
Lata Mangeshkar Latest Health Bulletin Released: ఇండియన్ నైటింగల్, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడిన పడిన సంగతి తెలిసిందే. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్న లతా మంగేష్కర్ రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. ఆమె వయసు రిత్యా వైద్యులు ముందు జాగ్రత్తగా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు వైద్యులు.
చదవండి: బ్రేకప్ చెప్పుకున్న లవ్‌బర్డ్స్!, క్లారిటీ ఇచ్చిన హీరో
లతా మంగేష్కర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. స్వల్పంగా కోలుకున్నారని లతా మంగేష్కర్కు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతీత్ సమ్దానీ స్పష్టం చేశారు. కాగా 92 ఏళ్ల లతా మంగేష్కర్ గత రెండ్రోజుల క్రితం కరోనా లక్షణాలతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కోవిడ్ పాజిటివ్ రావడంతో ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా తన పాటలతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న లతా మంగేష్కర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment