఐసీయూలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్
Lata Mangeshkar Hospitalised After Contracting Covid, In Icu: ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్(92)కు కోవిడ్ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్ మేనకోడలు రచనా ద్రువీకరించారు.'స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి' అని పేర్కొన్నారు. కాగా గతంలో 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 1929,సెప్టెంబర్28న జన్మించిన లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండియన్ నైటింగల్‌గా పేరు సంపాదించిన ఆమె ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలు పాడారు. "She is doing fine; has been kept in ICU only for precautionary reasons considering her age. Please respect our privacy and keep Didi in your prayers," singer Lata Mangeshkar's niece Rachna to ANI — ANI (@ANI) January 11, 2022 -
ఇంకా ఐసీయూలోనే సిరివెన్నెల సీతారామశాస్త్రి.. వైద్యులు ఏమన్నారంటే..
Sirivennela Seetharama Sastry Health Bulletin Released: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అనారోగ్యం కారణంగా ఈనెల 24న సిరివెన్నెలను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. -
నటుడు కైకాల సత్యనారాయణ పరిస్థితి విషమం
Kaikala Satyanarayana: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై అందించి చికిత్స అందిస్తున్నారు. గతనెల 30న ఇంట్లో జారిపడటంతో అనారోగ్యానికి గురైన కైకాల కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా మరోసారి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. -
ఐసీయూలో అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులు సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ముక్కుపచ్చలారని చిన్నారులు అగ్నికి ఆహుతి అయ్యారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న కమలా నెహ్రూ ఆస్పత్రిలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పీడియాట్రిక్స్ ఐసీయూ వార్డులో మంటలు చెలరేగి ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన చోటు చేసుకున్న సమయంలో వార్డులో 40 మంది చిన్నారులు ఉన్నారు. వీరిలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. 36 మంది సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని 25 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. మధ్యప్రదేశ్ వైద్య విద్యాశాఖ మంత్రి విశ్వాస్ సారంగ్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. (చదవండి: అతడు అడవిని ప్రేమించాడు! ఎందుకీ తారతమ్యం..) ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ‘‘కమలా నెహ్రూ ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాను. ఏసీఎస్ పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ మహ్మద్ సులేమాన్ పర్యవేక్షణలో ఈ విచారణ జరుగుతుంది’’ అన్నారు. (చదవండి: ‘జోకర్’ బీభత్సం: రైల్లో మంటలు.. 10 మందికి గాయాలు) ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చామని.. అయితే అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన కొందరు చిన్నారులను రక్షించలేకపోయామని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మూడో అంతస్తులోని ఐసీయూలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. చదవండి: రూ.90 కోట్ల విలువైన మద్యం దగ్ధం -
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి యువరాజ్ సాయం
-
యువీ దాతృత్వం.. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి 120 ఐసీయూ బెడ్స్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క సామన్య ప్రజలు ఎదుర్కొన్న అవస్థలను దగ్గరగా చూసిన టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌సింగ్.. బెడ్ల కొరత తీర్చేందుకు తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. తాజాగా, తన ఫౌండేషన్ (YouWeCan Foundation) ద్వారా తెలంగాణలోని నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో 120 ఐసీయూ బెడ్స్‌కు సాయం అందించాడు. ఈ ఐసీయూ బెడ్లను యువీ నేడు వర్చువల్‌గా ప్రారంభించాడు. కాగా, ఈ సిక్సర్ల వీరుడు.. గతంలో కూడా ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. ఈ ఏడాది మే నెలలో తన ఫౌండేషన్ పేరిట మధ్యప్రదేశలోని ఇండోర్‌లో మూడున్న కోట్ల వ్యయంతో 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇచ్చాడు. -
ఐసీయూలో ఐస్‌క్రీం తిని అత్త.. హోటల్ రూంలో మేనల్లుడు మృతి
గురుగ్రామ్: తీవ్ర అస్వస్థకు గురై ఆస్పత్రిలో చేరిన ఓ ఎయిర్‌హోస్టెస్ ఐసీయూలో ఐస్ క్రీం తిని మృతి చెందగా.. మరుసటి రోజే ఆమె మేనల్లుడు హోటల్ రూంలో విగతజీవిగా కనిపించాడు. వీరిద్దరి మృతి పట్ల సోషల్ మీడియాలో పలు అనుమానాలు తలెత్తుతుండటంతో మేఘాలయా తురా పార్లమెంట్ సభ్యుడు అగాథ సంగ్మా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వం శాఖకు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ కేసును ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ వివరాలు.. నాగాలాండ్‌కు చెందిన రోసి సంగ్మా (29) ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తన మేనల్లుడి సామువేల్ సంగ్మాతో కలిసి హరియాణ గురుగ్రామ్‌లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 23న రోసి ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. కాళ్లు,చేతుల్లో విపరీతమైన నొప్పి, తీవ్ర రక్తస్రావంతో బాధపడింది. దాంతో సామువేల్, రోసిని ఢిల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించాడు. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరుసటి రోజు ఉదయం అనగా జూన్ 24 ఉదయం, రోసిని గురుగ్రామ్ సెక్టార్ 10లోని ఆల్ఫా హాస్పిటల్‌కు తరలించారు. ఆల్ఫా ఆస్పత్రి ఐసీయూలో చేర్చిన తర్వాత రోసి కోలుకుందని తెలిపాడు సామువేల్. తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇబ్బంది పడిన రోసి ఆ తర్వాత ఆల్ఫా హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు ఐస్‌క్రీం తిన్నదని తెలిపాడు. ఆ సమయంలో రోసి ఎదురుగా డాక్టర్లు ఉన్నారని.. కానీ ఆమెను వారించలేదని ఆరోపించాడు. దాంతో ఆమె ఆరోగ్యం పూర్తిగా పాడయి.. మరణించిందని తెలిపాడు సామువేల్. దీని గురించి ప్రశ్నించిన తనను ఆల్ఫా ఆస్పత్రి సిబ్బంది కిందపడేసి చితకబాదారన్నాడు. రోసి చనిపోయిన విధానం తెలియజేస్తూ సామువేల్ వీడియో రూపొందించి, న్యాయం చేయాల్సిందిగా కోరుతూ.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ మరుసటి రోజే ఓ హోటల్ రూంలో సామువేల్ మృతదేహం వెలుగు చూడటం కలకలం రేపింది. సామువేల్, రోసిల మృతిపై సోషల్ మీడియాలో పలు అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజనులు. సామువేల్ మృతి గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి కేసు నమోదు చేశారు. ఆత్మహత్య చేసుకుని సామువేల్ చనిపోయినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆల్ఫా హాస్పిటల్ యాజమాన్యం ఈ సంఘటనపై స్పందించింది. తమ ఆస్పత్రికి వచ్చాక రోసి ఆరోగ్యం మెరుగైందని.. ఈ క్రమంలో ఐసీయూలో ఉన్న ఓ పేషెంట్ ఐస్‌క్రీం తినడం చూసిన రోసి.. తనకు కూడా కావాలని అడిగిందని తెలిపారు. రోసి తన ఇష్టప్రకారమే ఐస్ క్రీం తిన్నదని ఆస్పత్రి సిబ్బంది స్పష్టం చేశారు. ఇక సామువేల్‌పై తాము దాడి చేయలేదని తెలిపారు. ఈ ఘటనపై సామువేల్ తండ్రి స్పందిస్తూ.. ‘‘నా కుమారుడు చనిపోయేంత పిరికివాడు కాదు. రోసికి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నాడు. చనిపోయే రోజు తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో నాకు కాల్ చేసి మాట్లాడాడు. మరికాసేటికే చనిపోయాడని తెలిసింది. తప్పకుండా ఏదో జరిగే ఉంటుంది’’ అన్నాడు. -
ఐసీయూలో మాజీ సీఎం.. ప్రధాని మోదీ ఆరా
సాక్షి,లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ (89) అస్వస్థతకు లోనయ్యారు. ఆయనను లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఆదివారం చేర్పించారు. ఇంటెన్సివ్ కేర్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. నెఫ్రాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ, ఎండోక్రినాలజీ , న్యూరో ఓటోలజీ విభాగాల నిపుణుల బృందాన్ని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోంది. కల్యాణ్‌సింగ్ త్వరగా కోలుకోవాలని ఆ రాముణ్ని ప్రార్థిస్తున్నానంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. మరోవైపు కల్యాణ్ సింగ్ ఆరోగ్యపరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఆయన కుమారుడు రాజ్‌వీర్‌కు ఫోన్ చేసి, వివరాలను తెలుసుకున్నారు. అలాగే ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా సీఎం యోగీని కోరారు. అంతకుముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వాత్రా దేవ్ సింగ్ ఆసుపత్రిని సందర్శించిన కల్యాణ్ సింగ్‌ను పరామర్శించారు. కాగా రాజస్థాన్ గవర్నర్‌గా కూడా కల్యాణ్ సింగ్ పనిచేశారు. आज लखनऊ स्थित डॉ.राम मनोहर लोहिया आयुर्विज्ञान संस्थान पहुंचकर राजस्थान के पूर्व राज्यपाल एवं उ.प्र. के पूर्व CM श्री कल्याण सिंह जी के स्वास्थ्य के बारे में जानकारी प्राप्त की व डॉक्टरों को देखभाल हेतु निर्देशित किया। प्रभु श्री राम से प्रार्थना है कि आपको शीघ्र स्वस्थ करें। pic.twitter.com/VLjEQVey0G — Yogi Adityanath (@myogiadityanath) July 4, 2021 -
ఐసీయూలో రోగిపై ఎలుకల దాడి
సాక్షి, ముంబై: ఘాట్కోపర్లో బీఎంసీకి చెందిన రాజావాడి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ రోగిపై ఎలుకలు దాడిచేశాయి. ఘటనలో బాధితుడి కన్నుకు గాయం అయినట్లు తెలిసింది. ఈ సంఘటనను సీరియస్‌గా తీసుకున్న బీఎంసీ పరిపాలన విభాగం దర్యాప్తునకు ఆదేశించినట్లు మేయర్ కిశోరీ పేడ్నేకర్ తెలిపారు. మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటనపై రోగి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సాధారణంగా ప్రభుత్వ లేదా కార్పొరేషన్ ఆస్పత్రుల్లో జనరల్ వార్డులో ఎలుకలు, పిల్లులు, కుక్కలు అటు, ఇటూ తిరుగుతుంటాయి. కానీ, ఐసీయూలో ఏకంగా ఎలుక దూరడం, ఆ తరువాత బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగి కన్ను కొరకడం ఆస్పత్రి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిద్రలో ఉండగా.. కుర్లా, కమానీ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ ఎల్లప్ప (24) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల కిందట రాజావాడి ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడువాపు, కాలేయానికి సంబంధించిన సమస్యలుండటంతో ఐసీయూలో చేర్పించి వైద్యం ప్రారంభించారు. మంగళవారం ఉదయం ఐసీయూలోకి వచ్చిన బంధువులు శ్రీనివాస్ కంటి నుంచి రక్తస్రావం జరుగుతున్నట్లు గమనించారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు పరీక్షించారు. రోగి నిద్రలో ఉండగా ఎలుకలు కన్ను కొరికినట్లు నిర్ధరణకు వచ్చారు. అదృష్టవశాత్తు కన్నుగా ఎక్కువగా గాయం కాలేదు. ఈ విషయం తెలుసుకున్న కిశోరి పేడ్నేకర్ వెంటనే ఆస్పత్రికి చేరుకున్నారు. వార్డులు, ఆస్పత్రి పరిసరాలను పరిశీలించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. ఇదిలాఉండగా నాలుగేళ్ల కిందట కాందివలిలోని శతాబ్ధి ఆస్పత్రిలో ఇలాగే ఓ రోగి ముఖాన్ని ఎలుకలు కాటేశాయి. ఆ తరువాత మార్చురిలో ఉన్న శవాలను గుర్తుపట్టలేనంతగా ఎలుకలు కొరిన సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ బీఎంసీ, ప్రభుత్వాసుపత్రుల్లో మార్పు రాకపోకడంపై రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు
సాక్షి, అమరావతి : నిరుపేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో నిర్మాణ్ సంస్థ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏపీలోని ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో శాశ్వత ప్రాతిపదికన 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలను సమూలంగా మార్చి అత్యాధునికంగా తీర్చిదిద్దేదుoకు ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడు కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజారోగ్య రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి మౌలిక వసతులను కల్పించడం ద్వారా సుస్థిర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. పేదలకు సైతం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందించేందుకు నిర్మాణ్ సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్మాణ్ సంస్థ ఆపరేషన్స్ హెడ్ శ్రీకాంత్ నాథాముని, ఖోశ్లా వెంచర్స్ ఫౌండర్ వినోద్ ఖోశ్లా ఈ ఆలోచన కార్యరూపం దాల్చడానికి ముఖ్యకారకులు. ఏపీ ప్రభుత్వం తరపున న ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్, ఉత్తర అమెరికా- రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగా దాతలను గుర్తించి, వారిని విరాళం అందించేలా ప్రోత్సహించనున్నారు. ప్రభుత్వ ఒప్పందంలో భాగంగా ప్రతి ఐసీయూ యూనిట్ మీద సంబంధిత దాతల పేరు ఉంటుంది. ఇందుకు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం డా. అర్జా శ్రీకాంత్‌ను ముఖ్య అధికారిగా నియమించింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు.. ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన వైద్య సేవలందించేందుకు సిద్ధం కాబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని జూన్ 5న మంత్రి కల్వకుంట్ల తారక్ రామారావు ప్రారంభించారు. పేదలకు ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించే ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాల్సిందిగా ప్రతి ఒక్కరికీ మా విన్నపం. ఇప్పటికి 22 ప్రభుత్వ వైద్యశాలలకు దాతలు ముందుకు వచ్చారు , ఇంకా విరాళం అందించేందుకు ఆసక్తి ఉన్న దాతలు ఈ క్రింది లింక్ ద్వారా తమ విరాళాన్ని అందించవచ్చు. -
