పసిబిడ్డను కాపాడుకోవాలి.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్‌) | Newly Born Baby Life Is In Risk Please Donate And Save Her Life | Sakshi
Sakshi News home page

పసిబిడ్డను కాపాడుకోవాలి.. సహాయం చేయగలరా? (స్పాన్సర్డ్‌)

Published Mon, Apr 12 2021 1:14 PM | Last Updated on Mon, Apr 12 2021 2:37 PM

Newly Born Baby Life Is In Risk Please Donate And Save Her Life - Sakshi

ప్రసవం తర్వాత బిడ్డను అపురూపంగా హత్తుకొని లాలించాలని ఏ తల్లి మాత్రం అనుకోదు? కానీ ఆ దంపతులకు నిరాశే ఎదురైంది. పుట్టినప్పటి నుంచి బిడ్డను ఒక్కసారి కూడా ఎత్తుకోలేని దుస్థితి ఏర్పడింది. చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని మురిసిపోయే అదృష్టం లేకుండా పోయింది. చాలా తక్కువ బరువుతో కనీసం ఊపిరి కూడా సరిగా తీసుకోలేని స్థితిలో ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ఆర్థికంగా స్థోమత లేని ఆ దంపతులు నిస్సహాయులుగా ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కెటో (ఇండియాస్ మోస్ట్  క్రౌండ్ ఫండింగ్ సైట్) చికిత్స కోసం డబ్బులు లేని ఎంతో మందికి సాయం అందిస్తోంది. ఆ చిన్నారి సమస్య గురించి ఆ తల్లి  ఏం చెబుతుందో ఒక్కసారి తెలుసుకుందాం.

నేను, నా భర్త అబ్దుల్‌ ఎన్నో ఆశలతో నా చిన్నారిని ఈ ప్రపంచంలోకి స్వాగతించాం. చిన్నారి రాక కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. కానీ మా ఆశలన్నీ అడియాశలయ్యాయి. డెలీవరీ తర్వాత ఒక్కసారి కూడా నా బిడ్డను ఎత్తుకోలేదు. బిడ్డ పుట్టిన కొద్ది సేపటికే తనను ఎన్‌ఐసీయూ (NICU)కు తరలించారు. ఆ సమయానికి కనీసం నేను స్పృహలో కూడా లేను. ప్రసవం తర్వాత చిన్నారిని ఒక్కసారి కూడా ఎత్తుకొని మురిసిపోలేని దౌర్భాగ్యం వచ్చింది. 700 గ్రాముల బరువున్న నా బిడ్డ శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కృత్రిమ శ్వాస అందిస్తూ చిన్నారి శరీరం మొత్తం సూదులు, పైపులతో నిండి ఉన్న దృశ్యం చూసి ఎంతటి నరకం అనుభవిస్తున్నామో మాటల్లో చెప్పలేను. పాపం నా బిడ్డకు ఆ నొప్పి భరించలేక పడుతున్న వేదనను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. మరో ఆరు వారాల పాటు చిన్నారిని ఐసీయూలోనే ఉంచాలని డాక్టర్లు, ఇందుకోసం దాదాపు 4.5 లక్షలు అవుతుందని  చెప్పారు.

డబ్బుల కోసం మేం అన్ని విధాల ప్రయత్నించాము. కానీ ఎక్కడ మాకు డబ్బు దొరకలేదు. మా పేదరికం కారణంగా బాబుకు ఏదైనా జరిగితే మమల్ని మేం ఎప్పటికీ క్షమించుకోలేము. మీరు దయతో ఇచ్చే మొత్తం మా బాబును కాపాడగలవు. దయచేసి మా చిన్నారిని కాపాడండి

కెటో ఇండియాస్‌ మోస్ట్‌ క్రౌండ్‌ ఫండింగ్‌ సైట్‌ ద్వారా డబ్బులు లేని చిన్నారులెందరికో చికిత్స అందజేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ చేతనైనంతా సాయం కెటో ద్వారా విరాళంగా అందించండి. (అడ్వర్టోరియల్)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement