అల్లారుముద్దుగా పెంచుకున్న తమ ఇంటి ఆడబిడ్డను ఒక అయ్య చేతిలో పెట్టాలని ప్రతీ తల్లీదండ్రి ఆశపడతారు. ముఖ్యంగా పేద, ధనిక తేడాల్లేకుండా ప్రతీ కుటుంబంలోనూ ఉండే అత్యంత సమజమైన కోరిక. మరీముఖ్యంగా అమ్మలాంటి తన కూతురిపెళ్లిని ఉన్నంతలో ఘనం చేయాలనికోరుకుంటారు తండ్రులు. కానీ అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో హృదయాన్ని పిండేసే రీతిలో ఒక సంఘటన జరిగింది.
లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్ గ్రామానికి చెందిన మహ్మద్ ఇక్బాల్ సరిగ్గా కుమార్తె పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక అనారోగ్యానికి గురయ్యాడు. కోలుకోకపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. అయినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఛాతీలో ఇన్‌ఫెక్షన్ కారణంగా పరిస్థితి మరింత విషమించి ఇక్బాల్ ఎరా మెడికల్ కాలేజీ ఐసియులో ఉన్నాడు. అయితే తండ్రి కోరిక మేరకు ఆయన కళ్లముందే ఆసుపత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
జూన్ 22న ముంబైలో వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ తండ్రి పరిస్థితిని గమనించిన కుమార్తెలు కూతుళ్లు దర్శా, తాంజిలా ఆస్పత్రి ఐసీయూలోనే పెళ్లిచేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకొని తండ్రి ఆశీర్వాదం పొందారు. కుటుంబ సభ్యులు, పెళ్లి పెద్ద,వధూవరులు ఆసుపత్రి దుస్తుల్లో..ఆసుపత్రి అధికారుల అనుమతితోనే పెళ్లి తంతు మొత్తం జరిగింది. ఇతర రోగులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా వివాహాన్ని త్వరితగతిన నిర్వహించాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆస్పత్నిని సిబ్బందిని అభినందించారు. అలాగే నూతన వధూవరులకు ఆశీర్వాదాలందించారు.
Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !
Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024
Comments
Please login to add a commentAdd a comment