ఐసీయూలో మృత్యుఘోష.. 663 మందిలో 441 మంది మృతి
సాక్షి, బెంగళూరు: జిల్లా కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో కొన్నినెలలుగా కరోనా చికిత్స పొందిన 663 మందిలో 441 మంది కన్నుమూశారు. కోలుకుని 222 మంది మాత్రమే బతికి బట్టకట్టారు. మరణాల శాతం చాలా ఎక్కువగా ఉండడంతో ఐసీయూలో చేరిన రోగుల బంధువులు ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. ఐసీయూలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రాణనష్టం సంభవిస్తోందని ఆరోపణలున్నాయి. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: ఫంగస్ పంజా: జిల్లాలో ముగ్గురి మృతితో ఆందోళన -
రోగి అదృశ్యం.. మార్చురీలో మృతదేహం
లబ్బీపేట(విజయవాడ తూర్పు): కరోనా పాజిటివ్‌తో కోవిడ్ స్టేట్ ఆస్పత్రిలోని అయిన ఘటన శుక్రవారం కాసేపు కలకలం రేపింది. అయితే ఆ రోగి ఆస్పత్రిలో చేరిన రోజే మృతి చెందగా, మార్చురీకి సిబ్బంది చేర్చారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం లేకపోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది. అసలేం జరిగిందంటే.. గుడివాడకు చెందిన ఎంఎన్వీ సుబ్రహ్మణ్యం(42) ఈనెల 12న కరోనాకు చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాడు. అతడికి ఐసీయూ–9లో బెడ్ నంబర్–16 కేటాయించారు. ఆరోజే అతను మృతిచెందాడు. దీంతో సిబ్బంది మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ సమాచారం అధికారులకు చేరవేయలేదు. దీంతో బంధువులు వచ్చి రోగి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీయగా, శుక్రవారం ఉదయం కూడా బాగానే ఉందని సమాచార కేంద్రం సిబ్బంది చెప్పారు. మధ్యాహ్నం మాట్లాడేందుకు యత్నించగా ఫోన్ పనిచేయలేదు. బెడ్‌పై సుబ్రహ్మణ్యం కాకుండా, మరొక రోగి ఉండటంతో కాసేపు అధికారులు కంగారు పడ్డారు. ఏం జరిగిందని ఆరా తీస్తే మార్చురీలో మృతదేహాం ఉన్నట్లు గుర్తించారు. నిర్లక్ష్యం ఎవరిది! వార్డులో ఉన్న రోగి మృతి చెందితే, ఆ సమాచారం ఉన్నతాధికారులకు తెలియచేయాల్సింది అక్కడ విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ సిబ్బందే. కానీ కొందరు నాలుగో తరగతి ఉద్యోగులు ఎవరైనా రోగి మృతి చెందిన వెంటనే మృతదేహాన్ని మార్చురీకి తరలించి, ఆ బెడ్‌పై మరొకరిని తీసుకొచ్చి వేసేస్తున్నారు. దీనికోసం కొంతమొత్తం డబ్బులు తీసుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. చదవండి: ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు ఆదర్శం.. ‘ప్రగతి భారత్’ కోవిడ్ కేర్ సెంటర్ -
నటుడికి సీరియస్.. 2 నెలల బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లిన భార్య
కోవిడ్ బంధాలను, ఆత్మీయులను దూరం చేస్తుంది. ముట్టుకుంటే వెంట వచ్చే మహమ్మారి కావడంతో ఆత్మీయులు ఎవరైనా కోవిడ్ బారిన పడిన వారి దగ్గరకు వెళ్లి ఓదార్చలేని పరిస్థితి. ఈ క్రమంలో ‘‘ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్న తన భర్త కోసం రెండు నెలల పసిబిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లాను. నా జీవితంలో అత్యంత బాధకరమైన సందర్భం ఇదే అంటున్నారు’’ టీవీ నటుడు అనిరుధ్ దవే భార్య శుభి అహుజా. జీవితంలోనే అత్యంత క్లిష్ట సమయం అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. దీనిలో శుభి అహుజా ‘‘నా భర్త అనిరుధ్ దవే కోవిడ్ బారిన పడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భోపాల్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో నేను ఆయన దగ్గర ఉండటం ఎంతో అవసరం. కానీ మాకు రెండు నెలల చిన్నారి ఉంది. తనను చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు. అటు అనురుధ్ను చూసుకోవడానికి కూడా ఎవరు లేరు. నా జీవితంలోకెల్లా అత్యంత క్లిష్ట సమయం ఇదే. నా జీవితంలో అత్యంతక కఠినమైన సవాలు ఇదే. తప్పనిసరి పరిస్థితుల్లో నేను నా బిడ్డను ఇంట్లోనే వదిలి అనిరుధ్ దగ్గరకు వెళ్తున్నాను. నా బిడ్డ, భర్త క్షేమం కోసం ప్రార్థించాల్సిందిగా స్నేహితులు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరిని కోరుతున్నాను. మీ ప్రార్థనలు నాకు ఇప్పుడు ఎంతో ముఖ్యం’’ అంటూ శుభి అహుజా అర్థించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. మీ భర్త, చిన్నారి క్షేమంగా ఉంటారు.. ధైర్యంగా ఉండండి అంటూ మద్దతు తెలుపుతున్నారు అభిమానులు. ఇక అనురిధ్ దవే శక్తి - అస్తిత్వా కే ఎహ్సాన్కీ, వోహ్ రెహ్నే వాలి మెహ్లాన్కీ, వై.ఎ.ఆర్.ఓ కా తాషన్, బంధన్, లాక్‌డౌన్‌కీ లవ్ స్టోరీ వంటి టీవీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు -
యువ నటుడికి కరోనా, ఐసీయూకు మార్చిన వైద్యులు
రోజురోజుకు మహమ్మారి సినీ పరిశ్రమలో బుసలు కొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా మారి ఆరోగ్యవంతుల్లో సైతం తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఎంతో సినీ ప్రముఖులు కోవిడ్-19 బారిన పడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడగా... మరికొందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా హిందీ యువ నటుడు అనిరుధ్ డేవ్ కూడా కరోనాతో ఐసియులో చికిత్స పొందుతున్నాడు. గత వారం అతడికి కోవిడ్ పాజిటివ్‌గా తెలినట్లు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారడంతో వైద్యులు ఐసీయుకి మార్చినట్లు తాజాగా నటి ఆషా చౌదరి తెలిపింది. ఈ సందర్భంగా ఆమె అనిరుధ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడి ప్రార్థించండి అంటూ అభిమానులను ఇన్‌స్టా వేదికగా ఆమె అభ్యర్థించింది. కాగా భోపాల్‌లో షూటింగ్ సమయంలో అనిరుధ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే ప్రత్యేక వాహనంలో ముంబై చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువగా ఉండడంతో అతనికి ఐసియులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. చదవండి: ‘ఈ నీతులు నీ కజిన్ రణ్‌బీర్‌కు చెప్పండి మేడం’ విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి -
మీ BMI సరిచూసుకోండి.. తేడా వస్తే ఇబ్బందులే!
న్యూఢిల్లీ: కోవిడ్ బారినపడిన ఊబకాయులకు రిస్క్ ఎక్కువని ఓ అధ్యయనం తేల్చింది. కోవిడ్–19 సోకిన ఊబకాయులు ఐసీయూల్లో చేరాల్సి రావడం వంటివి ముప్పును ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తాజాగా లాన్సెట్ డయాబెటిస్, ఎండోక్రైనాలజీ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. కోవిడ్ రిస్క్‌కు, శరీర బరువు(బాడీ మాస్ ఇండెక్స్, బీఎంఐ)తో సంబంధమున్నట్లు మొట్టమొదటిసారిగా చేపట్టిన తమ విస్తృత అధ్యయనంలో రుజవైందని యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఒక వ్యక్తి బరువు(కిలోగ్రాములు), అతని ఎత్తు(మీటర్లు)ను భాగించడం ద్వారా శరీరంలోని కొవ్వును బీఎంఐ ద్వారా లెక్కిస్తారు. ఇంగ్లండ్‌లోని 69 లక్షల మంది ప్రజలతోపాటు కోవిడ్‌తో ఆస్పత్రి పాలైన 20 వేల మంది బాధితుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ అంచనాకు వచ్చామని పరిశోధకులు తెలిపారు. బీఎంఐ 23 కేజీ/ఎం2(కిలోగ్రాములు పర్ స్క్వేర్ మీటర్) ఉంటే దానిని ఆరోగ్యకరమైన స్థాయిగా భావిస్తారు. దీనికి మించి ఒక్క యూనిట్ ఎక్కువున్నా కోవిడ్‌తో పరిస్థితి విషమించి ఆస్పత్రిలో చేరే అవకాశం 5 శాతం, ఐసీయూలో చేరే చాన్స్ 10 శాతం పెరుగుతుందని తెలిపారు. బీఎంఐ 18.5 కంటే తక్కువ ఉన్న వారికీ కోవిడ్–19తో రిస్క్ ఎక్కువేనని వారు వివరించారు. ఇలాంటి రిస్క్ 20–39 ఏళ్ల మధ్య వారిలో అత్యధికం కాగా, 60 ఏళ్ల వారి నుంచి తగ్గుతుందని వెల్లడించారు. 19 ఏళ్లలోపు వారితోపాటు 80 ఏళ్లపైబడిన కోవిడ్ బాధితుల్లో బీఎంఐ చూపే ప్రభావం తక్కువని తెలిపారు. మొత్తమ్మీద చూస్తే 20–39 ఏళ్ల వారిలో మిగతా వయస్సు గ్రూపుల వారితో పోలిస్తే కోవిడ్ ప్రభావం తక్కువగానే ఉందని వెల్లడించారు. -
పసిబిడ్డను కాపాడుకోవాలి.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్)
ప్రసవం తర్వాత బిడ్డను అపురూపంగా హత్తుకొని లాలించాలని ఏ తల్లి మాత్రం అనుకోదు? కానీ ఆ దంపతులకు నిరాశే ఎదురైంది. పుట్టినప్పటి నుంచి బిడ్డను ఒక్కసారి కూడా ఎత్తుకోలేని దుస్థితి ఏర్పడింది. చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని మురిసిపోయే అదృష్టం లేకుండా పోయింది. చాలా తక్కువ బరువుతో కనీసం ఊపిరి కూడా సరిగా తీసుకోలేని స్థితిలో ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహాయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను, నా భర్త అబ్దుల్ ఎన్నో ఆశలతో నా చిన్నారిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. చిన్నారి రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. డెలీవరీ తర్వాత ఒక్కసారి కూడా నా బిడ్డను ఎత్తుకోలేదు. బిడ్డ పుట్టిన కొద్ది సేపటికే తనను ఎన్ఐసీయూ (NICU)కు తరలించారు. ఆ సమయానికి కనీసం నేను స్పృహలో కూడా లేను. ప్రసవం తర్వాత చిన్నారిని ఒక్కసారి కూడా ఎత్తుకొని మురిసిపోలేని దౌర్భాగ్యం వచ్చింది. 700 గ్రాముల బరువున్న నా బిడ్డ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. పాపం నా బిడ్డకు ఆ నొప్పి భరించలేక పడుతున్న వేదనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూలోనే ఉంచాలని డాక్టర్లు, ఇందుకోసం దాదాపు 4.5 లక్షలు అవుతుందని చెప్పారు. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా చిన్నారిని కాపాడండి. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్) -
ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ఛాతీ నొప్పితో ఆస్పత్రిలో చేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆరోగ్యం మెరుగుపడింది. ఎయిమ్స్‌లోని ఐసీయూ నుంచి ప్రత్యేక వార్డులోకి తరలించినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రపతి ఆరోగ్యం మెరుగుపడిందని, ఆయన కోలుకుంటున్నారని రాష్ట్రపతి భవన్ ప్రకటించింది. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మార్చి 27వ తేదీన సైనిక (ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్) ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం ఆ ఆస్పత్రి వర్గాలు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లాలని సూచించాయి. సాధారణ వైద్య పరీక్షల అనంతరం రామ్‌నాథ్ కోవింద్‌కు బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు మర్చి 30వ తేదీన బైపాస్ సర్జరీ విజయవంతంగా చేసిన విషయం తెలిసిందే. President Kovind was shifted from the ICU to a special room in the AIIMS today. His health has been improving continuously. Doctors are constantly monitoring his condition and have advised him to take rest. — President of India (@rashtrapatibhvn) April 3, 2021 చదవండి: రాష్ట్రపతికి విజయవంతంగా బైపాస్ సర్జరీ -
దారుణం: ఐసీయూలో ఉన్న మహిళపై అకృత్యం
జైపూర్: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మనిషిపై జాలి, దయ చూపించాల్సింది పోయి.. దారుణానికి పాల్పడ్డాడు ఓ మృగాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న మహిళపై అత్యాచారానికి ఓడిగట్టాడు నర్స్. రాజస్తాన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న బాధితురాలికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో స్పృహ కోల్పోయిన మహిళపై సోమవారం రాత్రి మగ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు ఇంజక్షన్ ఇవ్వడం వల్ల జరిగే దారుణం గురించి ఆమెకు తెలుస్తున్నప్పటికి ప్రతిఘటించలేకపోయింది. ఆ మరుసటి రోజు తనని చూడటానికి వచ్చిన భర్తతో జరిగిన దారుణం గురించి పేపర్ మీద రాసి అతడికి వెల్లడించింది. బాధితురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు నర్స్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. చదవండి: స్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది -
అది ఎంతటి నరకమో మాటల్లో చెప్పలేను (స్పాన్సర్డ్)
