
రోజురోజుకు మహమ్మారి సినీ పరిశ్రమలో బుసలు కొడుతోంది. కరోనా సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా మారి ఆరోగ్యవంతుల్లో సైతం తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఎంతో సినీ ప్రముఖులు కోవిడ్-19 బారిన పడ్డారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమించడంతో మృత్యువాత పడగా... మరికొందరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా హిందీ యువ నటుడు అనిరుధ్ డేవ్ కూడా కరోనాతో ఐసియులో చికిత్స పొందుతున్నాడు.
గత వారం అతడికి కోవిడ్ పాజిటివ్‌గా తెలినట్లు స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా మారడంతో వైద్యులు ఐసీయుకి మార్చినట్లు తాజాగా నటి ఆషా చౌదరి తెలిపింది. ఈ సందర్భంగా ఆమె అనిరుధ్ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడి ప్రార్థించండి అంటూ అభిమానులను ఇన్‌స్టా వేదికగా ఆమె అభ్యర్థించింది. కాగా భోపాల్‌లో షూటింగ్ సమయంలో అనిరుధ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వెంటనే ప్రత్యేక వాహనంలో ముంబై చేరుకొని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇన్‌ఫెక్షన్ కాస్త ఎక్కువగా ఉండడంతో అతనికి ఐసియులో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
చదవండి:
‘ఈ నీతులు నీ కజిన్ రణ్‌బీర్‌కు చెప్పండి మేడం’
విషాదం: టాలీవుడ్ యువ దర్శకుడు కరోనాతో మృతి
Comments
Please login to add a commentAdd a comment