అందరు అమ్మాయిల్లానే ప్రియాంక కూడా పిల్లలపై ఎన్నో ఆశలు పెంచుకుంది. తాను మొదటిసారి గర్భవతి అని తెలియగానే ఎంతో సంతోషించింది. తనకు పుట్టబోయే చిన్నారితో తన జీవితం మరింత అందంగా మారబోతుందని ఊహించుకుంది. కానీ విధి మరొకటి తలచింది. నెలలు నిండకుండానే ఆ శిశువు ప్రపంచాన్ని చూడాల్సి వచ్చింది. కేవలం 674 గ్రాముల బరువుతో పుట్టిన ఆ చిన్నారి ఇంక్యుబేటర్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ప్రస్తుతం శిశువు ఊపిరితిత్తులు, కాలేయం సహా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహుయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం. మొదటిసారి తల్లిదండ్రులు అయితే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. కానీ మా బిడ్డను చేతుల్లోకి తీసుకొని మురిసిపోలేని పరిస్థితి లేదు. డెలీవరీ తర్వాత నా బిడ్డను చూసే సమయానికి పాపను ఇంక్యుబేటర్‌లో ఉంచారు. ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. చర్మం పసుపు రంగులోకి మారి కళ్లు ఎప్పుడూ ఎర్రగానే ఉంటున్నాయి. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. నెలలు నిండకుండానే పుట్టిన శిశువు కావడంతో చిన్నారిని నియోనాటర్ ఐసీయూ(NICU)లో దాదాపు రెండు నెలల పాటు ఉంచాలని డాక్టర్లు చెప్పారు. ఇందుకోసం పది లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. నా బంగారు ఆభరణాలన్నింటిని తాకట్టు పెట్టాము. ఆ డబ్బు అంతా స్కానింగ్‌లు, చెకప్‌ల కోసం వాడేశాము. డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. ప్రియాంకకు మా పేదరికం కారణంగా ఏమైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా పాపను కాపాడగలదు’. దయచేసి మా చిన్నారి ప్రియాంకను కాపాడండి తనకు ప్రాణ భిక్ష పెట్టండి. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. కెటో ఇండియాస్ మోస్ట్ క్రౌండ్ ఫండింగ్ సైట్ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించి వీర్‌కు అండగా నిలవడమే. (అడ్వర్టోరియల్) -
శశికళకు కరోనా
సాక్షి ప్రతినిధి, చెన్నై/బెంగళూరు: జయలలిత స్నేహితురాలు శశికళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. దీంతో ఆమెను బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి ఐసీయూకి మార్చారు. ‘‘ప్రస్తుతం ఆమెకు కోవిడ్ 19 సోకింది. ఇతర ఏ అనారోగ్యాలు లేవు. ఆమె ఆక్సిజన్ స్థాయిలు 98 శాతంగా ఉన్నాయి. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది’’అని ఆస్పత్రి సూపరిండెంట్ రమేశ్ కృష్ణ చెప్పారు. ఆమెను మరో వారం పదిరోజుల అనంతరమే డిశ్చార్జ్ చేయవచ్చన్నారు. అంతకుముందు మంగళవారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గుతో బాధపడుతున్న శశికళను బుధవారం ఉదయం పరప్పన అగ్రహార జైలు అధికారులు బౌరింగ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ నెల 27న శశికళ జైలు నుంచి విడుదల కావాల్సిఉంది. శశికళ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, కర్ణాటక ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కుట్ర జరుగుతోందని అన్నా ద్రవిడర్ కళగం ప్రధాన కార్యదర్శి, ఆమె సోదరుడు దివాకరన్ ఆరోపించారు. తమిళనాడు మన్నార్‌కుడిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈమేరకు కర్ణాటక రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశామన్నారు. -
ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై : కరోనా బారినపడి గత పది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్, లాక్డౌన్ కారణాలతో ఎస్పీ బాలు గత కొంతకాలంగా తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని చెన్నైలోని తన ఇంట్లోనే ఉంటున్నారు. ఈనెల 5న ఆయనకు కరోనా వైరస్ సోకడంతో చెన్నై చూలైమేడులోని ఎంజీఎం ప్రైవేటు ఆస్ప త్రిలో చేరారు. ‘‘దయచేసి పరామర్శించడానికి ఫోన్లు చేయొద్దు. మాట్లాడలేను. త్వరలో ఇంటికి వచ్చేస్తాను’’అని ఆ రోజు బాలు స్వయంగా ఓ వీడియో విడుదల చేశారు. ‘బాలు స్వల్పమైన కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్నారు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు’అని గురువారం సాయంత్రం ఆస్పత్రి వైద్య సిబ్బంది విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు. ఆయన రక్తంలో ఆక్సిజన్ శాతం సరిపడేంతగా కూడా ఉందని తెలిపారు. అయితే, గురువారం రాత్రి ఒక్కసారిగా బాలు ఆరోగ్యం విషమంగా మారడంతో వెంటనే ఐసీయూకి తర లించి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన మరో బులెటిన్‌లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయనకు వెంటిలేటర్ అమర్చారని, వైద్య నిపు ణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని కుటుంబ సభ్యుల సమాచారం. మరోవైపు ఎస్పీబీ భార్య సావిత్రికి శుక్రవారం కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వారు తెలిపారు. ఎస్పీ బాలు ఆరోగ్యంపై చాలామంది ఆందోళన చెందడంతో ఆయన తనయుడు ఎస్పీ చరణ్.. ట్విట్టర్ ద్వారా తన తండ్రి ఆరోగ్య పరిస్థితిని తెలిపారు. ఓ తమిళ టీవీ చానల్లో తండ్రి ఆరోగ్యం గురించి వచ్చిన వార్త నిజం కాదన్నారు. నాన్నగారు తిరిగొచ్చేస్తారు నాన్నగారు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సేఫ్ హ్యాండ్స్ (ఎంజీఎం ఆస్పత్రిని ఉద్దేశించి)లో ఉన్నారు. వదంతులను నమ్మొద్దు. నాన్నగారు తిరిగొచ్చేస్తారని మేమంతా నమ్మకంగా ఉన్నాం. ఆయన కోసం ప్రార్థిస్తున్నవారికి ధన్యవాదాలు – ట్విట్టర్లో ఎస్పీ చరణ్ ఎవరూ కంగారుపడొద్దు మధ్యాహ్నం అన్నయ్యకు కొంచెం క్రిటికల్‌గా ఉంది. ఆ తర్వాత స్టేబుల్‌గా ఉన్నారు. ఎవరూ కంగారుపడొద్దు. ఆయనకు విల్‌పవర్ ఉంది. భగవంతుడి ఆశీస్సులు, మనందరి ప్రార్థనలతో తప్పకుండా ఇంటికొస్తారు. అందరి ప్రార్థనలు ఆయనకు కొండంత అండ – ఎస్పీ బాలు సోదరి వసంత -
ఐసీయూలో 500 మంది బాధితులు
గాంధీ ఆస్పత్రి: కరోనా వైరస్ విజృంభణతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఐసీయూలో ఉండే రోగుల సంఖ్య శనివారం నాటికి 500కు చేరుకుంది. వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 850 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తుండగా, వీరిలో కరోనాతోపాటు వివిధ రుగ్మతలకు గురై ప్రాణాపాయస్థితిలో ఉన్న సుమారు 500 మందిని ఐసీయూలకు తరలించి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కిడ్నీ, లివర్, ఆస్తమా, షుగర్, బీపీ, గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారిలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని, అందుకే వీరిని ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు. ఆస్పత్రిలో పడకలు, వెంటిలేటర్ల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. క్రిటికల్ పొజిషన్లో ఉన్నవారు కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు, సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని తెలిపారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు తొమ్మిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించామని, వందశాతం సక్సెస్ సాధించామన్నారు. ప్లాస్మా చికిత్సతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఐదుగురిని డిశ్చార్జ్ చేశామని, మరో నలుగురు కోలుకుంటున్నారని, వారిని రెండురోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వివరించారు. మరో ఐదుగురికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించేందుకు అవసరమైన ప్లాస్మాకణాలు గాంధీ బ్లడ్‌బ్యాంకులో అందుబాటులో ఉన్నాయని, ఐసీఎంఆర్ ఆదేశాల మేరకు వాటిని వినియోగిస్తామన్నారు. -
మహమ్మారితో 95 రోజులు పోరాడి..
-
మహమ్మారితో 95 రోజులు పోరాడి..
లండన్ : కరోనా మహమ్మారితో 95 రోజుల పాటు పోరాడి ప్రాణాంతక వ్యాధిని జయించి తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్రిటన్‌కు చెందిన కీత్ వాట్సన్ మూడునెలలకు పైగా వైరస్‌తో పోరాడి మహమ్మారిని ఓడించాడు. 41 రోజులు ఐసీయూలో గడిపిన వాట్సన్ 23 రోజుల పాటు కోమాలో ఉన్నారు. ఓ దశలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన ఇక బతకరని వాట్సన్ కుటుంబ సభ్యులకు వైద్యులు సమాచారం అందచేశారు. ధైర్యంతో తీవ్ర అనారోగ్యాన్ని అధిగమించిన వాట్సన్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంటికి పయనమయ్యారు. మూడు నెలలుపైగా చికిత్స అనంతరం వాట్సన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవుతుండగా వైద్య సిబ్బంది ఆయనను అభినందనల్లో ముంచెత్తారు. ఆస్పత్రి నుంచి ఇంటికి చేరగా ఇంటివద్ద 100 మందికి పైగా స్నేహితులు, స్ధానికులు ఆయనను చప్పట్లతో స్వాగతించారు. దీర్ఘకాలం కరోనా మహమ్మారితో పోరాడి తాను ఇప్పటికీ సజీవంగా ఉన్న విషయం నమ్మలేకపోతున్నానని వాట్సన్ చెప్పుకొచ్చారు. చదవండి : ‘మహమ్మారికి భయపడితే ఆకలితో చస్తాం’ -
‘వారిని చంపింది కరోనా కాదు’
ముంబై: పూణెలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న హర్షల్ నెహెతే కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం హర్షల్ భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది.. త్వరలోనే వారి ఇంటికి మరో చిన్నారి అతిథి రాబోతున్నారు. తన కోసం కుటుంబం అంతా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తుంది. ఇలాంటి సంతోష సమయంలో బిడ్డ కంటే ముందుగానే పిలవని అతిథిగా కరోనా వారి ఇంటికి వచ్చింది. ముందుగా హర్షల్ తండ్రి తులసిరామ్‌కి కరోనా సోకింది. అతడిని నాసిక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉంది. తండ్రి ఆరోగ్యానికి డోకా లేదు అనుకునే లోపు నాయనమ్మ మాలతి నెహెతేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆమెను జల్గావ్ సివిల్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఈ నెల 2 నుంచి ఆమె కనిపించడం లేదని ఆస్పత్రి సిబ్బంది హర్షల్‌కు సమాచారం అందించారు. (వూహాన్‌ను అధిగమించిన ముంబై) నాయనమ్మ గురించి ఆందోళన పడుతుండగానే మరో పిడుగులాంటి వార్త తెలిసింది. తల్లి టీనా నెహెతేకు కరోనా పాజిటివ్‌గా తెలిసింది. ఆమెను కూడా జల్గావ్ సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. 6 గంటలపాటు ఎదురు చూసినా ఐసీయూ బెడ్ లభించకపోవడంతో బుధవారం టీనా మరణించారు. ఈ దుఖంలో ఉండగానే మరో విషాదకర వార్త తెలిసింది. గత ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయిన మాలతి నెహెతే మృతదేహం సగం కుళ్లిపోయిన స్థితిలో జల్గావ్ ఆస్పత్రి బాత్రూమ్లో వెలుగు చూసింది. బుధవారం టాయిలెట్‌కు వెళ్లిన ఓ కోవిడ్ పేషెంట్ పక్క బాత్రూం నుంచి భరించలేనంత దుర్గంధం వెలువడుతుందని ఫిర్యాదు చేయడంతో.. సిబ్బంది తలుపులు పగలగొట్టి చూడగా మాలతి మృతదేహం బయటపడింది. అంటే గత 8 రోజులుగా సిబ్బంది ఎవరూ ఆస్పత్రి మరుగుదొడ్లను శుభ్రం చేయలేదని తెలుస్తోంది. (కరోనా భయం.. మానవత్వం దూరం) అయితే మాలతి కంటే ముందు ఈ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు కోవిడ్ రోగులు మరుగుదొడ్డికి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు విడిచినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో సిబ్బంది నిర్లక్క్ష్యం పట్ల ఆందోళన వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర వైద్య విద్య కార్యదర్శి సంజయ్ ముఖర్జీ, జల్గావ్ డీన్ డాక్టర్ బి ఎస్ ఖైరేతో సహా మరో ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉండగా చనిపోయిన తల్లి, నాయనమ్మలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఒక్కరు కూడా తోడు లేరంటూ హర్షల్ విచారం వ్యక్తం చేస్తున్నాడు. తన తల్లి, నాయనమ్మలను చంపింది కరోనా కాదని.. వైద్య సౌకరర్యాల కొరత, అధికారుల నిర్లక్క్ష్యం వల్లే వారు మరణించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ఐసీయూ గది తాళం దొరక్క ఆగిన ప్రాణం
ఇండోర్: ఆసుపత్రిలో ఐసీయూ గది తాళం చెవి దొరక్కపోవడంతో సకాలంలో చికిత్స అందక ఓ మహిళ కన్నుమూసిన ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. గురువారం ఉజ్జయిన్ జిల్లాకు చెందిన యాభై ఐదేళ్ల మహిళకు అధిక రక్తపోటుతోపాటు శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. దీంతో ఆమెను హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మాధవ్ నగర్‌లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కానీ ఆ ఆసుపత్రి కరోనా పరీక్షల కోసం నిర్దేశించినందున అంబులెన్సులో "ఆర్డీ గార్డీ మెడికల్ ఆసుపత్రి"కి తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్లేసరికి అత్యవసర విభాగమైన ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్) గదికి తాళం వేసి ఉంది. సరైన సిబ్బంది కూడా అక్కడ అందుబాటులో లేరు. (రూ.1.90 లక్షలకే వెంటిలేటర్) మరోవైపు ఆమె పరిస్థితి క్షణక్షణానికి మరింత దిగజారుతుండటంతో ఐసీయూ గది తాళాన్ని పగలగొట్టారు. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో వైద్యులు ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ ఘటన గురించి ఉజ్జయిని జిల్లా వైద్యాధికారి అనసూయ గాలి మాట్లాడుతూ.. "బాధితురాలు బీపీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి తీసుకు వచ్చిన వెంటనే ముందుగా వైద్యులు ఆమె నుంచి కోవిడ్-19 నమూనాలను సేకరించారు. కానీ ఆ సమయంలో పరిస్థితి క్షీణించి మరణించింది. దీనిపై విచారణ జరుపుతున్నాం" అని పేర్కొన్నారు. కాగా ఈ మహిళతోపాటు మరో రోగికి సకాలంలో వెంటిలేటర్లు అందించక వారి చావుకు కారణమైన ఇద్దరు వైద్యులను విధుల నుంచి తొలగించారు. (లాక్డౌన్: మహిళను కాల్చి చంపిన జవాను!) -
ఎమర్జెన్సీ.. ఐసీయూలో చేపలు
పట్నా : ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో తీవ్ర అస్వస్థతకు గురైన రోగులను ఉంచుతారనే సంగతి తెలిసిందే. అయితే చేపలను ఐసీయూలో ఉంచడం ఎప్పుడైనా చూశారా.. కనీసం విన్నారా..? లేదా. అయితే బిహార్‌లోని పట్నా నలంద మెడికల్ కాలేజి ఆస్పత్రిలో ఆదివారం చేపలను ఐసీయూలో చేర్చారు. రాత్రంతా వాటిని ఐసీయూలోనే ఉంచి, మరునాడు ఉదయం పంపించారు. ఇది చదవగానే మనుషులకే సరిగా దిక్కులేదు. చేపలను ఐసీయూలో ఉంచి చికిత్స చేశారంటే నిజంగా ఆ ఆస్పత్రి వైద్యులకు ఎంత నిబద్దతో అంటూ మురిసిపోకండి. ఎందుకంటే చేపలను ఐసీయూలో చేర్చింది వాటికి ఆరోగ్యం బాగాలేక కాదు. భారీ వర్షాలు, వరదల వల్ల చేపలు కాస్తా ఇలా ఆస్పత్రిలోకి చేరి, రోగులను పరామర్శించి వెళ్లాయి. ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ భారీ వర్షాల్లో తడిసి ముద్దవుతోంది. ప్రస్తుతం బిహార్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇదే క్రమంలో లోతట్టు ప్రాంతంలో ఉన్న నలంద ఆస్పత్రిలోకి వరద నీరు చేరింది. కేవలం జనరల్ వార్డులోకే కాక ఆఖరికి ఎమర్జెన్సీ వార్డు, ఐసీయూలోకి కూడా వరద నీరు చేరింది. అలా వచ్చిన వరద నీటిలో చిన్నచిన్న చేప పిల్లలు కూడా కొట్టుకొచ్చాయి. ఈ వరదల పుణ్యాన ఆస్పత్రి మొత్తం ఒకేసారి శుభ్రపడిందని సిబ్బంది సంతోషపడుతుండగా.. రోగులు, వారి వెంట వచ్చిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఇది ప్రతి ఏడాది ఉండే తంతేనని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. -
అపోలో ప్రతాప్ రెడ్డికి గుండెపోటు
సాక్షి, చెన్నై: అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుండెపోటు వచ్చింది. ఆయనకు చెన్నై థౌజండ్ లైట్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చెన్నై తేనాం పేటలోని నివాసంలో శుక్రవారం రాత్రి ఆయనకు శ్వాస సమస్య తలెత్తింది. ఆ వెంటనే గుండెపోటు రావడంతో స్పృహ తప్పారు. కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో రాత్రంతా చికిత్స అందించారు. యాంజీయోగ్రామ్ చికిత్స అనంతరం బీపీ, మధుమేహం తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యం కాస్త కుదుటపడడంతో ఐసీయూ నుంచి వీఐపీ వార్డుకు మార్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరీక్షిస్తున్నారు. -
నిమ్స్‌లో అత్యాధునిక ఐసీయూ
హైదరాబాద్: అగర్వాల్ సమాజ్ సహాయతా ట్రస్ట్‌ను ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని వైద్య, ఆరోగ్య మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.60 లక్షలతో నిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డ్ వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్, విశ్రాంతి శాల, ప్రైవేట్ గదిని మంత్రి లక్ష్మారెడ్డితో పాటు పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అగర్వాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేశారని.. ప్రస్తుతం అది పేద రోగులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్యశాఖ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించిందని, అనేక ఆసుపత్రులు స్పెషాలిటీ స్థాయికి ఎదిగాయని అన్నారు. తద్వారా ఐపీ , ఓపీ సేవలు 50 శాతం పెరిగాయని తెలిపారు. నిమ్స్‌లో కూడా 500 బెడ్లు అదనంగా ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. అగర్వాల్ ట్రస్ట్‌ను ఆదర్శంగా తీసుకోవాలి మంత్రి తలసాని మాట్లాడుతూ అగర్వాల్ సహాయక్ ట్రస్ట్‌ను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరంతోపాటు జిల్లాకేంద్రాల్లో కూడా సేవలు విస్తృతం చేయాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ ప్రతినిధులతో కలసి ముఖ్యమంత్రిని కలుస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.శాంతి కుమారి, కమర్షియల్ ట్యాక్స్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కరోడిమల్ అగర్వాల్, నిమ్స్ డైరెక్టర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
నిమ్స్‌కు అగర్వాల్ సమాజ్ బహుమానం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యశాలలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తోన్న అగర్వాల్ సమాజ్ సహాయత సేవా ట్రస్ట్ తాజాగా నిమ్స్ ఆస్పత్రికి పూర్తిస్థాయి ఐసీయూని బహుమానంగా అందజేసింది. నిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం నిర్వహించనున్న మెగా హెల్త్ క్యాంపు సందర్భంగా ఈ నూతన ఐసీయూని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ప్రారంభించనున్నారు. సుమారు రూ.60 లక్షల విలువైన ఈ అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 5 వెంటిలేటర్లు, 7 మానిటర్లు, 6 వీల్ చైర్లు, 2 ట్రాలీలు, వెయిటింగ్ రూమ్ వద్ద స్టీల్ సోఫా సెట్లు, 2 ఎల్ఈడీ టీవీలు ఉన్నాయి. ‘ఇది వరుసగా రెండో మెగా హెల్త్ క్యాంపు. ఇప్పటికే గాంధీ ఆస్పత్రికి డయాలసిస్ మెషీన్‌ను అందజేశాం. ఇప్పుడు నిమ్స్‌కి పూర్తిస్థాయి ఐసీయూని ఇస్తున్నాం. వచ్చే మెగా క్యాంపు నాటికి ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రికి మొబైల్ యూనిట్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులకు అందించే పరికరాలు, సదుపాయాలు నిజమైన పేదవారికి అందుతాయి. అది మా ట్రస్ట్‌కి ఎంతో సంతోషం కలిగించే అంశం’అని అగర్వాల్ సమాజ్ సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రాజేశ్ అగర్వాల్ అన్నారు. -
ఐసీయూ అలంకారప్రాయం..
ఉట్నూర్(ఖానాపూర్) : ఏజెన్సీ గిరిజనులకు అత్యవసర వైద్యం అంద ని ద్రాక్షగానే మిగిలింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు లక్ష్మారెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రులు జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి గత నెల 21న ఉట్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో అట్ట హాసంగా ప్రారంభిం చిన ఐసీయూ, డయాలసిస్ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని ఆశపడ్డ ఏజెన్సీవాసులకు నిరాశే మిగిలింది. ముఖ్యంగా ఐసీయూ, డయాలసిస్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులను నియమించాల్సి ఉన్నా ప్రభుత్వం కాంట్రాక్ట్ పద్ధతిన ఏంబీబీఎస్లను నియమించినట్లు తెలిసింది. గిరిజనులకు వైద్య సౌకర్యాల కల్పనకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం వైద్య సేవలు అందించే వైద్యాధికారులపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా అత్యధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నా గిరిజనులకు మెరుగైన వైద్యం అందడం లేదు. ఐసీయూలో ఎంబీబీఎస్‌లే దిక్కు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అత్యవసర వైద్య సదుపాయాలు మరింత చెరువ చేసేందుకు ప్రభుత్వం తెలంగాణ వైద్య విధాన పరిషత్ ద్వారా ఏప్రిల్‌లో సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యునిట్)ను రూ. 22 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసింది. ఐసీయూలో విధులు నిర్వహించేందుకు యూనిట్ హెడ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(అనస్థీషియా), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (జనరల్ మెడిసిన్), ఇద్దరు సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టు (పాల్మనరీ మెడిసిన్)లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ఆరుగురు స్టాఫ్ నర్సులు, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలాజీ టెక్నీషీయన్, వెంటిలేటర్ టెక్నీషియన్, ఎనిమిది మంది ఎమ్ఎన్వో, ఏఫ్ఎన్వోలు, మూగ్గురు సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిన నియమించేలా చర్యలు చేపట్టింది. ఐసీయూ కేంద్రంలో సెంట్రలైజ్డ్ ఏసీ సౌకర్యం, సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిస్టం ఏర్పాటు చేశారు. పది పడకల సామర్థ్యం గల యూనిట్ ఆస్పత్రి పర్యవేక్షకుడికి సంబంధం లేకుండా పూర్తిగా స్వయం ప్రతిపత్తి యూనిట్లుగా ఇన్చార్జీల పర్యవేక్షణలో ఉండేలా జాతీయ ఆరోగ్య మిషన్ చర్యలు చేపట్టింది. అయితే ఉట్నూర్ ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నతాధికారుల సూచనలతో ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యాధికారులను ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేలా నియమించినట్లు ఆస్పత్రి సుపరింటెండెంట్ పేర్కొంటున్నారు. అత్యవసర వైద్య సేవలు ప్రత్యేక వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహణ సాగితే మేలు జరుగుతుంది తప్ప ఎంబీబీఎస్ వైద్యులు నిర్వహణ కొనసాగిస్తే ప్రయోజనం ఉండదని గిరిజనులు వాపోతున్నారు. నెప్రాలజీ లేక.. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తశుద్ధి కోసం ప్రభుత్వం సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది. ఒకేసారి ఐదుగురు బాధితులకు రక్తశుద్ధి చేసేలా ఐదు డయాలసిస్ యునిట్లు ఏర్పాటు చేసి కేంద్రం నిర్వహణ బాధ్యతలను ‘డీమెడ్’ అనే సంస్థకు అప్పగించింది. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ఇద్దరు టెక్నికల్ అధికారులు, ముగ్గురు స్టాఫ్‌నర్సులు ఉన్నప్పటికీ డయాలసిస్ సమయంలో బాధితులను అన్ని విధాలా పర్యవేక్షించే అతి ముఖ్యమైన వైద్యాధికారి నెప్రాలజిస్ట్ లేక పోవడంతో కేంద్రం అలంకారప్రాయంగా మారింది. కీడ్నీ బాధితులకు డయాలసిస్ చేసేటప్పుడు అత్యవసరంగా రక్తం అవసరం పడుతుంది. కానీ సామాజిక ఆరోగ్య కేం ద్రంలో ఉన్న బ్లడ్ బ్యాంక్ ఎప్పుడో మూలకు పడింది. కొత్తగా నిర్మిస్తున్న భవనంలో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నా అది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులకు ఎలా డయాలసిస్ నిర్వహిస్తారో అధికారులకే తెలియాలి. ప్రత్యేక వైద్యాధికారులను నియమించి వైద్యం అందించాలని ఏజెన్సీ గిరిజనులు కోరుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో సేవలు.. సీహెచ్‌సీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఐసీయూ కేంద్రంలో విధులు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్యాధికారులు ఎవరూ ముందుకు రాక ఉన్నతాధికారులు ఐదుగురు ఏంబీబీఎస్ వైద్యులను ఐసీయూలో విధులు నిర్వహించేందుకు నియమించింది. అయితే వీరికి త్వరలో విడతల వారీగా ఐసీయూలో విధుల నిర్వహణపై శిక్షణ నిర్వహించనున్నారు. కేంద్రం నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు రాగానే ఐసీయూ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. డయాలసిస్ కేంద్రంలో విధులు నిర్వహణ కోసం త్వరలో నెప్రాలజిస్ట్ను ప్రభుత్వం నియమించే అవకాశం ఉంది. – వేణుగోపాల్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్ ఉట్నూర్ -
చేరువలో వైద్యం
మెదక్‌జోన్: పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో పేద ప్రజలకు వైద్యం మరింత చేరువ కానుంది. ఏరియా ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)ను భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి శనివారం ప్రారంభించనున్నారు. దీంతో అత్యవసర చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. పాము కాటు, విషం సేవించిన బాధితులు, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిని ప్రాణా పా యం నుంచి రక్షించేందుకు ఈ యూనిట్ ఉపయోగపడుతుంది. గతంలో బాధితులను హైదరాబాద్‌కు రెఫర్ చేసేవారు. అందులో చాలా మంది హైదరాబాద్‌కు చేరుకునేలోపే మరణిం చేవారు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండదు. ఈ యూనిట్లో ఐదుగురు వైద్యులతో పాటు, ఐదుగురు ప్రత్యేక నిపుణులు, ఎక్స్‌రే, ల్యాబ్ టెక్నిషియన్స్, స్టాఫ్ నర్స్‌లు, నర్స్‌లు, అనస్తీషియా వైద్యులు ఉంటారు. ప్రత్యేక నిపుణులు ఇద్దరే వచ్చారు. మరో ముగ్గురు రావాల్సి ఉంది. -
నేటి నుంచి గాంధీలో ఐసీయూ సేవలు
గాంధీ ఆస్పత్రి : ఆధునిక వసతులు, ఆత్యాధునిక వైద్య పరికరాలతో గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన 65 పడకల ఇన్సెంటివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) గురువారం నుంచి అందుబాటులోకి రానుంది. ఆస్పత్రి ఎమర్జెన్సీ భవనం పై అంతస్తులో రూ.5.18 కోట్ల వ్యయంతో నిర్మించిన దీనిని గతనెల 11వ తేదిన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ లాంఛనప్రాయంగా ప్రారంభించిన సంగతి విధితమే. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యలను అధిగమించిన ఆస్పత్రి యాజమాన్యం గురువారం ఉదయం నుంచి అత్యవసర రోగులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈమేరకు ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ నేతృత్వంలో బుధవారం మధ్యాహ్నం సంబంధిత వైద్యాధికారులు, ఆర్‌ఎంఓలు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నర్సింగ్ సిబ్బందితో పాటు జూనియర్ వైద్యులు, హౌస్సర్జన్లు, ఇంటర్నీస్లను కూడా విధుల్లో నియమించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఐసీయూ ఇన్చార్జి, జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజారావు, స్వైన్‌ఫ్లూ నోడల్ ఆఫీసర్ నరేందర్, వైద్యులు త్రిలోక్చందర్, విజయ్‌శేఖర్, ప్రదీప్, ఆర్‌ఎంఓలు జయకృష్ణ, శేషాద్రి, సాల్మన్, గీత, టీఎస్ఎంఎస్ఐడీసీ అధికారులు పాల్గొన్నారు. -
కష్టాల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు చెల్లు !
♦ వాటిని వీలైనంత త్వరగా అమ్మేయాల్సిందే... ♦ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య వ్యాఖ్య ముంబై: మొండి బకాయిల (ఎన్పీఏ) భారంతో కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మేయాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య సూచించారు. ‘‘భారీగా డిపాజిట్లు ఉన్న కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు తీవ్ర మొండిబకాయిల భారంలో ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్’(ఐసీయూ)లో ఉన్నాయి. వీటిని ప్రైవేటు బ్యాంకులకు అమ్మివేయచ్చు. మొండిబకాయిల సమస్యను ఎదుర్కొంటున్న ఆయా బ్యాంకులు ఇందుకు సంబంధించి తమ పరిస్థితిని మెరుగుపరచుకోడానికి, తాజా మూలధనం సమీకరించుకోడానికి సమయం మించిపోతుంది’’ అని అన్నారు. 8వ ఆర్కే తల్వార్ స్మారకోపన్యాసం చేసిన ఆయన ఈ సందర్భంగా ‘ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుత్తేజం– అసంపూర్ణ అజెండా’ అన్న అంశంపై మాట్లాడారు. న్యూయార్క్ యూనివర్శిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ అయిన ఆచార్య ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు... ప్రభుత్వ బ్యాంకుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి భారత్‌కు ఒక ‘సుదర్శన చక్రం’ కావాల్సిందే. సామర్థ్యం పెంపునకు బ్యాంకులు చేపడుతున్న చర్యలు పూర్తి మందగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కరించడంలో కాలాతీతం అయిపోతోంది. దీనితో రుణాలకు అధికభాగం వీటిమీదే ఆధారపడుతున్న చిన్న తరహా పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పునరుద్ధరించడానికి ఉద్దేశించిన ఇంద్రధనుష్ కార్యక్రమం (నాలుగేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా రూ.70,000 కోట్ల అందజేయడం ప్రధాన లక్ష్యంగా కేంద్రం ప్రకటించింది) మంచిదే. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సత్వర సమస్య పరిష్కారానికి ఇంకా శక్తివంతమైన ‘సుదర్శన’ చక్రం వంటి ప్రణాళిక అవసరం. ‘ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రధానమైన అంశాలు ఏమిటంటే, ప్రైవేటు క్యాపిటల్ ప్రొవైడర్స్‌కు కష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మివేయవచ్చా? తద్వారా ఆయా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో అమలు జరుగుతున్న ‘తగిన దిద్దుబాటు చర్యల (పీఏసీ)’తో ఐసీయూలో నుంచి పటిష్ట వంతమైన వ్యవస్థలోకి మారే వీలుంటుందా? ఈ ప్రశ్నలకు తగిన సమాధానాన్ని చిన్న బ్యాంకులతో రాబట్టే వీలుంటుందా?’ అని ఆచార్య ఈ సందర్బంగా ప్రశ్నించారు. బ్యాంకులకు రెండో విడత ‘దివాలా’ జాబితా మొండిబకాయిల ఖాతాలకు సంబంధించి బ్యాంకులకు తాజాగా రెండో జాబితాను పంపించినట్టు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ధ్రువీకరించారు. దివాలా కోడ్‌లోని నిబంధనలను మార్చామని, మొండిబకాయిల విషయంలో వీటిని విస్తృతంగా వినియోగించుకోవాలని బ్యాంకులను కోరినట్టు ఆయన చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇతర ఖాతాలను పరిష్కరించుకోవాలని కూడా సూచించినట్టు తెలిపారు. ఒకవేళ నిర్దేశించిన సమయంలోపు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనడంలో విఫలమైతే ఆయా కేసులను సైతం బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) కింద చర్యలకు సిఫారసు చేస్తామని విరాల్æ వివరించారు. ఆర్బీఐ తొలిసారిగా 12 భారీ రుణ ఎగవేత కేసుల్లో ఐబీసీ కింద చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల మరో 40 కేసులతో రెండో జాబితాను బ్యాంకులకు పంపినట్టు వార్తలు వచ్చాయి. కానీ, విరాల్ ఆచార్య మాత్రం ఈ సంఖ్య గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఐబీసీ కింద కేసులు ఫైల్ చేయాలని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశించడం వాణిజ్య నిర్ణయంలో భాగమేనన్నారు. నిరర్థక ఆస్తులను ఏరిపారేయడానికి బ్యాంకులు ఐబీసీని మరింతగా వాడుకోవాలన్నారు. దివాలా చర్యలను తమంతట తామే చేపట్టాలని, ఆర్బీఐ అనుమతి కోసం వేచి చూడరాదని సూచించారు. ఎన్పీఏలు రెండంకెలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉందని, రుణ వృద్ధి కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. -
వైద్యం.. దైన్యం
► ఐసీయూలో ఆస్పత్రులు ► జిల్లాలో ప్రభుత్వ వైద్యసేవలు అంతంతే.. ►వైద్యవిధానపరిషత్ వార్షిక నివేదికలో వెల్లడైన వాస్తవాలు ► జిల్లాలో పది వైద్యశాలలకు మాత్రమే ‘ఏ’ గ్రేడ్ ► మూడింటికి ‘బీ’.. మరో ఆరింటికి ‘సీ’ గ్రేడ్లు ► 50 పైగా భర్తీకినోచుకోని పోస్టులు జిల్లాలోని ఆరోగ్యకేంద్రాల పనితీరు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. వైద్యవిధాన పరిషత్ జిల్లాలోని ఆస్పత్రులపై ఇచ్చిన వార్షిక నివేదికలో ఈ విషయం బట్టబయలైంది. ఆయా ఆస్పత్రుల్లోని రోగుల సంఖ్య, శస్త్ర చికిత్సలు, ప్రసవాలు, ల్యాబ్ పరీక్షలు, ఈసీజీ లాంటి అంశాల ప్రాతిపదికగా రూపొందిం చిన రిపోర్ట్‌లో ఏకంగా ఆరు ఆస్పత్రులు సీగ్రేడ్లో ఉండడమే ఇందుకు నిదర్శనం. చిత్తూరు (అర్బన్): పేదలకు వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. సకాలంలో వైద్యులు విధులకు రాకపోవడం.. పనిచేస్తున్న చోట నివాసముండకపోవడం లాంటి కారణాలతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇవన్నీ ఎవరో చెప్పనవి కావు.. జిల్లాలోని వైద్య విధాన్ పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల పనితీరును తెలిపే వార్షిక నివేదికలో వెలుగు చూసిన వాస్తవాలు. ఒక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితో పాటు 12 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఆరు ఏరియా ఆసుపత్రులున్నాయి. ఏటా ఏప్రిల్ 1 నుంచి మరుసటి ఏడాది మార్చి 31 వరకు ఈ ఆసుపత్రుల పనితీరు ఆధారంగా ప్రభుత్వంగ్రేడింగ్లను కేటాయిస్తుంది. ఈసారి ఏకంగా ఆరు ఆసుపత్రులు ‘సీ’ గ్రేడ్లకు పడిపోయాయి. ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్య, ఆపరేషన్లు, ప్రసవాలు, ల్యాబ్ పరీక్షలు, ఈసీజీ లాంటి పరీక్షలు ఆరోగ్య కేంద్రాల పనితీరుకు అద్దం పడుతున్నాయి. గ్రేడ్లు ఇలా.. 2016–17 ఆర్థిక సంవత్సరంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు మదనపల్లె, శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులు, పుంగనూరు, పీలేరు, వాయల్పాడు, వి.కోట, పుత్తూరు, కలికిరి సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఏ గ్రేడ్‌ను సాధించాయి. గత ఏడాది ఏ గ్రేడ్ సాధించిన ఆసుపత్రులు 8 మాత్రమే. ఇక చిత్తూరు ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల లక్ష్యం 3.96 లక్షలు కాగా ఏకంగా 5 లక్షల మంది రోగులు రావడం, ప్రసవాల్లో 1800 లక్ష్యం ఉండగా 1411కు చేరుకోవడం, శస్త్ర చికిత్సల్లో సైతం 73 శాతం రాణించడం ‘ఏ’ గ్రేడ్ రావడానికి సహకరించాయి. మిగిలిన ఆసుపత్రులు సైతం వంద శాతానికి పైగా పనితీరును సాధించాయి. అయితే కేటాయించిన లక్ష్యాలను చేరుకోలేక ఆరు ఆసుపత్రులు ‘సీ’గ్రేడ్‌కు పడిపోయాయి. ఇందులో సత్యవేడు, చిన్నగొట్టిగల్లు, సదుం, పి.కొత్తకోట, తంబళ్లపల్లె, బంగారుపాళెం సీహెచ్‌సీలు ఉన్నాయి. పి.కొత్తకోట, బంగారుపాళెం, సదుం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది. ఈ మూ డింటికీ వరసగా 28, 30, 37 మార్కులు వచ్చాయి. ఒక్కో సీహెచ్‌సీలో ఏటా 180 శస్త్ర చికిత్సలు జరగాలని ఉంటే ఒక్క చోట కూడా ఆపరేషన్లు జరగలేదు. ఇక కుప్పం, పలమనేరు, నగరి ఏరియా ఆసుపత్రులు 87, 88, 84 మార్కులతో ‘బీ’ గ్రేడ్ సాధించాయి. ఖాళీలు భర్తీ చేయరు.. గ్రేడింగ్లలో ఆసుపత్రుల్లో నెలకొన్న ఖాళీలు సైతం ప్రభావం చూపుతున్నాయి. ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 15 అనస్తీషియన్ పోస్టులు, ఎనిమిది గైనకాలాజిస్టు పోస్టులు, 7 సివిల్ సర్జన్, 4 చిన్న పిల్లల వైద్య నిపుణులు, 6 ఈఎన్టీ పోస్టులు ఏళ్ల తరబడి భర్తీకి నోచుకోలేదు. దీనికితోడు ప్రసూతి సహాయకులు, ల్యాబ్ అసిస్టెంట్లు, డార్క్ రూమ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉండటం సైతం ప్రజల్ని ప్రభుత్వ ఆసుపత్రుల వైపు రానివ్వకుండా చేస్తోంది. సంజాయిషీ కోరాం.. ఆసుపత్రుల్లో వైద్యుల పనితీరు మెరుగుపడాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చించాం. ‘సీ’గ్రేడ్‌లో ఉన్న ఆసుపత్రుల పర్యవేక్షకుల నుంచి సంజాయిషీ అడుగుతున్నాం. పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చాం. త్వరలోనే ‘సీ’ గ్రేడ్‌లో ఉన్న వాటిని సరిచేస్తాం. పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదించాం. – డాక్టర్ పి.సరళమ్మ,జిల్లా ప్రభుత్వ వైద్యశాలల సేవల సమన్వయాధికారిణి -
జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలు
⇒ 500 మంది వైద్య సిబ్బంది భర్తీకి ఆదేశం ⇒ కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఎంపిక కమిటీ ఏర్పాటు ⇒ తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జిల్లా ఆసుపత్రులు, గుర్తిం చిన ఏరియా ఆసుపత్రుల్లో 20 ఐసీయూలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణ యించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక్కో ఐసీయూ 10 పడకలతో ఏర్పాటు చేస్తారు. ఇటీవలే మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్ధిపేట జిల్లా ఆసుపత్రుల్లో ప్రారంభం కాగా, మరో 17 ఐసీయూలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ జిల్లా ఆసుపత్రుల్లో ఐసీ యూలు ఏర్పాటు చేస్తారు. అలాగే నాగర్ కర్నూలు, నారాయణ్‌పేట్, మెదక్, జహీరా బాద్, మంచిర్యాల,నిర్మల్,కామారెడ్డి, సిరిసిల్ల, మహబూబాబాద్, భద్రాచలం, సూర్యాపేట, గద్వాల్ ఏరియా ఆసుపత్రుల్లో నెలకొల్పు తా రు. ఏటూరు నాగారం, ఉట్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఏర్పాటు చేస్తారు. కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకం కొత్తగా ఏర్పాటు చేయబోయే ఐసీయూలకు 500 మంది వైద్య సిబ్బందిని నియమిస్తారు. వైద్యులను కాంట్రాక్టు పద్ధతిలో, నర్సులు, సాంకేతిక సిబ్బందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా ఎంపిక కమిటీ వీరిని భర్తీ చేస్తుంది. ఒక్కోఐసీయూకు అధిపతిగా అనెస్థీషియా స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ను నియమిస్తారు. అతనికి నెల వేతనం రూ.లక్ష నిర్థారించారు. అలాగే ఐసీ యూకు జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఇద్దరిని నియమిస్తారు. వారి వేతనం రూ.80వేలు. పల్మనరీ స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఇద్దరిని నియమి స్తారు. వారికీ జీతం రూ.80వేలు. అవసరాన్ని బట్టి కార్డియాలజీ స్పెషలిస్టును ప్రత్యేకంగా కన్సల్టేషన్ ఫీజుతో బయటి నుంచి రప్పిస్తారు. ఒక్కో ఐసీయూకు ఆరుగురు స్టాఫ్ నర్సులను, ఒక్కొక్కరి చొప్పున ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, వెంటిలేటర్ టెక్నీషి యన్లను నియమిస్తారు. అలాగే 8 మంది ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వోలను నియమిస్తారు. ఒక్కో ఐసీయూకు ముగ్గురు సెక్యూరిటీ గార్డుల ను నియమిస్తారు. వారిలో స్టాఫ్ నర్సు వేతనం రూ.20 వేలు, ల్యాబ్ టెక్నీషియన్, రేడియాలజీ టెక్నీషియన్, వెంటిలేటర్ టెక్నీషియన్లకు రూ.15వేల వేతనం ఇస్తారు. ఎంఎన్‌వో/ ఎఫ్‌ఎన్‌వోలకు రూ.12వేలు, సెక్యూరిటీ గార్డు లకు రూ.9వేల చొప్పున వేతనం ఇస్తారు. వైద్య సిబ్బందికి అర్హతలివే... ఐసీయూ అధిపతిగా తీసుకోబోయే అనెస్థీషియా స్పెషలిస్టు ఎండీ (అనెస్థీషియా) చదివి ఉండాలి. జనరల్ మెడిసిన్ స్పెషలిస్టు ఆ విభాగంలో ఎండీ చేసి ఉండాలి. పల్మనరీ మెడిసిన్ స్పెషలిస్టు డీఎం పల్మనరీ లేదా ఎండీ (ఛాతీ వ్యాధులు) చేసి ఉండాలి. ఇక స్టాఫ్ నర్సులు బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎంలో డిప్లొమా చదివి ఉండాలి. మెడికల్ ల్యాబోరేటరీ టెక్నీషియన్ కోర్సు చదివిన అభ్యర్థులను ల్యాబ్ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. రేడియోగ్రాఫర్‌గా డిప్లొమా చేసిన అభ్యర్థులను రేడియాలజీ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. ఇంటర్‌తోపాటు వెంటిలేటర్ డిప్లొమా చేసిన అభ్యర్థులను వెంటిలేటర్ టెక్నీషియన్లుగా తీసుకుంటారు. పదో తరగతి పాసై ప్రాథమిక చికిత్సలో సర్టిఫికెట్ ఉన్న వారిని ఎంఎన్‌వో/ఎఫ్‌ఎన్‌వోలుగా తీసుకుంటారు. పదో తరగతి పాసైన వారిని సెక్యూరిటీ గార్డులుగా తీసుకుంటారు. ఈ మేరకు వైద్య విధాన పరిషత్ తగు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
నిలకడగా పాశ్వాన్ ఆరోగ్యం
పట్నా : అస్వస్థతకు గురైన కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ ఆర్యోగం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శ్వాసకోస ఇబ్బందులతో ఆయనను నిన్న రాత్రి ఢిల్లీలోని పరాస్ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. పాశ్వాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి కార్డియాలస్ట్ హెడ్ డాక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పాశ్వాన్‌కు ఐసీయూలోనే చికిత్స కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు పాశ్వాన్ ఆరోగ్యం మెరుగు పడగానే వైద్యుల సిఫార్సు మేరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఓఎస్డీ ఆర్సీ మీనా తెలిపారు. -
మళ్లీ ఐసీయూలో జయలలిత
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను మళ్లీ ఐసీయూలో చేర్పించారు. సాధారణ వార్డులో చికిత్స పొందుతున్న జయలలితకు గుండెపోటు రావడంతో ఐసీయూలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో జయలలితకు చికిత్స అందిస్తున్నారు. మరో వైపు ఆదివారం జయలలిత పూర్తిగా కోలుకున్నారని ఎయిమ్స్ వైద్య నిపుణులు నిర్ధారించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. త్వరలో జయలలిత డిశ్చార్జి అయి ఇంటికి వెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతలోనే మళ్లీ జయలలితకు గుండెపోటు వార్త రావడంతో పెద్ద మొత్తంలో కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. సమాచారం తెలియగానే గవర్నర్ విద్యాసాగర్ రావు హుటాహుటిన ముంబై నుంచి చైన్నైకి బయలుదేరారు. మధురైలో అత్యవసర సమావేశాన్ని రద్దు చేసుకుని డీజీపీ రాజేంద్రన్ చైన్నై బయలుదేరి వెళ్లారు. అపోలో ఆసుపత్రి వద్ద భారీగా భద్రత పెంచారు. సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. -
ఆసుపత్రి.. నడిచొస్తుంది!
• ఐసీయూతో సహా ఫిజియో, కీమోథెరపీ సేవలన్నీ ఇంట్లోనే • దంత, కంటి శస్త్ర చికిత్సలు కూడా • వైద్య నిపుణుల కోసం ఆసుపత్రులకు తిరగక్కర్లేదు కూడా • ఆసుపత్రి గది, బెడ్ చార్జీలుండవ్; దీంతో 20-30 శాతం డబ్బు ఆదా • రూ.16,750 కోట్లకు చేరిన దేశీ హోమ్ హెల్త్‌కేర్ పరిశ్రమ • నాలుగైదేళ్లలో రెండింతలు దాటేస్తుందంటున్న నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దిగ్గజ ఆసుపత్రుల గ్రూప్ ఆపోలో... వైద్యుడి కన్సల్టింగ్, నర్సింగ్, పరీక్షల శాంపిల్స్ సేకరణ సహా పలు వైద్యసేవల్ని రోగుల ఇంట్లోనే అందించేందుకు ‘అపోలో హోమ్‌కేర్’ను ఆరంభించింది. ఇక ఖాతాల కుంభకోణంతో తెరమరుగైన సత్యం గ్రూపు... కాల్హెల్త్ పేరిట సమగ్ర హోమ్‌హెల్త్‌కేర్ సేవలతో రంగంలోకి దిగింది. ట్యూటర్‌విస్టా, బిగ్‌బాస్కెట్, బ్లూస్టోన్ కంపెనీల సహ వ్యవస్థాపకురాలు మీనా గణేశ్... హోమ్‌హెల్త్‌కేర్ సంస్థ పోర్టియాను ఆరంభించి తక్కువకాలంలోనే అన్ని నగరాలకూ విస్తరించారు. డాబర్ ప్రమోటర్లరుున బర్మన్ కుటుంబీకుల దన్నుతో హెల్త్‌కేర్ ఎట్ హోమ్ మొదలైంది. ఇక నైటింగేల్స్, మ్యాక్స్, మెడ్‌వెల్ వెంచర్స్, వాస్తల్య, కేర్ 24, లైఫ్ సర్కిల్, జోక్టర్, జోజ్, ఫ్రిస్కా వంటి స్టార్టప్‌లు సైతం ఆరంభమైన కొద్దినెలలకే ఇతర నగరాలకు విస్తరిస్తూ దూకుడు మీదున్నారుు. మెట్రోలకే పరిమితం కాకుండా కొన్ని ద్వితీయశ్రేణి నగరాలకూ వెళుతున్నారుు. కారణం...! హోమ్హెల్త్కేర్కు పెరుగుతున్న డిమాండే. ఏకంగా 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ పరిశ్రమ... వచ్చే మూడు నాలుగేళ్లలో రెండింతలు దాటేస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నారుు. అందుకే దిగ్గజాలు వాటా కోసం పావులు కదుపుతున్నారుు. ఆ వివరాలే ఈ ప్రత్యేక కథనం.. అవసరం నుంచే ఆరంభం.. నగరాల్లో దంపతులిద్దరూ ఉద్యోగాలు చేయడం సాధారణం. మరి అలాంటి కుటుంబాల్లో పిల్లలకో, పెద్దలకో ఆరోగ్య సమస్య వస్తే పరిస్థితేంటి? వైద్యుల అపారుుంట్‌మెంట్లు తీసుకుని, సెలవులు పెట్టి ఆసుపత్రులకు తిరగటం అయ్యే పనేనా? ఇలాంటపుడే హోమ్‌హెల్త్‌కేర్ అవసరం కనిపిస్తోంది. నిజానికి దేశంలో వైద్యులు, వైద్య నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి 10వేల మంది జనాభాకు ఏడుగురు వైద్యులే ఉన్నారు. ఆసుపత్రి బెడ్లూ అరకొరే. ‘‘హోమ్ హెల్త్‌కేర్ ఎదగటానికి కారణాలివే’’ అనేది మెడ్‌వెల్ వెంచర్స్ చైర్మన్ విశాల్ బాలి మాట. హోమ్ హెల్త్‌కేర్ మార్కెట్ 2017కి 10 బిలియన్ డాలర్లకు చేరుతుందని గ్రాండ్ వ్యూ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. ఇంటివద్దే సేవలు... రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జరుున రోగికి వైద్య పర్యవేక్షణ అవసరం. బీపీ, షుగర్ చూడటం, సమయానికి ఇంజక్షన్లు, మందులు ఇవ్వటం, అవసరమైతే ఫిజియోథెరపీ... ఇవన్నీ ఇంటివద్దే చేయొచ్చు. కానీ చేసేవారు లేక ఆసుపత్రులకు వెళ్లేవారే అధికం. ఈ హోమ్‌హెల్త్‌కేర్ సంస్థలొచ్చాక ఇళ్లకు నర్సుల్ని, వైద్యుల్ని పంపి మరీ ఇవి ఆ సేవల్ని అందిస్తున్నారుు. కొన్ని హోమ్హెల్త్ సంస్థలైతే ఇళ్ల దగ్గరే ఆపరేషన్లూ చేస్తున్నారుు. కావలసిన పరికరాలు, ఫర్నిచర్‌ను వెంట తీసుకెళుతున్నారుు కూడా. ఇక కొన్ని సంస్థలైతే సేవల్లోనూ ప్రత్యేకత కనబరుస్తున్నారుు. వాస్తల్య సంస్థ డెంటల్ కేర్‌కు పరిమితం కాగా... ఢిల్లీలోని షార్ప్ ఐ సెంటర్ ఇటీవలే హోమ్ ఐ కేర్ సేవల్ని ఆరంభించింది. విజయవాడ, గుంటూరుల్లో పనిచేస్తున్న ఫ్రిస్కాకేర్... వైద్య నిపుణులనూ ఇళ్లకు పంపిస్తోంది. ఇక ‘హోమ్ కేర్ ఎట్ హోమ్’ సంస్థ... రూ.10-15 వేల ఛార్జీతో ఇంట్లోనే కావలసినవారికి ఐసీయూ ఏర్పాటు చేస్తోంది. ఇక ఇంట్లోని రోగిని ఆసుపత్రిలోని వైద్యులతో అనుసంధానం చేసేలా హోమ్‌హెల్త్‌కేర్ సంస్థలు ప్రత్యేక యాప్‌లు రూపొందించారుు. రోగి నిద్రలో ఉన్నపుడు తీసే స్లీప్ అనాలసిస్‌కు ఆసుపత్రికెళ్లాలి. కానీ ఇపుడు ఈ యంత్రాన్ని రోగి ఇంటికే తీసుకెళ్లి సేకరిస్తున్నారు. 20-30 శాతం డబ్బు ఆదా..! ఆసుపత్రి ఖర్చులతో పోలిస్తే హోమ్హెల్త్ కేర్‌తో సుమారు 20-30 శాతం దాకా సొమ్ము ఆదా అవుతుందన్నది ఫ్రిస్కాకేర్ వ్యవస్థాపకుడు ఆసిఫ్ మొహమ్మద్ మాట. ‘‘ప్రయాణ చార్జీల నుంచి ఆసుపత్రి గది, బెడ్ ఛార్జీలు, డాక్టర్ అపారుుంట్‌మెంట్ ఫీజు. ఇతరత్రా ఖర్చులూ మిగిలుతారుు. అదేకాదు. ఆసుపత్రంటే పేషెంట్లో ఉండే భయం తొలిగి, రోగి త్వరగా కోలుకుంటాడు’’ అని ఆసిఫ్ చెప్పారు. హోమ్హెల్త్ కేర్ సేవలతో ఆపరేషన్ తరవాత పేషెంట్ ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం పోరుుందని నైటింగేల్స్ సీఈఓ లలిత్ పాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘చికిత్స తరవాత అబ్జర్వేషన్ కోసం పేషెంట్‌ను ఆసుపత్రిలో ఉంచుకోకుండా డిశ్చార్జి చేసేసి, పర్యవేక్షణను ఇంటి దగ్గరే చేస్తే పేషెంట్ కుటుంబానికి డబ్బు ఆదా అవటమే కాదు. ఆసుపత్రి ఆ బెడ్‌ను మరొకరికి కేటారుుంచవచ్చు. అది ఇరువురికీ లాభం’’ అని పాయ్ చెప్పారు. అరుుతే హోమ్ హెల్త్‌కేర్ వృద్ధికి ప్రతిబంధకమైన అంశమూ ఒకటుంది. అది... ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాల మాదిరి మన దేశంలో హోమ్ హెల్త్‌కేర్‌కు బీమా సౌకర్యం లేదు. పేషెంట్ గనక ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నా, లేక ఆసుపత్రిలో గదులు లేకపోరుునా సదరు చికిత్సకు బీమా కవరేజీ ఇస్తామని లిబర్టీ వీడియోకాన్ జనరల్ ఇన్సూరెన్స చెబుతోంది. హైదరాబాద్ స్టార్టప్స్ హవా.. దేశంలో గతేడాది హోమ్ హెల్త్‌కేర్ స్టార్టప్స్ 57 డీల్స్ ద్వారా 277 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించారుు. ఐఎఫ్‌సీ, క్వాల్కామ్ వెంచర్స్, వెంచర్ ఈస్ట్ వంటి సంస్థల నుంచి పోర్షియా 37.5 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించగా... హైదరాబాదీ సంస్థ రూ.200 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి పెట్టింది. పలువురు పీఈ ఇన్వెస్టర్లతో మాట్లాడుతున్నామని.. డిసెంబర్‌లోగా డీల్‌ను క్లోజ్ చేస్తామని సంస్థ సీఈఓ హరి తాళ్లపల్లి చెప్పారు. ఇటీవలే వాస్తల్య.. ఎస్ స్క్వార్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి రూ.11 కోట్ల నిధుల్ని సమీకరించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కేర్ 24... సైఫ్ పార్టనర్స్, ఇండియా కోషంట్ నుంచి 4 మి. డాలర్లు సమీకరించింది. ఏ ఏ దేశాల్లో ఎంతెంతంటే.. ప్రపంచవ్యాప్తంగా హోమ్ హెల్త్ కేర్ పరిశ్రమ 227.5 బిలియన్ డాలర్లు. 2020 నాటికి ఇది 349.8 బిలియన్ డాలర్లకు చేరుతుందనేది గ్రాండ్ వ్యూ రీసెర్చ్ అంచనా. ప్రస్తుతం ఏఏ దేశాల్లో ఎంతనేది చూస్తే... -
సోనియా భుజానికి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ : అస్వస్థతకు గురైన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేగంగా కోలుకుంటున్నారు. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయానికి ఆమెను ఐసీయూ నుంచి బయటకు తీసుకు వచ్చే అవకాశం ఉంది. మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. మరోవైపు సోనియా భుజానికి శస్త్రచికిత్స జరిగింది. ఆమె ఎడమ భుజంలో ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఆమెకు సర్జరీ చేయడానికి ముంబై నుంచి డాక్టర్ సంజయ్ దేశాయ్ ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జైన తర్వాత ఆమె కొన్ని రోజులు ఫిజియో థెరపీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. మంగళవారం వారణాసిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సోనియా అస్వస్థత కారణంగా ర్యాలీని మధ్యలోనే రద్దు చేసుకుని ఢిల్లీ వెళ్లారు. డీహైడ్రేషన్, జ్వరం, అధిక రక్తపోటు, తలతిరగడం లాంటి సమస్యల బాధపడుతున్న ఆమెకు తొలుత ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స చేయించగా, అక్కడి నుంచి ఎస్ఆర్జీహెచ్కి తరలించారు. -
13 మందిని చంపిందన్న ఆరోపణలతో...
పియంబినొ: ఐసీయూలో 13 మంది చావుకు కారణమైందనే ఆరోపణలతో ఇటాలీకి చెందిన ఓ నర్సును పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసీయూలో రోగులకు ప్రమాదకర ఇంక్షన్ ఇచ్చి ఆమె ఈ దారుణానికి పాల్పడినట్టు అభియోగాలు నమోదు చేశారు. టస్కార్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఫ్రాస్టా బొనినొ(55)ను బుధవారం అరెస్ట్ చేసినట్టు ఇటలీ ఎన్ఎస్ఏ విభాగం పోలీసులు వెల్లడించారు. ఎనస్తీషియా, ఐసీయూ యూనిట్ లో పనిచేస్తున్న ఆమె 2014-2015 మధ్యకాలంలో ప్రమాదకర ఇంక్షన్ ఇచ్చి 13 మంది మరణానికి కారకురాలైన్నట్టు అనుమానిస్తున్నారు. వివిధ రకాల రోగాలతో బాధ పడుతున్న వృద్ధులకు ఆమె విషపు ఇంక్షన్లు ఇవ్వడం గమనార్హం. చనిపోయిన 13 మంది 61 నుంచి 88 ఏళ్ల మధ్య వయసున్న వారే కావడం చర్చనీయాంశంగా మారింది. కొన్ని నెలలుగా నిందితురాలిపై నిఘా పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు. ఇలాంటి కేసులో మరో నర్సుకు గత నెలలో కోర్టు జీవితఖైదు విధించింది. -
ఐసీయూ సెటప్.. అంతా బిల్డప్!
అధికారుల తీరుతో వైద్య ఆరోగ్య శాఖ అభాసుపాలు మహబూబ్‌నగర్‌లో ప్రారంభించిన వెంటనే పరికరాలను తీసుకెళ్లిన వైనం మళ్లీ డెమో పరికరాలతోనే సిద్దిపేట, కరీంనగర్లో ఏర్పాటుకు సన్నాహాలు? సాక్షి, హైదరాబాద్: ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ సిని మాలో తల్లిదండ్రులను బాధపెట్టొద్దని హీరో వైద్యుడిగా అవతారం ఎత్తుతాడు. అందుకు ఓ ఆసుపత్రి సెటప్ చేస్తాడు! ప్రజలను మభ్యపెట్టేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కూడా దాదాపు అలాగే ఫీట్లు చేస్తోంది. అన్ని జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల(ఐసీయూ)ను ఏర్పా టు చేస్తామని హామీ ఇచ్చిన ఈ శాఖ.. అందుకు ఒక్కో యూనిట్‌కు రూ.కోటి వరకు ఖర్చు చేయాలని నిర్ణయించింది. టెండర్లు కూడా పిలిచారు. కానీ టెండర్లు ఖరారు కాలేదు. అధికారులు మాత్రం హడావుడికి తెర లేపారు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ నెల 3న మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రిలో 8 పడకలతో ఐసీయూ యూనిట్‌ను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. అవి డెమో ఐసీయూ పరికరాలు కావడంతో కంపెనీ వాళ్లు... వాటిని వెంటనే తీసుకెళ్లిపోయారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేందుకు ఏర్పాటు చేసిన వెంటిలేటర్లను కూడా తరలించుకుపోయారు. ఐసీయూ పరికరాలను కొనుగోలు చేయకుండానే ఇలా ఎగ్జిబిషన్లో వస్తువుల్లా ఆర్భాటంగా వాటిని ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 25న మెదక్ జిల్లా సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలోనూ ఐసీయూల ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అక్కడ కూడా డెమో ఐసీయూలే ఏర్పాటు చేస్తారన్న ప్రచారం ఉంది. ప్రణాళిక లేని వైద్య ఆరోగ్యశాఖ ఐసీయూ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఏమాత్రం ముందస్తు ఏర్పాట్లు లేకుండా మహబూబ్‌నగర్‌లో డెమో ఐసీయూలను ఏర్పాటు చేయడంతో ఆ శాఖ పరువు బజారున పడింది. అంతేకాదు ప్రారంభించిన తర్వాత ఐసీయూ యూనిట్‌కు తాళం వేశారు. అంతకుముందు ఫొటోల కోసమే రోగులను కాసేపు ఉంచారన్న విమర్శలు వచ్చాయి. ఐసీయూల కొనుగోలుకు టెండర్లు పిలిచినా వాటిని త్వరగా ఖరారు చేయడంలో వైఫల్యం కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. టెండర్లు ఖరారు చేయడంలో ఈ సంస్థ పూర్తిగా విఫలమైంది. తాత్కాలికంగా డెమోలతో పని కానిచ్చేలా సంస్థ అధికారుల వ్యవహారం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తమకు ఇష్టమైన కంపెనీలకే టెండర్ వచ్చేలా టెండర్లు ఖరారు చేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఉదాహరణకు ఇటీవల ఆసుపత్రి ఫర్నీచర్ కొనుగోలుకు సంబంధించిన ఒక టెండర్లో మూడు కంపెనీలు పాల్గొంటే... తమకు ఇష్టమైన కంపెనీకి వచ్చేలా సింగిల్ టెండర్ తీశారు. మిగిలిన వాటికి సంబంధించి ఏదో సాంకేతిక కారణాలు చూపి పక్కనపెట్టారు. అంటే నామినేషన్ పద్ధతిలో ఇష్టమైన వారికి కాంట్రాక్టు ఇచ్చినట్లుగానే వారి వ్యవహార శైలి ఉంది. మొత్తం వ్యవహారంపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ముషర్రఫ్‌కు తీవ్ర అస్వస్థత
కరాచీ: తీవ్రమైన రక్తపోటుతో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ ఆస్పత్రిలో చేరారు. కరాచిలోని స్వగృహంలో ముషర్రఫ్ విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా రక్తపోటు పెరిగి స్పృహ కోల్పోయారు. వెంటనే అయనను కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో ముషర్రఫ్ చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముషర్రఫ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
అదృష్టమే!
తూటా ‘డెరైక్షన్’ మారితే తీవ్ర ప్రభావం త్రుటిలో తప్పిన ముప్పు {పాణాలతో బయటపడిన డాక్టర్ ఉదయ్ కుమార్ సిటీబ్యూరో: హిమాయత్ నగర్లో సోమవారం నాటి కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ఉదయ్ కుమార్ కోలుకుంటున్నారు. మంగళవారం ఆయనకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు తూటా శకలాలు తొలగించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తగిలిన తూటా ఏమాత్రం ‘అటు-ఇటు’గా వెళ్లినా పెను ప్రభావం ఉండేదని... ఆ ప్రకారం చూస్తే త్రుటిలో ముప్పు తప్పినట్లేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 45 డిగ్రీల కోణంలో ఫైరింగ్ కాల్పుల ఉదంతం జరిగింది హైఎండ్ కారుగా పరిగణించే ఓక్స్ వ్యాగన్లో. ఈ కారులో ముందు సీట్ల కంటే వెనుక సీట్లు కొద్దిగా ఎత్తులో ఉంటాయి. డ్రైవింగ్ సీటులో ఉదయ్, దాని పక్కన ఉండే సీటులో సాయికుమార్ కూర్చున్నారు. వెనుక సీటులో ఎడమ వైపు కూర్చున్న శశి.. తన రివాల్వర్‌ను కుడిచేత్తో పట్టుకొని, వెనుక నుంచి ఉదయ్‌పై కాల్చారు. వెనుక సీటు ఎత్తుగా ఉండటంతో ఉదయ్ ఎడమ చెవి వెనుక భాగం నుంచి 45 డిగ్రీల కోణంలో (పై నుంచి కిందికి) దూసుకు వచ్చిన తూటా దంతాలకు తగలకుండా దవడను తాకింది. పిల్లెట్స్గా మారిన బుల్లెట్ శశికుమార్ వినియోగించింది .32 లెసైన్స్డ్ రివాల్వర్. నాన్ ప్రొహిబిటెడ్ బోర్ (క్యాలిబర్)గా పరిగణించే ఈ తుపాకీలో వాడే తూటాలను సీసంతో (లెడ్) తయారు చేస్తారు. తుపాకీ ట్రిగ్గర్ నొక్కినప్పుడు హేమర్ ధాటికి ప్రైమర్ ప్రేరేపితమై బుల్లెట్ కేస్‌లో ఉండే గన్ పౌడర్‌ను మండిస్తుంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే ముందు భాగంలో ఉండే బుల్లెట్ దూసుకుపోతుంది. గన్ పౌడర్ మంటతో లెడ్ తూటా వేడెక్కి ఉంటుంది. ఇది చెవి పక్క నుంచి లోపలకు ప్రవేశించిన ఒత్తిడి, దవడకు తగిలినప్పుడు కలిగే ఒత్తిడి ఫలితంగా ఛిద్రమైపోయి పిల్లెట్స్గా మారింది. వీటిలో కొన్ని ఉదయ్ దవడ భాగంలో ఉండిపోగాా... మరికొన్ని పొట్టలోకి వెళ్లాయి. ఏమాత్రం ‘డెరైక్షన్’ మారినా... తుపాకీ నుంచి బయటకు వచ్చిన తూటా ప్రయాణించే దిశను డెరైక్షన్ అంటారు. శశికుమార్ కాలుస్తున్నప్పుడు ఏ మాత్రం డెరైక్షన్ మార్చినా... పొరపాటునో...ఆందోళన... కంగారు నేపథ్యంలోనో మారినా... ఉదయ్‌పై తీవ్ర ప్రభావం ఉండేది. ఏ వైపునకు డెరైక్షన్ మారితే... ఏం జరిగేదంటే? కుడి వైపు: వెన్నెముక, పుర్రె కలిసే భాగంలో మెడకు పైన సెరిబ్లమ్ అనే భాగం ఉంటుంది. తూటా కనుక కుడి వైపు ప్రయాణించి ఈ భాగాన్ని తాకితే... సర్వైకల్ ఎమిస్టైర్గా పిలిచే ప్రాంతం ఛిద్రమయ్యేది. ఇదే జరిగితే నాడీ వ్యవస్థ కుప్పకూలి బాధితుడు తక్షణం కోమాలోకి వెళ్లిపోతాడు.పై వైపు: ఈ తూటా డెరైక్షన్ 45 డిగ్రీల కోణంలో పైకి ఉండి ఉంటే... అక్కడ ఉండే మెదడుకు సంబంధించిన కీలక భాగం దెబ్బతినేది. అలా జరిగితే గాయం ఎడమ వైపు అయిన నేపథ్యంలో కుడి కాలు, చెయ్యితో పాటు ఇతర అవయవాలు చచ్చుబడిపోయే ప్రమాదం ఉండేది. కింది వైపు: శశికుమార్ కాల్చిన తూటా తలిగిన ప్రాంతానికి కుడి వైపు, కాస్త కింద నుంచి దూసుకుపోతే అక్కడ ఉండే బ్రెయిన్ స్టెమ్గా పిలిచే భాగం దెబ్బతినేది. శరీరానికి సంబంధించిన శ్వాస, రక్తప్రసరణ వ్యవస్థలను నియంత్రించే ఈ వ్యవస్థకు ఏం జరిగినా ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. -
ఐసీయూని ప్రారంభించిన మంత్రి లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్: పాలమూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఐసీయూ, డయాగ్నోస్టిక్ ల్యాబ్‌ను రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆసుపత్రికి మెరుగైన పరికరాల కోసం రూ.16కోట్లు విడుదల చేస్తున్నట్లు లక్ష్మారెడ్డి ప్రకటించారు. అనంతరం ఆయన జడ్చర్లలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. -
'పోలీసుల తీరు బాధాకరం'
-
బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు
-
దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..
-
ఐసీయూలో వైఎస్ జగన్
-
దీక్ష భగ్నం ఎలా జరిగిందంటే..
హైదరాబాద్: ముందస్తు వ్యూహం ప్రకారమే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. నిద్రహారాలు మానుకొని యావత్ ఆంధ్రప్రజానీకం భావి ప్రయోజనాలకోసం ఆయన అకుంఠిత పట్టుదలతో దీక్ష కొనసాగించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ముఖ్యంగా శరీరంలో కీటోన్స్ సోమవారం ప్లస్ 3 ఉండగా.. మంగళవారం తెల్లవారు జాము సమయానికి ప్లస్ 4కు చేరుకుని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అంతకుముందు ఆయన దీక్షపై ఏ విధమైన స్పందన తెలియజేయని ప్రభుత్వం ముందస్తు వ్యూహంలో భాగంగానే అందరు నిద్రిస్తున్న సమయంలో పోలీసులను దీక్షా స్థలి వద్దకు పంపించారు. ఆ సమయంలో దీక్షా ప్రాంగాణంతోపాటు చుట్టుపక్కల అంతా నిద్రలోనే ఉన్నారు. అక్కడికి చేరుకుంటుండగానే కెమెరాల కేబుల్స్‌ను కట్ చేయడంతో పాటు లైట్స్ కూడా ఆర్సేసినట్లు తెలిసింది. ఆ వెంటనే వైఎస్ జగన్ వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి విషమించినందున దీక్ష వెంటనే విరమించాలని కోరారు. కానీ అందుకు నిరాకరించిన వైఎస్ జగన్ తాను దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. దీంతో బలవంతంగా పోలీసులు దీక్షను భగ్నం చేశారు. అక్కడి నుంచి ఓ స్ట్రెచర్‌పై తీసుకెళ్లి 108 అంబులెన్స్‌లో ఎక్కించారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు లాఠీ చార్జికి దిగి అక్కడి వారిని చెల్లా చెదురు చూశారు. అంబులెన్స్‌కు ఎవరూ అడ్డు రాకుండా ముందు కొంతమంది పోలీసులు లాఠీలతో పరుగెత్తుతుండగా వేగంగా అంబులెన్స్‌ను గుంటూరు జీజేహెచ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నేరుగా ఐసీయూలోకి తీసుకెళ్లి ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తనకు ఫ్లూయిడ్స్ వద్దని, దీక్షను కొనసాగిస్తానని తీవ్రంగా వైద్యులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే, ఆరోగ్యం విషమించిందని, ఇలాగే కొనసాగితే ఊహించని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ బలవంతంగా వైఎస్ జగన్‌కు ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి, సోదరి వైస్ షర్మిల ఆస్పత్రికి వచ్చి ఆయనతో ఉన్నారు. మరోపక్క, పోలీసుల తీరుపట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఐసీయూలో ఆస్పత్రులు
మారుమూల పల్లెటూళ్లు మొదలుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకూ ఆస్పత్రులన్నీ ఒక్క తీరుగానే ఉన్నాయి. అవి సాధారణ పౌరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైద్య విధ్వంసం ఏ స్థాయిలో జరుగుతున్నదో, అందులో సామాన్యులెలా సమిథలవుతున్నారో ‘సాక్షి’ ఈ నెల 7వ తేదీనుంచి ఆరు రోజులపాటు వెలువరించిన ధారావాహిక కథనాలు కళ్లకు కట్టాయి. సర్కారు దవాఖానాలు నిలువెల్లా చీడపట్టి రోగులకు ఏ స్థాయిలో నరకాన్ని చూపిస్తున్నాయో... కార్పొరేట్ ఆస్పత్రులు డబ్బు జబ్బు ప్రకోపించి ఎలా నిలువు దోపిడీ చేస్తున్నాయో ఆ కథనాలు వెల్లడించాయి. ఈ రకమైన దుస్థితిపై అన్నిచోట్లా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక్క విధంగానే ఉన్నదని ఢిల్లీ మహా నగరంలో గత వారం రోజుల్లో చోటు చేసుకున్న రెండు విషాద ఘటనలు నిరూపించాయి. మొదటిది దక్షిణ ఢిల్లీలో ఒకటో తరగతి చదువుతున్న ఏడేళ్ల అవినాష్ రౌత్ ఉదంతం. ఢిల్లీలో అడ్డూ ఆపూ లేకుండా స్వైర విహారం చేస్తున్న డెంగీ వ్యాధికి ఇంతవరకూ బలైపోయిన 11మందిలో అవినాష్ ఒకడు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అవినాష్‌ను అత డి తల్లిదండ్రులు ఆరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అందరికందరూ అతన్ని చేర్చుకోవడానికి నిరాకరించారు. చివరిలో చేర్చుకున్న ఆస్పత్రి వైద్యులు అప్పటికే ఆలస్యమైపోయిందని తేల్చారు. ఆ బాలుడు నిస్సహాయ స్థితిలో మరణించాడు. కుమారుడికి సకాలంలో వైద్యం అందించలేకపోయామని కుమిలిపోతున్న అతని తల్లిదండ్రులు అవినాష్ అంత్యక్రియలు పూర్తికాగానే తిరిగొచ్చి తమ ఇంటిపైనుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత మేల్కొన్నట్టే కనబడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్పత్రులన్నిటికీ హెచ్చరికలు జారీచేశాయి. వైద్యాన్ని నిరాకరించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నాయి. ఇదంతా కొనసాగుతుండగానే మరో బాలుడు ఆరేళ్ల అమన్ శర్మ కూడా ఇలాంటి దుర్మార్గానికే బలయ్యాడు. అమన్ తల్లిదండ్రులు కూడా మహా నగరంలో సర్కారీ పెద్దాసుపత్రి సఫ్దర్‌జంగ్ మొదలుకొని నాలుగు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. తెల్లవార్లూ ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి ఆత్రంగా పరుగులెడుతూనే ఉన్నారు. అయినా అవినాష్‌కు ఏం జరిగిందో అమన్‌కూ అదే అయింది. సకాలంలో చికిత్స అందక పోవడంతో అమన్ కన్నుమూశాడు. రాష్ట్రపతి మొదలుకొని ప్రభుత్వాధినేతలందరూ... అత్యున్నత స్థాయి అధికారగణమంతా కొలువుదీరిన ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇద్దరు పిల్లలను పొట్టనబెట్టుకున్న ఉదంతాలివి. మీడియా దృష్టి పడింది గనుక ఇవి బయటికొచ్చాయిగానీ రాని ఉదంతాలు ఎన్ని ఉంటాయో అంచనా వేయలేం. దేశ రాజధాని నగరంలోని ఆస్పత్రుల్లో కనీస సదుపాయాలు లేవని, చాలినన్ని పడకలు లేవని, అక్కడి వైద్యులకు మానవతా దృక్పథం కొరవడిందని... ప్రాణం మీదికొచ్చిన రోగినైనా నిర్దాక్షిణ్యంగా బయటకు గెంటేయగల దుర్మార్గం అక్కడ రాజ్యమేలు తున్నదని అందరికీ తెలియడం కోసం ఇద్దరు పిల్లలు కడతేరవలసి వచ్చింది. ఒక కుటుంబం మొత్తం ప్రాణార్పణ చేయాల్సివచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు కావస్తున్నది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ సారథ్యాన్ని స్వీకరించి ఏడు నెలలవుతోంది. ఇద్దరూ వైద్య రంగాన్ని గాలికొదిలారని ఈ ఉదంతాలు రుజువు చేశాయి. ఇది ఢిల్లీకి పరిమితమైన ధోరణి మాత్రమే కాదు. కొంత హెచ్చుతగ్గులతో దేశమంతా ఇలాంటి పరిస్థితే నెలకొని ఉన్నదని తరచు బయటపడుతున్న దారుణ ఉదంతాలు తెలియజెబుతున్నాయి. ఈమధ్యే ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మూషికాలు కొరికేసిన కారణంగా నెలలు నిండని బాలుడు మృత్యువాత పడ్డాడు. ‘సాక్షి’లో వెలువడిన ధారావాహిక కథనాలకు స్పందించిన ఎంతోమంది ప్రభుత్వాసుపత్రుల్లోని నిర్లక్ష్యాన్ని, కార్పొరేట్ ఆస్పత్రుల్లోని నిలువు దోపిడీని కళ్లకుగట్టారు. ఆ అనుభవాలను చదివిన వారెవరైనా ఆసుపత్రి గడప తొక్కే దుస్థితి తమకెదురుకావొద్దని మొక్కుకుంటారు. లాభార్జనపై దృష్టి పెరగడం, ఆ క్రమంలో నైతిక విలువలకు తిలోదకాలొదలడం దాదాపు అన్ని రంగాల్లోనూ పెరిగినా వైద్య రంగంలో ఇది శ్రుతిమించిన దాఖలాలు కనబడుతున్నాయి. మనుషులు సహజాతాలను కోల్పోయి, రోబోలుగా మారుతున్న వైనం వెల్లడవుతోంది. వైద్య విద్య అంగట్లో సరుకయ్యాకే వైద్యులు వ్యాపారులయ్యారు. కార్పొరేట్ వైద్యం లాభాలార్జించిపెట్టే పెద్ద బిజినెస్‌గా మారింది. లాభం తప్ప ప్రాణం గురించి పట్టని కార్పొరేట్ ఆస్పత్రుల బారి నుంచి ఇక జనానికి విముక్తి లభించే అవకాశం లేదని ఈమధ్యే నీతి ఆయోగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు రాసిన లేఖ చదివితే అర్ధమవుతుంది. ప్రస్తుతం ప్రజారోగ్య రంగానికి జీడీపీలో ఖర్చుచేస్తున్న ఒక శాతం మించి నిధులు వెచ్చించడం సాధ్యంకాదని ఆ లేఖ చెబుతున్నది. 2020 నాటికి జీడీపీలో 2.5 శాతాన్ని ప్రజారోగ్యానికి కేటాయించాలన్న తాజా జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా లక్ష్యాలను సవరించుకొమ్మని ఆ లేఖ సూచిస్తున్నది. రోగులకు మందులు, చికిత్స, ఇతర పరీక్షలు...అన్నీ బీమా రంగంద్వారానే సాగాలంటున్నది. అంటే ఇప్పుడు ఢిల్లీలోనూ, దేశంలోని ఇతరచోట్లా వైద్య రంగంలో కనిపిస్తున్న జాడ్యం రాగలకాలంలో మరింత ముదురుతుందన్న మాట! వాస్తవానికి వేరే దేశాలతో పోలిస్తే మన దేశంలో ప్రజారోగ్యంపై పెట్టే పెట్టుబడులు చాలా తక్కువని జాతీయ ఆరోగ్య విధానం ముసాయిదా గణాంకాలతో సహా వివరించింది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉన్నదని చెప్పింది. నీతి ఆయోగ్‌లో ఘనులు మాత్రం అందుకు విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసే ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ విషయంలో జనం మేల్కొని ప్రభుత్వాలను గట్టిగా నిలదీయకపోతే ఈపాటి వైద్య సదుపాయాలు కూడా భవిష్యత్తులో దుర్లభమవుతాయి. -
ఐసీయూల ఏర్పాటుపై అధ్యయన కమిటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసీయూ) ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. వైద్య విద్యా డెరైక్టర్.. చైర్మన్‌గా ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. 45 రోజుల్లోగా మౌలిక సదుపాయాలు, సిబ్బంది తదితర పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. -
నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు!
-
రోడ్డు ప్రమాదంలో దర్శకుడికి గాయాలు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ (52) తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముంబైలో మంగళవారం ఉదయం ఆయన బైక్ పై నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని అదుపు చేయలేక కిందిపడినట్టు సమాచారం. ఆయన ప్రాణాలకు ప్రమాదం లేదని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఫ్రాక్చర్స్ అయ్యాయని, ఆపరేషన్ నిర్వహించనున్నాని తెలిపారు. బాలీవుడు ప్రముఖులు, నటులు లీలావతి ఆసుపత్రికి వెళ్లి హిరానీని పరామర్శించారు. బాలీవుడ్‌కు హిరానీ ఎన్నో బ్లాక్ బ్లస్టర్స్ అందించారు. ముఖ్యంగా మున్నాభాయ్ ఎంబిబిఎస్, లగే రహో మున్నాభాయ్, త్రి ఇడియట్స్, పీకె సినిమాలు ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పడతాయి. -
కోలుకున్న ములాయం
లక్నో: సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోలుకున్నారు. దీంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు తరలించారు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకినట్లు కూడా అనుమానించారు. ఈ నేపథ్యంలోనే లక్నోలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగవడంతో జనరల్ వార్డుకు తరలించినట్లు ఉత్తరప్రదేశ్ మంత్రి శివపాల్ సింగ్ యాదవ్ చెప్పారు. -
ఆర్ ఆర్ పాటిల్ ఆరోగ్య పరిస్థితి విషమం
ముంబై : మహారాష్ట్ర మాజీ హోమంత్రి, ఎన్సీపీ నేత ఆర్ ఆర్ పాటిల్ (57) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన ప్రస్తుతం లీలావతి ఆస్పత్రిలో చికిత్సలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో ఉన్న పాటిల్ మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఆయన గత రెండు వారాలుగా ఆస్పత్రిలో వెంటిలేటర్ ద్వారా చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించటంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఐసీయూకు తరలించారు. కాగా పాటిల్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు వెల్లడించేందుకు ఆస్పత్రి వర్గాలు నిరాకరించాయి. -
ఐసీయూలో వైద్యురాలి హత్య
దిబ్రగడ్: దిబ్రగఢ్లోని అసోం మెడికల్ కాలేజి హాస్పిటల్ ఐసీయూలో విధులు నిర్వహిస్తున్న ఓ పీజీ విద్యార్థిని వార్డు బాయ్ హత్య చేశాడు. ఆపరేషన్ చేసే కత్తితో సరితా తస్నివాల్ అనే డాక్డర్ మెడ ఎడమ వైపున పొడిచి చంపాడు. ఐసీయూలోని డాక్టర్ల విశ్రాంతి గదిలో బెడ్‌పై సరిత మృతదేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. నిందితుడు అత్యాచారానికి ప్రయత్నించి ఉండొచ్చని, ఈ క్రమంలో ఆమెను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సరితా తస్నివాల్ శుక్రవారం రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు డ్యూటీలో ఉన్నారు. 5:30 గంటల తర్వాత విశ్రాంతి గదికి వెళ్లినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆ సమయంలోనే ఆమెపై దాడి జరిగింది. అసోం మెడికల్ కాలేజి హాస్పిటల్ నుంచే సరిత ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతంరం పీజీలో చేరారు. సహ వైద్యుడితో ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. వచ్చే నెలలోనే సరితకు వివాహం జరగాల్సిఉంది. ఈలోగా దారుణం జరిగింది. వైద్యులకు, ముఖ్యంగా మహిళా వైద్యులకు రక్షణ కల్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరవధిక సమ్మెకు దిగారు. -
అంబులెన్స్ చార్జీలు ఖరారు
సాక్షి, ముంబై: అడ్డగోలుగా చార్జీలు వసూలు చేస్తున్న అంబులెన్స్ యజమానుల ఆగడాలకు కళ్లెం పడింది. ముంబై మెట్రోపాలిటన్ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో రవాణా శాఖ కొత్తగా అంబులెన్స్ చార్జీలను నిర్ణయించింది. ఆ ప్రకారమే ప్రజల నుంచి వసూలు చేయాలని ఆదేశించింది. ఇవి ముంబై, నవీముంబై, ఠాణే, వసయి, విరార్, అలీబాగ్ తదితర ప్రాంత ప్రజలకు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో పేదలకు ఎంతో ఊరట లభించింది. కొత్త చార్జీల పట్టికను అన్ని అంబులెన్స్‌ల్లో ఏర్పాటు చేయాలని అంక్షలు విధించింది. అత్యవసర సమయంలో రోగిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలంటే అంబులెన్స్ అవసరముంటుంది. అదేవిధంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగిని వివిధ పరీక్షల నిమిత్తం లేదా మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలించాలన్నా, చికిత్స పొందుతూ రోగి చనిపోతే మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి స్వగ్రామాలకు తరలించాలన్నా అంబులెన్స్‌లే గతి. దీన్ని అదనుగా చేసుకుని యజమానులు బాధితుల నుంచి అడ్డగోలుగా చార్జీలు వసూలుచేస్తూ దోచుకుంటున్నారు. దీంతో పేదలు చేసేది లేక వారు అడిగినంత చెల్లించక తప్పడం లేదు. అంబులెన్స్ యజమానుల ఆగడాలపై రవాణా శాఖకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రవాణా శాఖ అధికారులు ఓ ప్రణాళిక రూపొందించారు. అంబులెన్స్‌లో లభించే సౌకర్యాలను బట్టి ఎంత దూరానికి ఎంతమేర చార్జీలు వసూలు చేయాలనేది ఖరారు చేశారు. మొదటి గంటకు ఎలాంటి వెయిటింగ్ చార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రతీ గంటకు రూ.50 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంబులెన్స్ మోడల్ 25 కి.మీ. 2 6 కి.మీ. తర్వాత లోపు {పతీ కి.మీ.కు మారుతి వ్యాన్ 500 10 టాటా సుమో, మెటాడోర్ 600 10 టాటా 407, స్వరాజ్ మజ్దా 700 14 ఐసీయూ, ఏసీ సౌకర్యాలుంటే 850 17 -
పెద్దాస్పత్రికి ‘అసౌకర్యాల’ జబ్బు
పెద్దాస్పత్రికి ‘అసౌకర్యాల’ జబ్బు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అసౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. డివిజన్‌తోపాటు చత్తీస్గడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి అనేక మంది గిరిజనులకు ఈ ఆస్పత్రే పెద్ద దిక్కు. అయితే ఆస్పత్రిలో సరైన స్ట్రెచర్ కూడా లేకపోవడం శోచనీయం. ఐసీయూలో మానిటర్‌ను బ్యాండేజ్‌తో కట్టివేశారు. చిన్న పిల్లలకు చికిత్సను అందించే గదిలో సరైన బెడ్ కూడా లేదు. ఇలా అసౌకర్యాలతో అల్లాడుతున్న పెద్దాస్పపత్రిని పట్టించుకున్న నాధుడే లేడని రోగులు వాపోతున్నారు. - న్యూస్‌లైన్, భద్రాచలం టౌన్